Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#14
నువ్వు బాగుపడవు, నా కొడుకుకు ఏం మందు పెట్టినవో, చదువుందని లెక్క చెయ్యదు, సంపాదిస్తున్న అని పొగరు చూపిస్తది, నాలుగు నెలలకే విడిపోతారు" అనే రొటీన్ డైలాగులతో పాటు కొత్త కొత్త శాపాలు కూడా పెట్టి మొహం మీదే తలుపేసింది.

ఇద్దరు హైద్రాబాద్లో, ఇంటిని అద్దెకు తీసుకున్నారు. చిన్నగా ఒక్కో వస్తువు ఇంట్లోకి కొనుక్కోడం మొదలుపెట్టారు. ఆలా మూడు నెలలు మూడు నిముషాల్లా ఆనందంగా గడిచిపోయాయి.
ఆలా గడిచిపోతున్న వారి జీవితంలోకి ఒక పిడుగులాంటి వార్త కుదిపేసింది. కౌటిల్య ఉద్యోగం పోయిందని తెలిసింది. కానీ ఆరాధ్య ఎంతో నిబ్బరంగా మరో ఉద్యోగం కన్నా, తననే ఒక హార్డ్*వేర్ రిపేర్ షాప్ పెట్టమని సలహా ఇచ్చింది. దానికి బోలెడంత డబ్బులు ఇన్వెస్ట్*మెంట్ కావాలి, అందుకు ఆమె ఆఫీసులో కొంత డబ్బు లోనుగా తీస్కుని, మరికొంత తెలిసిన వాళ్ళ దగ్గర నుండి అప్పుగా తీసుకొచ్చాడు కౌటిల్య.
అలా అతనితో వ్యాపారం మొదలుపెట్టించింది ఆరాధ్య. కానీ అది అంతంత మాత్రమే నడిచేది లాభాలు, నష్టాలు కాకుండా నడవడంతో, అప్పులు తెచ్చిన చోట తిరిగి కట్టడానికి ఏమి మిగలలేదు. అలా అప్పుల వాళ్ళ వత్తిడి ఎక్కువైంది. కౌటిల్య మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా కాంట్రాక్టులు పట్టుకోడానికి చాలా ప్రయత్నాలే చేసాడు కానీ ఏవి నోటిదాకా రాలేదు.
వ్యాపారం మీదా ఎక్కువ సమయం గడిపేస్తున్న కౌటిల్య, ఆరాధ్యతో సమయం గడపలేకపోయాడు. ఎప్పుడో అర్ధరాత్రి రావడం, తెల్లారగానే వెళ్లిపోవడం లాంటివి చెయ్యడంతో ఆరాధ్య ఒక నూన్యతా భావానికి లోనైంది. చాలా రోజులు ఓపిగ్గానే చూసింది, కానీ అతని పరిస్థితి ఏమిటో ఆమెకు వివరించండంలో విఫలమైన కౌటిల్యతో ఆరాధ్య గొడవ పడింది.
"ఎప్పుడు వస్తున్నావో, ఎప్పుడు వెళ్తున్నావో ఏమైనా అర్ధమవుతోందా??? ఇది ఇళ్ల?? లాడ్జినా ??? పడుకోడానికి మాత్రమే రావడానికి" తిక్క రేగిన ఆరాధ్య కోపంతో ఊగిపోయింది.
"ఆరాధ్య ప్లీజ్ ఇప్పటికే చాలా చిరాకుతో ఉన్నాను, నన్ను మరింత సతాయించకు???" అని అంటూ బడాలికతో మంచంపై పడుకుని కళ్ళు మూసుకున్నాడు కౌటిల్య.
"అంత చిరాగ్గా ఉంటే ఇంటికి ఎందుకు వచ్చావు అక్కడే ఆ ఆఫీసులోనే పడుకోపోయావా???" గట్టిగా అరిచింది ఆరాధ్య.
ఏం పట్టనట్టు అటు తిరిగి పడుకున్నాడు కౌటిల్య, అతను ఆమె మాటలు పట్టించుకునే స్థితిలో లేడు, వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మదనపడ్తున్నాడు. అతను పడ్తున్న ఈ టెన్షన్, ఆమెకు చెప్పడం ఇష్టంలేక నోరుమూసుకుని పడుకున్నాడు కౌటిల్యా.
అతని చర్యని తప్పుగా అర్ధం చేసుకున్న ఆరాధ్యకు కోపం నషాళానికి అంటింది. దుఃఖం, ఆవేశం కలగలసి ఆమె గుండెలు ఎగిరి ఎగిరి పడ్డాయి. ఒక ఉదుటున కౌటిల్య భుజాన్ని పట్టి విసురుగా లాగింది. అలాంటి ఒక ప్రతిచర్యని ఊహించని కౌటిల్య అవాక్కయ్యాడు. విసురుగా మంచం పై నుండి లేచి నిలబడ్డాడు.
"నేను మాట్లాడుతుంటే అటు వైపు తిరిగి పడుకోడంలో నీ ఆంతర్యమేంటి???" అరిచింది ఆరాధ్య.





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:28 AM



Users browsing this thread: 1 Guest(s)