Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్
కృష్ణ, చందన నీ తీసుకోని తన ఇంటికి వెళ్లాడు చందన శేఖర్ నీ తలచుకొని ఏడుస్తున్నే ఉంది శైలు (కృష్ణ భార్య) ఎంత ఓదార్చాలి అని చూసిన కుదరలేదు అప్పుడే కొంత మంది సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి తలుపు కోడితే కృష్ణ తలుపు తీశాడు వాళ్లు అంత క్రైమ్ బ్రాంచ్ వాళ్లు శేఖర్ శవం నీ పోస్ట్ మార్టం కీ తీసుకోని వెళ్లాము అని చెప్పారు దాంతో శేఖర్ పడిన జీప్ తనదే కాబట్టి డిఎస్పి తనని తీసుకోని రమ్మని చెప్పారు అని తీసుకువెళ్లారు అప్పుడు చందన కూడా శైలు తో కలిసి హాస్పిటల్ కీ వెళ్లింది అక్కడ డిఎస్పి పోస్ట్ మార్టం అయిన తర్వాత బయటకు వచ్చి డాక్టర్ తో మాట్లాడుతూ ఉన్నాడు "మొత్తం బాడి లో ఆరు బుల్లెట్స్ దిగాయి సార్ దాంతో పాటు ఎనిమిదో అంతస్తు నుంచి పడ్డాడు కాబట్టి స్పాట్ లో చనిపోయాడు అతని రిబ్స్ విరిగి ఊపిరి తిత్తులోకి దిగాయి దాంతో ఒక వేళ అతని బ్రతికి ఉండి ఉంటే నరకం అనుభవిస్తు బ్రతికే వాడు" అని చెప్పారు డాక్టర్ ఇది అంతా విని డిఎస్పి నవ్వి "కన్న తల్లిదండ్రులను బాధ పెడితే అలాంటి వాళ్ల చావు ఇలాగే రాసి ఉంటుంది ఏమో " అని అన్నాడు దానికి కృష్ణ కీ కోపం వచ్చి వెళ్లి డిఎస్పి కాలర్ పట్టుకున్నాడు అప్పుడు మొత్తం యూనిట్ అంతా కృష్ణ పైకి వస్తుంటే డిఎస్పి వద్దు అని సైగ చేశాడు "కృష్ణ ఏంటి ఇది నేను నీ సుప్రియర్ ఆఫీసర్ నీ తలుచుకుంటే నీ జాబ్ ఉండదు నా కొడుకు లాంటి వాడివి అని ఇంకా సైలెంట్ గా ఉన్న" అని అన్నాడు డిఎస్పి.


దానికి కృష్ణ "నా బొంగులో జాబ్ ఏమన్నావు కొడుకు లాంటి వాడిన సొంత కొడుకు మీద లేని ప్రేమ నా మీద ఏమీ చూపిస్తున్నారు సార్, చిన్నప్పటి నుంచి చూస్తూన్నా సార్ మిమ్మల్ని మీరు మీ డిసిప్లిన్, సిన్సియర్ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ గా మీరు చాలా ఇన్స్పిరేషన్ గా కనిపించే వాళ్లు మా నాన్న కూడా పాతిక సంవత్సరాల పాటు మీకు డ్రైవర్ గా మీ చుట్టే నిజాయితీ అనే పదం చుట్టూ తిరిగి తిరిగి మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిన మీ వెంటే కుక్క లాగా ట్రాన్స్ఫర్ చేయించుకున్ని వచ్చేవాడు అలా మీ పిచ్చి తో మా డెత్ బెడ్ పైన ఉన్న కూడా మీకు ఇబ్బంది అని రాలేదు సార్ అప్పుడు నాకూ మీ మీద కోపం రాలేదు సార్, ఐఐటి స్టేట్ టాపర్ నీ ఇంజనీర్ అయ్యి అబ్దుల్ కలాం గారి లాగా సైంటిస్ట్ అవ్వాలి అని ఆశ పడ్డా కానీ మా నాన్న శేఖర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అని మీ కళ్ల ముందే పెరిగాను సెక్యూరిటీ అధికారి అయితే మీరు సంతోషిస్తారు నను బలవంతంగా సెక్యూరిటీ అధికారి చేశాడు అప్పుడు కూడా నాకూ మీ మీద కోపం రాలేదు సార్, అప్పటికీ కూడా మీరే ఇన్స్పిరేషన్ పైగా ఏ రంగంలో ఉన్న మీ లాగే నిజాయితీ గా ఉండాలి అని ఆశ పడ్డా కాకపోతే చిన్న ఇన్స్పెక్టర్ జాబ్ అమాయకత్వం ఉంది అని అందరూ ఆడుకున్నారు అది చూసి తట్టుకోలేక నా ఫ్రెండ్ వాడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ కేసు పూర్తి చేసి నాకూ క్రెడిట్ ఇచ్చాడు ఈ రోజు నేను తినే ప్రతి మెతుకు వాడు నాకూ పెట్టిన భిక్ష ఇప్పుడే వాడే లేడు నాకూ ఎందుకు ఈ జాబ్ మహా అయితే ఒక ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టుకుంటా మీరు ఇచ్చే జీతం కంటే డబల్ సంపాదించి నా కుటుంబాన్ని పోషించే శక్తి నాకూ ఉంది, తను నమ్మిన వాళ్ల కోసం న్యాయం కోసం ప్రాణం ఇచ్చే దమ్ము నా ఫ్రెండ్ కీ ఉంది కానీ మీకు ఏమీ మీ చుట్టూ మీకు బజానా చేయడానికి ఒక artificial ప్రపంచంలో బతుకుతున్నారు సార్ బయటికి వచ్చి చూడండి నేను రిజైన్ చేస్తున్నా ఏమైనా చేసుకోండి, కన్న కొడుకు చనిపోతే కసాయి వాడికి కూడా కళ్లలో నీళ్లు తిరుగుతాయి సార్ కానీ మీ లాంటి రాతి గుండె ఉన్న వ్యక్తి నీ ఇన్ని రోజులు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నందుకు నా మీద నాకూ కోపం వస్తుంది ఇప్పుడు " అని చెప్పి తన భార్య చందన నీ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు కృష్ణ.

కృష్ణ చెప్పినది విన్న రామచంద్ర అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి "సార్ కృష్ణ సార్ resignation లెటర్ వచ్చింది ఏమీ చేయాలి" అన్నాడు దానికి "వాడు ఆవేశం లో ఉన్నాడు disciplinary action కింద కొన్ని రోజులు సస్పెన్షన్ ఆర్డర్ లు ఇవ్వండి అలాగే చందు ఫోన్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా" అని అడిగాడు రామచంద్ర సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఇంకా ఏమీ వివరాలు రాలేదు అని చెప్పాడు, సైబర్ క్రైమ్ ఆఫీసు లో శేఖర్ ఫోన్ చెక్ చేస్తున్న ఒక అతను శేఖర్ పెట్టిన సెక్యూరిటీ సిస్టమ్ చాలా complicated గా ఉంది అని ఫోన్ పక్కన పడేశాడు అప్పుడు ఒక మెసేజ్ చందన కీ వెళ్లింది దాని తరువాత మొత్తం సాఫ్ట్వేర్ క్రాష్ అయ్యింది, కాకపోతే చందన జేమ్స్ దగ్గరికి వెళ్లి శేఖర్ చనిపోయాడు అని చెప్పింది దాంతో జేమ్స్ స్కూల్ లో ఉన్న పిల్లలు అందరితో కలిసి శేఖర్ ఆత్మ శాంతి కోసం ప్రార్థన చేయించాడు అప్పుడు రేపు ఉదయం ఫ్లయిట్ లో ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి లండన్ వెళ్లుతున్నాం ప్రోమో వీడియో పంపించమని అడిగాడు దాంతో చందన తన ఫోన్ మెయిల్ నుంచి థామస్ మెయిల్ కీ వీడియో పంపింది ఆ తర్వాత శేఖర్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి అని చూసింది అందులో longitude, latitude లో ఏదో అడ్రస్ వచ్చింది దాని గూగుల్ మ్యాప్ లో చూసి వెళ్లింది అది మొన్న శేఖర్, కృష్ణ వెళ్లిన సిడి షాప్ అప్పుడు ఆ మెసేజ్ లో ఏదో కోడ్ పదం అని ఉంటే అది ఆ షాప్ అబ్బాయి తో చెప్పింది దానికి వాడు చుట్టూ చూసి ఒక సిడి తీసి ఇచ్చాడు అప్పుడే ఒక బుల్లెట్ వచ్చి వాడి తలకు తగిలింది దాంతో చందన అక్కడి నుంచి పారిపోతుంటే థామస్ బిల్డింగ్ పై నుంచి చందన నీ కాలుస్తూ ఉన్నాడు కాకపోతే చందన గుంపు లో తప్పించుకోని వెళ్లింది ఆ తర్వాత థామస్ వెళ్లి ఆ సిడి తీసుకోని విరగోటి వెళ్లిపోయాడు.

తరువాత చందన ఇంటికి వెళ్లి తనకి వచ్చిన మెసేజ్ నీ సరిగ్గా చూస్తే అది ఒక వెబ్ సైట్ అడ్రస్ అందులోకి వెళ్లి చూస్తే శేఖర్ చివరగా ఒక వీడియో పెట్టాడు "చందు నువ్వు షాప్ కీ వెళ్లకుండా ఈ వీడియో చూస్తే నీకు ఒక క్లూ రవి కిషోర్ బెడ్ కింద లెటర్ ఉంది అందులో నీ క్లూ ఉంది ఒక వేళ నువ్వు షాప్ వెళ్లి ఈ వీడియో చూస్తే ఈ మర్డర్ చేసినవాడి ఫోటో నీకు దొరుకుతుంది" అని ఆగిపోయింది ఆ వీడియో ఇప్పుడు షాప్ కీ వెళితే రిస్క్ అని హాస్పిటల్ కీ వెళ్లింది అక్కడ రవి కిషోర్ చనిపోయాడు అని అతని బాడి తీసుకోని వెళ్తున్నారు ఫుల్ హడావిడిగా ఉంది తను ఎలాగో లోపలికి వెళ్ళింది అక్కడ బెడ్ కింద ఒక లెటర్ ఉంది అందులో

" you won't deserve this world brother rest in paradise" అని రాసి ఉంది దాంతో చందన ఈ డైలాగ్ ఎక్కడో విన్నాను అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు గుర్తుకు వచ్చింది అది థామస్ డైలాగ్ అని అంటే కిల్లర్ థామస్ అని తెలిసి షాక్ అయ్యింది. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ - by Vickyking02 - 30-07-2020, 08:19 AM



Users browsing this thread: 2 Guest(s)