Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
7పెద్దమ్మ : బుజ్జాయిలూ , కావ్యతల్లీ , హీరో గారూ ............ నేను దానికి ఒప్పుకోవాలంటే రేపు " బుజ్జాయిల - కావ్య - నీ - నా " .......... పుట్టినరోజుల నాడు నా చిన్న చిన్న కోరికలు తీర్చాలి .
మేమంతా : చిన్నవి ఏమిటి పెద్దమ్మా ........... అవి ఎలాంటివైనా తీర్చడానికి మా శాయశక్తులా కృషిచేస్తాము చెప్పండి అని ప్రేమతో ఆడిగాము . 
పెద్దమ్మ : హీరో .......... చిన్న చిన్నవేలే , తల్లీ కావ్యా ........... నువ్వు మాటివ్వాలి , ఎలాంటి పరిస్థితులలోనైనా మన బుజ్జాయిల లాంటి బుజ్జి కోరికలు తీరేలా చూస్తానని.
దేవత : పెద్దమ్మా ........... అంతకంటే అదృష్టమా , మీరెలా అంటే అలా అని గుండెలపై హత్తుకున్నారు .
పెద్దమ్మ : లవ్ యు కావ్య అని నుదుటిపై ముద్దుపెట్టి , హీరో తమరే తీర్చాల్సింది .
మీ సంతోషం కోసం అనుక్షణం మీ సేవలో పెద్దమ్మా ..........
పెద్దమ్మ : లవ్ యు ............ చెప్పేస్తున్నాను .
మొదటిది : పుట్టినరోజును the best గా జరుపుకోవాలి - చుట్టూ చూసి పరవశించి , అది నేను కోరిక ముందే తీర్చేశావు హీరో లవ్ యు .
బుజ్జాయిలు : యే యే యే .............. పెద్దమ్మ తొలి కోరికను మా అన్నయ్య తీర్చేశారు ఉమ్మా ఉమ్మా .......... మా అన్నయ్య గ్రేటెస్ట్ అని సంతోషంతో కేరింతలు వేశారు .
పెద్దమ్మ : అవును బుజ్జాయిలూ ........ రెండవది : వైజాగ్ లో బెస్ట్ ప్లేస్ చూడాలని ఆశ.
బుజ్జాయిలు : వైజాగ్ లో అన్నీ సూపర్ ప్లేస్ లే అని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు . బుజ్జాయిలూ ............ మీ ప్రాణమైన వాళ్ళతో చూస్తే మరింత అందంగా ఉంటాయి అని , అన్నింటిలోకెళ్లా బెస్ట్ ప్లేస్ అంటే .......... yes yes అదే ........ అనేంతలో , 
బుజ్జాయిలూ ........... మీ మనసులో ఉన్న the best ప్లేస్ నాకు కూడా తెలిసిపోయింది . పెద్దమ్మకు చెప్పొద్దు సర్ప్రైజ్ గా చూస్తే అదికూడా ప్రాణమైన మీతోపాటు చూస్తే కిక్కే కిక్కు ...........
అంతే బుజ్జాయిలు తమ తమ బుజ్జిచేతులతో బుజ్జి నోళ్ళను మూసేసి కళ్ళతోనే తమ ఆనందాన్ని తెలియజేసారు .
మా బుజ్జాయిలు బంగారం అని బుజ్జి బుగ్గలను స్వీట్స్ లా కొరికేసాను .
తియ్యని నవ్వులతో లవ్ యు లవ్ యు అంటూ పరవశించిపోతూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 
పెద్దమ్మ : మూడవ చిన్న కోరిక : బెస్ట్ ఫుడ్ ......... నా కావ్య తల్లి చేతి వంట రుచి చూసేసాను - సెకండ్ బెస్ట్ ఫుడ్ తినాలని .
దేవత : లవ్ యు పెద్దమ్మ  ...........
Ok పెద్దమ్మా ............ 
పెద్దమ్మ : పెదాలపై చిరునవ్వుతో ఇలా చిన్న చిన్న కోరికలు ........... రేపే తీరిపోవాలి - నాకు ఎక్కువ సమయం లేదు - తల్లీ కావ్యా ......... మాటిచ్చావు - ఇక చివరికోరిక హీరోగారూ .......... మీరు మాత్రమే తీర్చగలిగేది . మనుషుల ఫీలింగ్స్ లలో బెస్ట్ ఫీల్ ను ఆస్వాదించేలా చెయ్యాలి . 
మనుషులు - ఫీలింగ్స్ - బెస్ట్ ఫీలింగ్ .......... నేను మాత్రమే ........ ఎంత ఆలోచించినా ఫలితం లేక అదేమిటి పెద్దమ్మా అని అమాయకంగా అడిగాను .
దేవతకు అర్థమయినట్లు పెద్దమ్మ గుండెలపై చిలిపినవ్వులు నవ్వుతున్నారు .
పెద్దమ్మ కూడా నవ్వుకుని , హీరో ........... నా ఈ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చాక నీకే నీ మనసుకే తెలిసిపోతుందిలే .............. ఎక్కువ ఆలోచించకు అని నావైపు చూసి లవ్ యు అన్నారు . బుజ్జాయిలు - దేవత - పెద్దమ్మ ఆనందాలను కెమెరాలో బంధించాను . 
తారాజువ్వలు ఆగకుండా ఆకాశంలో పేలుతున్నాయి . బుజ్జాయిలూ .......... అందరమూ ఒకేరోజు పుట్టాము ఇంకా ఎవరైనా ఉన్నారా పెద్దమ్మా ........ అని సంతోషంతో నవ్వుకున్నాము . 
పెద్దమ్మ : ఆనందిస్తూనే ఈ సంవత్సరానికి మనం మాత్రమే ......... అని బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తారు .

బుజ్జాయిలూ .......... ఇక ఫైనల్ కేక్ కట్టింగ్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేద్దామా .........
యాహూ ........ అని అందరమూ సంతోషంతో కేకలువేశాము .
అన్నయ్యా ........... అందరమూ కలిసి కట్ చేద్దాము అని కోరారు . 
కెమెరాను ఆటోమేటిక్ లో సెట్ చేసి కేక్ ఎదురుగా ఉంచాము . సెకనుకు ఒక ఫోటో తీస్తూనే ఉంది . 
బుజ్జాయిలు క్యాండీల్స్ వెలిగించి కత్తిని పట్టుకుని అన్నయ్యా పెద్దమ్మా అమ్మా రండి అని చిరునవ్వులు చిందిస్తూ అందరమూ ఒకరికొకరం birthday విషెస్ తెలుపుకుంటూ కేక్ కట్ చేసుకుని ఒకరికొకరం ఆనందంతో సిగ్గుపడుతూ తినిపించుకోగానే , ముందుగా బుజ్జాయిలు కేక్ చేతిలోకి తీసుకుని నాకు ఆ తరువాత పరుగుపెడుతున్న దేవతల చీరలను పట్టేసుకుని ఆపి , అన్నయ్యా ......... మమ్మల్ని ఎత్తుకోండి అని ముఖం మూసుకుంటే వార్నింగ్ ఇచ్చిమరీ ముఖమంతా పూసేశారు . 
ఆ వెంటనే మేమంతా బుజ్జాయిలకు పూసేసి సంబరంలా సెలెబ్రెట్ చేసుకున్నాము . 
బుజ్జాయిలు నా ముఖం పై - దేవతల బుగ్గలపై క్రీమ్ ను నాకుతూ మ్మ్మ్..... మ్మ్మ్..... tasty అని కొరికేస్తుండటం చూసి నవ్వుకుని మొత్తం వీడియో తీసాను . 

నాకు దేవతల బుగ్గలపైన ఉన్న క్రీమ్ అందుకోవాలని ఆశగా ఉన్నప్పటికీ , రేయ్ రేయ్ ............ పుట్టినరోజు సెలబ్రేట్ చేసినంత మాత్రాన అడ్వాన్స్ అయిపోదామనుకున్నావేమో కంట్రోల్ కంట్రోల్ అనుకుని తియ్యని జలదరింపులతో ఆనందాన్ని ఆస్వాదించాను . 

పెద్దమ్మా - అమ్మా .......... అన్నయ్య చేతిలో కెమెరా అందుకుని మాకు తియ్యండి అని నా గుండెలపైకి చేరి , ఎందుకన్నయ్యా .......... మేమంటే అంత ప్రాణం మీకు . 
బుజ్జాయిలూ ........... అవన్నీ తీరికగా తరువాత మాట్లాడుకుందాము . సెలబ్రేషన్ ఇంకా అయిపోలేదు అని మూలన ఉంచిన గిఫ్ట్స్ తీసుకొచ్చి happy birthday అని అందించాను . 
గట్టిగా కౌగిలించుకుని వదిలి లవ్ యు లవ్ యు అని అందుకుని ఓపెన్ చేసి wow టెడ్డీ బేర్స్ ........ మాకు చాలా చాలా ఇష్టం అని హత్తుకున్నారు .
లవ్ యు అని నుదుటిపై ముద్దులుపెట్టి , మీ అమ్మలకు కూడా తీసుకొచ్చాను మీరే ఇవ్వండి అని కిందకుదించి అందించాను . 
అన్నయ్యా - అన్నయ్యా ........... ఎందుకో మాటలు రావడం లేదు . ఇన్ని సర్ప్రైజ్ లు ఇస్తున్నందుకు ప్రేమ హద్దులు దాటి ప్రాణంలా కొట్టాలనిపిస్తోంది . 
దేవతలు నవ్వుకున్నారు . 
బుజ్జాయిలూ ......... మీ తియ్యని దెబ్బలు తినడానికి నేను రెడీ , అమ్మలకు అందించి రండి అన్నాను . 
అమ్మలూ .......... అని పరిగెత్తి happy birthday , happy birthday అని అందించి ఏముందో చూడాలని ఆశతో చూస్తుంటే , మీ గిఫ్ట్స్ అంత అందమైనవి అయితే అయ్యుండవులే అని నుదుటిపై ముద్దులుపెట్టి ఓపెన్ చేసి జ్యూవెలరీ ఉండటం చూసి , 
గోల్డ్ చైన్స్ .......... భలే భలే అని సంతోషంతో గెంతులేసి అంతే పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .

దేవత : పెద్దమ్మా ......... ఏడేళ్ల తరువాత మళ్లీ గిఫ్ట్ అందుకున్నాను - లవ్ యు soooooo మచ్ మహేష్ అని నావైపు ప్రాణంలా చూస్తున్నారు . 
పెద్దమ్మ : జీవితంలో ఫస్ట్ birthday సెలబ్రేషన్ - ఫస్ట్ గిఫ్ట్ మహేష్ .......... , ఈ ఫీల్ కొత్తగా ఉంది లవ్ యు sooooo మచ్ ............. నిమిషం నిమిషానికీ చాలా చాలా ఋణపడిపోతున్నాను . 

పెద్దమ్మా ........... బుజ్జాయిలు - మేడం - మీరు ......... నేను అనాధను అన్న ఫీల్ ను ఎప్పుడో దూరం చేసేసారు . నేనే నా బుజ్జాయిలకూ మీకూ ఋణపడిపోయాను . 
బుజ్జాయిలు : మేము కూడా మా అన్నయ్యకు ......... అనడంతో అందరమూ నవ్వేసి ముద్దులతో ముంచెత్తాము . 

పెద్దమ్మ : బుజ్జాయిలూ .......... చలి ఎక్కువగా ఉంది మీకు జలుబు చేస్తుంది కిందకు వెళదామా ............
బుజ్జాయిలు : మాకైతే లేదు పెద్దమ్మా .......... మా అన్నయ్య వెచ్చని కౌగిలిలో ఉన్నాము కదా - మీకు చలివేస్తే కిందకు వెళదాము .
పెద్దమ్మ : మీ అన్నయ్య ఉన్నారు కదా .......... మాకూ వెచ్చగానే ఉందని దేవతలిద్దరూ నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 
నాకైతే పెద్దమ్మ చిలిపిమాటలు విన్నప్పుడల్లా తియ్యని జలదరింపులతో అలా అలా గాల్లో తేలిపోతున్నాను .

పెద్దమ్మా .......... అమ్మ చెప్పారు ఇలా చంద్రుడి వెన్నెలలో బుజ్జాయిలకు బోలెడన్ని కథలు చెబుతారని , ఇప్పుడు మాకు కూడా మా పెద్దమ్మ గుండెలపై ఆ కథలను వింటూ హాయిగా నిద్రపోవాలని ఉందని కోరిక కోరారు . 
బుజ్జాయిలు సెలబ్రేషన్ తరువాత కోరిన తొలి కోరిక ఉమ్మా ఉమ్మా ......... అని ముద్దులుపెట్టి దేవతలకు అందించి పరుగున లిఫ్ట్ లో వెళ్లి ఒక బెడ్ - దిండ్లు - వెచ్చగా ఉండేలా లావుపాటి దుప్పట్లు - ఒక సోఫా .......... అవసరమైనవన్నీ భీముడిలా ఎత్తుకునివచ్చి పరిచి , ఎంజాయ్ బుజ్జాయిలూ ......... అని ఎదురుగా సోఫాలో ఒక దుప్పటి కప్పుకుని కూర్చున్నాను . 
లవ్ యు అన్నయ్యా - లవ్ యు అన్నయ్యా .......... అని వెచ్చని ముద్దులుపెట్టి , నా దేవతలతోపాటు వాలి భుజాలవరకూ మందమైన దుప్పటి కప్పుకున్నారు . 
ఆఅహ్హ్గ్.......... వెచ్చగా ఉంది లవ్ యు మహేష్ , బుజ్జాయిలూ ......... ఉమ్మా ఉమ్మా ......... అనగనగనగా అంటూ పేదరాసిపెద్దమ్మ కథలను చెబుతుంటే ఊ కొడుతూ ఊ కొడుతూ .......... అందరమూ వెచ్చగా నిద్రలోకి జారుకున్నారు .

బుజ్జాయిలిద్దరూ అతి సుందరమైన నా దేవతల గుండెలపై హాయిగా నిద్రపోతుండటం చూసిన నా ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . గుడ్ నైట్ బుజ్జాయిలూ - గుడ్ నైట్ goddesses ............. అంటూ పెదాలపై చిరునవ్వుతో వాళ్ళను చూస్తూనే వెచ్చని దుప్పటిని భుజాలవరకూ కప్పుకున్నాను . 
ఈ సంతోషంలో నా ఫ్రెండ్స్ వాటా కూడా ఉండటంతో ఉదయం వరకూ ఆగడం నావల్ల కాక కృష్ణగాడికి కాల్ చేసాను . ఎత్తగానే లవ్ యు లవ్ యు ఫ్రెండ్స్ ........... అడగకముందే సరైన అవసరంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు ......... ఎదురుగా లేరు కానీ ముగ్గురినీ కౌగిలిలో నలిపేసేవాణ్ణి మళ్లీ మళ్లీ లవ్ యు sooooooo మచ్ .
కృష్ణ : రేయ్ మామా డబ్బా ......... , మేము పంపలేదురా ఎంత అవసరం ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాము అని ముగ్గురి నుండీ అమౌంట్ వచ్చింది . 
రేయ్ మామా ........... మీరు కాదా ? ........... అయితే అంతడబ్బు సరైన అవసరానికి ఎలా వచ్చింది ............... అని ఆలోచనలో పడ్డాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 22-09-2020, 11:13 PM



Users browsing this thread: 14 Guest(s)