Posts: 116
Threads: 0
Likes Received: 52 in 46 posts
Likes Given: 34
Joined: Aug 2019
Reputation:
2
Update super ga uande yr):
Posts: 2,898
Threads: 0
Likes Received: 1,410 in 1,170 posts
Likes Given: 12,058
Joined: May 2019
Reputation:
25
Nice update bro please continue story
Posts: 3,517
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
Rejina ki help chestadu ramu ippudu taruavtha appdapudu vellinvasta untadu ..
Chandra
Posts: 4,161
Threads: 0
Likes Received: 3,013 in 2,399 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
23
అప్డేట్ బాగుంది ప్రసాదరావు గారు.
Posts: 457
Threads: 0
Likes Received: 197 in 173 posts
Likes Given: 20
Joined: Dec 2018
Reputation:
0
Waiting for next update sir
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
అప్డేట్ ః 193
(ముందు అప్డేట్ 683 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-683.html)
రెజీనా : టెస్ట్ లు మొత్తం చేసిన తరువాత పిల్లాడి గుండెకు చిన్న రంధ్రం ఉన్నది…ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయాలని చెప్పాడు…ఆపరేషన్ కి దాదాపు రెండు లక్షలు అవుతుందని చెప్పాడు…అదీ గవర్నమెంట్ హాస్పిటల్ లో అయితే ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు…కాని తరువాత అయ్యే మందులు….ట్రీట్ మెంట్ కి చాలా అవుతుందని చెప్పాడు….
రాము : మరి ఆపరేషన్ చేపించావా…..
రెజీనా : (లేదన్నట్టు అడ్డంగా తల ఊపుతూ) లేదు రామూ…ఆపరేషన్ చేయడానికి పైనుండి అప్రూవల్ రావాలన్నారు…దానికి తోడు…ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు…వాళ్ళందరికి ఓకె వచ్చిన తరువాత మా అబ్బాయికి చేస్తామని చెప్పారు…..
రాము : మరి ఆ అప్రూవల్ ఎపుడు వస్తుంది అని చెప్పారు…..
రెజీనా : అవన్ని గవర్నమెంట్ కు సంబంధించిన పనులు కదా…ఎప్పుడు అవుతాయో తెలియదు అని చెప్పారు… వాళ్ళు నా ఫోన్ నెంబర్, అడ్రస్ రాసుకుని….అప్రూవల్ వచ్చిన తరువాత పిలుస్తామని చెప్పారు….
రాము : ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది…..
రెజీనా : దాదాపు ఆరు నెలలు అవుతుంది…..
రాము : మరి పిల్లాడికి హెల్త్ పరంగా ఏవిధమైనా ప్రాబ్లమ్స్ రాలేదా…..
రెజీనా : లేదు…ఆపరేషన్ జరిగే దాకా సీరియస్ అవకుండా ఉండటానికి మెడిసిన్స్ రాసి ఇచ్చారు…అవి వేస్తున్నాను ….ఇప్పుడు ఆ మందులు కొనడానికి….ఇల్లు గడవడానికి నేను మనసు చంపుకుని నా కొడుకుని రక్షించుకోవడానికి ఈ తప్పుడు పనులు చేస్తున్నాను…ఏం చేస్తాం….తప్పలేదు….నాకు వస్తున్న డబ్బులు ఇల్లు గడవడానికి…మందులు కొనడానికి సరిపోతున్నాయి….ఇక ఆపరేషన్ ఎలా చేయించాలో అర్ధం కావడం లేదు…దానికి తోడు అప్రూవల్ వచ్చిన తరువాత అది సాంక్షన్ చేయడానికి పై ఆఫీసర్లకు డబ్బులు ఎంతో కొంత ముట్టచెప్పాలని చెప్పారు….దాంతో నాకు ఏం చేయాలో తోచడం లేదు….
రాము : సరె….ఎప్పటి లోపు ఆపరేషన్ చేయించాలి….ఏమైనా చెప్పారా…..
రెజీనా : ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించాలని చెప్పారు…..ఒక టైం అంటూ ఏమీ చెప్పలేదు...టైం గడిచేకొద్దీ ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుందని చెప్పారు….
రెజీనా అలా అనగానే రాము వెంటనే తన ఫోన్ తీసుకుని తనకు తెలిసిన సర్కిల్….ఫ్రండ్స్ ని….బంధువులతో మాట్లాడాడు.
వాళ్లలో ఒకరు రాముకి హార్ట్ స్పెషలిస్ట్ నెంబర్ మెసేజ్ చేసారు.
రాము వెంటనే ఆమెకు ఫోన్ చేసి రెజీనా పిల్లాడికి గురించిన వివరాలు మొత్తం చెప్పాడు.
అంతా విన్న తరువాత రాముతో తన నెంబెర్ కి పిల్లాడికి సంబంధిన రిపోర్ట్ లు మొత్తం ఫోటోలు తీసి what’s up చేయమన్నది.
రాము సరె అని చెప్పి రెజీనా వైపు చూసి, “రెజీనా….పిల్లాడి మెడికల్ రిపోర్ట్ లు ఎక్కడ ఉన్నాయి….” అనడిగాడు.
రెజీనా వెంటనే అక్కడ అలమారలో ఉన్న ఫైల్ తీసి రాముకి ఇచ్చింది.
రాము వెంటనే ఆ రిపోర్ట్ లు అన్నీ తన ఫోన్ లో ఫోటోలు తీసి డాక్టర్ చెప్పిన నెంబర్ కి what’s up చేసి ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు.
డాక్టర్ కూడా వాటిని చూసి రాముతో, “రాము గారు…వీటిని ఒక్కసారి చూసి మీకు అరగంటలో ఫోన్ చేస్తాను,” అన్నది.
రాము అలాగే అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసి రెజీనా వైపు చూసి, “నువ్వు కంగారు పడకు రెజీనా…నేను చూసుకుంటాను….” అన్నాడు.
రెజీనా కి కూడా రాము చేస్తున్న ప్రయత్నం చూసి సంతోషంగా ఫీల్ అవుతూ, “రాము….నా గురంచి ఈ టైం లో చాలా కష్టపడుతున్నావు….” అన్నది.
రాము : అదేంటి రెజీనా….నువ్వు నా ఫ్రండ్ వి….నేను నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా…..
దాదాపు అరగంట తరువాత డాక్టర్ ఫోన్ చేసింది.
రాము : (ఫోన్ లిఫ్ట్ చేసి) హలో డాక్టర్ గారు….చెప్పండి….రిపోర్ట్ లు అన్నీ చూసారా….
డాక్టర్ : చూసాను రాము గారు…హార్ట్ లో హోల్ ఉన్నది….
రాము : చాలా సీరియస్ అయ్యిందా….
డాక్టర్ : లేదు రాము గారు…చిన్న వయస్సే కాబట్టి…ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత తొందరగా క్యూర్ అవుతుంది…
రాము : సరె….ఎప్పుడు ఆపరేషన్ చేస్తారు….
డాక్టర్ : మీరు ఎప్పుడంటే….అప్పుడు ఆపరేష రెడీ చేస్తాను….ఈ లోపు బాబుకు కొన్ని టెస్ట్ లు చేస్తాము…..
రాము : ఆపరేషన్ ఎంత అవుతుంది….
డాక్టర్ : మామూలుగా అయితే దాదాపు మూడు లక్షల దాకా తీసుకుంటాము….మీరు మా రిలేటివ్స్ కి బాగా కావల్సిన వాళ్ళు కాబట్టి….రెండు లక్షలు ఇవ్వండి….తరువాత మీరు మెడిసిన్స్ కాని ఏమీ కొనక్కర్లేదు….అంతా నేను చూసుకుంటాను…..ఎప్పుడు జాయిన్ అవుతారు…..
రాము : మీరు ఓకె అంటే…ఇప్పుడే పిల్లాడిని జాయిన్ చేస్తాను….మీ హాస్పిటల్ అడ్రస్ చెప్పండి….
డాక్టర్ : సరె…నేను అడ్రస్ what’s up చేస్తాను…మీరు పిల్లాడిని జాయిన్ చేయండి….నేను మా వాళ్ళతో చెబుతాను….
రాము : సరె….నేను ఇప్పుడే పిల్లాడిని తీసుకుని బయలుదేరుతాను….
డాక్టర్ : మీరు జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తరువాత నాకు ఒక్క ఫోన్ చేయండి….నేను హాస్పిటల్ కి వచ్చి మిగతా పనులు చూస్తాను…..
రాము : సరె….నేను హాస్పిటల్ కి వెళ్ళి ఫోన్ చేస్తాను….మీ పేరు ఏంటి….
డాక్టర్ : నిహారిక…..డాక్టర్ నిహారికా….కార్డియాలజిస్ట్ అని చెప్పండి….
ఇదంతా రాము ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండటంతో పక్కనే ఉన్న రెజీనా కూడా విన్నది.
రాము ఫోన్ కాల్ కట్ చేసిన తరువాత రెజీనా…..
The following 18 users Like prasad_rao16's post:18 users Like prasad_rao16's post
• 9652138080, AB-the Unicorn, Babu G, DasuLucky, Iron man 0206, K.R.kishore, kummun, Lover fucker, maheshvijay, Manavaadu, meeabhimaani, Naga raj, noohi, ramd420, Sivakrishna, SS.REDDY, Subbu115110, Sunny73
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
రెజీనా : రామూ….మరి రెండు లక్షలు అవుతుందంట….నా దగ్గర అంత డబ్బులు లేవు…..
రాము : నేను నీకు ఫోన్ స్పీకర్ ఆన్ చేసింది….డాక్టర్ చెప్పింది విని నీ మనసు కుదుట పడుతుందని స్పీకర్ ఆన్ చేసాను….
రెజీనా : నువ్వు చెప్పింది కరెక్టే….కాని….
రాము : ఇక నువ్వు ఏమీ మాట్లాడొద్దు….నేను నీ పక్కన ఉన్న తరువాత కూడా నువ్వు డబ్బు గురించి బాధ పడుతున్నావా….డబ్బు గురించి ఏమీ ఆలోచించొద్దు…..
రెజీనా : నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నావు రామూ…నీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు…
రాము : ఒక పసివాడి ప్రాణం కన్నా రెండు లక్షలు ఎక్కువ కాదు రెజీనా….కాని నువ్వు నాకు ఒక్కమాట ఇవ్వాలి…
రెజీనా : ఏంటి రామూ….
రాము : పిల్లాడికి ఆపరేషన్ అయిన తరువాత నీ మొహంలో సంతోషం చూసిన తరువాత అపుడు అడుగుతాను…. అప్పుడు నువ్వు ఏమడిగినా కాదనకుండా ఇవ్వాలి….
రెజీనా : నిజంగా రాము….నువ్వు ఏమడినా నాకు చేతనైనది చేస్తాను…..
రాము : సరె….ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదా…..మెడికల్ రిపోర్ట్ లు అన్నీ తీసుకుని వచ్చేయ్….
రెజీనా అలాగే అని తల ఊపుతూ….బట్టలు సర్దబోయింది.
అది చూసి రాము ఆమెను ఆపుతూ, “ఏం చేస్తున్నావు,” అనడిగాడు.
రెజీనా : అక్కడ టవల్స్, దుప్పట్లు అవసరం అవుతాయి కదా….అందుకని సర్దుతున్నాను….
రాము : రెజీనా….అది కార్పోరేట్ హాస్పిటల్….అవన్నీ అక్కడ ఉంటాయి….(అంటూ ఆమె చేతిలో మెడికల్ రిపోర్ట్ తీసుకుని) ముందు హాస్పిటల్ కి వెళ్దాం పద…..(అంటూ బయటకు వచ్చి కారులో కూర్చున్న తరువాత రవికి ఫోన్ చేసి విషయం చెప్పాడు)
రెజీనా మంచం మీద ఉన్న పిల్లాడిన్ చేతిలోకి తీసుకుని రాము వెనకాలే బయటకు వచ్చి రాము పక్కనే కారులో కూర్చున్నది.
రెజీనా కారులో కూర్చున్న తరువాత రాము హాస్పిటల్ వైపు పోనిచ్చాడు.
కారు పోనిస్తున్నన్నంత సేపూ రెజీనా రాము వైపు ఆరాధనా భావంతో చూస్తుండిపోయింది.
అనుకోకుండా తన జీవితంలోకి వచ్చి ఊహించని విధంగా తనకు అంత పెద్ద సహాయం చేస్తున్న రాముకి మనసులోనే థాంక్స్ చెప్పుకుంటున్నది.
అలా మనసులో రాముకి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పుకున్నదో ఆమెకే తెలియదు.
రెజీనా తన వైపు అలాగే చూస్తుండటం చూసి రాము చిన్నగా నవ్వుతూ, “ఏంటి అలా చూస్తున్నావు,” అనడిగాడు.
రెజీనా : నువ్వు చేస్తున్న సహాయానికి ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు రామూ….
రాము : నువ్వు రుణం తీర్చుకునే మార్గం నేను చెబుతాను కదా….నువ్వు నేను ఏమడిగినా ఒప్పుకుంటానని మాట ఇచ్చావు….గుర్తుందికదా…..
రెజీనా : తప్పకుండా రాము….నువ్వు ఏం చెబితే అది ఏమాత్రం ఆలోచించకుండా చేస్తాను…..
రాము : థాంక్స్ రెజీనా….నా మీద ఆమాత్రం నమ్మకం ఉన్నందుకు…..
రెజీనా : ఏమీ అడక్కుండానే నీ అంతట నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు….మరి నిన్ను నమ్మకుండా ఎవరిని నమ్మమంటావు రామూ…..
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే హాస్పిటల్ వచ్చింది.
రాము కార్ హాస్పిటల్ ముందు ఆపి రెజీనా వైపు చూసి, “రెజీనా నువ్వు హాస్పిటల్ లో డాక్టర్ నిహారిక గారి పేరు చెప్పు….ఆమె ఆల్రెడీ తన స్టాఫ్ తో మాట్లాడతానని చెప్పారు….నువ్వు ఆ ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యి,” అన్నాడు.
రాము అలా అనగానే రెజీనా కళ్ళల్లో కంగారు కనిపించింది.
అది చూసి రాము, “ఏమయింది….అంత కంగారు ఎందుకు పడుతున్నావు,” అనడిగాడు.
రెజీనా : నువ్వు లోపలికి రావా…..నాకు ఇక్కడ ఎవరూ తెలియదు….
రాము : (చిన్నగా నవ్వుతూ) నేను కారుని పార్కింగ్ ఏరియాలో పెట్టి వస్తాను….అంతలోకి నువ్వు వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేయ్….ఐదు నిముషాల్లో వస్తాను…..
రెజీనా : సరె….(అంటూ హాస్పిటల్ లోకి వెళ్ళింది.)
రాము కారు పార్కింగ్ ఏరియాలో పెట్టేసి హాస్పిటల్ లోకి వచ్చాడు.
అప్పటికే రెజీనా హాస్పిటల్ రిసెప్షన్ లో డాక్టర్ నిహారిక పేరు చెప్పేసరికి వాళ్ళు పిల్లాడిని హాస్పిటల్ లో చేర్చుకోవడానికి పేపర్స్ రెడీ చేస్తున్నారు.
రాము లోపలికి రావడం చూసి అప్పటిదాకా రెజీనా కళ్ళల్లో కనిపించిన బెదురు మొత్తం పోయి….రాము పక్కనే ఉన్నాడన్న ధైర్యం కనిపించింది.
ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి అయిన తరువాత రాము ఫోన్ తీసుకుని నిహారికకి ఫోన్ చేసి, “డాక్టర్ గారూ…. పిల్లాడిని హాస్పిటల్ లో జాయిన్ చేసాను,” అన్నాడు.
నిహారిక : ఆల్రెడీ నాకు ఫోన్ చేసారు రాము గారు…వాళ్ళకు ఏమేం చేయాలో చెప్పాను…వాళ్ళు టెస్ట్ లు చేస్తారు…. దాదాపు గంట పడుతుంది….నేను ఈ లోపు వచ్చేస్తాను….
రాము అలాగే అని కాల్ కట్ చేసాడు.
అంతలో ఒక నర్స్ వచ్చి వాళ్ళను ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పిల్లాడిని పడుకోబెట్టి టెస్ట్ లకు కావలసిన బ్లెడ్ శ్యాంపిల్స్ తీసుకుని వెళ్ళింది.
బాగా లగ్జరీగా ఉన్న ఆ రూమ్ చూసి రెజీనా చుట్టూ చూస్తూ, “రాము….ఇంత కాస్ట్లీ హాస్పిటల్….చాలా ఖర్చు అవుతుంది కదా,” అనడిగింది.
The following 18 users Like prasad_rao16's post:18 users Like prasad_rao16's post
• 9652138080, AB-the Unicorn, Babu G, DasuLucky, Iron man 0206, K.R.kishore, Kacha, kummun, Lover fucker, maheshvijay, meeabhimaani, Naga raj, noohi, ramd420, SS.REDDY, Subbu115110, Sunny73, Tik
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
రాము అక్కడే ఉన్న రిమోట్ తీసుకుని ac ఆన్ చేసి సోఫాలో కూర్చుంటూ, “ఖర్చు గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా….ముందు పిల్లాడు హెల్ప్ బాగుంటె చాలు,” అన్నాడు.
అలా గంట గడిచిన తరువాత నర్స్ మెడికల్ రిపోర్ట్ లు తీసుకుని వాళ్ళున్న రూమ్ కి వచ్చింది.
ఆమె వెనకాలే డాక్టర్ నిహారిక కూడా వచ్చింది.
నిహారిక : హాయ్ రాము గారు…నేనే మీతో మాట్లాడింది….
రాము : ఓహ్….మీరా….కార్డియాలజిస్ట్ అంటే….ఏదో యాభై ఏళ్ళు ఉంటాయనుకున్నా….కాని మీరు చాలా యంగ్ గా ఉన్నారు…..(అంటూ తనకు అలవాటు అయిన పొగడ్త వదిలాడు.)
నిహారిక : (చిన్నగా నవ్వుతూ) అవునా….అలా ఎందుకు అనుకున్నారు…..(అంటూ రిపోర్ట్ లు చూస్తున్నది.)
రాము : ఏమో….మీ మాటలు…ఇక్కడ మీ గురించి నేను విన్నదాన్ని బట్టి మీరు చాలా పెద్దవారని అనుకున్నాను…. (అంటూ ఆమెను పైనుండి కింద దాకా చూస్తున్నాడు.)
అంత రాత్రి పూట రావడంతో కొంచెం నిద్ర కళ్ళతో ఉన్నా నిహారిక చాలా అందంగా కనిపిస్తున్నది.
నిహారిక : (రాము చూపులు తన ఒంటిని తడమటం గమనించి) రాము గారు…
రాము : (వెంటనే అలెర్ట్ అయ్యి) చెప్పండి….
నిహారిక : రాము గారు…ఆపరేషన్ ఉదయం ఏడు గంటలకు చేస్తాను…దాదాపు రెండు గంటలు పడుతుంది…మీరు ఓకె అంటే ఈ పేపర్స్ మిద సంతకం చేయండి (రాము అలాగే అని తల ఊపడంతో ఆమె తన పక్కనే ఉన్న నర్స్ వైపు చూసి) సంతకం చేసిన తరువాత పేపర్స్ తీసుకుని నా కేబిన్ కి వచ్చేయ్…ఈ లోపు నేను ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయిస్తాను….(అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.)
రాము నర్స్ చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని రెజీనా వైపు చూసి, “రెజీనా ఇందులో సంతకం పెట్టు,” అన్నాడు.
రెజీనా అలాగే అన్నట్టు తల ఊపుతూ రాము చేతిలో పేపర్స్ తీసుకుని సంతకం పెట్టి నర్స్ కి ఇచ్చింది.
నర్స్ వాటిని తీసుకుని అక్కడనుండి తీసుకుని వెళ్ళిపోయింది.
రాము అక్కడ కూర్చుని తన అత్తయ్య మీనాకు ఫోన్ చేసి విషయం చెప్పి రావడానికి లేట్ అవుతుందని చెప్పాడు.
రెజీనా మనసు ఇప్పుడు ఆనందంతో నిండిపోయింది…..అప్పటి దాకా ఈ ఆపద ఎలా గట్టెక్కుతుందో…..తన కొడుకు తనకు దక్కుతాడో లేదో అన్న బాధలో ఉన్న ఆమెకు రాము చేస్తున్న సహాయం చూసి….తన కొడుకు తొందరలోనే ఆరోగ్యంగా ఉంటాడని సంతోషపడిపోతున్నది.
రెజీనా బెడ్ దగ్గరకు వెళ్ళి తన కొడుకుని పట్టుకుని పడుకున్నది.
అది చూసిన రాము ఆమెను కదిలించకుండా అక్కడే ఉన్న సోఫాలో పడుకున్నాడు.
అప్పటికే బాగా అలిసిపోవడంతో రాముకి తెలియకుండానే కళ్ళు మూతలు పడి నిద్ర లోకి జారుకున్నాడు.
రెజీనా కూడా దాదాపు ఒక గంట తరువాత నిద్ర లేచి చుట్టూ చూసింది….తన కొడుకు ప్రశాంతంగా నిద్రపోవడం చూసి రాము వైపు చూసింది.
రాము సోఫాలో పడుకుని ఉండటం చూసి రెజీనా డోర్ లాక్ చేసి వచ్చి సోఫా దగ్గరకు వచ్చి రాము వైపు ప్రేమగా చూసింది.
రాము నిద్ర పోతుండటంతో రెజీనా మెల్లగా ముందుకు ఒంగి రాము పెదవుల మీద ముద్దు పెట్టి…రాముకి డిస్టబెన్స్ కలగకుండా….రాము పడుకున్న సోఫాని బెడ్ లాగా చేసి మెల్లగా సోఫా మీదకు ఎక్కి రాము పక్కనే పడుకుని తన తలని ఛాతీ మీద పెట్టి చేత్తో రాముని చుట్టేసి కళ్ళు మూసుకుని పడుకున్నది.
తన మీద బరువు పడటంతో రాముకి మెలుకువ వచ్చి చూసాడు.
తన ఛాతీ మీద రెజీనా తల పెట్టి పడుకోవడం చూసి రాము చిన్నగా నవ్వుకుంటూ తన చేత్తో ఆమె నడుముని పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ, “ఏంటి రెజీనా….” అన్నాడు.
రెజీనా : నాకు ఎందుకో చాలా టెన్షన్ గా ఉన్నది రామూ…..
రాము : టెన్షన్ ఎందుకు….సిటీలోనే చాలా బెస్ట్ హాస్పిటల్ ఇది…..
రెజీనా : నిజంగా ఇప్పుడు జరుగుతున్నది….నాకు అంతా కలలాగా ఉన్నది….
రాము తల వంచి తన వైపు చూస్తున్న రెజీనా నుదురు మీద ముద్దు పెట్టాడు.
అలా ముద్దు పెట్టడంతో రెజీనా కి మనసులో అప్పటిదాకా ఉన్న భయం మొత్తం పోయి….ఒక రకమైన భరోసా రావడంతో మళ్ళి రాము ఛాతీ మీద తల పెట్టి పడుకున్నది.
రాము కూడా ఆమెను కదిలించకుండా అలాగే కళ్ళు మూసుకుని నిద్ర పోయాడు.
అలా ఎంతసేపు నిద్ర పోయారో తెలియదు కాని తరువాత డోర్ కొట్టిన శబ్దం వినిపించేసరికి రెజీనా కి మెలుకువ వచ్చి రాము వైపు చూసింది.
రాము ఇంకా నిద్ర పోతుండటం చూసి చిన్నగా నవ్వుతూ అతని పెదవుల మీద ముద్దు పెట్టి లేచి డోర్ తీసింది.
ఎదురుగా నిహారిక నిల్చుని ఉన్నది.
ఆమెను చూసి రెజీనా వెంటనే విష్ చేస్తూ పక్కకు జరిగింది.
నిహారిక లోపలికి వచ్చి సోఫాలో పడుకున్న రాము వైపు చూసి నవ్వుకుంటూ పిల్లాడి దగ్గరకు వెళ్ళి స్టెత్ పెట్టి హార్ట్ బీటింగ్ అన్నీ చెక్ చేసుకుని రెజీనా వైపు తిరిగి, “ఇంకో రెండు గంటల్లో పిల్లాడికి ఆపరేషన్ చేస్తాను….పిల్లాడికి పాలు అలాంటివి ఏమీ పట్టకండి…మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది….ఆ విషయం మర్చిపోవద్దు,” అంటూ రాము వైపు చూసి, “ఏంటి రాము గారు నిద్ర పోతున్నారా,” అనడిగింది.
రెజీనా : అవునండీ….రాత్రంతా నిద్ర లేదు….అలిసిపోయాడు….అందుకే పడుకోగానే నిద్ర పోయాడు….
నిహారిక : అలిసిపోక తప్పదు కదండీ….కొడుకు కోసం ఆమాత్రం కష్టపడకపోతే ఎట్లా…..
నిహారిక అలా అనగానే రెజీనా ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది.
రెజీనా : అయ్యో….రాము….కొడుకు కాదండి….వాడు నా కొడుకు…..
నిహారిక : (ఆశ్చర్యంగా చూస్తూ) అదేంటి….మీరు రాము బార్య కాదా….
రెజీనా : లేదండి….నేను ''….రాము నాకు చిన్నప్పడి ఫ్రండ్….
The following 21 users Like prasad_rao16's post:21 users Like prasad_rao16's post
• AB-the Unicorn, Babu G, Chandra228, DasuLucky, Deepakraj, Iron man 0206, K.R.kishore, Kacha, kummun, Lover fucker, maheshvijay, Manavaadu, meeabhimaani, Naga raj, noohi, ramd420, Sanjuemmu, SS.REDDY, Subbu115110, Sunny73, Tik
Posts: 7,229
Threads: 5
Likes Received: 15,125 in 2,265 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,104
నిహారిక : అవునా….మీ పేరు చూడంగానే నాకు డౌట్ వచ్చింది….కాని ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్….ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కామన్ కదా…అలా మీ ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారేమో అనుకున్నా…..
రెజీనా : లేదు డాక్టర్ గారు….రాము నాకు చిన్నప్పటి ఫ్రండ్….టెన్త్ లో నాకు క్లాస్ మేట్….తరువాత నాకు మళ్ళి కలవలేదు….నిన్న రాత్రి అనుకోకుండా రాముని కలిసాను…తరువాత నా కొడుకు గురించి తెలిసిన తరువాత ఏమాత్రం ఆలోచించకుండా ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్ లో జాయిన్ చేసాడు…..ఇప్పుడు ఆపరేషన్ కి ఆయ్యే మొత్తం ఖర్చు కూడా రామునే ఇస్తున్నాడు….చాలా మంచివాడు మేడమ్…..
నిహారిక : (రాము వైపు చూస్తూ) అవును….ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళ గురించే పట్టించుకోవడం లేదు….ఎప్పుడో టెన్త్ క్లాస్ మేట్ కష్టాల్లో ఉన్నదని తెలిసిన మరుక్షణం హెల్ప్ చేస్తున్నాడు….రాత్రి రాముతో మాట్లాడిన తరువాత ఆయన గొంతులో టెన్షన్ చూసి ఆయన కొడుకేమో అనుకున్నాను…..
రెజీనా : రాముకి ఇంకా పెళ్ళి కాలేదు డాక్టర్ గారు…..
నిహారిక : అవునా….నాకు పెళ్ళి అయింది….కాకపోతే మాత్రం రాముని తప్పకుండా ట్రై చేసేదాన్ని…..
రెజీనా : (నవ్వుతూ) ఇప్పుడే కదా పరిచయం అయ్యారు….అప్పుడే పెళ్ళి దాకా వెళ్ళిపోయారు….
నిహారిక : కొన్ని పరిచయాలకు టైం అక్కర్లేదు….మాకు ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ చూపులను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో బాగా తెలిసిపోతుంది….అందుకే అలా అన్నాను….మీరు విషయం చెప్పిన తరువాత రాము మీద ఇంకా గౌరవం పెరిగింది….
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా రాము నిద్ర లేచి వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ నిహారిక వైపు చూసి విష్ చేసాడు.
రాము : (నిహారిక వైపు చూసి) పొద్దున్నే కళ్ళు తెరవగానే ఇంత అందమైన అమ్మాయి కనిపిస్తే….చాలా మంచి జరుగుతుందని విన్నాను….(అంటూ నవ్వాడు.)
నిహారిక : అవునా….మీకు అలా ఎవరు చెప్పారు…..
రాము అలా అనగానే నిహారిక ఎలా రియాక్ట్ అవుతుందో అని రెజీనా కొంచెం కంగారు పడింది….కాని నిహారిక కూడా నవ్వుతూ మాట్లాడుతుండుంటం చూసి వాళ్ళిద్దరి మాటలను ఎంజాయ్ చేస్తున్నది.
రాము : ఎవరూ చెప్పక్కర్లేదు….పొద్దున్నే అందమైన అమ్మాయిని చూసామనుకోండి….మనసంతా ఉల్లాసంగా ఉంటుంది….దాంతో అనుకున్న పనులు వాటంతట అవే అయిపోతాయి…..
నిహారిక : మీరు ఆడవాళ్లతో బాగా ఫ్లర్ట్ చేస్తారనుకుంటాను…..
రాము : అదేంటి….అంత మాట అనేసారు…..ఏదో సరదాగా అన్నాను…..(అంటూ ఆమెను పైనుండి కింద దాకా అనుమానంగా చూస్తున్నాడు.)
నిహారిక : ఏంటి అలా చూస్తున్నారు…..
రాము : ఏం లేదు….ఇందాక అమ్మాయిని కాదన్నారు కదా….చూడ్డానికి మీరు అమ్మాయిలాగే కనిపిస్తున్నారు కదా….
నిహారిక : అమ్మాయి కాదు అంటే….నాకు పెళ్ళి అయిపోయింది……అని అర్ధం…పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళను అమ్మాయిలు అంటారు….మీరు వేరే అర్ధాలు తీయకండి….
రాము : ఒక్క నిముషం….ఇప్పుడే వస్తాను….(అని బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నిహారిక వైపు చూసి) మీరు రాత్రి నుండీ హాస్పిటల్ లోనే ఉన్నారా…..
నిహారిక : లేదు….మిమ్మల్ని కలిసిన తరువాత నేను ఇంటికి వెళ్ళాను….పావుగంట క్రితమే మళ్ళీ హాస్పిటల్ కి వచ్చాను….
రాము : మా కన్నా మీరే ఎక్కువ కష్టపడుతున్నారు….
నిహారిక : తప్పదు కదా….పేషెంట్ గురించి చాలా కేర్ తీసుకోవాలి….
రాము : ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుంది….
నిహారిక : దాని గురించి మీరు ఆలోచించొద్దు….(అని వార్డ్ బోయ్ ని పిలిచి) మన క్యాంటిన్ లో రెజీనా కి టిఫిన్ తీసుకుని రా…..
రాము : మరి నాకు….టిఫిన్ చెప్పలేదేంటి….
నిహారిక : నాకు, రాము గారికి టిఫిన్ తీసుకొచ్చి నా క్యాబిన్ లో పెట్టు….
రెజీనా : అదేంటి…రాముకి మీ క్యాబిన్ లో ఎందుకు…..
నిహారిక : ఏం లేదు….కొంచెం ఆపరేషన్ గురించి డిస్కస్ చేయాలి….అందుకే టిఫిన్ చేస్తూ మాట్లాడదామని….
రాము : అలాగే తప్పకుండా….
నిహారిక : సరె…..పావుగంట ఆగి రిపోర్ట్ లు తీసుకుని నా క్యాబిన్ కి వచ్చేయండి….(అని వెళ్ళిపోయింది.)
రెజీనా : ఏంటి రామూ….మళ్ళీ ఆపరేషన్ గురించి డిస్కషన్ అంటున్నారు….రెండు గంటల్లో ఆపరేషన్ చేస్తామన్నారు కదా….మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోవడం ఏంటి….
రాము : ఏం లేదు….ఫార్మాలిటీస్ అయి ఉంటుంది…..నువ్వు బట్టలు ఏమీ తెచ్చుకోలేదు కదా….
రెజీనా : లేదు….నేను సర్దుదామని అనుకుంటే….నువ్వే కదా….ఇక్కడ హాస్పిటల్ లో అన్నీ ఉంటాయని చెప్పావు….
రాము : అంటే…నువ్వు దుప్పట్లు, నేప్ కిన్స్ సర్దుతుంటే….అన్నీ ఇక్కడ ఉంటాయని అన్నాను….సరెలే….ఆపరేషన్ స్టార్ట్ అయిన తరువాత ఇంటికి వెళ్దువు గాని….
రెజీనా : అమ్మో…ఆపరేషన్ స్టార్ట్ అయిన తరువాత నేను వెళ్లను….అయిపోయిన తరువాత వెళ్ళొస్తాను….
రాము : నా డ్రైవర్ కి ఫోన్ చేసి మా అత్తయ్యను అడిగి చీరలు పంపమని చెబుతాను….
రెజీనా : అయ్యో….ఆమెనెందుకు ఇబ్బంది పెడతావు….వద్దులే….నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను….
రాము : ఇక్కడ నుండి నా విల్లా చాలా దగ్గర….పది నిముషాల్లో తెచ్చేస్తాడు…నీకే కాదు….నాక్కూడా బట్టలు కావాలి…
(అంటూ మీనా అత్తకు ఫోన్ చేసి విషయం చెప్పి…తామిద్దరికి బట్టలు పంపమని చెప్పి హాస్పిటల్ పేరు, రూమ్ నెంబర్ చెప్పి ఫోన్ పెట్టేసి) నేను స్నానం చేసి వస్తాను….(అని బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.)
The following 19 users Like prasad_rao16's post:19 users Like prasad_rao16's post
• 9652138080, AB-the Unicorn, Babu G, DasuLucky, Iron man 0206, K.R.kishore, kummun, maheshvijay, Manavaadu, meeabhimaani, Naga raj, noohi, ramd420, Sanjuemmu, Sivakrishna, SS.REDDY, Subbu115110, Sunny73, Tik
Posts: 304
Threads: 0
Likes Received: 119 in 90 posts
Likes Given: 198
Joined: May 2019
Reputation:
2
superb marvelous fantastic update bro and thank you for giving such a wonderful update. keep rocking and keep going plz continue same way as possible ur time
Posts: 1,065
Threads: 0
Likes Received: 1,143 in 727 posts
Likes Given: 356
Joined: Apr 2021
Reputation:
19
Super hospital lo romance adurs