Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తోడొకరుండిన
#15
ఆ రాత్రి కళ్యాణ మండపంలో పెళ్లిసందడికి దూరంగా గదిలో నిద్రపోతున్న అర్జున్ దగ్గరున్న మహిమ దగ్గరకొచ్చి కూర్చుంది సునంద.
"ఇక్కడున్నావేం మహీ? అర్జున్ పొడుకున్నాడుగా. మండపంలో కెళ్దాం వస్తావా?"
"లేదోదినా! అర్జున్ మళ్ళీ లేచి ఏడిస్తే కష్టం. మీరెళ్ళండి" అంది మహిమ.
"మహీ! నేను మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వీ పెళ్ళితంతు అంతా అవాయిడ్ చేస్తున్నావు. ఎందుకు?" సూటిగా అడిగింది.
"అదేం లేదు వదినా. అర్జున్ చాలా అల్లరి. వాణ్ణి చూసుకోవాలి కదా" అర్జున్ తల నిమురుతు చెబుతున్న మహిమ భుజంమీద చెయ్యేసింది.
"అందుకే మహీ నీతో మాట్లాడాలనుకుంటుంన్నాను"
"ఏం మాట్లాడాలి" మహీ ఆశ్చర్యంగా చూసింది.
"మహి! నేనొచ్చిన దగ్గరనుంచీ నిన్నూ, అర్జున్ ని నిశితంగా గమనిస్తునే ఉన్నాను. అందరూ వున్నా నువ్వెంత ఒంటరిగా ఫీలవుతున్నావో, అలాగే అర్జున్ నాన్న కోసం ఎంత ఆరాటపడుతున్నాడో నేను చూస్తూనే ఉన్నాను. మహీ! నువ్వు మళ్లీ కొత్త జీవితం ఎందుకు మొదలు పెట్టకూడదు" అంది సునంద మృదువుగా.
"వదినా ఇలా నేనొక్కదన్నే కాదుగా, నాలాగే చాలామంది ఉన్నారు. అలాగే అర్జున్ లా కూడా. నెమ్మదిగా అర్జున్ కి నిజం తెలుస్తుంది. తెలిసాక వాడు ముందు భాధపడ్డా తర్వాత నెమ్మదిగా ఈ సిట్యుయేషన్ కి అడ్జస్ట్ అవుతాడు. అప్పుడిక పెద్దగా ప్రాబ్లమేమి ఉండదు. నేను వాడికి అమ్మనే కాదు, నాన్నను కూడా. నేను వాణ్ణి పెంచగలను. ఆ ధైర్యం నాకుంది" అంది.
"మహీ! పెంచటం వరకు సరే, నీకు మీ అమ్మానాన్నల సపోర్ట్ ఉంది కాబట్టి అందరూ ఉన్నారన్న ధైర్యం నీకుంది కానీ నీ మనసులో నువ్వు ఒంటరీదానివి కాదా? నేనాడుగుతున్న విషయం అదే"
"నేను ఒంటరిదాన్నేం కాదు వదినా. అర్జున్ నాకున్నాడు కదా. వాడే నాకన్నీ" ఆప్యాయంగా అర్జున్ ని చూసుకుంటూ చెప్పింది.
"నువ్వు చాలా చిన్నదానివి మహీ! అర్జున్ పెరిగి పెద్దవాడయ్యాక వాడి జీవితం వాడిది. అప్పుడు నువ్వు ఒంటరీదానివి అయిపోతావు. అదే నీకో తోడుంటే..."
"అది నాకలవాటే వదినా" ఆ టాపిక్ మాట్లాడటం ఇష్టంలేనట్లు కళ్లు మూసుకుంది.
"మహీ! నేను ఊరికే ఈ విషయం మాట్లాడి నిన్ను బాధపెట్టటానికి రాలేదమ్మా. నిన్ను చూస్తుంటే, నీలాంటి పరిస్థితులోనే ఉన్న నా తమ్ముడు ఉదయ్ గుర్తొస్తున్నాడు. బహుశా నీకు తెలిసే ఉంటుంది. మా మరదలు అర్చన ఏడాదిన్నర క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది. ఇక వాడి మూడున్నారేళ్ల కూతురు వైషూ ఇలాగే అర్జున్ లానే అమ్మ కోసం అమాయకంగా అడుగుతుంటుంది. మహీ నువ్వు నాకు బాగా తెలుసు. అలాగే ఉదయ్ నాతొడబుట్టినవాడు. మీరిద్దరూ తలుచుకుంటే ఇటు అర్జున్ కి నాన్న, అటు వైషూకి అమ్మా దొరుకుతారు" కన్విన్సింగ్ గా చెప్పబోయింది సునంద.
"వదిన! మీరు చెప్పినంత ఈజీ కాదు అమ్మానాన్నలైపోవటం. అయినా నేను సంజయ్ ని మర్చిపోలేను. మీ తమ్ముడికి ఇంకెవరినైన చూడండి" స్పష్టంగా చెప్పేసింది మహీ.
          *                *              *            *
            party  Vishu99  party
[+] 1 user Likes Vishu99's post
Like Reply


Messages In This Thread
తోడొకరుండిన - by Vishu99 - 19-01-2019, 11:50 AM
RE: తోడొకరుండిన - by krish - 23-01-2019, 05:39 AM
RE: తోడొకరుండిన - by Vishu99 - 27-01-2019, 09:54 AM
RE: తోడొకరుండిన - by Uma_80 - 05-02-2019, 10:04 PM
RE: తోడొకరుండిన - by raaki - 06-02-2019, 12:33 AM
RE: తోడొకరుండిన - by ravi - 06-02-2019, 10:25 AM
RE: తోడొకరుండిన - by ~rp - 06-02-2019, 01:01 PM
RE: తోడొకరుండిన - by Uma_80 - 11-02-2019, 07:08 PM
RE: తోడొకరుండిన - by RAANAA - 06-10-2022, 05:47 AM



Users browsing this thread: 1 Guest(s)