Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
15 నిమిషాల తరువాత ఫేస్ వాష్ చేసుకుని టవల్ తో తుడుచుకుంటూ వచ్చి , నన్ను అందంగా ముస్తాబు చేసి తను ఆలంకరించుకుని , వెళదామా అంటూ చేతులు కలిపి చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చి అమ్మకు నన్ను అప్పజెప్పి కిటికీలోనుండి బయటకు చూస్తోంది .



మమ్మల్ని చూడగానే ........మహేష్ నీ birthday అనిచెప్పారు అంటూ సంతోషంతో గుంపుగా చుట్టుముడుతుంటే , అమ్మా జాగ్రత్త అని అక్కయ్య కంగారుపడింది .

తోటలో పనిచేసే సోమయ్య క్షణాల్లో మధ్యలోకి చేరి అమ్మగారు అంటూ నన్ను ఎత్తుకుని మీరు లోపలకువెళ్లండి నేను చూసుకుంటాను అని ఎత్తుకున్నాడు .

అక్కయ్య చూసి హమ్మయ్యా .......అంటూ గుండెలపై చేతిని వేసుకుంది .

ఊరి జనమంతా విష్ చేసి తమకు తోచిన గిఫ్ట్ ఇచ్చి వంటలు అద్భుతం అని మాట్లాడుకుంటూ సంతోషంతో అర గంటలో అందరూ వెళ్లిపోయారు . 

సోమయ్య ఎత్తుకుని వచ్చి మెయిన్ డోర్ దగ్గర ఉన్న అమ్మకు అప్పచెప్పివెళ్లాడు .

అక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏమీ కాలేదు కదా తమ్ముడూ అని మోకాళ్లపై కూర్చుని హత్తుకొని , నేను నవ్వుతుండటం చూసి ఆనందించింది . 

అక్కయ్యా .......ఊరివాళ్ళంతా చాలా మంచివారు , చాలా ప్రేమ చూపించారు అని సంతోషంతో చెప్పాను . ఇంత ప్రేమ ఆప్యాయతలు సిటీలలో ఉండవు అక్కయ్యా ............ఎంతైనా పల్లెటూళ్ళ పల్లెటూల్లే ................అని గర్వంతో చెప్పాను . 



ఇంతలో అక్కయ్య ఫ్రెండ్స్ వచ్చి , మీ అక్కతమ్ముళ్ల అనుబంధం సినిమా అయిపోతే తిందాము . మాకు చాలా ఆకలివేస్తోంది అని నీరసంగా చెప్పారు .

మీకే కాదే నాకు కూడా ..........అక్కయ్యా నాకు కూడా అని చెప్పడంతో అందరూ నవ్వేశారు .

అయితే అందరమూ కలిసి తిందాము తమ్ముడూ మనందరికోసం మేడ మీద షామియానా వేయించాను . వంటలన్నీ పైకి వచ్చేస్తాయి అంటూ నా చేతిని అందుకుంది . నేను అమ్మ చేతిని అందుకున్నాను . 

నా బుజ్జి బంగారం అంటూ నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయింది .



వంట వాళ్ళు వంటలన్నింటినీ పైకి మార్చేశారు . ముందే కుర్చీలు arrange చేసినందువల్ల , బఫె ద్వారా ఇష్టమొచ్చిన ఐటమ్స్ వడ్డించుకొని చుట్టూ అందరూ కూర్చుని తింటున్నారు . 

అందరూ వడ్డించుకొని వెళ్లిన తరువాత , తమ్ముడు కుర్చీలో కూర్చో వడ్డించుకొని వస్తాను అని అమ్మతోపాటు వెళ్లి ఒక ప్లేట్ లలో అన్ని ఐటమ్స్ తో వచ్చి , ఇద్దరూ నా ఎదురుగా కూర్చుని నాకు ఒక ప్లేట్ అందివ్వబోయారు .

అలిగినట్లు చేతులు కట్టుకున్నాను . ..........

ఉమ్మా.........అంటూ ఇద్దరూ చెరొకవైపు ముద్దులుపెట్టి , నా ప్లేట్ ప్రక్కన మరొక కుర్చీలో ఉంచేసి , ఫస్ట్ అక్కయ్య నెక్స్ట్ అమ్మ ప్రేమతో కలిపి తినిపించి మురిసిపోతుంటే ..........

అమృతం అమ్మా అక్కయ్యా ............ ఆమ్ ఆమ్........అంటూ తిని మీ......రు ......తినండి అని ముద్ద నములుతూనే చెప్పాను .

మా బంగారం అంటూ పొంగిపోతూ వాళ్ళు తిని నాకు తినిపిస్తుంటే , కళ్ళల్లో ఆనందబాస్పాలతో .............7 ఏళ్ల నుండి నేనే ఒక్కడినే తిన్నాను అక్కయ్యా........,ఇప్పుడు దేవతలాంటి అమ్మ , అక్కయ్య మరియు చుట్టూ నా ప్రాణమైన అక్కయ్య ఫ్రెండ్స్ తోపాటు తింటుంటే చాలా బాగుంది. నెక్స్ట్ 7 ఏళ్ళు మీకు వీలు కలిగినప్పుడల్లా ఇలాగే తినిపిస్తారా అని కన్నీఇళ్లను తుడుచుకుంటూ ప్రేమతో అడిగాను .

అక్కయ్య , అమ్మ హృదయం చలించిపోయినట్లు కళ్ళల్లో చెమ్మతో నోటివెంట మాట రానట్లు తలఊపి , అమ్మ అయితే నా చేతిని అందుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని , తలపై ముద్దుపెట్టి వీలుకాకపోయినా మా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జికి నా బుజ్జికి తినిపిస్తాము . అంతకంటే మాకు అదృష్టం ఇంకేమి కావాలి అని ప్రేమతో తినిపించింది .

అక్కయ్య అయితే నన్ను చూస్తున్న చూపుకు భాషలో పేరే పెట్టలేదు అన్నంత ప్రాణంలా చూసి , కారుతున్న కన్నీళ్లను తుడుచుకుని తినిపించింది .



నామాటాలు విని అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ నాచుట్టూ చేరి కళ్ళల్లో చెమ్మతో , ఏంటి హీరో , హ్యాండ్సమ్ , క్యూట్ బాయ్...........ఇలా రకరకాలుగా ఆప్యాయతలతో పలకరించి లేచి చుట్టూ నిలబడి , మీ అమ్మ అక్కయ్యేనా ........మేము కూడా తినిపించొచ్చా అని ఆశతో అడిగారు .

అంతే అంతులేని ఆనందంతో ఆనందబాస్పాలతో ఆ ఆ ...........అంటూ ఎంతవీలయితే అంత పెద్దగా నోటిని తెరిచాను . 

వారిలో వాళ్ళు పోటీపడుతూ తోసుకుంటూ ముందుకురావడం చూసి అక్కయ్య తన కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని ఒసేయ్ నెమ్మది , నా తమ్ముడిని ఏమో చేసేలా ఉన్నారు అంటూ సంతోషంతో కళ్ళల్లో నీల్లువచ్చేలా నవ్వుతోంది . 

అక్కయ్య సంతోషాన్ని చూసి గుండెలపై చేతిని వేసుకుని ఫీల్ అవుతుంటే నా తమ్ముడు బంగారం అంటూ ఎడమ చేతితో బుగ్గను ప్రేమతో స్పృశించింది .

అందరూ సంతృప్తితో భోజనాలు చేసిన తరువాత పైన మొత్తం అంతటినీ కిందకు పంపించేసి , షామియానా కింద పెద్ద పరుపు పరిచి అందరూ కూర్చుని సరదాగా ముచ్చట్లు పెట్టారు . 

అక్కయ్య నన్ను తన ముందు కూర్చోబెట్టుకొని రెండుచేతులను చుట్టేసి నా తలపై ,బుగ్గలపై ప్రాణంలా ముద్దులుపెడుతూ తన ఫ్రెండ్స్ తో సంతోషన్గా మాట్లాడుతున్నారు, చుట్టూ ఉన్నవాళ్లు మహేష్ మావల్ల కావడం లేదు అంత క్యూట్ గా ఉన్నాయి అంటూ నా బుగ్గలను గిల్లడానికి try చేస్తుంటే , ఒసేయ్ కొడతాను మిమ్మల్ని అంటూ వాళ్ళ చేతులను తోసేసి నా తమ్ముడిని మీనుండి రక్షించుకుంటాను అని నన్ను మరింత చుట్టేసి , నేనున్నాను కదా తమ్ముడూ వీళ్ళు నన్ను తాకాను కూడా తాకలేరు అని అందరికీ తియ్యని వార్నింగ్ ఇచ్చింది .

ఒసేయ్ 24/7 ఇలాగే నీతమ్ముడిని ఇలాగే సేవ్ చేస్తావా ........

ఆ..........

చూద్దాము ఒంటరిగా మాకు దొరక్కపోడు అంటూ వార్నింగ్ మరిచిపోయినట్లు మళ్లీ నాబుగ్గలను గిల్లడానికి చేతులు చెప్పగానే , చురుక్కుమనేలా దెబ్బ వేయడంతో నాతోపాటు మిగిలినవాళ్ళంతా పగలబడి నవ్వుకున్నారు .

ఫంక్షన్ గురించి , birthday గురించి , కాలేజ్ గురించి అందరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతుంటే ............

అక్కయ్య ఆనందాన్ని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ పొంగిపోతుంటే , లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దులతో ప్రేమలో ముంచెత్తింది .

అక్కయ్య కౌగిలిలోనే హాయిగా నిద్రపోతుండటం చూసి , అక్కయ్య ష్.......... అంటూ చేతులతో మెల్లగా జోకొట్టింది . 

కొన్ని నిమిషాల్లోనే అక్కయ్య ఒడిలో వాలిపోవడంతో అక్కయ్యతోపాటు అందరూ సంతోషించి , ఒసేయ్ మాహేరోని రూంలో బెడ్ పై పడుకోబెట్టు , ఉదయం వచ్చాము ఇక మేము ఇంటికి వెళతాము అనిచెప్పడంతో ,

థాంక్స్ వే .........అని అక్కయ్య చెప్పింది .

నా తమ్ముడు నిద్రపోతున్నాడు ఇక మీరు దొబ్బేయ్యండి అంటావు , సరే ఏమిచేస్తాము అంటూ ప్రతి ఒక్కరూ నన్ను స్పృశించి జాగ్రత్తగా ఎత్తుకుని అక్కయ్య రూంలో పడుకోబెట్టారు .

అక్కయ్య నా ప్రక్కనే కూర్చోవడం చూసి , ఒసేయ్ గేట్ వరకూ అన్నా వచ్చి మమ్మల్ని పంపు అని కోరడంతో .........

 ష్ ష్ ......... మీరేమైనా బుజ్జి పాపాయిలా .......సరే సరే ........పదండి అంటూ నా భుజాల వరకూ దుప్పటికప్పి , నుదుటిపై తియ్యని ముద్దుపెట్టి వదల్లేక వదల్లేక నా చేతిని వదిలి ఫ్యాన్ వేసి అందరితోపాటు బస్ స్టాప్ వరకూ వెళ్లి బస్ రావడంతో , అందరూ వచ్చి సంతోషం పంచినందుకు చాలా చాలా థాంక్స్ అంటూ కౌగిలించుకుని జాగ్రత్తగా వెళ్ళండి , వెళ్ళగానే కాల్ చెయ్యండి అనిచెప్పి బస్ వెళ్ళగానే ఊరి ఫ్రెండ్స్ తో ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు .

నిద్రలో ఏదో పీడ కల రావడంతో నుదుటిపై చెమటతో అక్కయ్యా .........అంటూ బెడ్ పై లేచి కూర్చుని చుట్టుచూసి అక్కయ్య కనిపించడంతో , దుప్పటి తీసేసి పరుగున వస్తుంటే ..........

అప్పటికే పరుగున గది తలుపు దగ్గరకువచ్చి మోకాళ్లపై కూర్చుని నన్ను గుండెలకు హత్తుకొని , నుదుటిపై చెమటను చూసి ఫ్యాన్ ఉన్నా చెమట పట్టిందంటే ........కలగన్నావా ........తమ్ముడూ అంటూ పైటతో తుడిచి అడిగింది . 

అక్కయ్యను భయపడుతున్నట్లు గట్టిగా కౌగిలించుకుని , అవునక్కయ్యా ........మళ్లీ రైల్వే స్టేషన్ లో ఒంటరిని అయిపోయినట్లు కలవచ్చింది .

లేదు లేదు .........తమ్ముడూ అంటూ కళ్ళల్లో చెమ్మతో నా బుగ్గలను అందుకొని నా ప్రాణం ఉన్నంతవరకూ అలా జరగనివ్వను . అంతా నా ఫ్రెండ్స్ వల్లనే లేకపోతే నేను నా తమ్ముడి ప్రక్కనే ఉండేదాన్ని అని ముద్దుపెట్టి ప్రాణంలా హత్తుకుంది .

అమ్మకూడా కేకవిని కంగారుపడుతూ వచ్చి మా ఇద్దరినీ అలాచూసి ఆనందబాస్పాలతో , తల్లి నీకు ట్రైన్ లోనే చెప్పానుకదా ..........ఫంక్షన్ లో మరింత అలసిపోయారు కదా అలానే ఉంటుంది . 

వెళ్లి హాయిగా నా బుజ్జి ప్రక్కనే పడుకో , నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేను నా కొడుకుని చూసుకుంటాను అని చిలిపినవ్వుతో చెప్పింది .

అమ్మో .........అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుంది .

అమ్మ నావైపు చూసి కన్నుకొట్టడంతో , ఇద్దరమూ నవ్వుకున్నాము .

అమ్మా మేము మళ్లీ కిందకు వచ్చేన్తవరకూ డిస్టర్బ్ చెయ్యొద్దు , ఏ చప్పుళ్ళూ వినిపించకూడదు సరేనా అనిచెప్పి నా చేతిని అందుకొని బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పి , ప్రక్కనే వాలిపోయి హాయిగా నిద్రపో తమ్ముడూ ఇక నేను నిన్నువిడిచి ఎక్కడికీ వెళ్ళను అని నుదుటిపై ముద్దుపెట్టి జోకొట్టింది .

అమ్మకూడా నా బుగ్గలను స్పృశించి ముద్దుపెట్టింది .

లవ్ యు అమ్మా , లవ్ యు అక్కయ్యా .........అంటూ అక్కయ్య చేతిపై చేతులువేసి అక్కయ్యనే చూస్తూ పెదాలపై చిరునవ్వుతో నిద్రలోకి జారుకున్నాను .



తల్లి నువ్వుకూడా పడుకో కింద పనులు నేను చూసుకుంటాను అని అమ్మ మళ్లీ నా నుదుటిపై ముద్దుపెట్టి తలుపు క్లోజ్ చేసి వెళ్ళింది . 

అక్కయ్య నన్నే ప్రాణంలా చూస్తూ జోకొడుతూ జోకొడుతూ నిద్రపోయింది .

*************



మళ్లీ వెచ్చని ముద్దులకు మెలకువ వచ్చి చూస్తే అమ్మ , అక్కయ్య చెరొకవైపున కూర్చుని నవ్వి , తమ్ముడూ లేచి తినేసి మళ్లీ పడుకో అని చెరొక బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

లేచి కూర్చుని లైట్స్ వేసి ఉండటం మరియు విండో బయట చూస్తే చీకటి పది ఉండటంతో , అక్కయ్యా .........టైం ఎంత ......అంటూ గోడపై ఉన్న గడియారం చూస్తే రాత్రి 10 గంటలు అయ్యింది .

అంతసేపు నిద్రపోయానా .........అంటూ ఆశ్చర్యపోయి , అక్కయ్యా అంటూ సంతోషంతో హత్తుకొని మా అక్కయ్య ప్రక్కనే ఉండటం వలన చిన్న పీడకల కూడా రాలేదు హాయిగా నిద్రపోయాను అనిచెప్పాను .

తమ్ముడూ నేను కూడా అలాగే నిద్రపోయాను . అమ్మవచ్చి లేపి అర్ధరాత్రి ఆకలి వలన ఎక్కడ కడుపు నొప్పిస్తుందో అని , తిని పడుకోండి అనిచెప్పడంతో లేచాను అంటూ నన్ను చుట్టేసి తిందామా అంటూ ఇద్దరమూ ఒకేసారి నోళ్లు తెరిచాము .

అమ్మ మొదట నాకు తినిపించబోతే నోటిని మూసేశాను . అక్కయ్యకు తినిపించబోతే అక్కడ మూసేసింది . 

ఇలా అయితే ఎలా ముందు ఎవరికో మీరే డిసైడ్ చేసుకోండి అని అలిగినట్లు ప్రక్కకు తిరిగింది అమ్మ .

మొదటి ముద్ద తమ్ముడికే , అక్కయ్యకే .........అని ఒకేసారి పలికి ఒకరొకరము చూసుకుని నవ్వుకున్నాము . ఇద్దరమూ ఇంతకూ పట్టువిడువకపోవడంతో ........

అక్కయ్యా .........సంధికి వద్దాము . ఒకరోజు ఫస్ట్ మీకు మరొకరోజు ఫస్ట్ నాకు ........

ఇదేదో బాగుంది ..........అయితే ఈరోజు మొదటి ముద్ద నా తమ్ముడికి .......

అలా ఎలా కుదురుతుంది అక్కా సరిగ్గా విన్నారా లేదా ఒకరోజు ఫస్ట్ మీకు అని ముందుచెప్పాను కాబట్టి అమ్మా అక్కయ్యకు మొదట తినిపించు అని చెప్పాను .

అవునా అన్నట్లు అక్కయ్య ఆలోచనలో పడింది . 

మా మంచి అమ్మకదా అంటూ అమ్మ ముఖాన్ని మావైపు తిప్పి అక్కయ్యకు ఫస్ట్ తినిపించు అమ్మా అని మాట్లాడుతుంటే .........

అమ్మ ముద్దకలిపి నానోటిలో పెట్టేసి నవ్వుతుంటే , అక్కయ్య అయితే యాహూ..........అంటూ చేతులుపైకెత్తి , షాక్ లో ఉన్న నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , అమ్మా ఇప్పుడు నాకు అంటూ నోట్లోకి తీసుకొని తినింది . 

అమాయకుణ్ణి చేసి నన్ను మోసం చేశారు కదూ అంటూ అమ్మ , అక్కయ్య ప్రేమకు పరవశించిపోయి వాళ్ళతోపాటు నవ్వుకుని , అక్కయ్యకు తమ్ముడుకి అంటూ మాట్లాడుతూ అమ్మ ప్రేమతో కలిపి తినిపించింది ముద్దలతో కడుపు నిండిపోయింది .



పెద్ద గ్లాస్ నిండా అక్కయ్య నీళ్లు తాగించడం , అమ్మ తన చీరతో మూతి తుడవగానే ..........

అక్కయ్యా..........పాస్ అర్జెంట్ అంటూ బాత్రూం లోకి పరిగెత్తడం చూసి అమ్మా అక్కయ్య నవ్వుకున్నారు . చేతులు కాళ్ళు కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ బయటకువచ్చేసరికి , అక్కయ్య బెడ్ నీట్ గా పరిచి తమ్మడు నిద్రపోవడానికి రెడీ అని చూపించింది . 

అప్పుడేనా ........ఇప్పుడే కదా పడుకొనిలేచి తిన్నాము ......అని ధీర్ఘం తీస్తుంటే ,

నాకు కూడా అలానే అనిపిస్తోంది తమ్ముడూ ........., మూవీ చూద్దామా అని అడిగింది .

లవ్ యు అక్కా అంటూ ఆనందంతో వెళ్లి కౌగిలించుకున్నాను . 

నా నుదుటిపై చిరునవ్వుతో ముద్దుపెట్టి బెడ్ పై వాలిపోయి దుప్పటిలో వెచ్చగా వొదిగిపోయి చూద్దామా .........అని అడిగింది .

Wow నిద్రవస్తే అలాగే పడుకోవచ్చు అని బదులిచ్చాను . 

అవును అంటూ నన్ను బెడ్ పై కూర్చోబెట్టి టీవీ on చేసి , తమ్ముడూ ఏ మూవీ చూద్దాము అని అడిగింది .

మా అక్కయ్యకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అని బదులిచ్చాను .

అక్కయ్య చిరునవ్వుతో సీడ్ లు తిరగేస్తూ నాకోసం అన్నట్లు , తమ్ముడూ కామెడీ మూవీ ...........

అక్కయ్యా ...........నవ్వి నవ్వి నోటికీ పెయిన్ రావాలి అలాంటి మూవీ ......

ఇదిగో అంటూ చూపించి పెట్టి ,

బెడ్ పైకి చేరి తలకు ఎత్తుకు రెండు రెండు దిండ్లు ఉంచుకుని ఇద్దరమూ ప్రక్కప్రక్కనే వాలిపోయాము .

సినిమా స్టార్టింగ్ నుండే కామెడీ వలన నవ్వుతూనే ఉన్నాము . అక్కయ్యా ........ఇంతలా ఇప్పటివరకూ నవ్వలేదు లవ్ యు అంటూ అక్కయ్య చేతిని నా గుండెలపై పెట్టుకున్నాను .

ప్చ్..........అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , తమ్ముడూ థియేటర్ లో ఏదైనా సినిమా చూసావా .........., 

లేదు అక్కయ్యా ......అసలు స్టేషన్ బయటకు వెలితేనే కదా , బయటకు వెళితే ఏమౌతుందో అని స్టేషన్ లో తెలిసిన జనాలతోనే ఉండేవాణ్ణి .

తమ్ముడూ...........అంటూ ఉద్వేగంతో నా నుదుటిపై ముద్దుపెట్టి , ఇక మీ అక్కయ్య ఉందికదా ప్రపంచం అంటే ఏమిటో చూపిస్తాను అంటూ మూవీ చూడకుండా నన్నే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది .

నేను టీవీ వైపు చూస్తూ ఆపకుండా నవ్వుతూనే , అక్కయ్యా మూవీ చాలా బాగుంది చూడు అని చెప్పాను . 

 నువ్వు చూడు , నేను మాత్రం నా ఫ్రెండ్స్ చెప్పినట్లు నా ముద్దుల బుల్లి హీరోని , తన స్వచ్ఛమైన నవ్వుని చూస్తున్నాను కదా అంటూ మళ్లీ నా బుగ్గపై ముద్దుపెట్టింది .

అలా చూస్తుంటే నాకు ఏదేదో అవుతోంది అని సిగ్గుపడుతూ చెప్పాను .

ఏదేదో అంటే అంటూ నా నడుముపై గిలిగింతలు పెట్టడంతో ,

గలగలా ..........నవ్వుతూ ఎగిరిగిరిపడ్డాను .

నా బుల్లి తమ్ముడికి గిలిగింతలు ఎక్కువ అంటూ చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ పెట్టి ,  నా నవ్వులు చూసి ఆనందంతో లవ్ యు తమ్ముడూ ........ఇక ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అని నన్ను చుట్టేసి నా గుండెలపై వాలిపోయింది .

వెంటనే తలెత్తి తమ్ముడూ ...........బరువుగా ఉన్నానా , నాకు బుద్ధిలేదు అంటూ ప్రక్కకు జరుగుతుంటే , 

మా అక్కయ్య నన్ను అలా హత్తుకొని గుండెలపై వాలుంటే చాలా చాలా హాయిగా ఉంది , ఇప్పుడు ఇక్కడ నొప్పివేస్తోంది అని ఛాతీ చూపించాను .

అలా అయితే మళ్లీ వాలిపోతాను అంటూ నా గుండెలపై వాలిపోయింది .

ఆహా..........ఇప్పుడు వెచ్చగా హాయిగా ఉంది లవ్ యు అక్కయ్యా అంటూ మాట్లాడుతూ టీవీ రన్ అవుతున్నా నిద్రలోకి జారుకున్నాను . 

నా నుదుటిపై వెచ్చని ముద్దు పెట్టినట్లు , మ్మ్మ్........అంటూ మూలుగడంతో , లవ్ యు తమ్ముడూ అని అక్కయ్యా ప్రక్కన దిండుపై తలవాల్చి , రిమోట్ తో టీవీ ఆఫ్ చేసి , అప్పటివరకూ తలవాల్చిన నా గుండెలపై తియ్యని ముద్దుపెట్టి జోకొడుతూ నిద్రపోయింది.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-12-2019, 10:03 AM



Users browsing this thread: 20 Guest(s)