Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
తను తెచ్చిన టి ఫిన్ తిని   ఆఫీస్ కు బయలు దేరాను.
 
ఆఫీస్  చేరుకోగానే నూర్ నుంచి ఫోన్ వచ్చింది దొరికిన వాళ్ళకు రాత్రి  ఇంకో కోటింగ్ ఇచ్చాక  స్టోర్ మేనేజర్ ను  చంపింది ఎవరు అనేది చెప్పారు టైం దొరికితే ఆఫీస్ కు రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
 
12 వరకు పెండింగ్  పనులతో సరిపోయింది. వాటిని కంప్లీట్ చేసి  ఆఫీస్ లోనే  లంచ్ చేసాను.   లంచ్ టైం లో జాకీ  చెప్పింది  తను  దివ్యా వాళ్ళ నాన్న రమేష్ ను  పెళ్లి చేసుకుంటాను అని.   తనకు కూడా  జాకీ అంటే  ఇష్టం  అని చెప్పింది.  వాళ్ళ  ఇద్దరికీ ఇష్టం అయితే  పెళ్లి చేసుకో అని చెప్పాను.   సింపుల్  గా  గుడిలో చేసుకుంటాము వచ్చే శనివారం  నన్ను తప్పకుండా  గుడికి రమ్మని చెప్పింది.  రమేష్  విడిగా ఫోన్ చేసి పిలుస్తాడు అని చెప్పింది.   పెళ్లి తరువాత  ఉద్యోగం చేయను , ఇంటి పని చూసుకుంటాను  అని చెప్పి   రేపటి నుంచి  ఆఫీస్ కు రాను  అని చెప్పింది.
 
తనకు రావాల్సిన జీతం అంతా  ఇచ్చేయమని ఆఫీస్  లో చెప్పి  నూర్  ఉన్న స్టేషన్ వైపు బయలు దేరాను.
 
నేను వెళ్ళే సరికి తను  స్టేషన్ లోనే ఉంది.  నేను వెళ్ళగానే  టీ తెప్పించింది  ఇద్దరం టీ  తాగుతూ ఉండగా చెప్పింది
 
"నిన్న దొరికిన వాళ్లను  ఇంకా కొద్దిగా తోమే  సరికి  వాళ్ళు  చెప్పారు  శివాని  వాళ్ళ  నాన్నను  చంపడానికి ఎవరు  ఎవరికీ సుఫారి ఇచ్చింది అనే  విషయం"
 
 
ఓ చిన్న పెపర్ మీద     రెండు పేర్లు  రాసి ఇచ్చింది 
 
"శివా సుఫారి తీసుకొన్న వాడు చాలా  పేరున్న  గుండా , ఇంత వరకు వాడి మీద  ఎవ్వరు  కేసు ఫైల్ చేయలేదు , కానీ వాడు దాదాపు ఇలాంటి  వి  12  దాకా  మర్డర్స్ చేశాడు  దేని  కీ ఎవిడెన్స్ లేవు. "
 
"ఈ రెండో పేరు ఎవరి ది "
 
"అది   ఓ పెద్ద పేరున్న  కంపెనీ ఓనర్ ది  , వాడే శివాని వాళ్ళ నాన్నను  తొలగించమని చెప్పింది."
"నిన్న జరిగిన రైడ్ లో  వాడు  దొరక లేదా ? "
"ఎందుకో ఆ లిస్టు  లో వాడు లేడు "
"అయితే వాడిని గురించి నువ్వు మర్చిపో ఈ  ఇద్దరి పేర్లు నువ్వు నాకు ఇవ్వలేదు  ఈ విషయం ఇంతటితో మర్చిపో "
"నువ్వు జాగ్రత్త  , నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే  చెప్పు  నేను చూసుకుంటా  వాళ్ళ ఇద్దరినీ "
"నీ అవసరం  అయితే చెప్తాలే "
"నువ్వు పర్సనల్ గా ఇందులో ఇరుక్కోక  జాగ్రత్త, కావాలంటే వాళ్లను  ఇద్దరినీ  ఎన్‌కౌంటర్  లో లేపేస్తా"
"నాకు తెలుసుగాఏదైనా  సహాయం కావాలంటే  నీ హెల్ప్ తీసుకుంటా లే "
"ఏమో నబ్బా  నువ్వు ఎం చేసి  నెత్తి  మీద కు తెచ్చు కొంటా వో  అని భయంగా ఉంది "
"ఎం కాదు  నేను బయలు దేరునా " అంటూ  తన వద్ద  వీడ్కోలు తీసుకొని  తన స్టేషన్ నుంచి బయటికి వచ్చాను.
 
 
వీళ్ళ  ఇద్దరినీ  కొద్దిగా   గమనించాలి  ఆ తరువాత   శివాని  పగ తీరే ట్లు ప్లాన్ చేయాలి, మొదట  వాళ్ళను  గమనించడం బెటర్ అనుకొంటూ     నూరు  ఇచ్చిన పేపర్  ను  జేబు లోంచి బయటకు తీశాను. 
 
తను పేర్లతో పాటు వాళ్ళ అడ్రస్  లు కూడా ఇచ్చింది.      ఎవరిని మొదట టార్గెట్ చేయాలి  అనుకొంటూ  కొద్ది సేపు బైక్ ను  రోడ్డు పక్కన ఉన్న కేఫ్ పక్కన ఆపి కేఫ్  లోకి వెళ్లి చాయ్  కు ఆర్డర్ చేసాను. 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-09-2020, 03:15 PM



Users browsing this thread: Depukk, 24 Guest(s)