Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
హాసిని : ఏంటి అన్నయ్యా ....... అక్కయ్యతో మాట్లాడుతూనే అటూ ఇటూ చూస్తున్నారు పదేపదే ........
అదీ ...... ఇక్కడకు రావడం కోసమని మా ఫ్రెండ్స్ కు ఫింగర్ చిప్స్ - గోబీ తీసుకొస్తానని అపద్దo చెప్పానా ...... ? , ఈ రూట్లో ఎక్కడా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ లేదు - తీసుకువెల్లకపోతే బాగోదు డేంజర్ కూడానూ .......
అక్కయ్య : ఇక్కడకు రా తమ్ముడూ , నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది , ఒక్క నిముషం చెల్లెళ్లతో మాట్లాడుతూ ఉండు అనిచెప్పి బామ్మా బామ్మా ...... అంటూ కేకలువేస్తూ వెళ్ళింది అక్కయ్య .
ఆటోలోనుండి అటూ ఇటూ చూస్తూనే సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకుని డబ్బు ఇచ్చి ఇంటికి చేరాను .

తమ్ముడూ - అన్నయ్యా ...... వచ్చేసావా అంటూ అక్కయ్య సైడ్ నుండి హత్తుకున్నారు - చెల్లెళ్లు మరొకవైపు చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు .
అక్కయ్యా ....... ఎక్కడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించలేదు , వాళ్ళ నుండి బయలుదేరి గంట అవుతోంది ఇప్పుడెలా ...... వెంటనే వెళ్ళాలి .
బామ్మ : మా బుజ్జిహీరో స్నాక్స్ రెడీ అంటూ పెద్ద క్యారెజీ తీసుకొచ్చారు .
అక్కయ్య : తమ్ముడూ ....... ఫింగర్ చిప్స్ - కబాబ్ , గోబీకి ఫ్లవర్ లేదు . మా బుజ్జిహీరోకు కబాబ్ చెయ్యడం కోసం ఉదయమే చికెన్ ఎక్కువ తీసుకురావడం మంచిది అయ్యింది .
మరి నా ప్రియమైనవారికి - చెల్లెళ్లకు .......
చెల్లెళ్లు : మా అన్నయ్య తింటే మేము తిన్నట్లే ......
అక్కయ్య : అవునవును అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
లేదు లేదు ........
బామ్మ : బుజ్జిహీరో ...... ఇంకా మా అందరికీ సరిపోయేంత చికెన్ ఉంది , చూయిస్తే కానీ నమ్మవు అని తీసుకొచ్చిమరీ చూయించారు .
లవ్ యు బామ్మా - లవ్ యు అక్కయ్యా - లవ్ యు చెల్లెళ్ళూ ....... , అమ్మో ఆలస్యం అవుతోంది అక్కడకు చేరేసరికి మరొక 30 నిమిషాలు పడుతుందేమో , అక్కయ్యా ...... వెళ్ళిరానా ? .
అక్కయ్య : తమ్ముడూ ....... నీ ప్రియాతిప్రియమైన దేవతను చూసివెల్లు ......
నిద్రలేచారా ..... ? .
అక్కయ్య : కొద్దిసేపటి ముందు ...... , నువ్వు కనిపించకపోయేసరికి గోల గోల చేసారనుకో .......
అవునా అక్కయ్యా అంటూ మురిసిపోయాను . ఏదీ ఎక్కడ ఉన్నారు నా దేవత ...... అంటూ ఆశతో చుట్టూ చూస్తున్నాను .
బామ్మ : ఇప్పుడే స్నానానికి వెళ్ళింది - 15 నిమిషాలలో వచ్చేస్తుంది .
ప్చ్ ...... , టైం లేదు బామ్మా ...... , వెళ్ళాలి లేకపోతే ఫ్రెండ్స్ పేరెంట్స్ కోప్పడతారు .
అక్కయ్య : అయితే నేరుగా బాత్రూమ్లోకి వెళ్లి నీ దేవతను చూసివెల్లు ...... , ఏమంటారు బామ్మా ........
బామ్మ : మనఃస్ఫూర్తిగా అంటూ లోపలికి చేతిని చూయించారు .
ఏమిటీ అంటూ వెనక్కు పడిపోయాను .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ కంగారుపడుతూ పిల్లలు , తమ్ముడూ - బంగారూ ....... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ దెబ్బ తగల్లేదు కదా అంటూ కూర్చోబెట్టి , తల వెనుక - వీపుపై ప్రేమతో స్పృశించి నవ్వుతూనే ముద్దులుపెట్టారు .
బామ్మ : షవర్ సౌండ్ వినిపిస్తోంది వెళ్లి డోర్ తెరిచి చూసి వెళ్లు బంగారూ అంటూ చిలిపినవ్వులతో లేపారు .
బామ్మా - అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... బై అనిచెప్పేసి క్యారెజీ అందుకుని వెనుతిరిగిచూడకుండా బయటకు పరుగుతియ్యడం చూసి నవ్వుతూనే లోపలికివెళ్లారు .
మెయిన్ రోడ్డుకువచ్చి ఆటో ఎక్కిబయలుదేరాను .

ఏంటీ ...... బాత్రూమ్లోకివెళ్లి స్నానం చేస్తున్న దేవతను ....... ఊహకే వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది - బామ్మ చెప్పినట్లు చెమట కాదు వేడి ... వేడి ..... ఆ వేడి సెగలు ...... , వొళ్ళంతా కాలిపోతున్నట్లుగా ఉంది , జ్వరం వచ్చేలా ఉంది అంటూ జలదరిస్తున్నాను . బామ్మ ఇంట్లో దేవత లోదుస్తుల వలన అప్పుడు అలా ఇప్పుడు ఇలా ....... ఈ ఫీల్ ఏంటి కొత్తగా తియ్యగా ఉంది అంటూ నాలో నేనే నవ్వుకుంటున్నాను . రేయ్ రేయ్ బుజ్జిమహేష్ తప్పు తప్పు ...... బుజ్జిమహేష్ బుజ్జి గానే ఉండు అంటూ లెంపలేసుకున్నాను . అవునూ ...... బామ్మ కోప్పడాలి కానీ నవ్వుతూ ఎంకరేజ్ చేస్తున్నారేమిటి ? , ఏమీ అర్థం కావడం లేదు చెమటలైతే పెరుగుతూనే ఉన్నాయి - అమ్మో ...... చీకటి పడిపోయింది .

అన్నా ..... ప్లీజ్ ప్లీజ్ కాస్త స్పీడ్ గా పోనివ్వండి , ఇప్పటికే ఆలస్యం అయ్యింది .
డ్రైవర్ : సరే తమ్ముడూ ...... , ఇంతదానికి ప్లీజ్ ఎందుకు అని వేగం పెంచాడు .
20 నిమిషాలలో మెయిన్ గేట్ చేరాను . దిగి డబ్బులు ఇచ్చి బరువుగా ఉన్న క్యారెజీ తీసుకుని వినయ్ ఇంటికి పరుగుతీసాను .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేడి వేడి స్నాక్స్ రెడీ అంటూ లోపలికివెళ్లి టేబుల్ పై ఓపెన్ చేసాను . ఫింగర్ చిప్స్ - కబాబ్ అండ్ అండ్ ఈ పెద్ద క్యారెజీలో ఏముంది wow బిరియానీ అదికూడా అందరికీ సరిపోయేంత - రాత్రి తినడం కోసం అన్నమాట లవ్ యు బామ్మా - అక్కయ్యా .......
మురళి : గోబీ అన్నావుకాదరా .......
అదీ అదీ రెండూ వెజ్ అయితే ఏమి బాగుంటుంది అని కబాబ్ తీసుకొచ్చాను - ప్రక్కనే బిరియానీ ఘుమఘుమలు నోరూరించడంతో తీసుకొచ్చేసాను నా ఫ్రెండ్స్ కోసం .......
ఫ్రెండ్స్ : థాంక్యూ థాంక్యూ మహేష్ ...... వాసనకే నోరూరిపోతోంది తిందామురా కాసేపు బుక్స్ ప్రక్కన ఉంచి టీవీ ఆన్ చేద్దాము .
సరే అంటూ వినయ్ టీవీ ఆన్ చేసి పేపర్ ప్లేట్స్ తీసుకొచ్చాడు .

న్యూస్ ఛానెల్ ప్లే అవ్వడం - బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ - టెర్రర్ అటాక్ తో అట్టుడికిన హైద్రాబాద్ , ఒకేసారి పలుచోట్ల బాంబులు పేలడం వలన భారీగా ఆస్తి నష్టం - ప్రాణ నష్టం .......
రేయ్ రేయ్ ...... మీ పేరెంట్స్ వెళుతున్నది హైద్రాబాద్ కదరా , వెంటనే కాల్ చేసి చెప్పురా .......
వినయ్ వెంటనే కాల్ చేసాడు . ఫ్లైట్ లో వెళుతున్నారు కదరా తగలడం లేదు అని కంగారుపడుతున్నాడు .
ఈపాటికి తెలిసే ఉంటుంది లేరా వినయ్ , వెనక్కు వచ్చేస్తారులే ...... అని ఓదార్చాము .
గోవర్ధన్ : ఫ్రెండ్స్ యాంటీ టెర్రరిస్ట్ చీఫ్ మాట్లాడుతున్నారు సౌండ్ చెయ్యకండి .....
చీఫ్ : విచారం వ్యక్తం చేశారు - హైద్రాబాద్ లోనే కాదు దేశంలోని ప్రధానమైన నగరాలన్నింటిలో టెర్రర్ అటాక్స్ జరుగబోతున్నాయని తెలిసింది - స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు - అటాక్స్ జరగకుండా చూడటమే కాకుండా మనలోనే కలిసిపోయి తిరుగుతున్న టెర్రరిస్ట్ లను కనిపెడితేనే మళ్లీ కంటిన్యూ అవ్వకుండా చెయ్యవచ్చు - ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు వచ్చినా వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలపాలని కోరుకుంటున్నాము - మాతోపాటు మీరూ కలిసి పనిచేసినప్పుడే ఇలాంటి అటాక్స్ జరగకుండా ఆపగలము అని ఉద్వేగపూరితమైన స్పీచ్ ఇచ్చారు .
వెంటనే అటాక్ తరువాతి దృశ్యాలు ప్లే అవుతున్నాయి .
ఫ్రెండ్స్ : అంతమందిని చంపిన అనా టెర్రరిస్ట్ నాకొడుకులు దొరకాలి ...... అంటూ కోపంతో ఊగిపోతున్నారు . మహేష్ ...... స్నాక్స్ క్యారెజీలో ఉంచెయ్యి తరువాత తిందాము . 
అవును ఇలాంటి సమయంలో తినడం భావ్యం కాదు అని క్యారెజీ చేసి ప్రక్కన ఉంచాను .

అంతలో ఫ్రెండ్స్ అందరితోపాటు నాకూ కాల్ వచ్చింది చూస్తే అక్కయ్య ...... , తమ్ముడూ ...... హైద్రాబాద్ లో బాంబులు పేలాయి - నువ్వు జాగ్రత్త ......
మా అక్కయ్యకు నేనంటే ఎంత ప్రాణం - వందల కిలోమీటర్లో దూరంలో బాంబులు పేలితే ........
అక్కయ్య : అవన్నీ నాకనవసరం నువ్వు జాగ్రత్త అంతే .......
లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , సరే సరే మీరు కూడా జాగ్రత్త .
అక్కయ్య : తమ్ముడూ ...... మేము వైజాగ్ లోనే safest ప్లేస్ లో ఉన్నామని నీకు తెలియదా ...... , ఉదయమే వచ్చేయ్యాలి .
తెల్లవారుఘామున మా అక్కయ్య - దేవత ముందు ఉంటాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ...... గుడ్ నైట్ .
గుడ్ నైట్ అక్కయ్యా ...... అనిచెప్పి కట్ చేసాను .

అక్కడే ఉంటే బాధపడతామని టీవీ ఆఫ్ చేసి అందరమూ బయటకువచ్చాము . మినీ గ్రౌండ్ లోని లైట్ కిందకు చేరాము . టెర్రరిస్ట్ ల గురించే మాట్లాడుకున్నాము . 9 గంటల సమయంలో ఆకలివేస్తోందని ఫ్రెండ్స్ అనడంతో వారి వారి ఇళ్ల నుండి వచ్చిన క్యారీజీలతోపాటు స్నాక్స్ - బిరియానీ తిని 11 గంటలవరకూ చదువుకుని ఇంటికి తాళం వేసుకుని , ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్ - హాల్లో పడుకున్నాము . 
అక్కయ్య - బామ్మ గుడ్ నైట్ చెప్పారు కానీ దేవత చెప్పలేదు , ఈ సమయంలో వద్దులే కంగారుపడతారు అని కళ్ళు మూసుకున్నాను .

కొద్దిసేపటికే దెయ్యం కల కన్నట్లు గోవర్ధన్ మమ్మీ అంటూ సడెన్ గా లేచాడు . ప్రక్కనే పడుకుని ఉండటంతో రేయ్ మహేష్ రేయ్ మహేష్ ఉచ్చ ఫాస్ట్ గా వస్తోంది అంటూ లేపాడు .
ప్రక్కనే కదరా బాత్రూం ......
గోవర్ధన్ : 12 గంటలు అయ్యిందిరా నాకు మహా భయం అందులోనూ దెయ్యం కల వచ్చింది తోడుగా రారా మహేష్ అంటూ కదిల్చి పైకిలేచాడు .
ఏంట్రా గోవర్ధన్ ...... మంచి నిద్ర డిస్టర్బ్ చేసావు అంటూ కళ్ళు తిక్కుకుంటూ లేచి కూర్చున్నాను . 
లేచి నిలబడిన వాడి ముఖమంతా చెమట మరియు సగం షర్ట్ చెమటతో తడిచిపోయి ఉండటం - విండో వైపు ఏదో భయాంకరమైనది చూస్తున్నట్లు పెద్ద పెద్ద కళ్ళతో వణికిపోతున్నాడు .
రేయ్ గోవర్ధన్ ఏమైందిరా అలా వణుకుతున్నావు అని టచ్ చేసాను అంతే .....
గోవర్ధన్ మరింత భయంతో నిలబడే ప్యాంటులో ఉచ్చ పోసేసుకున్నాడు .
రేయ్ గోవర్ధన్ ఏంట్రా ఒక్క నిమిషం ఆపుకోలేవా అంటూ పైకిలేచాను .
గోవర్ధన్ : కిటికీలోచూడు నువ్వు కూడా కార్చుకుంటావు అనిచెప్పి , భయంతో వణుకుతూ తడిచిన ప్యాంటుతోనే దుప్పటి ఫుల్ గా కప్పుకుని ముడుచుకున్నాడు దెయ్యం దెయ్యం దెయ్యం అని కలవరిస్తూ .......

కిటికీలో ఏముందిరా ఇంత భయపడిపోతున్నావు అంటూ చూసాను . భూత్ బంగ్లా లోపల టార్చ్ వెలుగులు కదులుతుండటం చూసి భయంతో కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి . ఉచ్చపడిపోయినంత పని సయ్యింది . భయానికి మరొక కారణం వెలుగులు అటూ ఇటూ కదులుతుండటం .......
భయంతో కింద కూర్చుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...... దెయ్యం దెయ్యం తొందరగా లేవండి - భూత్ బంగ్లాలో లైట్స్ వెలుగుతున్నాయి - చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి .
గోవర్ధన్ : దుప్పటి కప్పుకునే చెబితే వినలేదు ఇప్పుడు భయమేస్తుందా .......
అవును గోవర్ధన్ ...... ఫ్రెండ్స్ అందరినీ లేపుదాము లెగు .......
గోవర్ధన్ : ఇంకా ఉచ్చ ఆగడం లేదు , నువ్వేమో మన ఫ్రెండ్స్ ను లేపమంటున్నావు ,  వాళ్ళు మన మాటలు వింటూనే ఉన్నారు అందుకే భయంతో ఒక్కడూ ముసుగు తియ్యడం లేదు , గప్ చుప్ గా పడుకో ...... దెయ్యం దెయ్యం అంటూ దుప్పటిలోనే వణుకుతున్నాడు . 
చుట్టూ చూస్తే గోవర్ధన్ చెప్పింది నిజమే ...... ఫ్రెండ్స్ అందరూ దుప్పటిని గట్టిగా పట్టుకుని ముడుచుకుని పడుకున్నారు . 

వెలుగులు బయటకు రావడం చూసి వెంటనే మోకాళ్లపైకి చేరాను . భయం వేస్తున్నా క్యూరియాసిటీ వలన మోకాళ్లపైననే కిటికీ దగ్గరకువెళ్లి తొంగి చూసాను .
వన్ టూ త్రీ ఫోర్ ...... నలుగురు వ్యక్తులు బయటకు గోడ దూకారు . నాకు ఆసక్తి గలిగించినది ఏమిటంటే ...... నలుగురూ తమ షర్ట్స్ వెనుక గన్స్ పెట్టుకోవడం ......  , అలా చూడగానే దెయ్యం భయం వెళ్ళిపోయి భూత్ బంగ్లా ప్రక్కనే ఉంటున్న నా ప్రాణమైన బామ్మ - దేవత గుర్తుకువచ్చారు . ఊహించుకుంటేనే గుండె ఆగినంత పని అయ్యింది - లోపల ఏమిచేసి గన్స్ తో వస్తున్నారో వెంటనే తెలుసుకుని డేంజర్ అయితే వెంటనే ఉదయమే నా ప్రాణామైన ఇద్దరినీ వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యేలా చూడాలి - అయినా లోపల ఏముందో ఎలా తెలుసుకోవడం .......
నలుగురు వ్యక్తులూ చుట్టూ చూస్తున్నారు .
అంతే వెంటనే కిందకు వొంగాను . ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ....... దెయ్యాలు కాదు నలుగురు వ్యక్తులు బయటకువచ్చారు .
గోవర్ధన్ : రేయ్ మహేష్ ...... , వాళ్లే దెయ్యాలు మగ దెయ్యాలు , దెయ్యాలను చూసేసావా .... ? , అవి నిన్ను చూడలేదు కదూ ......
లేదు .......
గోవర్ధన్ : హమ్మయ్యా ...... , రేయ్ ఊరికే పడుకో , ఎప్పుడు తెల్లవారుతుందో ఏమిటో .......
కిటికీలోనుండి తొంగిచూస్తే నలుగురూ మాయమైపోయారు - ఎక్కడా కనిపించడం లేదు . వేరే ఫ్రెండ్స్ ను లేపబోతే , నా మాటలు విన్నట్లు వింటున్నట్లు భయంతో ఉలకడం లేదు పలకడం లేదు ....... - బామ్మ దేవతకు ఏమైనా అవుతుందేమోనని భయం అంతకంతకూ పెరుగుతోంది . వాళ్ళ క్షేమం ముఖ్యం కాబట్టి ఫ్రెండ్స్ ఎవ్వరూ రాకపోయినా మొబైల్ అందుకుని దైర్యంగా కిందకువెళ్లి మెయిన్ డోర్ - మెయిన్ గేట్ తెరుచుకుని స్లిప్పర్స్ వేసుకున్నాను . 
 ఉదయం వెళ్లడానికే భయపడతారు అలాంటిది అర్ధరాత్రి 12 గంటల సమయంలో భూత్ బంగ్లా మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నాను . తాయెత్తులు కట్టిన మెయిన్ గేట్ - చుట్టూ నిశ్శబ్దం - వేగంగా వీస్తున్న చల్లని గాలులకు - గాలి శబ్దాలకు ఒక్కసారిగా భయం వచ్చేసింది - గజగజా వణికిపోతున్నాను .
గన్స్ గుర్తుకురాగానే , నో నో నో నా దేవత - బామ్మకు ఏ హానీ కలుగకూడదు , పెద్దమ్మను తలుచుకుని భయం - ధైర్యం రెండింటితో వాళ్ళు ఎక్కి దూకిన గోడ ఎక్కి అటువైపుకు దిగాను . చుట్టూ చిమ్మ చీకటి - పొదల్లోనుండి శబ్దాలు ...... ఉచ్చపడిపోయింది అంతే వెనక్కుతిరిగి గోడ ఎక్కబోయి , గన్స్ కళ్ళముందు మెదలగానే ...... నాకేమైనా పర్లేదు నా వాళ్లకు ఏ హానీ కలుగకూడదు - అయినా పెద్దమ్మ ఉండగా నాకేంటి భయం అంటూ మొబైల్ తీసి టార్చ్ వేసాను . 
వెలుగుకు సర్రున పెద్ద పాము ప్రక్కకు వెళ్ళిపోయింది . ఆ భయానికి గుండె చప్పుడు నా చెవులకు వినిపిస్తోంది - కొన్ని క్షణాలు కదలకుండా ఉండిపోయాను .
మెసేజ్ సౌండ్ : నేనెప్పుడూ మా బుజ్జిహీరో వెంటనే ఉంటాను . నేనుండగా భయమా ....... బుజ్జిహీరో .......
లేదు పెద్దమ్మా లేదు భయం లేనే లేదు అంటూ దైర్యంగా అడుగులు ముందుకువేశాను . ఏపుగా పెరిగి దారిని మూసేసిన తీగలను ప్రక్కకు తీసుకుంటూ మెయిన్ డోర్ దగ్గరకు చేరుకున్నాను . నేలపై దుమ్ములో ఇప్పుడే ఆ నలుగురు వ్యక్తులు నడిచిన ఫ్రెష్ అడుగుజాడలు కనిపిస్తున్నాయి టార్చ్ వెలుగులో ........

లోపలికి దైర్యంగా ఎవరు వస్తారలే అన్నట్లు గొళ్ళెం కు కేవలం తీగను మాత్రమే చుట్టారు . మందమైన తీగను తియ్యడానికి కాస్తకష్టపడాల్సివచ్చింది . డోర్స్ తెరవగానే గాలి ఫోర్స్ గా కొట్టింది .......
కూల్ కూల్ రా ..... , పెద్దమ్మ తోడు ఉండగా ఎందుకు భయం అంటూ లోపల టార్చ్ వేసి చూసాను - బూజు తప్ప ఏమీ కనిపించడం లేదు - కానీ అడుగుజాడలు ఎటువైపు వెళ్ళాయో అటువైపు మాత్రం కొన్నిరోజులుగా వస్తూ పోతున్నట్లు క్లీన్ గా ఉంది - ఈ నలుగురి అడుగుల చప్పుళ్ళు వినిపించేనేమో బామ్మ - దేవత మొదటిరోజు భయపడినది .
అడుగుజాడలవైపు టార్చ్ వేసుకుంటూ మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్ అటునుండి ఒక తలుపు దగ్గరికి చేరాను . అన్నీ అడుగుజాడలు లోపలికి - బయటకు చూయిస్తుండటం చూసి ఇక్కడే ఈ గదిలోనుండే గోవర్ధన్ - తరువాత టార్చ్ వెలుగులు చూసాము అనుకుని తెరవబోతే పెద్ద తాళం వేసి ఉంది . మెయిన్ డోర్ కు వెయ్యకుండా ఇక్కడ వేశారు అంటే విషయం ఈ గదిలోనే ఉంది అనుకుని తాళం పగలగొట్టడానికి ఏమైనా దొరుకుంతుందేమోనని చుట్టూ చూస్తే లావుపాటి రాడ్ దొరికింది .
వెలుతురు పడేలా మొబైల్ ను షర్ట్ జేబులో ఉంచుకుని , సౌండ్ చెయ్యకుండా పగలగొట్టబోతే పెద్ద తాళం అయినందువలన ఎంతకీ ఉపయోగం లేకపోయింది . లాభం లేక బలం అంతా కూడదీసుకుని పెద్దమ్మా ...... అంటూ బలంగా కొట్టాను - తాళం ముక్కలు ముక్కలై కిందపడటం చూసి నాకే ఆశ్చర్యం వేసింది - పెద్దమ్మను తలుచుకోవడం వలన ఇలా జరిగి ఉంటుంది లేకపోతే మనకు ఇంత బలం ఎక్కడుంది - ఈ సౌండ్ కానీ గోవర్ధన్ కు వినిపించి ఉంటే మళ్లీ ఉచ్ఛపోసుకుని ఉంటాడు అని నవ్వుకున్నాను .
మెసేజ్ : జేబులోనుండి అందుకుని చూస్తే , పెద్దమ్మ : హ హ హ ......
థాంక్స్ పెద్దమ్మా ...... , ఒకచేతితో మొబైల్ టార్చ్ వేసి - మరొకచేతితో గొళ్ళెం తీసి డోర్ తోసి లోపలికివెళ్ళాను . కాలికి ఏదో తగిలి పడిపోబోయి మరేదో చేతితో పట్టుకుని నిలబడ్డాను . నన్ను పడెయ్యబోయింది ఏంటబ్బా అని అందుకుని టార్చ్ వెలుగులో చూస్తే AK - 47 గన్ ...... భయంతో దూరంగా విసిరేసాను . విసిరిన ప్లేస్ నుండి పెద్దపెద్దగా మెటల్ సౌండ్స్ రావడంతో అటువైపు టార్చ్ వేసాను . 
షాక్ షాక్ షాక్ ....... నా అంత ఎత్తులో గన్స్ - రివాల్వర్ మొదలుకుని AK - 47 మరియు పెద్ద పెద్ద గన్స్ ఉండటం చూసి మరింత భయమేసింది , దగ్గరకు వెళ్లాడానికే భయమేస్తోంది . వణుకుతూ టార్చ్ ప్రక్కనే పడింది అక్కడ బాక్సస్ బాక్సస్ బాంబులు - వైర్స్ - జాకెట్ వెస్ట్ బాంబ్స్ ...... చెమటలు పట్టేస్తున్నాయి . ప్రక్కన ఇంకా ఎమున్నాయో అని తిరుగుతూ టార్చ్ వేసాను - గోడలపై పెద్ద పెద్ద టెర్రరిస్టుల ఫోటోలు - మ్యాప్స్ , మ్యాప్స్ పై గుర్తులు ...... పెద్ద హాల్ నిండా ఎటుచూసినా గన్స్ బాంబులు - కంప్యూటర్స్ ..... కంప్యూటర్స్ కు పెద్ద పెద్ద బ్యాటరీలు - ఫైల్స్ , ఫైల్స్ లో ప్లాన్స్ ...... వైజాగ్ మ్యాప్స్ అంటే నెక్స్ట్ అటాక్ వైజాగ్ లోనే అన్నమాట - స్థావరంగా ఈ భూత్ బంగ్లాను ఎంచుకున్నారు - ఎదురుగా రెండు డోర్స్ ఉన్నాయి , డోర్స్ ముందు డబ్బులు చిందరవందరగా పడి ఉండటం చూసి తెరిచాను - నా మోకాళ్ళవరకూ కట్టలు కట్టలు మీదపడ్డాయి - డబ్బుతోపాటు పెద్ద ఫైల్ పడటంతో అందుకుని చూస్తే స్లీపింగ్ సెల్స్ అని రాసి ఉంది - లోపల ఫోటోలు వారికి ఇవ్వాల్సిన అమౌంట్ లిస్ట్ ఉంది - నాకైతే తుపాకీ మూవీ గుర్తుకువచ్చింది .

భయంలో మెదడు పనిచేయడం లేదు . వణుకుతూనే మొబైల్లో 100 కు డయల్ చేసాను . 
Yes ......
సర్ సర్ పోలీ....స్ పో.....లీస్ ...... గన్స్ - బాంబ్స్ - మనీ - టెర్రరిస్ట్స్ - టెర్రరిస్ట్ అటాక్స్ ...... సర్ సర్ వెంటనే ***** ఏరియా కు రావాలి . నాకు చాలా భయమేస్తోంది - ఒక ఇంటి మొత్తం గన్స్ - బాంబ్స్ - అదేదో అదేదో బార్స్ బార్స్ ..... ఆ ఆ మూవీస్ లో చూయించినట్లు పెద్దమొత్తంలో RDX ఉంది సర్ వెంటనే రావాలి.
సెక్యూరిటీ అధికారి : బాబూ ...... నీ మాటలను బట్టి పిల్లాడివని తెలుస్తోంది - సాయంత్రం టీవీలో న్యూస్ చూసి ఆటపట్టించడానికి చేశావని తెలుస్తోంది - బాగా నిద్రవస్తోంది డిస్టర్బ్ చెయ్యకుండా పెట్టేయ్యి ....... - పిల్లలు ఎప్పుడూ ఇంతే గది మొత్తం గన్స్ బాంబ్స్ ఏంటి నమ్మేలా ఉండాలికదా సాయంత్రం నుండీ ఇవే కాల్స్ అని కట్ చేసేసాడు .
సర్ సర్ ...... , మళ్లీ డయల్ చేసాను .
సెక్యూరిటీ అధికారి : అర్ధరాత్రి దాటింది పడుకుంటావా లేక ..... అంటూ మళ్లీ కట్ చేసాడు .
మళ్లీ చేసాను - ఈ సారి ఎత్తి కట్ చేసేసాడు . 

Shit shit ...... ఇప్పుడెలా , ఈ సమయంలో ఒక పిల్లాడు చేస్తే ఏ సెక్యూరిటీ అధికారి నమ్ముతారులే ....... , కూల్ కూల్ రా ఆ టెర్రరిస్ట్ లు లేరు కదా కూల్ గా ఆలోచించు - ఆ ఆ హాస్పిటల్లో SI సర్ ..... నెంబర్ ఇచ్చారుకదా అని స్క్రోల్ చేసి డయల్ చెయ్యబోయి ఇలాకాదు అంటూ రెండు మూడు పిక్స్ తీసి పంపించి కాల్ చేసాను .

ఎత్తగానే SI సర్ SI సర్ ...... బాంబ్స్ RDX గన్స్ మనీ కంప్యూటర్స్ స్లీపింగ్ సెల్స్ ...... అంటూ ఆతృతతో చెప్పాను .
SI సర్ : పిల్లాడివే కదా ..... , రెండు రోజులుగా దేశంలోని సెక్యూరిటీ ఆఫీసర్లంతా నిద్రాహారాలు మానుకుని రోడ్లపై తిరుగుతున్నాము , వెళ్లి పడుకో.......
తెలుసు తెలుసు సర్ ...... మీరు నమ్మరని , 100 కు డయల్ చేసినా ఇదే చెప్పారు .  అందుకే మీకు వాట్సాప్ చేసాను , చూస్తే మీరే కాల్ చేస్తారు అని కట్ చేసాను . 1 2 3 4 5 6 7 8 9 ...... 10 అనేంతలో సర్ నుండి కాల్ వచ్చింది .
SI సర్ : కంగారుపడుతూ ...... బాబూ ఎక్కడ ? , నీ పేరేమిటి ? .
నేను సర్ - మనం నిన్ననే కలిసాము - నా పేరు ...... ( వద్దులే exams ఉన్నాయి , ఫేమస్ అవ్వడం వలన అందరి వలన డిస్టర్బ్ అవ్వవచ్చు మరియు ఇక్కడ నా పరిస్థితులు వేరు ) కొన్ని situations వలన నా పేరు చెప్పడం ఇష్టం లేదు సర్ , అయినా నా పేరుతో అవసరమే లేదు , లొకేషన్ షేర్ చేస్తాను వెంటనే వచ్చెయ్యండి అని కట్ చేసి లొకేషన్ షేర్ చేసాను .
సాయంత్రం న్యూస్ లో విన్న యాంటీ టెర్రరిస్ట్ ఆఫీసర్ మాటలు గుర్తుకువచ్చి వెంటనే సర్ కు కాల్ చేసాను . 
నమ్మకం వలన ఒక్క రింగుకే ఎత్తి చెప్పు బాబూ అన్నారు .
సర్ ...... సాయంత్రం ఒక ఆఫీసర్ చెప్పారు - వీటిని పట్టుకోవడం కంటే వీటిని రెడీ చేస్తున్న టెర్రరిస్టులను పట్టుకున్నప్పుడే టెర్రరిజం ను అంతం చెయ్యగలము అని - ఇక్కడ కేవలం స్లీపింగ్ సెల్స్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి - వారిని డబ్బులతో టెర్రరిజంలోకి దింపుతున్న నలుగురు వ్యక్తులు నా కళ్ళముందే చీకటిలో మాయమైపోయారు - ఇప్పుడు గనుక మీరు మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్ బందోబస్తుతో వస్తే మీడియాలో టెలిక్యాస్ట్ అయ్యి ఆ నలుగురూ తప్పించుకునివెళ్లి మళ్లీ అటాక్స్ కు ప్లాన్ చేస్తారేమో , కాబట్టి మీరు కొద్దిమందితో మాత్రమే వచ్చి వీటన్నింటినీ మూడో కంటికి తెలియకుండా తీసుకెళితే , రేపు ఇదేసమయానికి ఇక్కడకు రాబోతున్న ఆ నలుగురినీ పెట్టుకోవచ్చు , హైద్రాబాద్ లో అటాక్స్ జరిగాయి కాబట్టి వైజాగ్ లో కూడా అటాక్స్ చెయ్యడం కోసం ఖచ్చితంగా వస్తారు . ఏదో పిల్లాడు వాగుతున్నాడు అనుకుంటే మీ ఇష్టం ఏదో నా బుజ్జి తెలివితో చెప్పాను .
SI సర్ : బుజ్జి తెలివి కాదు బాబూ ...... సూపర్ పవర్ నాలెడ్జ్ ప్రక్కన లేవు కానీ ఉండి ఉంటే కౌగిలించుకునేవాడిని - నాకు రాని అత్యద్భుతమైన ఐడియా ఇచ్చావు - నువ్వు చెప్పినట్లుగానే చేస్తాము బుజ్జి సర్ ....... ప్రౌడ్ గా సెల్యూట్ చేస్తున్నాను - గుట్టుచప్పుడు కాకుండా వచ్చి పని పూర్తిచేసుకుని వెళతాము .
మీరు పొగుడుతుంటే సిగ్గేస్తోంది సర్ - సర్ ..... ఇప్పటికే ఆలస్యం అయ్యింది , రేపు exam కూడా ఉంది నాకు కాల్ చేసి డిస్టర్బ్ చెయ్యకండి , అసలే 11 గంటలవరకూ చదువుకున్నాను బై బై ...... అని కట్ చేసాను . ఎందుకైనా అవసరం పడతాయని హాల్ మొత్తం మరియు స్లీపింగ్ సెల్స్ ఫోటోల వీడియో తీసుకుని , పెద్దమ్మను తలుచుకుంటూనే దర్జాగా కిందకువచ్చి డోర్స్ విశాలంగా తెరిచి బయటకువచ్చి గోడను జంప్ చేసాను . వినయ్ ఇంటి మెయిన్ గేట్ - మెయిన్ డోర్ లాక్ చేసుకుని సైలెంట్ గా వెళ్లి గోవర్ధన్ ప్రక్కన కాకుండా కాస్త దూరంగా వినయ్ ప్రక్కన పడుకున్నాను ఎందుకో అర్ధమయ్యే ఉంటుంది అని నవ్వుకున్నాను .

కొద్దిసేపటికే వెహికల్ సౌండ్ రావడంతో కిటికీ దగ్గరకువెళ్లి తొంగిచూసాను . జీప్ లో SI సర్ వెనుక కోర్టులకు నేరస్థులను తీసుకెళ్లే పెద్ద సెక్యూరిటీ అధికారి వెహికల్ ఒకటే ఒకటి అందులో కొద్దిమంది సెక్యూరిటీ ఆఫీసర్లు ....... 
ఏంటి సర్ ...... ఫోటోలు తీసి పంపించినా ఒకేఒక వెహికల్ తో వచ్చారు - లోపలున్న డబ్బుకే ఈ వెహికల్ సరిపోదు . 
అంతలో SI సర్ మొబైల్ తీసి ఇదే లొకేషన్ అంటూ చూయించి అందరూ గప్ చుప్ గా గోడను జంప్ చేసి లోపలికివెళ్లారు . సర్ తన తప్పు తెలుసుకున్నట్లు అర గంటలో మూడు నాలుగు పెద్ద వెహికల్స్ మరియు మరికొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చినట్లు చకచకా లోడ్ చేస్తున్నారు . గంటలో మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుని , బయటకువచ్చి చుట్టూ చూసారు నాకేమీ అన్నట్లు , వచ్చినట్లుగానే సైలెంట్ గా వెళ్లిపోయారు . 
పెదాలపై చిరునవ్వుతో పడుకున్నాను . 
సర్ నుండి కాల్ వచ్చి ఒక్క రింగుకే స్టాప్ అయ్యింది - నన్ను డిస్టర్బ్ చెయ్యకండి అన్న మాటలు గుర్తుకొచ్చినట్లు - నవ్వుకుని హాయిగా పడుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 23-10-2021, 09:43 AM



Users browsing this thread: 15 Guest(s)