Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఆ లగేజీ వెహికల్ 15 నిమిషాల ఆలస్యం వలన చెరొకవైపు నుండి ఇద్దరమూ ఒకేసారి ఇంటికి చేరుకున్నాము . 
కృష్ణగాడు తన ఇన్ఫ్లుయెన్స్ తో ఆ వీధిని మాత్రమే చీకటిగా మార్పించినట్లు మేము ఎదురెదురుగా ఆగడం , చీకటిగా ఉందని అక్కయ్యావాళ్ళు గుసగుసలాడుతూ కిందకు దిగగానే మొదట అంటీ అక్కయ్య ఇల్లులు విద్యుత్ కాంతులతో వెలిగిపోవడం చూసి అక్కయ్యా , బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ , మహి తన ఫ్రెండ్స్ సంభ్రమాశ్చర్యంతో కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయారు . WELCOME ......... అంటూ గాల్లోకి ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఎగిరాయి .
ఎలా ఉండాలోనని చెప్పిన నేనే షాక్ లో ఉండిపోయాను . లవ్ యు రా మామా అని మురిసిపోయాను .
 అడుగులు అటువైపు పడి Wow ......... అమ్మా , అంటీ మనం మన ఇంటికే వచ్చామా.......... కొత్తగా మారిపోయాయి అని మెయిన్ గేట్ తీసుకుని నేలపై పరిచిన పూలతో లోపలకువెళ్లి , కాంపౌండ్ మొత్తం రంగురంగుల పూలతో పచ్చని పూలమొక్కలతో కనువిందు చేస్తుండటం చూసి ఒకరినొకరు సంతోషంతో కౌగిలించుకుని , బయటే ఇలా ఉంటే లోపల ఇంకెలా ఉంటుందోనని ఆతృతతో మెయిన్ డోర్ తియ్యబోతుంటే , 

తల్లీ లావణ్యా .......... ఇదంతా మీ అంటీ వాళ్ళ పెద్దమ్మ గారికోసం ఏర్పాట్లుచేశారు కాబట్టి ఆమె వచ్చేన్తవరకూ మనం వేచిచూడటం మంచిదేమో అని అక్కయ్య చెబుతుండగానే , 
తల్లీ వాసంతీ ........... ఆ పెద్దమ్మను నేనే అంటూ నేరుగా అక్కయ్యదగ్గరకువెళ్లి , ఎంత మంచిమనసు తల్లీ నీది , మొదటి కలయికలోనే నా హృదయాన్ని కదిలించావు, నా కొడుకూ కోడలూ ఉన్నారు నేను ఎప్పుడెప్పుడు పైకిపోతానా నా ఆస్తిమొత్తం అనుభవిద్దామా అని గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు . 
ఒకసారి ఓకేఒక్కసారి నిన్ను కౌగిలించుకోవచ్చా ............
పెద్ద.......... 
ఊ .......... ప్రేమతో పిలువుతల్లీ ..........
పెద్దమ్మా ............ ప్రయాణం బాగా జరిగిందా , ముందు లోపలకు రండి అలసిపోయి ఉంటారు అని ఆప్యాయంగా పిలిచింది అక్కయ్య .
ముందు నిన్ను కౌగిలించుకుని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టిన తరువాతనే లోపలకు అడుగుపెట్టేది లేకపోతే ఇటునుండి ఇటే ఫ్లైట్ లో వెనక్కు వెళ్లిపోతాను .
అక్కయ్య పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మా .......... రాగానే నా పేరుపెట్టి పిలిచారు - ఆశ్చర్యం , ఇప్పుడు అంతులేని ప్రేమను కురిపిస్తున్నారు - ఎవరైనా తల్లిప్రేమను కాదంటారా ............
లవ్ యు తల్లీ ......... రెడీ 3 2 1 ........ అంటూ అక్కయ్య బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి కౌగిలించుకుని , అక్కయ్య గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్యకు ఎలా ఉంది అని కన్నుకొట్టింది .
ఉమ్మా .......... సూపర్ పెద్దమ్మా అంటూ ఇద్దరూ చేతులు కలిపారు . హమ్మయ్యా ......... ఇప్పటికిగానీ నా ప్రాణం నిలబడింది అని నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు తల్లీ మనసారా దీవించి , మహీ కదా - బుజ్జి జానకి కదా - బుజ్జి మహేష్ కదా .......... ఎలా ఉన్నారూ , మీ అమ్మను సంతోషపెట్టడంలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు కదూ బంగారం లాంటి పిల్లలు ...........మీరెలా తెలుసు అని ఆశ్చర్యపోతున్నారా ........ మహి నీ ఫ్రెండ్స్ పేర్లు కూడా తెలుసు మా రాధకు ఎప్పుడు కాల్ చేసినా మీ గురించే చెబుతూ ఉంటుంది  కానీ ఎవరి పేరు ఏంటో తెలియదు చకచకా నాలుగు పేర్లు చెప్పేసింది .
నేను నేను నేను నేను .......... అంటూ పెద్దమ్మ ముందుకు వచ్చి షాక్ లో ఉండిపోయారు .
ఇంతకీ మా వాసంతి ఎత్తుకున్న ఈ బుజ్జిదేవత ఎవరూ ..........ఒక్కక్షణం కూడా వాసంతిని ఉండలేనట్లు హత్తుకుపోయింది . ఒక్క నిమిషం ఒక్కనిమిషం వెలుతురు వైపు తిరగండి , wow .......... లవ్లీ లవ్లీ ......... ఇద్దరూ కవలల్లా ఉన్నారే , మిమ్మల్ని మీ సంతోషాన్ని చూడటానికి రెండుకళ్ళూ చాలడం లేదు ఒకసారి నా దగ్గరకు వస్తావా బుజ్జితల్లీ .......... 
అక్కయ్యను మరింత గట్టిగా అల్లుకుపోయింది .
పెద్దమ్మా .......... అమ్మ పేరూ వాసంతి - బుజ్జిఅమ్మ పేరూ వాసంతినే , ఒకరంటే మరొకరికి ప్రాణం . రోజులో 23 గంటలా 59 నిమిషాలా 59 సెకన్లు ఇలాగే ఉంటారు , మిగిలిన ఒక్క క్షణం మా దగ్గరకువచ్చి ముద్దుపెట్టెలోపు మళ్లీ అమ్మ గుండెలపైకి చేరిపోతుంది , ఇదిగో వీరు బుజ్జిఅమ్మ తల్లి తన దగ్గరికి కూడా వెళ్ళరు అని సంతోషంతో తియ్యని కోపంతో చెప్పింది లావణ్య .
ఉమ్మా ఉమ్మా ........... అలా అయితే నీ ఇష్టం బుజ్జితల్లీ అంటూ బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి చెల్లివైపు చూసి నవ్వుతుంటే ,
మా అక్కయ్యను సంతోషంతో పలకరించారు కాబట్టి , అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి పెద్దమ్మా .......అంటూ చేతులను చాపడంతో , లవ్ యు లవ్ యు యాహూ .......... నా బంగారుకొండ బుజ్జితల్లీ అంటూ గుండెలపై హత్తుకొని , అక్కయ్యతో మనసారా ఎంజాయ్ చేస్తున్నావా బుజ్జితల్లీ అని నుదుటిపై ముద్దుపెట్టి వెంటనే అక్కయ్యకు అందించి , నా పేరు మహాలక్ష్మి .......... పెద్దమ్మ అని పిలిస్తే చాలా ఆనందిస్తాను . మీ అందరికీ గిఫ్ట్స్ తెద్దామనుకున్నాను , ఆ గిఫ్ట్స్ కొనే సమయాన్ని కూడా వృధాచెయ్యకుండా మిమ్మల్ని చూడటానికి పరుగున వచ్చేసాను . ఇల్లు చూసి ఫ్రెష్ అయ్యి షాపింగ్ వెళుతున్నాము . 

పెద్దమ్మా .......... చాలాదూరం ప్రయాణించి ఉంటారు , అలసిపోయి ఉంటారు . మీరు మాతో ఆప్యాయంగా మాట్లాడారు అంతకంటే గిఫ్ట్స్ ఇంకేమికావాలి . మీరే మా గిఫ్ట్ ..........., అవును పెద్దమ్మా అని అందరూ వంత పాడారు . 7 అవుతోంది అంటే భోజనం సమయం కూడా అయ్యింది . వేడివేడిగా వండుతాను తిని హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పింది అక్కయ్య .
అందుకే చెబుతున్నాను నా బంగారు తల్లీ .......... తొందరగా రెడీ అయ్యి , చూస్తుంటే అందరూ రెడీ అయ్యే ఉన్నారు కాబట్టి నేనొక్కటే క్షణాల్లో రెడీ అయిపోతాను బయలుదేరుదాము . షాప్స్ క్లోజ్ చేసేలోపు ఈరోజు కొన్ని మిగతావి రేపు ..........
పెద్దమ్మా ...........
పెద్దమ్మ లేదు ఏమీ లేదు , నాకు కాస్త టెంపర్ ఎక్కువ . మీరు నా మాట వింటానంటే ఇక్కడ ఉంటాను లేకపోతే ఎయిర్పోర్ట్ కు అటునుండి ఆటే నా కొడుకు దగ్గరికి అంటే నరకానికి వెళ్లిపోతాను అని కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ చెప్పింది .

పెద్దమ్మా పెద్దమ్మా .......... మీరు బాధపడకండి , మీ ఇష్టమే మా ఇష్టం పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్స్ కదా త్వరగా తీసుకుని వచ్చేద్దాము .
 ఏడుపు ఆపేస్తున్నాను కానీ నాకు ఈ క్షణం నుండీ పెద్దమ్మా వద్దు నో..... అనిమాత్రం వినిపించకూడదు . అలా అయితేనే మీతోపాటు ఉంటాను లేకపోతే ..........వెళ్లిపోతాను . నేనేదో సరదాగా ఉండటానికి వచ్చాను మీరు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు అని మళ్ళీ యాక్టింగ్ .
అక్కయ్యా .......... గిఫ్ట్స్ కదా ఇస్తాను అన్నారు , బాంబుల్లా ఫీల్ అవుతున్నారు . ఊ అనెయ్యండి . పెద్దమ్మతో డబ్బులు లెక్కలేనన్ని ఉన్నట్లున్నాయి కొడుక్కి ఎలాగో ఇవ్వనంటున్నారు కాబట్టి మొత్తం మనం లాగేసి , ఆమె అహంకారాన్ని అణిచివేద్దాము అని గుసగుసలాడింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిఅక్కయ్య మాటలకు అందరికీ నవ్వు వచ్చేసింది .
మీరు నవ్వుతున్నారంటే ok అన్నట్లే ........... నేను ఇక్కడ ఉండేంతవరకూ నా మాటే నెగ్గాలి సరేనా ...........
మీ ఇష్టం పెద్దమ్మా ......... అంటూ నవ్వుకుని , ఇప్పటికైనా లోపలకు రండి , మీకోసం టీ చేస్తాము అనిచెప్పారు . 
టీ లేదు జ్యూస్ లేదు ముందు షాపింగ్ ......... అంటూ మహి బుజ్జిఅమ్మ చేతులను అందుకొని లోపలకు అడుగుపెట్టగానే అడుగుల చప్పుడుకే లైట్స్ వెలిగాయి . Wow సెన్సార్స్ .......... అంటూ మహి సంతోషంతో చెప్పడంతోపాటు లోపల చూసి నోటిమాట పడిపోయింది .

అదేంటో అర్థం కాకపోయినా అవును మహీ తల్లీ ........ అని పెద్దమ్మ ఊ కొట్టింది .
పెద్దమ్మా ......... మీకోసమే అంటీ ఈ ఏర్పాట్లన్నీ చేశారు , ఒసేయ్ లావణ్యా లాస్య అని మహి కేకలు వేయడంతో , 
చూస్తున్నాము లేవే అంటూ రంగురంగుల డిజైన్స్ తో గోడల రంగులు , led లైట్స్ , బిగ్గెస్ట్ టీవీ , AC , పిల్లల ట్యూషన్ కోసం ప్రొజెక్టర్ స్క్రీన్ , న్యూ ఫర్నిచర్ , పూర్తి మోడరన్ గా మారిపోయిన వంట గది , బెడ్ రూమ్స్ .......... పూర్తిగా మారిపోయి ఉండటం చూసి నోరుతెరిచి అలా షాక్ లో చూస్తూ ఉండిపోయారు .
అమ్మా .......... బుజ్జిఅమ్మ అడుగుపెట్టారు మా అమ్మ పెదాలపై చిరునవ్వు పూయించారు . పెద్దమ్మ అడుగుపెట్టారు ఇంటినే మార్చేశారు . ఇప్పుడు ఇంకా గిఫ్ట్స్ అంటున్నారు ......... మా కళ్లతో మేము చూడాలని లేట్ గా వస్తాము అని ఇంటికి కాల్ చేసి చెప్పేసాము . 
అక్కయ్యా ......... ఏంటి అలా చూస్తున్నారు . సూపర్ గా మారిపోయింది కదూ .......
ఏంటో బుజ్జిచెల్లీ నాకు అంతా మాయలా ఉంది . కానీ పాత ఇంటిలో మా బుజ్జిచెల్లి ఎలా ఉంటుంది అని బాధపడ్డాను ఇప్పుడు చాలా సంతోషం , పెద్దమ్మకు ఏవిధంగా థాంక్స్ చెప్పాలో అని రూంలోనుండి ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన పెద్దమ్మకు రెండుచేతులతో నమస్కరించింది .
తల్లీ ............ ఇంకెప్పుడూ ఇలా చెయ్యనే చెయ్యకు , నేను తట్టుకోలేను అని బుగ్గపై చేతినివేసి , ఎన్ని కష్టాలను అనుభవించావు నీ సంతోషం కోసం నీ తమ్ముడు అనుక్షణం పాటుపడుతున్నాడు అని మనసులో అనుకుని షాపింగ్ వెళదాము పదండి , బుజ్జితల్లీ ......... అక్కయ్య చేతులు నొప్పిపుడతాయేమో నేను ఎత్తుకోనా కాసేపు . 
పెద్దమ్మా ........ మీకు కూడా నొప్పివేస్తాయి నేను నడుస్తాను అని కిందకు దిగి ఇద్దరి చేతులనూ అందుకుంది .

 ఒక్కనిమిషం పెద్దమ్మా ......... అంటీ మీ ఇల్లు చూద్దాము పదండి అని లావన్యతోపాటు అందరూవెళ్లి చూసి అంతే సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
తల్లీ వాసంతి - మహి - బుజ్జిఅమ్మా - లావణ్య ........... మీ మొబైల్ నెంబర్ల నుండి నాకు missed కాల్స్ ఇవ్వండి మనమంతా కలిసి ఒక గ్రూప్ create చేద్దాము . ఎవరో ముగ్గురి నెంబర్స్ రాలేదు . 
పెద్దమ్మా ........ మా అక్కయ్యకూ - మహికి - బుజ్జిఅమ్మకూ - బుజ్జిమహేష్ కు కలిపి ఒకే ఒక చిన్న మొబైల్ ............
గుడ్ ........ అయితే షాపింగ్ అక్కడ నుండే మొదలుపెడదాము రండి బయట క్యాబ్స్ ను wait చెయ్యమని చెప్పాను .

పెద్దమ్మా ........ 
తల్లీ వాసంతి ఇప్పుడెందుకు వద్దు అంటున్నావు కదూ ........
నెనుఉండను ఒక్కనిమిషం కూడా నేనుండను ఇక్కడ లగేజీ బయటే ఉంది కదూ వచ్చిన క్యాబ్స్ లోనే ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోతాను .
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య నవ్వుకుని sorry sorry ........ పెద్దమ్మా , వద్దు అనికాదు సిటీలోనే పెద్ద మొబైల్ షోరూం తెలుసు అని చెప్పబోయాము .
లవ్ యు లవ్ యు ........ అయితే ok , ఇక మనమధ్యన sorry లు కూడా ఉండకూడదు . 
లవ్ యు పెద్దమ్మా ......... అని బుజ్జిఅక్కయ్య సంతోషంతో ఇంతే ఏమాత్రం తగ్గద్దండి అని చెప్పింది .
ఉమ్మా ....... అంటూ బుజ్జిఅక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , తల్లీ వాసంతి మహీ .......... నా లగేజీ కూడా నాతోపాటు తెచ్చుకుంటాను . మరొక్కసారి ఇలా నో అన్నారో అటునుండి ఆటే అంటూ అందరూ బయటకువచ్చి డ్రైవర్లతో బుజ్జిఅక్కయ్య లగేజీ మొత్తాన్ని లోపల పెట్టించి అడిగిన మొత్తం పే చేసేసి పంపించి ఇంటికి లాక్ చేశారు .
*********

ఈ గ్యాప్ లో చెల్లి నాకు కాల్ చేసి అలాగే తన హ్యాండ్ బ్యాగులో వదిలెయ్యడం వలన పెద్దమ్మ ఇరగదీస్తున్న యాక్టింగ్ వింటూ కృష్ణగాడితోపాటు ఎంజాయ్ చేస్తూ , క్యాబ్స్ ను ఇక్కడే wait చెయ్యమని అమౌంట్ ఇచ్చి , అన్నయ్యల కుటుంబాలను అపార్ట్మెంట్ లో వదిలి రెస్ట్ తీసుకోండి , హోటల్ కు వెళ్లి మాంచి భోజనం చెయ్యండి రేపు ఉదయం నుండీ బయట మా వదినలకు డ్యూటీ - ఇళ్లల్లో పిల్లలను చూసుకునే డ్యూటీ మా అన్నయ్యలది అని అమౌంట్ ఇచ్చాను .
మహేష్ సర్ ......... సరైన పని అప్పగించారు అని వదినలు సంతోషంతో నవ్వుకుని అపార్ట్మెంట్స్ చూసి , శ్రీవారూ ........... అన్నీ వసతులూ ఉన్నాయి . ఏవీ కొనాల్సిన అవసరం లేదు . 
మహేష్ సర్ అంటే అంతేమరి .......... అని సంతోషించారు .

నేను చెల్లి మొబైల్ నుండి కృష్ణగాడు పెద్దమ్మ మొబైల్ నుండి అక్కయ్యా - బుజ్జిఅక్కయ్య - పెద్దమ్మ మాటలు వింటూనే చివరి క్యాబ్ లో ఎక్కి కూర్చున్నాము . 
 పెద్దమ్మ ....... అక్కయ్య వదలకుండా పట్టుకున్న బుజ్జిఅక్కయ్య మరొకచేతిని మరియు బుజ్జిఅమ్మ చేతులను అందుకొని అక్కయ్యతోపాటు మొదటి క్యాబ్ లో కూర్చోబోతూ , తల్లీ కృష్ణా మహీ లావణ్యా ......... మమ్మల్ని ఫాలో అయిపోండి అని బుజ్జిఅక్కయ్యనూ బుజ్జిఅమ్మనూ మధ్యలో కూర్చోబెట్టుకొని బుజ్జి మహేష్ ను ఒడిలో కూర్చోబెట్టుకుంది . బుజ్జిఅమ్మా ........ ఎలాంటి మొబైల్ గిఫ్ట్ గా కావాలి అని అడిగింది .
పెద్దమ్మ గారూ ......... నాకూ మరియు బుజ్జి నాన్నకూ ఇప్పట్లో ఈ వయసులోనే మొబైల్ అవసరం లేదనుకుంటాను . 
 మా బుజ్జి జానకీ బంగారం , నేనున్న కొన్నిరోజులూ మీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడటానికి నాకు అవసరం . నాతో ఉన్నన్ని రోజులూ మీకు ఏలోటూ ఉండకూడదు నా ఈగో ఒప్పుకోదు సరేనా ......... కావాలంటే నేను వెళ్లిపోయిన తరువాత మొబైల్ పగలగొట్టేసెయ్యి అని కురులపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
బుజ్జిమహేష్ .......... నీకూ ..........
మా బుజ్జిఅమ్మ ఎలా అంటే అలా అని బదులిచ్చాడు .
తల్లీ వాసంతి ......... బంగారం లాంటి పిల్లలను కన్నావు , ఇప్పటివరకూ ఉన్నంతలో ప్రాణంలా చూసుకున్నావు . నేనొచ్చేసాను కష్టం బాధ అన్నమాట ఉండకూడదు అలా చూసుకుంటాను . 
పెద్దమ్మా .......... ఈ ప్రపంచంలో మాలాంటివాళ్ళు చాలామందే ఉన్నారు . మా గురించి మీకు తెలుసనికూడా అనుకోవడం లేదు . మేమే ఎందుకు అని అడిగింది అక్కయ్య .
 పెద్దమ్మ :  అదీ అదీ .......... అంటూ తడబడి , తల్లీ ........ త్వరలోనే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి అంతవరకూ , రాధ చెప్పినట్లు మీ బుజ్జిచెల్లితో సంతోషంగా ఉండాలి .
 అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... నువ్వూ కొన్నిరోజుల్లో అన్నావు , ఇప్పుడు పెద్దమ్మ కూడా కొన్నిరోజుల్లో అంటున్నారు .......... ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... కొన్నిరోజుల్లో .........
అక్కయ్య : కొన్నిరోజుల్లో అర్థమవుతుంది అంటావు అంతేకదా అంటూ బుజ్జిఅక్కయ్యకు గిలిగింతలు పెట్టి , చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ......... అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని మురిసిపోయింది .

మేడం సిటీ సెంటర్ కు వచ్చాము ఎక్కడికీ పోనివ్వమంటారు అని డ్రైవర్ అడిగాడు .
డ్రైవర్ .......... వైజాగ్ లోనే బిగ్గెస్ట్ మొబైల్ షాప్ కు తీసుకెళ్లు అని బుజ్జిఅక్కయ్య చెప్పి , అంతేకదా పెద్దమ్మ గారూ .......... అని ధీర్ఘం తీసింది .
పెద్దమ్మ : లవ్ యు బుజ్జితల్లీ ........... ఉమ్మా .........
5 నిమిషాలలో డ్రైవర్ కారుని ఆపి పాప .......... వైజాగ్ లో ఇదే పెద్ద మొబైల్ షాప్ అన్నిరకాల మొబైల్స్ దొరుకుతాయి అని డ్రైవర్ చెప్పాడు .
అవును పెద్దదే ..........
అయితే వెళదాము బుజ్జితల్లీ ......... , మీ బుజ్జిఅమ్మకూ బుజ్జితమ్ముడికీ నువ్వే సెలెక్ట్ చెయ్యాలి అని కారుదిగి అక్కయ్యతోపాటు మహీ మహి ఫ్రెండ్స్ ను అంటీని లోపలకు పంపించి కారులోనే కూర్చున్న నాతో మొబైల్లో మాట్లాడారు .
పెద్దమ్మా ......... మహికి ఏది కొనిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కు కూడా .......... అనిచెప్పాను .
అర్థమైపోయింది మహేష్ .......... ఇకచూసుకో అని విజయపు సింబల్ చూపించారు.

అమ్మా ......... నేను పాత మొబైల్ యూజ్ చేస్తాను . పెద్దమ్మ కోప్పడకముందే మీరు తీసుకోండి అనిచెప్పింది మహి .
తల్లీ ........ ఏంటో నాకు అర్థం కావడం లేదు . ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించనేలేదు . తీసుకుంటే ఇబ్బంది పడాల్సివస్తోంది తీసుకోకపోతే పెద్దమ్మ కోపంతో ఊగిపోయేలా ఉన్నారు . 
అక్కయ్యా ......... పెద్దమ్మ లోపలికి వచ్చేస్తోంది అని బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులతో చెప్పింది . చెల్లి ఒక్కమాటకూడా మాట్లాడకుండా జరుగుతున్న వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది .
బాబూ .......... మూడు చిన్న మొబైల్స్ చూపించండి అని అక్కయ్య అడిగింది .
చిన్న మొబైల్స్ కోసమా ఇంతమంది వచ్చింది కాసేపు ఆగండి అని చీప్ గా చూస్తూ వాడు మరొక కస్టమర్ దగ్గరకు వెళ్ళిపోయాడు .
వినగానే కోపంతో ఊగిపోతూ కారు దిగబోతుంటే , కృష్ణగాడు ఆపి రేయ్ మామా ......... అక్కడ ఉన్నది మన డేరింగ్ అండ్ డాషింగ్ బుజ్జిఅక్కయ్యరా ......... జరగబోవు విచిత్రాన్ని చూడమని ఆపాడు .

 బుజ్జిఅక్కయ్య కోపంతో పెద్దమ్మ చేతిని పట్టుకునివెళ్లి , చెవిలో అక్కయ్య చిన్న మొబైల్స్ అడగడం సేల్స్ మ్యాన్ వెళ్లిపోవడం గురించి చెప్పింది .

అక్కయ్య తలదించుకుని ఉండటం చూసి పెద్దమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .
పెద్దమ్మా ........... అక్కయ్య బాధపడటం లేదు చేతిని చూడండి ఎలా నలిపేసుకుంటున్నారో ..........
ఆ ........ అవును బుజ్జితల్లీ...........
అంటే కోపం వస్తోంది అక్కయ్యకు , నాకు తెలిసి తమ్ముడితో చిప్పప్పటి షాపింగ్ గుర్తుకువచ్చిఉంటుంది ఆడిగినవన్నీ ఎంత కాస్ట్ అయినా ఇప్పించారు . ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా ........ అని కోపంతో బాధపడుతున్నారు . మనకు కావాల్సింది ఈ ఎమోషనే ............
బుజ్జితల్లీ ........ ఉమ్మా అంటూ ఎత్తుకుని కాస్త దూరంలో కూర్చున్న మహిదగ్గరకువెళ్లి, మహీ ......... ఒక పేపర్ పెన్ అందుకో చెబుతాను . Ok ....... కాలేజ్ వెళ్లే అమ్మాయిలు ఏ మొబైల్ కోరుకుంటారు అని పెద్దమ్మ అడిగింది .

పెద్దమ్మా ......... పోయి పోయి దీన్నే ఆడిగారా , దీనికి చదువు మరియు అమ్మ పిల్లల సంతోషం తప్ప వేరే ధ్యాస లేదు , మమ్మల్ని అడగండి అంటూ లావణ్య మహిబుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , ఐఫోన్స్ ......... పెద్దమ్మా ........
పెద్దమ్మ : ఆ ........ ఐఫోన్స్ అదేదో అప్డేట్ .......కొత్త అంటారు లావణ్య .........
లావణ్య : లేటెస్ట్ వర్షన్ పెద్దమ్మా ..........
పెద్దమ్మ : ఆ ........ లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ ఏదో అది రాయండి .
లావణ్య : మహి రాయవే మనకు ఐఫోన్ గురించి updates వస్తాయి ప్రస్తుత లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ 11 ప్రో మాక్స్ ............, మహి పేపర్ పై రాసింది .
పెద్దమ్మ : నెక్స్ట్ ఐఫోన్ తరువాత గొప్పది ఏది లావణ్యా ........
లాస్య : వన్ ప్లస్ పెద్దమ్మా ........
పెద్దమ్మ : ఆ వన్ ప్లస్సో , టూ ప్లస్సో .......... అందులోని ఖరీదైన లేటెస్ట్ మోడల్ , నెక్స్ట్ అదిగో ఎదురుగా అక్కడ పెద్ద ఫొటోలో ఉన్నది ఏంటి .
లావణ్య : మోటో ఎడ్జ్ పెద్దమ్మా ........
పెద్దమ్మ : ఎడ్జి నో గిడ్జిని అది రాయి మహి ........, అలాగే మా ఇంట్లో మా మనవడు పెద్ద స్క్రీన్ ఉండేదానితో పెద్దగా గేమ్స్ ఆడుకునేవాడు క్యాబో ల్యాబో ........ అనేవాడు . 
మహి ఫ్రెండ్స్ నవ్వుకుని క్యాబ్ కాదు పెద్దమ్మా ట్యాబ్ ...........
 పెద్దమ్మ :  ఆ అదే అదే ట్యాబ్ కంపెనీ వచ్చేసి కట్ చేసిన ఆపిల్ గుర్తు ఉంటుంది ..........
ఆ కంపెనీ పేరే ఆపిల్ అమ్మమ్మా .........
పెద్దమ్మ : ఆ ....... అదే రాయి మహి తల్లీ .........అలాగే వైర్ లేకుండా పాటలు వింటూండేవారు .
బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ పెద్దమ్మా .........
పెద్దమ్మ : ఆ అవే అవే ......... రాయి మహీ ......... ఆపిల్ గుర్తు తప్పనిసరిగా ఉండాలి. అలాగే చెవిలో పెద్దగా పెట్టుకుని పాటలకు స్టెప్పులేస్తూ రోడ్డులో బిల్డప్ ఇస్తూ వెళ్తుంటారు అవికూడా రాయి తల్లీ ......... లావణ్య ...... అదేంటీ అన్నావు లేటెస్ట్ ఆ ఆ లేటెస్ట్ గా ఏమేమి వచ్చాయో అవన్నీ రాయించు . మనం కొనేవి చూసి వాడి మైండ్ బ్లాక్ అవ్వాలి , నా వాసంతి తల్లి సంతోషంతో గర్వపడాలి . 
మీరు సూపర్ పెద్దమ్మా ......... అంటూ అమితమైన ఆనందంతో లావణ్య తన మొబైల్ లో చెక్ చేసి మహి కి చెప్పింది .

 పెద్దమ్మా ......... అన్నీ రాసేసాను అని మహి అందించింది . బుజ్జిఅక్కయ్యతోపాటు పెద్ద లిస్ట్ చూసి మహి నుండి పెన్ అందుకొని ఐఫోన్స్ ముందు 5 అని - టాబ్స్ ముందు 8 అని - ఇయర్ బడ్స్ ముందు 8 అని - హెడ్ ఫోన్స్ ముందు 7 అని ........ అన్నింటి ముందూ రాసి ok నా బుజ్జితల్లీ ..........
లవ్ యు పెద్దమ్మ గారూ ......... అని బుజ్జిబుజ్జినవ్వులతో బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
అయితే మీ అక్కయ్య దగ్గరకు తీసుకెళ్లు అని ప్రాణమైన ముద్దుపెట్టి కిందకు దించింది.

అక్కయ్యా .......... అంటూ హుషారుగా వెళ్లి పేపర్ అందించి ఇప్పుడు ఆర్డర్ ఇవ్వండి అని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి అక్కయ్య ఒడిలో చేరింది .
అక్కయ్య :  పేద్ద లిస్ట్ చూసి షాక్ నుండి తేరుకుని బుజ్జిచెల్లీ - పెద్దమ్మా ........
అక్కయ్యా ......... చీప్ అని వెళ్లినవాడికి చెమటలుపట్టాలి అని బుజ్జిఅక్కయ్య - తల్లీ వాసంతి అన్నిదగ్గరా మొహమాటం పనికిరాదు , నెనున్నంతవరకూ నా మాట వినాలని చెప్పాను కదా , కావాలంటే నేను వెళ్లిపోయిన వెంటనే నేను కొనిచ్చినవన్నీ...........
పెద్దమ్మా .......... అంటూ ఉద్వేగంతో చేతిని అందుకొని ముద్దుపెట్టి ఆనందిస్తుంటే , అందరూ చూసి ఒకరినొకరు హత్తుకొని మురిసిపోయారు . మహి కళ్ళల్లో చెమ్మతో అక్కయ్యనే చూస్తూ పరవశించిపోతోంది .

బుజ్జిఅక్కయ్య ........ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , హలో ఇక్కడ ఇంతమంది ఉన్నాము కనిపించడం లేదా అని కోపం ప్రదర్శించింది బుజ్జిఅక్కయ్య .
ముగ్గురు సేల్స్ మ్యాన్స్ ఖాళీగా ఉన్నప్పటికీ ఒక పిల్లవాడిని మాదగ్గరకు పంపించి రేయ్ వాళ్లకు నువ్వే చిన్న మొబైల్స్ కోసం పెద్ద గ్యాంగ్ వచ్చింది అని వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకున్నారు .
పిల్లాడు కూడా నవ్వుతూ వచ్చి samsung , nokia , jio .........ఏ కంపెనీ కావాలి మేడం అని అడిగాడు .
బుజ్జిఅక్కయ్య నవ్వుకుని అక్కయ్య చేతిలోని పేపర్ వాడికి అందించి మీ వాళ్లకు వీటన్నింటినీ చకచకా మా ముందు ఉంచితే తీసుకుని వెళ్లిపోతాము .
వాడు అందుకొని ఆరు ఐఫోన్ 11 ప్రో మాక్స్ మొబైల్స్ .......... అని చదివి షాక్ లో పరుగునవెళ్లి వాళ్లకు అందించాడు . 
ముగ్గురూ లిస్ట్ చూసి నుదుటిపై చెమటతో మాదగ్గరకు పరుగునవచ్చారు . 
ఏంటీ .......... లిస్ట్ చూసి గజగజా వణుకుతున్నారు . మళ్లీ చదివి వినిపించాలా అని బుజ్జిఅక్కయ్య లాక్కుని అక్కయ్యా ......... ఊ అంటూ అందించింది .

లవ్ యు బుజ్జిఅక్కయ్యా .......... వాళ్ళ ముఖాలు చూస్తుంటే , మనపై రెస్పెక్ట్ చూస్తుంటే చాలా చాలా సంతోషం వేస్తోంది అని ప్రాణంలా చుట్టేసి , 
Five ఐఫోన్ 11 ప్రో మాక్స్ మొబైల్స్ ............
లావణ్య : five ఐఫోన్స్ ? అంటూ షాక్ లో అక్కయ్య వెనుకకు చేరి పెద్దమ్మా ......... ఎవరికోసం అన్నట్లు అయోమయంతో చూస్తున్నారు .
నా ప్రాణమైన మహి మరియు తన ప్రాణమైన ఫ్రెండ్స్ కోసం............
అంతే వాళ్ళ నోటిలోనుండి ఒక్కమాటకూడా రాక షాక్ లో ఉండిపోవడం చూసి బుజ్జిఅక్కయ్యతోపాటు నవ్వుకుని , తల్లీ వాసంతి కంటిన్యూ ......... అంది పెద్దమ్మ .
 అక్కయ్య :  వన్ one plus 8 pro......... 
పెద్దమ్మ : అది మా బుజ్జి జానకి కోసం .
అక్కయ్య : వన్ మోటో ఎడ్జ్ ప్లస్ .........
పెద్దమ్మ : అది మా బుజ్జిమహేష్ కోసం ..........గేమ్స్ ఆడుకోవడానికి .
అక్కయ్య : two samsung note 10 plus ..........
బుజ్జిఅక్కయ్య : ఇది మా అక్కయ్య మరియు అంటీ కోసం అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది .
అక్కయ్య : 8 ఐఫోన్ ట్యాబ్స్ .......... 8 ఇయర్ బడ్స్
పెద్దమ్మ : మీ అందరికీ ఒక్కొక్కటి .........
అక్కయ్య .......... లిస్ట్ మొత్తం చదివి హమ్మయ్యా అయిపోయింది అంటూ ఆయాసంతో పేపర్ టేబుల్ పై ఉంచి ఎదురుగా సేల్స్ మ్యాన్ ముఖాలను చూసి గర్వపడుతూ లవ్ యు పెద్దమ్మా ......... అని మురిసిపోతోంది .
బుజ్జిఅక్కయ్య : ఏంటి అబ్బాయిలూ ......... ఇంకా షాక్ నుండి తెరుకోవడం లేదు . చకచకా ......... చూపిస్తే తీసుకుని కౌంటర్ లో బిల్ పే చేసి మా దారిన మేము వెళ్లిపోతాము అని అక్కయ్యతోపాటు నవ్వుతూ చెప్పింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 03-07-2020, 06:23 AM



Users browsing this thread: 18 Guest(s)