Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#12
ఏమో అనుకున్నాను నువ్వు తనను మార్చేసావు"  "అంటే"  "ముందు ఈ వారం రోజులు నువ్వేం చేసావో చెప్పు"  "ఐ లవ్ యు అని చెప్పాను" అన్నాడు కూల్ గా.  అదిరిపడింది "ఏంటీ???" అంది సాగదీస్తూ.  "అవును. పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పాను. కాని ఇవన్ని పందెం నగ్గడానికి కాదు. నిజంగా తనని ప్రేమిస్తున్నాను." చెప్పాడు. ఉలుకుపలుకు లేకుండా నిలబడిపోయింది. అరవింద్ చెప్పుకుంటూ పోతున్నాడు తన ధోరణిలో "ఈ క్రెడిట్ అంతా నీదే మేఘన. నువ్వే మా ఇద్దరిని ఇండైరక్ట్ గా కలిపావు. తను నిన్ను ఇగ్నోర్ చేయడం కాదు. నేను చూపించే ప్రేమ వల్ల నిన్ను మర్చిపోవచ్చు కూడా అంటూ నవ్వేడు. నాజీవితంలో ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదేమో" అని ముగించాడు. 
* * *
ఆరోజు అరవింద్ యూనివర్సిటీ లో అందరితోపాటు ఉండగా మౌనిక వచ్చి "హాయ్ అరవింద్" అని పలకరించింది. అక్కడున్న అందరు ఆశ్చర్యపోయారు. "హాయ్"అన్నాడు అరవింద్. "రా,నా ఫ్రెండ్స్ ని అందరిని పరిచయం చేస్తాను అని అందరిని పరిచయం చేసాడు. అచ్యుత్ నవ్వుతు "నువ్వు మాకందరికీ ముందే తెలుసు, మేమే నీకు తెలియదు. నిజానికి నిన్ను అరవింద్ కి చూపించింది మేమే, మళ్ళి మాకు కొత్తగా నిన్ను పరిచయం చేస్తున్నాడు" అని అన్నాడు.  చైతన్య, అచ్యుత్ ని "టైం అయింది వెళ్దామా? అని అడిగింది చైతన్య వైపు చూసి నవ్వుతు అరవింద్ కేసి చూసి చైతన్య వెనకాల అడుగులు వేసాడు. అరవింద్ వల్ల వాళ్లిద్దరు మంచి స్నేహితులైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అరవింద్ "ఏరా నీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది?" అం అడిగాడు రాజీవ్ ని.  "అవుతోంది" అని పొడిగా సమాధానం ఇచ్చాడు.  "మీ లీడర్ నవ్యఎలా ఉంటోంది?" అని మరో ప్రశ్న వేసాడు.  "ఉంటోంది..."అన్నాడు నవ్యవైపు చూస్తూ.  "వెళ్దామా?!" అని అడిగింది నవ్య రాజీవ్ ని.  "నువ్వు వెళ్ళు. నేను తరువాత వస్తాను" అన్నాడు. తాను మౌనంగా కదిలింది.  అందరు వెళ్ళిపోయాక మౌనిక అరవింద్ తో "సాయంత్రం బీచ్ కి వెళ్దామా?" అని అడిగింది.తన వైపు నవ్వుతు చూస్తూ "సరే" అన్నాడు. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసాడు.  పౌర్ణమి రోజు కావడం వలన చందమామ నిండుగా ఉంది. అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అలా సముద్రాన్ని చూస్తూ కూర్చున్నారు ఇద్దరు. చల్లటి గాలి వీస్తుండగా నిశబ్దాన్ని భగ్నం చేస్తూ "మౌనిక" అని పిలిచాడు.  "ఉ ..."అంది.  "నీకా చందమామని చూస్తుంటే ఏమనిపిస్తోంది?" అని అడిగాడు చందమామని చూస్తూ.  "మ్.. నాకు గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టాలనిపిస్తోంది" అంది. ఆ మాట అంటున్నపుడు మౌనిక కళ్ళల్లో వెలుగుని చూస్తూ ఉండిపోయాడు. తాను కూడా అరవింద్ ని చూస్తూ ఉండిపోయింది. శరీరం అదుపుతప్పిన ఫీలింగ్. ఇద్దరు ఒక్కసారిగా తమాయించుకుని సిగ్గుతో ముఖాలు తిప్పేసుకున్నారు. కాసేపయ్యాక "నీకు నేనంటే ఇష్టమా?"అని అడిగింది.  "అవును" అన్నాడు.  "ఎంత ఇష్టం?" అని అడిగింది.  "ఈ సముద్రమంత" చెప్పాడు  "అంతేనా?" మళ్ళి అడిగింది ఇంకా ఇష్టం ఉంటే బాగుండుననే ఉద్దేశ్యంతో.  "ఈ ఆకాశమంత, ఈ సముద్రమంత" చెప్పాడు మళ్ళి  "అంతేనా???" కావాలనే రెట్టించింది.  "మ్... మా అమ్మ అంత, మా ఫ్రెండ్ ప్రమోద అంత " అన్నాడు చివరగా.  "ప్రమోద ఎవరు?" అని అడిగింది ఒక్కసారిగా.  "ఓ , నీకు చెప్పలేదు కదా, చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఆడుకున్నాం, కొట్టుకున్నాం. తను నాకు మంచి స్నేహితురాలు. అమ్మాయి అంటే అలా ఉండాలి" అన్నాడు. మౌనికకి తరువాత ఏ ప్రశ్న అడగాలో అడగాలో అర్ధం కాక "వెళ్దామా?" అంది.  "అప్పుడేనా?ఇప్పు డే కదా వచ్చాం." అన్నాడు.  "లేదు వెళ్దాం"అంది ముభావంగా.  "అర్ధమైంది. ప్రమోదకు నాకు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నావా?"  "లేదు" అని అబద్ధం చెప్పింది. "నీకు ఏమైనా అనుమానాలుంటే నన్ను డైరెక్ట్ గానే అడుగు మౌనిక, నీ మనసులో ఉంచేసుకోకు!. ప్రమోద అంటే నాకు గౌరవం, అభిమానం. అంతే, ఇంకేమి లేదు. కాని నువ్వు అంటే నాకు ఇష్టం, ప్రేమ ఉన్నాయి." అన్నాడు  అరవింద్ ని కౌగలించుకుని "ఐ లవ్ యు "అంది. అతని ఆనందానికి అవధుల్లేవు. తన ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుని "నన్ను నమ్ము మౌనిక. మహారాణిలా చూసుకుంటాను" అన్నాడు.  అరవింద్ మౌనికను ముద్దు పెట్టుకోవడం అంజలి చూసింది. వాళ్లిద్దరూ బయటకు వస్తుండగా అరవింద్ ని అడిగింది "ఏంటి అరవింద్, పప్పన్నం ఎప్పుడు?" అని.  "హాయ్ అంజలి" పలకరించాడు.  "నేను అంతా చుసానులే, ఏంటి లవ్వా? ముద్దు పెట్టేసావ్ పబ్లిక్ గా?" అని అడిగింది నవ్వుతూ. మౌనిక సిగ్గు పడింది. "మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం"అని చెప్పాడు మౌనిక వైపు చూస్తూ.  "నచ్చావ్ అరవింద్, ప్రేమించుకుంటున్నాం అనలేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నావ్.,మీ పెళ్ళికి సాక్షి సంతకం కావాలంటే చెప్పు. నేను పెడతాను" అంది నవ్వుతూ.  "అలాగే, తప్పకుండా, సరే వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు.  దార్లో "ఏంటి నీకు అమ్మాయిలు తప్ప అబ్బాయిలు ఫ్రెండ్స్ తక్కువనుకుంటాను " అంది మౌనిక. సమాధానంగా నవ్వాడు. మౌనికని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి తను రూమ్ కి వెళ్ళిపోయాడు.  
* * *
స్వాతి సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయింది.  "ఇలా ఫెయిల్ అవడం మన ఇంటా వంటా లేదు. నీకు ఇష్టం ఉండే కదా డిగ్రీ చేస్తున్నావు. మరెందుకు ఫెయిల్ అయ్యావు" ప్రశ్నించాడు స్వాతి తండ్రి. యూనివర్సిటీ నుండి నిరంజన్ అప్పుడే ఇంటికి వస్తూ తండ్రి మాటలు విని లోపలికి వచ్చి "ఏమైంది నాన్నగారు?" అని అడిగాడు.  "ఏమవుతుంది.. స్వాతి పరీక్ష తప్పింది" అని చెప్పాడు కోపంతో. ఏమి మాట్లాడకుండా నేల చూపులు చూస్తున్న స్వాతికేసి చూసి, "నేను మాట్లాడుతాను నాన్నగారు" అన్నాడు సద్ది చెప్పుతూ. తండ్రి నిరంజన్ మాట విని అక్కడి నుండి వెళ్లిపోతూ "మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవకూడదు. నీ చదువేదో అయితే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఫెయిల్ అయ్యి పరువు తీయకు " అన్నాడు హెచ్చరిస్తూ.  "చదువుకు పెళ్ళికి ముడి పెడతారేంటి నాన్న" అని ఎదురు ప్రశ్న అడిగింది.  "ఏమిటే!! కొత్తగా ఎదురు మాట్లాడుతునావ్ ..ఆ ...?" గర్జించాడు తండ్రి.  "నాకు ఇంకా చదువుకోవాలని ఉంది" అని చెప్పింది భయపడుతూ.  "ఇలా ఫెయిల్ అయి కూర్చుంటే పై చదువులేం చదువుతావ్?" అడిగాడు  " పరీక్ష కట్టి పాస్ అవుతాను. అయినా ఇప్పుడేమంత కొంపలు ములిగిపోలేదు. ఆ రోజు పరీక్ష కష్టంగా ఇచ్చాడు. మళ్ళీ రాస్తాను. పాసవుతాను. నాకిష్టం లేకుండా పెళ్లి సంబంధాలు చూడటం చేయకండి" చెప్పింది  "ఎప్పుడేమి చేయాలో నాకు తెలుసు. నువ్వు నాకు నేర్పనక్కర్లేదు. చెప్పనక్కర్లేదు. ముందు ఇక్కడి నుండి ఆతలికి పో" అని అరిచాడు తండ్రి. అసహనంతో అందరికేసి చూసి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. నిరంజన్ స్వాతి గదిలోకి వెళ్లి భోజనానికి రమ్మని పిలిచాడు. నాకు ఆకలిగా లేదు అని చెప్పింది. అన్నం కలిపి తనగదిలోకి తీసుకెళ్ళాడు. "కొంచెం తిను స్వాతి, అమ్మ మీద అన్నం మీద అలగకూడదు" అన్నాడు బ్రతిమాలినట్టుగా. "వద్దు. నాన్న ఎందుకు మాటిమాటికి పెళ్లి పెళ్లి అంటారు. నా ఇష్టాఇష్టాలు మీకు వద్దా? నాకేం కావాలో కూడా మీరే నిర్ణయిస్తారా?" అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. "అది కాదు స్వాతి, నువ్వు ఫెయిల్ అయ్యావనే బాధలోనో, కోపంతోనో నాన్న అలా అనుంటారు. నువ్వు చదువుకుంటానంటే ఎవరు కాదంటారు చెప్పు? అయినా నీపై కోప్పడింది పరాయివాళ్ళు కాదుగా, నాన్నే కదా! నాన్న నిన్ను ఏమి అనకూడదా? "అనడిగాడు శాంతంగా నచ్చచెపుతున్నట్టుగా. "అనకూడదు అని నేను అన్నానా? అయినా నాన్న అలా అనడం నాకు నచ్చలేదు" అంది. నిరంజన్ కోపంతో "బుద్ధిలేకుండా మాట్లాడకు స్వాతి. నాన్న ఏమి చేసినా నీ మంచి కోరే చేస్తారు. నీ ఇష్ట ప్రకారమే చేస్తారు. ముందు భోజనం చేయి" అని కంచం పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టాడు. “నాకు వద్దని చెప్పానుగా” అంటూ కంచం పక్కకు జరిపేసింది. అది బల్లపైనుండి కింద పడిపోయింది. నిరంజన్ కి పట్టరానంత కోపం వచ్చింది. "అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారే, ఎవడికోసమో ఆలోచనలు పెట్టుకుని చదువుని చెంకనాకేలా చేసుకుంది నువ్వు. చేసిన తప్పుకు తండ్రి కోప్పడితే అలా మాట్లాడడం నచ్చలేదు అంటూ వితండవాదం చేస్తుంది నువ్వు. ఈ మద్యన నీ ప్రవర్తన అసలేం బాగుండటం లేదు స్వాతి. నువ్వు ఇంతకు ముందులా లేవు" అన్నాడు "ఇంకా చాలు అన్నయ్య! నువ్వు నీ లెక్చర్స్. చిన్నప్పటి నుండి విని విని విసుగెత్తిపోయాను. అవును. నేను ఆలోచనలు పెట్టుకునే ఫెయిల్ అయ్యాను. నా జీవితం, నా చదువు, నా ఇష్టం." అంది పొగరుగా. చాచి పెట్టి చెళ్ళుమనేలా చెంపదెబ్బ కొట్టాడు. "ఛి! నా చెల్లెలువేనా నువ్వు? ఇలా తయారయ్యావేమిటే మొండిదానిలాగా? ఒకసారి ఆలోచించు, నీ ప్రేమను నేను కాదన్నానా? అడ్డు పడ్డాన? అసలేం లోటు చేసానే నీకు? చదువుకోమని చెప్పడం కూడా తప్పేనా? ఏం, ఆ మాత్రం అర్హత కుడా లేదా మాకు" అరిచాడు స్వాతి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంది." పో! నువ్వు నాతో మాట్లాడకు. నేను నీతో మాట్లాడను. అసలు నువ్వు నా అన్నయ్యవే కాదు" అంది. చలించిపోయాడు. కోపంలో చేయి చేసుకున్నానని బాధపడి "అది కాదు స్వాతి ....' అంటూ దగ్గరికి వెళ్ళబోయాడు. "గె....ట్... అ....వు...ట్ ....." అని అరిచింది. దయం అయింది. "ఏరా నిరంజన్, స్వాతి ఏది ఉదయంనుండి కనపడలేదు" అని అడిగాడు తండ్రి. కంగారుపడిపోయాడు నిరంజన్. ఇల్లంతా వెతికాడు."అమ్మా!స్వాతి ఏది?" అని తల్లిని అడిగాడు. "మేడ మీద గదిలో ఉందేమోర, పొద్దున్నించి కనిపించలేదు" అంది తల్లి పనిచేసుకుంటూ. పరిగెత్తుకుంటూ స్వాతి గాదిలోకి వెళ్ళాడు. రీడింగ్ టేబుల్ పై ఓ ఉత్తరం గాలికి ఎగురుతూ ఉంది. అందులో అమ్మా! నేను ఇంటిలోనుండి వెళ్ళిపోతున్నాను. నేను అశోక్ అనే అబ్బాయిని ప్రేమించాను. అతను కుడా నన్ను ప్రేమిస్తున్నాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ప్రేమని మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పరాయి కులం వాడిని పెళ్లి చేసుకుంటానంటే ఖచ్చితంగా ఒప్పుకోరు. ఆచారాలు కట్టుబాట్లు అంటూ నన్ను కట్టి పాడేస్తారు. అందుకే వెళ్ళిపోతున్నాను. మీ స్వాతి నిరంజన్ కి ఉత్తరం చదివాక తల తీసేసినట్టైంది. తండ్రి తలపట్టుకుని స్తంభానికి ఆనుకుని కూర్చుండిపోయాడు.ఎంత పని చేసిందిరా అంటూ తల్లి శోకాలు పెట్టింది. నిరంజన్ తండ్రి దగ్గరకు వెళ్లి "నన్ను క్షమించండి నాన్నా! స్వాతి ప్రేమ సంగతి నాకు ఇంతకు మునుపే తెలుసు. మీకు చెబితే ఏమైనా అంటారేమో అని చెప్పలేదు. తరువాత వీలుచూసుకుని మీతో మాట్లాడదాం అని అనుకున్నాను. కాని ఇంతలోనే ఇది ఇంత పని చేస్తుందనుకోలేదు.ఈ విషయం మీదే స్వాతికి నాకు గొడవ అయింది. అవన్నీ మీకు చెప్పి బాధపెట్టడం ఎందుకు అని చెప్పలేదు...." కాసేపాగి తానే కొనసాగించాడు. "మీరు చెప్పండి నాన్న ఏమి చేద్దాం ఇప్పుడు? ఆ అశోక్ ని బాది చెల్లెల్ని ఈడ్చుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పాడేయమంటారా? వాళ్ళ ప్రేమని ఒప్పుకుని ఇంటికి ఆహ్వానిద్దాం అంటారా? లేక ఇవన్నీ ఎందుకు నీళ్ళు వదిలేసుకోమంటారా? చెప్పండి నాన్న చెప్పండి అంటూ కూర్చుని ఉన్న తండ్రి భుజంపై వెనక నుండి చేయి వేసాడు. తండ్రి పక్కగా ఒరిగిపోయాడు. "నాన్నా ........!!!!" పెద్దగా అరిచాడు. "నాన్న...... నాన్న....." అంటూ కంగారుగా కదిపాడు. కూతురు పరువు తక్కువ పని చేసిందనే మాట వినగానే ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఆ గుప్పెట గుండె బద్ధలైపోయింది. నిరంజన్ తండ్రిని పట్టుకుని ఏడ్చాడు. భర్త పోయేసరికి నిరంజన్ తల్లి ఉలుకుపలుకు లేకుండా బిగుసుకుపోయింది. మెంటల్గా బాగా అప్సెట్ అయిపొయింది. తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా!అమ్మా! అని పిలిచాడు. ఆమె అలానే భర్త వైపు చూస్తూ ఉండిపోయింది. వెంటనే రాజీవ్ అచ్యుత్ లకు ఫోన్ చేసాడు. జరిగినదంతా కంగారుపడుతూ ఏడుస్తూ చెప్పాడు. అంబులెన్సు తో సహా హుటాహుటిన అక్కడికి వచ్చారు ఇద్దరు. డాక్టర్ తల్లిని పరీక్షించి "బాగా షాక్ కి గురి అయ్యారు. తగిన చికిత్స అవసరం. హాస్పిటల్ లో చేర్పించండి. తొందరపడకపోతే ఈమెకు కూడా అపాయం." అని చెప్పి ఆమెను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు. రాజీవ్ తోడుగా వెళ్ళాడు. అపస్మారక స్థితిలో శవంలా పడి ఉంది. మరో పక్క తండ్రి శవం... విషయం వీధి నుండి ఊరికి, ఊరు నుండి బంధువులందరికీ పాకింది. బంధువులందరూ ఒక్కొక్కరుగా వచ్చారు. అందరు స్వాతి వెళ్ళిపోయిన విషయమే మాట్లాడుకుని రగిలిపోయారు. నిరంజన్ కి సానుభూతి ప్రకటించడం తప్ప ఇంకేమి చేయలేకపోయారు.
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:54 AM



Users browsing this thread: 1 Guest(s)