Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అందమైన అనుభవం BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#3
హడావిడిలో అక్క ఇచ్చిన టిఫిన్ కార్లోనే మరచిపోయాను. పేంట్రీలో ఏమీ రావని తెలిసింది. ఈ రాత్రికిక ఉపవాసమే" అంటూ వాటర్ బాటిల్ అందుకున్నాడు తుషార్.

'నా టిఫిన్ ఉంది. షేర్ చేసుకుందాం' అంది అమూల్య చొరవగా.
'సరే అయితే చెరిసగం పంచుకుందాం" అన్నాడు కొంటెగా ఇద్దరూ హాయిగా నవ్వుకుని, కబుర్లు తింటూ టిఫిన్ పూర్తిచేసారు. తొలి పరిచయంలోనే తుషార్, అమూల్య బాగా కనెక్టై పోయారు. 'తొలి ప్రేమ" అంటే ఇదేనేమో!
***
"అమ్మయ్య మీ దయవల్ల కడుపు నిండింది. ఇంక ఆ పడక సంగతి కూడా చూస్తే ఓ పనై పోతుంది" అన్నాడు తుషార్.
"మాటలు కోటలు దాటుతున్నాయి. ఏంటి సంగతి అమూల్య చురక వేసింది నవ్వుతూ.
'సరే, సరే ఇంతకీ నన్ను ఎక్కడ పడుకో మంటారు, పైనా, కిందా మళ్ళీ కొంటెగా అడిగాడు తుషార్. ఆ కొంటెతనాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోందిగానీ, ఆ స్పీడుకు బ్రేకులు వేస్తూ, "ఆ డైలాగులే వద్దన్నది, తిన్నగా మాట్లాడండి అంది గంభీరంగా. సారీ! పైన నాకు చోటు సరిపోదు. అభ్యంతరం లేకపోతే నేను కింద పడుకుంటా. అయినా మీరు ఒప్పుకుంటారు లెండి, మీది అసలే జాలిగుండె అన్నాడు ఆమె బాడీ లాంగ్వేజ్ను అబ్జర్స్ చేస్తూ. పై బెర్తుమీద నీట్గా ఆమెకు పక్క వేసి, ఓకే మేడం. గుడ్ నైట్ ఎండ్ స్వీట్ డ్రీంస్' ఆమె వంక అదోలా చూసి కింద బెర్తు మీద నడుం వాల్చాడు.
***
ఏదో పెద్ద స్టేషన్లో ఆగింది రైలు. 'ఏవండీ పైన నిద్ర పట్టడం లేదు. అభ్యంతరం లేకపోతే కాసేపు కింద కూర్చోనా' కిందికి దిగుతున్న తుషార్ ను అడిగింది అమూల్య. "అయ్యయ్యో ఈ బెర్తు మీది, కొంచెం సేపేంకర్మ, తెల్లవార్లూ కూర్చోండి' అంటూ కిందకు దిగి ఇద్దరికీ వేడివేడి కాఫీ తెచ్చాడు.
'అబ్బా అర్ధరాత్రి, చల్లని వాతావరణంలో ఇలా వేడివేడి కాఫీ తాగుతుంటే భలే మజాగా ఉంటుంది' అని మెల్లిగా వణుకుతున్న స్వరంతో అమూల్య అంది.
ఏంటండి! ఈ మాత్రం చలికే తట్టుకోలేకపోతున్నారు. ఇక కాశీలో చలి ఇంకేం తట్టుకుంటారు? నవ్వుతూ అడిగాడు తుషార్.
'భలేవారే పక్కన మీరుండగా నాకు చలేంటి అనబోయి, మీరసలు ఏమాటా తిన్నగా మాట్లాడరా' చిన్నగా కోపంతో ప్రశ్నించింది అమూల్య.
'అయ్యయ్యో నేనిప్పుడు ఏమన్నానని అందమైన ముక్కుని అలా ఎర్రగా చేసుకున్నారు! అయినా కోపంలో కూడా మీరు అప్పుడే వెలిగించిన దీపంలా, మా ఊరి కొలనులో ఎర్రకలువలా ఎంతో అందంగా ఉన్నారు" అన్నాడు తుషార్. అతడి కవిత్వానికి మనసులోనే పొంగిపోయింది అమూల్య కోపం నటిస్తూ, ఏంటండి వచ్చిన దగ్గరనుండి చూస్తున్నాను. నన్ను పొగడ్డమే పనిగా పెటుకున్నారు, ఏంటి సంగతి?' అమూల్య.
మీరే చెప్పండి. మీరు అందంగా ఉంటారు కదా! మరి నేనూ అదే కదా చెప్పాను. ఏం తప్పు చేశానంటారా అమాయకంగా అడిగాడు తుషార్ ఆ మాటకు ఫక్కున నవ్వింది.
కిందకు వంగి ఏదో ఏరుకోవడం మొదలెట్టాడు తుషార్ ఏంటండీ, చీకట్లో ఏమిటి ఏరుకుంటున్నారు, చిల్లర డబ్బులుగానీ పడిపోయాయా అడిగింది నవ్వుతూ, అబ్బేలేదండి, ముత్యాలు ఏరుతున్నాను" అన్నాడు. ట్రైన్లో ముత్యాలా? కాస్త అర్థమయ్యేలా చెప్పండి మహానుభావా! అంది అమూల్య.
ఏం లేదండీ. మీరు నవ్వినప్పుడు రాలిన ముత్యాలు ఏరుకుంటున్నా అన్నాడు.





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అందమైన అనుభవం BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 11:05 AM



Users browsing this thread: 1 Guest(s)