Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అందమైన అనుభవం BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#7
చెప్పిన ప్రకారమే మర్నాడు ఉదయం పడవ వాడు వాళ్ళను తీసుకుని గంగ ఆవలి ఒడుకు బయలుదేరాడు. పడవ గంగ నడిమధ్యకు చేరుకుంది. పూలవానలా కురుస్తోంది మంచు. గంగ ఒడ్డున స్నానం చేసిన భక్తులు దీపాలు వెలిగించి గంగలో వదులుతున్నారు. ఆ దీపాలు నదిమీద తేలుతూ వెళుతుంటే ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. ఆ వాతావరణం చూసి పరవశించిపోయాడు తుషార్. చలిగాలికి వణుకుతున్న అమూల్యను చూసి ఏంటి అమూల్య చలిగా ఉందా? పోనీ వెనక్కు వెళ్ళిపోదామా అన్నాడు ప్రేమగా.. వద్దు తుషార్, ఇటువంటి అనుభవం మళ్ళీ జీవితంలో దొరకదు. నీతో ఇలా పవిత్ర గంగానదిపై పడవ ప్రయాణం "అందమైన అనుభవం'. దీని కోసం ఒక్క చలిగాలేంటి దేన్నీ లెక్కచెయ్యను'. తుషార్ భుజంపై తలవాల్చి అతని చెవిలో మెల్లగా అంది. "మన ప్రేమకు ఈ గంగమ్మతల్లే సాక్షి. ఐ లవ్యూ తుషార్ కళ్ళమూసి తన్మయ త్వంతో చెప్పింది. పడవవాడు తనలోనే నవ్వుకున్నాడు. వాళ్ళను గంగ ఒడ్డున వదిలి, సాబ్ నేను గంటలో వస్తాను. ఈలోగా మీరు. అంటూ నవ్వుతూ హిందీలో ఏదో అని వాళ్ళకు ఏకాంతం కలిగించి వెళ్ళిపోయాడు.
"ఇంత అందమైన ప్రదేశంలో మెత్తని ఇసుకపై నీ పక్కనే నడుస్తూంటే, ఏదో చెప్పలేని ఆనందం, "అందమైన అనుభవం మాటల్లో చెప్పలేను. అందమైన అమ్మాయితో ఇటువంటి రమణీయ ప్రదేశంలో గడపడం నిజంగా నా అదృష్టం. కల్లోకూడా ఊహించలేదు."
ఆ మాట నేనే అనాలి. పరిచయమైనప్పటి నుండీ మీతో గడిపిన ప్రతి క్షణం, నా జీవితంలో ఓ అందమైన అనుభవంలా మిగిలిపోతుంది. ఇక్క డికి రాకముందు ఎంతో భయపడ్డాను. కానీ ఇలా మీ పక్కనే ఉంటే, భయమన్నదేలేదు అంది అమూల్య. అక్కడ ఇసుకలో కూరుకుపోయిన ఓ పడవ పక్కనే నడుస్తున్న అమూల్య తుషార్ భుజంమీద చెయ్యి వేయబోయి తూలిపడబోయింది. ఒడుపుగా ఆమెను పటుకున్న తుషార్తో సహా ఇద్దరూ సైకత తల్పం లాంటి ఇసుక పాన్పు మీద వెల్లకిలా పడిపోయాడు. అలా పడ్డప్పుడు ఆమె పయ్యెద మాటున పదిలంగా దాగిన సంపద మొత్తగా అతని గుండెల్ని ముద్దాడింది. అమూల్య ఎంతో హాయిని అనుభవిస్తూ అతన్ని ఇంకా గట్టిగా వాటేసుకుని తన గుండెలకు బలంగా హత్తుకుంది.
చుట్టూ ఏకాంతం, మనసుని తొందరపెడుతున్న వయసు ప్రభావం..
తనువు, మనసు ముడివేసుకున్న ఆ జంట సరస సల్లాపాలను చూసి ప్రకృతి పులకించి పోయింది. వారి ప్రేమకు సాక్షిగా అప్పుడే ఉదయించిన బాలభానుడు తన నులివెచ్చని లేత కిరణాలతో వాళ్ళను ఏకంకమ్మని ఆశీర్వదించాడు. అలా వారిద్దరూ ఆ ఏకాంతాన్ని ఆనందిస్తుండగా అంతలో పడవవాడు తమకేసి రావడం చూసి సిగ్గుతో పైకిలేచి ఇసుక దులుపుకుని ముసిముసిగా నవ్వు కుంటూ పడవలో తిరిగి ప్రయాణమయ్యారు.
కొద్దిసేపటిక్రితం 'అనుభవం' పడవలో కూర్చున్న అమూల్యకు గుర్తొచ్చి ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. ఆమె బుగ్గలు సింధూరవర్ణం దాల్చాయి. సూర్యుని లేతకిరణాలు ఆ నదిమీద నుండి పరావర్తనం చెంది, అమూల్య మీదపడి ఆమె మోము సప్తవర్ణాల ఇంద్ర ధనస్సులా మారింది. ఆమె అందాలను మైమరచి చూస్తున్న తుషార్ తో ‘దిగండి సాబ్.' అన్నాడు పడవవాడు నవ్వుతూ. ఈ లోకంలోకి వచ్చిన తుషార్ వాడి చేతిలో వెయ్యిరూపాయల నోటు పెట్టి షుక్రియా" అంటూ పడవదిగి, అమూల్యకు చెయ్యి అందించాడు.
***
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అందమైన అనుభవం BY పునర్కథనం &/ సంఖ... - by LUKYYRUS - 20-11-2018, 11:06 AM



Users browsing this thread: 1 Guest(s)