Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#32
"ఎక్కడికో చెప్తే కాని రావా??? సరే!!! దేవి దర్శనంకి వెళుతున్నాం, ఇక వెళ్ళి త్వరగా రా" అని నీల్ అంగీకరం కూడా తెలుసుకోకుండా పూజ గదిలోకి వెళ్ళిపోయింది. ఇంక ఏం చెప్పినా వినదు అనుకున్నా నీల్ ఏమి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి ఒక గంట తర్వాత రెడి అయ్యి వచ్చాడు. "ఏంటి ఇలాంటి బట్టలు వేసుకున్నావు, ఇదిగో ఈ షర్ట్ వేసుకొని రా" అని ఒక తెల్లని చొక్కా ఇచ్చింది. "ఇది ఎందుకు ఇప్పుడు, నాకు వద్దమ్మా ఈ షర్ట్ బాగానే ఉందిగా" అని అన్నాడు నీల్ విసుగ్గా.
"చెప్పింది చెయ్యి నానా, అమ్మ చెప్పింది చేస్తా అన్నవ్ గా" అని తన కుడి చేతిని నడుము మీద పెట్టి సూటిగా చూస్తూ అంది లీలవతి. ఇక చేసేదేం లేక వేసుకొని వచ్చాడు నీల్. అప్పటికి నీల్ పిన్ని, బాబాయి ఉన్నారు హాల్లో. " ఏంట్రా నీల్ పెళ్ళి కల వచినట్టుంది అప్పుడే " అన్నాడు బాబాయి. "ఏంటి మీరనేది బాబాయి, మనం ఎక్కడికి వెళుతున్నాం అమ్మ దేవిదర్శనంకి అని చెప్పి నన్ను ఎక్కడకి తీసుకుని వెళుతున్నారు" అని గట్టిగా అరిచాడు నీల్. లీలవతి పూజ గదిలో నుండి బయటకి హడవిడిగా వచ్చింది. చేతిలొ తాంబూలం, తాంబూలంలో చీర, గాజులు, పూలు, కుంకుమ భరిణ ఉన్నయి.నీల్ కళ్ళు ఎర్రగా నీళ్లతో నిండి ఉన్నాయి, లీలవతి మొదట జంకినా మెల్లిగా "నీల్ ఎందుకు అరుస్తున్నావు అలా, నానా నువ్వు ముందు కార్ తియ్యి అన్ని నీకు నేను దారిలో చెప్తాను పద" అని అతనికి దగ్గరగా వచ్చి చెయ్యి పట్టి లాగింది. నీల్ వెంటనే విసురుగా చెయ్యి విదిలించాడు. " నీ దేవి దర్శనంకి కూడా రావా??? అని అడిగింది ఆమె. నీల్ ధర్మరావు వైపు చుశాడు, అతను నవ్వుతూ నిలబడి కళ్లతో "అవును" అన్నట్లు సైగ చేసాడు. నీల్ కళ్లలో నీళ్ళు సుడులు తిరిగాయి. లీలవతిని గట్టిగా కౌగిలించుకుని బొంగురుపోయిన గొంతుతో "థ్యాంక్స్ అమ్మ" అని కళ్ళు మూసుకున్నాడు. "పిచ్చి నానా ఆ అమ్మాయి మాకు నచ్చింది రా కాని కులం అనే పొర మా కళ్ళకు కమ్మింది, నిన్న మీ నాన్నతో మాట్లాడాకా ఈ నిర్ణయం తీసుకున్నాము. స్వప్న అమ్మనాన్నాల తో మాట్లాడాము, వాళ్ళే ఇవాళ రమ్మని అడిగారు, నీ సంతోషము కన్నా మాకు ఏమి కావాలి రా, పద వెళదాం అక్కడ అమ్మాయి ఎదురు చూస్తూ ఉండి ఉంటది" అని నీల్ నుదుట మీద ముద్దు పెట్టింది.
"నీల్ పద ఏంటీ అలా నిలబడిపోయావ్" అని చిటికెలు వేస్తూ అడిగింది స్వప్న. అప్పుడు ఈ లోకం లోకి వచ్చాడు నీల్. ఆ రోజు స్వప్న వాళ్ళింటికి వెళ్ళాడం, పెద్దలు ఒప్పుకోవడం, పెళ్ళి అర్భాటం లేకుండా సింపుల్ గా జరిగిపోవడం అన్ని ఒకదాని వెంటా ఒకటి జరిగాయి.
ఎయిర్ పోర్ట్ వరకు ఇరు పెద్దలు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించారు. విమానం లొ స్వప్న నీల్ గుండెల మీద పడుకుని తన కుడి చేతి వేలితో అతని చాతి మీద రాస్తూ అడిగింది " ఓయ్ అస్సలు ఏం చెప్పి ఒప్పించావ్ మీ అమ్మని" అని. నీల్ పెద్దగా నవ్వి "ఈ రాక్షసి లేకుండా నేను ఉండలేను అని చెప్పా అంతే" అని తన మొహాన్ని చెతుల్లోకి తీసుకొని ఇంక ఏదో మాట్లాడడానికి వెళ్ళిన స్వప్న పెదాలను తన పెదాలతొ అందుకున్నాడు.
*************
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:40 AM



Users browsing this thread: 1 Guest(s)