Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2
#77
ఫ్రైడే: 


ఇద్దరికీ ఆఫీస్ అయ్యింది. ఈ రోజు స్వీటీ నన్ను బస్ స్టాప్ దగ్గర ఎక్కించుకోమంది. నేను తను చెప్పినట్లే బస్ స్టాప్ దగ్గరికి వెళ్లాను. అక్కడ తానుంది.  

"హే స్వీటీ ..... "

"హాయ్ సంజు ...... "

"హే ...... మనిద్దరి బాగ్స్ నీ ఆఫీస్ పెట్టు నీ ఆఫీస్ కేబిన్ లో ....... పెట్టటం కుదురుతుందా ??"

"ఎందుకు ??"

"కుదురుతుందా ??"

"ఏమో సంజు ........ అంత సేఫ్ కాదు ....... "

"సరే ........ నా ఆఫీస్ లో పెడదాం .............. " అన్నాను. 

"సంజు ...... ఎక్కడికి ??"

"చెప్తా ..... ముందు ఎక్కు బైక్ "

తను బైక్ ఎక్కింది. ఇద్దరం నా ఆఫీస్ దగ్గరికి వెళ్లి నేను ఇద్దరి బాగ్స్ సెక్యూరిటీ దగ్గర పెట్టేసి వచ్చాను. 

ఇద్దరం మళ్ళి బైక్ ఎక్కాము. 
 
"సంజు ....... ఎక్కడికి ??" అని ఆతృతతో అడిగింది. 

 తను బైక్ ఎక్కింది. నేను రెండో వైపు బైక్ తిప్పాను. 

"సంజు .......... ఇటు ఎక్కడికి ??"

"చెప్తా ....... " 

"ఓకే ....... "

సిగ్నల్ దగ్గర ఆగాము. 

"ఇప్పుడు చెప్పరా ....... ఎక్కడికి వెళ్తున్నాం ........ ??"

"గెస్ చేయి ........ రెండు ఛాన్సెస్ ఇస్తున్నాను ...... "

"hmmmmmm ........ రెస్టారెంట్ కా ??"

"కాదు ....... "

"సరే ఇంకో ఛాన్స్ ....... "

"పార్క్ కా ??"

"పార్క్ కా ?? ఐన మనకెందుకె పార్క్ ??"

"సరే రెండు గెసెస్ అయిపోయాయి ....... ఇప్పుడు చెప్పు ....... "

"రెండు గెసెస్ అన్నాను కానీ రెండు గెసెస్ అయిపోయాక ఆన్సర్ చెప్తానన్నానా ?? ...... "

నన్ను నడుం దగ్గర గిల్లింది. 

"రాక్షసి ........ "

"మరి చెప్పు ........ "

"చెప్తే నాకేంటి ??"

"ఆ ??"

"చెప్తే నాకు లాభం ఏంటి ??"

"పుణ్యం ...... " అంది. 

"నాకు ఆల్రెడీ చాల ఉంది ........ "

"అబ్బా ప్లీస్ ...... చెప్పారా బాబు ....... "

"నేను చెప్పనుగా ....... "

"ఐన నేను అక్కడికి రాను ....... "

"నీ టైం బాగుందే ........ ఎలాగో సిగ్నల్ కోసం ఇక్కడ ఆగం గా ...... ఇక్కడే దిగిపో ....... నేను వెళ్తాను ...... "

"ఆ ...... యదవ  ....... అంటే నన్ను వొదిలేసి నువ్వొక్కడివే వెళ్ళిపోతావా ??"

"ఎస్ ....... "

నన్ను భుజం పై కొట్టింది. నేను మూసి మూసి నవ్వులు నవ్వాను. 

"ఈ నవ్వులకేం తక్కువ లేదు ........ "

"సిగ్నల్ వచ్చింది ....... సరిగ్గా కూర్చో...... "

తను చిరుకోపంతో కూర్చుంది. నేను లోలోపల నవ్వుకొని బైక్ స్టార్ట్ చేసి ముందుకి వెళ్లాను. 

నెమ్మదిగా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చాము. 

"ఓ ! షాపింగ్ గా ..... " అంది. 

నేను సైలెంట్ గా ఉన్నాను. 

మాల్ లో బేస్మెంట్ లో బైక్ తీసుకొనివెళ్ళి పార్క్ చేసాను. ఇద్దరం బైక్ దిగి లిఫ్ట్ వైపుకి వెళ్ళాము. 

"దీనికి అంత బిల్డ్ అప్ ...... ఎందుకో ...... " అని కామెంట్ చేసింది. 

నేను తన వైపు చూసాను. తను ఏమి తెలియనట్లు వేరే వైపు చూసింది. 

నేను ".... every dog has its day....." అన్నాను. 

"ఓ ......   మొత్తానికి నువ్వు మనిషివి కాదని ఒప్పుకుంటున్నావ్ అన్నమాట..... " అని కామెంట్ చేసింది. 

నేను తన వైపు చూసి నవ్వి "నీకు బాగా ఉందే ....... బాగా మాటలు నేర్చావ్ ....... " అన్నాను. తను కూడా నవ్వింది. 

ఇద్దరం నవ్వుకున్నాక "మొదట్లో ఎంత సిగ్గు తో సైలెంట్ గా ఉండేదానివో ...... "

"ఎం చేస్తాం ....... నీతో తిరుగుతున్న గా ....... అందుకే ఇలా తయారయ్యాను ...... "

నేను మళ్ళి తన వైపు చూసి నవ్వి "..... నిన్ను బాగా కొడతానే ఈ రోజు ...... " అన్నాను. 

"సరే ...... చూద్దాం ...... " అంది. 

"ప్రస్తుతం నాకు కౌంటర్స్ రావట్లేదు ....... వచ్చినప్పుడు నేను కూడా నీ పై బాగా కౌంటర్స్ విసురుతా ..... "

"సరే నీ ఇష్టం ....... "

ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాం. 

తను నా చేయి పట్టుకుంది. లిఫ్ట్ బాగా రద్దీ గా ఉంది. 

"5th floor.... " అని లిఫ్ట్ లో చెప్పాను. 

తను లిఫ్ట్ లో ఉన్న sticker చూసి "ఓ ..... సినిమాకా .... "

నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను. 

లిఫ్ట్ దిగాక రద్దీ తగ్గింది. 

"ఎం సినిమారా ??" అని అడిగింది. 

నేను సైలెంట్ గా ఉన్నాను. 

"నాకు తెలుసు ...... నువ్వు చెప్పవ్ ..... "

ఇద్దరం థియేటర్ దగ్గర ఉన్న లాబీ లోకి వెళ్లి కూర్చున్నాం. 

"సరే ఇప్పుడు చెప్పు ...... "

"మనం దయ్యం సినిమాకి వెళ్తున్నాం ....... 3D మూవీ....... "

"అనుకున్నాను ........ "

"అబ్బ ??"

"పోస్టర్స్ బయట చూసినప్పుడే అర్ధమైంది ....... "

"నైస్ ....... "

"ఐన నాకేం భయం ఉండదు లే....... "

"సినిమా స్టార్ట్ అయ్యాక ఇదే మాట మీద నిలబడు ..... "

"నేను నాకు భయం లేదు అనలేదు ..... "

"మరి ??"

"నువ్వున్నావ్ గా ........ గట్టిగ పట్టుకొని చూస్తాను లే ..... "

"యా ...... " అన్నాను. 

"ఐన దీనికి నాకు అంత చెప్పకుండా తీసుకొని రావాల్సిన అవసరం ఉందా ??"

"ఎస్ ...... "

"ఎందుకు ??"

"ఎందుకంటే నువ్వు రాను అనొచ్చు కాబట్టి ....... "

"ఐన నువ్వుండగా ......  నేనెందుకు రాను అనుకున్నవ్ రా ??"

"ఏమో ........ "

"ఐన సినిమాకి టికెట్స్ ఎప్పుడు బుక్ చేసావ్ రా ??"

"చేయలేదు ....... "

"మరి ??"

"ఇవి ఫ్రెండ్ టికెట్స్ ........ తనకి వేరే పని వస్తే ...... టికెట్స్ వేస్ట్ అయిపోతాయి......  అడిగాడు ....... సరే అని తీసుకున్నాను ..... "

"ఓ ...... "

"నువ్వు చెప్పింది కరెక్ట్ ....... "

"ఎం విషయం ??"

"సినిమా గురించి ...... "

"హా ??"

"మొన్న ఆఫీస్ వాళ్ళందరూ ఈ సినిమాకి ఈ రోజు వెళ్దామని టికెట్స్ బుక్ చేస్తాను అంటే వద్దు అన్నాను సంజు ........ "

"ఓ ......."

తనకి ఏదో గుర్తొచ్చి  "ఆగు ..... ఒక్క నిమిషం ........ " అని తన ఫోన్ తీసుకుని చూసింది. 

ఫోన్ చూసి విచిత్రంగా రియాక్ట్ అయ్యి "సంజు ....... "

"hmmmmmm ...... "

"వాళ్ళు కూడా ఇదే థియేటర్ కి వస్తున్నారు ...... "

"మంచిదే గా ...... "

"మంచిదేంటి ?? నాకు ఈ రోజు డాక్టర్ అప్పోయింట్మెంట్ ఉందని తప్పించుకున్నాను ........ "

నేను నవ్వి "ఎందుకు ??" అని అడిగాను. 

"ఎందుకంటావేంటి ?? వాళ్ళు నాకు దయ్యం సినిమాలు ఇంత భయం అని తెలిస్తే ఆఫీస్ లో రేపటి నుంచి నన్ను బాగా టీస్ చేస్తారు........ "

నేను గట్టిగ నవ్వి "ఏంటి ??" అని అడిగాను. 

"నవ్వు ..... ఆపు ....... ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నన్ను చూసి ఏమనుకుంటారో ఏమో ....... "

"మూవీ స్టార్ట్ అవ్వటానికి ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉంది....... చూడు ఎవరైనా వచ్చారేమో....... "

"లేదు ....... ఎవ్వరు రాలేదు ...... "

"ఏది ఒకసారి ఫోన్ నాకు ఒకసారి ఇవ్వు ........ "

"ఎందుకు ??"

"వాట్సాప్ ఓపెన్ చేసి సినిమా ఫస్ట్ షో నా లేదా సెకండ్ షో నా చూడు ........ " అన్నాను. 

తను ఫోన్ ఓపెన్ చేసి "సెకండ్ షో ....... "

"దీనికెందుకు టెన్షన్ ??"

"టెన్షన్ కాదు ........ నా గురించి వేరే లాగ అనుకుంటారు ....... "

"స్వీటీ రిలాక్స్ ........ ఇట్స్ ఓకే ..... అనుకుంటే అనుకోని ....... "

"నీకేం బాబు ....... చాల లైట్ తీసుకుంటావ్ అన్ని విషయాలు ....... నేను నీ లాగ కాదు ....... "

"దీనికి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ....... "

"నీకర్ధం కాదు సంజు ....... నువ్వనుకున్నంత ఈసి కాదు ....... "

"సరే నాకొకటి చెప్పు ....... ఆఫీస్ వాళ్ళతో కాకుండా నాతో వస్తే ప్రాబ్లెమ్ ఏంటి ??"

"అదంతే ....... నీకు మా ఆఫీస్ వాళ్ళ గురించి తెలీదు ......... "

నేను తన వైపు దీర్ఘంగా చూసి "నువ్వేదో దాచుతున్నావని నా ఫీలింగ్ ........ నీ మొహం లో ఆ డిస్కంఫర్ట్ ఏంటి ??" అన్నాను. 

"ఎం లేదే ....... "

"లేదు ఏదో దాచుతున్నావ్ ....... "

తను casual గా ఎం లేదని అటు వైపు చూసి మళ్ళి నా వైపు చూసి "ఏంటి ??"

నేను అలాగే తన వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాను. 

తను గట్టిగ ఊపిరి తీసుకుని "..... సరే ....... నువ్వు చెప్పింది కరెక్టే ........ సంజు ..... "

"చెప్పు ...... వింటున్నాను ...... "

తను నా చేతులు తీసుకొని నా చేతులు తన చేతులతో పట్టుకొని " సంజు .......   " అంది. 

"ఎందుకిలా అంత ప్రవర్తిస్తున్నావ్ ....... ??"

ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. 

తన ఫీలింగ్స్ చూసి నాకర్ధమైంది నేను తన వైపు చూసి "..... నో ...... " అన్నాను. 

"ఏంటి ??" అంది. 

"నువ్వు మీ ఆఫీస్ వాళ్లకి నా గురించి ఏదో చెప్పావ్....... అందుకే ఈ రోజు ఆఫీస్ లో కాకుండా బస్సు స్టాప్ లో ఎక్కించుకోమన్నావ్ ........ "

"సంజు ....... " అని ఇబ్బందిగా చూసింది. 

"ఎం చెప్పవే నా గురించి ??" అని అడిగాను. 

"అది ...... అది ....... నీకు వొంట్లో బాలేదు ....... హాస్పిటల్ కి వెళ్తున్నాం అని చెప్పాను ........ "

"దుర్మార్గురాల ....... నీ స్వార్ధం కోసం నన్ను వాడుకుంటావా ??" అని అన్నాను. 

"ఓవర్ ఆక్షన్ ఆపు ........ పోయిన నెల ఆఫీస్ వాళ్ళు నీకు ఫోన్ చేసి ఓవర్ టైం వర్క్ చేయమంటే ........ ఎం చెప్పావ్ రా ??"

"ఎం చెప్పాను ??"

"గుర్తులేదా ??"

"లేదు ...... "

"అబ్బ ...... "

"నా పేరు సంజయ్ ......సంజయ్ రామస్వామిని ........  నాకు short term memory loss ఉంది...... "

తను నవ్వి "చంపేస్తాను ...... " అంది. 

"నిజం ....... అసలు ఎవరు నువ్వు ??" అని అడిగాను. 

"టాపిక్ డైవర్ట్ చేయకు ....... "

"ఎం టాపిక్ ??"

"అబ్బ ...... "

"అసలు మనం ఎక్కడున్నాం ?? ఇక్కడేం చేస్తున్నాం ??"

"సంజు ...... "

నా ఫోన్ ఓపెన్ చేసి స్వీటీ ఫోటో చూసి తనకి చూపించి "ఇది ...... నువ్వేనా ?? ఇక్కడ నా వైఫ్ అని రాసుంది ........ "

తను నవ్వుతు నా తొడ పై గిల్లి 

"అబ్బా ....... రాక్షసి ...... "

"ఇప్పుడు .... గుర్తొచ్చానా ఎవరో నేను ??" అంది. 

"లేదు ...... "

ఇంకోసారి గిల్లింది ...... 

"అబ్బా ........ శాడిస్ట్ ........ "

"ఇప్పుడు గుర్తొచ్చానా ??"

నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నట్లు నటించి "నీ పేరు స్వీటీ కదూ ..... " అన్నాను. 

"సంజు ....... టాపిక్ భలే డైవర్ట్ చేస్తావె నువ్వు ??"

నేను నవ్వి ఊరుకున్నాను. 

"నువ్వు మాత్రం నన్ను వాడుకుంటావ్ ......... మీ ఆఫీస్ వాళ్ళకి ఏదో చెప్పుకుంటావ్ ....... నేను మాత్రం ఎం చెప్పకూడద ??"

"లేదు ..... మొగుడు గా నేనేం చెప్పిన అది రైట్ .... నేనేమైన చెప్పొచ్చు కానీ వైఫ్ గా నీకు అలా చేసే అధికారం లేదు ....... "

"అబ్బా ...... ఇంకా ??"

"అంతే కాదు ........ నేనేం చేసిన అది మన మంచికోసమే ....... "

"మరి నేను చేస్తే ??" అని అడిగింది. 

"స్వార్ధం కోసం ....... "

"అబ్బో ....... "

"నాది కల్మషం లేని మనసు ....... నీ లాగ కాదు ....... "

"బాబోయ్ ....... నిజంగానే ??"

"అవును ........ నా లాంటి మచ్చ లేని మనసు నీకు రావాలంటే tide, surf excel కూడా సరిపోవు ....... "

"సంజు ....... చాలా ఓవర్ అవుతుంది ........ తెలుసా ??" అని నవ్వుతు అంది. 

"సరే ...... " అని నేను నవ్వాను. 

తను కూడా నవ్వింది. ఇద్దరం నవ్వుకున్నాం. 

"సంజు ...... సినిమాకి టైం అయింది ....... "

"ఆగు ..... ముందు 3D glasses తీసుకోవాలి ......... " అని ఇద్దరం తొందరగా వెళ్లి 3D గ్లాసెస్ తీసుకొని సినిమా థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాం. 

కూర్చున్నాక "ఐన అంత అబద్దం ఆడాల్సిన ఆవరసం ఏంటే ??"

"సంజు ..... నీకు తెలీదు ....... ఇప్పటికి కూడా నన్ను ఆరు నెలల కింద చుసిన సినిమా గురించి టీస్ చేస్తారు తెలుసా ??"

"6 నెలల కింద ఎం జరిగిందో చెప్పు ....... "

నా వైపు సిగ్గుతో నవ్వి "సంజు ...... తంతాను నిన్ను ...... అనోశ్రంగా నీకు చెప్పాను ..... " అంది. 

నేను నవ్వి "చెప్పవే ప్లీస్ ........ " అన్నాను. 

"నో ...... "

"సరే నేనే కనుక్కుంటాను ....... "

"ఎలా ??"

"నాకు నా దారులున్నాయి ........ "

"సరే నీ ఇష్టం ....... "

"నా లాప్టాప్ లో నీ ఫోన్ backup తీసావ్ గుర్తుందా ??" 

"అవును ....... "

"దాంట్లో ఉన్న అన్ని నెంబర్లు నా దగ్గరున్నాయి ...... "

"దుర్మార్గుడా.... "

నేను నవ్వి "సరే చెప్పు ....... "

"ఐన నువ్వు ఫోన్ చేసినప్పుడులే ....... " అని లైట్ తీసుకుంది. 

"సరే ....... పెళ్ళికి ముందు గుర్తుందా ??"

"దేని గురించి ??"

"నువ్వు నాతో బయటకు రాను అంటే నేను ఎం చేసాను ??"

"ఎందుకు గుర్తులేదు ?? నాన్నకి ఫోన్ చేసావ్ ..... పర్మిషన్ అడగటానికి ...... "

"నాకు ఎలాంటి మోహుమాటల లేవు ........ అలా చేసిన వాడ్ని ...... ఇలాంటి విషయాలు ఫోన్ చేసి కనుక్కోలేనా ??" అన్నాను. 

నా వైపే చూస్తుంది. నేను కూడా తన వైపే చూస్తున్నాను. 

నేను నవ్వటం స్టార్ట్ చేసాను. తను కూడా నవ్వటం స్టార్ట్ చేసింది. ఈ లోపల లైట్స్ ఆఫ్ అయ్యాయి. 

తను నా చేయి పట్టుకొని గట్టిగ పట్టుకొని నా భుజం పై తల పెట్టుకుంది. 

సినిమా స్టార్ట్ అయ్యింది. 

ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేసాను. తానైతే సినిమా మొత్తం నన్ను అలాగే పట్టుకొని ఉంది. చాల రొమాంటిక్ గా అనిపించింది. 

ఇద్దరం సినిమా చూసి ఒక మంచి రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళాము ....... స్వీటీ నాకు 6 నెలల కింద ఎం జరిగిందో చెప్పింది. నేను కూడా నా లైఫ్ లో అలంటి సిట్యుయేషన్స్ గురించి చెప్పాను. ఇద్దరం ఒకరి స్టోరీస్ ఒకరం విని నవ్వుకుని ఇద్దరం ఆఫీస్ దగ్గర మా బాగ్స్ తీసుకొని ఇంటికి వెళ్లి ఓపిక లేక చాల తొందరగా బెడ్ పై  పడుకొని ఇంకా చాల విషయాలు షేర్ చేసుకొని నవ్వుకుంటూ ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటూ పడుకుండిపోయాము. 

టు బి కంటిన్యూడ్ ...... 

Images/gifs are from internet & any objection, will remove them.
[+] 4 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2 - by pastispresent - 26-11-2019, 01:49 AM



Users browsing this thread: 2 Guest(s)