Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
63.4

"ఏమైంది మామా ఎవరూ వాళ్ళు  "  అంటూ ప్రతాప్ అక్కడికి వచ్చాడు.  వాళ్ళు ఎవరో తెలియదు అంటూ అక్కడ జరిగిన దంతా  వాడికి   వివరించి చెప్పా.   సరేలే వాళ్ళు ఎవరో నేను  ట్రేస్ చేస్తాలే అంటూ  ఇద్దరం  లోపలి వెళ్ళాము.   
 
 
ఓ  45  నిమిషాలకు  డాక్టర్ బయటకు వచ్చాడు.     ఇద్దరకీ  కాళ్ళు fractureఅయ్యాయి  ,  రక్తం ఎక్కువుగా పోయింది  ,  ఇప్పుడు  రక్తం ఎక్కించారు.  వాళ్ళకు ఓ  గంటా , గంటన్నరకు మెలుకవ రావచ్చు అని చెప్పాడు.    వాళ్లకి మెలుకవ వచ్చేంత వరకు  అక్కడే ఉండక తప్పదని,  శాంతాకి ఫోన్ చేసాను.
 
శాంతా వాళ్ళు ఇంటికి చేరుకున్నారు.     కొడుకు,  మనుమడికి ఏమి అయిందో నని ముసలాళ్ళు ఇద్దరు కంగారు పడుతున్నారు , పెద్దాయన నీతో  మాట్లాడాలంటున్నారాని  ఫోన్  పెద్దాయన చేతికి ఇచ్చింది. 
 
" నాకొడుక్కి , నా మనుమడికి  ఎలా ఉంది  బాబు ఇప్పుడు  , వాళ్ళు కు ఎమీ కాలేదు కదా ,  లేచారా " అంటూ  ఏడుస్తూ ఆత్రంగా   అడిగాడు .
"వాళ్ళు ఇద్దరు క్షేమంగా ఉన్నారు పెద్దయ్యా , మీరు  కంగారు పడకండి ,శాంతా కారు ఆరెంజి చేస్తుంది  మీరు వచ్చేయండి "  అంటూ చెప్పి  , పెద్దాయన శాంతా కు ఫోన్ ఇవ్వగా
"శాంతా , ఊర్లో  ఎవరన్నా డ్రైవర్ ఉంటే  సర్పంచ్ వాళ్ళ కారు  లో పెద్దోల్లని ఇద్దరిని వెంటనే పంపించు అని చెప్పాను."
"నేను మాట్లాడాను ,  అంగడి  ఓబులేసు  వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు ఇప్పుడే కారు తీసుకోని మన ఇంటికి వచ్చాడు , శైలజా అక్క కుడా ఇక్కడే ఉంది, వాళ్ళు ఇంకో 10 నిమిషాల్లో బయలు దేరుతున్నారు "  అంటూ ఫోన్ పెట్టేసింది.
 
వాళ్ళ జేబులో ఉన్న పేపర్లు ఆదారంగా ,  ఆయన  కడప లో  పేరున్న బిజినెస్ మేన్ ,  వాళ్లకు  ఓ  రెండు సినిమా థియేటర్స్ ,  ఓ  రెండు  షాపింగ్ మాల్స్ ఉన్నాయి, దానికి తోడూ 100 ఎకరాల తోటలు ఉన్నాయంట  టవునుకు దగ్గరలో ఉన్న పల్లెలో.   ఆ పెద్దాయన పేరు  రాజిరెడ్డి,  తన బార్య అచ్చమ్మ , వాళ్ళ అబ్బాయి నల్లప రెడ్డి , కోడలు కాంతమ్మ, మనుమడు తేజా , మనుమరాలు వర్ష.
 
మనుమరాలు  , కోడలు  రాలేదు ,  కొడుకు, మనుమడితో కలిసి బందువుల ఫంక్షన్  ఉంటే వచ్చారు , తిరుగు ప్రయాణంలో కొడుకు డ్రైవ్ చేస్తానంటే , కారు వాడిచేతికి ఇచ్చాడు నల్లప రెడ్డి  ఆ తరువాత  మనకు తెలిసిందే.
 
అక్కడున్న  S.I  కి చార్జ్ అప్పగించి ,  అవసరం అయితే ఫోన్ చేయమని చెప్పి  ప్రతాప్  వెళ్ళిపోయాడు తను వెళ్ళిన ఓ  10 నిమిషాలకు   నల్లప రెడ్డి కి మెలుకవ వచ్చింది.
"మా వాళ్లకు ఏమి కాలేదు కదా "
"మీ నాన్నా  అమ్మా , బాగానే ఉన్నారు కానీ మీ అబ్బాయికి , మీకు బాగా దెబ్బలు తగిలాయి , కాని ప్రమాదం ఏమి లేదు " అని  డాక్టర్ చెప్పాడు. 
"చాలా ధాంక్స్  డాక్టర్ "
"థాంక్స్ నాకు కాదండి , ఇదిగో  ఇతనికి చెప్పండి , ఇతనే మిమ్మల్ని కస్టపడి  తియానికి తీసుకొచ్చి  అన్ని దగ్గరుండి మీకు ఏమి పరవాలేదు అన్నంత వరకు మా వెనుకే ఉంటూ  సొంత మనిషి కంటే ఎక్కువుగా చూసుకున్నాడు."
 
"బాబు నువ్వు ఎవరో కాని సమయానికి దేవుడిలాగా వచ్చి మమ్మల్ని రక్షించావు , మా అమ్మా నాన్న ఎక్కడ "
"కారులో అందరు పట్టక పొతే , మా అయ్యగారి ఊరికి పంపాను  , వాళ్ళు వేరే కారులో బయలు దేరారు , ఇంకో  10  , 15 నిమిషాలలో ఇక్కడ ఉంటారు " అంటూ జరిగింది చెప్పాను.
"మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్ "
"మీ అబ్బాయికి , కుడి కాలు మోకాలి కింద  విరిగింది ,  కట్టు కట్టాము,   తన కుడా స్ప్రుహ లో నుంచి రావాలే"  అనుకుంటూ పక్కనే ఉన్న వాళ్ళ అబ్బాయి బెడ్ దగ్గరకు వెళ్లి  తనను చెక్ చేస్తుండగా ,  వాళ్ళ నాయనా , అమ్మ వచ్చారు , వాళ్ళతో పాటు  అంగడి ఓబులేసు బందువుల అబ్బాయి  లోపలికి వచ్చి నన్ను గుర్తు పట్టి
"అన్నా శాంతక్క  ఈ డబ్బులు మీకు ఇమ్మంది  అంటూ  "  ఓ కట్ట  నా చేతిలో పెట్టాడు.  
"నేను ఉండనా  లేక వెళ్ళనా అన్నా ?? "  తనతో పాటు బయటకు వెళ్లి    తన అవసరం లేదులే అని చెప్పి  , తనకు 100  చేతిలో పెట్టి , వెళ్ళేటప్పుడు  ఎక్కడైనా ఆగి ఏమైనా తిని వెళ్ళమని చెప్పాను.     వాడు వేల్లెంత వరకు అక్కడే ఉండి వాడు వెళ్ళిన తరువాత లోపలి వచ్చాను.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:52 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 26 Guest(s)