Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
తను అటు వెళ్ళగానే   ఇంత  దాకా లీడ్  తీసుకొని మాట్లాడిన అతనే  “మీ హెల్ప్ లేక పొతే  మా కంపెనీలు చాలా లాస్ అయ్యే వి శివా , మేము మీకు చాలా రుణ పది ఉన్నాము ,  మీకు మా నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా అడగండి”  అన్నాడు.
“అందులో నేను చేసింది ఏమీ లేదు సర్, కానీ  ఆ కంపెనీ లో పనిచేస్తున్న  ఓ  వ్యక్తి   నిజాయితీ ఆ కంపెనీ  బండారం బయట పెట్టబడింది.  ప్రస్తుతం ఆ వ్యక్తీ  ఉద్యోగం ,  జీవితం  ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే  ఆ వ్యక్తి కి  అతని ని కుటుంబానికి  హెల్ప్ చేయండి”
“మీరు ఆ వ్యక్తీ గురించి  మరిచి పొండి శివా , మేము చూసుకుంటాము.  అతను ఎక్కడ ఉన్నారో చెప్పండి , మా ప్రైవేట్ సెక్యూరిటీ  అతనికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది.  ఇంక  అతనికి జాబ్ అంటారా  అతను  ఇంతకూ ముందు సంపాదించే దానికి రెట్టింపు జీతంతో  నా కంపెనీలో  రేపటి నుంచి జాయిన్ కావచ్చు.   ఇదిగో ఈ కార్డు  అతనికి ఇచ్చి  రేపు నన్ను మా ఆఫీస్ లో కలవమని చెప్పండి.” అంటూ  తన  విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు.
 
ఆ కార్డ్ తీసుకొంటు, దివ్యా  వాళ్ళ నాన్న నెంబర్  ఇచ్చాను.
నాకు కార్డ్ ఇచ్చిన అతనే  బయట ఉన్న తన సెక్యూరిటీ  అతనికి   ఆ నెంబర్  ఇచ్చి  నెంబర్ ఉన్న  వ్యక్తీ  ఇంటికి  ఫుల్ సెక్యూరిటీ  ఇవ్వండి నేను వద్దు అని చెప్పేంత వరకు.  అతని కి , అతని ఫ్యామిలీ  అందరికి  24  గంటలు  జాగ్రత్తగా చూసుకోండి అంటూ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి పంపాడు.
“శివా ,  మీరు కూడా  ఇక్కడ నుంచి వెళ్ళిపోండి.  ఈ  కంపెనీ వెనుక చాల పెద్ద హాండ్స్ ఉన్నాయి  మేము  వీళ్ళను హ్యాండిల్  చేస్తాము ,   ఇక్కడ ఉంటే  వాళ్ళు మీ మీద  పగ పట్టే ఛాన్స్ ఉంది” అన్నారు.
“మా ఫ్రెండ్  ఒకరు  ఈ  డూప్లికేట్  మెడిసిన్స్  వల్ల  ఓ కేసు లో చిక్కు కొన్నారు.  అతనిని విడిపించడానికి  నేను ఈ కేసులో వేలు పెట్టాల్సి వచ్చింది.”
“మీరు డీటైల్స్ ఇవ్వండి శివా , మేము చూసుకుంటాము ఆ కేసు కూడా , మా బెస్ట్  లాయర్స్   చూస్తారు”  అంటూ  కేసు డీటెయిల్స్ తీసుకున్నారు.
“ఈ రోజు ఈవినింగ్ కల్లా మీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారు, కేసు హియరింగ్  కి రాగానే మా లాయర్లు చూసుకుంటారు”
“థాంక్స్  సర్ ,  అయితే నేను  బయలు దేరుతాను”
“మేము మీకు థేంక్స్ చెప్పాలి శివా ,  కొన్ని  కోట్లు  ఈ కంపెనీ  వలన మాకు అందరికి నష్టాలు వస్తు ఉన్నాయి, మేము ఎం చేయలేని  స్థితిలో ఉండగా మీరు  సమయానికి మంచి లీడ్  ఇచ్చి మా కంపెనీలను ఈ నష్టాల నుంచి గట్టెక్కించారు”
అందరికి బాయ్ చెప్పి స్టేషన్ లోంచి బయటకు వచ్చాను.     వాళ్ళు ఇచ్చిన   కార్డ్ నాదగ్గరే ఉంది  దాన్ని  దివ్యా  వాళ్ళ నాన్నకు ఇచ్చేస్తే  ఓ పని అయిపోతుంది.  అనుకుంటూ బైక్ కు  దివ్యా ఇంటి వైపు తిప్పాను. 
 
నేను వాళ్ళ ఇంటికి చేరుకునే సరికి  బయట ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు.  
“ఎవరిని కలవాలి” అంటూ  నన్ను చెక్ చేసి   పంపారు. 
నా చేతిలోని  విజిటింగ్  కార్డు రమేశ్ చేతిలో పెట్టి “మీరు రేపు  ఈ  కంపెనీ  CEO  ని కలవండి  , మీకు జాబ్ గ్యారంటీ”
“థాంక్స్ శివా,   కొద్ది సేపు ఉండండి  దివ్యా వాళ్ళు పక్క సందులోకి వెళ్ళారు  ఇంట్లోకి సరుకులు కావాలంటే”  అన్నాడు.  
మేము మాట్లాడుతూ ఉండగా   దివ్యా , జాకీ వాళ్ళ వెనుక  ఓ సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు.
“టీ  పెట్టండి” అంటూ  దివ్యా ను , జాకీ  కిచెన్ లోకి   పంపి  నేను రమేశ్  మాట్లాడుకోసాగాము.
“మిగతా కంపెనీ వాళ్ళు కు ఎలా తెలుసు సర్ , అక్కడ దుప్లికేట్ మెడిసిన్ తయారు అవుతుంది అని ,  వాళ్ళు అంత  తొందరగా ఎలా  రా కలిగారు” అన్నాడు రమేశ్    నేను స్టేషన్ లో  జరిగిన ఇన్సిడెంట్స్  చెప్పగానే.
“నిన్న  దివ్యా దగ్గర   నువ్వు తయారు చేసిన  డైరీ చదవగానే నాకు ఓ  ప్లాన్ తట్టింది. ఈ దుప్లికేట్ కంపెనీ  వెనుక చాల పెద్ద తల కాయలు ఉన్నాయి వాళ్లను  ఎదుర్కోవాలంటే  వీళ్ళు ఎవరికీ తల కాయ నొప్పి తెస్తున్నారో వాళ్లను ఇందులో కి లాగాలని.  అప్పుడు  నెట్ లో సెర్చ్ చేసాను,   మన సిటీ లో  పెద్ద పెద్ద  మెడికల్  కంపెనీలను.  వాళ్ళకు న్యూస్ చెప్పి రెడీ  గా ఉండండి రేపు  ఉదయం మీకు లొకేషన్ చెప్తాను  అని.  
నిన్న దివ్యా  మా ఇంటి దగ్గర  నుంచి బయలు దేర గానే నేను  దివ్యా ను క్లోజ్  గా ఫాలో కా సాగాను.
వాళ్ళు దివ్యాను కిడ్నాప్ చేయడం , నీ దగ్గరకు తీసుకొని రాగానే. నువ్వు సేఫ్  అని తెలిసిన వెంటనే  వాళ్ళను  నువ్వు పని చేసే ఫ్యాక్టరీ  మీదకు దాడి చేయమని చెప్పాను.    వాళ్ళు చాల  ప్లాన్  గా  సెక్యూరిటీ అధికారి , మీడియా , లాయర్స్ మరియు  లోకల్  కోర్ట్  జడ్జి  తో పాటు  ఫాక్టరీ మీద దాడి చేసారు.   వెళ్ళు వెళ్ళేటప్పటికి  ఫ్యాక్టరీ  ఓపెన్  ఉంది.   ప్యాకింగ్ చేసి డెలివరీకి  రెడీ  గా ఉన్న  మెడిసిన్స్ తో  పక్కాగా దొరికారు. 
అక్కడున్న ఎవిడెన్స్  తో  వాళ్ళ మీద పక్కగా కేసు పెట్టి  ఆ డైరెక్టర్స్ మీద  అరెస్ట్ వారెంట్  ఇష్యూ చేసారు.   ఇంకో  గంటలో న్యూస్ వస్తుంది వాళ్ళ అరెస్ట్  గురించి.” అంటూ    జరిగింది అంతా చెప్పాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 24-06-2020, 02:29 PM



Users browsing this thread: 30 Guest(s)