Thread Rating:
  • 5 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రియాతి ప్రియమైన వారికి అప్రియాతి అప్రియమైన లేఖ
#31
(08-05-2021, 03:02 PM)anothersidefor Wrote: హాయ్ నరేష్ గారు... 
కొత్తగా మొట్ట మొదటిసారి కథ (రాక్షస ప్రేమ) రాసిన నాకు . మీ లాంటి ఎక్సపీరియెన్సుడ్ రైటర్స్ నుంచి రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు మీ ప్రొఫైల్ బ్రౌజ్ చేసి  చూసాను. మీ దారాలతో ఒక దారం అదేనండి మీ ప్రేమ లేఖ దారం, చదివాను. చదివాకా కొంచెం టైం పట్టింది నాకు నార్మల్గా అవ్వటానికి. గుండెలు పిండేసినట్టైయింది. రకరకాల ప్రశ్నలతో నా బుర్ర నన్ను వేధించి వేధింది వేయించుకు తినేసింది ఇప్పటివరకు. అప్పుడే అర్థమయ్యింది నేను వేరు నా బుర్ర వేరు అని.  ఇప్పుడే కొంచెం కోలుకొని మీకు రిప్లై ఇస్తున్న. అసలు అందరు అంటారు సెక్స్ స్టోరీస్ చదవకూడదు అని కానీ చెప్పాల్సింది ఇలాంటి ప్రేమ కావ్యాలని కాదు కాదు ప్రాణ కావ్యాలని చదవకూడదు అని బాన్ చెయ్యాలి.  ప్రాణాలు తోడేసినట్టయింది. పైగా సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అని ఆమె మీద నింద వేశారు. అసలు ఆమెను మీరు ఏమి ప్రశ్న అడిగారు. ఆమె మీకు ఏమి సమాధానం చెప్పాలీ, అసలు ఆమెనుంచి మీకు కావలసిందేమిటి.  మీరు మాత్రం 10 నిముషాలు మీ మనసులో ఉన్నదంతా చెప్పి మీ గుండెలో భారాన్ని దించేసుకుని , ఆ భారాన్ని  ఈ ప్రేమ లేఖ చదువుతున్న రీడర్స్ కి ఎక్కించారు. మీరు మాత్రం కళ్ళలో తన రూపం తో వెళ్లిపోయారు. 

"నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి పడింది" అన్నారే, నిజం చెప్పాలంటే రాయి పడింది మీకు కాదు, మీ మాటలు విన్న జ్యోతి గారికి లేదా చదివిన మాకు.  మీ మనుసులో అనిపించింది మీరు జ్యోతి కి , మాకు కూడా చెప్పారు. సరే నా మనసులో అనిపించింది చెప్పాను. పెద్దగా పరిచయం లేని, కొత్తగా సైట్ లోకి వచ్చిన నేను ఇలా కామెంట్ చేశాను అని ఏమి అనుకోకండి.   

అలా ఏం లేదు సార్.. అటూ ఇటూ కాకుండా ఏవో నాలుగు కథలు రాసినా కూడా మీ మనసులో సీనియర్ రైటర్ అని పేరు సంపాదించుకున్నాను అంటే అంతే చాలు. 

మీకు కథ చదివిన తర్వాత జరిగింది నాకు తనని చూస్తుండగా జరిగింది. స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లాడు స్కూల్ బస్ ఎక్కి వాళ్ళ అమ్మకి టాటా చెప్తూ ఎంత బాధపడతాడో అంతకన్నా ఎక్కువే బాధపడ్డాను. దానినే చిన్న జ్ఞాపకంగా రాసాను. 

నేను చాలా కథలు చదువుతాను ఈ సైట్ లో.. కానీ చాలా వరకు చివరిదాకా చదివే అంత ఇంట్రెస్ట్ రావడంలేదు. కొన్ని మాత్రం చాలా మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాయ్. అలాంటి వాటిలో మీ కథ ఒకటి నాకు బాగా నచ్చింది. అందుకే మెసేజ్ పెట్టాను. 

మీ కథకు నా సలహా ఏంటంటే కామెంట్స్ వల్ల కలిగే వత్తిడి మీ కథ మీద పడకుండా మీదైన శైలిలో సాగిపోండి. ఎందుకంటే మన కథల్లో మొగుడు పెళ్ళాం, లవర్స్, అంటీ అంకుల్ ఇలాగే తప్ప వేరే రకమైన కథలు బాగా అరుదు. అలాంటి ప్రత్యేకమైన కథలు అందించే మీలాంటి వాళ్ళ అవసరం మన సైట్ కి చాలా ఉంది. 
All the very best
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply


Messages In This Thread
RE: ప్రియాతి ప్రియమైన వారికి అప్రియాతి అప్రియమైన లేఖ - by naresh2706 - 09-05-2021, 12:52 AM



Users browsing this thread: 1 Guest(s)