Posts: 48
Threads: 0
Likes Received: 21 in 17 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
4
Vikatakavi garu. Really u writing skills great. Chalaa nachindi naku me ee story. Mundu title chusi chadavaledu. Tarwatha oka page chaduvudamani start chesa. Ala chaduvuthu almost motham chadivesa. Prathi pathraku meru nyayam chesaru. But nasmin n sameer role ni involve cheYadam nachaledu. Mari sontha anna chellelu ala baga anipinchaledu. Anyhow great update nonstop ga. All the best.
Posts: 272
Threads: 0
Likes Received: 62 in 55 posts
Likes Given: 13
Joined: Nov 2018
Reputation:
3
అప్డేట్ చాల చాల బాగుంది తొందరగా అప్డేట్ ఇవ్వండి
Posts: 3,517
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
చాలా చాలా బాగుంది వికటకవి గారు బావ మరదలు అక్క తో ఒక రాత్రి ప్లాన్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన అలాగే నాస్మిన్ సుజాత సమీర్ తో కలిస్తే చూడాలని రీడర్ నా విజ్ఞప్తి..
Chandra
Posts: 2,206
Threads: 0
Likes Received: 907 in 727 posts
Likes Given: 5,237
Joined: Nov 2018
Reputation:
14
Nice update broo keep updating story bro
Posts: 2,095
Threads: 243
Likes Received: 1,816 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
Episode 110
మర్నాడు ఉదయం సుజాత నాస్మిన్ ఇంటికి వచ్చింది.
సుజాత రావటం చూసిన నాస్మిన్ గాభరాగా ఆమెకు ఎదురువచ్చి గుమ్మం దగ్గరే— "సుజ్జీ...! నువ్వేంటీ... ఇలా వచ్చావ్?" అని అడిగింది, కంగారుగా సామిర్ గదివైపు చూస్తూ.
సుజాత 'తన సామిర్' కంటపడకుండా చెయ్యాలని ఆమె తాపత్రయం. అందుకే, అతను ఊరికి వస్తున్నట్టు సుజాతకి చెప్పలేదు.
"మనిద్దరికీ సేమ్ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారేఁ!" అని ఉత్సాహంగా అంటూ సుజాత తన చేతిలో వున్న పుస్తకాన్ని తెరిచి అందులోంచి రెండు హాల్ టికెట్లు తీసి చూపించింది. "అమ్మ ఇందాకే నాకు ఇచ్చింది. నీది కూడా తన దగ్గరనుంచి తీసుకున్నాను. నిన్ను తర్వాత ఆఫీస్ రూమ్ కి వచ్చి రిజిస్టరు లో సంతకం చెయ్యమని చెప్పింది... రికార్డు కోసమని!"
అప్పుడే— అటుగా వచ్చిన నాస్మిన్ వాళ్ళ అమ్మ, "అలా ఆ అమ్మాయిని బయటే నిలబెట్టి మాట్లాడతున్నావేఁ? లోపలికి రమ్మను!" అని అనటంతో నాస్మిన్ అయిష్టంగా పక్కకి తొలగి, "రా...!" అంటూ సుజాతకి దారిచ్చింది.
సుజాత హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటుండగా సామిర్ తన గదిలోంచి బయటకొచ్చాడు.
సుజాతని చూడగానే అతని కళ్ళు మరింత విశాలమయ్యాయి. రెప్పవాల్చకుండా ఆమెను ఆపాదమస్తకం పరీక్షగా చూడసాగాడు. ఇంతకుముందు కన్నా సుజాత కొద్దిగా చిక్కినట్లు అతనికి అన్పించింది. కళ్ళ క్రింద నల్లటి వలయాలు కూడ ఏర్పడ్డాయి(బహుశా పరీక్షలు కోసమని నిద్రమాని తెగ చదివేస్తుందేమో!). అయినా... 'చక్కనమ్మ చిక్కినా అందమే' అని అన్నట్టు ఆమెలోని ఆకర్షణ ఇసుమంతైనా తగ్గలేదు.
అటు సుజాత కూడా అతన్ని చూసి నాస్మిన్ తో, "హేయ్! మీ అన్నయ్య ఎప్పుడు వచ్చాడు?" అని అడిగింది.
"ని-న్న వచ్చాడులేఁ!" అని ముభావంగా బదులిచ్చి, "నా హాల్ టికెట్ ఇవ్వు!" అందామె.
సుజాత తన పుస్తకంలోంచి హాల్ టికెట్ ని తీసి ఆమెకు ఇచ్చింది.
సామిర్ వాళ్ళ దగ్గరకి వచ్చి నవ్వుతూ సుజాతని పలకరించాడు.
ఆమె కూడా చిరునవ్వుతో అతన్ని విష్ చేసింది. ఆమె కళ్ళు కూడ అతన్ని స్కాన్ చేస్తున్నాయి.
"ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా?" అన్నాడు సామిర్ ఆమె ఎదురు కుర్చీలో కూర్చొంటూ.
"అఁ... అ-మ్—!" అని అంటూ నిలువుగా తలూపిందామె.
'అంతకుముందులా తనతో ఒక్క మాట మాట్లాడటానికి బిగుసుకుపోయిన సామిర్ ఇతనేనా?' ఇప్పుడిలా తన కళ్ళలో కళ్ళుపెట్టి సూటిగా చూస్తూ, చక్కగా మాట్లాడుతుంటే తడబడటం ఈసారి సుజాత వంతయింది. పైగా కళ్ళు చెదిరేలాటి దుస్తులు ధరించి స్మార్టుగా... ఊఁహూ... సెక్సీగా తన ముందు నిలబడి వుంటే చూస్తూ కుదురుగా వుండటం తనకు కష్టమైందేమో, కుర్చీలోనే ఒకసారి అటుఇటు కదిలింది.
అటుప్రక్క నాస్మిన్ వాళ్ళిద్దరినీ చురచుర చూస్తూ గట్టిగా ఓమారు తన గొంతుని సవరించుకుంది.
సామిర్ వెంటనే సర్దుకుని ఆమె వైపుకి చూసి, "అఁ... స్-సెంటర్... ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు?!" అని అడిగాడు.
నాస్మిన్ సమాధానం చెప్పేలోగా సుజాత, "బండారులంక జెడ్ పి హైకాలేజ్... ఇద్దరికీ," అని చెప్పింది.
"ఓహో... అంత దూరం ఇచ్చారా మీకు!?" అంది నాస్మిన్ వాళ్ళ అమ్మీ వాళ్ళ మాటలు విని. ఆమె వంటగదిలో వుంది.
"అదంత పెద్ద దూరమేం కాదు అమ్మీ... బైక్ మీద వెళ్తే జస్ట్ ఇరవై-ఇరవై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు," అన్నాడు సామిర్ సుజాతని ఓరగా చూస్తూ.
నాస్మిన్ అతని చూపుని గమనిస్తూ — "ఐతే, మనం బైక్ మీద వెళ్దాం భయ్యా... సుజీ, నువ్వు— శంకర్ సార్ ని అడిగి అతని బండి మీద వచ్చేయ్!"
శంకర్ తో కళ్ళు కలపటం కూడా సుజాతకి ఇష్టం లేదు. అతని మీద, శ్రీదేవి మీద తనకున్న కోపం ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఇంక అతన్నేం అడుగుతుంది.!?
"ఊహూ... న్-నాకు... మ్-నేను వేరే ఎలాగో వస్తాన్లేఁ—" అని ఆమె అంటుండగా సామిర్, "ఒక్కర్తివేఁ.. ఏం వెళ్తావ్? కావాలంటే నువ్వూ మాతో రా... బైక్ మీద," అన్నాడు వెంటనే.
నాస్మిన్ సామిర్ ని గుడ్లురిమి చూసింది. సామిర్ మాత్రం సుజాతనే చూస్తున్నాడు.
సుజాత తన తల దించుకుని అలోచిస్తూ మెల్లిగా, "రావొచ్చు.! కానీ... బైక్ పైన ముగ్గురు అంటే... పర్లేదా-?" అని అడిగింది.
నాస్మిన్ 'అదేమీ కుదరదులేవేఁ' అని అందామని నోరు తెరిచేలోగా సామిర్, "ఏం పర్లేదు. త్రిబుల్స్ నాకు అలవాటే... నేను జాగ్రత్తగానే తీసుకెళ్తాను...! అమ్మీని, నాస్మిన్ ని ఎక్కించుకుని ఎన్నోసార్లు తీసుకెళ్ళాను కూడా. కదా అమ్మీ!" అన్నాడు.
"హా... ఔను బేటా!" అంది వాళ్ళ అమ్మ వంటింట్లోంచే. నాస్మిన్ మధ్యలో అడ్డు తగలకుండా వుండటానికి వాళ్ళ అమ్మని కూడా డిస్కషన్ లో ఇన్వాల్వ్ చేశాడు సామిర్!
సుజాత చిన్నగా నవ్వుతూ తలెత్తి సామిర్ మొహంలోకి చూసి—
"ఐతే... నేనూ ఎంచక్కా మీతో కలిసి బండి మీద వచ్చేస్తాను!" అంది సంతోషంగా.
సామిర్ కూడ 'ఓకే' అన్నట్టుగా తలూపుతూ నవ్వాడు.
నాస్మిన్ మొహం మాత్రం కందగడ్డలా మారిపోయింది.
★★★
రాజమండ్రి —
శిరీష్ మర్నాడు ఉదయం ఇంటి ముందున్న పూల మొక్కలకి నీళ్ళు పెడుతుండగా ఏదో బండి ఆగిన శబ్దం వినిపించి తలత్రిప్పి గేట్ వైపు చూశాడు.
అజయ్ తన జీప్ దిగి గేట్ తీసుకుని లోపలికి వస్తూ కన్పించాడు.
శిరీష్ ముఖంపై చిరునవ్వు విరిసింది.
"హ్మ్... అజయ్! రా రా... నేను అనుకున్నదానికన్నా చాలా తొందరగానే వచ్చావేఁ!" అన్నాడు.
అజయ్ ఆశ్చర్యపోతూ ఆగిపోయి — "నేనొస్తానని ముందే అనుకున్నావా, గురూ!?"
శిరీష్ అవునన్నట్లు తలూపి, "నీకు నిన్ననే చెప్పాను కదా.... నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసునని!" అంటూ నర్మగర్భంగా నవ్వాడు.
"అయితే... నేనిక్కడికి ఎందుకొచ్చానో చెప్పు చూద్దాం?" జేబులో చేతులు పెట్టుకుని కళ్ళెగరేస్తూ అడిగాడు.
శిరీష్ తన చేతిలో వున్న వాటర్ జగ్ ని పక్కనున్న గట్టుమీద పెట్టి, "హ్మ్... ఎందుకొచ్చావో చెప్పనా లేక ఎక్కడకెళ్ళి ఇక్కడికి వచ్చావో కూడ చెప్పనా...!?" అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు.
అజయ్ ముఖంలో భావం ఒక్కసారిగా మారిపోయింది. గుటక మింగుతూ శిరీష్ తో కళ్ళని కలపలేనట్టు చప్పున తన తలని క్రిందకి దించేశాడు. 'గురూకి ఎలా తెలిసిపోయింది?' అనుకున్నాడు మనసులో.
నిజానికి డైరెక్టుగా శిరీష్ ఇంటికనే బయలుదేరిన అతడు.... ఒక్కసారి సౌమ్యని చూడాలని అన్పించటంతో దారి కాకపోయినా ముందు ఆమె ఇంటి వైపే తన జీప్ ని పోనిచ్చాడు. ఐతే... ఆమెను ఎందుకనో ఆమెను చూడకుండానే వెనుదిరిగి ఇక్కడికి వచ్చేసాడు.
శిరీష్ నిర్మలంగా నవ్వుతూ అజయ్ ని సమీపించి, "చూశావా... నేనేమీ చెప్పకుండా నువ్వే సమాధానం ఇచ్చేశావ్!!!" అన్నాడు.
అజయ్ మౌనంగా తన చేతులు కట్టుకుని వున్నాడు. ఒక పోలిస్ గా ఎందరో దొంగనాయాళ్ళను పట్టుకున్న అతడు మొదటిసారి శిరీష్ ముందర ఒక పట్టుబడ్డ దొంగలా నిలబడ్డాడు.
శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి, "లోపలికి పద... మాట్లాడుకుందాం!" అన్నాడు.
అజయ్ ని చూసిన వాణీ గబగబా పరుగెత్తుకుంటూ వాళ్ళ ముందుకొచ్చి, "అన్నయ్యా! ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావ్?" అని అడిగింది.
"వాణీ... ముందు వాణ్ణి లోపలికి రానీయ్...!" అన్నాడు శిరీష్ తన నవ్వును మెయింటెయిన్ చేస్తూ.
అజయ్ గుర్రుగా వాణీని చూస్తూ, "గురూ... నీ మరదలితో చెప్పు. ఇంకోసారి నన్ను 'అన్నయ్యా' అని పిలవొద్దనీ!" అని శిరీష్ తో అన్నాడు.
ఇద్దరూ లోపలికొచ్చి హాల్లో కూర్చున్నారు.
శిరీష్ కూడా తన మొహాన్ని సీరియస్గా పెట్టి వాణీతో, "ఔను. నిజమే... అజయ్ ని నువ్వు 'అన్నయ్య' అని పిలవొద్దు...!" అంటూ చిన్నగా కన్నుకొట్టి, "కావాలంటే... అం-కు-ల్, అని పిలుచుకో!" అన్నాడు.
"అంకులా!" అంటూ వాణీ గలగల నవ్వేసింది.
అజయ్ బిక్క మొహం వేసి, "గురూ... నువ్వు కూడా మొదలెట్టావా!" అన్నాడు శిరీష్ తో.
"లేదు లేదు... నేను అన్నయ్యా అనే పిలుస్తాను!" అంటూ అజయ్ ప్రక్కన కూర్చుంది.
అప్పుడే లత ఆ గదిలోకి ప్రవేశించింది. తలారా స్నానం చేసి కాలేజీ యునిఫారం ధరించి తన తడి జుత్తును టవల్ తో శుబ్రంగా తుడుచుకుంటూ, "అరే... అజయ్ గారూ! మీరెప్పుడు వచ్చారు?" అని అడిగింది.
"ఇప్పుడే..." అని బదులిచ్చాడు అజయ్.
"టీ తీస్కొస్తానుండండీ!" అంటూ వడివడిగా కిచెన్ వైపు కదిలిందామె.
వాణీ అజయ్ గడ్డం పట్టుకుని తనవైపు తిప్పుకుని, "ఇప్పుడు చెప్పన్నయ్యా... ఇంత పెందలాడే వచ్చావేంటి?" అని అడిగింది మళ్ళీ.
లత ఆ మాటలు విని 'అన్నీ దీనికే కావాలి!' అని సణుక్కుంటూ టీ చేయ నారంభించింది.
అటు అజయ్ ఒకసారి వాణీని, శిరీష్ ని మార్చి మార్చి చూశాడు.
శిరీష్ మొహం ఎప్పటిలాగే ప్రశాంతంగా వుంది. అయితే... వాణీ కళ్ళు మాత్రం చిలిపిగా కదులుతున్నాయి.
మళ్ళా గుండెల్లో ఏదో తియ్యని తిమ్మిరి మొదలయినట్టు అన్పించింది అజయ్ కి. ఇక ముసుగులో గుద్దుడు అనవసరమనిపించింది.
వాణీని చూస్తూ, "నీ వ్-వదినని చూద్దామని వచ్చాను!" అన్నాడు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Posts: 272
Threads: 0
Likes Received: 62 in 55 posts
Likes Given: 13
Joined: Nov 2018
Reputation:
3
ఈ ఇయర్ లోప్పు xossib లో పోస్ట్ చేసిన అప్డేట్ అన్నీ పోస్ట్ చేస్తారని కోరుకుంటున్న నాను.
మీ
Posts: 2,095
Threads: 243
Likes Received: 1,816 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
నాకు డౌటే మిత్రమా....
సాధ్యమైనంతవరకూ ట్రైచేస్తాను
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Posts: 2,095
Threads: 243
Likes Received: 1,816 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారు అని చెప్పారుగానీ... ఎక్కడా వికటకవులు అవుతారు అని చెప్పలేదు కదా బ్రో...
కనుక, నేను నాలాగే వుంటాను. కథ అప్డేట్స్ ఎప్పటిలాగే పెడతాను.
అయినా... కొత్త సంవత్సరంలో కొత్త అప్డేట్స్ తో మొదలుపెడితేనే బావుంటుంది.
పాత అప్డేట్స్ మహా అయితే ఇంకా నాలుగున్నాయి అనుకుంటాను.
అంతే!!!
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK