Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#19
"అవును, ఇంతకీ ఎక్కడుంటున్నావు? మేఘన ఇల్లు ఖాళి చేసేసావట కదా? అని అడిగింది. "అవును. వేరే చోట ఉంటున్నాను." చెప్పాడు. తరువాత ఇద్దరు మద్యాహ్నం వరకు కాలక్షేపం చేసి, సినిమాకు వెళ్లి, అంజలిని దించేసి సాయంత్రానికి ఇంటికెళ్ళాడు. ప్రమోద మెట్లపై కూర్చుని అరవింద్ కోసం ఎదురు చూస్తోంది.  అరవింద్ రాగానే,"అరవింద్.." అని పేరు పెట్టి పిలిచింది. లోపలికి వెళ్ళేవాడు ఆగి ప్రమోదవైపు చూసాడు. "నీతో మాట్లాడాలి" అంది. చెప్పు అన్నట్టుగా చూసాడు.  "ఇప్పుడొద్దులే, ఫ్రెష్ అప్ అవ్వు. టీ తాగుతూ మాట్లాడుకోవచ్చు" అంది. అరవింద్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ముఖం కడుగుకుని టీ పెట్టడానికని వంటింట్లోకి వెళ్ళాడు.  "నాకు కూడా టీ పెట్టు" అని చెప్పింది. ఇద్దరికీ టీ ప్రిపేర్ చేసాడు. చెరో కప్పులో పోసి పట్టుకెళ్ళి ప్రమోదకు ఇవ్వబోయాడు. తాను అందుకోకుండా "అక్కడ పెట్టు" అంది. అరవింద్ కి విషయం అర్ధమైంది. కింద పెట్టాడు. ఆ కప్ ని తీసుకుని కొంచెం టీ తాగి " మూడు రోజులు " అంది. ప్రమోద కళ్ళల్లోకి చూసాడు.  "సరే, నేను వండుతాలే" అన్నాడు.  ప్రమోదకు చాలా ఆనందమనిపించింది. ఆమెకు విడిగా కంచం, మంచి నీళ్ళు, గ్లాస్ తీసి ఉంచాడు. తాను బయటకు వెళ్తే తినడానికి బ్రెడ్, పళ్ళు కొని ఏర్పాటు చేసాడు. విడిగా బొంత చాప దుప్పటి సద్ది పెట్టాడు. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంటే , తానే తనకు గాలి తగిలేలా ఏర్పర్చాడు. ఆమె స్నానానికి వెళ్తే ముందుగానే బాత్ రూమ్ హంగర్ కి తువ్వాలు తగిలించేవాడు. ఉదయానే లేవడం, ప్రమోదకు కాఫీ కలిపి ఇవ్వడం. టిఫిన్ తాయారు చేసి అదే చేత్తో అన్నం కూర వండేసి అవన్నీ ఆమె దగ్గర సద్దేసి తాను యూనివర్సిటీకి వెళ్ళిపోయేవాడు. తిరిగి సాయంత్రం వచ్చి టీ కాచి ఇచ్చి మళ్ళీ అన్నం కూర వండేసి ఆమెకు వడ్డించేవాడు. మూడు రోజులు ఇలానే గడిచాయి.  ఆ తరువాత ఆమె మైలు స్నానం చేసి బయట ఎండలో తలారబెట్టుకుంటోంది. ఆమెను చూసాడు. నిజానికి ప్రమోద కూడా చాలా అందగత్తె. స్నేహం అనే ముసుగులో చూసాడు ఇప్పటివరకు. కాని ఇప్పుడామె తలారబెట్టుకుంటున్నప్పుడు అతనిలో ఆమె తన భార్య అనే ఆలోచన కదలాడింది. వెనక నుంచి వెళ్లి గట్టిగా కౌగిలించుకోవాలనుకున్నాడు. కాని నిగ్రహించుకున్నాడు. బండి మీద వెళ్తూ ఆలోచించుకున్నాడు. ఎందుకిలా తన మనసు పరిపరివిధాల పరుగులు తీస్తోంది? కోరిందొకటి!. అందిందొకటి! అందింది వద్దనుకుంటూనే కావాలనుకుంటున్నాను. కోరింది కావాలనుకుంటూనే వద్దనుకుంటున్నాను. తాను చేసేది. చేస్తున్నది. చేయాలనుకుంటున్నది మూడు కూడా పూర్తిగా విభిన్నమైన దారులు. ఒకరకంగా ప్రమోద తన భార్య, కానీ ఒకప్పుడు మంచి స్నేహితురాలు. ఇప్పుడు తాను భర్త హోదాలోను ఇమడలేకపోతున్నాడు. స్నేహితుడుగాను ఉండలేకపోతున్నాడు. ఏదో ఇరుకు దారిలో ప్రయాణంలా తోచింది. మరోపక్క ఒకప్పుడు మౌనిక తనకు ప్రేయసి, ఇప్పుడు కూడా .. కాని ఆ స్థానం అక్కడితో ఆగిపోయింది. కాళ్ళు చేతులు కట్టేసి నూతిలో పడేస్తే ఆ ఇరకాటంలోంచి బయటపడే తాపత్రయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. జీవితం ఒక చదరంగం. ప్రతి ఎత్తుకు పైఎత్తు ఉండి తీరుతుంది. గెలవాలంటే కొంత సైన్యాన్ని త్యాగం చేయాలి. ఇప్పుడు తాను గెలవాలంటే ఎవరిని త్యాగం చేయాలి.  ప్రమోదనా?  మౌనికనా?  తన ప్రేమనా?  తన స్నేహాన్నా?  అసలు ఎవరిని త్యాగం చేస్తే వచ్చేది 'నిజమైన గెలుపు?'.  యూనివర్సిటీకి వెళ్లేసరికి అక్కడ నిరంజన్, రాజీవ్ లు కనిపించారు. వాళ్ళ దగ్గరకు నేరుగా వెళ్లి పలకరించాడు. "ఏంటిరా ఎలా ఉంది ప్రమోద?" అని అడిగాడు నిరంజన్.  "బావుంది" చెప్పాడు అరవింద్.  "మరి నువ్వు??" అని అడిగాడు  సమాధానం ఇవ్వకుండా మౌనంగా చూసాడు. నిరంజన్ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చిన విషయం, మానస ఇంటికెళ్ళి మాట్లాడిన విషయం చెప్పాడు. ఇంతలో అచ్యుత్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ "అశోక్ కి ఈ రోజు పెళ్లంటరా, అన్నవరంలో, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. మనం వెళ్లి ఆ పెళ్లిని ఎలా అయినా ఆపాలి" అన్నాడు.   "నువ్వు చెప్పేది నిజమేనా?" అని అడిగాడు నిరంజన్.  "నిజంరా, మనం వెంటనే బయలుదేరాలి. మరో విషయం ఎందుకైనా మంచిది మనం కూడా జాగ్రత్తగా ఉండాలి." అన్నాడు అచ్యుత్.  "పదండి ముందు" అని నిరంజన్ అరవింద్ లు ఒక బండిపైన , రాజీవ్ అచ్యుత్ లు మరో బండిపైన బయలుదేరారు. గంటలో అన్నవరం చేరుకున్నారు. గుడిలో పెళ్లి అని తెలిసి మెట్లద్వార గుడిలోకి వెళ్ళారు. నలుగురు నాలుగువైపులా వెళ్లి వెతికారు. ఎక్కడా అశోక్ కనిపించలేదు. చాలాసేపటి వెతుకులాట తరువాత అశోక్ కనిపించాడు. రాజీవ్ అశోక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి "ఏం చేస్తున్నావో నీకు అర్ధమవుతోందా?" అని ప్రశ్నించాడు.  "ఏమి చేస్తున్నాను?" అని అడిగాడు అశోక్  "పెళ్లి చేసుకుంటున్నావుగా?" అని అరిచాడు రాజీవ్  "పెళ్ళా? ఎవరు చెప్పారు? అయినా నేనెందుకు రెండో పెళ్లి చేసుకుంటాను. సత్యనారాయణ స్వామి వ్రతానికని ఫ్యామిలీతో పాటు వచ్చాను. " అని అన్నాడు అశోక్.  అరవింద్ వస్తూ ఆ మాట విన్నాడు. వెనకనే నిరంజన్, అచ్యుత్ లు కూడా వచ్చారు. నిరంజన్ ని చూస్తూ "హాయ్ నిరంజన్ బాగున్నావా?" అని అడిగాడు అశోక్.  "నీకు పెళ్లైపోయిందా?" అని ప్రశ్నించాడు అరవింద్. ఆ మాట వినగానే నిరంజన్ కి పట్టరాని కోపంతో అశోక్ మీదకు వచ్చాడు. ఆగు నిరంజన్ ఆపాడు అరవింద్.  "అయిపోయింది. అదిగో నా భార్య అటుగా వెళ్తున్న అతని భార్యని పిలిచాడు. ఆమెకు 'నా ఫ్రెండ్స్' అని పరిచయం చేసాడు. నీతో మాట్లాడాలి అన్నాడు అరవింద్ అశోక్ తో. "సరే పదండి" అని అందరు పక్కకు వెళ్లారు.  "నువ్వు నా చెల్లెలు స్వాతిని ప్రేమించాలేదా? పెళ్లి చేసుకోవాలనుకోలేదా?" అని అడిగాడు నిరంజన్  "ప్రేమించాను...."  "మరెందుకు పెళ్లి చేసుకున్నావు?"  "చేసుకోవాల్సి వచ్చింది" అన్నాడు అశోక్.  "ఎందుకు? ఏమైంది?" అని అడిగాడు అరవింద్.  "వద్దు అరవింద్, వదిలేయండి. అయ్యిందేదో అయిపోయింది." అన్నాడు అశోక్.  "అయ్యిందేదో అయిపోవడం ఏంటిరా? అంటూ కాలర్ పట్టుకుని ఏం జరిగిందో చెప్పు ! " అని కసిగా అడిగాడు నిరంజన్. అరవింద్ నిరంజన్ ని వెనక్కి లాగి "స్వాతి నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకిలా చేసావు? ఇప్పుడీ విషయం తెలిస్తే తనేమైపోతుందో ఆలోచించావా?" అని అడిగాడు అరవింద్  నిరంజన్ వైపు చూసి " నిజం చెప్తాను. కాని మీకు ఈ విషయం తెలుసని స్వాతికి చెప్పకండి" అన్నాడు అశోక్.  "ఏంటా నిజం?" అని అడిగాడు నిరంజన్.  "నన్ను ఈ పెళ్లి చేసుకోమని స్వాతియే చెప్పింది. ఈ విష యం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది." అన్నాడు. అందరు నిర్ఘాంతపోయారు. “అసలెందుకిలా చేస్తోంది ?" అని అనుకున్నాడు నిరంజన్.  అశోక్ " స్వాతి ,నేను ప్రేమించుకోవడం నిజం..\, కాని, జరిగింది ఏమిటంటే... "ఒకరోజు తనకు తలనొప్పి వస్తోందని చెప్పింది. టాబ్లెట్స్ ఇచ్చాను. రెండు మూడురోజులైనా తగ్గకపోయేసరికి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. బ్రెయిన్ స్కాన్ తీయించమంటే తీయించాము. ఆ రిపోర్ట్స్ చూసి స్వాతికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, అడ్వాన్స్డ్ స్టేజి అని ఎంతోకాలం బ్రతకదని డాక్టర్ చెప్పారు .అప్పటినుండి నన్ను వేరే పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. నేను ఎంత చెప్పినా వినలేదు. తను చనిపోయేలోపు నాకు పెళ్లి జరిగిన విషయం వినాలనేది తన ఆఖరి కోరికని బ్రతిమాలింది. ఆరోజు నా ఒళ్లో పడుకుని ఏడ్చింది. నాతో ఈ ఒట్టు వేయించుకుని ఎటైనా వెళ్లిపోదామనుకుంది. అందుకే నాతో పెళ్లి అంటూ ఉత్తరం రాసింది. కాని తనకు మిమ్మల్ని వదలడం ఇష్టం లేకపోయింది. “నేను ఇంటికి తిరిగి వెళ్తాను కనీసం చివరి రోజులైనా అన్నయ్య, అమ్మానాన్నలతో గడుపుతాను” అని తిరిగి బయలుదేరింది.  తప్పుడు నిర్ణయం బ్రతికుండగానే చంపుతుంది అని తరువాత తెలిసింది.  మీరు తనను ఎంతగా ప్రేమిస్తారో తెలుసు. తనకు ఏమైనా అయితే తట్టుకోలేరని అలా అయిష్టంగా, పొగరుగా నటించింది. ప్రతిరోజూ నాకు చెప్పుకుని బాధపడేది. "అన్నయ్యని అనరాని మాటలంటున్నాను" అంటూ ఏడ్చేది. తన పరీక్ష ఫెయిల్ అవడానికి కారణం తన ప్రేమ కాదు. తన అనారోగ్యం. పరీక్షల టైములో తనకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. చదవలేకపోయింది. తను చాలా మంచిది నిరంజన్. నేను కూడా ఏమి హ్యాపీగా లేను. తనను చూడాలని ఉంటుంది. కాని నాకు పెళ్లైయ్యాక ఇక జీవితంలో కలవకూడదు అని ఒట్టు వేయించుకుంది. తనకు నువ్వంటే చాలా ఇష్టం నిరంజన్, మా అన్నయ్య ఇది, మా అన్నయ్య అది అంటూ చెప్తూ ఉండేది. తను ఒకసారి నాతో ఏమందో తెలుసా " మా అన్నయ్య ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను.మన పెళ్లి అయినా సరే" అని. అంత విలువ ఇస్తుంది నీకు. నువ్వు తనకో రోల్ మోడల్ అని చెప్తూ ఉంటుంది. కలిసిన ప్రతిసారి నీ గురించి మానస గురించి మాట్లాడుతూ ఉండేది. మా వదిన ఎంత మంచిదో తెలుసా, మా అన్నయ్య ఎంత అదృష్టవంతుడో తెలుసా అంటూ ఏవేవో కబుర్లు చెప్పేది.  తనకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసినప్పటి నుండి తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అందుకే కావాలనే గొడవలు పెట్టుకునేది. కావాలనే ఆరోజు నువ్వు రావడం గమనించి నా పేరు పుస్తకంలో రాసింది. ఇదంతా తనని తానూ కోల్పోతున్న బాధతో, మిమ్మల్ని విడిచిపోతున్న బెంగతో, .. తనకోసం కాదు మీకోసం" ముగించాడు అశోక్ అశ్రునయనాలతో.  అంతా విన్న నిరంజన్ వెక్కి వెక్కి ఏడ్చాడు. మిగిలిన వాళ్ళ గుండెలు కూడా చెరువులయ్యాయి. నిరంజన్ ని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. అశోక్ దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేసి " మీకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే తను తట్టుకోలేదు. తనను ప్రేమగా చూసుకో నిరంజన్" అని చెప్పాడు.  నిరంజన్ కి స్వాతి మాటలు గుర్తొచ్చాయి ".....అవును, నేను ఆలోచనలు పెట్టుకునే ఫెయిల్ అయ్యాను. నా జీవితం. నా చదువు. నా ఇష్టం....." అందరికి ఆమెపై అపారమైన అభిమానం, గౌరవం కలిగాయి. కాసేపు ఎవరు ఏమి మాట్లాడుకోలేదు. అకస్మాత్తుగా ఓ వ్యక్తి కూర్చున్న రాజీవ్ తలపై ఇనుప రాడ్ తో బలంగా బాదాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రాజీవ్. అందరు ఉలిక్కిపడ్డారు. అరవింద్ వెంటనే అతని గుండెలపై తన్నాడు. ఇంకో నలుగురు ఆయుధాలతో వాళ్ళపై విరిచుకు పడ్డారు. అరవింద్ భుజంపై కత్తివేటు వేసాడొకడు. రెండోసారి కూడా పొడవబోతుంటే నిరంజన్ ఆపడానికి ప్రయత్నించగా అరచెయ్యి కోసుకుపోయింది. నిరంజన్ ఆ మంటకు వెర్రెత్తిపోయాడు. కోపంతో ఊగిపోయి అతన్ని పట్టుకుని దూరంగా విసిరేశాడు. అరవింద్ మెరుపు వేగంతో మరొకడి ముఖంపై పిడి గుద్దులు గుద్దాడు. అచ్యుత్ రాజీవ్ ని ఎత్తుకుని పరిగెడుతూ అశోక్ వెళ్ళిపో అని అరిచాడు. అందరు పరుగులెత్తారు. గుడి చుట్టూ చాలా మంది మనుషులు వాళ్ళపై దాడి చేయడానికి సిద్దంగా కాచుకుని ఉన్నారు.  అందరిని కొట్టుకుంటూ, తోసుకుంటూ, కిందకి పరుగులు తీసారు. రాజీవ్ కి శోష తప్పిపోయింది. అడ్డొచ్చిన వాళ్ళందరిని నెత్తురోచ్చేటట్టు చితక బాదారు. అచ్యుత్ రాజీవ్ ని సరాసరి హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. నిరంజన్ అరవింద్ లు రెచ్చిపోయారు. మీదకు వస్తున్న ఒకరి కాలర్ పట్టుకుని కిందకి ఈడ్చి తలను ఒక రాయికేసి కొట్టాడు నిరంజన్. ఫాట్ మని శబ్దం వచ్చింది. మరొకడు పరిగెడుతుంటే చొక్కా పట్టుకుని గుంజి వెనక్కి లాగి పడేసి పొత్తి కడుపులో, డొక్కల్లో తన్నాడు అరవింద్ " చెప్పరా, ఎవడ్రా మిమ్మల్ని పంపించింది?" అని అలానే తంతూ అడిగాడు. వాడు ఆ బాధను తట్టుకోలేక అరవింద్ కాళ్ళు పట్టుకుని "మేఘన .. మేఘన మేడం" అని చెప్పాడు. వాడి ముఖంపై తన్నాడు నిరంజన్.  రాజీవ్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసారు. నిరంజన్, అరవింద్ లు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి చేరుకున్నారు. ప్రమాదమేమి లేదని డాక్టర్స్ చెప్పారని అచ్యుత్ వాళ్లతో చెప్పాడు. వాళ్ళ మనసు అప్పుడు కుదుట పడింది. ఇద్దరు కట్లు కట్టించుకున్నారు. "అది ఇంత పని చేస్తుందనుకోలేదు. దాన్ని బ్రతకనివ్వను. కొద్దిలో తప్పింది లేకపోతే మన రాజీవ్ పరిస్థితి.." అన్నాడు అచ్యుత్.  "జరింగేదో జరిగిపోయింది. ఆమెకు వార్నిగ్ ఇద్దాం. ఈ విషయాన్ని మర్చిపోండి. ఇది పెద్దది చేసి అనవసరంగా ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయద్దు" చెప్పాడు అరవింద్. సాయంత్రం అందరు ఇంటికి వెళ్ళిపోయారు. రాజీవ్ ని అచ్యుత్ తీసుకెళ్ళాడు. 

* * *





[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:59 AM



Users browsing this thread: 1 Guest(s)