Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బస్ ముందుకు వెళ్ళిపోయింది .
బుజ్జితల్లి : మమ్మీ ........ లవ్ యు sooooo మచ్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి మమ్మీ మొక్కులన్నీ తీరబోతున్నాయి అని చిరునవ్వులు చిందిస్తోంది .
బుజ్జితల్లి - దేవత సంతోషాలను చూసి ఆనందించి చుట్టూ చూసాను . మేడం ...... మీ మొక్కులో కాలినడకన ఏడుకొండలూ ఎక్కుతానని ఉందా ? .
దేవత : అది చిన్నప్పటి కోరిక మహేష్ గారూ ....... , కానీ ఇప్పుడు కాలినడక అంటే ఆలస్యం అయిపోతుందేమో ........
ఆలస్యం గీలస్యం ప్రక్కన పెట్టేయ్యండి మాట ప్రకారం మన బస్సు ఊరికి చేరేలోపు మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది - ఇప్పటికిప్పుడు మొక్కు తీర్చుకునే అవకాశం లభిస్తే కాలినడకన ఎక్కడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా ? అదొక్కటి చెప్పండి .
బుజ్జితల్లి : నేనైతే రెడీ అంకుల్ ...... మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని ఉత్సాహంతో చెప్పింది .
దేవత నవ్వుకుని , మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటారంటే సంతోషంగా భక్తితో ఏడుకొండలూ ఎక్కడా ఆగకుండా ఎక్కేస్తాను అని భక్తితో మొక్కుతున్నారు .
మేడం ....... అటువైపుకు చూడండి మరొక coincidence .......
ఎదురుగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న కొండలపై కాలినడక మార్గాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు . నిజమని ఇప్పుడు నమ్ముతున్నాను మహేష్ గారూ ....... బస్సు సరిగ్గా మొదటి మెట్టుకు దగ్గరలో ఆగడం అంటే అదృష్టమనే చెప్పాలి - స్వామీ ...... ఇన్నిరోజులూ మొక్కు తీర్చుకోలేకపోయినందుకు మీరే రప్పించుకున్నారా మమ్మల్ని మన్నించండి అని లెంపలేసుకున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ ....... దెబ్బలే కాదు అంకుల్ లా గుంజీలు కూడా తీయాలి అని బుజ్జిబుజ్జిగా నవ్వుతోంది .
దేవత : దర్శించుకుని స్వామివారి ముందు మన్నించమని గుంజీలు తీస్తాను బుజ్జితల్లీ హ్యాపీనా ...... ? , మహేష్ గారూ ...... సమయం వృధాచెయ్యకూడదు అన్నారుగా ........ అని అటువైపు అడుగులువేశారు .
మేడం ........ ముందు ఇటువైపు అని దగ్గరలోని స్టార్ హోటల్ వైపు చూయించాను - చికెన్ తిన్నాముకదా మేడం దర్శనం అనగానే మరిచిపోయినట్లున్నారే .......
దేవత : అవునుకదా ....... స్వామీ మన్నించండి అని లెంపలేసుకుని నాతోపాటు వచ్చారు . హోటల్లో ప్రక్కప్రక్కనే రెండు సూట్స్ ను తీసుకుని రూమ్ వరకూ వదిలి బ్యాగు అందించాను - మేడం ....... రోజూలా కాదు అర గంటలో మనం తొలిమెట్టు దగ్గర ఉండాలి . 
దేవత : నేనేమీ అందరి అమ్మాయిలలా కాదు మీకంటే ముందుగా బయట ఉంటాను అని ముసిముసినవ్వులతో డోర్ క్లోజ్ చేసుకున్నారు .
నాకంటే ముందుగా కాకపోయినా చెప్పిన సమయానికి తలంటు స్నానం చేసి పట్టుచీరలో చీరను సరిచేసుకుంటూ బయటకురావడం అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . 
బుజ్జితల్లి వచ్చి నా తొడపై గిల్లేసి , నో అలా చూడకూడదు అనిచెప్పానుకదా , మీ దేవత - బుజ్జి ఏంజెల్ అని బుజ్జికోపంతో వార్నింగ్ ఇచ్చింది .
స్స్స్ .........
దేవత : ఏమైంది మహేష్ గారూ .......
బుజ్జి చీమ కుట్టింది మేడం అంటూ బుజ్జితల్లివైపు చూసాను - బార్బీ లా రెడీ అయి ఉండటం చూసి wow బ్యూటిఫుల్ అంటూ ఎత్తుకున్నాను . 
దేవత : నవ్వుకుని , మహేష్ గారూ ....... సమయానికి వచ్చామా ? .
పర్ఫెక్ట్ మేడం అంటూ బయటకువచ్చి నడుచుకుంటూనే , ఓర కంటితో పట్టుచీరలోని నా దేవతను పదే పదే చూస్తూ - బుజ్జితల్లికి దొరికిపోయి బుజ్జి దెబ్బలను తింటూ దగ్గరలోని తొలిమెట్టు చేరుకున్నాము . మేడం ....... ఒక్కనిమిషం , బుజ్జితల్లీ ....... మమ్మీకి తోడుగా ఉండు అని కిందకుదించి వెళ్లి లగేజీలను టీటీడీ ఆఫీస్ లో సబ్మిట్ చేసివచ్చి లెట్స్ గో అంటూ బుజ్జితల్లిని ఎత్తుకోబోతే ........
నో నో నో అంకుల్ ....... నేనుకూడా స్టెప్స్ ఎక్కుతాను అని బుజ్జిచేతులతో మా ఒక్కొక్క చేతిని అందుకుంది .
దేవత : నా బంగారుకొండ అని తొలిమెట్టుకు మొక్కుకున్నారు . 
అధిచూసి బుజ్జితల్లి - బుజ్జితల్లిని చూసి నేను మొక్కుకుని భక్తితో స్టార్ట్ చేసాము .

100 మెట్లు ఎక్కగానే మమ్మీ ........ అంటూ బుజ్జి ఆయాసంతో మెట్టుపై కూర్చుంది బుజ్జితల్లి ........
ఇప్పుడెలా అని దేవత కంగారుపడేంతలో ....... , బుజ్జితల్లీ ...... ఈ అంకుల్ ఉన్నాడుకదా అంటూ భుజాలపైకి ఎత్తుకుని బుజ్జిచేతులను పట్టుకుని - బుజ్జిచేతులపై ముద్దులుపెడుతూ కంటిన్యూ చేసాము .
దేవత : మహేష్ గారూ .......
నా ప్రాణం కంటే ఎక్కువైన కీర్తీ పేరుతో ఉన్న ఈ బుజ్జితల్లిని ఇలా ఎత్తుకుని ఏడుకొండలూ ఎక్కడం నా అదృష్టం మేడం ...... , please ....... మీరేమీ మనసులో ఉంచుకోకుండా భక్తితో ఎక్కండి - మధ్యలో ఎక్కడైనా మీకూ అలసట వస్తే మిమ్మల్ని కూడా ఇలానే ఎత్తుకుని ఏడుకొండలనూ సంతోషంగా ఎక్కేస్తాను .
దేవత : నేను పుట్టి పెరిగినది పల్లెటూరులో , అమ్మానాన్నలతోపాటు చదువుకుంటూనే పొలం పనులలో సహాయం చేసాను , చూస్తూ ఉండండి ఒక్కచోట కూడా ఆగకుండా ఎక్కేస్తాను .
Wow ....... స్ట్రాంగ్ అన్నమాట గుడ్ మేడం .......
బుజ్జితల్లి : అయితే మన ఊరు వెళ్ళాక అమ్మమ్మకు నేనూ సహాయం చేసి మమ్మీలా స్ట్రాంగ్ అవుతాను .
దేవత : లవ్ యు బుజ్జితల్లీ ........ 
బుజ్జితల్లి బుజ్జిచేతిపై ముద్దుపెట్టి , బుజ్జితల్లీ ....... చీకటిలో కనిపించవు కానీ నీకు రెండువైపులా జింకలు - పులులు కనిపిస్తాయి చూడు ......
బుజ్జితల్లి : పులులు అంటే నాకు చాలా భయం అంకుల్ అంటూ నా చేతులను గట్టిగా పట్టుకుంది .
నాకు కూడా మహాభయం బుజ్జితల్లీ ....... , అయినా పొలం పనులు చేసిన మీ స్ట్రాంగెస్ట్ మమ్మీ ఉండగా మనకు భయమేల .........
దేవత : మహేష్ గారూ ....... మిమ్మల్నీ అంటూ ఫస్ట్ టైం నా చేతిపై కొట్టి , sorry sorry .........
ఆ sorry లు ఎక్కడ వినిపిస్తాయి , నేను మేఘాలలో తెలిపోతుంటేనూ ....... నా దేవత నన్ను కొట్టింది అని ఏడుకొండలూ వినిపించేలా కేకలువెయ్యాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని దేవత ప్రక్కనే ఉత్సాహంగా ఒక్కొక్క మెట్టు ఎక్కాను .

బ్రహ్మోత్సవాల సమయం అవ్వడం వలన భక్తులు పెద్ద సంఖ్యలో ఎక్కుతున్నారు - అక్కడక్కడా ప్రసాదాలు - పళ్ళు పంచుతున్నారు . ప్రసాదం స్వీకరిస్తూ బుజ్జితల్లికి పళ్ళు అందించి అందరితోపాటు భక్తితో స్వామివారి నామస్మరణ చేసుకుంటూ గంటపాటు ఎక్కడా ఆగకుండా ఎక్కుతూనే ఉన్నాము .
మేడం ....... బిల్డప్ ఇస్తున్నారు అనుకున్నాను కానీ ఎక్కడా ఆగకుండా ఇప్పటికీ హుషారుగా మెట్లు ఎక్కుతున్నారు - మీరు నిజంగా స్ట్రాంగెస్ట్ ....... , ఎంతైనా పల్లెటూళ్ళల్లో మ్యాటర్ ఉందని నమ్ముతున్నాను .
దేవత : నవ్వుకున్నారు - మీరు సిటీలో పెరిగినా నాకంటే హుషారుగా ఎక్కుతున్నారు - మీరు మరింత స్ట్రాంగ్ , నా బంగారుకొండను ఎత్తుకుని కొండలను అవలీలగా ఎక్కేస్తున్నారు థాంక్యూ soooooo మచ్ అని ఫీల్ అవుతూ చెప్పారు .
మేడం ....... మీరు ఏమాత్రం ఫీల్ అవ్వకండి - మీబుజ్జితల్లి అంటే నాప్రాణం కంటే ఎక్కువైన నా కీర్తీ తల్లి కాదా ....... - తననూ ఇలానే ఎత్తుకుని వెళ్ళేవాడిని - అసలు ఏమాత్రం బరువే లేదు .
బుజ్జితల్లి : థాంక్యూ అంకుల్ ........

కీర్తీ ....... ఒక్క అనిమల్ కూడా కనిపించలేదా ? .
బుజ్జితల్లి : ప్చ్ ....... అంకుల్ అంకుల్ అదిగో అక్కడ అక్కడ జింకలు గుంపులుగా ఉన్నాయి త్వరగా త్వరగా తీసుకెళ్లండి .
లవ్ టు కీర్తీ తల్లీ ....... అంటూ ఫెన్సింగ్ దగ్గరకు తీసుకెళ్ళాను .
బుజ్జితల్లి : టీవీలో కాకుండా ఫస్ట్ టైం చూస్తున్నాను అంకుల్ అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతోంది .
కీర్తీ ....... వైజాగ్ - బెంగళూరులో ఉన్నావు ఒక్కసారికూడా జూ లో చూడలేదా ? .
దేవత : నా కడుపున పుట్టినందుకు కీర్తీ అపార్ట్మెంట్ కూడా దాటి బయటకు అడుగుపెట్టలేదు అని బాధపడుతున్నారు .
మేడం కంట్రోల్ ....... ఇప్పుడు తనివితీరా చూస్తుందిలే అని ప్రక్కనే అమ్ముతున్న గింజలు - పళ్ళు తీసుకొచ్చి బుజ్జితల్లి - దేవత ద్వారా జింకలకు అందించేలా చేసి వారి ఆనందాలను ఆస్వాదించాను . 
భక్తుల పిల్లలందరూ అక్కడకుచేరి జింకలను చూసి ఆనందిస్తున్నారు .
బుజ్జితల్లి : థాంక్యూ అంకుల్ అంటూ గట్టిగా హత్తుకుని ముద్దులుపెట్టింది .
బుజ్జితల్లీ ....... మరికొంతసేపు చూస్తావా ? .
బుజ్జితల్లి : satisfied అంకుల్ ....... ఇక అమ్మ మొక్కు కూడా తీరితే మరింత హ్యాపీ ....... అంటూ మరికొన్ని అడుగులువేసి నావైపు దీనంగా చూడటంతో , నవ్వుకుని మళ్లీ భుజాలపైకి ఎత్తుకున్నాను .

దాదాపు 3 గంటల తరువాత చివరి మెట్లను చేరుకున్నాము . బుజ్జితల్లీ ....... మొదటి మెట్లు స్వయంగా ఎక్కావు - మధ్యలో కొన్ని మెట్లు ఎక్కావు - ఇప్పుడు ఈ కొన్ని చివరి మెట్లు ఎక్కావంటే నువ్వే స్వయంగా ఎక్కినట్లు ........
బుజ్జితల్లి : ok అంకుల్ అంటూ కిందకుదిగి మాకంటే ఉత్సాహంతో చివరి మెట్టుకూడా ఎక్కేసి , అంకుల్ ....... ఏదో మంచి ఫీల్ కలుగుతోంది థాంక్యూ అంకుల్ అంటూ కాలిని చుట్టేసింది .
నాకు కూడా బుజ్జితల్లీ ........ అదే ఈ ఏడుకొండలూ గొప్పతనం - మేడం మీకు ? .
దేవత : ఆనందబాస్పాలతో థాంక్యూ sooooo మచ్ మహేష్ గారూ ....... ,మీరు లేకపోయుంటే .........
స్టాప్ స్టాప్ స్టాప్ మేడం ఇప్పుడే కాదు , దర్శనం చేయించాలి - స్వామివారికి పెళ్లి పత్రికను ఇవ్వాలి - మిమ్మల్ని సేఫ్ గామీ ఊరికి తీసుకెళ్లాలి అప్పుడు అప్పుడు చెప్పండి అని బుజ్జితల్లిని ఎత్తుకుని కంపార్టుమెంట్ కు చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 07-10-2021, 10:41 AM



Users browsing this thread: 43 Guest(s)