Thread Rating:
  • 9 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఖర్కోటఖుడు by Naresh2706
#23
రెండు నిమిషాలకి లోపలనుంచి నల్లటి కుర్తా, తెల్లటి ప్యాంటు, తోలు చెప్పులు, మెళ్ళో గొలుసు, నోట్లో కిళ్ళీ, ఎర్రటి బొట్టుతో ఒక 50 సంవత్సరాల గంగాదాస్ నడుచుకుంటూ వచ్చాడు.

ఈ వయసులో కూడా కరుకైన రాయిలా ఉన్నాడు.
"ఎవరు సాబ్ మీరు?" సౌమ్యంగానే అడిగాడు హార్ధిక్ ఎదురుగా కూర్చుంటూ.
"నేను హార్ధిక్ ఠాగూర్, సౌరవ్ ఠాగూర్ కొడుకుని." చెప్పాడు హార్ధిక్.
"ఠాగూర్ అంటే ఆ కంపెనీ?..." అంటూ సాగదీస్తున్నాడు గంగాదాస్. అతనికి నమ్మకం కలగట్లేదు. తనతో వాళ్ళకి పని ఎందుకు ఉంటుంది అనే అనుమానంతో.
"అవును ఆ కంపెనీలు అన్నీ మావే" అన్నాడు హార్ధిక్ అతని మనసులో అనుమానం కనిపెట్టి.
"చెప్పండి సాబ్ నాతో పని ఏంటి?"
"ఏముంటుంది? నువ్వు చేసే పనే"
"అంటే?" అర్థం కానట్టుగా అడిగాడు గంగాదాస్.
"ఏం లేదు నీ మనుషులు ఒక పదిమంది నాకు కొన్ని రోజులు కావాలి" సిగరెట్ ముట్టించుకుంటూ చెప్పాడు.
మళ్ళీ హార్ధిక్ చెప్తూ "ఈ కొన్ని రోజులూ నేను చంపమంటే చంపాలి, చావమంటే చావాలి. నీకు కోటి రూపాయలు ఇస్తాను. మనిషి చస్తే మనిషికి 10లక్షలు ఇస్తాను. ఏమంటావ్?" అన్నాడు హార్ధిక్ కాలు మీద కాలు వేసుకుని దమ్ము బలంగా లోపలికి లాగి వదులుతూ.
గంగాదాస్ కి నమ్మశక్యంగా లేదు. ఒకేసారి ఇంత భారీ మొత్తం జీవితంలో ఇదే మొదటిసారి. ఆనందంగా " మీ ఇష్టం సాబ్ మీరు ఎలా అంటే అలా. మీకు ఎవరు కావాలో తీసుకోండి"
"నీ మనుషుల్లో భయం అంటే తెలీని వాళ్ళు, ఇది తప్పు ఇది ఒప్పు అనే విచక్షణా జ్ఞానం లేనివాళ్ళు, ఎంతటి దెబ్బకి అయినా సరే తట్టుకునే వాళ్ళు, కనీసం ఒక ఐదుగురిని ఒకేసారి వచ్చినా నిలువరించేవాళ్ళు, వేగంగా కదిలే మనుషులు ఒక పదిమంది కావాలి"
గంగాదాస్ ఒక్క క్షణం ఆలోచించి "అలాంటి వాళ్ళు ఉన్నారు సాబ్. కానీ మీరు వాళ్ళని పెట్టే చోట ఆడపిల్ల ఉండకూడదు. రాత్రిళ్ళు పడుకున్నాక వాళ్ళని బంధించి ఉంచాలి. వాళ్ళకి తిండికి, మందుకి లోటు చెయ్యకూడదు. వాళ్ళకి చీకటి పడ్డాక అమ్మాయి పొందు కావాలి. కానీ బాగా అలవాటు ఉంటే తప్ప వాళ్ళని తట్టుకోవడం కష్టం. మా గూట్లో 15 మంది వరకు వాళ్ళ పోటుకి చచ్చిపోయారు" అన్నాడు లోగొంతుకతో.
హార్ధిక్ కళ్ళు ఆశ్చర్యం కలగలిపిన ఆనందంతో ఒక్క క్షణం మెరిసాయి. "ఏరీ? ఎక్కడ ఉన్నారు?" అన్నాడు ఒక రకమైన కుతూహలంతో.
గంగాదాస్ ఒకసారి తల ఆడించి పక్కనున్న అనుచరుడుకి సైగ చేసాడు.
అప్పటి వరకు అక్కడ పని చేస్తున్న ఆడవాళ్ళు తమ తమ వస్తువులు తీసుకుని పరుగుపరుగున లోపలికి వెళ్ళిపోయారు.
లోపలనుంచి ఒక 20 నుంచి 22 సంవత్సరాల లోపు కుర్రాళ్ళు
ఒక పదిమంది వచ్చి నిలబడ్డారు.
పెద్ద పొడుగు లేరు, లావు కూడా అంతంత మాత్రమే, కానీ ధృఢంగా ఉన్నారు. బట్టలు, జుట్టు దుమ్ము పట్టి ఉంది. నడుముకు మెలి తిరిగిన కొడవలి లాంటి కత్తి ఒకటి వేలాడుతుంది.
వాళ్ళ కళ్ళు మాత్రం చాలా చురుకుగా ఉన్నాయి. వాళ్ళ కళ్ళు చూసి ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది హార్ధిక్ కి. అంత పదునుగా ఉన్నాయి వాళ్ళ చూపులు.
"ఇంత చిన్న పిల్లలా?" అనుమానంగా అడిగాడు హార్ధిక్.
"అనుమానం వద్దు సాబ్. ఒక్కొక్కరు 10మందిని అయినా నిమిషాల్లో మట్టి కరిపిస్తారు. ఒక్కసారి అటు చూడండి" అంటూ వాళ్ళకి సైగ చేసాడు.
వాళ్ళు ఎదురుగా ఉన్న 30 అడుగుల చెట్టుని ఉత్తి చేతి సాయంతో అరక్షణంలో ఎక్కి అక్కడి నుంచి అమాంతం ఉరికేసారు. ఆశ్చర్యం వాళ్ళకి చిన్న గీత కూడా పడలేదు.
"చూసారు కదా సాబ్? వీళ్ళని చిన్నప్పుడే అడవినుంచి ఎత్తుకొచ్చాను. కానీ వీళ్ళు వీళ్ళ అడవి బుద్దిని మాత్రం వదిలిపెట్టలేదు. అందుకే వీళ్ళని రాత్రిపూట హత్యలకు ఉపయోగిస్తాను. మనిషి ఎవరైనా ఎంతమంది అడ్డున్నా పని పూర్తి చేసుకొస్తారు. తుపాకీ గుళ్ళు కూడా వీళ్ళను తాకడం కష్టమే" అన్నాడు.
"సరే వీళ్ళు మొత్తం ఎంత మంది ఉన్నారు?"
"12మంది సాబ్.. మొన్నే ఒకడు చచ్చిపోయాడు"
"మరి ఇంకొకడు ఎక్కడ?"
"అమ్మో వద్దు సాబ్.. వాడే ఇంకొకడ్ని చంపేశాడు. ఈ పులుల్ని పక్కన పెట్టుకోవడం ప్రమాదకరం సాబ్."
"వాళ్ళు పులులైతే నేను రింగ్ మాస్టర్ ని కానీ.. వెళ్ళి వాడ్ని కూడా తీసుకురా"
"సాబ్ రింగ్ మాస్టర్ మాట వినడానికి వాడు పులి కాదు సాబ్ తోడేలు. జరంత నా మాట వినండి" భయంతో చెప్పాడు గంగాదాస్.
"గంగాదాస్.. చెప్తున్నా కదా? ఏం పర్లేదు. తీసుకురా"
"మీ ఇష్టం సాబ్. మీ మంచి కోసం చెప్పాను." అని వాళ్ళలో ఒకడివైపు తిరిగి "రేయ్ సుల్తాన్.. ఆ బద్మాష్ టూటూ గాడ్ని పిలువు బే" అన్నాడు అరచినట్టుగా.
ఒక పది నిముషాలకి గేట్ కిర్రుమని ఓపెన్ అయ్యింది. అందరూ నిశ్శబ్దంగా అటువైపు చూస్తున్నారు. ఒక చామనఛాయలో ఉన్న 22 సంవత్సరాల కుర్రాడు ఉక్కు మనిషిలా ఉన్నాడు. నడుస్తూ వస్తున్న ఆ కుర్రాడు ఒక్క క్షణంలో మాయమయ్యాడు. తలతిప్పి చూసేలోపు ఆ వరుసలో నిలబడ్డ ఒకడి పళ్ళు సెట్టు మొత్తం నేల మీద ఉంది.
"అమ్మా.." అని మెడ విరిగిన బాధతో ఒకడు నేల మీద పడిపోయాడు.
వెంటనే గంగాదాస్ కోపంగా "రేయ్ టూటూ.. ఏంటి బే. ఏం చేస్తున్నావ్" అని అరిచాడు కోపంగా.
"క్షమించు బాబా.. నిన్న మందు అయిపోయిందని వెళ్ళిపోయాడు. ఎంత పిలిచినా వినిపించుకోలేదు వీడు" అన్నాడు తల వంచుకుని టూటూ.
"చూసావా సాబ్? వీడికి పిచ్చి కోపం. వీడు ఒక్కడే ఈ పదిమందిని చంపేయ్యగలడు. అందుకే వద్దు అంటున్నా"
"పర్లేదు దాస్. వీడు నాకు పర్సనల్ బాడీ గార్డుగా ఉంటాడు." అంటూ టూటూని దగ్గరకు రమ్మని పిలిచాడు. కానీ టూటూ వెనక్కి వెనక్కి వెళ్ళిపోయాడు.
"సరే నేను వీళ్ళని తీసుకువెళ్తాను. పంపించు" అన్నాడు హార్ధిక్ బాక్స్ లోంచి చెక్ బుక్ తీసి కోటి రూపాయలకు చెక్ రాసి ఇస్తూ.
 
"రేయ్ ఇక నుంచి కొన్ని రోజులు ఈ సాబ్ తో ఉండాలి. ఏం చెప్పినా చెయ్యాలి. పని పూర్తి చేసుకుని తొందరగా వచ్చెయ్యండి. మీకు ఏం కావాలన్నా సాబ్ చూసుకుంటాడు. సాబ్ ఏం చెప్తే అది చెయ్యండి. అర్థమయ్యిందా?" అన్నాడు.
అందరూ బుద్దిగా తలూపారు. హార్ధిక్ కాల్ చేసి వాన్ ని రమ్మన్నాడు.
హార్ధిక్ వీళ్ళని తీసుకుని కార్ దగ్గరకి వచ్చే సరికి వాన్ వచ్చి ఆగింది.
వాళ్ళని వాన్ లో ఎక్కించి తన ప్యాలస్ కి బయలుదేరాడు.
ఇంటికి వచ్చే సరికి హాథీ ఇంటి దగ్గర ఉన్నాడు.
"ఎక్కడున్నాడు?" అడిగాడు హార్ధిక్.
"అక్కడే ఉన్నాడు. కానీ చుట్టూ సెక్యూరిటీ ఎక్కువగా ఉంది."
"సరే బయట వాన్ లో ఉన్నవాళ్ళకి వాడి ఫోటో, ప్లేస్ చూపించు. వాళ్ళు చూసుకుంటారు"
"ఓకే సర్" అని అక్కడి నుంచి బయటకు నడిచాడు హాథీ.
ఇంతలో హార్ధిక్ సీక్రెట్ బ్లాక్ బెర్రీ ఫోన్ రింగయ్యింది.
డాడ్ ఏమో అని చూసుకున్నాడు. కానీ ఏదో కొత్త నెంబర్.
ఎవరిదో అని లిఫ్ట్ చేసి "హలో" అన్నాడు.
"హెలో హార్ధిక్?" అవతలి వ్యక్తి కంఠం.
"హా.." అన్నాడు అప్రయత్నంగా.
"నేను మల్హోత్రాని" మల్హోత్రా కంఠం కంగారుగా పలికింది. "చెప్పండి. ఏమైంది?" అడిగాడు హార్ధిక్.
మల్హోత్రా చెప్పడం మొదలెట్టాడు.
 
###########
 
ఉదయం తన గుడిసెలో నిద్ర లేచాడు మల్హోత్రా..
చాలా కాలం తర్వాత ఒక వింతైన ఉదయాన్ని చూస్తున్నాడు. తన చిన్నతనంలో తనకి బాగా పరిచయమైన ఉదయం.
కళ్ళు తెరవగానే ఎదురుగా పెద్ద చెట్టు. దాని మీద వాలుతూ ఎగురుతూ ఆహార వేటకు వెళ్తున్న పక్షులు.
ఎరుపు రంగుకు నిర్వచనం ఇస్తూ మెల్లిగా ఉదయిస్తున్న పెద్ద సూర్యుడు..
ప్రకృతి ఎంత అందంగా ఉంది?
మనం ఎందుకు ఈ అందాన్ని ఆస్వాదించలేక కాంక్రీట్ అడవులలో మృగాల్లా ఎంతకీ తనివితీరని ఆకలితో కొట్టుమిట్టాడుతున్నాం.
అయినా తనకి జీవితం విలువ తెలిసింది కాబట్టి ఇప్పుడు అర్థం అవుతుంది.
కానీ ఇవన్నీ ఆలోచించేదెవరు?
లేచి ఒక వేప పుల్ల తీసుకుని దంతావధానం ముగించాడు.
ఎదురుగా ఉన్న ఒక టీ కొట్లో కూర్చుని వాడు ఇచ్చిన మల్లెపూలవంటి తెల్లని ఇడ్లీలు నాలుగు పొగలు కక్కుతుండగా కమ్మటి చెట్నీలో అద్ది కడుపులో వేసుకున్నాడు.
ఒక్కసారిగా ఏదో తెలియని ఒక మధురానుభూతిని పొందుతూ ఇలాంటి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటే చాలు కదా అనిపించింది.
"ఎవరు బాబూ నువ్వు?" అంటూ ఒక ఆత్మీయమైన పలకరింపుతో ఒక ముసలాయన వెనకనుంచి భుజం మీద చెయ్యి వేసాడు.
వెనక్కి తిరగ్గానే రహీం చాచా..
"రహీం చాచా?" అంటూ అలాగే పొదివి పట్టుకుని వెచ్చని కన్నీళ్లు చెంపల నుంచి కారుతుంటే "నేను చాచా.. మల్హోత్రాని. రిజ్వానా అక్కతో ఆడుకునే వాడ్ని. గుర్తు పట్టావా?" అన్నాడు.
"బేటా ఎందుకు గుర్తు లేవు.. నీకు ఇష్టమైన మిఠాయి ఇస్తాను తింటావా?" అంటూ చెయ్యి పట్టి తీసుకుపోయాడు.
మల్హోత్రా రహీం వెనకాలే నడుస్తున్నాడు.
కొంత దూరం వెళ్ళాక అక్కడ ఎవరూ లేరని నిర్దారించుకుని సర్రున పక్కకు లాక్కుపోయాడు.
"ఏమైంది చాచా?" అన్నాడు మల్హోత్రా అయోమయంగా.
"బేటా రెండు రోజుల క్రితం ఇక్కడికి ఎవరో వచ్చారు. నీ పేరు చెప్పి నీ కోసం వాకబు చేశారు. ఎవరూ తెలీదు అనేసరికి ఇది నీ స్వస్థలం అని ఇక్కడికి వస్తే ఫోన్ చెయ్యమని నంబర్, నీ ఫోటో ఇచ్చి వెళ్ళారు. ఈ పాటికి నీ గురించి తెలిసిపోయి ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో" కంగారుగా చెప్తున్నాడు రహీం చాచా.
ఇంతలో దూరం నుంచి టొర్నాడో వస్తున్నట్టు దుమ్ము గాలిలోకి ఎగసిపడుతుంది.
"వౄమ్.. వ్రు........ మ్" అంటూ కార్లు దూసుకొస్తున్నాయి..
రహీం చాచా తన గదిలోకి తీసుకుపోయి దాచేసాడు. బయటకి వచ్చి షాప్ లో కూర్చున్నాడు.
కార్లు సర్రుమని బ్రేక్ కొట్టి సెంటర్ లో ఆగాయి.
వాళ్ళని అక్కడ ఉండే గురునాథ్ సింగ్ అనే వ్యక్తి వచ్చి కలిసాడు.
"ఎక్కడ ఉన్నాడు?" అని అడిగాడు అక్కడకి వచ్చిన వాళ్ళ నాయకుడు.
అక్కడ దగ్గర్లో ఉన్న గుడిసె చూపించాడు సింగ్.
లోపలికి వెళ్ళి మొత్తం వెతికారు.
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ఖర్కోటఖుడు by Naresh2706 - by sarit11 - 26-11-2018, 01:47 PM



Users browsing this thread: 1 Guest(s)