Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రాత్రి ఆలస్యంగా పడుకోవడం వలన ఉదయం 7 గంటలైనా అందరూ ఘాడమైన నిద్రలో ఉన్నాము . 
బయట అయితే బుజ్జిఅక్కయ్య కోసం బుజ్జి ఫ్రెండ్స్ - మహిని చూడటం కోసం మహి పరిస్థితిని తెలుసుకోవడం కోసం ఇంటర్ స్టూడెంట్స్ , దెబ్బలు తిన్న యూత్ వారి పేరెంట్స్ తో సహా వచ్చేసి డిస్టర్బ్ చెయ్యకుండా వేచిచూస్తున్నారు . 
వదినలు తీలవారుఘామునే డ్యూటీ ఎక్కేసినట్లు అందరినీ చూసి సంతోషిస్తున్నారు .

లోపల ముందుగా లావణ్యకు మెలకువ వచ్చి వొళ్ళువిరుస్తూ లేచికూర్చుని చుట్టూ ఇంకా హాయిగా నిద్రపోతుండటంతో మహివైపు చూసి కంగారుపడుతూ రెండుచేతులతో కళ్ళుతిక్కుకుని , మహి హత్తుకున్న దిండు మొత్తం రక్తంతో ఎరుపు రంగులోకి మారిపోవడం చూసి ,  అమ్మా ........... అని గట్టిగా కేకవేసి బెడ్ పైకి చేరి చేతికున్న కట్లు మొత్తం కూడా ఎరుపు రంగులోకి మారిపోవడంతో , కళ్ళల్లో కన్నీళ్ళతో మహి మహి ............అని బుగ్గలను స్పృశించింది .
నీరసంగా మహి కళ్ళుతెరిచి పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ లావణ్య ........., సడెన్ గా లేచి కూర్చుని ఎందుకే ఏడుస్తున్నావు అని తన చేతులని - అప్పటివరకూ హత్తుకున్న దిండుని చూసి స్పృహ కోల్పోయింది . 

అమ్మా , పెద్దమ్మా , బుజ్జిఅమ్మా ........... అని కేకలువెయ్యడంతో , 
బయట అందరూ కంగారుపడిపోయి వాసంతి - చెల్లీ - మహీ ......... తలుపు తెరవండి అని తలుపులు కొడుతూ విండో లోనుండి చూస్తున్నా ఏమీ కనిపించక ఏమి జరిగిందోనని బాధపడుతున్నారు .
అక్కయ్యా ........ అంటూ లేపి ఇద్దరూ రూంలోకివెళ్లి చూసి , అక్కయ్య వెళ్లి మహీ మహీ ........ అంటూ ఏమిచెయ్యాలో తెలియక ఏడుస్తుండటం - మహి చేతులకు రక్తం చూసి , బుజ్జిఅక్కయ్య నోటివెంట మాటరానట్లు వొళ్ళంతా చెమటతో పరుగునవెళ్లి పెద్దమ్మను లేపి ఏడుస్తూ నోటివెంట మాటరానట్లు రూం వైపు చేతిని చూపించింది . 
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ......... అంటూ ప్రాణంలా గుండెలపై హత్తుకొని రూంలోకివెళ్లి చూసింది .

కింద చప్పుళ్లకు మెలకువ వచ్చి పైనుండి కిందకు చూసి రేయ్ మామా - చెల్లెమ్మా ......... అని కేకవేసి వేగంగా మెట్లుదిగివెళ్లి తమ్ముళ్లూ - అంకుల్ ఏమైంది అని కంగారుపడుతూనే అడిగి , పెద్దమ్మా పెద్దమ్మా ......... బుజ్జిఅక్కయ్యా బుజ్జిఅక్కయ్యా .......... అని కేకలువెయ్యడంతో , 
బుజ్జిఅక్కయ్య పెద్దమ్మకు డోర్ వైపు చేతిని చూపించి కదల్చడంతో షాక్ నుండి తేరుకుని , బజ్జుఅక్కయ్యను ఎత్తుకునే పరుగునవెళ్లి డోర్ తెరిచింది . 
పెద్దమ్మకూ నోటివెంట మాట రావడం లేదు . 
తమ్ము ........తమ్ముడూ .......మహి మహి రక్తం అని వెక్కి వెక్కి ఏడుస్తూ లోపలికి చేతిని చూపించడంతో , పరుగునవెళ్లి చేతులు - దిండు - దుప్పటి మొత్తం రక్తం చూసి, రేయ్ మామా .......... కార్ అని కేకవేసి అప్పటికే అక్కయ్య లావణ్య మహిని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుండటం - అక్కయ్య ఎదుస్థిన్డటం చూసి , లావణ్య ......... అంటూ ఎత్తుకుని పరుగున బయటకువచ్చాను . 
ఏడుస్తున్న బుజ్జిఅక్కయ్యను కృష్ణగాడు ఎత్తుకుని ఓదారుస్తున్నాడు . 
వదిన కారుని ఏకంగా మెయిన్ గేట్ లోపలికి తీసుకురావడంతో నలుగురమూ ఎక్కి , చెల్లీ .......... అక్కయ్యను జాగ్రత్తగా తీసుకురా అనిచెప్పి వదిన వేగంగా పోనివ్వనిచెప్పాను . 

చెల్లి , పెద్దమ్మ , అంటీ , లావణ్యవాళ్ళు ......... అక్కయ్యను బుజ్జిఅమ్మనూ బుజ్జిమహేష్ ను ఓదారుస్తూ రెండు కార్లలో బయలుదేరారు . 
అంతా తమవల్లనే అని తమ్ముళ్లు బాధపడుతుండటం - మహికి ఏమీ కాకూడదు అని బుజ్జాయిల దగ్గర నుండి అందరూ దేవుళ్లను ప్రార్థిస్తుండటం చూసి , ఎవరెవరు హాస్పిటల్ కు రావాలనుకున్నారో ఎక్కండి మహి దగ్గరకు తీసుకెళతాము అని వదినలు మరియు విషయం తెలుసుకుని పిల్లలను ఎత్తుకుని వచ్చిన అన్నయ్యలు చెప్పడం ఆలస్యం బుజ్జాయిలతోపాటు అందరూ అందరూ .......... అన్నీ కార్లలో ఎక్కడంతో వేగంగా పోనిచ్చారు .

స్పృహకోల్పోయిన మహిని చూసి బుజ్జిఅక్కయ్య వెక్కివెక్కి ఏడుస్తూ , నాన్నా ........ మహికి ఏమయ్యింది అని చేతిని అందుకొని అడిగింది .
ఏమీ కాలేదు బుజ్జిఅక్కయ్యా ............ నిన్నలానే రక్తం ఎక్కువగా పోయింది . రక్తం ఎక్కిస్తే రాత్రి నవ్వినట్లు నవ్వి , బుజ్జిఅమ్మా .......... అంటూ ప్రాణంలా హత్తుకుంటుంది అని ధైర్యం చెప్పాడు .
బుజ్జి.......అమ్మా .......... నాప్రక్కనే పడు......కో అని ప్రేమ......తో పిలి.....చింది . నేనే అక్కయ్యే నా ప్రాణం - అక్కయ్యతో తప్ప ఎవ్వ.......రితో పడుకోను , మహీ కావా.......లంటే నీ కలల రాకుమారుడిని తలుచుకుని దిండుని హత్తు........కొని పడుకో అని నే.....నే చెప్పాను . నా వల్ల.....నే ఇలా అయ్యింది అని ఏడుస్తూనే తడబడుతూ చెప్పింది . 
బుజ్జిఅక్కయ్యా ........... మహికి ఏమీకాదు , మహి ఆరాధించే వ్యక్తి కోసమైనా నవ్వుతూ లేచివస్తుంది చూడు అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని ఓదార్చారు .

10 నిమిషాల్లో ........ వదిన నేరుగా ఎమర్జెన్సీ దగ్గరకు తీసుకెళ్లింది . కృష్ణగాడు - వదిన వేగంగా దిగి డాక్టర్ గారూ డాక్టర్ గారూ ........... అని మహిని ట్రీట్ చేసిన డాక్టర్ మేడం ను ICU దగ్గరికి తీసుకొచ్చారు .
 నేను మహిని ఎత్తుకుని ICU దగ్గరకు చేరడంతో నర్స్ చూసి డోర్ తెరిచి same బెడ్ పై పడుకోబెట్టమనిచెప్పి రక్తం చాలా పోయినట్లుందే అని కట్లు నెమ్మదిగా ఊడదీస్తోంది . 
అంతలో డాక్టర్ మేడంకు జరిగింది వివరిస్తూ పిలుచుకునివచ్చారు .
డాక్టర్ గారు చూసి అవును రక్తం చాలాపోయింది వెంటనే ఎక్కించాలి .
మేడం .......... అంటూ చేతినిచాపి బెడ్ పై పడుకున్నాను . 
సర్ .......... మీనుండి నిన్ననే తీసుకున్నాను కుదరదు మరెవరైనా ఉంటే చూడండి అర్జెంట్ అనిచెప్పారు .
డాక్టర్ డా.......క్టర్ .......... మా అమ్మది - తమ్ముడిది అదే బ్లడ్ అయితే నాదికూడా అదే అయి ఉంటుంది నానుండి మొత్తం తీసుకుని మహికి ఏమీకాకుండా చూసుకోండి అని బుజ్జిఅక్కయ్య వెక్కివెక్కి ఏడుస్తూ చెప్పడం చూసి , డాక్టర్ గారు ఆశ్చర్యపోయి , 
ఒక్కమాటకూడా మాట్లాడకుండా వచ్చి నానుండి బ్లడ్ తీసుకున్నారు . 
లవ్ యు లవ్ యు బుజ్జిఅక్కయ్యా ......... అని ఫ్లైయింగ్ కిస్ వదిలాను . 
కృష్ణగాడు ముద్దులతో ముంచెత్తి వెనక్కుజరిగి నిలబడ్డాడు . 

 కట్లు వేరుచేసి డెటాల్ తో శుభ్రం చేసి , దిండుని గట్టిగా పట్టుకుని పడుకుందేమో రెండు కుట్లు ఊడిపోయాయి . బుజ్జితల్లీ .......... మహి అని ప్రేమతో పిలుస్తావు కదూ ......... , కుట్లువేసి బ్లడ్ ఎక్కిస్తే గంటలో నవ్వుతూ లేస్తుంది అని చేతికి మాత్రమే మత్తు ఇచ్చి కుట్లువేసి కట్లు కట్టారు .
అధిచూడలేక నాన్నా ......... అంటూ అటువైపు తిరిగి ఏడుస్తూ హత్తుకుంది .

 డాక్టర్ : అవునూ మీ పేరు అని వదినను అడిగారు డాక్టర్ గారు .
మల్లీశ్వరి మేడం ...........
డాక్టర్ :  కుట్లు ఊడిపోయేంతలా దిండుని హత్తుకొని రక్తం కారుతున్నా ఉదయం వరకూ మైమరిచిపోయి పడుకుందంటే , మహి పీకల్లోతు ప్రేమలో ఉందన్నమాట ........, మల్లీశ్వరి ఇంతకూ ఆ అదృష్టవంతడు ఎవరు - నేనైతే ఒకరిని అనుకుంటున్నాను అని అడిగారు .
మల్లీశ్వరి : తెలిసినా కూడా , నాకు తెలియదు మేడం నేను డ్రైవర్ ను అని మరింత వెనక్కువెళ్లి నిలబడ్డారు . 
డాక్టర్ : మహి అంటే ఇంత ప్రాణమైన మా బుజ్జితల్లికి తప్పకుండా తెలిసే ఉంటుంది. బుజ్జితల్లీ ........అని వెనక్కు తిరిగారు . 
బుజ్జిఅక్కయ్య ఏడుస్తూనే తెలుసు తెలుసు .......... అని బదులిచ్చింది .
కృష్ణ : డాక్టర్ గారూ ........ మీరు ఎవరిని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ........
రేయ్ ........... అనగానే వాడు సైలెంట్ అయిపోయాడు .
డాక్టర్ : తప్పైతే క్షమించండి అని వేలితో నన్నుచూపించింది . 
కృష్ణగాడు వెంటనే తలదించేసుకోవడం తో .........
మౌనం అర్ధాంగీకారం అంటారు అయితే నా గెస్ కరెక్ట్ ......... అనుకున్నాను లోపలికి వెళ్లిన రక్తం ఊరికే ఉంటుందా .......... తనపని తాను చేసుకుపోయింది , పాపం ఎంత విలవిలలాడిపోయిందో ......... మహీ ఇందులో నీతప్పేమీ లేదు , హృదయం నిండా ఉన్న ప్రాణమైన వాళ్ళ రక్తం వొళ్ళంతా సర్రుసర్రున పాకి అదే గుండెను చేరితే ఎలాంటి మధురానుభూతి కలుగుతుందో ఇప్పటివరకూ నాకూ తెలియదు . ఇలానే జరుగుతుంది అని ప్రూవ్ చేసావు అని సంతోషిస్తూ .......... నేనిచ్చిన రక్తం తీసుకుని నాకు ఆపిల్ అందించి మొత్తం తినాలి ఏమో ఇప్పుడెక్కించే రక్తం తనని ఏమిచేస్తుందో అని , దేవుడా .......... వాళ్ళు ఏకమయ్యేంతవరకూ కాస్త తగ్గించు , మహీ ......... నువ్వుకూడా కాస్త కంట్రోల్ చేసుకోవాలి అని ఎక్కించారు .
బుజ్జిఅక్కయ్య ఇంకా ఏడుస్తూ ఉండటం చూసి , బుజ్జితల్లీ ......... అర గంటలో ఈ రక్తం పూర్తవగానే కొద్దిసేపటికి స్పృహలోకివస్తుంది నీ ప్రాణమైన మహి అని నవ్వుతూ చెప్పింది .

నాన్నా ......... నాకు మహిప్రక్కనే కూర్చోవాలని ఉంది అని ఏడుస్తూ చెప్పడంతో , 
డాక్టర్ గారి హృదయం చలించినట్లు ........ ఇట్స్ ఆల్రైట్ అని వాడి నుండి ఎత్తుకుని మహి ప్రక్కనే కూర్చోబెట్టి కన్నీళ్లను తుడిచారు .
 బుజ్జిఅక్కయ్య : లవ్ యు మహీ ........... అని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , అంతా నావల్లనే రాత్రి నీప్రక్కనే పడుకోవాల్సింది అని బాధపడుతోంది .
బుజ్జిఅక్కయ్యా ........... లవ్ యు అని మహి బుగ్గలను స్పృశించడానికి చేతులు ఎత్తి , స్స్స్ ......... అంది మహి .
 డాక్టర్ : ఇట్స్ మిరాకిల్ ............ బుజ్జితల్లీ , నువ్వు ముద్దుపెట్టగానే ............ అని సంతోషిస్తోంది . 
వదిన పరుగున బయటకువెళ్లి మహి స్పృహలోకివచ్చింది . బుజ్జి వాసంతితో మాట్లాడుతోంది అని అక్కయ్యను - చెల్లిని - పెద్దమ్మ - అంటీనిలావణ్య వాళ్ళను లోపలికి పిలుచుకొనివచ్చింది .

బుజ్జిఅక్కయ్య : మహీ .......... ఇంకొక్కసారి చేతులు ఎత్తావా కొట్టేస్తాను అని కొట్టబోయి ఆగి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టడంతో , 
లవ్ యు బుజ్జిఅమ్మా ........... అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి మహి నవ్వడం చూసి , అందరూ కన్నీళ్లను తుడుచుకుని బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు.

నేను ఆపిల్ తింటూ ......... బయటకువెళ్లి కూర్చున్నాను . 
తమ్ముళ్లు : అన్నయ్యా .......... మహీ .........
స్పృహలోకివచ్చింది అందరితో మాట్లాడుతోంది , గంటలో ఇంటికి వెళ్లొచ్చు అనిచెప్పారు .
తమ్ముళ్లు : అంతా మావల్లనే అన్నయ్యా ........ అని కన్నీళ్ళతో బాధపడుతున్నారు  

 కృష్ణ : మేడం మరొక ఆపిల్ తీసుకోవచ్చా ....... నాకోసం కాదు వాడికోసం .
డాక్టర్ : బ్లడ్ ఇచ్చాడు కదా ఎన్నైనా తీసుకో .........
కృష్ణ : థాంక్స్ మేడం అని అందుకొని బయటకువచ్చాడు . బుజ్జాయిలతోపాటు అందరూ బాధపడుతుండటం చూసి , బుజ్జాయిలూ ......... మీ అక్కయ్యను చూడాలని ఉందా ........అయితే రండి అని డోర్ తెరిచి లోపలికి పంపించాడు . తమ్ముళ్లూ ........... మహి perfectly ఆల్రైట్ ఎలాగో అందరూ వచ్చారు కాబట్టి మీ దెబ్బలకు కూడా డ్రెస్సింగ్ చేయించుకోండి అనిచెప్పాడు .
తమ్ముళ్లు : పర్లేదు అన్నయ్యా , ముందు మహి ...........
కృష్ణ : నర్సులను పిలిచి వీళ్ళ దెబ్బలను కూడా డ్రెస్సింగ్ చేస్తే బాగుంటుంది .
నర్స్ : yes సర్ అని ఐదుగురు నర్సులను పిలిచి ప్రక్కనే ఉన్న జనరల్ వార్డ్ లోకి పిలుచుకునురమ్మన్నారు .
కృష్ణ : అంకుల్ ........ వెళ్ళండి అంతలోపు మహి నవ్వుతూ బయటకువస్తుంది అని అందరినీ పంపించారు .

బుజ్జాయిలు , ఇంటర్ స్టూడెంట్స్ ........... కృష్ణగాడు డోర్ తెరవగానే అక్కయ్యా , అక్కయ్యా ............ బుజ్జిఅమ్మా .......... అంటూ బెడ్ చుట్టూ చేరారు . 
బుజ్జిఅమ్మలూ - బుజ్జిమావయ్య - బుజ్జాయిలు - చెల్లెళ్ళూ - అమ్మా - కృష్ణ అమ్మా - పెద్దమ్మా - అంటీ - ఒసేయ్ లావణ్య లాస్య కారుణ్య ..........బాధపడకండి నాకేమీ కాలేదు నొప్పి కూడాలేదు .
 డాక్టర్ : అవునవును నొప్పి ఎలా ఉంటుంది . ప్రాణమైన వాళ్ళు బ్లడ్ ఇచ్చాక ........
మహి సిగ్గుతో పులకించిపోతోంది .
అయినాకూడా అందరూ బాధపడుతూనే కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకుంటున్నారు .
అక్కయ్య : డాక్టర్ గారూ .......... బ్లడ్ ఎవరు ఇచ్చారు .
లావణ్య : అక్కయ్య వెనుక నుండి డాక్టర్ వైపు నో ......... అని తలఊపింది .
డాక్టర్ గారికి మొత్తం అర్థమైపోయి అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలని చెప్పాను , ఈ బుజ్జితల్లి వుందే ఈ బుజ్జితల్లి , మహీ మహీ ......... అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ డాక్టర్ గారూ నా వొంట్లోని బ్లడ్ మొత్తం తీసుకుని మహికి ఎక్కించండి , మహికి ఏమీ కాకూడదు అని చేతిని చాపింది . ఇప్పుడు మీరెలా షాక్ అయ్యారో నేనుకూడా అలానే షాక్ అయ్యాను . రోజు గ్యాప్ లోనే ఒక్కరి నుండి బ్లడ్ తీసుకోవడం ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అయినాకూడా నిన్న బ్లడ్ ఇచ్చిన వ్యక్తి చేతిని అందుకొని కుచ్చేసాను అనిచెప్పడంతో ,
మహి తప్ప ఎవరూ నవ్వడం లేదు . బుజ్జిఅమ్మా - అమ్మా - లావణ్య ......... i am ఆల్రైట్ ......... ఇప్పుడే ఇంటికివేళదామా ........ అనిచెప్పింది .
 డాక్టర్ : బ్యాడ్ టైమింగ్ .......... sorry ......... మహీ ........ బ్లడ్ మొత్తం పూర్తవగానే వెళ్లిపోవచ్చు కొద్దిసేపట్లో వస్తాను అని నర్సుకు జాగ్రత్తలు చెప్పి బయటకువెళ్లారు .

బుజ్జిఅక్కయ్య ......... అక్కయ్య - బుజ్జిఅమ్మ చేతులను అందుకొని బెడ్ పై కూర్చోబెట్టుకుంది .
అక్కయ్య ......... బజ్జుఅక్కయ్య చేతిని అందుకొని ముద్దుపెట్టి , కళ్ళల్లో చెమ్మతో బుజ్జిచెల్లీ ........ మొత్తం రక్తం ఇచ్చేస్తావా ..........
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య - మహి - బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ .......... సంతోషం కోసం ఏమైనా చేస్తాను , అవసరమైతే నా ప్రా.......... అనేంతలో , 
అక్కయ్య - బుజ్జిఅమ్మతోపాటు మహికూడా బుజ్జిఅక్కయ్య మాటలను ఆపేయ్యడానికి చేతులు ఎత్తడం - మహి నొప్పితో స్స్స్ ........ అనగానే .......
బుజ్జిఅక్కయ్య ......... మహి బుగ్గపై దెబ్బవేసి , వెంటనే కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు లవ్ యు మహీ .......... అని మహి గుండెలపై వాలిపోయి బాధపడుతోంది .
మహి :  బుజ్జిఅక్కయ్యా ......... నాకు దెబ్బ పడాల్సిందే అని నవ్వుతోంది . 
లవ్ యు మహి లవ్ యు మహి అని కొట్టిన చోట ప్రాణమైన ముద్దుపెట్టింది .
 మహి : మ్మ్మ్......... హాయిగా ఉంది . బుజ్జిఅమ్మా ఒకసారి కట్లు కట్టిన చేతులపై కూడా ముద్దులుపెట్టారంటే మరింత హాయిగా ఉంటుంది - మరింత త్వరగా డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చేతులను చూపించింది . 
బుజ్జిఅక్కయ్య : కళ్ళల్లో చెమ్మతోనే అక్కయ్యా ......... నేను మహిని కావాలని కొట్టలేదు , తనపై ఉన్న ప్రేమతో నాకు తెలియకుండానే కొట్టాను , నన్ను క్ష.......
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... తనను కొట్టే అధికారం నీకు కాక మరెవ్వరికీ ఉంది నా బంగారూ ..........., మహి అంటే బుజ్జిఅమ్మ అంటే బుజ్జిమహేష్ అంటే నా బుజ్జిచెల్లికి ఎంతప్రాణమో నాకు తెలియదా - ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలియదా ..........., నువ్వు ఇప్పుడే చెప్పావుకదా చేతులు పైకెత్తకు అని అంతలోనే ఎత్తింది మహికి దెబ్బలు పడాల్సిందే అని అక్కయ్య కూడా మహి నెత్తిపై మొట్టికాయ వెయ్యడంతో బుజ్జిఅక్కయ్య కన్నీళ్లను తుడుచుకుంది .
మహి : బుజ్జిఅమ్మా ........... చిన్నప్పటి నుండీ అమ్మ ఒక్కదెబ్బకూడా కొట్టలేదు , అమ్మ దెబ్బ రుచి ఎంత మాధుర్యంగా ఉంటుందో నాకు తెలిసేలా చేశారు లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ .......... వీలైనప్పుడల్లా కొడతారని ప్రామిస్ చెయ్యండి అని చేతిని ఎత్తబోయి వెంటనే కిందకు దించెయ్యడంతో లావణ్య వాళ్ళు నవ్వుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు మహీ ......... అని రెండు చేతులపై ముద్దులుపెట్టి , తన సంతోషాన్ని చూసి మురిసి , మహీ .......... నాకు కూడా మా అక్కయ్య దెబ్బల రుచిని ఆస్వాదించాలని ఉంది ఆ కోరిక ఎప్పుడు తీరుతుందోనని లేచి అక్కయ్య ఒడిలో కూర్చుని , అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టింది .
అంటీ : బుజ్జివాసంతి ........... జీవితంలో ఆ కోరిక తీరకపోవచ్చు . 
బుజ్జిఅక్కయ్య : కోపం వచ్చినప్పుడు కొడతానని అక్కయ్య ప్రామిస్ చేసింది అంటీ ............
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... నేనా , లేదు లేదు నా బుజ్జిచెల్లిని నాకు ఇంత కోపం వచ్చినా కొట్టను . అయినా నా బుజ్జిచెల్లిపై కోపం రానే రాదు అని ప్రాణంలా హత్తుకొని ముద్దుపెట్టారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... please please please ......... ఎప్పుడైనా ఎప్పుడైనా కొట్టండి అక్కయ్యా .......... నా ఫ్రెండ్స్ హోమ్ వర్క్ చెయ్యనప్పుడు కొట్టి ఉంటారు కదా అలా ...........
బుజ్జాయిలు : బుజ్జిఅమ్మా .......... ఇప్పటివరకూ అమ్మ అలా ఎప్పుడూ చెయ్యలేదు . మమ్మల్నే కొట్టలేదు ఇక నిన్ను ........... అంటే కష్టమే ..........
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య కొట్టకపోతే , మా దేవతను ప్రార్ధిస్తాను - రెండుచేతులనూ జోడించి అమ్మా .........మా అక్కయ్య కొట్టేలా మీరే ఆశీర్వదించాలి . నేనంటే మీకు ఇష్టం నాకు తెలుసు నా కోరిక తీరుస్తారని ...........
అందరూ నవ్వేశారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-08-2020, 10:14 AM



Users browsing this thread: 24 Guest(s)