Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మంత్రాలు - చింతకాయలు
#34
అటు శయన గాని నవమి గాని ఓ పదిరోజుల దాకా మామూలు మనుషులు కాలేకపోయారు. పదిరోజుల తరువాత కొద్దిగా తేరుకొన్న నవమిని చూసి ఫల్గుణి లోలోపలే తిట్టుకొంది.సునేత్ర మాట్లాడి వెళ్ళిపోయాడు. నవమికి దిక్కు తోచకుండా ఉంది. ఏదైనా కేసు పెడదామంటే అసలు తమను కొట్టిందెవరో తెలియడం లేదు. అదేదో దెయ్యమో భూతమో అయినట్లుగా గాల్లోనుండి తమను వెంపర్లాడించి కొట్టేయడం అస్సలు మింగుడు పట్టం లేదు.మళ్ళీ ఏదిక్కునుండి ఏమొస్తుందోనని బిక్కు బిక్కుమంటూ కూచొనెలా చేసింది.ఫల్గుణి ఏదైనా చేతబడిలాంటిదేమైనా చేసిందా అని కూడా ఆలోచించింది. తనకు అటువంటి వాటి మీద అస్సలు నమ్మకం లేదు. అన్నట్టు చివర్లో ఏవో మాటలు కూడా వినిపించాయి. ఫల్గుణీ గోపీ అని . . . గోపీ అంటే శయన వాళ్ళ బందువులా ? ఏమో? ఒకసారి కనుక్కోమని చెప్పాలి. ఫల్గుణి పేరు కూడా వినిపించింది కాబట్టి. . .అంటే ఫల్గుణికి ఏదో తెలుసుండాలి లేదా తనకు దీనితో సంభందమైనా ఉండాలి. అనుకొని ఫల్గుణికి కబురంపింది.
ఫల్గుణి నవమి గదిలోనికెళ్ళి అమ్మను తేరిపారా చూసింది. కళ్ళు లోపలకెళ్ళి గుంతలు పడిపోయి ఉన్నాయి. మొహం అంతా పీక్కుపోయి చిన్న చిన్న మడుతలు కనిపిస్తున్నాయి. తలంతా చిందర వందరగా లేచి గరుకుగా తయారయ్యి ఉన్నాయి. లోలొపలే నవ్వుకొని ఏమ్మా ఇప్పుడెలా ఉంది?
చూస్తున్నావు కదే . . నా జీవితంలో ఇంత జ్వరం ఎప్పుడూ రాలేదు!
అప్పుడప్పుడూ జ్వరం రావడం కూడా మంచిదేలేమ్మా. . .నన్నెదుకు పిలిచావో చెప్పు.ఆంది ఫల్గుణి.
ఏం లేదే నీకు గోపీ అని ఎవరైనా తెలుసా. . .
ఫల్గుణి కాసేపు అలోచించి ఆ శయన ఆంటీ కజిన్ వాళ్లబ్బాయి,వాడి అక్క ఇద్దరూ నా దగ్గరకు ఓ సారి వచ్చారు.నాకేదో ఇబ్బంది కలగబోతోందని అదనీ ఇదనీ చెప్పారు. నాకు ఇంట్రస్టు లేదని చెప్పి పంపేసాను. ఏమ్మా నీ దగ్గరకు కూడా వచ్చారా?
అబ్బే అలాంటిదేం లేదు. శయన నాతో తనకు ఏదైనా ఉద్యోగం చూడమని చెప్పిందిలే అందుకని . . .నీతో కలిసిఉంటే నీవే ఎక్కడైన అప్పాయింట్ చేసావోమేమోనని అంతే. . అంటూ విశయం దాటవేసింది. ఫల్గుణికి విసయం ఏం తెలియదని రూఢీ చేసుకొంటూ. . .
సరేలేమ్మ నేను వస్తా నీవు రెస్ట్ తీసుకో అంటూ వెళ్ళిపోబోతుంటే.. .
పల్లూ ఈ రోజు సాయంకాలం మన గెస్ట్ హౌసుకు రాగలవా . . .అంది అడిగింది నవమి.
దేనికమ్మా అంటూ చిత్రంగా చూసింది. ఎప్పుడూ లేనిది దీని నోటినుండి ఇంత మంచిమాటలొస్తున్నాయేమిటా అనుకొంటూ. . .
నీవు రా. . అక్కడ మాటాడుదాం ప్లీజ్ . . ఇప్పుడు నాకు నీరసంగా వుంది.
సరేలేమ్మా వస్తా అంటూ వెళ్ళిపోయింది.
తన గదికెళ్ళి ఆలోచించసాగింది. గోపీ పేరు అమ్మకెలా తెలుసు? శయన ఆంటీ ఏమైనా చెప్పిందా ఒక్కసారి కనుక్కొందామని ఫోన్ చేసి ఇంటికెళ్ళింది.
శయన ఇల్లు మధ్యమ స్థాయి ఉన్నత వర్గాలకు చెందినట్టుగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. పోర్టికోలో కారును నిలిపి లోపలకెళ్ళింది.
ఫల్గుణి తన దగ్గరకు రావడం శయన నవమికి ఫోన్ చేసి చెప్పేసింది. ఏం మాటాడాలో నవమి గయిడ్ చేసి ఉంది.
లోపలకు వెళ్ళగానే శయన కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఉంది గాని జ్వరం ఎఫెక్ట్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.బాగా డీలా పడి ఉంది.
ఫల్గుణికి చిత్రంగా అనిపించింది ఇద్దరకూ ఒకేసారి జ్వరం రావడం ఏమిటా అని.
కాసేపు అదీ ఇదీ మాటాడి గోపీ విశయం చెప్పింది. నవమి ముందుగానే చెప్పి ఉంది కాబట్టి తాను తడుముకోకుండా గోపీని తానే పరిచయం చేసినట్టుగా చెప్పింది శయన.
శయనను ఫల్గుణి బాగా నమ్మి ఉంది కాబట్టి వేరే ఎమీ మాటాడకుండా వచ్చేసింది.
తను అటెళ్ళగానే శయన నవమి కి ఫోను చేసి ఇద్దరినీ కాడించిన ఆ అదృశ్యశక్తి ఖచ్చితంగా గోపీ పనే అయిఉంటుందని ఊహించేసారు.
తానొక్కటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా . . ఇంటికెళ్ళడానికి మనసొప్పక ఏదైనా వెకేషన్ పోవాలని ప్లాన్ చేసుకొంటూ తన స్నేహితులతో కలసి క్రూస్ బుకింగ్ సెంటరుకు వెళ్ళింది ఫల్గుణి.దారిలో ఖనిజ స్కూటీ మీద వస్తూ కనిపించింది. తనను ఎక్కడో చూసినట్టుగా అనిపించి కారును ఆపింది.
తన ఎదురుగా స్లో అయ్యి పక్కన నిలబడిన కారును చూసి ఖనిజ గుర్తుపట్టింది అది ఫల్గుణి కారని.తానుకూఅడా స్కూటీని ఆపి వచ్చింది. తన స్నేహితులని కారులోనే ఉండమని చెప్పి హుందాగా ఖనిజ దగ్గరికొచ్చింది. తనే అలా కారు దిగి రావడం ఖనిజ కు సంతోషపెట్టింది. చిరునవ్వుతో ఎదురెళ్ళి ఓ ఫల్గుణి గారా ఎలా ఉనారు?
అహా నాకేం బానే ఉన్నా . . మీ తమ్ముడికి ఏదైనా ఉద్యోగం దొరికిందా?
ఉద్యోగమా అంటూ విస్మయంగా చూసింది ఖనిజ..
అవును,నా దగ్గరకు ఏవో సోకాల్డ్ పేర్లు చెప్పి వచ్చారు. అది జరుగక పోయేసరికి ఉద్యోగప్రయత్నాలు మొదలెట్టారుగా . . .అంది ఫల్గుణి.
నా తమ్ముడు ఉద్యోగప్రయత్నాలా. . ఎవరు చెప్పారు ?అంది ఖనిజ గజిబిజి పడుతూ
మీ పెద్దమ్మే చెప్పింది,,తను మా అమ్మతో ఏదైనా ఉద్యోగం చూడమని అడిగారంటగా. . . అంది వెటకారంగా . . .
ఖనిజ కు ఎక్కడో ఏదో మిస్ కొడుతున్నట్టుగా అనిపించి ,ఒక్కనిముషం అంటూ గోపీకి ఫొన్ చేసి విచారించి కంఫర్మ్ చెసుకొని, చూడండి ఫల్గుణి గారూ ఎక్కడొ ఏదొ పొరబాటు జరుగుతూ ఉంది . . . నా తమ్ముడు ఎవరినీ ఏమీ అడగలేదు. అలా అని మా పెద్దమ్మతో మాకు అంత మంచి సత్సంబందాలేమీ లేవు. అవన్నీ మా అమ్మా నాన్నలవరకే . . .మీ విశయంలోనే ఎదో జరుగుతోంది,,కనుక్కోండి, మమ్మల్ని నమ్మ మని చెప్పట్లేదు,కాని ఏదైనా అవసరం ఉంటే నా నంబరుకు ఫొన్ చేయండి అని నెంబరిచ్చి వచ్చేసింది.
ఫల్గుణికి మొట్టమొదటి సారిగా శయన మీద అనుమానమొచ్చింది. ఎలానూ అమ్మ సాయంకాలం గెస్ట్ హౌస్ కు రమ్మందిగా . . తన ఊహ నిజమైతే శయనకు సంబందించిన ప్రస్తావన ఖచ్చితంగా వచ్చే వస్తుందనుకొని ఇంటికెళ్ళిపోయింది.
ఇంటికెళ్ళిన ఫల్గుణీకిదిక్కు తోయలేదు. తన చుట్టూ ఏదో విషవలయం అల్లుకొంటూ ఉందని మాత్రం అర్థం అయ్యింది.శయనకు ఫోన్ చేయాలన్నా ఏదో కీడు శంకిస్తూ ఉంది.అలా అని స్నేహితులతో పంచుకోలేదు. లోకం లో తను ఒక్కతే పూర్తిగ ఒంటరైనట్లు తోచి దేశం విడిచిఎక్కడికైనా పారిపోదామా అనిపించి దుఖం పొంగుకొచ్చింది..
చివరి ప్రయత్నంగా ఖనిజకు ఫోన్ చేసింది.
టక్కున లైన్లోనికొచ్చింది ఖనిజ. చెప్పండి ఫల్గుణీగారూ అంటూ. . .
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: మంత్రాలు - చింతకాయలు - by Monica Sunny - 16-04-2019, 08:50 PM



Users browsing this thread: 1 Guest(s)