Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ప్రక్కన అక్కయ్య స్పర్శ తగలకపోవడంతో అక్కయ్యా అక్కయ్యా ..........అంటూ బెడ్ పై చేతులతో తాకి కళ్ళుతెరిచాను .

తమ్ముడూ సర్ప్రైజ్ అని సునీతక్క వొంగి బుగ్గపై ముద్దుపెట్టింది . 

అక్కయ్యా ..........నిజంగా మీరేనా నమ్మలేకపోతున్నాను అని లేచి గుడ్ మార్నింగ్ చెప్పాను . 

నా ముద్దుల తమ్ముడు కాదు కాదు గురువు కోసం తెల్లవారుఘామునే వచ్చేసాను అని ఇద్దరమూ కిందకువచ్చాము . 

అప్పటికే కృష్ణగాడువచ్చి బూస్ట్ తాగుతూ టీవీ లో క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాడు . అమ్మా అక్కయ్య తోటకు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేస్తూ , తల్లీ సునీత బూస్ట్ కలిపి నీ తమ్ముడికి నీచేతులతో తాగించు అని అమ్మ చెప్పగానే ,



సునీతక్క ఆనందానికి అంతులేనట్లు లవ్ యు అమ్మా అని సైడ్ నుండి గట్టిగా హత్తుకొని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి వదిలి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి బూస్ట్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి తాగించింది . 

నాన్నా ............బాత్రూం కు వెళ్లాలంటే వెళ్ళిరా తోటకు వెళుతున్నాము స్నానం అక్కడే అని అమ్మ చెప్పడంతో , అమ్మ రూంలోకివెళ్లి రాగానే రెండు స్కూటీలలో సునీతక్క పిల్లలను మరియు ముందు బ్యాగుతో బయలుదేరి 5 నిమిషాలలో చేరుకున్నాము .



గేట్ తీసుకుని లోపలకి వెళ్ళగానే సునీతక్క సంతోషమైన ఆశ్చర్యంతో ఒసేయ్ కొన్ని నెలల ముందు వచ్చాము మొత్తం ఎందుటాకులతో ఉండేది . ఇప్పుడు ఎటుచూసినా పచ్చదనం , నీడ చాలా చాలా అందంగా ఉంది అని చూసి పరవశించిపోతోంది .

ఈ తోట మాత్రమే కాదు అక్కా ...........ఊరిచుట్టూ ఉన్న పంట పొలాలు చూశారుకదా ఎంత పచ్చగా కళకళలాడుతున్నాయో అంతా నా ప్రాణం స్నేహాతుడి వల్లనే అని కృష్ణగాడు గర్వపడుతూ చెప్పాడు . 

అందుకే కదా కృష్ణ ఊరందరికీ బుజ్జి దేవుడు అయ్యాడు అని నాముందు మోకాళ్లపై కూర్చుని ప్రేమతో హత్తుకొని , తమ్ముడూ అందరికీ అన్నీ చేసావు నాకు కూడా ఈత నేర్పిస్తావా అని అడిగింది . 

అలాగే అక్కయ్యా అని చెప్పడం , కృష్ణగాడు మునగ కొమ్మలను రెడీ చెయ్యడం , అక్కయ్య సునీతక్కను తొట్టెమీదకు పిలుచుకొనివెళ్లి ఫస్ట్ రూల్ భయపడకూడదు అని ఒక్కసారిగా నీళ్ళల్లోకి తోసేసి వెనుకే నీళ్ళల్లోకి చేరిపోయింది . 



ఒసేయ్ ఒసేయ్ అమ్మా అమ్మా ...........అని నీళ్ళల్లోనుండి పైకిలేచి ప్రక్కనే నవ్వుతున్న అక్కయ్యను గట్టిగా కౌగిలించుకుంది . 

ఇక్కడే ఉన్నామే చూడు చూడు అంటూ అమ్మ మాఇద్దరినీ చూపించి మొదటిరోజు తమ్ముడుకూడా నన్ను ఇలానే నీళ్ళల్లోకి తోసేశాడు అని నవ్వి తమ్ముడూ దీనికి కట్టండి అని చెప్పింది . 

మెట్లమీదకు వెళ్లి సునీతక్కను కూర్చోబెట్టి కొమ్మలను కట్టి అన్ని జాగ్రత్తలు చెప్పి నీళ్ళల్లోకి పిలుచుకునివేళ్ళగానే తెలిపోవడంతో సునీతక్క సంతోషంతో అక్కయ్య ప్రక్కనే చేతులు కాళ్ళు ఆడించడం మొదలెట్టింది . 

గంట తరువాత టిఫిన్ చేసాము . మళ్లీ కాసేపు రెస్ట్ తీసుకున్న తరువాత నీళ్ళల్లోకి వెళ్లబోతోంటే మా తోటను ఆనుకుని అటువైపు నుండి పెద్దగా మంట దానివలన పొగ రావడం చూసి కంగారుపడేంతలో కృష్ణగాడు వెళ్లివచ్చి ఏమీలేదురా ప్రక్క తోటవాళ్ళు వేస్ట్ అంతా మంటపెట్టారు అంతే అని చెప్పడం , పొగ కూడా గాలికి అటువైపే వెళ్తుండటంతో మేము నీళ్ళల్లో ఎంజాయ్ చెయ్యసాగాము.



12 గంటలకు తోట గేట్ దగ్గర స్కూటీ హార్న్ చప్పుడు వినిపించడంతో చూస్తే కాంచన అక్క .

వచ్చేసిందా ఇది స్కూటీ ఎవరిదో ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చోలేదా అని సునీతక్క చిరుకోపంతో మాట్లాడుతుంటే , 

అక్కయ్యతోపాటు నవ్వుకుని నీళ్ళల్లోనుండి పరుగునవెళ్లి గేట్ తెరిచాను . 

తమ్ముడూ ........... అని సంతోషంతో పలకరించి , ఒసేయ్ సునీత నీ స్కూటీ లేకపోతే రాలేననుకున్నావు కదూ , తమ్ముడిని కలవడానికి వెళుతున్నాను బస్ ఇంకా గంట ఆలస్యం అన్నాను అంతే ఊర్లో ఉన్న స్కూటీలన్నీ మాఇంటి ముందు ఉంచారు , అదీ మా తమ్ముడి గొప్పదనం అని నా బుగ్గపై ముద్దుపెట్టి , నైట్ డ్రెస్ తీసుకుని గుడిసెలోకివెళ్లి మార్చుకునివచ్చి నీళ్ళల్లోకి ఎగిరి దుంకేసింది . రావే రావే అంటూ అందరిలో మరింత ఉత్సాహం తీసుకొచ్చారు.

ఒంటి గంటవరకూ నీళ్ళల్లో ఎంజాయ్ చేశాక అమ్మ భోజనానికి పిలవడంతో అందరమూ కాసేపు ఎండలో డ్రై అయ్యి చెట్టు నీడలో అమ్మదగ్గరికి చేరిపోయాము . 

అమ్మ అందరికీ వడ్డించడం నాకు తినిపించి వాళ్ళు తిని , 



వాసంతి నాకు తోట మొత్తం పచ్చదనం పూల అందాలు చూడాలని ఉంది అని సునీతక్క కోరడంతో అక్కయ్యలు లేచారు . 

తల్లులూ ............ ముల్లులు ఉంటాయి చెప్పులు వేసుకునివెళ్లండి అక్కడక్కడా చిన్న చిన్న గుంతలు ఉంటాయి జాగ్రత్త అని పాత్రలన్నీ సర్దుతుంటే , 

అమ్మా మేంఉన్నాముకదా అక్కయ్యల ముందు ముందు నడిచి పూలదారిని వేస్తాము అని అలాగే చేస్తూ ముందుకువెళ్లాము .



తోటను మొత్తం వీక్షిస్తూ మాట్లాడుకుంటూ నవ్వుతూ తోట అటు చివరకు చేరుకున్నాము . 

మా తోటను అనుకునే అటువైపు మంటలు దానివలన అటువైపు ఉన్న పురుగు పుట్ర మా తోటలోకి వస్తుండటం కనిపిస్తోంది . 

అక్కయ్య ఆపి ఇంతటితో చాలు వెనక్కు వెళదాము అని అక్కయ్య చెప్పింది . 

ఒసేయ్ ఒసేయ్ ఇప్పటివరకూ చూసింది ఒక ఎత్తు అక్కడ చూడు గులాబీ పూలతో ఉన్న మొక్కలు వాటిని దగ్గరకువెళ్లి చూడకపోతే ఎలానే please please వెళ్లి చూసి వచ్చేద్దాము అన్నారు . 

వద్దే సునీత అక్కడ ఎంత గుబురుగుబురుగా ఉందొ చూడు ఏమైనా చేరుకుని ఉంటాయి , నెక్స్ట్ టైం వచ్చేముందు మొత్తం శుభ్రం చేయిస్తాను నీఇష్టం ఒకరోజంతా అక్కడే ఉండు అని బదులిచ్చింది అక్కయ్య .

అవునే సునీత నువ్వు పట్నం లో ఉంటావు పల్లెటూళ్ళల్లో తోటల్లో పొలాల్లో తేళ్లు పాములు చేరుకుని ఉంటాయి , అందులోనూ దూరంలో మంటలు కాబట్టి అటువైపువన్నీ ఇటు చేరుకుని ఉంటాయి అని కాంచన అక్క కూడా బ్రతిమాలుతోంది.



నేను కృష్ణగాడు ప్రక్కనే దిగబడిన కొమ్ములు నుండి పళ్ళను పీకడానికి ఎగిరెగిరి try చేస్తున్నాము .

ఒసేయ్ మీకు భయమేస్తే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి పూలను పీక్కుని వచ్చేస్తాను అని సునీతక్క వెళుతోంటే , 

ఒసేయ్ వద్దే మా మాట వినవా అని అక్కయ్య ప్రేమతో చెయ్యిపట్టుకొని వారించింది .

Please please వాసంతి అంత అందమైన వాటిని చూస్తూ ఆగిపోవడం నావల్ల కావడం లేదు , మీరు ఇంతలా చెబుతున్నారు కాబట్టి ఇలా వెళ్లి ఒకే ఒక గులాబీ పువ్వుని కోసుకుని అలా వచ్చేస్తాను అని అక్కయ్య చేతిపై ముద్దుపెట్టడంతో ,

మా మాట వినవుకాదూ అని అక్కయ్య నవ్వడంతో ,

లవ్ యు రా ...........అని మందంగా పడిన ఎండిన ఆకులు , అలుములపై అడుగులో అడుగు వేసుకుంటూ ఎలాగోలా మొదటి గులాబీ మొక్క దగ్గరకు చేరుకుంది .

ఒసేయ్ ఇంకా ముందుకు వెళ్లకు అని అక్కయ్యలు కంగారుపడుతూ సునీతక్క వైపే చూస్తున్నారు . 

లేదు లేవే , wow ఎంత అందంగా ఉన్నాయి పూలు అని కోసుకోబోయి గులాబీ ముళ్ళు గుచ్చుకుని స్స్స్.........అని చేతిని వెనక్కు తీసుకోవడం చూసి ,

సునీత జాగ్రత్త అని అక్కయ్య అడుగువెయ్యబోతోంటే , 

గులాబీ ముళ్ళు లేవే అక్కడే ఉండు ఈ పువ్వు కోసుకుని నేనే వచ్చేస్తాను అని వేలిపై కారుతున్న రక్తాన్ని నోటిలోకి తీసుకుని ఆపి , నాకే గుచ్చుకుంటావా పువ్వు కోసుకునికానీ ఇక్కడ నుండి కదలను అని కోపంతో మొక్క మొత్తాన్ని కదిలిస్తూ ఎలాగోలా కష్టపడి పువ్వుని చేతిలోకి తీసుకుని , I got it అని అక్కయ్యలకు చిరునవ్వులు చిందిస్తూ చూపిస్తోంది . 



OK ok ఇక వచ్చెయ్యవే అని అక్కయ్యలు ప్రేమతో పిలిచారు . 

మరొక్కటి అని వద్దన్నా వెనుతిరిగి గుబురుని కదిలిస్తూ పీకుతోంటే స్స్స్ స్స్స్ ....... అన్న చప్పుడుకు ఎగురుతున్న వాడిని ఆగి చుట్టూ చూస్తూ , గులాబీ మొక్కల గుబురుదగ్గర సునీతక్కయ్య కాళిపై ఏక్షణమైనా కాటు వేయడానికి పడగెత్తిని పాముని చూసి ముందూ వెనుకా చూడకుండా అక్కయ్యా కదలకు అని ఏకాగ్రతతో పామువైపే చూస్తూ పరుగుపెట్టాను .

సరిగ్గా అక్కయ్య కాలిపైకి కాటువెయ్యబోతుంటే అక్కయ్యా ..........అంటూ దూరం నుండే జంప్ చేసి కాలిపై చేతిని అడ్డుపెట్టడం మణికట్టుకు కాస్తపైన కాటువేసింది . నొప్పికి అమ్మా అని దూరంలో ఉన్న అమ్మకు వినిపించేలా కేకేవేశాను . 

తమ్ముడూ అని అక్కయ్యలు , రేయ్ అంటూ కృష్ణగాడు మావైపు పరుగున వస్తుంటే , 

 అది అంతటితో ఆగక మళ్లీ అక్కయ్యకు కాటువెయ్యబోతే ఎక్కడి నుండి వచ్చిందో అంత ధైర్యం ఏకంగా పాము తలను పట్టుకునిబయటకు లాగి దూరం విసిరాను .

మళ్లీ అది అక్కయ్యలవైపు రావడం చూసి , వాసంతి విషం పాము అని భయపెడుతుంటే , కృష్ణగాడు అంతే ధైర్యంతో తోక పట్టుకుని ఎత్తెత్తి కుక్కి దూరం విసిరేశాడు . మత్తెక్కినట్లు పాము కదలకుండా ఉండిపోయింది . 



 అక్కయ్యా పాదంపై ఏమైనా కాటువేసిందేమో అని చూస్తుంటే , సునీతక్క షాక్ నుండి తేరుకుని తమ్ముడూ అని కింద కూర్చుని కాట్లు చూసి మరింత భయంతో వాసంతి తమ్ముడికి పాము కరిచింది అని ముఖం మొత్తం చెమటతో నన్ను తన గుండెలపై హత్తుకుని , తమ్ముడూ మేంఉన్నాము కదా నీకేమి కాదు , నాకోసం ఈ అక్కయ్య కోసం ప్రాణాలకు తెగించావా అని కళ్ళల్లో నీళ్లతో బాధపడుతోంది .

అక్కయ్య గుండె అయితే కొన్నిక్షణాలు ఆగిపోయినట్లు కళ్ళల్లోనుండి ఏకధాటిగా కన్నీళ్లను కారుస్తూ చేతివైపు నోటివెంట త ........తమ్ము..........అని భయంతో వణుకుతోంది .

కాటువేసినది చాలా అపాయాయమైన అత్యంత విషం గల పాము వాసంతి , విషం వొళ్ళంతా పాకక ముందే నోటితో లాగేయ్యాలి అని కాంచన అక్క మాట పూర్తవ్వకముందే అక్కయ్య నోటితో రక్తాన్ని లాగేసి లాగేసి బయటకు ఉమ్ముతోంది .



నాకేక విని అమ్మ కంగారుపడుతూ పరుగునవచ్చి మమ్మల్ని అలాచూసి తల్లి నా ప్రాణం కు ఏమైంది అని విషయం తెలుసుకుని కళ్ళల్లో నీళ్లతో నాన్నా ......... అని గుండెలపైకి తీసుకుని తడబడుతున్న మాటతో మేమంతా ఉన్నాముకదా ఏమీ కాదు ఏమీ కాదు అని నా ముఖంపై చెమటను తుడుస్తోంది . 

స్పృహ కోల్పోయేలోపు డాక్టర్ దగ్గరికివెళ్లాలి స్కూటీ తీసుకొస్తాను అని కాంచన అక్క పరుగుతీయడంతో వెనుకే సునీతక్క వెళ్లారు . 



 అమ్మా , అక్కయ్యా .............నా......కు మీతో......నే ఉండాలని ఉంది అని మూతలుపడుతున్న కళ్ళతో అమ్మను గట్టిగా హత్తుకున్నాను .

 తల్లీ త్వరగా త్వరగా అని చెబుతోంటే అక్కయ్య గట్టిగా లాగేస్తోంది .

నాన్నా ........నీకేమి కాదు మాప్రాణాలిచ్చయినా కాపాడుకుంటాము అని కళ్ళల్లో నీళ్లతో చెప్పి నుదుటిపై పెదాలను తాకించింది .



వాసంతి తమ్ముడిని తొందరగా తీసుకురా అని కాంచన అక్క స్కూటీని అటువైపు తిప్పి స్టార్ట్ లోనే పిలిచింది .

నా బరువును కూడా లెక్కచేయకుండా అమ్మఒడిలోని నన్ను అక్కయ్య అమాంతం ఎత్తుకుని పరుగున కాంచన అక్కయ్య వెనుక కూర్చుని నన్ను గుండెలపై హత్తుకుని తొందరగా పోనియ్యవే అని ఏడుస్తున్న స్వరంతో చెప్పింది . 

జాగ్రత్తగా పట్టుకో వేగంగా పోనిస్తాను అని గేట్ వరకూ జాగ్రత్తగా పోనిచ్చి రోడ్ మీదకు చేరుకోగానే టౌన్ వైపు వేగం పెంచింది .

అమ్మా రండి అని సునీతక్క స్కూటీలో ఎక్కించుకుని తమ్ముడూ అని కృష్ణను పిలిచారు .

అక్కయ్యా ..........మీరు తొందరగా వెళ్ళండి నేను నాన్నను , పెద్దయ్యకు చెప్పి వెనుకే వచ్చేస్తాము అని ఊరివైపు అమితవేగంతో పరుగుపెట్టాడు .

దారి పొడవునా అక్క.......య్యా , ఆ........మ్మా , అక్క........య్యా అ........మ్మా అని కలవరిస్తూనే వదిలివెళ్లకు అన్నట్లు అక్కయ్యను ఏకమయ్యేలా హత్తుకున్నాను .

తమ్ముడూ ............నీకేమి కాదు , నా బంగారు నాబుజ్జి అంటూ ముద్దులుపెడుతూ కాటు దగ్గర కారుతున్న రక్తాన్ని పీల్చి రోడ్ మీదకు ఉమ్మేస్తోంది అక్కయ్య .

కాంచన ఇంకెంతసేపు అని ఏడుస్తూ అడిగింది .

5 నిమిషాలు వాసంతి , తమ్ముడూ మీ అక్కయ్యలు ఉండగా నీకేమైనా కానిస్తామా అని మరింత వేగంతో టౌన్ చేరుకుని దగ్గరలోని పెద్ద హాస్పిటల్ చేరుకుని , ఆగకుండా నేరుగా స్కూటీని లోపలికి ICU దగ్గరికి డాక్టర్ డాక్టర్ ...........అని కేకలువేస్తూ చేరుకుంది .



అదృష్టం డాక్టర్ గారు ICU లోపల నుండి బయటకువచ్చి విషయం తెలుసుకుని లోపలికి రండి అనిచెప్పడంతో అక్కయ్య ఏడుస్తూ ఎత్తుకొనివెల్లి బెడ్ పై పడుకోబెట్టింది . 

ఏపాము ఎవరైనా చూసారా అని డాక్టర్ గారు అడిగారు .

కాంచన అక్క వివరించడంతో ..........

Too dangerous , నర్స్ ********anti venom తెప్పించండి అని చెప్పడంతో , నర్స్ పరుగున బయటకు వెళ్ళింది .

మీరు బయట ఉండండి అని బాధపడుతున్న అక్కయ్యలకు డాక్టర్ చెప్పారు .

నన్నే ప్రాణంలా చూస్తూ వెళుతోంటే , అక్క.......య్యా ........నాతోపాటు ఉండు అని చేతిని పట్టుకుని గుండెలపై ఉంచుకున్నాను . 

డాక్టర్ గారు ..........అని కాంచన మాట్లాడబోతోంటే ,

మీరు ఉండొచ్చు అని కాటు దగ్గర శుభ్రం చేస్తూ నోటితో పీల్చిన ఆనవాళ్లు కనిపించడంతో , ఎవరు అని అడిగారు .

తనే డాక్టర్ గారు అని అక్కయ్యను చూపించడంతో , 

గుడ్ ఫస్ట్ aid జరిగిపోయింది . కానీ మీరు కూడా నోటిలో ఏమీ మింగరాదు అని నర్సు తెత్తిన మెడిసిన్ అందుకొని , మొదట అక్కయ్య నోటిలో పుకిలించమని మందు అందించి వెంటనే నాకు ఇంజక్షన్ వెయ్యడం , రెండు నిమిషాల్లో కాటు నుండి రక్తం కారిపోతుండటంతో అక్కయ్యలు కంగారుపడటం చూసి , ఏమీ పర్లేదు చేదు రక్తం బయటకు వచ్చేస్తుంది . సరైన సమయానికి తీసుకొచ్చారు . నెక్స్ట్ అక్కయ్యకు కూడా ఒక ఇంజక్షన్ చేశారు . 



మామూలుగా పాము కాటు వెయ్యగానే భయమే ఎక్కువగా ప్రాణాలను తీసేస్తుంది . పాము కాటువేసినా ఇంత చిన్న పిల్లాడయినా భయపడినట్లు లేడు , ఎవరికోసమో బ్రతకాలనే దృఢ సంకల్పం బలంగా పిల్లాడిలో ఉంది అదే భయాన్ని దూరం చేసింది .

ఇంకెవరు డాక్టర్ గారు వాళ్ళ అక్కయ్య కోసమే అని అక్కయ్యను చూపించింది . 

చూస్తుంటేనే తెలుస్తోంది , గంటలో కోలుకుంటాడు అనిచెప్పి మెడిసిన్ రాసిచ్చి , నర్స్ గ్లూకోజ్ ఎక్కించండి అనిచెప్పారు .

అమ్మా , సునీతక్క బయటనుండి కంగారుపడుతూ చూస్తోంటే , కాంచన అక్కయ్య వెళ్లి డాక్టర్ గారు సేఫ్ అనిచెప్పారు అనిచెప్పి లోపలిపిలుచుకునివచ్చింది .

కాస్త దూరం నుండే అమ్మ కన్నీళ్ళతో చూస్తోంటే , 

బాబు అమ్మనా ...........

అవును డాక్టర్ గారు .

అయితే బాబు ప్రక్కనే కూర్చోవచ్చు , చూసాము కదా వాళ్ళ ప్రేమే త్వరగా కొలుకునేలా చేస్తుంది అని కాటు దగ్గర మొత్తం శుభ్రం చేసి మందువేసి కట్టుకట్టి , అమ్మా ...........బాబుకి ఏమీకాదు , నర్స్ స్పృహలోకివచ్చాక పిలవండి అని ధైర్యం చెప్పి వెళ్లిపోయారు.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 05-04-2020, 06:03 AM



Users browsing this thread: 56 Guest(s)