Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
49.91%
263 49.91%
వొద్దు
15.75%
83 15.75%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
34.35%
181 34.35%
Total 527 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 48 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
(మిత్రుల కోరిక మేరకు కాదు కాదు పెర్టిక్యులర్ గా AKHIL గారి కోరిక మేరకు update త్వరగా ఇవ్వడానికి పెద్దగా కాకపోయినా కొంచెం అయినా ఇస్తే ఆనందిస్తాడు అని update short ga isthunna enjoyy )


EPISODE 38

లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా ? మనని ప్రాణానికి ప్రాణం గా ప్రేమిస్తున్న తల్లి తండ్రుల సంగతేంటి ? వాళ్ళు ఇంత కష్టపడి పెంచింది ఇలా చావమనేనా ? అయినా నెక్స్ట్ సెకండ్ ఎమ్ జరుగుతుందో అనేదే చెప్పలేక పోతున్నామే మరి రేపు నెలా డిసైడ్ చేస్తాం ? రేపే మనకు అనుకూలంగా ఉంటుందేమో ? కాబట్టి ఒకసారి ఆలోచించండి. చనిపోయాక సాధించేది ఎమ్ లేదు. ఏమున్నా బతికే సాధించాలి. ఇలాంటి ఆలోచనలను రానివ్వకండి వచ్చినా సరైన కౌన్సిలింగ్ తీసుకోండి. 9152987821 ఈ నంబర్ ద్వారా మీకు కౌన్సిలింగ్ అందుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ పదైదూ నిమిషాలు కాలేజ్ స్టేజ్ మీద ఏకదాటిగా సూసైడ్ చేసుకోకూడదనే అంశం మీద స్పీచ్ ఇవ్వగానే ఒక్కసారిగా చప్పట్లు మోగాయ్. 

అలా ఆరోజు స్పీచ్ ఇచ్చింది. సూసైడ్ చేసుకోకూడదు అని చెప్పింది. చేసుకునే ముందు పెంచిన తల్లితండ్రుల గురించి ఆలోచించండి అని చెప్పింది ఇలా నేను చెప్పినవి నాకే ఒక్కొక్కటిగా గుర్తు వస్తూ వుండగా ఒక్కసారిగా స్పృహ వచ్చింది.
అంతే వెంటనే మా అమ్మ నాన్న గుర్తొచ్చారు.. 
వాళ్ళ ప్రేమ ఆప్యాయత గుర్తొచ్చాయి. వెంటనే అనిపించింది 
నేను చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఎంటి ? నన్నే తలుచుకుంటూ జీవితాంతం బాధ పడరా అని. అంతలో మేడమ్ గుర్తొచ్చింది. 
కాసేపటి క్రితం బిందు నన్ను కోపంగా కత్తి తో పొడవడానికి వస్తుంటే మేడం తన నుండి కాపాడింది గుర్తొచ్చింది. అలా గుర్తు రాగానే మేడమ్ నేనంత వెధవ పని చేసినా బిందు నుండి కాపాడింది ఎందుకు ఇలా చావామనేనా ? అని అనిపించింది. 
అయినా మేడమ్ కావాలనుకుంటే బిందు ను ఆపి ఉండేది కాదు కానీ ఎందుకు ఆపింది ? ఎందుకు తన నుండి కాపాడింది ? నా మీద అంతో కుంతో ప్రేమ ఉండబట్టే కదా అనిపించింది అంతే చిన్నగా నాలో ఎదో ఆశ చిగురించింది. 
నేను ఇలా చచ్చిపోతే తను ఆనంద పడుతుందా ? అని అనిపించగానే లేదు లేదు అందరికన్నా తనే ఎక్కువ బాధపడుతుంది అని అనిపించింది. అంతే వెంటనే నాలో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన శాతం తగ్గిపోతూ వచ్చింది. చిన్నగా పెదాలను కదుపుతూ నేను చావకూడదు చావకూడదు అని అనుకుంటూ ఉన్నా.. 
అలా అనుకుంటూ కళ్ళు తెరవాలని చూసా. కానీ తెరవలేకపోయా. వొళ్ళంతా పట్టేసినట్లు ఉంది. చేయ్ కాలు తల ఎదీ కదపలేకపోతున్నా. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. మనసులో నేను చావకూడదు చావకూడదు అని గట్టిగా అనుకుంటూ ఉన్నా. ఎవరైనా సహాయం కోస్తే బాగుంటుందని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా భరత్ అని మేడమ్ గొంతు వినిపించింది. అంతే అంత పరిస్థితి లో కూడా ఒక్కసరిగా కళ్ళు తెరిచా.. చూస్తే ఎవ్వరూ లేరు అది నా భ్రమ అని అర్దం అయ్యింది. మెల్లగా తల కొద్దిగా తిప్పుతూ చుట్టూ చూసా..
అసలు ఎక్కడున్నానో అర్దం కాలేదు సిటీ దాటి చాలా దూరం వచ్చేసా అని అర్దం అయ్యింది. కాస్త దూరం లో ఉన్న రోడ్డు మీద ఎదో బైక్ వెళ్తుండడం కనిపించింది అంతే వెంటనే హే హెల్ప్ అని అరవబోయా.. కానీ నోరు పెగల్లేదు. అరవడానికి కూడా శక్తి రాలేదు చూస్తుండగానే ఆ బైక్ స్పీడ్ గా వెళ్లిపోయింది. వెంటనే నాలో నిరాశ కమ్ముకుంది. చిన్నగా స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించింది.
కళ్ళు మూతలు పడడం మొదలైంది. 
మైండ్ లో ఇలాగే ఉంటే ఇంకా ప్రమాదం అని అనిపించింది. అంతే వెంటనే కష్టంగా బలం అంతా కూడదీసుకుని లేవడానికి ప్రయత్నించా కానీ లాభం లేకపోయింది. అంతలో చేతి మీద కొసుకుంది గుర్తొచ్చింది వెంటనే చేతిని చుసుకోగా రక్తం మెల్లగా కారడం కనిపించింది అంతే వెంటనే అలెర్ట్ అయిపోయి చేతి మీద నేల పై ఉన్న మట్టిని వేసి అదుముకున్నా రక్తం రాకుండా..
అలా అదుముకుని ఇంకా లేట్ చేస్తే స్పృహ కోల్పోతానని వెంటనే రోడ్డు వైపు చూసా. సిటీకి దూరం గా ఉండడం వల్ల అనుకుంటా ఏ వెహికల్స్ పెద్దగా రావట్లేదు. నేను కానీ ఇంకా ఇక్కడే ఉంటే వచ్చే వెహికల్స్ కూడా నన్ను చూడకుండా వెళ్లిపోతాయి అని అనిపించింది. వెంటనే ఎదురుగా రోడ్ మీదకు వెళ్ళడం మంచిది ఒకవేళ స్పృహ కోల్పోయినా ఎవరో ఒకరు చూసి హెల్ప్ చేసే అవకాశం ఉంది అని అనిపించింది. అంతే వెంటనే రోడ్డు మీదకు వెళదామని లేవడానికి చూసా..  
కానీ శరీరం సహకరించలేదు. కష్టంగా చేతులను రెండు ముందుకు జరిపి అక్కడే పాతుకుపోయిన ఒక రాయిని పట్టుకుని నా శరీరాన్ని ముందుకు జరపడానికి చూసా కానీ బైక్ పడ్డప్పుడు తగిలిన దెబ్బల వల్ల అస్సలు కదలలేక పోయా.. మళ్ళీ ప్రయత్నించినా అదే పరిస్థితి ఒక పక్క ఎండ ఇంకో పక్క వొంటి మీది దెబ్బలు అస్సలు కదలలేని స్థితి ఇవ్వన్నీ గుర్తొచ్చి నాలో నిరాశ ఇంకా ఎక్కువైంది. అలా నిరాశ రాగానే ఇక కదలలేను ఇక్కడే చచ్చిపోతానేమో అని అనిపించింది అలా అనిపించగానే నిరాశ పడుతూ నెల మీద అలాగే పడుకుంటూ రోడ్డు వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నా..
అలా మూసుకుంటూ ఉండగా 
అప్పుడే రోడ్డు మీద నిల్చుని కనిపించింది మేడమ్..
నేను వెంటనే ఆశ్చర్యంగా చూసా.. తను నన్నే చూస్తు ఉంది. నేను మెల్లగా తల లేపి తన వంకే చూసా. మేడమ్ నన్నే చూస్తూ రా భరత్ లేయి త్వరగా రా అని అంటూ పిలిచింది. అంతే తననలా పిలవగానే కొంచెం ఎదో బలం వచ్చినట్లు అనిపించింది మేడమ్ ఇంకా నన్నే చూస్తూ చేతులు చాచి రా భరత్ రా అంటూ పిలిచింది. అంతే అలా తను పిలవగానే ఒక్కసారిగా వంద రెట్లు బలం వచ్చినట్లు అయ్యి తన దగ్గరకు వెళ్లాలని గట్టిగా అనిపించింది. అంతే గట్టిగా ఒక్కసారిగా మేడమ్ ను తలుచుకుంటూ ఎదురుగా ఉన్న రాయిని ఆసరా గా చేసుకుని ముందుకు జరిగా ఆశ్చర్యంగా ముందుకు కదిలా.. అలా కదలగానే సంతోషం వేసి ఎదురుగా మేడమ్ వంక చూసా మేడమ్ రా భరత్ అంటూ ఉంది. నేను వెంటనే రెట్టించిన వేగం తో ముందుకు కదులుతూ వస్తున్నా అని మనసులో అనుకున్నా.. అలా అనుకుంటూ మెల్లమెల్లగా పాక్కుంటూ ముందుకు వెళ్ళా.. 
మేడమ్ రోడ్డు మీదే నిల్చొని రా భరత్ రా అంటూ ఉంది. నేను కష్టంగా ముందుకు పాకుతూ పాకుతూ ఉన్నా మేడమ్ ఇంకొంచెమే ఇంకొంచమే అంటూ ఉంది. నేను తన్ని చూస్తూ వస్తున్నా అంటూ అలా పాక్కుంటునే దాదాపు రోడ్డు దగ్గరకు వెళ్ళా. అలా వెళ్ళగానే మేడమ్ ఒక్కసారిగా మాయం అయిపొయింది. అంతే ఆశ్చర్యంగా చుట్టూ చూసా.. కాసేపటికి అది నా బ్రమ అని అర్దం అయ్యింది. అలా అర్దం కాగానే ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. 
అంతే అలా నీరసం రాగానే రోడ్డు పక్కన అలాగే పడుకుంటూ నిరాశగా మేడమ్ ను తలచుకున్నా.. 
అలా తలుచు కోగానే అనిపించింది అయినా తను ఎందుకు వస్తుంది ? నేను చేసిన పనికి ఇంకో సారి నా ముఖం అయినా చూస్తుందా అని. అంతే వెంటనే పూర్తిగా నిరాశ కమ్ముకుంది. మళ్ళీ ఎందుకు బతకడం అనిపించింది. ఇలాగే చచ్చిపోతే తనకు నా ముఖం చూపించాల్సిన అవసరం ఉండదు కదా అని అనిపించింది.
అలా నాలో నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉండగా దూరంగా ఎదో బండి వస్తున్న శబ్దం వినిపించింది. 
అంతే వెంటనే తలెత్తి చూసా.. దూరంగా స్కూటీ నడుపుతూ తెల్ల కోటు వేసుకున్న ఇద్దరు ఆడపిల్లలు నా వైపే రావడం కనిపించింది. 
బహుశా డాక్టర్లు అనుకుంటా అంతే వెంటనే బలమంతా కూడదీసుకుని చేతిని పైకి లేపుతూ వాళ్ళ వైపు సైగ చేసా.. వాళ్ళు నన్ను చూస్తూ వస్తున్నాం అన్నట్లుగా చేయ్ వూపారు అంతే ఒక్కసారిగా నేను హమ్మయ్య అనుకుంటూ అలాగే రోడ్డు మీద పడిపోయా..

అలా పడిపోయాక స్కూటీ నా దగ్గర ఆగడం వాళ్ళలో ఒకరు చెప్పా కదే మేఘా వీడు ఎక్కడో చోట పడిపోతాడని అంటూ ఉండడం దానికి ఇంకొరు అవునే శైలు నువ్వు చెప్పబట్టి మంచిదైంది అంటూ అనడం అంతలో త్వరగా పదవే వీడిని మన మెడికల్ కాంప్ దగ్గరకు తీసుకెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి నన్ను లేపడం ఆ తరువాత నన్ను స్కూటీ మధ్యలో కూర్చోబెట్టుకుని వెళ్ళడం అలా వెళ్తుంటే నేను పూర్తిగా స్పృహ కోల్పోవడం అలా అలా జరిగిపోయాయి..
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
Nice story...,, - by Praveen kumar - 14-11-2018, 11:21 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 26-02-2019, 11:12 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 27-02-2019, 10:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 17-02-2019, 08:17 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 21-02-2019, 10:04 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 09:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:12 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:14 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 02-03-2019, 11:15 AM
RE: భరత్ అనే నేను..... - by akhilapuku - 18-11-2019, 07:36 PM
RE: భరత్ అనే నేను..... {Index Available} - by dom nic torrento - 06-09-2020, 08:37 PM



Users browsing this thread: 26 Guest(s)