Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
వినయ్ : మహేష్ ....... ఏంటి ఇంకా స్కూల్ బ్యాగ్ - స్కూల్ డ్రెస్ లోనే ఉన్నావు .
మురళి : వాడు ఇంకా ఇంటికి వెల్లనేలేదు , ఇక్కడే అటూ ఇటూ తిరుగుతున్నట్లున్నాడు - ఇంటికి రాకుండా ఏమిచేస్తున్నావురా .........
మురళీ సర్ అదీ అదీ ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను అందుకే గుడికి వెళ్ళాను .
మురళి : నిజమా ....... ? .
గోవర్ధన్ : చూస్తుంటేనే తెలుస్తోంది కదా మురళీ ...... , కుంకుమ కూడా ఉంది - మహేష్ బాక్స్ లో ఏమిటి అంత జాగ్రత్తగా పట్టుకున్నావు .
స్నాక్స్ ఫ్రెండ్స్ ....... , ఒక దేవతలాంటి బామ్మగారు ప్రేమతో ఇచ్చారు - టేస్ట్ చేయండి వేడివేడిగా కారకారంగా ......... అంటూ బాక్స్ ఓపెన్ చేసాను .
ఫ్రెండ్స్ : wow ...... నువ్వు చెబుతుంటేనే నోరూరిపోతోంది మహేష్ అంటూ టేస్ట్ చెయ్యడానికి పోటీపడుతున్నారు .
మురళి : రేయ్ రేయ్ స్టాప్ స్టాప్ ........ , ఎవరో అలగా జనం ఇస్తే అలా ఎగబడిపోవడమేనా , తిన్నారంటే అంకుల్ వాళ్లకు చెబుతాను .
అంతే ఎక్కడివాళ్ళు అక్కడే ఆగిపోయారు - రేయ్ మహేష్ ....... ఎవరుపడితే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మేము తినము , మా లెవల్ ఏమిటి స్టేటస్ ఏమిటి ........ వెళ్లు వెళ్లి నువ్వు మాత్రమే తిను .
మురళి మాటలకు కోపం వేసినా , మొత్తం నేనే తినబోతున్నానని కలిగిన ఆనందానికి కోపం మొత్తం హుష్ కాకి అయ్యింది - పేదవాళ్లను చులకనగా చూస్తున్నందుకు మాత్రం ప్రతీసారీ బాధవేస్తూనే ఉంది .

వినయ్ : మహేష్ ........ తొందరగా వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకునిరా మ్యాచ్ ఆడదాము.
మురళి : నో ....... , రోజూ ఈ సమయానికి మ్యాచ్ ఆడతామని తెలిసికూడా నాకు చెప్పకుండా గుడికి వెళ్ళాడు కాబట్టి ఈరోజుకు వాడికి ఇష్టమైన క్రికెట్ బ్యాట్ ముట్టుకోవడానికి వీలు లేదు అలా అని ఇంటికి వెళ్ళడానికి కూడా వీలులేదు - రేయ్ మహేష్ ....... మేము ఆడుకునేంతవరకూ అక్కడ కూర్చో ఇదే నీ పనిష్మెంట్ అని ఆర్డర్ వేసి మ్యాచ్ స్టార్ట్ చేశారు .
గుడికి వెళ్లినందుకే పనిష్మెంట్ ఇచ్చాడు , నిన్న బామ్మగారికి సహాయం చేశానని - ఇప్పటివరకూ బామ్మతోపాటే ఉన్నానని తెలిస్తే ఇక అంతే గోల గోల చేసేస్తాడు అని పెదాలపై చిరునవ్వులతో బ్యాగును ప్రక్కన ఉంచి బల్లపై కూర్చున్నాను . బాక్స్ ఓపెన్ చేసి ఆలూ స్నాక్స్ - స్వీట్ తిని మ్మ్మ్ మ్మ్మ్ ...... స్పైసీ అండ్ స్వీట్ లవ్లీ కాంబినేషన్ అంటూ కళ్ళుమూసుకుని ఎంజాయ్ చేస్తున్నాను . 
ఫీల్డింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ లొట్టలేస్తూ నావైపు ఆశతో చూస్తున్నారు - టేస్ట్ చెయ్యాలని ఆశ ఉన్నా మురళికి భయపడి తమను తాము కంట్రోల్ చేసుకుంటున్నారు - బాక్స్ మొత్తం ఒక్కడే ఖాళీ చేసేస్తున్నాడు అని దీనంగా చూస్తూ ఫీల్డింగ్ కూడా మిస్ చేస్తుండటం చూసి నవ్వుకున్నాను .

థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బామ్మా ....... , అచ్చు అవ్వలు చేసినట్లుగానే భలే రుచిగా ఉన్నాయి , ఎదురుగా ఉండి ఉంటే గుండెలపైకి చేరి మరింత కావాలని ఆడిగేవాడిని ప్రాధేయపడేవాడిని అంటూ బామ్మ ఇంటివైపు చూసాను . 
ఆశ్చర్యం ఇంటిపైనుండి ఇప్పటివరకూ నన్నే చూస్తున్నట్లు hi బుజ్జిహీరో అంటూ చేతిని ఊపి స్నాక్స్ ఎలా ఉన్నాయి అని సైగలతో అడిగారు .
సూపర్ సూపర్ సూపర్ ....... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వధలబోయి ఇంకా అంత ఆప్యాయతకు చేరుకోలేదని ఆగిపోయాను - బామ్మా ....... ఖాళీ అంటూ బాక్స్ ను తిప్పి చూయించాను - ఆకలేస్తోంది బామ్మా ....... please please అంటూ కడుపును స్పృశించుకున్నాను .
బామ్మ పరుగున కిందకువెళ్లారు . పెదాలను తడుముకుంటూ మెయిన్ గేట్ వైపు ఆశతో చూస్తున్నాను .

5 నిమిషాలకు బామ్మనే స్వయంగా బాక్స్ తోపాటు బయటకువచ్చారు .
పెదాలపై చిరునవ్వుతో యాహూ అని కేకవెయ్యబోయి ఆగిపోయాను - ఆ వెంటనే మురళిని చూసి గుండె ధడ ధడా కొట్టుకుంది . మురళి బామ్మను ఏమైనా అంటే తట్టుకోగలనా అంటూ పైకి లేవబోతే ........
మురళి చూసి రేయ్ ఎక్కడికిరా మ్యాచ్ పూర్తయ్యేంతవరకూ కదాలకూడదు అనిచెప్పానుకదా - కిట్స్ ఎవరు తీసుకొస్తారు కూర్చో కూర్చో ........
అయ్యో ....... ఇప్పుడేమి చెయ్యడం ( బామ్మా బామ్మా ...... రావద్దు ) - అంతలో బామ్మ గేట్ క్లోజ్ చేసి రోడ్డులో ముందుకువెళ్లిపోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను - రెండు నిమిషాలకు మళ్లీ లోపలికివెళ్లిపోయారు చూస్తే చేతిలో బాక్స్ కనిపించలేదు . 
అదే బాక్స్ తో సెక్యూరిటీ అన్నయ్య వచ్చి మహేష్ డెలివరీ అని ఇచ్చి వెళ్ళిపోయాడు . 

గోవర్ధన్ : మహేష్ ....... మరొక స్నాక్స్ బాక్స్ అంటూ షాక్ చెంది బాక్స్ వైపే చూస్తున్నారు . 
వారు చూస్తుండగానే బాక్స్ ఓపెన్ చేసాను . ఉల్లిపాయ పకోడీలు విత్ పుదీన చట్నీ ప్రక్కనే లెటర్  థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బామ్మా అంటూ పకోడీని చట్నీలో ముంచుకుని తిని మ్మ్మ్ ...... వాహ్ సూపర్ అంటూ దర్జాగా కూర్చున్నాను - లెటర్ ఓపెన్ చేసాను .
" బుజ్జిహీరో అంతా గమనించాను అందుకే సెక్యూరిటీ ద్వారా పంపించాను ఎంజాయ్ - పాపం మీ ఫ్రెండ్స్ కూడా తినడానికి ఆశపడుతున్నారనుకుంటాను , వారు కూడా తినేలా ఏర్పాటుచేసానులే - అయినా ఈ బామ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వధలబోయి ఎందుకు ఆగిపోయావు - చెప్పానుకదా ఒక్కరోజులోనే ఒకరొకరం ప్రాణంలా కలిసిపోయాము అని - నువ్వూ చెప్పావుకదా పెద్దమ్మ కూడా చెప్పారని - నేను అలిగాను "
Sorry sorry బామ్మా అంటూ చూస్తే ఇంటిపైన అలకచెందినట్లు బామ్మ కోపంతో చూస్తున్నారు ...... కోపం కాదు చిరుకోపం కాదు కాదు తియ్యనైన కోపం ......

ఫ్రెండ్స్ నోరూరిపోతుండటం - మురళి వైపు కోపంతో చూస్తుండటం చూసి నవ్వుకున్నాను . 
అంతలో మరొక సెక్యూరిటీ వచ్చి మురళీ సర్ మీకోసం ఏరియా మెయిన్ గేట్ దగ్గర ఒక వ్యక్తి వేచిచూస్తున్నాడు .
మురళి : ఎవరు ? .
సెక్యురిటి : తెలియదు మురళి సర్ , లోపలికి రమ్మంటే ససేమిరా అంటున్నాడు - మహా అర్జెంట్ తొందరగా పిలుచుకునిరండి అని కాళ్లావేళ్ళా పడుతున్నాడు , అందుకే వచ్చాను మీరు వస్తారా లేక వెనక్కు పంపించెయ్యమంటారా ..... ? .
మురళి : మహా అర్జెంట్ అంటున్నాడు కదా డాడీ ఏమైనా పంపించారేమో పదా వెళదాము . 
సెక్యూరిటీ కన్ను కొట్టడంతో ...... బామ్మ ప్లాన్ అని అర్థమైపోయింది . తలదించుకుని నవ్వుకుంటున్నాను .

మురళి : హలో హీరో ....... వెళుతున్నాను కదా సెక్యూరిటీగా రావాలని తెలియదా ........ 
Sorry మురళీ సర్ అంటూ లేచి నిలబడ్డాను - ఇప్పుడెలా ....... నేను తిన్నాను కదా ఫ్రెండ్స్ ను తిననిద్దాము అని బాక్స్ ను బల్లపై ఉంచి గోవర్ధన్ - వినయ్ వైపు ఎంజాయ్ అంటూ కన్నుకొట్టాను .
అంతే వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి . ముసిముసినవ్వులతో మురళి వెనుకే ఫాలో అయ్యాను - బామ్మ ఇంటిదగ్గరికి చేరుకోగానే థాంక్యూ థాంక్యూ బామ్మా అంటూ బోలెడన్ని ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడంతో ......
బామ్మ బుంగమూతిపెదాలు ఒక్కసారిగా చిరునవ్వులు చిందిస్తూ వదిలిన కిస్సెస్ అన్నింటినీ రెండుచేతులతో అందుకుని గుండెలపై హత్తుకుని , మా బుజ్జిహీరో అంటూ దిష్టి తీసి మురిసిపోతున్నారు .
ఆపకుండా బామ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే వెనక్కు నడుస్తున్నాను .
ముద్దుల సౌండ్ కు వెనక్కుతిరిగి చూసినట్లు , రేయ్ మహేష్ ...... ఎవరికిరా అన్ని ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నావు అని మురళి ........
మురళీ సర్ అదీ అదీ అదిగో ఆకాశంలో వెళుతున్న పక్షులకు ....... , ఇలా ముద్దులుపెడితే అదృష్టం అని మా అవ్వలు చెప్పేవారు .
మురళి : అదృష్టమా ....... , నీ జీవితమంతా మా కింద బ్రతకాల్సిందే , అలాంటి ఆశలు పెట్టుకోకుండా మూసుకుని రా .......
మెయిన్ గేట్ దగ్గరికి వెళితే ఎవ్వరూ లేరు , ఎలా ఉంటారు బామ్మ వేసిన ప్లాన్ అయితేనూ ......... అని వెనుక నవ్వుకుంటున్నాను .
మురళి : సెక్యూరిటీ ఎవ్వరూ లేరే .......
సెక్యురిటి : ప్లాన్ ప్రకారం పెద్దయ్యా ...... ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమయ్యారు అని బయటకువెళ్లి రోడ్డుకు ఇరువైపులా చూసాడు .
సెక్యురిటి పెద్దయ్య : మొబైల్ మ్రోగడంతో మళ్లీ వస్తాను అనిచెప్పి వెళ్ళిపోయాడు అని సమాధానమిచ్చాడు .
మురళి : ఈసారి వస్తే నాదగ్గరికే పిలుచుకునిరండి అని కోపంతో మినీ గ్రౌండ్ కు వచ్చేశాడు .

చేరుకున్నాడు .

ఫ్రెండ్స్ అందరూ తృప్తిగా తిన్నట్లు - స్పైసీ గా ఉన్నట్లు ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ....... అంటూ ఒకరిచేతిలోని వాటర్ బాటిల్ ను మరొకరు లాక్కుని తాగుతున్నారు .
మురళి : ఆశ్చర్యపోయి , రేయ్ ఏమైందిరా నీటికి కూడా అంతలా పోటీపడుతున్నారు .
ఫ్రెండ్స్ : ఆఅహ్హ్హ్ ఆఅహ్హ్హ్ ...... అదీ అదీ ఆడి ఆడి అలసిపోయాము కదా ఆయాసంతో తెగ దాహం వేస్తోంది రేయ్ నాకు రేయ్ నాకు అంటూ తాగుతున్నారు - అయ్యో ఎంప్టీ ....... కారం కారం కాదు కాదు దాహం దాహం ....... నాలుక కరుచుకున్నారు .
ఫ్రెండ్స్ ...... నాబ్యాగులో వాటర్ బాటిల్ ఉంది ........
వినయ్ : ఈ బాటిల్ నీ బ్యాగులోనిదే మహేష్ ఆఅహ్హ్ ఆఅహ్హ్ ........ కారం దాహం దాహం మహేష్ .......
క్షణంలో తీసుకొస్తాను అని బాటిల్ అందుకుని పరుగున బామ్మ ఇంటికి వెళ్ళాను - మెయిన్ గేట్ బయట నుండే బామ్మా బామ్మా ....... నేను బుజ్జిమహేష్ ను అర్జెంట్ గా వాటర్ కావాలి ........

ఎవరు బామ్మా ....... బుజ్జిమహేష్ అంటూ లోపలినుండి అతిమధురమైన మాటలు వినిపించాయి . ఎక్కడో విన్నాను ఎక్కడో విన్నాను .........
తల్లీ తల్లీ ....... స్టాప్ స్టాప్ నేను చూస్తాను అంటూ పరుగున బయటకువచ్చారు బామ్మ ....... - కంగారు - ఆయాసపడుతూనే ....... బుజ్జిహీరో అంటూ కౌగిలించుకోబోయారు .
బామ్మా బామ్మా ........ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........
బామ్మ ఆగిపోయి దీనంగా ముఖం పెట్టారు .
Sorry sorry బామ్మా ....... , మురళి అనే ఫ్రెండ్ చూస్తే గోడవలైపోతాయి - అవన్నీ తరువాత చెబుతాను - మా బామ్మగారు స్పైసీ స్నాక్స్ తిని కారం కారం అంటున్నారు ఫ్రెండ్స్ - మనలా ఎక్కువ కారం తినరు వాళ్ళు కాబట్టి అంటూ వాటర్ బాటిల్ చూయించాను .
బామ్మ : నా వెనుక చూసి సడెన్ గా నా నుదుటిపై ముద్దుపెట్టి బాటిల్ అందుకుని వడివడిగా లోపలికివెళ్లి నాలుగైదు బాటిల్స్ మరియు స్వీట్స్ అందించారు .
కూల్ వాటర్ - బామ్మా ....... వింటున్నారు కదా కారపు ఆహాకారాలు got to go .......
బామ్మ : wow ఇంగ్లీష్ ........ 
తియ్యదనంతో నవ్వుకుని , చెప్పానుకదా బామ్మా ....... ఇంగ్లీష్ మేడం గా వచ్చినది నా దేవత అంటూ పరుగున వెళ్లి ఫ్రెండ్స్ కు కూల్ వాటర్ అందించాను .
ఫ్రెండ్స్ గట గటా తాగి థాంక్యూ థాంక్యూ మహేష్ కూల్ వాటర్ తెచ్చినందుకు ....... 
ఫ్రెండ్స్ ....... మన పరిస్థితిని చూసి ఆ ఇంట్లో ఉన్న బామ్మగారు స్వీట్స్ కూడా ఇచ్చారు తినండి అని అందించాను .
మురళి నో అనేంతలో ఫ్రెండ్స్ నోటిలోకి చేరిపోవడంతో ఏమీచెయ్యలేక గుర్రుగా చూస్తూ వెళ్లి బ్యాట్ పట్టుకుని మ్యాచ్ పూర్తిచేయడానికి అందరినీ పిలిచాడు .
ఫ్రెండ్స్ : థాంక్స్ మహేష్ అంటూ అందరూ ఒకేసారి హత్తుకుని ఫీల్డింగ్ నిలబడ్డారు . 
మురళి : రేయ్ మహేష్ ...... నవ్వింది చాలు వెళ్లి కూర్చో అని కోపంతో చెప్పాడు . 
అలాగే మురళి సర్ అంటూ బాటిల్స్ అందుకుని వెళ్లి కూర్చున్నాను . బాటిల్స్ లో బామ్మగారికి నేను ఇచ్చిన బాటిల్ లేదు - ఫ్రిడ్జ్ లోనుండి వారికోసం ఉంచిన బాటిల్స్ ఇచ్చారన్నమాట థాంక్స్ బామ్మా ...... - ప్రక్కనే ఖాళీ బాక్సస్ ఉన్నాయి చిన్న పకోడీ వదలకుండా కుమ్మేసారన్నమాట , కారం కారం అంటూనే చట్నీ కూడా నాకేసినట్లు తెలిసి నవ్వుకున్నాను .

ఫ్రెండ్స్ చీకటిపడేంతవరకూ ఆడుకున్నారు . రేయ్ మహేష్ మేము వెళుతున్నాము నీ బ్యాగుతోపాటు కిట్స్ కూడా తీసుకురా ఇదే నీకు చివరి పనిష్మెంట్ ........
నాకు సహాయం చేయడానికి ఫ్రెండ్స్ వచ్చారు .
మురళి : ఫ్రెండ్స్ ...... వాడికి హెల్ప్ చేశారో ఎవరో ఇచ్చిన స్వీట్స్ ముందూ వెనుకా చూడకుండా తిన్నారని అంకుల్ వాళ్లకు చెబుతాను అని వేగంగా వెళ్ళాడు .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ....... ఇది నాకు పనిష్మెంట్ కానే కాదు , మీకు తరువాత చెబుతానుకదా వెళ్ళండి వెళ్ళండి ...... అని సంతోషంతో చెప్పడంతో మురళీ రేయ్ మురళీ ఆగురా వస్తున్నాము అనివెళ్లారు .
దిక్కులకొకటి పడేసిన వికెట్స్ - బ్యాట్స్ - బాల్స్ ....... కిట్స్ బ్యాగ్స్ లో ఉంచి , బ్యాగుని వెనుక వేసుకుని - రెండు చేతులతో కిట్స్ పట్టుకుని , థాంక్స్ మురళీ ...... బామ్మను మళ్లీ కలిసే అవకాశం లభించే స్వీట్ పనిష్మెంట్ ఇచ్చావు - మాతోపాటు రా అని ఉంటే ఈ సంతోషం కలిగేది కాదు అని బామ్మ ఇంటికి చేరుకుని బామ్మా బామ్మా ....... అని ప్రేమతో పిలిచాను .

బామ్మా ....... మళ్లీ ఎవరో వచ్చారు - వెళ్లి చూస్తాను .
వాయిస్ స్వీట్ వాయిస్ ........ ఆఅహ్హ్ అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను . ఎక్కడో ....... ఎక్కడ ఎక్కడ విన్నాను అని ఆలోచనలో పడిపోయాను .
వద్దు వద్దు వద్దు నువ్వు ఏదో పనిలో అన్నావుకదా నేను వెళతాను అని మళ్ళీ కంగారుపడుతూ వడివడిగా వచ్చారు . బుజ్జిహీరో బుజ్జిహీరో ....... అక్కడే ఆగిపోయావే లోపలికిరావచ్చుకదా ........ , వద్దు వద్దు వద్దులే అంటూ బామ్మే వచ్చి నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు . ఏంటి బుజ్జిహీరో ఏమిటో దీర్ఘన్గా ఆలోచిస్తున్నాడు .
అధికాదు బామ్మా ....... సాయంత్రం నుండీ ఇంటిలోపల నుండి ఒక మధురాతిమధురమైన వాయిస్ ఎక్కడో విన్నట్లు ........ ఎక్కడబ్బా ........ , ok ok త్వరగా వెళ్ళాలి లేకపోతే ఫ్రెండ్ కోప్పడతాడు , బామ్మా ....... బాటిల్స్ - బాక్సస్ తీసుకోండి సరైన సమయానికి చల్లని నీళ్లు ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరూ మీకు థాంక్స్ చెప్పారు . 
బామ్మ : పెదాలపై చిరునవ్వులతో , విన్నాను చూసాను నా బుజ్జిహీరోను కూడా సంతోషంతో కౌగిలించుకోవడం ........
మా ప్రియమైన బామ్మ వల్లనే కదా ....... థాంక్యూ sooooo మచ్ , బామ్మా ....... మన బాటిల్ ........
బామ్మ : మన బాటిల్ ...... , సంతోషం పట్టలేక హత్తుకున్నారు - మన బాటిల్ కదా అందుకే నా ప్రాణమైన బుజ్జిహీరో గుర్తుకు వస్తూనే ఉండాలని భద్రంగా దాచేసుకున్నాను - బాటిల్ చూడగానే బుజ్జిహీరో బుజ్జినవ్వులు కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి - కావాలంటే ఈ బాటిల్స్ అన్నీ తీసుకెళ్లు ........
అయితే మా బామ్మకు గుర్తుగా ఒక బాటిల్ తీసుకెళతాను బై బామ్మా .......
బామ్మ : నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి మురిసిపోతున్నారు . బుజ్జిహీరో ....... నీ బుజ్జిదేవకన్య పదే పదే నిన్నే కలవరిస్తోంది , ఇంటిని ఇంత చక్కగా సర్దడం - పిజ్జా తీసుకొచ్చి ఆకలితీర్చిన బుజ్జిదేవుడు ఎవరు ఎవరు నేను చూడాలి బామ్మా ....... అని - ఒకసారి లోపలికివచ్చి కనిపించు లేదా నీ బుజ్జిదేవకన్యనే పిలివనా ...... - నిన్ను చూడటం కోసం థాంక్స్ చెప్పడం కోసం వీలైతే నాకంటే ప్రేమతో ముద్దుపెట్టడం కోసం తహతహలాడుతోంది పాపం ........
బామ్మా బామ్మా ........ తప్పు తప్పు నా బుజ్జిదేవకన్య కాదు , మీ బుజ్జితల్లి ..... - చెప్పానుకదా బామ్మా ...... please please ఇక్కడ కేవలం నా దేవత మాత్రమే ఉంది - చదువుకుంటోంది అన్నారుకదా డిస్టర్బ్ చెయ్యకండి .
బామ్మ : అంతేనా బుజ్జిహీరో ........ అని బుంగమూతిపెట్టుకున్నారు - అయితే ఉండు నేనూ సర్ప్రైజ్ ఇస్తాను అన్నట్లు చూస్తున్నారు .
Please please బామ్మా ...... దేవత విషయం చెప్పగానే ఆనందంతో కౌగిలించుకున్నారు కదా , ముద్దులుకూడా పెట్టారు ....... , మీరు బాధపడితే నేను చూడలేను .
బామ్మ : సరే సరే నీ బుజ్జిదేవకన్య చదువుకుంటోంది అని నీకెలా తెలుసు .......
మీరే కద బామ్మా ....... పనిలో ఉన్నావు కదా బుజ్జితల్లీ నేను చూస్తాను అని బయటకువచ్చారు - ఈ వయసులో పని అంటే స్కూల్ హోమ్ వర్క్ - రీడింగ్ కాకుండా ఇంకేమిటి బామ్మా ....... 
బామ్మ : హోమ్ వర్క్ - రీడింగ్ ? అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
Yes yes మా బామ్మ ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి , వెళ్ళొస్తాను బామ్మా ........ అని కింద ఉంచిన కిట్స్ అందుకున్నాను .
బామ్మ : నా బుజ్జి మనవడు ఇంత బరువు ....... , నన్ను సహాయం చెయ్యనివ్వు ఇంటివరకూ తీసుకువస్తాను ఇవ్వు ........
అమ్మో ....... నాకిష్టమైన బామ్మతో బరువును మోయిస్తానా ఇంకేమైనా ఉందా - పర్లేదు బామ్మా ....... నాకు అలవాటే , మీ మనవరాలిని ఒంటరిగా వదిలి ఎక్కడికీ వెళ్ళకండి - ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యండి నేనున్నానుకదా బామ్మా ........
బామ్మ : బుజ్జిహీరో అంటూ ఉద్వేగానికి లోనై మనసారా కౌగిలించుకున్నారు .
బామ్మా ....... వదిలితే రాత్రంతా కౌగిలించుకునేలా ఉన్నారు .......
బామ్మ : ఆ అదృష్టం కోసం ఎదురుచూస్తూ ఉంటాను - నువ్వే ....... స్వయంగా వచ్చి బామ్మా , మీ కౌగిలిలోనే ఉండిపోతాను అంటూ బ్రతిమాలే రోజు అతి త్వరలోనే వస్తుంది నువ్వే చూస్తావుకదా అని ముసిముసినవ్వులతో ముద్దుపెట్టి వదిలారు . 
బై చెప్పి ఇంటికి చేరుకున్నాను . కిట్స్ ను జాగ్రత్తగా ఔట్ హౌస్ బయట ఉంచి లోపలకువెళ్లి లైట్స్ on చేసాను - బ్యాగును బెడ్ పై ఉంచి నగ్నంగా తయారయ్యి ఫ్రెష్ గా స్నానం చేసివచ్చాను -
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-09-2021, 09:52 AM



Users browsing this thread: 9 Guest(s)