Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
49.91%
263 49.91%
వొద్దు
15.75%
83 15.75%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
34.35%
181 34.35%
Total 527 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 48 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
EPISODE 46

ఇంకో రెండు వారాల లోగా కాలు బాగా అయిపోయింది. ఇప్పుడు నేను నడవడం పరిగెత్తడం అన్నీ చేస్తున్నా, మేడం కూడా కాలేజ్ కు వెళ్ళడం మొదలు పెట్టింది. నేను రెండు రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్న తరువాత నేనూ కాలేజ్ వెళ్ళడం మొదలు పెట్టాను. పొద్దున అన్నీ రెడీ అయిపోయాక నేను మామూలుగా వెళ్లి బైక్ స్టార్ట్ చేశా అప్పుడే సిద్దు గాడు కూడా వచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ కనిపించాడు. వాన్ని చూసి పలకరిద్దాం అని అనుకునే లోగానే వాడు తల పక్కకు తిప్పుకొని బైక్ ను కాస్త ముందుకు తీసుకు వెళ్లి ఆపాడు. నేను బైక్ స్టార్ట్ చేసి బయలుదేరుతూ ఉండగా మేడం గుర్తొచ్చింది. తను కూడా వస్తుంది కదా అని గుర్తు రాగానే కాస్త ఆనందం వేసింది. అంతలోనే కాస్త భయం కూడా వేసింది. 

పైగా అక్కడ సిద్దు గాడు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు మేడం లాస్ట్ టూ డేస్ వాడి బండి పైనే వెళ్ళింది. ఇప్పుడు మేడం నా బైక్ ఎక్కుతుందా లేదా అనేదే నా డౌటు..
అలా ఉండగా కాసేపటికి మేడం వచ్చింది. నా గుండె దడ దడ గా కొట్టుకుంటూ ఉండగా మేడం మామూలుగానే వచ్చి సిద్దు గాడు దూరంగా బైక్ ఆపి ఉండడం చూసి నా బైక్ ఎక్కింది. నన్ను తగలకుండా జాగ్రత్తగా కూర్చుంది. నేను గుండె దడ దడ లాడుతూ ఉండగా వెళ్దామా అని అనబోయా..
కానీ అదేంటో కాళ్ళు చేతులు వొనక సాగాయ్ తనతో మాట్లాడదాం అంటేనే, ఇక ఆ సాహసం చేయలేను అని అర్దం చేసుకున్న నేను వెంటనే బైక్ స్టార్ట్ చేసాను. సిద్దు గాడు మేడం, నా బండి ఎక్కడం చూసి ఒక నిట్టూర్పు విడిచి వాడూ బయలు దేరాడు. 
 బైక్ నడుపుతుంటే ఎందుకో ఒక రకమైన టెన్షన్, మేడం వెనుక నన్ను తగలకుండా జాగ్రత్తగా కూర్చుని ఉంది. నేను  ఎం అంటే తను ఎం అంటుందో అని ఒకటే భయపడుతూ మేడం తో మాట్లాడదాం అని కొంచెం దైర్యం తెచ్చుకుని మేడం అని అన్నా..
 మేడం ఎం పలకలేదు. నేను ఇంకో సారి అనబోతూ ఉండగా మేడం ఆటో లో వెళ్ళమంటావా అంది సీరియస్ గా. అంతే గమ్మున ఉండిపోయా.. 
 
 దారిలో వెళ్తుండగా అప్పుడే ఎదురుగా స్పీడ్ బ్రేకర్స్ కనిపించాయి. 
 అవి చూడగానే గుండె జళ్ళుమంది. ఇప్పుడు ఎలా రా బాబు అని భయపడుతూ బండి ని స్లో చేశా, సైడ్ మిర్రర్ లో నుండి మేడం ను చూసా మేడం వేరే వైపు చూస్తూ ఉంది. నేను మెల్లగా మామూలు కంటే తక్కువ స్పీడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్ మీద పోనిస్తూ తను నన్ను టచ్ కాకుండా ఉండేలా జాగ్రత్తగా పోనించా. మేడం అదేం పట్టించుకోవట్లెదు. మామూలుగానే ఉంది. నేను హమ్మయ్యా అని అనుకుంటూ తనని జాగ్రత్తగా కాలేజ్ కు తీసుకు వచ్చా.  
 మేడం ను సైడ్ మిర్రర్ లో నుండి చూసా, తను బైక్ దిగింది, దిగి వెళ్తుండగా అటు వైపు నుండి హారిక మా దగ్గరకు రావడం కనిపించింది. ఆమె దగ్గరకు రాగానే తనని పలకరిద్దాం అని అనుకుంటూ ఉండగా అంతలో ఆమె  కనీసం నా వంక కూడ చూడకుండా బాగున్నారా మేడం అంటు మేడం ను పలకించి తనతో పాటు ముందుకు నడిచింది. అలా ముందుకు నడుస్తూ  మేడం తో  సిద్దు తో రావొచ్చు గా మేడం అని అంది. అలా అనగానే ఒక్కసారిగా కోపంగా వెళ్తున్న హారిక వంక చూసా,
వాళ్ళు అలాగే ముందుకు వెళ్ళిపోయారు..
నేను మనసులో దీనికెందుకో అంత అని అనుకుంటూ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళా. క్లాస్ లో అందరూ పలకరించారు, ఆక్సిడెంట్ అయ్యింది అంట కదా ఎలా ఉంది అంటూ.. 
అంతలో అక్కడే ఉన్న ప్రియ నన్ను చూసింది. వెంటనే ఆనందంగా నా దగ్గరకు వచ్చింది. వచ్చి నా కళ్ళలో చూస్తూ ఎలా ఉన్నావ్ ? చాలా రోజులు అయ్యింది చూడక, ఇప్పుడు కాలు బాగు అయిపోయిందా అంటూ అరెరే నిలబడే ఉన్నావ్ ఎంటి కూర్చో (కాలు బాగోలేదు కదా అందుకు) అంటూ నన్ను అక్కడే బెంచ్ లో కూర్చోబెట్టింది. లాస్ట్ బెంచ్ లో కూర్చోడం వల్ల మమ్మల్ని ఎవ్వరూ పట్టించు కోవట్లెదు, అలా ఎవ్వరూ పట్టించుకోక పోయే సరికి ఇక ఎవ్వని బాధ లేకుండా హాయిగా ప్రియ నాతో మాట్లాడుతూ ఉంది. నేను ఊరికే తన మాటలు వింటూ ఉన్నా, అంతలో ఏం గుర్తొచ్చిందో తనకు తెలీదు కానీ  కొంచెం బుంగ మూతి పెడుతూ నా ముందు బెంచ్ ను ఆనుకుని నా వంక చూస్తూ అయినా నీకు వేరే రూం వుంది అంట కదా, ఎందుకు నువ్వు ఇంకా ఆ దయ్యం ఇంట్లో ఉన్నావ్ అంది. నేను కొంచెం అర్దం కానట్లు చూసా, ప్రియ నా రియాక్షన్ చూసి అర్దం అయ్యేలా అదే మీ మేడం గారు అంది. నేను ఆమె నా ? దెయ్యమా ?  అని అన్నా అర్దం కానట్లు.  ప్రియ అటు ఇటు చూసి నాతో తెలుసా, నేను నిన్ను కలుద్దాం అని మూడు సార్లు మీ ఇంటికి వచ్చా అని అంది. నేను ఎప్పుడు అన్నట్లుగా చూసా., ప్రియ నాతో వచ్చాలే నీకు తెలీదు, అయినా  ఆ దయ్యం అసలు నన్ను నిన్ను కలవనిస్తే కదా తెలిసేది అంది.
నేను తనని చూసి ఎందుకు కలవనివ్వలేదు అని అడిగా 
ఏమో ఎవరికీ తెలుసు, మూడు సార్లు వస్తె ఒక్కసారి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు రూం బయట నుండి చూపించింది. అప్పుడు కూడా నీతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టింది. అసలు ఎందుకు అలా అంది అన్నా. ప్రియ ఏమో రా నాకూ తెలీదు ఎప్పుడు అడిగినా 
ఇప్పుడే పడుకున్నాడు అనో లేకపోతే నిన్ను డిస్ట్రబ్ చేయొద్దు అనో ఎదో ఒకటి చెప్పి తిరిగి పంపించేది ఇక అది నిన్ను కలవనివ్వదు లే అని నేనూ రావడం మానేశా.. 
అది విన్న నేను అసలు ఎందుకు ఇలా చేసింది అని ఆలోచనలో పడ్డా, నేను ఆలోచిస్తూ ఉండడం చూసి నన్ను చూస్తూ ఆమె ఎందుకు అలా చేసిందో నాకు అర్దం అయిపోయింది భరత్ అంది. నేను ఎం అర్దం అయ్యింది అన్నట్లు చూసా, తను నన్ను చూస్తూ 
 ఆమె గారికి నేను నిన్ను ప్రేమించడం ఇష్టం లేదు అందుకే ఇలా చేస్తుంది అని కొంచెం అసూయగా అంది. ఆమె అలా అనగానే నేను అది అయ్యిండదు లే అంటూ ఉండగా అంతలో  క్లాస్ లోకి మేడం వచ్చింది. వచ్చి రాగానే మమ్మల్ని చూసేసింది. 
మేడం వచ్చింది  అని చూడని ప్రియ నేను తన వైపు చూడక పోవడం తో తన చేతిని నా గడ్డం మీద వేసి తన వైపు తిప్పుకుంటూ ఎంటి అది అయ్యిండదా ? అంటూ ఇంకా ఎదో చెప్తుంటే నేను  వెంటనే తన చేతిని విడిపించుకుని లేచి నిలబడ్డా. ప్రియ నేనలా చేసే సరికి ఎంటా అని ముందుకు చూసింది. అక్కడ మేడం మా వంకే చూస్తూ కనిపించింది. ప్రియ వెంటనే భయపడి బెంచ్ మీద నుండి లేచి వెంటనే అవతల వైపు గర్ల్స్ కూర్చునే చోటు కెళ్ళి తల దించుకుని నిలబడింది.
మేడం మా ఇద్దరి వంక కొంచెం కాస్త సీరియస్ గా చూస్తూ టేబుల్ మీద బుక్ పెట్టి ప్రియ వంక చూసింది. ప్రియ ఇంకా తల దించుకునే ఉంది. మేడం తనని చూసి ప్రియ అని పిలిచింది కాస్త గట్టిగా. ప్రియ తలెత్తింది. మేడం ప్రియ ను చూసి క్లాస్ అయ్యాక కనిపించు అంది. ప్రియ భయపడుతూనే తలాడించింది. ఆ వెంటనే మేడం నా వంక చూసింది. నా కాళ్ళు వణకడం నాకు తెలుస్తూ ఉంది. మేడం అలాగే రెండు మూడు క్షణాలు చూసి కూర్చోండి అని అంది అందరితో..
అందరూ కూర్చున్న తరువాత తను లెసన్ చెప్పడం స్టార్ట్ చేసింది. 
తను లెసన్ చెప్తూ ఉన్నంత సేపు నేను భయపడుతూ నే వింటున్నా. క్లాస్ మధ్యలో హారిక ఒకసారి వెనుకకు తిరిగి నా వంక ప్రియ వంక చూసి మళ్ళీ తల తిప్పుకుంది. 
క్లాస్ అయిపొయింది. మేడం చైర్ లో కూర్చుని మా వంక చూస్తూ చెప్పడం మరిచిపోయా, ఇంకో పదైదు రోజుల్లో మీకు ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అండ్ మీ డిగ్రీ కూడా అయిపోతుంది అంది. అలా అంటూనే ఇంకో విశయం అంటూ  మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి  చదవాలి అనుకుంటే  మన కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే ఇక్కడ ఈ ఇయర్ నుండి పీజీ కూడా స్టార్ట్ చేస్తున్నారు.  మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే చేరోచ్చు పైగా నేను కూడా ఫిజీ వాళ్లకు క్లాస్ చెప్పబోతున్నా అంది. అంతలో ఎవడో ఏ డిపార్ట్మెంట్ మేడం అన్నాడు. దానికి మేడం కంప్యూటర్స్  అంది. (మేడం అకౌంట్స్, కంప్యూటర్స్ రెండూ సమర్థవంతంగా డీల్ చేస్తుంది). (ఇక అసలు విశయం చెప్పాలంటే మీకు తెలియనిది ఏముందీ మన స్టోరీ నడవాలంటే భరత్ మేడం పక్క పక్కన ఉండాలి  జాబ్ చేసేటోడికి కంటే సదుకునే టోడే కదా ఎక్కువ కాలీగా ఉండేది అందుకే మన భరత్ గాడిని ఫిజీ కి పంపిద్దాం అని అనుకుంటున్నా అదీ విశయం)

అలా మేడం చెప్తూ ఉండగా నేను ఎదో ఆలోచనల లో ఉండిపోయా అంతలో మేడం ప్రేమా దోమా అని అనకుండా బుద్దిగా చదువుకుంటే మంచి జాబ్ వచ్చి సెటిల్ అవుతారు అని అంటూ ఉండగా ఈ లోకం లోకి వచ్చి మేడం ను చూసాను. మేడం కూడా నా వంక చూసి మళ్ళీ మామూలుగా  అందరితో ఈ వయసులో హార్మోన్ల ప్రభావం ఎక్కువే ఉంటుంది కానీ వాటి మాట కంటే మా మాటలు వినడం మంచింది అంటూ నా వంక చూసి లైఫ్ లో ఛాన్స్ లు  అరుదుగా వస్తాయ్ వచ్చాయి కదా అని మళ్ళీ చేసిన తప్పులే చేస్తూ ఉంటే వాడంత మూర్కుడు ఎవరూ ఉండరు, అంటూ నన్ను పర్టికులర్ గా చూసి వచ్చిన ఛాన్స్ ను జాగ్రత్తగా ఎలా యుస్ చేసుకోవాలో నేర్చుకోవాలి అంటూ నా వంక చూసి తిరిగి బుక్ తీసుకుని బయటకు వెళ్తూ అర్దం కావాల్సిన వాళ్లకు అర్దం అయ్యింది అనుకుంటున్నా అంటూ వెళ్ళిపోయింది.
సిద్దు గాడికి హారికకు ఎం అర్దం అయ్యిందో వెంటనే తల వెనక్కు తిప్పి ఇద్దరూ నన్ను చూసారు. నేను వాళ్ళ వంక చూడగానే వెంటనే తల తిప్పేసుకున్నారు.

భరత్ భయం వేస్తుంది రా ఏమంటుందో అని అంటూ ఉంటే ఏం కాదులే నువ్వు వెళ్ళు అంటూ స్టాఫ్ రూం లోకి పంపించా ప్రియ ను. లోపలికి వెళ్ళిన ప్రియ మేడం అక్కడ కూర్చుని ఉండడం చూసి వోనుకుతున్న కాళ్ళతో తన దగ్గరకు వెళ్ళింది. మేడం ప్రియ రావడం చూసి తల ఎత్తింది. వాళ్ళు ఎం మాట్లాడుతున్నారో అర్దం కాని నేను అవతల వైపు ఉన్న విండో దగ్గరకు వెళ్ళాను. 
మేడం : ఇప్పుడు ఇస్తున్నావా లేదా ?
ప్రియ : మేడం ప్లీస్ మేడం (కళ్ళలో నీళ్ళు దింపుకొని) 
మేడం : ప్రియ నేను మళ్ళీ మళ్ళీ అడగను అనగానే 
ప్రియ భయపడుతూ వాళ్ళ అమ్మ ఫోన్ నంబర్ చెప్పేసింది. 
ఫోన్ నంబర్ తీసుకున్న మేడం ప్రియ వంక చూసింది. 
ప్రియ :  మేడం మా అమ్మ చంపేస్తుంది మేడం తనకి ఇలాంటివి ఇష్టం ఉండదు ప్లీస్ చెప్పకండి అంటూ మేడం ముందు మోకాళ్ళ పై పడి తన కాళ్ళు పట్టుకో బోయింది. వెంటనే మేడం హేయ్ లెయ్ అంటూ కాళ్ళు పక్కకు పెట్టేసుకుంది. ప్రియ భయపడుతూ మేడం వంక చూసింది. (ప్రియ మరీ ఇంత ఎందుకు భయపడుతుందో అర్దం కాని మేడం ఇంకా నేను ఇద్దరం తనని అలాగే చూస్తూ ఉండిపోయాయి)
అంతలో మేడం ఎంటి అంత భయపడుతున్నావ్ మీ అమ్మకు అంది. ప్రియ కళ్ళ నీళ్ళు తుడుచుకుని మేడం మా అమ్మ ది లవ్ మ్యారేజ్ మేడం మా అమ్మను మా నాన్న నేను పుట్టాక వొదిలేసి వేరే ఆమెను చేసుకుని వెళ్ళిపోయాడు అప్పటి నుండి ప్రేమ అంటేనే మా అమ్మకు ఎక్కడ లేని కోపం వస్తుంది ఇప్పుడు కానీ మీరు నా విశయం అమ్మ కు చెప్తే నన్ను కచ్చితంగా చంపేస్తుంది అంటూ అనగానే మేడం సరే ముందు కళ్ళు తుడుచుకో అంది. ప్రియ కళ్ళు తుడుచుకోగానే మేడం తన వంక చూసి ఇంకోసారి వాడితో ప్రేమ అని తిరిగితే అంటూ వుండగానే ప్రియ లేదు మేడం ఇంకోసారి అలా చేయను అంది. మేడం తనని చూసి సరే నువ్వు వెళ్ళు అంది. ప్రియ వెంటనే అక్కడ నుండి వెళ్ళబోయింది. వెళ్తున్న ప్రియను  ప్రియా అంటూ ఆపింది. ప్రియ ఆగి ఎంటి మేడం అంది. మేడం పైకి లేచి తన దగ్గరకు వస్తూ మొదట నువ్వు నీ ప్రేమ ను చెప్పినప్పుడు హెల్ప్ చేస్తా అన్న నేను ఇప్పుడు వద్దు అని ఎందుకు అంటున్నానో అర్దం చేసుకో, నువ్వూ మీ అమ్మలా మోసపోకు అంది కాస్త సీరియస్ గా. ప్రియ మేడం ను అర్దం కానట్లు గా చూసి మళ్ళీ తిరిగి అడిగితే ఏమంటుందో అని అలాగే మేడం అంటు అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న ప్రియ ను చూసి చిన్నగా నవ్వుకుంది మేడం. అప్పుడు చూసా ఎన్నో రోజుల తరువాత మేడం ముఖం లో నవ్వు. అలా నవ్వుతున్న మేడం ను అలాగే చూస్తూ ఉండిపోయా, మేడం చిన్నగా ఎదో గొణుక్కుంటూ వీడికి ఫాలోయింగ్ ఎక్కువైపోయింది ముందు దాన్ని తగ్గించాలి అప్పుడు కానీ దారి లోకి రాడు అని అనుకుంటూ వెళ్లి తన చైర్ లో కూర్చుంది. అంతలో ఎవరో వస్తుంటే  నేను అక్కడ నుండి వచ్చేశా..
ప్రియ ప్రియా అంటూ పిలుస్తుంటే ప్రియ కంగారుగా నా వంక చూసింది. నేను దగ్గరకెళ్ళి ఏమంది మేడం అన్నా. ప్రియ చుట్టూ చూస్తూ భరత్ ప్లీస్ ఇక్కడ నుండి వెళ్ళిపో నేను నీతో మళ్ళీ మాట్లాడతా అంటూ కంగారు పడుతూ ఉంటే నేను మనసులో ఎలాగో మనకీ దీని పై ఇంట్రెస్ట్ లేదు ఆమె అంటత ఆమె దూరంగా ఉన్నప్పుడు గెలుక్కోడం ఎందుకు లే అని అనిపించింది. అలా అనిపించగానే సరే మళ్ళీ మాట్లాడుకుందాం లే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయా ఒక గోల వదిలింది లే అనుకుంటూ..
తెలిసో తెలీకో మేడం నాకు హెల్పే చేసింది లే అని అనుకుంటూ క్లాస్ కు వెళ్ళా. 

ఇంటికి తిరిగి వెళ్ళడానికి బైక్ తీసి రెడీ గా ఉన్న నాకు మేడం ఫోన్ లో మాట్లాడుతూ రావడం కనిపించింది. తను వస్తూ వస్తూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నాకు మొబైల్ ఇచ్చింది మాట్లాడమన్నట్లుగా చూస్తూ. నేను ఎవరో చూసి హెలో అన్నా. మామ అవతల నుండి మాట్లాడుతూ అల్లుడు బిందు ఆంటీ దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి అవి వచ్చే టప్పుడు తన క్లినిక్ దగ్గరకు వెళ్ళి తీసుకురా అని అన్నాడు  నేను సరే మామ అని చెప్తూ  మామ బిందు ఆంటీ కి చెప్పావా నేను వస్తున్నా అని అన్నా..
మామ లేదు ఇప్పుడే చెప్తా అని అంటూ ఫోన్ పెట్టేసాడు.
మేడం తన ఫోన్ తీసుకుని ఎక్కి కూర్చుంది. నేను బిందు క్లినిక్ వైపు బయలుదేరా. బయలుదేరితే బయలుదేరా కానీ మనసులో మాత్రం కొంచెం భయంగా ఉంది. బిందు నన్ను చూసి ఏమంటుందో అని..  క్లినిక్ దగ్గరికి వెళ్ళగానే మేడం కిందికి దిగింది. 
తనకు మేడం కు మాటలు అంతగా లేవు, కాబట్టి బిందు మేడం ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని అనిపించింది. లోపలికి వెళ్ళిన మాకు బిందు లోపల పేషంట్ తో మాట్లాడుతూ కనిపించింది. నేను,  మేడం ఇద్దరం పక్కన కూర్చున్నాము అలా కూర్చోగానే బిందు కు మేము కనిపించామ్.  మేము కనిపించగానే కొద్ది క్షణాలు మా వంక చూసి తిరిగి పేషెంట్ తో మాట్లాడ్డం మొదలెట్టింది. కాసేపటికి ఆ పేషెంట్ వెళ్ళగానే ఒక నర్స్ వచ్చి మేడం రమ్మంటున్నారు అని మాతో అంది. నేను వెంటనే లేచి మేడం తో పాటు బిందు రూం లోకి వెళ్ళాము. వెళ్లి తన ముందు ఉన్న రెండు చైర్స్ లో ఇద్దరం కూర్చున్నాం. నేను బిందు వంక చూసా, తను కొంచెం సీరియస్ గా చూసింది నేను వెంటనే తల దించుకున్నా, మేడం కూడా బిందు ను చూడకుండా అటు ఇటు చూస్తూ ఉంది. తను మా ఇద్దరినీ చూసి నిట్టూర్చి, అక్కడ ఉన్న నర్స్ తో నువ్వెల్లి ముగ్గురికి కాఫీ పంపించు అని అంది. ఆమె వెళ్ళగానే బిందు అక్కడ టేబుల్ డ్రాయేర్ లో ఉన్న రిపోర్ట్స్ తీసి మా ముందర పెట్టింది. నేను తనని చూడకుండా రిపోర్ట్స్ తీసుకుని పక్కన పెట్టుకున్నా. 
ముగ్గురం సైలెంట్ గా ఒకరిని ఒకరం చూసుకుంటూ అంతలోనే ముఖం తిప్పుకుంటూ అలా కాసేపు గడిపాం. అంతలో కాఫీ వచ్చింది. సైలెంట్ గా కాఫీ తాగుతూ ఉన్నాం. నేను అయిపోయిన కప్పు ను పక్కన పెడుతూ ఉండగా బయట ఉన్న బాయ్ వచ్చి నా కప్పు తీసుకుంటూ ఉండగా బిందు ఆ బాయ్ కి నన్ను చూపించి సార్ ను బయట వెయిట్ చేయమని చెప్పు అంది. ఆ బాయ్ నన్ను చూసి సార్ అని అంటూ ఉండగా నేను వినిపించింది లే అంటూ రిపోర్ట్స్ తీసుకుని అక్కడ నుండి బయటకు వచ్చా.. 
లోపల మేడం బిందు ఒకరినొకరు చూసుకుని మళ్ళీ కాఫీ తాగడం మొదలెట్టారు. కాసేపు మౌనం తరువాత బిందూ నే తగ్గి పెదవి విప్పింది. 




(ఏంటో ఈ ప్రెసెంట్ సిట్యుయేషన్ లో నాకు పెద్దగా ఐడియాస్ ఎం రావట్లేదు అందుకే అప్డేట్ కూడా లేట్ అవుతుంది మీ దగ్గర ఏమైనా ఈ ప్రెసెంట్ situation కి సంబంధించి ideas unte చెప్పండి ఏదైనా పర్లేదు నాకైతే పెద్దగా ideas రావడం లేదు 
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
Nice story...,, - by Praveen kumar - 14-11-2018, 11:21 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 26-02-2019, 11:12 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 27-02-2019, 10:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 17-02-2019, 08:17 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 21-02-2019, 10:04 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 09:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:12 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:14 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 02-03-2019, 11:15 AM
RE: భరత్ అనే నేను..... - by akhilapuku - 18-11-2019, 07:36 PM
RE: సారీ టీచర్..... {Index Available} - by dom nic torrento - 14-05-2021, 10:59 PM



Users browsing this thread: 15 Guest(s)