Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కారు సౌండ్ రాగానే స్నిగ్ధ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్యా .......... మన బుజ్జి అక్కయ్య అలిగింది ఒకసారి టైం చూసుకోండి అనిచెప్పింది .
2 దాటడంతో అయిపోయాను అంటూ స్నిగ్ధ చేతిని అందుకొని పరుగున లోపలికి వస్తూ ఏడవలేదు కదా అని అడిగాను .
ఏడ్చింది అన్నయ్యా ......... వెంటనే అక్కయ్య పాలు ఇవ్వడంతో అప్పటి నుండీ చిన్న చిరునవ్వుకూడా నవ్వకుండా అక్కయ్య ఓడిలోనే హాయిగా నిద్రపోయింది .
అన్నయ్యా ......... వచ్చావా అని ప్రక్కనే కూర్చోబెట్టుకుంది .
అక్కయ్యను ఎత్తుకుని లవ్ యు అక్కయ్యా .......... ఆలస్యం అయ్యింది . మీరు చూపించిన దారిలో వెళుతూ చాలలామందికి సహాయం చేస్తున్నానా ........ వాళ్ళు అభిమానం చూపిస్తుంటే కాసేపు మాట్లాడి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది . వాళ్ళ ఆశీర్వాదాలన్నీ మా బుజ్జిఅక్కయ్యకే చెందాలి అని ప్రాణంలా ముద్దుపెట్టి హత్తుకున్నాను . 
లవ్ యు అన్నయ్యా ........... అంటూ నాచేతిని చుట్టేసి ఆనందించింది .
ఇంతలో సర్ వాళ్ళుకూడా రావడంతో అందరమూ కలిసి భోజనం చేస్తూ , మహేష్ ........ నువ్వు కోరిన కోరికవల్లనే మీ మేడం వాళ్ళ చేతివంట తింటున్నాము ఆహా ...... అద్భుతం ఉమ్మా ........ లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు .
అధిచూసి అందరమూ సంతోషంతో కేకలువెయ్యడంతో , మేడం వాళ్ళు సిగ్గుతో మురిసిపోయి మహేష్ , కృష్ణ .......... ఎలా ఉన్నాయి అని అడిగారు . 
సర్ వాళ్ళు చెప్పినట్లు అమృతమే అంటూ కుమ్మేసి కాసేపు సర్ వాళ్ళతో ప్రాజెక్ట్స్ గురించి చర్చించి ఇంటికి చేరుకున్నాము . 
తరువాతి రోజు నుండి ఇంటి నుండే వర్క్ చేస్తూ బుజ్జిఅక్కయ్యతోనే సమయం గడుపుతూ , కృష్ణగాడు ప్రిపేర్ అవుతూ నెలరోజుల తరువాత చెల్లి రిజల్ట్స్ వచ్చాయని మొబైల్ కు కాలేజ్ నుండి మెసేజ్ రావడం ఆవెంటనే congratulations అని wishes ఆపకుండా వస్తూనే ఉండటంతో , చెల్లి ఆనందంతో మాఇద్దరి మధ్యన కూర్చుని లాప్టాప్ ఓపెన్ చేసి బుజ్జి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి రిజల్ట్స్ చూసి , లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ......... మీ చెల్లి మళ్లీ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది అనిచెప్పగానే ,
బుజ్జిఅక్కయ్యతోపాటు ఇద్దరమూ అంతులేని ఆనందంతో , ఒక్కొక్కచేతితో చెల్లిని అమాంతం పైకెత్తేసి మాకు ముందే తెలుసు మా చెల్లి గురించి అని పండగ చేసుకున్నాము . కృష్ణగాడు స్వీట్స్ తీసుకొచ్చి చెల్లికీ నాకు తినిపించి బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టాడు .
మా ఆనందాన్ని చూసి మా బుజ్జిఅక్కయ్య కాళ్ళుచేతులనూ కదిలించి ఆపకుండా నవ్వుతూనే ఉంది .

 15 రోజుల తరువాత చెల్లి కాలేజ్ స్టార్ట్ అవ్వడంతో బుజ్జిఅక్కయ్యతోపాటు ముగ్గురమూ కాలేజ్ చేరుకున్నాము . బుజ్జిఅక్కయ్య కోసం వాకింగ్ చైర్ , పడుకోవడం కోసం కారులో వెనుక సీట్ తీయించి ఒక ఊయల arrange చేయించాము , చెల్లితోపాటు క్లాస్ కు వెళితే అక్కడ పడుకోవడానికి , ఆడుకోవడానికి కావాల్సినవన్నీ తీసుకుని ముందుగా ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెళుతోంటే , చెల్లికి ప్రతి ఒక్కరూ కంగ్రాట్స్ చెబుతున్నారు .
ప్రిన్సిపాల్ మేడం కూడా లేచివచ్చిమరీ కౌగిలించుకుని కంగ్రాట్స్ చెప్పి , ఇలాంటి సమయంలో కూడా .......... సాధించావు కృష్ణ చాలా సంతోషం . ఒక స్టూడెంట్ వరుసగా త్రీ ఇయర్స్ యూనివర్సిటీ టాప్ లో రావడం కాలేజ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ప్రౌడ్ ఆఫ్ యు my గర్ల్ ............
థాంక్స్ మేడం , మావారు మరియు మా అన్నయ్య వల్లనే నేను సాధించగలిగాను లవ్ యు both అని మా ఇద్దరి చేతులనూ చుట్టేసి ఆనందించి , ఇప్పుడు మరొక ఇన్స్పిరేషన్ కూడా my baby గర్ల్ ......... my హార్ట్ , our హార్ట్ , our లైఫ్ అంటూ నా చేతులలోని అక్కయ్య చేతులను స్పృశించి మురిసిపోతోంది .

మేడం ........ పాప అని విషయం చెప్పేంతలో , 
మహేష్ ........ పాప తల్లితోనే ఉండాలి కాబట్టి , పాప కంఫర్ట్ ముఖ్యం , నేనూ తల్లినే కదా అర్థం చేసుకోగలను అని పాప క్యాంపస్ , క్లాస్ ......... లలో చెల్లితోనే ఉండేలా పర్మిషన్ ఇచ్చి , సంతోషంతో దగ్గరకువచ్చి can i అని అడిగారు .
అక్కయ్యా .......... ప్రిన్సిపాల్ అంటూ అందించాను .
క్యూట్ , బ్యూటిఫుల్ .......... కృష్ణా ...... you are very lucky అని ముద్దుపెట్టి అందించారు . 
కృష్ణా ......... స్టాఫ్ రూంలో లెక్చరర్స్ అందరికీ ఒకసారి ముందుగానే లెటర్ చూపించి ఇంఫార్మ్ చెయ్యి , so that ...........ok ,
Yes మేడం sure అని స్టాఫ్ రూమ్ కు వెళ్ళాము . అందరూ ఫస్ట్ క్లాస్ కు వెళ్ళడానికి రెడీ అవుతుండటంతో వారి పర్మిషన్ కూడా తీసుకున్నాము .

తరువాతి రోజు నుండీ మళ్లీ బిజీ షెడ్యూల్ ........... తెల్లవారకముందే లేచి అక్కయ్యకోసం వెళ్లడం - టిఫిన్ చేసి బుజ్జిఅక్కయ్య సంతోషాన్ని చూసి మురిసిపోతూ రెండు కార్లలో చెల్లి కాలేజ్ చేరడం - అక్కయ్యా ........లంచ్ లో కలుస్తాను అని ప్రామిస్ చేసి ముద్దులతో ముంచెత్తి ఆఫీస్ కు వెళ్లడం - చెల్లి క్లాస్ లో ఉన్నంతసేపూ అక్కయ్యను తనదగ్గరే ఉంచుకుని చూసుకోవడం - చెల్లికి lab ఉన్నప్పుడు క్యాంపస్ చల్లని చెట్టునీడలో కార్లో కూర్చుని ప్రిపేర్ అవుతున్న కృష్ణగాడికి అందించడం , వాడు కొద్దిసేపు ఆడించి నవ్వించి కారులో వెనుక ఊయలలో పడుకోబెట్టి మళ్లీ చదువుతూ అక్కయ్యను జాగ్రత్తగా చూసుకోవడం - అవసరమైనప్పుడు చెల్లిని కానీ , నన్ను కానీ పిలిపించేవాడు . అలా రోజులు సంతోషంగా సాఫీగా రోజులు , వారాలు , నెలలు సాగిపోతున్నాయి . మా ముగ్గురికీ ఉన్న ఒకే ఒక బాధ - అక్కయ్య ఎక్కడ అని ...........

ఒకరోజు ఆఫీస్ లో సర్ , మేడం వాళ్ళు మా రూమ్ కు వచ్చి మహేష్ ........ బెంగళూరులో సౌత్ ఇండియా ప్రైవేట్ constructions కంపెనీల చైర్మన్స్ మీటింగ్ జరుగుబోతోంది . నువ్వు రమేష్ కూడా మాతోపాటు వస్తున్నారు ఎల్లుండి ప్రయాణం రెండు రోజులు అక్కడే అనిచెప్పారు .
నో నో నో ........ అది చైర్మన్స్ మీటింగ్ , అంటే మమ్మల్ని ఏదోలాగా ......... అమ్మా ఆశ దోస అప్పడం . నేనైతే అస్సలు రాను కావాలంటే రమేష్ ను తీసుకెళ్లండి . రెండు రోజులా .......... మా బుజ్జి అక్కయ్యను చూడకుండా నేను ఉండలేను . మీరు ఫ్లైట్ ఎక్కేంతవరకూ నేను ఆఫీస్ కు కూడా రాను . మీరు ఎమోషనల్ గా బ్లాక్మైల్ చేసినా చేస్తారు . ఇదిగో ఇప్పుడే వెళ్లిపోతున్నాను నాకు కాల్ కూడా చేయకండి happy journey and enjoy the మీటింగ్ .
భలే ప్లానింగ్ వేసి ఎలాగోలా తీసుకెళ్దామనుకున్నారు , నేనేమీ అంత అమాయకుణ్ణి కాదు .............
మహేష్ మహేష్ మహేష్ .......... అని ఎంతపిలిచినా పట్టించుకోకుండా కారులో నేరుగా కాలేజ్ కు బయలుదేరాను . 
సర్ , మేడం వాళ్ళు నవ్వుకుని లవ్ యు soooooo మచ్ మహేష్ ........... నువ్వు ఇక్కడ ఉంటావు అని గుండెలపై చేతులువేసుకుని గర్వపడుతూ రమేష్ .........నువ్వు ఒక్కమాట కూడా మాట్లాడటానికి వీల్లేదు we are going thats ఫైనల్ అని ఆర్డర్ వేసి పొంగిపోతూ ఆఫీస్ రూంలోకివెళ్లారు .

అమ్మో ......... ఎంత ప్లాన్ వేశారు . ఎలాగోలా చైర్మన్ చేయాలనుకుంటున్నారు . నో నెవర్ మా అక్కయ్య కోరిక తీర్చడం కంటే ఇక దేనిపైనా నాకు ఆశలేదు అని అక్కయ్యను తలుచుకుంటూ , ప్రిన్సిపాల్ గారు మాకు ఇచ్చిన కార్డ్ ద్వారా కాలేజ్ లోపలికి వెళ్లి , మా బుజ్జిఅక్కయ్య కృష్ణగాడితో లేకపోవడం చూసి నేరుగా చెల్లి క్లాస్ కు వెళ్లి , లెక్చరర్ కు అపాలజీ చెప్పి వీల్ చైర్ కం స్మాల్ బెడ్ పైచెల్లిని , క్లాస్ ను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా తనకు తానే ఆడుకుంటున్న మా బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా ఎత్తుకుని , ఇద్దరమూ చెల్లికి బై చెప్పి చిరునవ్వులు చిందిస్తూ చెట్టుకింద స్టోన్ బెంచ్ పై చదువుకుంటున్న కృష్ణగాడి ప్రక్కనే కూర్చున్నాను .
Hi మామా.......... ఆఫీస్ అంటూ బుజ్జిఅక్కయ్య బుగ్గలను స్పృశించి లవ్ యు అంటూ ముద్దుపెట్టాడు .
ఆఫీస్ డ్రామా వివరించి రెండు రోజులు నో ఆఫీస్ 48 hours మన బుజ్జి అక్కయ్యతోనే అంటూ ప్రాణంలా గుండెలపై హత్తుకొనివెళ్లి కారులోని టాయ్స్ బాక్స్ అందుకొని వాడి ఎదురుగా గడ్డిలో కూర్చుని మాలోకంలో మేము విహరించాము .
కృష్ణగాడు చూసి పరవశించిపోతూ ప్రిపరేషన్ లో మునిగిపోయాడు .

లంచ్ బెల్ కొట్టగానే చెల్లి తన ఫ్రెండ్స్ తోపాటు పరుగునవచ్చి మమ్మల్ని చూసి దూరం నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , my lovely లవ్లీ లవ్లీ ఏంజెల్ అంటూ వచ్చి నా చేతిని చుట్టేసి కూర్చుని ముద్దులతో ముంచెత్తి , మీ పెద్ద తమ్ముడితో ఆడుకుంటున్నారా అక్కయ్యా .......... పాలు కావాలా అని అడిగింది .
Yes yes ......... అన్నట్లు బుజ్జి బుజ్జి నవ్వులతో చేతులను కదిలించడంతో , ఫ్రెండ్స్ .......... ఇప్పుడే వచ్చేస్తాను లవ్ యు అన్నయ్యా ......... అని కారులోపలికివెళ్లి పాలు ఇచ్చింది .
కొద్దిసేపటి తరువాత కృష్ణగాడువెళ్లి చెల్లితోపాటు లంచ్ బ్యాగ్ తీసుకొచ్చాడు . అప్పటికే తిన్న చెల్లి ఫ్రెండ్స్ మాప్రక్కనే కూర్చుని పాపను ఆడిస్తూ నవ్వించారు .
చెల్లి ఆఫీస్ విషయం తెలుసుకుని గ్రేట్ అన్నయ్యా .......... రెండు రోజులు మన బుజ్జిఅక్కయ్య ఫుల్ హ్యాపీ అయితే అంటూ తినిపించింది . ఆరోజు సాయంత్రం వరకూ మరియు మరుసటి రోజు కూడా మా బుజ్జిఅక్కయ్యతోనే ఎంజాయ్ చేసాను . ఈ సమయంలో సర్ , మేడం వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేశారో లెక్కేలేదు . నో నో నో ........... హ్యాపీ జర్నీ అని రిప్లై మాత్రం ఇస్తున్నాను .

రెండురోజుల తరువాత ఉదయం లేచి బుజ్జిఅక్కయ్యకు విష్ చేసి మొబైల్ చూస్తే మేడం నుండి we reached in బెంగళూరు అని మెసేజ్ వచ్చాక , పెదాలపై చిరునవ్వుతో వెంటనే కాల్ చేసాను .
మహేష్ .......... నిన్నూ అని నవ్వి , కొద్దిసేపటి ముందే బెంగళూరులో ల్యాండ్ అయ్యాము , హోటల్ కు వెళుతున్నాము అనిచెప్పారు మేడం .
హ హ .......... ఎంజాయ్ ద మీటింగ్ మేడం , have a good day ......... బై బై అని కట్ చేసి ఫ్రెష్ అయ్యివచ్చి , అప్పటికే బేబీ డాల్ లా ముద్దొచ్చేలా రెడీ అయిన బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని సోఫాలో చదువుకుంటున్న కృష్ణగాడి ప్రక్కనే చేరాను .
గుడ్ మార్నింగ్ రా ......... ఏంటి ల్యాప్ పెట్టుకున్నావు అని అడిగాను .
గుడ్ న్యూస్ రా మామా .......... మన బుజ్జిఅక్కయ్య రెడీ అయ్యాక అందరికీ చెబుదామని ఎదురుచూస్తున్నాను అని అక్కయ్యను ఎత్తుకుని ప్రాణంలా హత్తుకొని బుగ్గపై ముద్దుపెట్టి ,

అక్కయ్యా , రేయ్ మామా , రేయ్ కృష్ణ ............ నోటిఫికేషన్ పడింది అనిచెప్పాడు .
Wow .......... ఇంకేంటిరా మామా , బుజ్జిఅక్కయ్య బుజ్జి చేతితో స్టార్ట్ చెయ్యి అని చెప్పాను . చెల్లి సంతోషంతో కృష్ణగాడి ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసి భుజం పై ముద్దుపెట్టి , రేయ్ ........ ఇక exam వరకూ నిన్ను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము . కాన్సంట్రేషన్ మొత్తం exams మీదనే ఉంచు ......... అక్కయ్య కోరిక తీరాలి ఏమంటావు అన్నయ్యా .........
As you say చెల్లీ ......... అని బదులివ్వడంతో , 
సోఫాలో కాళ్లుమడిచి కూర్చుని బుజ్జిఅక్కయ్యను పడుకోబెట్టుకొని మాఇద్దరినీ సంతోషంతో తనవైపుకు లాక్కుని ఉక్కిరిబిక్కిరిచేసి , బుజ్జిఅక్కయ్య ఫారం ఫిల్ చేద్దామా అని చిరునవ్వులు చిందుస్తుండటంతో , మా అక్కయ్య కూడా go అనిచెప్పింది అని ముద్దులతో ముంచెత్తి , వాడి పేరుని బుజ్జిఅక్కయ్యతో టైప్ చేయించాడు .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని అక్కయ్య ఫోటోవైపు చూస్తూ గుండెలపై చేతినివేసుకొని మీకోరిక తీర్చడమే నా ఏకైక లక్ష్యం అని బుజ్జిఅక్కయ్యను నాకు అందించి నోటిఫికేషన్ పూర్తిచేశాడు . 
బుజ్జిఅక్కయ్యతోపాటు ఆనందించి all the best రా మామా , all the best రా అని మేము , బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులతో చెప్పింది . 
ఆరోజు నుండీ బుజ్జిఅక్కయ్య చిరునవ్వులను చూస్తూ మురిసిపోతూ లక్ష్యం వైపు అడుగులువేశాడు . ఇంట్లో , పబ్లిక్ లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేవాడు .
చెల్లి టైం టేబుల్ స్టడీ చేసి లాబ్స్ సమయానికి ఆఫీస్ నుండి కాలేజ్ చేరుకుని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని క్యాంపస్ పార్క్స్ లో ఎంజాయ్ చేసేవాళ్ళము .

రెండు రోజుల తరువాత సర్ నుండి కాల్ .........
ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లున్నారు రెండురోజులు కాల్ కూడా లేదు అని అడిగాను .
అదొక్కటే తక్కువ hectic షెడ్యూల్ ......... మేము construction ఫీల్డ్ లోకి దిగినప్పటి నుండీ ఇప్పటివరకూ కలిసిన ఫ్రెండ్స్ , other కంపెనీ చైర్మన్స్ తోనే చీకటిపడిపోతోంది . ఈరోజు నైట్ హైద్రాబాద్ రావాల్సింది కానీ మరొకరోజు పట్టేలా ఉంది .
ఓహ్ గ్రేట్ ......... పాతవాళ్లందరినీ కలిసారన్నమాట అంతకంటే హ్యాపీనెస్ మరొకటి ఉండదు ........మొత్తం పూర్తిచేసుకునే రండి ఇక్కడ మేము చూసుకుంటాము అని బదులిచ్చాను . 

మహేష్ ........ అధికాదు , సుమారు 2 సంవత్సరాల తరువాత మా ప్రాణానికి ప్రాణమైన కూతుర్లు స్వాతి ( జానకి మేడం ) , ప్రసన్నా ( భువనేశ్వరి మేడం ) స్టడీస్ కంప్లీట్ చేసుకుని లండన్ నుండి వచ్చేస్తున్నారు . రేపు ఉదయం 4 గంటలకు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారు . వాళ్లకు మీటింగ్ విషయం చెప్పాము . 
ఆల్రైట్ dad .......... రాగానే సెలబ్రేట్ చూసుకుందాము అని ఒప్పుకున్నారు . 
వాళ్ళను పిక్ చేసుకోవడానికి ఒక డ్రైవర్ ను పంపడానికి మా మనసు ఒప్పుకోవడం లేదు .
సర్ ........ can i ? అని అడిగాను .
Thank god మహేష్ ......... 
సర్ ......... నేను మీ సేవకుణ్ణి anytime ఆర్డర్ వెయ్యొచ్చు అనిచెప్పాను .
నో నో నో ......... dont ever say that word again మహేష్ ........ మా తరువాత కంపెనీని చూసుకోవాల్సింది నువ్వే ........
సర్ కట్ చేసేస్తున్నాను , మీరు ఏమీ కంగారుపడకండి చిన్న మేడం వాళ్ళను స్వయంగా నేనే రిసీవ్ చేసుకుంటాను బై బై ......... 
సర్ వాళ్ళు స్పీకర్ on చేసినట్లు మేడం వాళ్ళతోపాటు నవ్వుకుని , హమ్మయ్యా ....... ఇక మహేష్ చూసుకుంటాడు శ్రీమతి గారు .........
విన్నాము శ్రీవారూ ......... అని మేడం వాళ్ళు చిలిపినవ్వుతో కౌగిలించున్నారు .

అసిస్టెంట్ మేనేజర్ కు కాల్ చేసి మీకు తెలిసే ఉంటుంది సర్ డాటర్స్ వస్తున్నారు ఉదయం 4 గంటలలోపు స్వాగతం పలికేలా చూసి వాళ్ళు సంతోషంతో మైమరిచిపోయేలా ఇంటిని decorate చెయ్యాలి అనిచెప్పాను 
Sure మహేష్ .......... మాకు వదిలెయ్యి మేము చూసుకుంటాము గుడ్ నైట్ చెప్పారు .
 రాత్రి డిన్నర్ చేస్తూ చెల్లికి విషయం తెలిపి , బుజ్జిఅక్కయ్య పాలు తాగిన తరువాత చెల్లి రూంలో పడుకునేంతవరకూ ఊయల ఊపి , అక్కయ్యా........ రేపు మీరు లేచేలోపు నేను బయటకు వెళ్లుంటాను , పని పూర్తిచేసుకును వచ్చేస్తాను అని గుడ్ నైట్ కిస్ పెట్టి నారూంలోకి వచ్చి అక్కయ్య ఫోటోని చూస్తూ బెడ్ పై వాలాను . అక్కయ్యా .......... మీ మరొక తమ్ముడూ , మీరంటే మరొక ప్రాణమైన మీరు చూడని చెల్లి తమ గోల్స్ సాధించేంతవరకూ కనిపించరా , మా బాధను చూడలేకనే మా సంతోషం కోసం బుజ్జిఅక్కయ్యను మా చెంతకు చేర్చారా ........ , మీ ఇష్టం మీరు ఎలా కోరుకుంటే అలా ముందుకువెళతాము . మీరు గర్వపడేలా గొప్ప స్థాయికి చేరుకుంటాము లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని గుండెలపై చేతినివేసుకొని అక్కయ్య అందమైన నవ్వుని తలుచుకుంటూ నిద్రపోయాను .
***********

అలారం చప్పుడు వినిపించడంతో లేచి ఫ్రెష్ అయ్యేలోపు 3 అయ్యింది . చెల్లి గదిలో లైట్ వెలుగుతుండటం - డోర్ తెరిచి ఉండటం - కృష్ణగాడు హాయిగా నిద్రపోతున్న చెల్లి కురులను స్పృశిస్తూ చదువుతుండటం చూసి లవ్ యు రా మామా అని గుసగుసలాడి , మా బుజ్జిఅక్కయ్య ఊయల దగ్గరకువెళ్లి చూసి ఆనందంతో గుడ్ మార్నింగ్ కిస్ పెట్టి వెళ్ళొస్తాను అని కార్ కీస్ అందుకున్నాను . 
రేయ్ మామా చలి ఎక్కువగా ఉంటుంది జాకెట్ వేసుకో అని కప్ బోర్డ్ వైపు సైగచెయ్యడంతో వాడిది వేసుకుని మెయిన్ డోర్ తీసి క్లోజ్ చేసి చీకటిలోనే ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి 3:45 అయ్యింది .
Display చూసి కరెక్ట్ టైం కే ల్యాండ్ అవ్వబోతోంది అని ఒక ప్లకార్డు అందుకొని పేర్లు పేర్లు .......... ఆ ఆ ప్రసన్నా , స్వాతి కరెక్ట్ అని రాసి చాలామందితోపాటు నిలబడ్డాను.
ఆఫ్టర్ two ఇయర్స్ తరువాత ఇండియా కు వస్తున్నారు ఫ్లవర్స్ తో స్వాగతం పలుకుదామని రెండుచేతులతో పట్టుకునేంత బొకే లు రెండు తీసుకున్నాను .

15 నిమిషాలకు ఫ్లైట్ లాండింగ్ అనౌన్స్మెంట్ జరగడంతో అందరితోపాటు నేనూ అలెర్ట్ అయ్యి ప్లకార్డు పైకెత్తిపట్టుకున్నాను .
ప్లకార్డు చూసి నా వయసున్న ఇద్దరు అమ్మాయిలు , మేడం వయసున్న వారు నావైపు రావడంతో , ఖచ్చితంగా వారేనని ప్లకార్డు ప్రక్కన ఉంచి వెనుక కుర్చీలో ఉంచిన లాట్ ఆఫ్ ఫ్లవర్స్ అందుకొని welcome to your లవ్లీ అండ్ బ్యూటిఫుల్ ఇండియా మేడం అని అందించాను .
Roses ......... wow wow లవ్లీ ........ థాంక్యూ సో సో soooooo మచ్ అని గుండెలపై హత్తుకొని మురిసిపోతున్నారు . వాసన పీల్చి పిన్నీ ........ఇండియన్ రోజెస్ లో ఉండే పరిమళం ప్రపంచంలో ఎక్కడా ఉండదు . ఆఫ్టర్ sooooo many మంత్స్ అంటూ అమ్మాయిలిద్దరూ చేతివేళ్ళతో పెనవేసి , థాంక్యూ soooooo మచ్ అని మరొకసారి చెప్పి , and your sweet name అని సంతోషంతో అడిగారు .
మ.......... అనేంతలో ,
స్వాతి , ప్రసన్నా ......... డ్రైవర్ అని పిలవండి ఇక పేరు ఎందుకు అనిచెప్పి , డ్రైవర్ వెళ్లి లగేజీ తీసుకురా అని ఆర్డర్ వేశారు .
Yes మేడం అంటూ వెళుతోంటే , 
ఎస్క్యూస్ మీ ......... పిన్నీ అక్కడ లండన్ లో ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళము కదా , ఇండియాకు రాగానే బద్దకం వచ్చేసిందా మీకు అని చెరొకవైపు ప్రేమతో హత్తుకొని బుగ్గలపై ముద్దులుపెట్టి , welcome to india అని ఫ్లవర్స్ అందించి wait చెయ్యండి లగేజీ తీసుకొస్తాము అని నాతోపాటు వచ్చారు .
Sorry ........ మా పిన్ని చాలా చాలా మంచివారు . లాంగ్ జర్నీ వలన అలసిపోయారు అందుకే కోపం , రెస్ట్ తీసుకుంటే కూల్ అయిపోతారు . 
Never mind మేడం ............

ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నారు .........
Welcome అన్నపదం ఎవరైనా మాట్లాడగలరు మేడం అని ఇద్దరితోపాటు నవ్వుకుని one two three four five......... పెద్దపెద్ద లగేజీ బ్యాగులను చూసి ఆశ్చర్యపోతుంటే , two ఇయర్స్ తరువాత వచ్చాము ఫర్దర్ స్టడీస్ కు వెళితే వెళతాము లేకపోతే mom and dads తోనే అని రెండుచేతులతో లగేజీ అందుకున్నారు . 
మేడం ........ please లెట్ మీ అని అన్నింటినీ పెద్ద ట్రాలీ పై పెడుతున్నాను .
 థాంక్స్ చెప్పి వెనక్కు తిరిగి , పిన్నీ ........ కొద్దిసేపు అక్కడే కూర్చుని ఉండొచ్చుకదా మేమే వచ్చేవాళ్ళము అని ఇద్దరూ ఆమె చేతులను చుట్టేశారు .
కారులో వెనుక ముగ్గురూ కూర్చున్న తరువాత డోర్ వేసి 5 మినిట్స్ మేడం అని ట్రాలీతోపాటు వెనుక ఉన్న క్యాబ్ దగ్గరకువెళ్లి ఫాలో అవ్వాలి అనిచెప్పి అతని సహాయంతో లగేజీని క్యాబ్ మొత్తం నింపేసి బయలుదేరాము .

స్వాతి : ఫ్రెండ్ ........
పిన్ని :  డ్రైవర్ ........
ప్రసన్నా : పిన్నీ మీరు టైర్డ్ అయ్యారు నా భుజం పై పడుకోండి , కావాలంటే ఇంటికి చేరుకున్నాక మేమే ఎత్తుకుని లోపలికివెళ్లి బెడ్ పై పడుకోపెడతాము అని నవ్వుకున్నారు .
పిన్ని : exams పూర్తయ్యాయో లేదో నన్ను ఫ్లైట్ ఎక్కించేశారు . మీ ఫేర్ వెల్ పార్టీ చూద్దామని , వీడియో తీసి మా అక్కయ్యకు చూపిద్దామని ఎంత ఆశపడ్డానో తెలుసా.......... 
 Soooo sorry పిన్నీ లవ్ యు sooooo మచ్ అంటూ చేతులపై ముద్దులుపెట్టి , పిన్నీ ......... మేము ఇంత సడెన్ గా బయలుదేరాడానికి కారణం చెప్పలేదు కదూ .
What .......... ఏంజెల్స్ .......
మహేష్ కోసం ........ అని ఇద్దరూ ఒకేసారి చెప్పి సిగ్గుతో వాళ్ళ పిన్ని గుండెలపై తలదాచుకొని మురిసిపోతున్నారు .
అంతే సడెన్ గా బ్రేక్ వేసాను . 
ఫ్రెండ్ ఏమైంది అని అడిగారు .
పిన్ని : స్వాతి , ప్రసన్నా ......... డ్రైవర్ ను డ్రైవర్ అనే పిలవాలి అని కాస్త కోపంతో చెప్పారు అండ్ మహేష్ ......... నో వే స్వాతి , ప్రసన్నా ......... , he is జస్ట్ an employee , అతడి పని అతడు చేసాడు ఇందులో అతడి గొప్పతనం ఏముంది . మీ ప్రతి బుక్ పై " M " దానిచుట్టూ లవ్ గుర్తు ఉన్నప్పుడే డౌబ్ట్ వచ్చింది .
బుక్స్ లో ఏంటి పిన్నీ మా హృదయాల నిండా మహేష్ నిండిపోయాడు. మమ్మీ వాళ్ళు ఫోటో పంపించమంటే డైరెక్ట్ గా వచ్చి థాంక్స్ చెప్పండి అనిచెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే మా రూమ్ నిండా మహేష్ ఫొటోలతో నింపేసేవాళ్ళము అంత ప్రేమిస్తున్నాము మేము . మహేష్ ను తప్ప మా లైఫ్ లో ఎవరినీ ఊహించుకోలేము , మనం ఇప్పుడు ఇలా నవ్వుతున్నామంటే కారణం మహేష్ నే , అమ్మావాళ్ళు దేవుడు అని పిలుస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు , ఇప్పుడు చెబుతున్నాము మేమిద్దరమూ మా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాము . మహేష్ ఎలా ఉన్నా ......... డ్రైవ్ చేస్తున్న ఫ్రెండ్ లో 0.1% ఉన్నా మేము అతని సొంతం అని ఫిక్స్ అయిపోయాము . అమ్మావాళ్ళు అడ్డుపడితే లేపుకెళ్లిపోతాము అని చిలిపిదనంతో వాళ్ళ పిన్నిని చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు .
మీ ఇష్టం , మీ అమ్మా నాన్నల ఇష్టం నాకు నిద్రవస్తోంది అని ఒకరి భుజంపై వాలిపోయి కళ్ళుమూసుకున్నారు .
వెనుక ఇద్దరి మాటలకు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు .

హలో ఫ్రెండ్ .......... మహేష్ ను నువ్వు చూసావా ఎలా ఉంటాడు హీరో లా ఉంటాడా అని అడిగారు .
 హమ్మయ్యా ........ మేడం వాళ్ళు ఫోటో పంపించకుండా మంచిపని చేశారు . వెంటనే మహేష్ అంటే వీళ్లకు అసహ్యం పుట్టేలా చేసి , కలవకుండా ఉండిపోతే సరిపోతుంది , ఇద్దరి మనసూ సర్ మేడం వాళ్ళలానే , కంపెనీని వాళ్ళలానే ముందుకు తీసుకువెళ్లగలరని నమ్మకం ఉంది అని నాలో నేను ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను .
ఫ్రెండ్ ఫ్రెండ్ .......... మహేష్ ను చూసారా , are you alright అని అడిగాను .

 మహేష్ తెలియకుండా మన ఆఫీస్ లో ఎవ్వరూ ఉండరు .
ఎలా ఉంటాడు ......... నీలో ......
 మేడం ......... sorry మీ మాటలు విన్నాను . మీరేమో స్వర్గం నుండి దిగివచ్చిన దేవకన్యల్లా ఉన్నారు . కానీ మహేష్ ఏమో నల్లగా , బక్కగా , పొట్టిగా చూస్తేనే అసహ్యం పుట్టేలా ఉంటాడు . మీకు వాడికీ 0.1 %  కూడాసెట్ అవ్వదు. కంపెనీ కోసం మొదట చాలా కష్టపడ్డాడు ఒప్పుకుంటాను కానీ మీకు తెలియదేమో కొద్దిరోజుల ముందు వేరే కంపెనీలకు అమ్ముడుపోయాడు , ఈ విషయం ఇంకా మీ పేరెంట్స్ కు తెలియదు. తెలియగానే కంపెనీ నుండి తోసేయ్యడం గ్యారంటీ........., నాకు తెలిసి అందుకేనేమో మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా ఫోటో పంపించలేదు .

ఫ్రెండ్ ......... నో నో  డ్రైవర్ ....... మహేష్ గురించి ఒక్కమాట కూడా అలా మాట్లాడకు , మా చేతిలో గన్ ఉండి ఉంటే ఈపాటికి నిన్ను చంపేసేవాళ్ళము . అతడు ఎప్పటికీ అలాచెయ్యడు అని ప్రతి విషయం mom వాళ్ళు చెప్పారు మాకు . పిన్ని లేకపోయి ఉంటే ఈపాటికి ఈ కారు దిగేసేవాళ్ళము . తొందరగా మమ్మల్ని ఇంటిలో వదిలి ఇక జీవితంలో మాకు కనిపించకు . మహేష్ ........ ఎలా ఉన్నా మేమిద్దరమూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాము , ఆరాధిస్తున్నాము . మా జీవితం అతడితోనే ...........
మేడమ్స్ అదీ .........
ఇక ఒక్కమాటకూడా మాట్లాడొద్దు , పిన్ని చెప్పినా వినకుండా నిన్ను ఫ్రెండ్ అనిపిలిచి పెద్దతప్పుచేసాము అని కన్నీళ్ళతో ఉండిపోయారు .

ఇది ఎక్కడికీ దారితీస్తుందోనని 5 గంటలకు ఇంటికి చేరుకున్నాము . సెక్యూరిటీ సెల్యూట్ చేసి మెయిన్ గేట్ తెరిచాడు . 
స్వాగతం అని పెద్దగా రాసి ఇల్లుమొత్తం రంగురంగుల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుండటం , స్వాతి ,ప్రసన్నా ఎలా ఉన్నారు అని అసిస్టెంట్ మేనేజర్ కొంతమంది స్టాఫ్ వచ్చి కారు డోర్ తెరిచారు .
కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వుతో కిందకు అడుగుపెట్టగానే పూల వర్షం కురవడంతో , wow .......... స్వాతి - ప్రసన్నా అంటూ పరవశించిపోతూ థాంక్స్ మేనేజర్ గారు రెండు సంవత్సరాలు అయ్యింది మిమ్మల్ని చూసి ,
ఆ అదృష్టం మాది నేను ఇప్పటికీ గుర్తున్నందుకు , థాంక్స్ నాకు కాదు చెప్పాల్సింది .............
మేనేజర్ గారు .......... అనేంతలో
మహేష్ కు ఉదయం 4 గంటలలోపు ఏమిచేస్తారో తెలియదు చిన్న మేడం వాళ్లకు ఘనస్వాగతం ఏర్పాట్లుచేయ్యండి అనిచెప్పారు మేము చేసాము అంతే . 

మేనేజర్ గారు ........ మహేష్ ఎక్కడ లోపల ఉన్నారా అని అంతులేని ఆనందంతో ఒకరినొకరు హత్తుకొని ఉబ్బితబ్బిబ్బైపోతూ అడిగారు .
ఇక్క ..........
ష్ ష్ ........ అని సైగచెయ్యడంతో , 
ఇక్కడ లేడు , ఎక్క......డ ఉన్నా.......డో తెలియదు అని తడబడుతూ బదులిచ్చి నిద్రవస్తోంది స్వాతి మేము వెళ్లవచ్చా అని అడిగారు .
మాకోసం రాత్రంతా కష్టపడ్డారు థాంక్యూ sooooo మచ్ మేనేజర్ గారు . వెళ్లి రెస్ట్ తీసుకోండి . అలాగే ఈ డ్రైవర్ ను కూడా తీసుకువెళ్లండి . ఇక మాకు ఎప్పటికీ కనిపించకూడదు .
స్వాతి తల్లీ..........
సర్ ......... అని సైగతో ఆపి , తెల్లవారేంతవరకూ సేఫ్ గా చూసుకుంటాను అని సర్ వాళ్లకు మాటిచ్చాను . సో ఇక్కడే ఉంటాను అనిచెప్పాను .
వెనుకే వచ్చిన క్యాబ్ లోని లగేజీలను సెక్యూరిటీ లోపలికి తీసుకువెళుతోంటే , ఆపి అయితే మొత్తం లాగేజీని నువ్వొక్కడివే లోపల ఉంచు అని వాళ్ళ పిన్నితోపాటు లోపలికి వెళుతూ , స్వాతి ప్రసన్నా ......... సరైన పనిష్మెంట్ ఇచ్చారు . డ్రైవర్ ను డ్రైవర్ లానే చూడాలి . 
పిన్నీ ........ డ్రైవర్ అని కాదు , మా ప్రాణమైన మహేష్ ను అలా అన్నందుకు ఈ పనిష్మెంట్ ఇచ్చాము అంతే అని పైన ఉన్న తమ రూంలోకి వెళ్లిపోయారు .
మొత్తం లాగేజీని హాల్లోకి తీసుకొచ్చి ఎంత బరువున్నాయి అంటూ సోఫాలో వాలిపోగానే నిద్రపట్టేసింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 05-06-2020, 05:45 AM



Users browsing this thread: 66 Guest(s)