Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#10
వాటి గురించి వివరించి చెప్పాడు. కాని వాళ్ళు కావాలనే డిపార్ట్మెంట్ల స్టూడెంట్స్ ని కలుపుతున్నాం అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించలేదు. అంతా విన్నాక చాలా మంది స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధపడ్డారు. కొంతమంది తర్వాత చెప్తామని చెప్పారు. ఏది ఏమైనా చివరికి అందరు ఒప్పుకున్నారు.  "మొత్తానికి మౌనికకు దగ్గరవడానికి మంచి ఐడియానే వేశావ్" అంది మేఘన అరవింద్ తో.  "అప్పుడే ఏమి చూసావ్ కధ మొదలైంది ఇప్పుడే కదా" అన్నాడు నవ్వుతు.  "నాకు ఎందుకో ఆల్ ది బెస్ట్ చెప్పాలని ఉంది" అని ఆల్ ది బెస్ట్ అంది  "థాంక్స్" అన్నాడు. కాని ఆల్ ది బెస్ట్ చెప్పిన మేఘన అంతరంగాన్ని మాత్రం అర్ధం చేసుకోలేకపోయాడు.  "అవును. నువ్వు అన్నట్టుగానే కధ ఇప్పుడే మొదలైంది" అంది  "అంటే"అని అడిగాడు.  "అర్ధం అవుతుందిలే నీకే ముందు ముందు" అని చెప్పి వెళ్ళిపోయింది. అంతుచిక్కని ఆలోచనలు ఉంటాయని అరవింద్ కి అప్పుడర్ధమైనది. 
* * *
ఓ రోజు అచ్యుత్ ఆటోకోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు. ఎంతసేపు చూసినా ఆటో రాకపోయే సరికి "ఛి! టైంకి బండి పాడవడం ఏమిటో, ఇంత పెద్ద వైజాగ్ నగరంలో ఆటో కరువు రావడం ఏమిటో, పొద్దున్న తొమ్మిదింటికి ఈ ఎండ ఏమిటో " అని విసుక్కుంటుడగా ఓ ఆటో అటుగా రావడం చూసి హమ్మయ్యా అనుకుని దానిని ఆపాడు. ఆటో డ్రైవర్ తో "యూనివర్సిటీకి వెళ్ళాలి" అని చెప్పి ఆదమరపుగా వెనక సీట్ వైపు చూసాడు. సముద్ర కెరటం ఉవ్వెత్తున ఎగసిపడింది. వెనక సీట్లో చైతన్య కూర్చుని ఉంది. ఒక్కనిమిషం గుండె ఆగి కొట్టుకుంది. "ఎక్కండి సార్" అన్నాడు డ్రైవర్. అతని మాటలకు తేరుకుని చైతన్య పక్కన కూర్చున్నాడు. మనసులో ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.  చైతన్య పక్కన కూర్చోవడం. తనతో కలిసి ప్రయాణించడం. ఆనందం పట్టలేకున్నాడు. బయట సముద్రం చూస్తూ ఉన్న చైతన్యని అద్దంలో చూస్తూ మురిసిపోయాడు. అతనికా క్షణాలు చాలా విలువైనవి.  "సార్ దిగండి" అన్నాడు ఆటోవాడు.  "యూనివర్సిటీ వెళ్ళాలి బాబు" అన్నాడు అచ్యుత్.  "యూనివర్సిటీ వచ్చేసింది సార్" చెప్పాడా డ్రైవర్. అప్పుడే వచ్చేసిందా అని అన్నాడు నిరాశగా. దిగి 20 రూపాయల నోటు ఇచ్చాడు. చైతన్య 100 నోటు ఇవ్వబోతే "చిల్లర లేదు మేడం, మీ పది రూపాయలు సార్ కి ఇచ్చేయండి మేడం" అంటూ ఉచిత సలహా ఇచ్చాడా డ్రైవర్. అప్పుడు చూసింది చైతన్య మొట్టమొదటిసారి అచ్యుత్ ముఖాన్ని. ఇబ్బందిగా కదిలాడు. ధైర్యం కూడగట్టుకుని పదాలు పేర్చుకుంటూ"..పరవాలేదులెండి. నేను ఇక్కడే చదువుతున్నాను. తర్వాత నాకిద్దురు..." అని అన్నాడు. ఆ మాటలు విని చైతన్య దిగింది. అప్పుడే యూనివర్సిటీ కి వస్తున్న అరవింద్ ని చూసి "అన్నయ్యా" పిలిచింది. అరవింద్ ఇద్దరిని చూసాడు. అచ్యుత్ ముఖమైతే మతాబులా వెలిగిపోతోంది. "ఏంటి అచ్యుత్ ?" అని ముందుగా కావాలనే అచ్యుత్ ని పలకరించాడు.  "నీకు ఇతను తెలుసా?" అని అడిగింది అరవింద్ ని.  "తెలుసు నీకు పారలల్, మైక్రోబయాలజీ, పేరు అచ్యుత్" అని పరిచయం చేస్తున్నట్టుగా చెప్పాడు.  "ఓ అవునా! నైస్ టు మీట్ యు. ఓకే. చేంజ్ తర్వాత ఇస్తాను" అని చెప్పి వెళ్ళిపోయింది.  "ఏంటిరా కలిసి వచ్చారు. ఏంటి సంగతి." అనడిగాడు అరవింద్ భుజంపై చేయి వేస్తూ.  "ఏమి లేదు.. బండి రిపేర్,, ఆటోకోసం వెయిట్ చేస్తుంటే చైతన్య ఉన్న ఆటో వచ్చింది. ఎక్కాను." చెప్పాడు.  "ఓ గుడ్, ఎలా ఉంది జర్నీ" అని అడిగాడు నడుస్తూ.  "ఫస్ట్ టైం మా ఇంటికి దూరంగా యూనివర్సిటీ ఉంటే బాగుండును అనిపించింది" చెప్పాడు.  దానికి అరవింద్ నవ్వుతూ అప్పుడే ఏమైంది? కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్నారు, ముందు ముందు చాలా ఎంజాయ్మెంట్ ఉంది" అని అన్నాడు.  "అవునా? నిజంగానా?"అడిగాడు అచ్యుత్ ఆనందంతో  "నిజం. నువ్వు చైతన్యని ప్రేమించినంత నిజం" అని అన్నాడు అరవింద్.  "థాంక్యు... థాంక్యు సో మచ్...నీ ఋణం ఉంచుకోను" అని అన్నాడు  "అంత పెద్ద మాటలు ఎందుకులే పదా..."అని చెప్పి మీటింగ్ హాల్ లోకి ఎంటర్ అయ్యారు.  స్టూడెంట్స్ అందరు మీటింగ్ కి హాజరు అయ్యారు. "అందరు నా మాట విని కలిసి ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యు వెరీ మచ్. ప్రాజెక్ట్స్ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి మేము సిద్ధం. మేము రాన్డంగా కొన్ని పేర్లను సెలెక్ట్ చేసాము. టీం కి ముగ్గురు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్ స్టూడెంట్ అయి ఉంటాడు. పేర్లు చదవడం మొదలు పెడుతూ ముందు బయోటెక్నాలజీ-మైక్రోబయాలజీ-బయోకెమిస్ట్రీ ఈ వరసలో పేర్లు పిలుస్తాను. అందులో లీడర్ని కూడా మేమే నిర్ణయించాము. ఇందులో ఎటువంటి పార్షియాలిటీ లేదు" అని చెప్పి పేర్లు చదవడం ప్రారంభించాడు. కొన్ని పేర్లను చదివాక అచ్యుత్ ఏ టైం కోసమైతే ఎదురుచూస్తున్నాడో ఆ టైం రానే వచ్చింది.  చైతన్య-అచ్యుత్-భార్గవి. లీడర్-చైతన్య అని చెప్పాడు. అచ్యుత్ ఆనందానికి అవధుల్లేవు.  మళ్ళి కొన్ని పేర్లు చదివాక,  నవ్య-రాజీవ్-రాకేశ్. లీడర్-నవ్య చెప్పాడు. రాజీవ్ అరవింద్ ని కోపంతో చూసాడు. నవ్య నెమ్మదిగా రాజీవ్ వైపు చూసింది భయంతో. అలానే చూస్తూ “ నాకిష్టం లేదు యూనివర్సిటీ లో ప్రాజెక్ట్ చేయడం" అని చెప్పాడు.  "అది ముందు చెప్పాలి" అన్నాడు నిరంజన్.  "నాకు తెలియలేదు, నువ్వు అరవింద్ కలిసి ఇలా చేస్తారని,, లేకపోతే అప్పుడే ఇష్టం లేదని చెప్పేవాడిని" అన్నాడు రాజీవ్.  "నిన్ను ప్రాజెక్ట్ చేయడం కోసం సెలెక్ట్ చేసాం అంతకంటే ఏమి లేదు. అంతకంటే మనసులో ఏమైనా ఉద్దేశ్యాలు ఉంటే తీసేయి" అన్నాడు అరవింద్.  నవ్య వైపు చూస్తూ "నాకే ఉద్దేశ్యాలు లేవు" అన్నాడు రాజీవ్ .  "అలాంటపుడు మారు మాట్లాడకుండా ప్రాజెక్ట్ చెయ్" అన్నాడు నిరంజన్  "సరే, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రాజెక్ట్ చేయమను"అని చెప్పి వెళ్ళిపోయాడు రాజీవ్. అలా అనేసరికి నవ్యకి బాధనిపించింది."అంత ఇష్టం లేకపోతే తనతో చేయడం నాకు ఇష్టం లేదన్నాయ్య" అంది అరవింద్ తో. "నువ్వు ఇలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా ప్రాజెక్ట్ చేయ్. ప్రేమని చూపించకు, చూపిస్తున్నట్టు కూడా ఎక్కడా కనపడనివ్వకు. వాడికి డౌట్ రావాలి, ఆ తర్వాత కధ నేను నడిపిస్తాను " అని దగ్గరగా వచ్చి చేయి పట్టుకుని "ప్రేమకు నిరీక్షణ అవసరం" అని చెప్పాడు అరవింద్. సరే అన్నాట్టుగా తలూపింది నవ్య. 
* * *
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:53 AM



Users browsing this thread: 1 Guest(s)