Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మేడం ....... ? .
దేవత : మా బుజ్జిహీరో ప్రక్కన లేకపోతే నాకు భయం - ఇద్దరమూ కలిసి మీ అక్కయ్యను ఇంటివరకూ వదిలి మనం మన స్టాప్ కు వెళదాము అని నవ్వుకుంటూ చెప్పారు .
అక్కయ్య : నా వలన మీరు ఇబ్బందిపడుతున్నారు . Sorry అక్కయ్యా .......
మేడం : నో నో నో ...... , అక్కయ్యా అంటూ నన్ను - తమ్ముడూ ...... అంటూ మన బుజ్జిహీరోను ఆప్యాయంగా పిలిచావు , మరి మా తోబుట్టువును ఒంటరిగా ఎలా వదిలేస్తాము చెప్పు , చెల్లీ ...... ఆటో వచ్చింది జాగ్రత్తగా ఎక్కు .
అక్కయ్యా ....... మీ స్టిక్ నాకు ఇచ్చి మేడం ను పట్టుకుని ఎక్కండి .
అక్కయ్య : అలాగే తమ్ముడూ అంటూ మేడం ప్రక్కన కూర్చున్నారు . 
అక్కయ్యా ...... అడ్రస్ చెప్పండి .
ఆటో డ్రైవర్ : తమ్ముడూ ...... ఎక్కి కూర్చో కావ్య తల్లిది మా ఏరియా నే నేను తీసుకెళతాను . 
అక్కయ్య : hi అంకుల్ ........
ఆటో డ్రైవర్ : కావ్యా ...... ఏంటి కాలేజ్ బస్సులో రాలేదా ..... ? .
అక్కయ్య : బస్సు పరిస్థితిని వివరించారు .
ఆటో డ్రైవర్: కావ్యా ...... నా నెంబర్ ఇచ్చాను కదా , కాల్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని .......
అక్కయ్య : బస్సు అలవాటే కదా అంకుల్ .......
అక్కయ్యా ...... నెక్స్ట్ టైం అంకుల్ కు కాల్ చెయ్యండి please అంటూ డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాను .
తమ్ముడూ - బుజ్జిహీరో ....... అక్కడ డేంజర్ వెనుకవచ్చి కూర్చో ప్లేస్ ఉందికదా అంటూ అక్కయ్య సీట్ తడుముతూ ఒకేసారి చెప్పారు .
మా దేవతలాంటి మేడం - చక్కనైన అక్కయ్య ఆర్డర్ వేస్తే పాటించకుండా ఉంటానా అని వెనుకవెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చున్నాను.

అక్కయ్య తడుముతూ నా చేతిని అందుకుని , తమ్ముడూ ...... ఏ స్కూల్ ? .
******* ఇంటర్నేషనల్ స్కూల్ అక్కయ్యా - 10th చదువుతున్నాను - అదే స్కూల్లో మా మేడం ఇంగ్లీష్ టీచర్ - సూపర్ గా టీచ్ చేస్తారు , టీచ్ చేస్తుంటే అలా చూస్తూ వింటూ ఉండిపోవచ్చు - నేను అన్నీ క్లాస్సెస్ వదులుకుని ఉదయం నుండీ సాయంత్రం వరకూ మేడం క్లాస్సెస్ మాత్రమే వింటాను . 
అక్కయ్య : క్లాస్సెస్ కోసం కాదులే , అక్కయ్యను చూడటానికి కదూ ....... - అక్కయ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నావు అన్నమాట - బుజ్జిహీరో లేకుండా వెళ్లను అన్నప్పుడే అర్థం అయ్యింది తమ్ముడూ ....... - దేవతలాంటి మేడం అన్నావు అంటే అక్కయ్య అంత అందంగా ఉన్నారన్నమాట ........
మా అక్కయ్య అందం కంటే తక్కువే ....... 
అక్కయ్య : థాంక్యూ తమ్ముడూ ....... అంటూ ఆనందిస్తున్నారు . చేతిపై ముద్దుపెట్టుకోవచ్చా తమ్ముడూ .......
అక్కయ్య అలా అడుగవచ్చా ...... ముద్దే కాదు కొరికెయ్యవచ్చు .
అక్కయ్య సంతోషంతో నవ్వుతూనే , నా చేతిపై ముద్దుపెట్టి గుండెలపై హత్తుకున్నారు .
మేడం : చెల్లీ ....... నువ్వు నవ్వుతుంటే చాలా చాలా ముచ్చటేస్తోంది - నీ తమ్ముడు చెప్పినట్లు sooooo బ్యూటిఫుల్ , నాకైతే నీ బుగ్గపై ముద్దుపెట్టి ఆ అందాన్ని కాస్తయినా కొరుక్కుని తినాలని ఉంది .
అక్కయ్య : లవ్ టు అక్కయ్యా అంటూ నాచేతితోపాటు మేడం చేతిని కూడా అందుకుని ముద్దులుపెట్టి గుండెలపై హత్తుకున్నారు . అక్కయ్యా ...... ఇంకా ముద్దుపెట్టలేదు .
మేడం : Ok ok అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : తమ్ముడూ ...... నీకు ఇష్టం లేదు అన్నమాట ......
లవ్ టు లవ్ టు లవ్ టు అంతకన్నా అదృష్టమా అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : థాంక్స్ తమ్ముడూ ...... కానీ ఇద్దరూ ఒకేసారి ముద్దులుపెడితే నేను మరింత హ్యాపీ .........
మేడం వైపు చూడగానే స్మైల్ ఇవ్వగానే ...... , లవ్ టు లవ్ టు అంటూ ఇద్దరమూ ఒకేసారి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : థాంక్స్ అక్కయ్యా - లవ్ యు తమ్ముడూ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ మా చేతులపై ముద్దులుపెట్టారు .
మేడం : చెల్లీ ...... మీ తమ్ముడికి లవ్ యు అంటూ ప్రేమతో చెప్పి - ఈ అక్కయ్యకు మాత్రం థాంక్స్ ....... 
అక్కయ్య మరింత ఆనందంతో నవ్వుకుని , sorry అక్కయ్యా ......
మేడం : అదిగో మళ్లీ sorry , నేను బుంగమూతి పెట్టుకున్నాను .
అక్కయ్య : మరింత మరింత నవ్వుకుని , లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... అంటూ ఏకంగా బుగ్గపై ముద్దుపెట్టారు . 
సూపర్ లవ్లీ అక్కయ్యా ...... చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు అంటూ మొబైల్ తీసి క్లిక్ మనిపించాను - అక్కయ్యా ఇప్పుడు నేను బుంగమూతిపెట్టుకున్నాను .
అక్కయ్య : అమితంగా చిరునవ్వులు చిందిస్తూ తమ్ముడూ ...... నేనేమి చేసాను .
పో అక్కయ్యా ...... మీ అక్కయ్యకేమో ప్రేమతో బుగ్గపై ముద్దు - నాకు మాత్రం పరాయివాడిలా చేతిపై మాత్రమే ముద్దు ........
అక్కయ్య ఆనందాలకు అవధులు లేనట్లు కళ్ళల్లో చెమ్మ చేరేలా నవ్వుతున్నారు .
చూసి అక్కయ్యా అక్కయ్యా ....... sorry sorry , మిమ్మల్ని బాధపెట్టేలా మాట్లాడి ఉంటే క్షమించండి , మీరు బాధపడితే ఆవేవో అంటారు భూతాలు భూతాలు ...... సరైన సమయానికి గుర్తుకురావు .......
అక్కయ్య : పంచభూతాలు తమ్ముడూ .......
ఆ ఆ పంచభూతాలూ ఆగ్రహించి ప్రళయాలను సృష్టిస్తాయి .
అక్కయ్య సంతోషంతో నవ్వుతూనే ఉన్నారు .

ఆటో డ్రైవర్ : మిర్రర్ లో చూసినట్లు , బాబూ ...... మీ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు ......
అక్కయ్య : అవును తమ్ముడూ ....... ఇంతలా ఎప్పుడూ నవ్వలేదు - సంతోషించలేదు . నా లోపాన్ని మరిచిపోయేలా చేసావు - చిన్నప్పటి నుండీ చాలా చాలా ఇబ్బందిపడ్డాను , తెలిసినవాళ్లే వెక్కిరించడంతో మరింత బాధపడుతూ పెరిగాను , ఇదిగో బస్సుల్లో అక్కడక్కడా ..... ఇలాంటివి అంటూ బాధపడుతూ చెప్పారు .
మేడం : చెల్లీ చెల్లీ ..... అటూ గుండెలపైకి తీసుకుని ఓదార్చారు .
అక్కయ్య : sorry sorry తమ్ముడూ ...... , ఇక ఎప్పుడూ కన్నీళ్లు కార్చను , అవన్నీ మరిచిపోయేలా చేసావు తమ్ముడూ ....... లవ్ యు సో మచ్ అంటూ తడుముతున్నారు . 
అక్కయ్యా ....... బుగ్గ అదే ......
అక్కయ్య : నవ్వుతూ నాకు తెలుసులే తమ్ముడూ అంటూ నా తమ్ముడికి ప్రాణమైన ముద్దు నుదుటిపై అంటూ ముద్దుపెట్టి పరవశించిపోతున్నారు . తమ్ముడూ ...... మీ స్కూల్ నుండి కొద్దిదూరంలోనే మా కాలేజ్ ...... అనిచెప్పి ఇంటివరకూ నవ్వుతూనే ఉన్నారు .
డ్రైవర్ : తల్లీ ...... ఇంటికి చేరుకున్నాము , ఇంకాస్త దూరం ఉండి ఉంటే బాగుండేది - మా కావ్య తల్లి ఆనందాలను మరికాసేపు చూసేవాడిని .
అక్కయ్య : అప్పుడే వచ్చేసామా ...... అంటూ మాఇద్దరి చేతులను గట్టిగా పట్టేసుకుని ఫీల్ అవుతున్నారు , ఇప్పటికే ఆలస్యం అయ్యింది తమ్ముడు - అక్కయ్య ఇంటికి వెళ్లాలికదా అని బాధను లోపలే దాచేసుకుని వెంటనే నవ్వుతూ తమ్ముడూ - అక్కయ్యా ...... ఇంతలా ఎప్పుడూ నవ్వలేదు , మీరు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి - అంకుల్ .......
డ్రైవర్ : తల్లీ ...... నేను తీసుకెళతాను .
పర్లేదు అంకుల్ అక్కయ్యను జాగ్రత్తగా ఇంట్లోకి వదిలి దగ్గరలోని బస్టాండు వరకూ నడుచుకుంటూ వెళ్లి బస్సులో వెళతాములే మీరు వెళ్ళండి అనిచెప్పాను .
తమ్ముడూ - అక్కయ్యా ....... ఇంట్లోకి వస్తారా ? , ఉమ్మా ఉమ్మా ..... వెంటనే వెళ్లిపోతారని బాధపడ్డాను - రండి మన బామ్మను పరిచయం చేస్తాను అని చిన్న ఇంటిలోకి తీసుకెళ్లారు .

బామ్మ : బుజ్జితల్లీ ....... నువ్వేనా నవ్వుతున్నది చాలా చాలా సంతోషం అంటూ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపైకి తీసుకుని ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .
బుజ్జితల్లి ? ...... ఇద్దరమూ ఒకరొకరిని చూసుకుని నవ్వుకున్నాము .
అక్కయ్య : తమ్ముడూ ...... మీ నవ్వులకు కారణం ,నాకూ చెప్పొచ్చుకదా please ........
అక్కయ్యా ....... మీ అక్కయ్యను కూడా వారి బామ్మగారు ఇప్పటికీ బుజ్జితల్లీ అని ఇలాగే పిలుస్తారు - మా అక్కయ్యను కూడా బామ్మగారు ....... బుజ్జితల్లీ అని ప్రాణంలా పిలవడంతో నవ్వు వచ్చేసింది .
బామ్మ : నాకు నా బుజ్జితల్లి ఎప్పటికీ బుజ్జితల్లినే ...... 
అవునవును బామ్మా ...... చిన్న బుజ్జితల్లులు అంటూ గట్టిగా నవ్వుతున్నాను . 
మేడం : బుజ్జిహీరో నిన్నూ ...... అంటూ బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ ...... ఉండండి కాల్ చేసి బామ్మకు చెబుతాను . 
మేడం : వద్దు వద్దు బుజ్జిహీరో ...... , స్టూడెంట్ ను కొట్టినందుకే కొట్టేశారు - గిల్లానని తెలిస్తే గట్టిగా గిల్లేస్తారు అంటూ బుగ్గలను కప్పేసుకున్నారు .
అదీ ...... ఆ మాత్రం భయం ఉండాలి అని నవ్వుకున్నాను .

బామ్మ : బుజ్జితల్లీ ....... వీరు ? 
అక్కయ్య : జరిగినది వివరించారు .
బామ్మ : బాబూ - తల్లీ ...... అంటూ కన్నీళ్ళతో దండం పెట్టారు . 
బామ్మా - బామ్మా ...... అంటూ ఆపి , మీరు ఆశీర్వదించాలి కానీ ఇలా .... అంటూ పాదాలను స్పృశించాము .
బామ్మ : నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండండి బాబూ - తల్లీ ......
అక్కయ్య : ఈ ఆశీర్వాదాలన్నీ మా అక్కయ్యకు చేరాలి .
అక్కయ్య : లేదు లేదు తమ్ముడు - అక్కయ్యకు .......
లేదు లేదు అక్కయ్యకు - చెల్లికి ......
అక్కయ్య :  లేదు లేదు అక్కయ్య - తమ్ముడికి .......
లేదు లేదు చెల్లికి - అక్కయ్యకు .......
అక్కయ్య : లేదు లేదు అంటూ నవ్వుతూనే ఉన్నారు . 
అక్కయ్యా ....... మీరు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి . 
అక్కయ్య : థాంక్స్ ..... లవ్ యు తమ్ముడూ అంటూ చేతిని చాపడంతో అందుకున్నాను . ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .

బామ్మా ...... అక్కయ్యకు ఎప్పటి నుండీ ఇలా ? .
బామ్మ : చిన్నప్పటి నుండీ బాబూ ........ , ఒకరి కళ్ళు పెడితే చూపు వస్తుందని డాక్టర్స్ చెప్పారు - నా కళ్ళు ఇవ్వడానికి రెడీగా ......
అక్కయ్య : బామ్మా ...... అలా ఎప్పటికీ జరగనివ్వను - మా బామ్మ అంటే నాకు ప్రాణం ....... - తమ్ముడూ అక్కయ్యా ...... భోజనం చేసి వెళ్ళాలి ముందుగా టీ తీసుకొస్తాను అని చిన్నప్పటి నుండీ అలవాటైనట్లు స్టిక్ సహాయం లేకుండానే సులభంగా వంట గదిలోకివెళ్లారు .
దేవత : బామ్మ గారూ ...... ఒకరి కళ్ళు పెడితే చెల్లికి చూపు వస్తుందా ...... ? .
బామ్మ : వస్తుందని డాక్టర్స్ చెప్పారు తల్లీ ....... , govt హాస్పిటల్లో చిన్నప్పటి నుండీ  రోజూ వెళుతున్నా మా టర్న్ రావడం లేదు - వచ్చినా మాలాంటి పేదవారికి ఎలా మారుస్తారు ? , అందుకే నా కళ్ళు ఇస్తాను బుజ్జితల్లీ అంటే ఒప్పుకొనే ఒప్పుకోవడం లేదు - అంతకంటే ఇలానే నాకు సంతోషం బామ్మా అంటుంది .
దేవత : అవును బామ్మా ...... మాకు మీరంటే ప్రాణం ఎలా ఒప్పుకుంటాము అని బాధపడుతున్నారు . 

అక్కయ్య కాఫీ తీసుకురావడం చూసి , దేవత కన్నీళ్లను తుడుచుకునివెళ్లి అందుకుని , ప్రౌడ్ ఆఫ్ యు చెల్లీ ...... అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : స్వీటెస్ట్ కిస్ ...... , అక్కయ్యా - తమ్ముడూ ...... నిలబడే ఉన్నారా కూర్చోండి అని ఆనందిస్తున్నారు .
చిరునవ్వులు చిందిస్తూ కాఫీ తాగి సూపర్ అన్నాము . చెల్లీ ....... బామ్మ ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్ళొస్తాము .
అక్కయ్య : భోజనం ....... , ఆలస్యం అయ్యింది కదూ ok అక్కయ్యా - తమ్ముడూ ....... , మళ్లీ ఎప్పుడు కలుస్తామో ......
త్వరలోనే అక్కయ్యా ........ , మా అక్కయ్యను చూడాలని మాకు ఉండదా ఏమిటి అని చేతులను స్పృశించాము .
అక్కయ్య : అంతేనా ...... ముద్దులు లేవా ప్చ్ ......
ఇద్దరమూ నవ్వుకుని ఒకేసారి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , అందరమూ చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాము . 

అంకుల్ ....... 
డ్రైవర్ : నా మనసుకు మాటిచ్చాను మిమ్మల్ని మీ ఇంటివరకూ వదులుతానని రండి .......
అక్కయ్య : థాంక్స్ అంకుల్ .......
అక్కయ్యా - చెల్లీ ...... వెళ్ళొస్తాము అనిచెప్పి ఆటోలో ముందూ వెనుక కూర్చున్నాము .
దేవత : హలో బుజ్జిహీరో ...... వెనుక కూర్చోండి .
మీరే కదా మేడం బస్సులో మూడో కన్ను తెరిచారు కూర్చోబోతే .......
దేవత : అదిగో చెల్లి పెదాలపై అంతటి ఆనందాలను పంచినప్పుడే ఆ విషయం మరిచిపోయాను వచ్చి కూర్చో ....... 
థాంక్స్ మేడం అంటూ నవ్వుకుంటూ కూర్చున్నాను - మేడం ...... నిజంగా నేను .....
దేవత : ఆ విషయాన్ని మరిచిపోయాను అని చెప్పానుకదా వదిలెయ్యి , దానికంటే ఈ సంతోషం వంద రెట్లు .......
కానీ నాకు మా మేడం కోపం అంటేనే ఇష్టం కదా ఇప్పుడెలా ......
దేవత : కోపం అంటే ఇష్టమా ఇష్టమా ...... అంటూ బుగ్గను గిల్లేసి నవ్వుతూనే ఉన్నారు . బుజ్జిహీరో ....... బస్సులో నలుగురు రౌడీలు - గూండాల్లా ఉన్నారు , భయం వెయ్యలేదా ...... ? .
చాలా భయం వేసింది మేడం కానీ ప్రక్కనే అక్కయ్య కన్నీళ్లను చూడగానే కోపం వచ్చిందీ ...... వాళ్ళను చంపేయాలనిపించి దైర్యంగా వెళ్ళాను . 
దేవత : sooooo క్యూట్ - ప్రౌడ్ ఆఫ్ యు బుజ్జిహీరో ....... , నువ్వు ప్రక్కనే ఉంటే నాకు ఉన్న భయం స్థానంలో ధైర్యం వచ్చేస్తుంది థాంక్యూ ...... అని మాట్లాడుకుంటూ మా స్టాప్ చేరుకున్నాము .
అంకుల్ స్టాప్ ఇక్కడే మేడం గారు దిగేది . 
దేవత కిందకుదిగి జాగ్రత్తగా వెళ్లు బుజ్జిహీరో ...... , ఒక అందమైన ఫీల్ ను కలిగించావు థాంక్యూ థాంక్యూ అంటూ హ్యాండ్ బ్యాగ్ నుండి అమౌంట్ ఇవ్వబోతే .......
అంకుల్ : మీ దగ్గర డబ్బు తీసుకుంటే నేను మనిషినే కాదు మేడం please ..... బాబూ ..... ఎక్కడికి వెళ్ళాలి ? .
దేవత : బుజ్జిహీరో ....... రేపు నిన్ను కలవాలని - తొందరగా రాత్రి గడిచిపోవాలని కోరుకుంటున్నాను .
Wow యాహూ ....... ఫస్ట్ టైం ...... కానీ మేడం , నాకు ..... మీ కోపం అంటేనే ఇష్టం - రేపు కలవగానే కోపం తెప్పిస్తాను కదా ........
దేవత : నిన్నూ అంటూ చెంపపై సున్నితంగా కొట్టి , జాగ్రత్తగా వెళ్లు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు . 
అంకుల్ ఒక్కనిమిషం .......
దేవత మెయిన్ గేట్ దాటగానే , బుజ్జితల్లీ ...... అంటూ బామ్మ కౌగిలించుకున్నారు . 
అంకుల్ ok ......
ఆటో కదులగానే స్టాప్ స్టాప్ అంటూ బామ్మ ......
అంకుల్ అంకుల్ ......
బామ్మ వచ్చి చిరునవ్వులు చిందిస్తూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . ఎక్కడికి వెళ్లిపోతున్నావు ....... దానికోసం కాదు నీకోసమే వచ్చాను - నువ్వు ప్రక్కనే ఉంటే నాకెందుకు భయం .
లవ్ యు బామ్మా ...... , అదిగో ముందుకువెళ్లి ఆగి వద్దామని ......
బామ్మ : అవసరం లేదు , నేను ...... దాన్ని పిలుచుకుని వెళతాను వెనుకే వచ్చెయ్యి ....... , బయట ఉంటాను అని వెళ్లారు .
లవ్ యు బామ్మా ......, అంకుల్ కు థాంక్స్ చెప్పేసి వెనుకే లోపలికివెళ్ళాను .

దేవతను ఇంట్లోకి వదిలి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినమనిచెప్పి , బాక్స్ లో నాకోసం తీసుకొచ్చి ఇంటి మీదకు పిలుచుకునివెళ్లారు . చంద్రుడి వెన్నెలలో బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చారు .
బామ్మా ...... ఫింగర్ చిప్స్ లవ్ యు అంటూ తిని బామ్మను కూడా తినమని చెప్పాను .
బామ్మ : నేను తిన్నానులే బుజ్జిహీరో ...... , మొత్తం నీకే తిను ......
దేవత - నేను తినకుండా మీరు తినరని నాకు తెలుసులే బామ్మా ...... , మీరు తింటేనే నేనూ తినేది అంటూ బాక్స్ కింద ఉంచేసి చేతులు కట్టుకున్నాను .
బామ్మ : నా బుజ్జిహీరో బంగారం అంటూ దిష్టి తీసి ముద్దుపెట్టారు . ఇదిగో తింటున్నాను . 
మా బామ్మ కూడా బంగారం , సూపర్ గా ఉన్నాయి బామ్మా ..... బాగా ఆకలేస్తోంది అంటూ ఇష్టంగా తింటున్నాను . 

బామ్మ : బుజ్జిహీరో ....... బస్సులో నా మరొక బుజ్జితల్లిని , నలుగురు వెధవలు నుండి కాపాడావట కదా ...... , నీ దేవత ...... నీకు ఫ్యాన్ అయిపోయింది - గేట్ దగ్గర నుండి ఇంటివరకూ నిన్ను పొగుడుతూనే ఉంది బుజ్జిహీరో అని ...... - బామ్మా ....... నీ బుజ్జిహీరో , హీరో అవునా కాదో కానీ ..... నా స్టూడెంట్ మాత్రం రియల్ హీరో అంటూ ...... - దానికి తెలియదు నా బుజ్జిహీరోనే తన బుజ్జిహీరో కూడా అని , తెలిసిన రోజు ఆకాశానికి ఎత్తేస్తుందేమో ....... , బుజ్జి నాన్నా ...... నేను ఇంత సంతోషమైన విషయం చెబుతున్నా అలా మూడీగా ఉన్నావేమిటి ? , నీ దేవతేమైనా కొట్టిందా ....... ? .
అక్కయ్య గురించే ఆలోచిస్తూ కొట్టారు ....... 
బామ్మ : కొట్టిందా ....... ? , అయితే .......
నో నో నో బామ్మా .......
బామ్మ : నిజం చెప్పు బుజ్జి నాన్నా ....... 
కొట్టారు ...... , నిన్నటికంటే ఒక దెబ్బ ఎక్కువనే తిన్నాను బామ్మా అంటూ సంతోషంగా చెప్పాను - బస్టాండులో అయితే కాస్త గట్టిగానే తగిలింది ఇప్పటికీ చుర్రుమంటూనే ఉంది అంటూ రుద్దుకున్నాను .
బామ్మ : అంత గట్టిగా కొట్టిందా నీ దేవత ...... , ఏమంత తప్పు చేసావు అంటూ బుగ్గపై సున్నితంగా స్పృశిస్తున్నారు .
ముద్దుపెట్టు బామ్మా ...... మాయమైపోతుంది .
బామ్మ : ఆమాత్రం కూడా తెలియదు నాకు అంటూ ప్రాణంలా ముద్దుపెట్టారు .
ఇప్పుడు హాయిగా ఉంది బామ్మా.......
బామ్మ : అంటే ఇప్పటివరకూ నొప్పి కలిగేలా దెబ్బ ఎందుకు కొట్టింది .
నిజం చెబితే బామ్మ బాధపడతారు - అదీ అదీ ఒక పెద్ద తప్పు చేశాను బామ్మా ....... , బస్టాండులో వెనుక నిలబడి మీ బుజ్జితల్లి రిబ్బన్ ను లాగేసాను .
బామ్మ : రిబ్బన్ లాగినంత మాత్రాన నా బుజ్జిహీరోను ఇంత గట్టిగా ....... ఆగు ఆగు ఆగు నా బుజ్జి మహేష్ ....... తన దేవతతో అలా ఎప్పటికీ ప్రవర్తించడు - ఇప్పుడు నిజం చెప్పు నా మీద ఒట్టు .......
బామ్మా ...... అంటూ చేతిని లాగేసుకున్నాను . వదిలెయ్యండి బామ్మా ....... నా బాధకు కారణం .......
బామ్మ : ముందు ఈ కారణం చెప్పు , ఒట్టు వేశావు మరొక అపద్ధం చెప్పకూడదు .
బామ్మా బామ్మా అదీ ...... వేరే వాడు లాగాడు - వెనకున్నది నేనే కాబట్టి ......
బామ్మ : నువ్వే లాగావని కొట్టిందన్నమాట , దెబ్బ గట్టిగా తగిలిందా బుజ్జిహీరో ...... అంటూ బాధపడుతున్నారు .
ఇదిగో ఇలా బాధపడతారనే చెప్పలేదు . వాడిని అక్కడికక్కడే బాగా కొట్టి రిబ్బన్ తీసుకుని మీ బుజ్జితల్లికి ఇచ్చానులే బామ్మా .......
బామ్మ : బాగా కొట్టావు కదూ ...... లేకపోతే నా బుజ్జిహీరోనే కొట్టిస్తాడా వాడు - నేను కనుక ఉండి ఉంటే ముందు వాడి రక్తం కళ్ళచూసి ఆ తరువాత నీ దేవత చెంపలు చెల్లుమనిపించేదానిని ..... - నీ దేవత రిబ్బన్ మాత్రమే కాదు ఏమైనా లాగే హక్కు అర్హత నా బుజ్జిహీరోకు ఉంది - నీకు ఏమైనా చెయ్యాలనిపిస్తే చేసెయ్యి బుజ్జిహీరో ..... నేనున్నాను కదా ......
తియ్యదనంతో నవ్వుకున్నాను . నో నో నో please please బామ్మా ....... , అందుకు కూడా చెప్పలేదు - ఉదయం మీరు దేవతను కొట్టిన దెబ్బలే స్కూల్ చేరేంతవరకూ రుద్దుకునేలా చేశాయి - నావల్లనే అని నాకు చాలా బాధవేసింది .
బామ్మ : నా బుజ్జిహీరో బాధపడితే కొట్టనులే అని నవ్వుకున్నాము .

వెంటనే మళ్లీ sad మూడ్ లోకి వెళ్ళిపోయాను .
బామ్మ : బుజ్జి నాన్నా ...... ఇప్పుడు చెప్పు , నా బుజ్జిహీరో బాధకు కారణం ఏమిటి ? .
బామ్మా బామ్మా ...... అక్కయ్యకు - మీ చిన్న బుజ్జితల్లికి చిన్నప్పటి నుండీ చూపులేదు , ఆపరేషన్ చేసి వేరేవాళ్ళ కళ్ళు పెడితే చూపు వస్తుందని డాక్టర్స్ చెప్పారట - govt హాస్పిటల్లో చాలాసార్లు అక్కయ్య వంతు వచ్చినా డబ్బులకు వేరేవాళ్లకు ........ అంటూ కన్నీళ్ళతో బామ్మ ఒడిలోకి చేరాను - అక్కయ్యకు ఉన్నది కూడా మీలాంటి బామ్మగారే , నా కళ్ళు ఇచ్చేస్తాను తల్లీ అని రోజూ బాధపడుతున్నారు .
బామ్మ : నా బుజ్జితల్లి తప్పకుండా ఒప్పుకుని ఉండదు - దానికంటే ఇలానే ఉంటాను అని ఉంటుంది .
అవును బామ్మా ....... , చిన్నప్పటి నుండీ అక్కయ్య ఎన్నో ఇబ్బందులు - కష్టాలు - అవమానాలు - ఆకతాయిల వలన కన్నీళ్లు ....... , అక్కయ్యకు చూపు రావాలంటే ఏమిచెయ్యాలి బామ్మా ....... ? .
బామ్మ : అమ్మా దుర్గమ్మా ...... , నా బుజ్జిహీరో స్వచ్ఛమైన కోరికను తీర్చలేరా ..... ?.
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బామ్మా ...... , మన దైవమైన పెద్దమ్మను ప్రార్ధిస్తాను , అక్కయ్యకు చూపు రావడం కోసం ప్రతిఫలంగా ఏమి చెయ్యమన్నా చేస్తాను .
బామ్మ : నేను కూడా బుజ్జిహీరో ...... , ప్రార్థించి ప్రతిఫలంగా ఏమి చెయ్యమన్నా చేస్తాను అంటూ ప్రార్థించారు - పెద్దమ్మా ...... చూపు లేకపోతే ఎలా ఉంటుందో అదికూడా వయసుకొచ్చిన అమ్మాయికి చాలా చాలా కటం - నా బుజ్జితల్లిని కంటికి రెప్పలా చూసుకోవడానికి మన బుజ్జిహీరో ఉన్నాడు కాబట్టి , ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ముసలిదాని ప్రాణాలను తీసుకుని నా చిట్టితల్లి చూపును ప్రసాదించు .
బామ్మా ...... అంటూ నోటిని చేతితో మూసేసి కన్నీళ్ళతో గుండెలపైకి చేరాను . పెద్దమ్మా ...... ఎవ్వరూ లేని అనాధను నేను , నా ప్రాణా .......
బామ్మ నా నోటిని మూసేసి , ఏమి కోరుకోబోతున్నావో నాకు తెలుసు , అలా ఎప్పటికీ జరగనివ్వను జరగనివ్వను అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నారు.
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 23-10-2021, 09:36 AM



Users browsing this thread: 11 Guest(s)