Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
తమ్ముడూ నెక్స్ట్ మూవీకి వెళదాము . టర్నింగ్ లో ఊరిలో ఏ సినిమాలు ఆడుతున్నాయో ప్రతి ఒక్క పోస్టర్ అతికించి ఉంటారు , నువ్వు దేనికి వెళదామంటే ఆ మూవీ చూద్దాము అని అడిగింది .

సంగీతక్క కళ్ళుమూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ , నేను తను అనుకున్న మూవీ పేరునే చెప్పాలి అని తనలో తానే మూట్లాడుతోంది .

అక్కయ్యా పోస్టర్లు చూసి అవసరం లేదు మనం సిటీలో తిరుగుతున్నప్పుడే చూసాను , నాకు స్పైడర్ మ్యాన్ చూడాలని ఉంది . వారం రోజుల ముందు రిలీజ్ అయ్యిందనుకుంటాను . రైల్వే స్టేషన్ టీవీ లలో చూసాను , మా అక్కయ్యకు కూడా ఇష్టమైతే వెళదాము అని బదులిచ్చాను .



నా మాటలను వింటూ షాక్ చెందినట్లు సునీతక్క కదలకుండా ఉండిపోయింది . డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి బాబు సూపర్ మూవీ అంట మన ఊరి స్టూడెంట్స్ మాట్లాడుతుంటే విన్నాను , సాలీడు హీరోని కొరకగానే అతడు స్పైడర్ మ్యాన్ ఆయిపోతాడంట , గ్రాఫిక్స్ అత్యద్భుతమని చెప్పారు అని ఆపకుండా మాట్లాడుతుంటే .............



సునీతక్క తేరుకుని , హీరో నువ్వు నిజంగా నా హీరోనే మూడురోజుల నుండి కాలేజ్ బంక్ కొట్టి వెళదామంటే కుదరడం లేదు థాంక్యూ soooooo మచ్ హీరో నేను ప్రార్థించింది కూడా అదే అంటూ అమాంతం నన్ను సైడ్ నుండి చుట్టేసి బుగ్గను కొరికేసినంత పనిచేసింది . డ్రైవర్ అన్నయ్య కూడా నాలానే ప్రార్థించినట్లున్నాడు ..........



అవును అమ్మగారు , మీవలన మూవీ చూడొచ్చనే ఆనందంలో అలా అంటూ సిగ్గుపడుతూ పోనిచ్చాడు . 



నా తమ్ముడి ఇష్టమే నా ఫ్రెండ్ కు కూడా కోరుకుంటోంది కాబట్టి నాకు మరింత ఇష్టంగా ఉంది తొలిసారి కార్టూన్స్ తరువాత స్పైడర్ మ్యాన్ మూవీ వచ్చింది కాబట్టి దానికే వెళదాము తమ్ముడు అంటూ నా బుగ్గలను అందుకొని నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టింది . అమ్మా మీకు అని అడిగాను , గ్రాఫిక్స్ సినిమా ఇప్పటివరకూ చూడలేదు , నా బుజ్జి వలన ఆ కోరిక కూడా తీరబోతోంది అని సిగ్గుపడుతూ బదులిచ్చింది .

వో వో.......... అంటీ మీకు కూడా కోరికలు ఉన్నాయి అంటూ సునీత అమ్మను ఆటపట్టించింది .



అమ్మగారు 15 నిమిషాల్లో గుంటూరులోని బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్ దగ్గరకు తీసుకెళతాను . రష్ ఎక్కువగా ఉంటుంది అయినా పర్లేదు లేడీస్ డైరెక్ట్ లోపలకు వెళ్లిపోవచ్చు అని చెప్పాడు . 

థియేటర్ చేరుకుని చూస్తే వీకెండ్ వలన రష్ ఎక్కువగానే ఉంది , కానీ లేడీస్ ను లోపలికి పంపిస్తుండటం చూసి వెళ్లి 5 టికెట్స్ తీసుకుని ఒకటి డ్రైవర్ కు ఇచ్చి లోపలకు వెళ్ళాము . 

అమ్మగారు నాకు ముందు ఉండి చూస్తేనే కిక్కు మాస్ అంటూ ముందు సీట్లోకి వెళ్ళిపోయాడు .

నాకు చెరొకవైపు అక్కయ్యలు , ప్రక్కనే అమ్మ కూర్చుంది . మూవీ స్టార్ట్ అవ్వగానే అక్కయ్య నా చేతిని చేతివేళ్ళతో పెనవేసి ఇంటరెస్ట్ గా చూస్తోంది . సునీత అక్కయ్య , అమ్మ అయితే మూవీ లో లీనమైపోయారు .

స్పైడర్ కొట్టడం ........స్పైడర్ మ్యాన్ లా మారడం ........హీరో తన శక్తులను టెస్ట్ చెయ్యడం ..........బిల్డింగ్ బిల్డింగ్ లు దాటుకుని వెళుతున్నప్పుడల్లా అక్కయ్య , స్పైడర్ మ్యాన్ కిందకు పడిపోతాడేమోనని నా చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని గుండెలపై హత్తుకుంటోంది . 

అక్కయ్యా ...........హీరో కదా ఏమీ కాదులే అని నవ్వుతూ ధైర్యం చెప్పడంతో , 

లవ్ యు తమ్ముడూ అంటూ నాచేతిపై ముద్దుపెట్టి నవ్వింది .



అంతలో ఇంటర్వెల్ పడటంతో అమ్మా ఇక్కడే ఉండు తమ్ముడు తినడానికి ఏమైనా తెస్తాము అని నన్ను పిలిచారు . 

అక్కయ్యా .........హోటల్ లోనే ఫుల్ అయిపోయింది లోపల కొద్దిగా కూడా ఖాళీలేదు అనిచెప్పాను . 

అయితే కూల్ డ్రింక్స్ ఒక్కటే తెద్దాము తమ్ముడూ అనిచెప్పడంతో........

దానికైతే ఫుల్ గ్యాప్ ఉంది లోపల అంటూ నవ్వుకుంటూ ముగ్గురమూ వెళ్లి తీసుకొచ్చి కూర్చోగానే మూవీ స్టార్ట్ అయ్యింది .

సెకండ్ హాఫ్ మరింత అదిరిపోయింది . చుట్టూ ఉన్న జనాలంతా విజిల్స్ వేస్తుంటే .............హీరోయిన్ ను కాపాడే scene కు అందరితోపాటు నేనుకూడా విజిల్ వేసాను .

హీరో నీకు విజిల్ వెయ్యడం వచ్చా .........ఎలాగో నాకు చూపించవా......... థియేటర్ లో వేయాలని చిన్నప్పటి నుండి కోరిక .........

అక్కయ్యా .........అంటూ అక్కవైపు చూసాను . 

నేర్పించు తమ్ముడూ లేకపోతే అది వదలదు అని నవ్వి కళ్లతో సైగచెయ్యడంతో అటువైపు తిరిగి నోటిలో వేళ్ళు ఎలా పెట్టుకుని వేయాలో చూపించాను . 

గాలిమొత్తం పీల్చి చేతులు నోట్లోకి దూర్చి విజిల్ వేసింది , మొదటిసారే థియేటర్ మొత్తం వినిపించేలా సౌండ్ రావడంతో , థాంక్స్ థాంక్యూ sooooo మచ్ హీరో అంటూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి వదిలింది .

అంతలో స్పైడర్ మ్యాన్ మేరీ జేన్ ను పైనుండి వచ్చి తను ఎవరో తెలీకుండా ముద్దు పెట్టే scene రావడంతో , థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయి కన్నార్పకుండా చూస్తున్నట్లు అనిపించింది .

అక్కయ్యలిద్దరికీ కూడా తెలిసిపోయినట్లు , అక్కయ్య సిగ్గుపడుతూ తల దించుకుంది , సునీతక్క మాత్రం నావైపు కొరుక్కుని తినేసేలా చూస్తుంటే , అక్కయ్యా ..........అంటూ చేతిని చుట్టేసాను . 

ఒసేయ్ చిన్నపిల్లాడితో ఏంటే సిగ్గులేదు నీకు అని ముసిముసినవ్వులతో చెప్పింది .

పెదవులు కలువగానే యూత్ అంతా లేచిమరీ విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లేలా చేశారు .

చూడవే దాని పవర్ ...........ఇంత వయసు వచ్చింది , ఒక్క కిస్ టేస్ట్ చేసామా ............అంతా నీవల్లే , పెళ్లి తరువాతే అన్నీ అని నన్ను కూడా ఆపుతున్నావు . 

ఆ మాటలు అమ్మ విన్నట్లు సంతోషించింది . 

హీరో ఇంతకు ముందు scene చూసావా .........అని సునీతక్క చిలిపి నవ్వుతో అడిగింది .

ఒసేయ్ నిన్నూ అంటూ అక్కయ్య , సునీతక్క తలపై మొట్టికాయ వేసి తమ్ముడూ దాని మాటలు వినద్దు నువ్వు ఇటువైపురా అని లేచి నన్ను అమ్మ ప్రక్కన కూర్చోబెట్టింది . 

అద్భుతమైన ఫైట్ తో క్లైమాక్స్ సుఖాంతం అయ్యింది . హీరో మూవీ సూపర్ కదా అంటూ నెమ్మదిగా బయటకు వచ్చేసరికి డ్రైవర్ కారుని గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు .

కారు ఎక్కగానే సమయం 5 అయ్యింది నన్ను కాలేజ్ దగ్గర వదళాలే వాసంతి ఇంటికి వెళ్లిపోవాలి అనిచెప్పింది . 

నాకు కూడా తెలుసే అంటూ కాయలేజ్ లో సునీతక్క దిగి , హీరో నీవల్ల చాలా తియ్యని గుర్తులు ఆస్వాదించి నీకు ఋణపడిపోయాను . ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చేస్తాను బై అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి కాలేజ్ నుండి స్టూడెంట్స్ ఇంటికి వెళుతుంటే సునీతక్క లోపలకు వెళ్లడం చూసి నవ్వుకున్నాము .



తమ్ముడూ ఇప్పుడు చూడు బుద్ధిమంతురాలిలా కాలేజ్ నుండి వస్తున్నట్లు ఎలావస్తుంది అని అక్కయ్యా చెప్పడం , అలాగే అక్కయ్య మిగిలిన ఫ్రెండ్స్ తో పాటు దర్జాగా బయటకు రావడం చూసి నవ్వుకున్నాము .

అందరూ కారుని చుట్టుముట్టి ఒసేయ్ ఒక్క గంట ఆగలేవా ..........ఎలా ఎంజాయ్ చేశారో ఇదిచెబుతుంటే అసూయ వచ్చేస్తోంది అంటూ అక్కయ్యపై నిందలు వేశారు .

ఒసేయ్ సునీత కంటే ముందు మీకే కాల్ చేసాను , మీకు అదృష్టం లేదు అంతే అంటూ నవ్వింది . 

ఇంతకీ మన క్యూట్ బాయ్ ఎక్కడ కారులో దాచేశావా .......మేమేమీ ఇప్పుడే ఎత్తుకెళ్లము లేవే దిగమని నువ్వే పిలుస్తావా ....... .లేక మేమే దాడి చెయ్యమంటావా అని ముందుకువస్తుంటే ,

అమ్మా తల్లులు ఆగండి మీరంతా కలిసి భయపెట్టేలా ఉన్నారే అంటూ డోర్ తీసి చెవిలో ear phones పెట్టుకుని అక్క మొబైల్ లో పాటలు వింటున్న నా బుగ్గపై ముద్దుపెట్టడంతో ,

అక్కయ్యా అంటూ మొబైల్ ప్రక్కన పెట్టాను . 

తమ్ముడూ నిన్ను వీళ్లంతా చూడాలంటున్నారు .

అక్కయ్యా.............నన్ను ఎక్కడపడితే అక్కడ గిల్లుతారు అని బదులివ్వడంతో , అమ్మతోపాటు నవ్వుకుని , తమ్ముడూ నేనున్నాను కదా అలాచేస్తే వాళ్ళను కొట్టేస్తాను అంటూ నా నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి చెయ్యి అందుకొని కిందకు దిగడం ఆలస్యం ,

హ్యాండ్సమ్ , క్యూట్ బాయ్ ,మహేష్ .............అంటూ మీదకు వస్తుంటే , అక్కయ్య నన్ను వెనుక నుండి హత్తుకొని , ఒసేయ్ మీ చేష్టలతో నా బుజ్జి తమ్ముణ్ణి ఏమైనా చేసారనుకో ఊరుకోను .

ఏమిచేస్తావే ఏమిచేస్తావే ..........అంటూ ముందు అక్కయ్యకు గిలిగింతలుపెట్టి , నన్ను తమవైపు లాగి , హీరో మమ్మల్ని ఏమిచెయ్యమంటావు నువ్వు అంత క్యూట్ గా ఉంటేనూ మాచేతులను మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటూ బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి , ఈరోజుకు మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటున్నాము అంటూ కంగారుపడుతున్న నా తలపై ఇష్టంతో స్పృశించి తమ తమ బ్యాగులలోనుండి పెద్ద పెద్ద chocolates తీసి ఇచ్చారు . 

నాపెదాలపై చిరునవ్వు చిగురించడం చూసి అక్కయ్య కూడా సంతోషించింది . 

స్కూల్ లో జాయిన్ అయ్యావట కదా రోజూ chocolates ఇస్తాము కానీ ఇంత సాఫ్ట్ గా కాదు ఎందుకంటే ఈరోజు లాగా కంత్రిల్ చేసుకోవడం మావల్ల కాదు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు . 

అక్కయ్యా .......అంటూ అందరి మధ్యలోనుండి అక్కయ్య వెనుక దాక్కున్నాను . 

ఒసేయ్ నేను కూడా ఈరోజు ఉన్నంతలా సాఫ్ట్ గా ఉండను అంటూ అక్కయ్య నవ్వుతూ వారికొక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది .

చూద్దామే ఈ యుద్ధం లో ఎవరు గెలిచి హీరోని చేజిక్కించుకుంటారో అని చెప్పడంతో లోపల ఉన్న అమ్మతోపాటు అందరూ నవ్వుకుని , ఇక వెళతాము అని అక్కయితను కౌగిలించుకుని , అక్కయ్య వెనుజ నుండి తొంగిచూస్తున్న నావైపు కన్నుకొట్టి వెళ్లిపోయారు .



నావైపు తిరిగి ఇద్దరమూ నవ్వుకుని ఎక్కి కూర్చుని అన్నా షాపింగ్ మాల్ కు వెల్లమని చెప్పింది .

నేరుగా తీసుకెళ్లి గుంటూరులోని బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ముందు కారుని ఆపాడు .

నాకు చెరొకవైపు అమ్మ అక్కయ్య చేతులను పట్టుకుని లోపల కిడ్స్ wear దగ్గరకు పిలుచుకొనివెళ్లి , సేల్స్ గర్ల్ కు నన్ను చూపించి ఇప్పటి ట్రెండ్ కు తగ్గ అన్ని డ్రెస్సెస్ చూపించండి అని చెప్పింది .

అమ్మా నువ్వు తమ్ముడికి ఏవి నచ్చితే అవి తీసుకో నేను ఆ డిస్ప్లే లో ఉంచినవి సెలెక్ట్ చేస్తాను అని సుమారు గంటసేపు సంవత్సరానికి సరిపోయే బట్టలను సెలెక్ట్ చేసాము .

నెక్స్ట్ స్కూల్ డ్రెస్సెస్ , నైట్ డ్రెస్ లు , షార్ట్స్ , చలికి జర్కిన్స్ , స్టైల్ కోసం క్యాప్స్ ........ఇలా అన్నింటినీ నాకోసం తీసుకున్నారు .

చివరన తమ్ముడూ లోచెడ్డీలు వేసుకుంటావా అని చెవిలో అడిగింది . 

నేను సిగ్గుపడుతుంటే .........

ముసిముసినవ్వులు నవ్వి , స్కూల్ కు వెళతావు కదా వేసుకో మంచిది అని బనియన్స్ మరియు చెడ్డీలను తీసుకుని ఇంకా ఇంకా అని ఆలోచించి thats it అని చెప్పడంతో కౌంటర్ కు పంపించారు . 

అక్కయ్య బిల్ పే చేసేసింది , షాప్ లో ఉన్నవాళ్లు అన్నింటినీ బయటకు తీసుకొచ్చి కారులో వెనుక ముందు సర్దేశారు . 

అక్కడి నుండి బుక్ స్టోర్ కు వెళ్లి స్కూల్ లో ఇచ్చిన లిస్ట్ ప్రకారం బ్యాగ్ బుక్స్ తీసుకుని అటునుండి foot wear కు వెళ్లి స్కూల్ కోసం షూస్ , రీబాక్ షూస్ మరియు చప్పల్స్ తీసుకుని ప్రక్కనే ఉన్న పిజ్జా కార్నర్ లో పిజ్జా తినేసి , ఐస్ క్రీమ్ షాప్ లో రెండు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ తీసుకుని కారులోకి చేరిపోయి , అన్నా ఐస్ క్రీమ్ కరిగేలోపు ఊరికి చేరిపోవాలి అని అక్కయ్య చెప్పింది . 

చూస్తారుకదా అమ్మగారు అంటూ కారుని పోనిచ్చాడు .

సిటీ దాటి చీకటిలోనే 20 నిమిషాలలో ఊరికి దగ్గరకు చేరుకున్నాము అని అక్కయ్య నన్ను హత్తుకొని నుదుటిపై ముద్దుపెట్టి చెప్పింది .

అక్కయ్యా ........ఉదయం అడుగుదామనుకున్నాను , మన ఊరి దగ్గర మాత్రం పొలాలు పండలేదు , సిటీకి దగ్గరవుతున్న కొద్దీ ఎక్కడచూసినా పచ్చదనం కనిపించింది అని అడిగాను . 

అవును తమ్ముడూ కొన్ని సంవత్సరాల క్రితం మన ఊరిలో అంతకంటే పచ్చదనం ఉండేది పంటలతో కలకలాడిపోయేవి కానీ మన వెనుక ఉన్న ఊరివాళ్ళతో గొడవలు అందుకే వాళ్ళు అక్కడ ఉన్న డ్యామ్ నుండి నీటిని మన కాలువల్లోకి వదలడం లేదు , వాళ్లకు రాజకీయంగా పలుకుబడి ఉండటంతో మన ఊరివాళ్ళు ఏమీచెయ్యలేకపోతున్నారు . 

మన తోట ఒకప్పుడు నీళ్లతో పళ్ళు కూరగాయల చెట్లతో నిండుగా ఉండేది , కానీ ఇప్పుడు ఎందుటాకులతో నిండిపోయింది , అందుకే నిన్ను తీసుకువెళ్లలేదు లేకపోతే నిన్ననే వెళ్ళేవాళ్ళము . లోపల నేను నీళ్ళల్లో స్విమ్ చేసేదాన్ని ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీరు లేదు అని బాధపడుతూ చెప్పింది . అమ్మ కళ్ళల్లో కూడా కన్నీరు కారింది.

కారు ఇంటిముందు ఆగింది , సోమయ్య పరిగెత్తుకుంటువచ్చి మొత్తం లాగేజీని డ్రైవర్ సహాయంతో లోపలపెట్టేశాడు . 



మహేష్ నీవలన స్టార్ హోటల్ లో మొదటిసారి తిన్నాను , చూడాలనుకున్న మూవీ చూసాను థాంక్స్ అని డ్రైవర్ చెప్పాడు .

అన్నయ్యా ......   మీఇంట్లో పిల్లలు ఉన్నారా ..........

నీవయసున్న ఒక తమ్ముడు ఉన్నాడు బాబు ,

తమ్ముడూ ఐస్ క్రీమే కదా అంటూ రెండింటిలో ఒకటి నాకు అందించింది . 

దానిని డ్రైవర్ అన్నకు అందించి నా ఫ్రెండ్ కు ఇవ్వండి అని బై చెప్పి , అక్కయ్య దగ్గరకు వచ్చి లవ్ యు అక్కయ్యా .........అంటూ సంతోషంతో చేతినిపట్టుకొని లోపలకువెళ్లాము .



తల్లి , బుజ్జి మీరు ఫ్రెష్ అయ్యి రండి అంతలోపు వంట వండేస్తాను అని అమ్మ నా నుదుటిపై ముద్దుపెట్టి చెప్పింది . 

అమ్మా పిజ్జా తో నా కడుపు నిండిపోయింది ..........

కొద్దిగానే కదా బుజ్జి తినింది , నిద్ర సరిగ్గా పట్టదు . నాచేతులతో ప్రేమతో తినిపిస్తాను అనిచెప్పింది. 

మా అమ్మ తినిపిస్తానంటే నేనొద్దంటానా అలాగే అమ్మా అంటూ అక్కయ్యను లాక్కుంటూ పైకి వెళ్ళాము. ఇద్దరమూ అలసిపోయినట్లు సోఫాలో వాలిపోయి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము . 



తమ్ముడూ నైట్ డ్రెస్ వేసుకో కంఫర్ట్ ఉంటుంది , కింద నుండి తీసుకొస్తాను అంతలోపు నువ్వు ఫేస్ వాష్ చేసుకో అనిచెప్పడంతో ,

సరే అక్కా అంటూ బాత్రూమ్లోకివెళ్లి టాయిలెట్ పోసి ముఖం కడుక్కుని తుడుచుకుంటూ బయటకు వచ్చాను . అక్కయ్య బట్టలను బెడ్ పై ఉంచి తనుకూడా బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ లో వచ్చింది . 

అవునక్కా హాయిగా ఉంది అంటూ కిందకు వెళ్లి వంట గదిలో అమ్మతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ , వంట అవ్వగానే అమ్మచేతి ముద్దలు తిని గుడ్ నైట్ కిస్ అందుకొని ,మనసారా అమ్మను హత్తుకొని అక్కయ్య చేతిని అందుకొని పైకివెళ్లి , నిన్నలానే టీవీ చూస్తూ అక్కయ్య ప్రాణమైన వెచ్చటి ముద్దుల్లో తడుస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-12-2019, 10:05 AM



Users browsing this thread: 53 Guest(s)