Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
40.2

మీ శివా సార్ వళ్ళ నాకు  రెండు ప్రమోషన్ లు వచ్చాయి అంటూ హమీద్ అందరికి స్వీట్స్ పంచి ఇచ్చాడు,  ముగ్గరు కలిపి దాదాపు  ఓ పది కిలోలు స్వీట్స్ తెచ్చారు.  నేను ఎక్కడ కష్టాలలో ఉన్నానో అని  వూరు అందరూ  కలిసి నా కోసం రావడం , మా  రవీంద్ర గాడికి బాగా నచ్చింది.  అందుకే అందర్నీ పోగుచేసుకొని వచ్చాడు.   
 
మిగిలిన స్వీట్స్ అన్నిటిని మల్లన్న చేత పంపించి , ఓబులేసు తో పాటు  పల్లెలో మనకోసం వచ్చిన వాళ్ళ అందరికి పంచమని రవీంద్ర ఇచ్చి పంపాడు.   వాళ్ళు వెలతా మంటే పెద్దాయన  మద్యానం  భోంచేసుకొని వేళ్ళమన్నాడు.   నల్లప్పకు చెప్పి  ఊర్లో కెళ్ళి 4 కోళ్ళు పట్టుకొని రమ్మని , సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలిని కుడా అక్కడే  భోంచేయమని చెప్పి,  ఇక్కడ వంట అయ్యే లోపల వాళ్ళకు మన గుడి చుపిచ్చుకొని రాపో రా  అని రామి రెడ్డికి చెప్పాడు. 
 
రామి రెడ్డి తోడు రాగా అందరం గుడి  కి వచ్చాము , అక్కడ పూజారి గుడికి సంబందించి న విషయాలు చెప్పసాగాడు.   విజయ నగర సామ్రాజ్య కాలంలో  వీల్ల  వంశం వారు  రాజుల దగ్గర పాలెగాళ్ళు గా చేసేవారట, అప్పుడు ఆ పలేగాల్లలో  ఒకరు రాజు  వెంట అనేక యుద్దాలకు వెళ్లి ఆయనకు బోలెడన్ని విజయాలు చేకుర్చారట   ఆ విజయాలకు  చిహ్నం గా ఈ అమ్మవారు ఆలయాన్ని కట్టించీ ఇచ్చాడట.
 
ఓ యుద్ధం లో గెలిచి ఆ సంపదనంతా  ఎక్కడో ఈ చుట్టు  పక్కల ప్రాంతాలలో దాచి ఆ రహస్యాన్ని మా పెద్దలకు ఎవరికో చెప్పారంట ,ఆ సంపద ఇప్పుడు ఎక్కడ వుందో ఏమో ఎవరికీ తెలిదు. వంశ  పారంపర్యంగా వచ్చే వస్తువులల్లో ఆ  సంపద రహస్యం దాచి ఉంచారట  అని మాతాతలు ఎప్పుడో మేము చిన్నగా వున్నప్పుడు  చెబుతుంటే విన్నాము.  మీ  పెద్దాయన పొలానికి పక్కన గుట్ట  వుంది చూసారా ఆ గుట్ట మీద ఒకప్పుడు కోట వుండేది అంట ,   ఇప్పుడు  ఒట్టి రాళ్ళు మాత్రమే ఉన్నాయి  గోడలు కుడా లేవు.   అక్కడ  సంపద వుంది అని చాలా మంది గుంతలు  గుంతలు  తవ్వినారు , కానీ ఎవ్వరికి  పిసరంత కుడా దొరక లేదు.    అంటూ ఆ గుడి చరిత్ర  , వీళ్ళ  వంశ చరిత్ర , ఆ నిధి గురించి  చెప్పాడు.    అక్కడ పూజ చేసి  , ప్రసాదం తీసికొని వెనుకకు బయలు దేరుతుంతే , పూజారి పిలిచి అందరికి బండారు ఇచ్చాడు.   
"మరి ఈ  గుడికి  ఆదాయం ఎలాగా , మీకు జీతాలు ఎవరూ ఇస్తారు ? "  అంటూ ప్రతాప్ అడిగాడు.
"దేవుడి మన్యం అని ఓ 20 ఎకరాల పొలం వుంది  అది ఊరిలో కౌలుకు వేలం  వేస్తాం , ఆ ఏడాది ఎవరూ ఎక్కవ కౌలు ఇస్తారో  వారికి కౌలుకు ఇస్తాం  ఆడబ్బే  బోలెడు ఉంది,  ఇక పూజ లంటారా రోజంతా ఇక్కడ ఎవ్వరు వుండరు , పొద్దున్నే  , సాయంత్రం మాత్రమె దీపం వెలిగిస్తాం, మా వంశస్తులు మాత్రమె ఇక్కడ పూజలు చేస్తారు  మేము జీతాలు తీసుకోము , ఇది మాకు ఆ అమ్మోరు ఇచ్చిన  వరం అనుకుంటాము.    ఈ నగలు అన్ని చుట్ట పక్కల వుల్లో వాళ్ళు చేపిచ్చినవే , ఇదిగో  ఈ పాపిటి బిళ్ళ  మా ఇంట్లో పడుంటే  నేను ఎత్తుకొచ్చి  అమ్మోరు తల్లో  పెట్టినా , ఈ వడ్డాణం  వెండిది , మీ పెద్దాయన M.L.A  గెలిచినప్పుడు చేయించాడు,  ఇదిగో ఈ  హారం   వీళ్ళ  నాయన సర్పంచ్ గా గెలిచి నప్పుడు చేయించాడు " అంటూ వాటి పుట్టు పూర్వోత్తరాలు చెప్పా సాగాడు. అది మా వాళ్ళకు బోర్ కొట్టి నట్లు ఉంది , ఒక్కరొక్కరే  చల్లగా బయటకు జారు కున్నారు నేను ఒక్కడే అక్కడ మిగిలాను.
 
"ఆ పాపిటి బిళ్ళ ఒకసారి చూడొచ్చా పూజారి గారు"   అది  పుర్య కాలం డిజైను లాగా వుంది  అన్నాను.
"రాప్పా నువ్వు , పెద్దాయన ఇంటి మనిషివి ,  మాకు ఇక్కడ ఎంత హక్కు వుందో నీకూ   అంతే  హక్కు వుంది అంటూ నన్ను లోపలికి పిలిచి "
"నువ్వు చుత్తాండు నేను ఇప్పుడే వస్తా"  అని బయటకు వెళ్ళాడు.    ఆ బిళ్ళ కుడా  శాంత మెళ్ళో లాకెట్ లాగే ఉంది.   దాన్ని చేతులో తీసికొని చుస్తే , మైనం వుంది దానిని వేలితో గోకి దాని కింద ఉన్న స్క్రు ని నా పుర్స్ లో ఉన్న బ్లేడ్ ముక్కతో ఓపెన్ చేసి చుస్తే , అందులో ఓ చిన్న రాగి రేకు . దానిని జేబులో వేసుకొని  దానిని యదా విదిగా బిగించి అమ్మోరి మీద అలంక రిస్తుంటే  పూజారి వచ్చాడు.  అయన దగ్గర సెలవు తీసుకోని అందరం కలిసి ఇంటికి వచ్చాము.
 
మేము వచ్చే టప్పటికి  భోజనం రడిగా గా చేసి ఉంచారు ,  అందరం కలిసి బొంచేస్తుంతే హమీద్ అన్నాడు
"మీ ఊరికి ఏమి అవసరం వచ్చినా ,మా శివా రెడ్డి సార్ లాగే  మేము  ఉన్నామని మర్చి పోకండి "  ఓ చిన్న కబురంపండి  మేము వచ్చి వాలి పోతాము అన్నాడు.  ఆ మాటలకు సర్పంచి , వాళ్ళ పిల్లలు  మా పెద్దాయన అందరూ  ఆశ్చర్య పోతూ    "ఏమన్నావు  ,  శివా రెడ్డా ?"  
"ఏమబ్బి , నీవు రెడ్డి బిడ్డవా ?  మాకు అందరకి శివ అని చెప్పినావు  ఏంది ?  "
"అదేం   అంత పెద్ద విషయం కాదులే పెద్దయ్యా  , పిలవడానికి  సులువుగా ఉంటుంది అని శివ   అని చెప్పా "  అంటూ ఆ మాటలు అక్కడే కట్ చేసి  టాపిక్ మార్చేసా,
 
మేము తింటుంటే ,  మల్లన్న  తోటలోకి వెళ్లి  ఓ సంచి నిండా మామిడి కాయలు ,నిమ్మ కాయలు పిక్కొచ్చి వాళ్ళ బండ్లో  పెట్టాడు.   అందరికి వీడ్కోలు చెప్పి వెళ్ళారు.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:10 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 13 Guest(s)