Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అలారం చప్పుడుకు దేవత లేచారు . బామ్మా ...... త్వరగా టిఫిన్ రెడీ చెయ్యి చెల్లి దగ్గరకువెళ్లి స్కూల్ కు వెళ్లాలికదా ....... , నాకు తెలిసి తన అక్కయ్య దగ్గరికి వెళ్లడం కోసం ఈ పాటికే రెడీ అయిపోయి ఉంటాడు బుజ్జిహీరో అంటూ నిద్రమత్తుతోనే బాత్రూం లోకి వెళ్లారు .
అలారం చప్పుడు దేవతకు ఇరువైపులా పడుకున్న ఇద్దరమూ లేచి భయంభయంగా నవ్వుకున్నాము . 
లేచి , ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను బామ్మా అని ముద్దుపెట్టి పరుగుతీసాను . కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి స్కూల్ డ్రెస్ లోకి మారే లోపు డోర్ బయట టిఫిన్ రెడీగా ఉంది - తినేసి బయటకువచ్చాను - మురళి ఇంకా అప్పుడు బ్రష్ చేస్తుండటం చూసి , మురళి సర్ స్కూల్ కు వెళ్లి ప్రాక్టీస్ చెయ్యాలి అనిచెప్పేసి , వెనుతిరిగిచూడకుండా నవ్వుకుంటూ అంతే పరుగుతో దేవత ఇంటికి చేరుకున్నాను . దేవత కూడా రెడీ అయ్యి బయటకు రావడం చూసి మెయిన్ గేట్ నుండి వస్తున్నట్లు అటువైపుకు చేరి వచ్చాను .
దేవత : బామ్మా ...... మన కాదు కాదు మా బుజ్జిహీరో వచ్చేశాడు . మీ బుజ్జిహీరో గురించి చెబుతావు కానీ చూయించనేలేదు అంటూ బుగ్గలను రుద్దుకుంటున్నారు .

ఏంటి మేడం బుగ్గలు రుద్దుకుంటున్నారు అని తెలిసే అడిగాను .
దేవత : బామ్మనే కందిపోయేలా గిల్లేసింది - బాగా నొప్పివేస్తుంది స్స్స్ స్స్స్ ......
ఇప్పుడు తెలిసిందా మేడం గారూ ...... ఎంత నొప్పివేస్తుందో కానీ మా మేడం గిల్లితే నాకైతే హాయిగా ఉంది .
దేవత : అవునా అవునా అంటూ మళ్లీ గిల్లేసారు .
స్స్స్ ....... మొదలెట్టేశారా ..... ? , మీకు కూడా మళ్లీ రేపు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది లేండి అని నవ్వుకున్నాను . 

అంతలో బస్ హార్న్ వినిపించడంతో , బామ్మా ...... లంచ్ అని అడిగారు దేవత .
బామ్మ : exam కదా ఆకలికాదులే బుజ్జితల్లీ ...... వెళ్ళండి వెళ్ళండి అని నావైపు కన్ను కొట్టారు .
నాకు కూడా ఏమీ అర్థం కాలేదు . బస్సు ..... బస్టాప్ వైపుకు వస్తున్నట్లు సౌండ్ పెరుగుతూ రావడం - నెక్స్ట్ బస్ మళ్లీ అర గంటకు కానీ రాదని తెలిసి బామ్మకు బై బై చెప్పేసి వడివడిగా బయటకువచ్చాము . బస్టాప్ దాటి వెళ్లిపోతున్న బస్సు దగ్గరికి పరుగుతీసి స్టాప్ స్టాప్ అంటూ కొట్టిమరీ ఆపి , చిరునవ్వులు చిందిస్తున్న దేవతతోపాటు ఎక్కాను . దేవత ఖాళీ సీట్లోని విండో ప్రక్కన కూర్చోగానే , కూర్చోకుండా నిలబడ్డాను .
దేవత : బుజ్జిహీరో ....... కష్టపడి నాకోసం బస్సు ఆపావు కూర్చో .......
ప్చ్ ...... ఎందుకో తెలియదు మేడం , మీరు ఇష్టం చూయిస్తుంటే నాకు నచ్చడం లేదు , కొప్పుడుతుంటేనే బాగుండేది .......
దేవత : నిన్నూ ...... అంటూ కొట్టిమరీ సీట్లోకి లాగేసారు . Exam ఉంది కాబట్టి వద్దు తరువాత కోప్పడతానులే అని నవ్వుతూనే ఉన్నారు . అంత చివరన కూర్చున్నావు పడతావు నావైపుకు రా బుజ్జిహీరో .......
నిన్నటివరకూ జరుగు జరుగు అని కొట్టారు - ఇప్పుడేమో రా రా అంటూ కొడుతున్నారు నాకేమీ అర్థం కావడం లేదు ........
దేవత : ఒక్కరోజులో బుజ్జిహీరో అయిపోయారు కదా అందుకే ........ , బాగా ప్రిపేర్ అయ్యావా ...... ? .
అక్కయ్య మాథ్స్ లో క్వీన్ మేడం ....... , డౌట్స్ అన్నీ అలా అలా క్లియర్ చేసేసారు ఔట్ ఆఫ్ ఔట్ తెచ్చుకుని అక్కయ్యకు బోలెడన్ని ముద్దులు ఇవ్వాలి .
దేవత : ఈరోజు మాత్రం నీకంటే నేనే ఎక్కువ ముద్దులు పెడతాను - స్వీకరిస్తాను నా చెల్లి నుండి బెట్ వేసుకుందామా ....... ? .
నాకు కూడా అలా జరగడమే ఇష్టం మేడం ...... , అక్కయ్య - దేవత సంతోషంతో చిరునవ్వులు చిందించడం చూడటం కంటే నాకు సంతోషం ఏముంటుంది అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను .
దేవత : మేమంటే ఇంత ఇష్టం ఎందుకు బుజ్జిహీరో ...... , నిన్ను చూస్తే నాకే అసూయ వేస్తోంది , మరీ ఇంత మంచివాడివి ఏమిటి , మరి ఇలా చేస్తే కోపం జన్మలో రాదు .......
అవునుకదా అయితే మారాలి , నాకు కావాల్సినది మా మేడం కోపం - దెబ్బలు - గిల్లుళ్లు ........
దేవత : బుజ్జిహీరో బుజ్జిహీరో స్టాప్ స్టాప్ ఇక నవ్వే ఓపిక నాకు లేదు అంటూనే నవ్వుతూనే ఉన్నారు .
దేవతను చూస్తూనే మాథ్స్ టెక్స్ట్ బుక్ తీసి పైపైన చూసుకుంటున్నాను .
దేవత : నో డిస్టర్బ్ నో డిస్టర్బ్ అంటూనే అటువైపుకు తిరిగి సంతోషంతో నవ్వుతూనే ఉన్నారు . 

7:30 కు స్కూల్ బస్టాప్ దగ్గర ఆగి , దగ్గరలోనే కాబట్టి నడుచుకుంటూ సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకున్నాము .
అన్నయ్యా - మేడం ...... అంటూ కేకలువేస్తూ విక్రమ్ - హాసిని స్కూల్ డ్రెస్ - స్కూల్ బ్యాగ్స్ తో పరుగునవచ్చారు . మా చేతులను పట్టుకుని అక్కయ్య ఇంటికి పిలుచుకునివెళ్లారు .
మేడం ...... డోర్ తెరిచే ఉంది .
హాసిని : మా తమ్ముడు - అక్కయ్య ఏ క్షణమైనా రావచ్చునని ఎప్పటి నుండో అక్కయ్య డోర్ విశాలంగా తెరిచి ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు .
అవునూ మీకెలా తెలుసు ? .
ఎందుకంటే విక్రమ్ - హాసిని రాత్రి ఇక్కడే నాతోనే పడుకున్నారు కాబట్టి తమ్ముడూ అంటూ పరుగునవచ్చి దేవతను హత్తుకుని ముద్దుపెట్టారు అక్కయ్య .......
దేవత : యాహూ ...... ఫస్ట్ నన్నే హత్తుకుని , నన్నే ముద్దుపెట్టింది చెల్లి .......
లవ్ యు అక్కయ్యా ....... ఉమ్మా ఉమ్మా , దేవత కోప్పడాలంటే బుంగమూతిపెట్టుకోవాలి కదా ........
దేవత : బుజ్జిహీరో ....... నువ్వు మారవన్నమాట , చూడు చెల్లీ ...... నేను ఇష్టపడుతుంటే కోపమే కావాలంటాడు .
అక్కయ్య : తమ్ముడు ఏది అడిగితే అది ఇచ్చేద్దాము అక్కయ్యా ....... , ముందు లోపలికి రండి టిఫిన్ చేద్దాము .
దేవత : అమ్మో ఫుల్ గా తిన్నాము exam అని .......

తమ్ముడూ - చెల్లీ ....... రాత్రి ఇక్కడే పడుకున్నారా ? , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
హాసిని : మేమే కాదు అన్నయ్యా ...... , మమ్మీ కూడా ఇక్కడే పడుకున్నారు .
అక్కయ్య : చదువుతూ చదువుతూనే నా ఓడిలోనే పడుకున్నారు తమ్ముడూ ....... , అందుకే ఇక మేడం కూడా ఇక్కడే పడుకోవాల్సి వచ్చింది . అవునూ ....... రాత్రి మళ్లీ కాల్ చేస్తానని చెయ్యలేదేమిటి తమ్ముడూ ....... అంటూ నా ప్రక్కనే వచ్చి కూర్చుని చేతిని గుండెలపై హత్తుకున్నారు .
Sorry లవ్ యు అక్కయ్యా ...... , ఫ్రెండ్స్ తోపాటు చదువుకునేసరికి 11 గంటలు అయ్యింది - ఆ సమయంలో హాయిగా నిద్రపోతున్న మా అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక చెయ్యలేదు అంతే .......
నువ్వు కాల్ చేస్తావని అర్ధరాత్రివరకూ మేల్కొనే ఉంది బుజ్జిహీరో అంటూ బామ్మ చెప్పారు .
అవునా బామ్మా ...... , నాకు బుద్ధే లేదు అంటూ లెంపలేసుకుని మొట్టికాయ వేసుకోబోతే , అక్కయ్య ఆపి మా మంచి తమ్ముడు అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు . 
అక్కయ్య : కమాన్ అన్నయ్యా కమాన్ , ఫోనులో మొత్తం 15 ముద్దులుపెట్టారు - మనం కలిసాక నాకు పెడతారని చెప్పారుకదా .......
మేడం విన్నారుకదా 15 15 15 అంటూ అక్కయ్య బుగ్గలపై 15 ముద్దులుపెట్టాను .
అంతే బుంగమూతిపెట్టుకుని రుసరుసలాడుతూ చూస్తున్నారు మేడం .... , yes yes yes నాకు కావాల్సింది అదే కోపం అదే కోపం ....... 
దేవత : కోపంతో నా తొడపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ...... అంటూ అంతెత్తుకు ఎగిరిపడి రుద్దుకోవటం చూసి , అందరూ నవ్వుకున్నారు .
అక్కయ్య పరుగునవెళ్లి , ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి గిల్లినచోట ఉంచారు .
అప్పుడు దేవతను చూడాలి నాకైతే నవ్వు ఆగడం లేదు . 
దేవత : పో చెల్లీ ...... , బెట్ కూడా వేసాను , నన్ను క్లీన్ బౌల్డ్ చేసేసావు అంటూ లాక్కునివెళ్లి దూరంగా కూర్చోబెట్టుకున్నారు . ఇక నీ తమ్ముడి దగ్గరకు వదలనే వదలను అటూ గట్టిగా చుట్టేశారు . చెల్లీ ...... చెప్పనేలేదు కదూ ఈ డ్రెస్ లో అచ్చు కృతి శెట్టి లానే ఉన్నారు .
నేనూ బస్సు ఎక్కే హడావిడిలో చెప్పనేలేదు మేడం ఈ సారిలో .......
దేవత : తమన్నాలా ఉన్నారు అంటావు అంతేకదా అని నవ్వుకున్నారు . 
మా మాటలకు చెల్లి - తమ్ముడు నవ్వుకుని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు , అంతలో వైష్ణవి - వర్షిని వచ్చి మాకు గుడ్ మార్నింగ్ చెప్పి హాసిని ప్రక్కన కూర్చున్నారు .
బామ్మ టీ తీసుకురావడంతో తాగాము . 

8:30 అవ్వడంతో దేవత క్షణక్షణానికీ టైం చూస్తూనే అక్కయ్యను మరింతలా చుట్టేస్తున్నారు .
విషయం అర్థమై , మేడం గారూ ....... మీరు వెళ్ళాలి కాబట్టి మీరు వెళితే అక్కయ్య వచ్చి నా ప్రక్కన చేరతారని ఎంత అసూయ పడుతున్నారు , సరే సరే ......నేనూ వస్తాను పదండి తప్పుతుందా ...... ? .
అక్కయ్య గట్టిగా - దేవత ముసిముసినవ్వులు నవ్వుతున్నారు . అంతే మరి పదా వెళదాము అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
పిల్లలు : అన్నయ్యా ...... మేమూ వస్తాము .
చెల్లెళ్ళూ ....... ఇంకా గంట సమయం ఉంది . 
హాసిని : అయినా పర్లేదు , మేమూ వస్తాము , అక్కడే చదువుకుంటాము , మమ్మీలకు చెప్పేసాము .
దేవత : ఇంకా కూర్చున్నావే బుజ్జిహీరో బయటకు నడు ....... , నువ్వు బయటకు వెళ్లాకనే నేను , చెల్లిని వదిలి వచ్చేది ......
అక్కయ్యవైపు ఆశతో చూస్తూ పిల్లలతోపాటు బయటకు వెళ్ళాక , దేవత వచ్చారు . అంతే పరుగున అక్కయ్యదగ్గరికివెళ్లి ముద్దులుపెట్టి , అక్కయ్యా ...... డోర్స్ జాగ్రత్తగా వేసుకోండి .
అక్కయ్య : All the best తమ్ముడూ అంటూ ముద్దుపెట్టారు .
మా అక్కయ్య ముద్దుపెట్టింది కదా ఇక దూసుకుపోతాను అని ముద్దుపెట్టి , కోపంగా చూస్తున్న దేవత దగ్గరికి చేరుకున్నాను . 
ఒక దెబ్బ - ఒక గిల్లింత ........
స్స్స్ స్స్స్ ..... 
నవ్వుతున్న అక్కయ్య డోర్ వేసుకునేంతవరకూ అక్కడే ఉన్నాను .

లేడీ సెక్యూరిటీ అధికారి : రండి అందరినీ డ్రాప్ చేస్తాను .
యూనిఫార్మ్ లో ఉన్నారు అంటే మీకూ ఆలస్యమయ్యిందని అర్థం - పర్లేదు మేడం దగ్గరే కదా నడుచుకుంటూ వెళ్లిపోతాము - what do you say చెల్లెళ్ళూ .......
పిల్లలు : yes yes అన్నయ్యా .......
లేడీ సెక్యూరిటీ అధికారి : ok బై బై exam బాగా రాయండి .
పిల్లలు : లవ్ యు మమ్మీ - అంటీ ...... అంటూ మా చేతులను పట్టుకుని మాతోపాటు నడిచారు .

స్కూల్ చేరుకున్నాము . హలో బుజ్జిహీరో ....... రోజూ క్లాస్సెస్ కాబట్టి ఇంగ్లీష్ వంక చెప్పి ఫస్ట్ పీరియడ్ నుండి లాంగ్ బెల్ కొట్టేంతవరకూ నాకు బాడీగార్డ్ గా సేఫ్ గా చూసుకున్నావు , ఇప్పుడు exam కాబట్టి నువ్వు ఒక రూంలో exam రాయబోతున్నావు - నేను మరొక రూంలో ఇన్విజిలేటర్ గా ......
కోరిక స్వఛ్చమైనది అయితే భూతాలు భూతాలు ఆ ఆ పంచభూతాలు ఏకమై మనల్ని ఒకే రూమ్ కు చేర్చవచ్చు మేడం  ....... 
దేవత : ఆ ఆ ....... ఇలాంటివి చెప్పమంటే రోజంతా చెబుతూనే ఉంటావు అని బుగ్గపై గిల్లేసారు .
హాసిని : ఎందుకు మేడం , మా అన్నయ్యపై ఎప్పుడూ కోప్పడతారు - కొడతారు - గిల్లుతారు ........
ష్ ష్ ష్ చెల్లీ ...... , అలానే నాకు మహా ఇష్టం .......
దేవత : అందరికీ మీ అన్నయ్య అంటేనే ఇష్టం అని తియ్యనికోపంతో టీచర్స్ అందరితోపాటు ఆఫీస్ రూంలోకి వెళ్లారు . హలో ...... బుజ్జిహీరో ఓన్లీ స్టాఫ్ ......
Ok ok మేము ఇక్కడే చదువుకుంటాము అని బయటున్న బెంచ్ పై కూర్చున్నాము.
దేవత నవ్వుకుంటూ లోపలికివెళ్లారు . 

కొద్దిసేపటి తరువాత బయటకువచ్చి బుజ్జిహీరో ...... చెప్పానా ? , నాకు ...... మీ క్లాస్ ప్రక్కనున్న రూంలో ఇన్విజిలేషన్ , ఏదో స్వచ్ఛమైన కోరిక అన్నావు అనిచెప్పి టీజ్ చేస్తూ మళ్లీ లోపలికివెళ్లారు .
ప్చ్ ...... ఇక పెద్దమ్మను ప్రార్థించాల్సిందే , ముందే ప్రార్థించకుండా ఏమి చేస్తున్నావురా ...... ? , కొవ్వు పట్టింది నీకు అని లెంపలేసుకున్నాను . 
వైష్ణవి : అన్నయ్యా ...... ఏమైంది , మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారు .
వరాలిచ్చే దైవాన్ని మరిచిపోయాను చెల్లీ ...... , కాస్త గట్టి దెబ్బలు తగలాలి నాకు ......
మెసేజ్ : హ హ హ .......
పెద్దమ్మా ...... ప్లీజ్ ప్లీజ్ , మీకు తెలుసుకదా ...... 2:30 గంటలపాటు దేవతను చూడకుండా ఉండటం నావల్లకాదు .... అంటూ ప్రార్థిస్తున్నాను .
పిల్లలు : మా అన్నయ్య కోరిక తీరాలి అని నలుగురూ మొక్కుకున్నారు .
థాంక్యూ థాంక్యూ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టాను . 

ప్రేయర్ బెల్ మ్రోగడంతో దేవతతోపాటు వెళ్లి దేవత ముందు నిలబడ్డాము . పూర్తయ్యాక బుజ్జిహీరో ...... పిల్లలను వాళ్ళ క్లాస్సెస్ లో వదిలి నువ్వు నీ క్లాస్ కు వెళ్లు - నేను ఆఫీస్ రూమ్ కు వెళ్లి క్వశ్చన్ పేపర్స్ తోపాటు నా డ్యూటీ రూమ్ కు వెళతాను బై బై ........
ఏమిచేస్తాం ఈ exams వరకూ తప్పదు అని చెల్లెళ్లు - తమ్ముడిని వాళ్ళ క్లాస్సెస్ లో వదిలి All the best చెప్పి నా క్లాస్ చేరుకున్నాను - ప్చ్ ....... ప్రక్క గదిలో exam అయి ఉంటే ఎంత బాగుండేది .

రేయ్ మహేష్ ....... ఎక్కడికి వెళుతున్నావు ? , మన exam ప్రక్కగదిలో బెంచ్ కు ఇద్దరే అంటూ కోరుకున్న గదిలోకే లాక్కునివెళ్లాడు గోవర్ధన్ .......
థాంక్యూ థాంక్యూ మై ఫ్రెండ్ అంటూ సంతోషం పట్టలేక అక్కడికక్కడే డాన్స్ చేసాను .

మహేష్ మహేష్ ....... అంటూ క్లాస్మేట్స్ బాయ్స్ & గర్ల్స్ నవ్వుకున్నారు .
ఇంగ్లీష్ మేడం వస్తున్నారు అంటూ ఇద్దరు క్లాస్మేట్స్ బయటనుండి కేకలువేస్తూ వచ్చి వారి వారి places లో కూర్చున్నారు .
థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా ...... అంటూ డాన్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్లి నా ప్లేస్ లో కూర్చున్నాను . 
దేవత లోపలికి రాగానే , అందరమూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచాము . దేవతకు కనిపించకుండా ముందున్న మురళి వెనుక దాక్కుని నవ్వుకుంటున్నాను . 
దేవత : గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ , సిట్ డౌన్ ...... , బాగా ప్రిపేర్ అయ్యారా ..... ? .
Yes మేడం .......
దేవత : good then , All the best .......
థాంక్యూ మేడం ........

Exam బెల్ మ్రోగడంతో ....... , స్టూడెంట్స్ ...... బుక్స్ అన్నింటినీ బయట ఉంచండి అన్నారు దేవత .......
Yes మేడం yes మేడం ...... అంటూ సగం మంది వెళ్లి బుక్స్ బయట ఉంచి వచ్చారు - నా ప్రక్కన సీట్ మాత్రం ఖాళీగా ఉంది .
దేవత : వన్స్ అగైన్ All the best స్టూడెంట్స్ అంటూ మొదట స్టూడెంట్ తో మొదలుపెట్టి వరుసగా క్వశ్చన్ పేపర్స్ ఇస్తూ ఇస్తూ వెనుకకు వెళ్లి టర్న్ అయ్యి వెనుక నుండి నాదగ్గరకు వచ్చారు .
బెంచ్ పై వాలి చిన్నగా బీట్ వేస్తున్నాను .
దేవత : బుజ్జిహీరో ...... నువ్వు ఇక్కడ ? అంటూ ఆశ్చర్యంతో చూస్తున్నారు .
స్వచ్ఛమైన కోరిక మేడం - ఇది exam మేడం బెంచ్ కు ఇద్దరు మాత్రమే - అంతా పెద్దమ్మ దయ అంటూ గుండెలపై చేతినివేసుకుని నవ్వుతున్నాను .
దేవత : బుగ్గను గట్టిగా గిల్లేసారు . 
స్స్స్ .......
క్లాస్మేట్స్ అందరూ నావైపు చూసారు .
దేవత : నవ్వుకుని , టైం అయ్యింది నీ ప్రక్కన ఎవరు రాలేదు .......
వెనకున్న గర్ల్ : జాహ్నవి మేడం ఇంకా రాలేదు .
దేవత : వస్తుందిలే మీరు స్టార్ట్ చెయ్యండి అని నవ్వుతూనే అందరికీ క్వశ్చన్ పేపర్స్ - వైట్ పేపర్స్ అందించారు .

అందరూ క్వశ్చన్ పేపర్స్ చూసి థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ సంతోషంతో కేకలువేశారు . 
దేవత : why why బాయ్స్ గర్ల్స్ ....... , ఎందుకు అందరూ మహేష్ కు థాంక్స్ చెబుతున్నారు అంటూ నాదగ్గరికి వచ్చి చిరుకోపంతో చూస్తున్నారు .
క్లాస్మేట్స్ : ఎందుకంటే మహేష్ వల్లనే కష్టమైన 8 మార్క్స్ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చెయ్యబోతున్నాము మేడం ....... థాంక్యూ మహేష్ .......
మళ్ళీనా అంటూ రుసరుసలాడుతూ చూస్తున్నారు .
ఈ థాంక్స్ లన్నీ అక్కయ్యకు చెందుతాయి మేడం , లవ్ యు అక్కయ్యా అంటూ తలుచుకున్నాను .

Exam రూమ్ నుండి ఏమిటీ కేకలు అంటూ హెడ్ మాస్టర్ లోపలికివచ్చారు - ఓహ్ ....... అవంతికా మేడం ఇక్కడే ఉన్నారన్నమాట అంటూ దేవతవైపుకు రాబోతే , దేవత మరొకవైపుకు వెళుతున్నారు . 
నాకైతే పిచ్చ కోపం వచ్చేసి పైకిలేచాను .
దేవత : బుజ్జిహీరో ...... నేను మ్యానేజ్ చేస్తాను కదా కూల్ కూల్ కూర్చో 
అని కళ్ళతోనే సైగచెయ్యడంతో కూర్చున్నాను . దేవత దూరం దూరం నడవడం చూసి హెడ్ గాడికి కోపం వచ్చేస్తోంది .

అదే సమయానికి may i come in మేడం అంటూ జాహ్నవి వచ్చింది . 
దేవత : please come in జాహ్నవి ...... , ఎందుకు ఆలస్యం ...... ok ok ముందు exam పూర్తిచేయ్యి .......
హెడ్ : నో స్టాప్ ....... , రావడమే ఆలస్యం అందులోనూ కలర్ డ్రెస్ లో వచ్చావు - exam కు ఆలో చెయ్యనే చెయ్యను - go to home .......
క్లాస్మేట్ జాహ్నవి కళ్ళల్లో కన్నీళ్లు ....... , సర్ అదీ స్కూల్ కు వస్తుంటే వేగంగా వెళుతున్న కార్ వలన రోడ్డుపై నిలబడిన నీళ్లు వెదజల్లి స్కూల్ డ్రెస్ మొత్తం తడిచిపోయింది - కిందకు కూడా పడిపోయాను . ఇంటికి వెళ్లి చేంజ్ చేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయ్యింది . 
అవును సర్ నేను జాహ్నవి father , అందుకే ఆలస్యం అయ్యింది .
ఫ్రెండ్ ...... దెబ్బలేమీ తగులలేదు కదా అని నేను - జాహ్నవీ ...... అంటూ అడగబోయి గుడ్ అంటూ నావైపు చూసారు మేడం ........
జాహ్నవి : లేదు ఫ్రెండ్ ...... , దెబ్బలేమీ తగులలేదు .
దేవత : జాహ్నవీ ....... లోపలికి వచ్చి exam .......
హెడ్ గాడు : నో నెవర్ ....... , స్కూల్ డ్రెస్ లేకుండా exam కు ఆలో చెయ్యను , మీ father తోపాటు ఇంటికి వెళ్లిపో , ఇలాంటి కథలు నేను వినను .
జాహ్నవి : సర్ సర్ ......
హెడ్ గాడు : గెట్ ఔట్ ...... , స్కూల్ డ్రెస్ ఉంటేనే .......
జాహ్నవి మరియు తన father కళ్ళల్లో కన్నీళ్లు ........
దేవత : సర్ , ఎస్క్యూస్ చేసి ఆలో చెయ్యండి ప్లీజ్ ......
హెడ్ గాడు : నిన్న నువ్వు నా మాట విన్నావా బ్యూటీ ........
దేవత కళ్ళు అగ్ని గోళాలుగా మారిపోయాయి - నావైపు చూసారు .
క్లాస్మేట్ జాహ్నవి ఏడుపు చూసి క్లాస్మేట్స్ అందరూ exam రాయడం ఆపేసి ఫీల్ అవుతున్నారు . 
ప్లీజ్ ప్లీజ్ సర్ అంటున్న జాహ్నవి కన్నీళ్లు - దేవత కళ్ళల్లో చెమ్మ చూసి హృదయం చలించిపోయింది . వెంటనే లేచి అందరూ చూస్తుండగానేస్కూల్ డ్రెస్ విప్పేసి , నేనూ ...... స్కూల్ డ్రెస్సులో లేను నన్నూ బయటకు పంపించేయ్యండి అని ఓన్లీ షార్ట్ తో బయటకువెళ్లి జాహ్నవి వెనుక నిలబడ్డాను - జాహ్నవి i am with my ఫ్రెండ్ ......
వెనుకనే వినయ్ - గోవర్ధన్ - మా ఏరియా ఫ్రెండ్స్ except మురళి ఒక్కొక్కరుగా లేచి స్కూల్ డ్రెస్సెస్ విప్పేసి , మేమూ స్కూల్ డ్రెస్ లో రాలేదు మమ్మల్నీ గెట్ ఔట్ చెయ్యండి అని నావెనుకే వచ్చి నిలబడ్డారు - జాహ్నవి we are with my ఫ్రెండ్ , గుడ్ డెసిషన్ మహేష్ .......
మా క్లాస్మేట్ ఏడుపు చూసి మేమూ exam రాయలేము అంటూ క్లాస్మేట్స్ బాయ్స్ అంతా స్కూల్ డ్రెస్సెస్ విప్పేసి బయటకువచ్చి మా వెనుకే నిలబడ్డారు - జాహ్నవీ we too with my ఫ్రెండ్ ........
మేమేమి తక్కువనా అన్నట్లు గర్ల్స్ అందరూ పైకి లేచారు . అంతే మురళి లేచి షర్ట్ విప్పేసి పరుగునవచ్చి మా వెనుక నిలబడ్డాడు . 
గర్ల్స్ : సర్ ...... , ఇకనుండీ సర్ అని పిలవము - మా ఫ్రెండ్ జాహ్నవిని ఆలో చేస్తేనే మేమూ exam రాసేది . నో అని మరొకసారి ఆనండి మేమూ ...... స్కూల్ డ్రెస్ విప్పేసి ........

నో నో నో అంటూ విషయం తెలిసి కొంతమంది టీచర్స్ వచ్చి , హెడ్ మాస్టర్ గారూ ....... విషయం తెలిసింది - ఇప్పటికే చాలాదూరం వెళ్ళింది మరింత దూరం తీసుకెళ్లకండి - ఇంత చిన్న విషయానికి ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు - బయటకు తెలిస్తే అంత మంచిది కాదు - మీరు మీ రూమ్ కు వెళ్లిపోండి .
సైలెంట్ గా వెళ్లిపోతుంటే అడ్డుపడ్డాను . టీచర్స్ ...... మా ఫ్రెండ్ జాహ్నవికి - మేడం గారికి తలదించుకుని sorry చెబితేనేనే పంపించేది లేకపోతే అడుగు కూడా వెయ్యనియ్యము - what do you say ఫ్రెండ్స్ .......
Yes yes అంటూ స్కూల్ దద్దరిల్లేలా గట్టిగా చెప్పారు . ఆ కేకలకు మిగతా స్టాఫ్ - రెండువైపులా ఉన్న స్టూడెంట్స్ బయటకువచ్చి గుసగుసలాడుకుంటున్నారు .
టీచర్స్ : హెడ్ మాస్టర్ ...... please స్టూడెంట్స్ చెప్పినట్లుగా చేస్తే మీకే మంచిది లేకపోతే స్కూల్ మొత్తం వచ్చేస్తారు .
హెడ్ గాడికి చెమటలు పట్టేసాయి . చుట్టూ చూసి వేరే మార్గం లేనట్లు sorry చెప్పాడు .
వినయ్ : నో నో నో ఇలాకాదు , మహేష్ చెప్పినది మోకాళ్లపై కూర్చుని తలదించుకుని మా ఫ్రెండ్ మరియు మేడం గారికి sorry చెప్పాలి .
సూపర్ వినయ్ అంటూ హైఫై కొట్టుకున్నాము .
హెడ్ గాడు : నో నెవర్ .......
అది మా క్లాస్మేట్ ను ఏడిపించకముందు ఆలోచించి ఉండాల్సింది - sorry చెబుతారా లేక స్టూడెంట్స్ అందరినీ పిలవమంటారా ...... ?
గర్ల్ క్లాస్మేట్ : మహేష్ ...... మా డాడీ మీడియాలో పనిచేస్తారు , కాల్ చెయ్యనా ..... ? .
టీచర్ : స్టూడెంట్ ప్లీజ్ ప్లీజ్ ...... , హెడ్ మాస్టర్ ....... మీడియా వరకూ వెళ్లకుండా త్వరగా వారు కోరినట్లుగా sorry చెప్పేయ్యండి .
హెడ్ గాడు అందరివైపు - ముఖ్యన్గా నావైపు కోపంతో చూస్తున్నాడు .
గోవర్ధన్ : మనవైపు కోపంతో చూస్తున్నాడు , ఇక మీడియాకు కాల్ చేయాల్సిందే ........ 
టీచర్స్ : హెడ్ మాస్టర్ ...... మన స్కూల్ పరువు మీ చేతుల్లో ఉంది ఇక మీ ఇష్టం ........
హెడ్ గాడికి ముచ్చెమటలు పడ్డాయి . ఇక మార్గం లేక మోకాళ్లపై కూర్చుని స్టూడెంట్ జాహ్నవి sorry - మేడం .......
రెస్పెక్ట్ .......
హెడ్ గాడు : మేడం గారూ ...... sorry .
తెలుగులో ....... , ఏవైపు చూసినా లాభం లేదు చెప్పాల్సిందే ......
హెడ్ గాడు : తల దించుకుని స్టూడెంట్ జాహ్నవి క్షమించు - మేడం గారూ క్షమించండి అనిచెప్పి , కోపంతో వెళ్లిపోబోయాడు .
మళ్లీ ఆపాను .......
టీచర్స్ : స్టూడెంట్స్ - మహేష్ ....... sorry చెప్పారు కదా ........
ఇతడి మూర్ఖత్వం వలన విలువైన exam సమయం అర గంట కోల్పోయాము టీచర్స్  - మాకు ఎక్స్ట్రా టైం కావాలి .......
టీచర్స్ : డన్ డన్ ....... , ఇక వదలండి .
థాంక్స్ టీచర్స్ అంటూ దారి వదిలాము . వెనక్కు తిరిగిచూడకుండా వాడి గదిలోకి కాకుండా బయటకు వెళ్ళిపోయాడు .
వినయ్ : హెడ్డూ ....... మా ఫ్రెండ్ కాదు గెట్ ఔట్ , నువ్వు గెట్ ఔట్ అంటూ నవ్వుకున్నాము .

మహేష్ మహేష్ మహేష్ ....... అంటూ బాయ్స్ అందరూ కలిసి నన్ను అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ....... మేడం గారు మరియు మన క్లాస్ గర్ల్స్ చూస్తున్నారు సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది .
దేవత మరియు గర్ల్స్ అందరూ చిలిపినవ్వులు నవ్వుకుంటున్నారు - మహేష్ ...... 10th క్లాస్ లోనే సిక్స్ ప్యాక్స్ సూపర్ ...... జిమ్ వల్లనా ? అని గట్టిగా నవ్వుతున్నారు .
అవునవును అంటూ కిందకు దింపి సిగ్గుపడుతున్నారు బాయ్స్ .......
నో నో నో గర్ల్స్ ...... చిన్నప్పటి నుండీ కష్టపడటం వల్లన - ప్లీజ్ ప్లీజ్ అలా చూడకండి సిగ్గేస్తోంది అంటూ చేతులతో కప్పుకుని లోపలికివెళ్లి అందరమూ డ్రెస్సెస్ వేసుకున్నాము .
నవ్వులు మాత్రం ఆగడం లేదు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 23-10-2021, 09:40 AM



Users browsing this thread: Ajayk, 11 Guest(s)