Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తోడొకరుండిన
#2
తోడొకరుండిన

పచ్చని మామిడాకుల తోరణాలు, పసుపు గంధం సుగంధాలు, పట్టుచీరల.రెపరెపలు, బంగారు నగల మిలమిలలు, పలకరింపులు, సరదాలు-సందళ్ళూ. పెళ్ళికూతురు మృదుల పెదవులపై చిరునవ్వులు,బుగ్గల్లో నునుసిగ్గులు. మృదుల తండ్రి విశ్వనాధం గారి కళ్ళు ఆ హడావిడిలో ఎవరి కోసమో వెతుకుతున్నాయి.
"అమ్మా మంజూ" అటుగా వెళ్తున్న కోడలు మంజులను పిలిచారు.
"ఏమిటి మావయ్యా?" కట్టకున్న పట్టుచీర అంచు సరిచేసుకుంటూ వచ్చింది.
"మహీ ఏదమ్మా? కనిపించట్లేదు?" మెల్లగా అడిగారు.
మంజుల మోహం కాస్త చిట్లించింది.
"ఇక్కడే ఎక్కడో ఉంటుంది మావయ్యా? ఏమండి ఈ చీర ఏలా ఉంది?" అప్పడే ఆ గదిలోకొచ్చిన శ్రీకాంత్ ని అడుగుతూ, ఏదో పనున్నట్టు వెళ్ళపోయింది.
ఆయనో నిట్టూర్పు విడిచి లోపలికి నడిచారు.
"మృదూ! మహీ ఏదమ్మా?" పెళ్ళికూతురు మృదులనడిగారు. 
పెళ్ళికొడుకు గురించి తన ఫ్రెండ్స్ కి ఏదో చెప్పి సరదాగా నవ్వుతున్న మృదుల మొహంలో నవ్వు మటుమాయమైపోయింది. "మహీ, అర్జున్ ని రెడీ చేస్తుంది నాన్నా! అదిగో వచ్చింది చూడు" అన్న ఆమె మాటల్లో గిల్టీనెస్ అంతర్లీనంగా కనబడుతోంది.
"ఏంటి నాన్నా? ఏదైనా పనుందా?" అంటూ నాలుగేళ్ళ అర్జున్ తో వస్తున్న సన్నగా, పొడుగ్గా ఉన్న ఇరవైరెండు - ఇరవైమూడేళ్ళ అమ్మాయి ఏ పట్టుచీరా కట్టుకోకపోయినా, ఏ నగా పెట్టకపోయినా మెరుపుతీగలా మెరిసిపోతోంది. కానీ......
ఆమె విశాలమైన కళ్ళల్లో ఏ ఉత్సాహమూ లేదు. కేవలం ఉదాశీనత తప్ప.
అందాల చందమామలాంటి ఆమె వదనంలో ఎటువంటి భావాలు లేవు. ఆ లేత వయస్సులో తాను చూసిన దారుణమయిన అనుభవాలు తప్ప.
ఆయన గుండె ఒక్కసారి పిండినట్లయింది. వచ్చిన పని మర్చిపోయి కళ్ళలో తిరుగుతున్న నీటిపొరతో గబగబా అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు.
విశ్వనాధం, సంధ్యలకి మొదట శ్రీకాంత్ తర్వాత మహిమ, మృదుల. ఏ చీకూ చింత లేక ఉన్నంతలో హయిగా గడిపే సంసారం. అయిదు సంవత్సరాల క్రితం శ్రీకాంత్ పెళ్ళిలో చలాకీగా తిరుగుతున్న అందాల అపరంజి బొమ్మలాంటి పదిహేడేళ్ళ మహిమని చూసి, పెళ్ళికూతురి దూరపు బంధువైన సంజయ్ మనసు పారేసుకున్నాడు. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పంతంపట్టి మరీ తన పేరెంట్స్ ని ఒప్పించాడు.
సాఫ్ట్ వెర్ ఇంజినీరైన సంజయ్ ఉద్యోగం, అతని ఫ్యామిలీ, వాళ్ళ ఆస్తీ అంతస్తూ చూసి, కోరి వచ్చిన అంత మంచి సంబంధాన్ని కాదనలేక, మహీకింకా పెళ్ళివయస్సు రాకపోయినా విశ్వనాధంగారు వెంటనే పెళ్ళికి ఒప్పుకున్నారు. 
ఆకశమంత పందిరి, భుదేవంత అరుగు వెయ్యకపోయినా, తమ చిన్నారి కూతురి పెళ్ళి అన్ని ముచ్చట్లతో జరిపించి అత్తారింటికి పంపారు. ఏరికోరి చేసుకున్న అల్లుడు తమ అమ్మాయి అరిపాదాలు కందనీయకుండా అపురూపంగా కాపురం చెయ్యటం చూసి తమ కూతురి అదృష్టానికి పొంగిపోయారు. కానీ...
ఆ ఆనందమంతా కేవలం మూణ్ణాళ్ళ ముచ్చటైంది. పెళ్ళయిన ఆర్నెల్లకి ఏదో ప్రాజెక్టుకని ఫిన్లాండ్ వెళ్ళిన సంజయ్ అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడు. అక్కడి వెదర్ కండిషన్స్ వల్ల న్యుమోనియా వచ్చి అర్దాంతరంగా చనిపోయాడు.
పద్దెనిమిదేళ్ల కూడా నిండకుండానే పచ్చని జీవితమంతా అంధకారబంధురమై, అయిదు నెలల గర్భవతిగా మిగిలిన తమ కూతురిని చూసి గుండె పగిలిపోయింది. అయినా తమ కర్తవ్యం గుర్తోచ్చి ఆమెను మళ్ళీ తమ గుండెల్లో దాచుకున్నారు. కళ్ళు తెరవకుండానే కన్నతండ్రిని పోగొట్టుకుని పుట్టిన మనవణ్ణి పెంచుతున్నారు.
ఆ బాధంతా ఒకెత్తయితే ఇప్పుడు పడుతున్న ఆవేదన ఇంకో ఎత్తు. మృదుల పెళ్ళిలో అందరి మధ్యలో మహిమని చూస్తుంటే ఆ తండ్రి గుండె తరుక్కుపొతోంది. 
ఇక ఆమె తల్లి సంధ్య పరిస్థితి ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరులా ఉంది. పెళ్ళికూతురి అలంకరణలో కళకళలాడుతున్న మృదులని చూసి మురిసిపోవాలో...మరో పక్క అందరిలో కలవలేక మానలేక, తనేంచేస్తే ఎవరు నొచ్చుకుంటారో, ఏ అశుభం జరుగుతుందో అన్న సంశయంతో ముడుచుకుపొతున్న మహిమని చూసి ముక్కలైపొతున్న మనసుని ఎలా చిక్కబట్టుకోవాలో తెలియక భారంగా తిరుగుతోంది. మృదులని పెళ్ళికూతుర్ని చేస్తూ ఆమెకి హారతివ్వాలని ముత్తైదువులందరినీ పిలుస్తున్న తనని చూసి, ఏదో పనున్నట్లు వెళ్ళపోయిన మహీని చూసి ఆ తల్లి మనస్సు చివుక్కుమంది.
"భగవంతుడా! రోజులెంత మారినా, మనుషుల్లో ఎన్ని మార్పులొచ్చినా ఈ ఛాదస్తాలు, మూఢనమ్మకాలు పోయే రోజెప్పుడొస్తుంది స్వామీ" ఆ తల్లి మనసు మౌనంగా రోదించింది. ఇదే మహిమ, ఇప్పుడు సంజయ్ ఉండుంటే మృదులకిచ్చే హారతిలో తనే ముందుండేది. తన ముద్దుల చెల్లెల్ని మురిపెంగా తన చేతులతో పెళ్ళికూతురిని చేసి ముచ్చటపడేది. సంధ్య కళ్ళు బాధతో జలజలా వర్షిస్తున్నాయి.
"ఏంటత్తయ్యా! మృదూ వెళ్ళిపోతోందని అప్పుడే బెంగ మొదలయిందా?" ఆ తల్లి వేదన ఏమిటో అర్థం కాని మంజుల నవ్వుతూ అడుగుతోంది.
            *               *               *              *
            party  Vishu99  party
[+] 2 users Like Vishu99's post
Like Reply


Messages In This Thread
తోడొకరుండిన - by Vishu99 - 19-01-2019, 11:50 AM
RE: తోడొకరుండిన - by Vishu99 - 19-01-2019, 11:56 AM
RE: తోడొకరుండిన - by krish - 23-01-2019, 05:39 AM
RE: తోడొకరుండిన - by Uma_80 - 05-02-2019, 10:04 PM
RE: తోడొకరుండిన - by raaki - 06-02-2019, 12:33 AM
RE: తోడొకరుండిన - by ravi - 06-02-2019, 10:25 AM
RE: తోడొకరుండిన - by ~rp - 06-02-2019, 01:01 PM
RE: తోడొకరుండిన - by Uma_80 - 11-02-2019, 07:08 PM
RE: తోడొకరుండిన - by RAANAA - 06-10-2022, 05:47 AM



Users browsing this thread: 1 Guest(s)