03-03-2019, 08:38 AM
(03-03-2019, 07:54 AM)ఐశ్వర్య Wrote: కథని కొనసాగిస్తాను ఇక ఎవరు ఏమన్నా అననీ..
వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒక్కటే,నా కథ నచ్చకపోతే చదవకండి,నచ్చితే చదివి ప్రోత్సహించండి అంతే తప్ప దిగజారుడు కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెట్టకండి.
ధన్యవాదాలు.
చాలా అంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఐశ్వర్య గారు. నాకు తెలిసినంత వరకు కధ రాసే రచయితకు చదివే పాఠకులు పెట్టె కామెంట్స్ బూస్ట్ అప్ లా ఉంటాయి(ఉండాలి కూడా). అవి కూడా కథకి సంభందించినంత వరకే ఉండాలి కానీ వ్యక్తిగతంగా వెళ్ళటం అన్నదానికి నేను వ్యతిరేకం. కధలో నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు అని రెండు మాత్రమే చెప్పాలి.
పాఠకులకి చిన్న విన్నపం. కధ నచ్చితే ఏమి నచ్చిందో చెప్పండి. నచ్చక పోతే ఏమి నచ్చలేదో చెప్పండి. ఏమైనా సరిచేసుకోవాల్సిన విషయాలుంటే తప్పకుండా చెప్పండి. అవి రచయితకి తన రచన మెరుగుపరుచుకునేందుకుఉపయోగపడతాయి. అంతే కాని వ్యతిగత విషయాలు, దరిద్రపు కామెంట్స్ తో ఇక్కడ ఆక్టివ్ గా ఉన్న అతికొద్ది మంది రచయితలని, వారి మనసు గాయపరచి ఈ సైట్ కి దూరం చేయకండి.
ఒకరిని వ్యక్తిగతంగా, నీచమైన కామెంట్స్ రాసుతున్నారంటే మీరెంత దిగజారారో ఆలోచించుకోండి.
పోతే ఐశ్వర్య గారు కధ బాగుంది. నాకు తెలిసి మీరు కధ రాయటం మొదటిసారి అనుకుంట. అయినా బాగా రాస్తున్నారు. బట్ చిన్న సలహా అక్కడక్కడా కొన్ని పదాలు అటూఇటూ అవుతున్నాయి అని నాకు అనిపించింది. మీకు అలాగే అనిపిస్తే ఒకే. లేదు కరెక్ట్ గానే వుందకుంటే వదిలెయ్యండి. కింది పేరా ఒకేసారి గమనించండి
【అనుకుంటున్నారా నేను కానీ దానితో మాట్లాడాలంటే ఎందుకో భయంగా ఉంది,పైగా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నా.
అవునా మరి అమ్మకి చెప్పి పంపించు అన్నయ్యా ఇంటికి రమ్మని.】
తిరిగి రాయలనుకున్నదుకు ధన్యవాదాలు. థాంక్యూ
Vishu99