Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
ఎప్పుడైతే వాళ్ల అమ్మ నాన్న అందరూ వస్తున్నారు అని ఫోన్ చేశారో అప్పుడు విద్య కీ ఏమీ చేయాలో తెలియక రెడీ అయ్యి బయటకు వస్తే అప్పుడే వినయ్ తన రూమ్ నుంచి కిందకు దిగుతు వస్తున్నాడు విద్య నీ "నాకూ ఆఫీస్ కీ టైమ్ అయ్యింది నేను వెళ్లాలి ఇంట్లో సరుకులు లేవు అనుకుంట మన కాలనీ నుంచి అలా ముందుకు వెళితే సూపర్ మార్కెట్ ఉంటుంది ఏమీ కావాలి అన్న తెచ్చుకో నీకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా కార్ ఉంటుంది వాడుకో" అని చెప్పి గ్యారేజ్ లో ఉన్న తన బైక్ తీసుకొని ఆఫీసు కీ వెళ్లిపోయాడు వినయ్ దాంతో విద్య కొంచెం ఊపిరి పీల్చుకుంది వినయ్ అలా ఆఫీస్ వెళ్లగానే విద్య ఫ్యామిలీ, వినయ్ ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చారు అసలు నిజానికి వినయ్ అక్కడ 7 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తన అమ్మ నాన్న నీ ఏ రోజు తన ఇంటికి రానివ్వలేదు అందుకే మొదటిసారి తన కొడుకు ఇంటికి రావడంతో ఇళ్లు మొత్తం చూసి మురిసి పోయారు, ఇలా ఇళ్లు మొత్తం సందడి సందడిగా మారింది దాంతో విద్య లో కొంచెం ధైర్యం పెరిగింది ఆ తర్వాత తన ఫోన్ లో ఫేస్ బుక్ చూస్తూ ఉంటే తనకి ఒక నోటిఫికేషన్ కనిపించింది దాంతో వెంటనే పక్కింటి సర్దార్జీ దగ్గరికి వెళ్లి "సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్లాలి ఆంటీ నీ తోడు పంపిస్తారా" అని అడిగింది దానికి ఆయన కూడా వాళ్ల భార్య నీ విద్య తో సూపర్ మార్కెట్ కీ పంపారు.


కార్ లో వెళ్తున్నంత సేపు సూపర్ మార్కెట్ లో తిరుగుతున్నంత సేపు ఆమె బాగానే మాట్లాడింది కానీ మాటిమాటికి "ముండియా (పంజాబీ లో అమ్మాయి అని అర్థం)" అని పిలుస్తుంటే విద్య కీ చిరాకుగా అనిపించింది అంటే దాని అర్థం తెలియక ఏదో తీడుతుంది అనుకుంది ఆ తర్వాత ఇంటికి వెళ్లి అందరితో సరదాగా సాయంత్రం వరకు గడిపింది, ఇక్కడ వినయ్ పరిస్థితి వేరేగా ఉంది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఇష్టం లేని ఉద్యోగం ఇష్టం లేని లైఫ్ కాకపోతే ఇంకో రెండు నెలల తరువాత ఆ కంపెనీ తో కాంట్రాక్ట్ అయిపోతుంది దాంతో పాటు ఇప్పుడు తను చేస్తున్న ప్రాజెక్ట్ లో తనకి 40% partnership వస్తుంది అందుకే ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా పూర్తి చేయాలని ఉన్న స్టాఫ్ నీ 4 నెలల నుంచి పని రాక్షసుడు లాగా పీడిస్తున్నాడు రెండు వారాలు తను ఆఫీస్ కీ రాక పోయేసరికి ఎక్కడి పని అక్కడే ఆగిపోయింది అసలు trail submission కూడా అవ్వలేదు దాంతో తన స్టాఫ్ సాలరీ సగం కట్ చేసి ఆ submission తనే చేశాడు ఆ తరువాత ఎవరికి రెండు నెలల పాటు సెలవు ఉండదు అని తేల్చి చెప్పాడు ఎవరూ ఎవరూ అయితే పని ఏగోటారో వాళ్ళని పని పూర్తి అయ్యే వరకు రాత్రి ఆయన సరే అక్కడే ఉండి పని చేయాలి అని రూల్ పెట్టాడు.

వినయ్ ఎవరితో ఎంత కఠినంగా ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీ రామ్ తో మాత్రం ఎప్పుడు సరదాగా ఉంటాడు వాడితోనే అని పంచుకుంటాడు ఆ రోజు ఆఫీస్ అవ్వగానే హవేలి అనే హోటల్ లో మేనేజర్ గా పనిచేసే శ్రీ రామ్ దగ్గరికి వెళ్లి కలిశాడు ఇద్దరు కొద్ది సేపు మాట్లాడుకున్నాక "జీవితం లో పెళ్లి చేసుకోను అన్నావు ఇప్పుడు ఎమ్ అయ్యింది నీ దరిద్రం కొద్ది నువ్వే పెళ్లి చేసుకున్నావు సరే కానీ ఎప్పుడు పరిచయం చేస్తావ్ తనని" అన్నాడు దానికి వినయ్ "సండే ఇంటికి రా నువ్వు మమత రండి పరిచయం చేస్తా" అన్నాడు ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్లాడు లోపలికి వెళ్లగానే తనకి ఇష్టం అయిన చేపల పులుసు వాసన తగిలింది దాంతో వినయ్ కొంచెం కూల్ అయ్యాడు అంతే కిచెన్ లోకి వెళ్లి రెండు పీస్ లు ప్లేట్ లో వేసుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అప్పటి వరకు ఇంట్లో పరిస్థితి ఏమాత్రం పట్టించుకో లేదు తనకి నచ్చింది తన కళ్ల ముందు ఉంటే ప్రపంచం తో సంబంధం లేకుండా బ్రతికేస్తాడు వినయ్ ఆ తర్వాత అప్పుడు చూశాడు తన ఇల్లు మొత్తం exhibition గ్రౌండ్ లాగా అంత మంది తో నిండిపోయింది దాంతో అంత సేపు ఉన్న ప్రశాంతత మొత్తం పోయింది దాంతో చిరాకు గా తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడు విద్య బట్టలు మార్చుకుంటు కనిపించింది దాంతో కొద్ది సేపు బయట ఉన్నాడు ఆ తర్వాత విద్య బయటికి భయపడుతూ వచ్చింది.

" సారీ నాకూ తెలియదు వాళ్లు వస్తున్నారు అని సడన్ మార్నింగ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నాము అడ్రస్ చెప్పు అంటే ఇంక ఇలా వచ్చేసారు" అని చెప్పింది అ తరువాత ఆ ఆంటీ అన్న పదం గురించి అడిగింది దానికి వినయ్ అర్థం చెప్తే విద్య కొంచెం cool అయ్యింది ఇంకో రెండు రోజులు అమ్మ నాన్న వాలు ఉంటారు అనింది, దాంతో వినయ్ తన ఫోన్ తీసి రేపు ఉదయం 5 గంటల ఫ్లయిట్ కీ టికెట్ లు బుక్ చేసి వాళ్ల నాన్న కీ పంపించాడు అది చూసి ఆయన షాక్ అయ్యి వినయ్ తో మాట్లాడడానికి వెళ్లాడు "రేయ్ ఏంటి రా ఇది కనీసం రెండు రోజులు అయిన ఉండకుండా వెళ్లిపో అంటున్నావు ఎప్పుడు రానీయకుండా ఇపుడు వస్తే వెనకు పంపుతున్నావు" అని అన్నాడు దానికి వినయ్ "ఏదో పెద్ద నా మీద ప్రేమ ఉన్నట్లు నటించింది చాలు ఈ నెల బ్యాంక్ లోన్ కట్టడం లేట్ అయ్యింది అనే కదా నీ ఏడుపు రేపు కట్టేస్తా ఇంకో సారి నాకూ చెప్పకుండా వస్తే చంపేస్తా నువ్వు మీ నాన్న ఉన్న ఆస్తి మొత్తం దాన ధర్మాలు చేశారు నాకూ తినడానికి తిండి లేక చేశారు పేరు కీ జమీందారు కుటుంబం కాని పైన ఏమీ లేదు నీ వల్ల నా కలలు అని చంపుకొని బతుకుతున్నా మళ్లీ ఇక్కడికి రావ్వోదు ఇక్కడ నను ప్రశాంతంగా ఉండనివ్వు "అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు.

రాత్రి 12 కీ విద్య వినయ్ రూమ్ కొట్టి లేపింది వినయ్ నిద్ర మబ్బులో లేచి డోర్ తీసి చూస్తే అందరూ హ్యాపీ బర్త్ డే అని అరిచారు (పొద్దున ఫేస్ బుక్ లో చూసిన విషయం ఇదే) అప్పుడు వినయ్ అందరినీ చూసి విద్య నీ గట్టిగా లాగి కొట్టి వెళ్లి పడుకున్నాడు,అది చూసి విద్య కుటుంబం వినయ్ అమ్మ నాన్న అంతా షాక్ అయ్యారు పెళ్లి అయిన వారం కీ తన కూతురిని ఏడిపించాడు అని బాధ తో ఉదయం ఫ్లయిట్ కీ అందరూ తిరిగి వెళ్లిపోయారు కానీ విద్య మైండ్ లో ఒకటే ఆలోచన ఉంది.

(కొన్ని రోజుల క్రితం)

ఒక రోజు విద్య గుడికి వెళ్లి "దేవుడా నాకూ ఒక మంచి అబ్బాయి నీ నా జీవితంలోకి పంపు నా ఫ్రెండ్స్ కీ అందరికీ ఉన్నారు నాకూ ఒకడిని ఇవ్వు" అని కళ్లు మూసుకుని దండం పెట్టుకుని ఉంటే అప్పుడే పూజారి "శతమానంభవతి పండంటి పిల్లలతో సంతోషంగా ఉండండి" అని ఆశీర్వదించాడు అప్పుడు కళ్లు తెరిచి చూసిన విద్య పక్కన ఉన్న వినయ్ నీ చూసి అలాగే ఉండి పోయింది దానికి వినయ్ సారీ చెప్పి వెళ్లాడు అప్పటి నుంచి వినయ్ నే దేవుడు తన కోసం పంపాడు అని అనుకుంటుంది విద్య. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 27-06-2020, 08:28 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 4 Guest(s)