Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#16
---------------- నిజం చెప్పాలి అంటే, జాను అమెరికా వెళ్ళాక నేను ఎక్కువ ఇంట్లోనే ఉండిపోయాను.....ఎందుకో తెలియని స్తబ్దత....అన్ని ఉన్న ఎదో తెలియని వెలితి జీవితంలో.....ఒంటికి సుఖం దొరుకుంది కానీ....ఇంకా ఇంకా ఎదో కోరుకుంటుంది మనసు....పదే పదే.....సిరి జ్ఞాపకాలు మనసులో ముళ్ళు లా గుచ్చుకుంటున్నాయి.....నేను ఎక్కువగా ఇంట్లోనే ఉండడం గమనించి, ఒక రోజు అమ్మ నా పక్కన కూర్చొని "ఏంటి కన్నా.....ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నావు......ఒంట్లో బాగోలేదా...."అంది అనునయంగా. "ఏంలేదు ...అమ్మ.....బయట కూడా పెద్దగా పని ఏమిలేదు....అందుకే....."అంటూ ఆపాను. "కన్నా....ఇరవయి ఏడూ కి వొచ్చావు.....ఇప్పుడైనా పెళ్లి చేస్కో....అన్ని సర్దుకుంటాయి....బందువులు చాల మంది అడుగుతున్నారు నీకు పిల్లను ఇస్తాము అని....అందులో  నీకు నచ్చిన  అమ్మాయి ని పెళ్లి చేస్కో.....నా మాట విను....చిన్న వయసులోనే అన్ని సాదించావు.....ఈ పెళ్లి ఒకటి నా చేతుల మీదుగా ఐ పొతే నాకు కూడా తృప్తిగా ఉంటుంది....."అంది అమ్మ. నేను అమ్మ వొడిలో పడుకున్నాను ఏమి మాట్లాడకుండా. ఈ మధ్య నిద్ర సరిగా లేకపోవడం వల్లనేమో అలాగే అమ్మ వొడిలో పడుకుండి పోయాను.

 
చటుక్కున మెలుకువ వొచ్చి లేచి కూర్చున్నాను. "ఏమైంది రా....అలా లేచావు సడన్ గా....."అంది అర్ధం కానట్టుగా అమ్మ. "సారీ....అమ్మ నిద్ర పట్టేసింది....."అంటూ లేచి బాత్రూం లో కి వెళ్లి షవర్ కింద నిల్చున్నాను. నీళ్లు తల మీద ధారగా పడుతుంటే కొంచెం రిలీఫ్ అయినట్టుగా అనిపించింది.
ఇంట్లో ఉంటె ఏదోలా అనిపించి రెడీ అయ్యి కారు తీస్కొని బయటకు వెళ్ళాను.
ఎప్పుడైనా ఏదోలా ఉంటె లాంగ్ డ్రైవ్ కి ఒంటరిగా వెళ్లడం అలవాటు. ఆ రోజు కూడా ఎం చేయాలో అర్ధం కాలేదు....ఎవరిని కలవాలని అని కూడా అనిపించలేదు....అలా డ్రైవ్ చేస్కుంటూ వెళుతున్నాను....సడన్ గా సైడ్ రోడ్ నుండి స్కూటీ వొచ్చింది. బ్రేక్ గట్టిగ నొక్కాను. ఐన కూడా కారు వెళ్లి స్కూటీ కి డాష్ ఇచ్చింది. క్షణాల్లో స్కూటీ కిందపడిపోవడం కారు ఆగిపోవడం జరిగింది. ఇంజిన్ ఆఫ్ చేసి డోర్ తీస్కొని కిందకు దిగాను. స్కూటీ మీద ఎవరున్నారో కూడా గమనించలేదు నేను హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకి. డోర్ తీస్కొని బయటకు వొచ్చానో లేదో జనాలు  పోగయ్యారు. "ఏంటి రా....చూసుకొని కారు నడుపక్కర్లా......డబ్బు మదమా...."అంటూ ఒకడు నా కాలర్ పట్టుకున్నాడు. "ఓయి....అందులో నా తప్పేమి లేదు......"అని అంటూ ఉండగానే చేయి ఎత్తాడు. వాడి చేయిని అలాగే పట్టుకున్నాను అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను గట్టిగ వెనక్కు నెట్టేసాను వాడిని కోపంగా. ఇంతలో ఒక అమ్మాయి వొచ్చింది మా మధ్యకు. వాడి వైపు చూసి "హలో....అతని తప్పేమి లేదు....అనసరంగా ఇష్యూ చేయకండి....."అంది వాడితో కోపంగా. వాడు నా వైపు కోపంగా చూసి అక్కడనుండి తప్పుకున్నాడు, వాడి తో పాటు ఒక్కొక్కరు వెళ్లిపోయారు, అనవసరంగా వొచ్చాము అన్నట్టుగా మా వైపు చూసుకుంటూ. ఒంటికి అంటుకున్న మట్టిని దులుపుకుంటూ "సారీ...అండి....నాదే తప్పు...చూస్కోకుండా వొచ్చాను....అక్కడికి మీరు చాల కంట్రోల్ చేసారు కారుని, లేదంటే నేను హాస్పిటల్ లో ఉండాల్చి వొచ్చేది....."అంది నా వైపు చూసి.   నేను ఆ సంఘటననుండి  కొంచెం కోలుకొని "ఇట్స్ ఓకే...మీకేమి దెబ్బలు తగల లేదు కదా ....."అన్నాను తన వైపు చూసి.    "నో....ఐ అం ఫైన్...కానీ....."అంటూ నా వైపు చూసింది. నేను ఏంటి అన్నట్టుగా చూసాను. తాను కారు వైపు చూసింది. నేను అటు వైపు చూసాను.   కారు ఫ్రంట్ డామేజ్ అయ్యింది, స్కూటీ వెనక భాగం తో పాటు. స్కూటీ తో పోల్చుకుంటే  కారు కె ఎక్కువ డామేజ్ అయ్యింది.     "సారీ అండి...కారు బాగా  డామేజ్ అయినట్టుగా ఉంది.....నేను పే చేస్తాను...ఎంత అవుతుంది...."అంది పర్సులో చేయి పెట్టి డబ్బులు వెదుకుతూ. "ఇట్స్ ఓకే......పర్వాలేదు..."అన్నాను. "లేదు..లేదు.....ఇట్స్ absolutely   మై మిస్టేక్ ....ఒక రెండు వేలు అవుతుందా..." అంది  నా వైపు  చూసి పర్సు లో  నుండి డబ్బు తీస్తూ.   "పరవాలేదు....మీ స్కూటీ కి కూడా డామేజ్ అయ్యింది....దాన్ని రిపేర్ చేయించండి...."అన్నాను తన వైపు చూసి.      "నిజం చెప్పండి ...చాల డామేజ్ అయ్యింది కదా....మనీ కూడా ఎక్కువే అవుతుంది కదా....నా దెగ్గర ఈ రెండు  వేలే ఉన్నాయి....honest  గా చెప్పాలంటే...నేను నిన్ననే జాబ్ లో జాయిన్ అయ్యాను....సాలరీ రావడానికి నెల పడుతుంది...వొచ్చాక మీకు ఇస్తాను....."అంది ఇబ్బంది పడుతూ.
"ఇట్స్ ఓకే.....మనీ ఏమి అవసరం లేదు.....ఐ కెన్ మేనేజ్.....మీరు వెళ్లి స్కూటీ రిపేర్ చేయించండి..."అన్నాను. తాను నా వైపు రెండు క్షణాలు చూసి "ఐ అం ...మేఘన...."అంది నా వైపు చేయి చాపి. "ఐ అం విగ్నేష్....."అంటూ తనతో చేయి కలిపాను.
ఇది జరిగాక కొన్ని రోజులకి నేను మర్చిపోయాను, నా పనిలో బిజీ అయిపోతూ. ఒకరోజు బయట నుండి ఇంటికి వొస్తున్న మధ్యలో ఆకలేసి, KFC దెగ్గర ఆపి లోపలి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశాను.    ఫోన్ మోగుతుంటే జోబులో చేయిపెట్టి ఫోన్ తీసి నెంబర్ చూడకుండానే "హలో..."అన్నాను.     "హాయ్.....థిస్  ఇస్ ...మేఘన....."అంది.    సడన్ గా గుర్తురాలేదు,  ఈ మేఘన ఎవరు అని అనుకుంటూ ఆలోచిస్తున్నాను.    "గుర్తుపట్టలేదు కదూ....అదే అండి...కారు ఆక్సిడెంట్.....స్కూటీ....."అని తాను అంటూ ఉంటె, గుర్తుకు వొచ్చి   "యా..యా...ఐ గాట్ ఇట్....హాయ్...."అన్నాను నా నెంబర్ తన దెగ్గరకు ఎలా వొచ్చిందో అర్ధం కాక.   "థాంక్స్....గుర్తుపట్టారు....."అంది తను.   "అవును....హౌ యు గాట్ మై నెంబర్....."అన్నాను నేను.  "అదో  పెద్ద స్టోరీ లెండి....తర్వాత చెప్తాను.....అవును మీరు ఎక్క్డడ  ఉన్నారు...."అంది తను.   "KFC ....ఎం జి రోడ్...."అన్నాను. "అక్కడే ఉండండి...నేను వొస్తున్నాను ...."అని disconnect  చేసింది ఫోన్.  ఈ అమ్మాయికి నా నెంబర్ ఎలా దొరికింది, తన పేస్ ని visualize  చేసుకోవడానికి ట్రై చేశాను. అంతగా గుర్తు రాలేదు, ఎదో మసక మసకగా అంతే.
తింటూ గ్లాస్ లో నుండి  బయటకు చూసాను. స్కూటీ స్టాండ్ వేస్తూ కన్పించింది తనను చూడగానే గుర్తుపట్టాను. KFC  లోపలికి  వొస్తూ అటు ఇటు చూస్తున్న తనవైపు చేయి చూపాను. తను నవ్వుకుంటూ నా దెగ్గరకు వొచ్చి ఎదురుగ కూర్చుంది.
తనకు కూడా ఆర్డర్ చేశాను. "మా ఆఫీస్ దెగ్గర్లోనే ....అందుకే వొస్తాను అన్నాను....."అంది, పర్సు లో నుండి ఒక కవర్ తీసి టేబుల్ మీద పెడుతూ. "అవును నా నెంబర్ ఎవరు ఇచ్చారు....."అని అడిగాను. "మీ అమ్మ గారు....."అండి నవ్వుతు. "అమ్మనా. ...."అంటూ అర్ధం కానట్టుగా చూసాను తన వైపు. "ఆ రోజు మీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను....అది మీరు వెళ్లిపోతుంటే గుర్తొచ్చింది.....వెంటనే కార్ నెంబర్ నోట్ చేసుకున్నాను....RTA  ఆఫీస్ లో నాన్నగారి ఫ్రెండ్  పని చేస్తాడు.....సో.... మీ అడ్రస్ తెలుసుకున్నాను......అలా మీ అమ్మగారితో కలిసే అవకాశం వొచ్చింది...."అంది చొరవగా. నేను నవ్వుతు తన వైపు చూసి "నా అడ్రస్ ఎందుకు తెలుసు కున్నారు..."అన్నాను. "అయ్యో....మీకు డబ్బులు ఇవ్వాలి కదండీ....ఆరోజే చెప్పాను కదా సాలరీ వొచ్చాక ఇస్తాను అని....."అంది నా వైపు చూసి. "చ..చ..వొద్దు....మీ ఫస్ట్ సాలరీ మనీ ఇలా ఇవ్వొద్దు ...మీ ఇంట్లో వాళ్ళకో....మీకో ఎప్పుడు గుర్తుండి పోయేట్టుగా ఏదైనా కొనండి...."అన్నాను.  "భలే వారే...ఎదుటి వాళ్ళకి నష్టం చేసి ....మనము హాయి గా ఎలా ఉండగలుగుతాము....పర్వాలేదు..ఆ కొనేదేదో వచ్చే నెల ఐన కొనుక్కుంటాను...."ఏముంది అందులో అన్నట్తుగా చూసి కవర్ నాకు ఇవ్వపోయింది. "అది కాదు......నీ పేరు..నీ పేరు ...."అని నేను గుర్తుకు తెచ్చుకునేందుకు ట్రై చేస్తుంటే "మేఘన.......ఇప్పుడే ఫోన్ లో చెప్పాను కదండీ....."అంది మెల్లిగా. "సారీ....సారీ....మర్చిపోయాను....పర్లేదు మేఘన....నువ్వు ఉంచుకో..."అన్నాను తన వైపు చూసి. అంతలో బేరర్ ఆర్డర్ చేసింది తీసుకొచ్చాడు. కవర్ టేబుల్ మీద పెట్టింది మేఘన. అతను సర్వ్ చేసి వెళ్ళాక, "ప్లీజ్ తీస్కోండి...."అంది నా వైపు చూసి. "ఆకలేస్తుంది ....ఫస్ట్ తినండి....."అన్నాను నవ్వుతు తన వైపు చూసి. "అవును...నాకు కూడా....నేను ఈ రోజు లంచ్ కూడా చేయలేదు......"అంది నవ్వుతు. తాను తింటూ "అవును మీరు ఎం చేస్తారు....."అంది నా వైపు చూసి. "నథింగ్ ....ఎదో ఇలా  తింటూ తిరుగుతాను....."అన్నాను తన వైపు చిరునవ్వుతో చూస్తూ. "ఐతే మీ నాన్నగారు బాగా సంపాదించి ఉండాలి....మీ ఇల్లు కూడా చాల బాగుంది "అంది తింటూ. "నాన్న గారు లేరు....."అన్నాను. సారీ అన్నట్టుగా నా వైపు చూసి "నిజం చెప్పండి ...ఎం చేస్తారు మీరు...."అంది. "నిజమే చెప్తున్నాను....ఇలా తింటూ తిరుగుతాను..."అలాగే చిరునవ్వుతో చూస్తూ. "అలా ఊరికే తిరిగే వాళ్ళు ఐతే ఆ రోజే నాతో గొడవ పడి డబ్బులు తీసుకునే వారు..."అంది. నేను నవ్వుతు చూస్తూ "అంత కాళీ కాదు కానీ....ఎదో కొద్దిగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాను....."అన్నాను. "వావ్...నిజమా....అక్కడ ఇక్కడ జాబ్స్ చేసేకంటే అదే బెటర్....లెండి.....ఐతే బానే సంపాదిస్తున్నారన్నమాట....."అంది నా వైపు నవ్వుతు చూస్తూ.
నేను ఆ రోజు చాల కష్టపడాల్సి వొచ్చింది డబ్బులు తీసుకోకుండా ఉండడానికి. అడపా దడపా మధ్య మధ్య ఫోన్ చేసేది ఫ్రెండ్లీ గా మాట్లాడేది. తన న్యూ జాబ్ గురించి, మధ్య మధ్య నా స్టాక్ మార్కెట్ ఎలా ఉంది లాంటివి, అమ్మ గురించి, తను అడిగిన దానికి జవాబు ఇవ్వడమేకాని తన గురించి ఎప్పుడు అడగలేదు నేను, ఐ మీన్ వాళ్ల ఇంట్లో వాళ్ల విషయాలు.
ఒక రోజు సండే 11  గంటలు ఇంటికి వొచ్చింది. నేను ఇంకా లేవలేదు, నైట్ ఫ్రెండ్ birthday  పార్టీ ఉండడం వల్ల early  hours  లో ఇంటికి వొచ్చాను. మంచి నిద్రలో ఉంటె అమ్మ వొచ్చి లేపింది నా కోసం ఎవరో వొచ్చారు అని. నేను నిద్ర మత్తులో అలాగే బయటకు వొచ్చాను, షార్ట్ మాత్రం వెస్కొని. తాను నవ్వుతు నా వైపు చూసింది. తను ఇంటికి వొస్తుంది అని ఎక్సపెక్ట్ చేయని నేను అయోమయంగా తన వైపు చూసి హాయి చెప్పాను, అప్పటికి గాని గుర్తుకు రాలేదు నేను షర్ట్ లేకుండా ఉన్నాను అని. జస్ట్ ఏ  మినిట్ అంటూ నేను నా బెడ్ రూమ్ లోకి వెళ్తుంటే   "ఆంటీ ....ఈ రోజు నా బర్త్ డే  …స్వీట్ ఇద్దాము  అని వొచ్చాను...."అని అమ్మతో చెప్తున్న  మాటలు వినపడేసరికి వెళ్ళేవాడిని  ఆగి వెనకకు వొచ్చి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ birthday  అని చెప్పాను. హాఫ్ నేకేడ్ గా ఉన్న నన్ను చూసి కొంచెం సిగ్గుపడుతూ థాంక్స్ అంది.
నేను వెళ్లి రెడీ అయి వొచ్చేలోపు అమ్మతో మాట్లాడుతుంది పక్కన కూర్చొని. ఆ అమ్మాయి కలుపుగోలు తనం కి అమ్మ బాగా ఇంప్రెస్స్ అయినట్టుగా ఉంది. ఇంట్లో మనిషి లాగే ఆప్యాయంగా మేఘనతో మాట్లాడుతుంటే "మా అమ్మను బాగా ఇంప్రెస్స్ చేసినట్టున్నావు...."అంటూ వెళ్లి అమ్మ కు ఇంకో పక్క కూర్చున్నాను. "అవును రా....అమ్మాయి బర్త్ డే అంటూ స్వీట్ తీస్కొని వొచ్చింది ....గిఫ్ట్ ఏమి ఇవ్వవా...."అంది నా వైపు చూసి నవ్వుతు. అమ్మ అలా అంటుందని ఎక్సపెక్ట్ చేయని నేను ఎదో అనేలోపు "లేదు ఆంటీ.....అలాంటిది ఏమి అవసరం లేదు.....తనకు ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వుంది.....అందుకే ఇంటికి వొచ్చాను....మిమ్మల్ని కూడా కలిసినట్టుగా ఉంటుంది అని..."అంటూ అమ్మ వైపు చూసింది. "పర్లేదు అమ్మ....నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రా...."అంది ఆప్యాయంగా అమ్మ. నేను మేఘన వైపు చూసి "నా ఫోన్ ఛార్జింగ్ అయిపొయింది నైట్....మర్చిపోయాను ఛార్జింగ్ పెట్టడం.....అవును....ఎం గిఫ్ట్ కావాలి నీకు...."అన్నాను. "ఒరేయి....ఎవరైనా అలా అడుగుతారా...గిఫ్ట్ ఎం కావాలి అని....మనకు నచ్చింది ఇవ్వాలి గాని...."అంది అమ్మ. అమ్మ సంతోషం గా ఉండడం నాకు చాల సంతోషం అనిపించి "మా అమ్మను ఇలా సంతోషం గా చూసి చాల రోజులు అయ్యింది...నీకు వీలు ఉన్నప్పుడల్లా వొచ్చి అమ్మను కలిసి వెళ్తుండు....."అన్నాను నాకు కూడా సంతోషం వేసి. "వీడు అంతే అమ్మ...ఏమి అనుకోకు....ఏదున్నా ముఖం మీదే చెప్తాడు...."అంది నా తల మీద చిన్నగా కొడుతూ, అందరి తల్లుల్లాగే అమ్మ కూడా. "పర్వాలేదు ఆంటీ..వీలు ఉన్నప్పుడల్లా మీతో కలవడానికి తప్పక వొస్తాను.....గిఫ్ట్ లాంటివి ఏమి వొద్దు..."అన్న కూడా అమ్మ పట్టుబట్టి మరి నాతో గోల్డ్ చైన్ తెప్పించి తనకు ఇచ్చింది.
అమ్మ తన వల్ల కొంచెం సంతోషం గా ఉండడం వల్ల కాబోలు నేను తనతో ఇంకా క్లోజ్ అయ్యాను. కొద్ది కాలంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. ఎంతలా అంటే నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు తనతో షేర్ చేసుకున్నాను.  క్రమ క్రమంగా మా స్నేహం, మా రెండు కుటుంబాల మధ్య కూడా స్నేహానికి దారి తీసింది. ఉన్నంతలో వాళ్ళు కూడా హాయిగానే ఉన్నారు. మేఘన ఒక్కతే కూతురు. చిన్న ఇల్లు ఐన కూడా సొంత ఇల్లే. మేఘన తల్లిదండ్రులు కూడా మా ఇంటికి రావడం, అమ్మ కూడా వాళ్ళింటికి  నేను లేకుండా కూడా వెళ్లడం అలా మా మధ్య ఒక బంధం లాంటిది ఏర్పడింది.
కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఉన్నట్టుండి అమ్మ నాతో "ఎరా....నేను నిన్ను ఒకటి అడగనా....."అంది టిఫిన్ చేస్తున్నపుడు. ఏంటి అన్నట్టుగా అమ్మ  వైపు చూసాను. "అది కరెక్టో కాదో నాకు తెలియదు రా....కానీ మేఘన నీకు భార్య అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది....కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను.....నీతో చెప్తాము అని....చూడడానికి ఈడు జోడు కూడా బాగుంటుంది మీ ఇద్దరిది..."అంటూ నా వైపు చూసింది. నేను అమ్మ అలా అడుగుతుంది ఊహించనైనా ఊహించలేదు.  "అమ్మ....తను నా ఫ్రెండ్ మా.....నేను ఎప్పుడు తన గురించి అలా ఆలోచించలేదు.....నాకు పెళ్లి చేయాలనే తొందర్లో నువ్వు ఏదేదో ఉహించుకోకు....తనకు కూడా నా మీద అలాంటి ఉదేశ్యం ఉన్నట్టుగా ఎప్పుడు అనిపించలేదు..." అన్నాను అమ్మ వైపు చూసి. తర్వాత అమ్మ ఏమి మాట్లాడలేదు.
నేను మాములుగా బయటకు వెళ్ళాను.
సాయంత్రం అమ్మ నాకు ఫోన్ చేసింది మేఘన ఇంటికి రమ్మని, తను అక్కడే ఉన్నాను అంది. నాకు అర్ధం కాలేదు. నేను మేఘన ఇంటికి వెళ్లేసరికి అమ్మ మేఘన  తల్లిదండ్రులతో నవ్వుతు మాట్లాడుతుంది. మేఘన కోసం చూసాను. "మేఘన ఇంకా రాలేదు రా..."అంది అమ్మ నవ్వుతు.  అక్కడి పరిస్థితులు చూసేసరికి అమ్మ వాళ్ళను మేఘనతో నా పెళ్లి కి వొప్పించిందని అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నాకు అంత అయోమయంగా ఉంది. నేను ఎప్పుడు మేఘన ని ఆ అంగెల్ లో చూడలేదు. ఒక మంచి స్నేహితురాలిగా మాత్రమే చూసాను. తను కూడా నన్ను అలాగే భావిస్తుందని నా గట్టి నమ్మకం. వాళ్ళ మాటలను బట్టి ఇంకా ఈ విషయం మేఘనకు తెలియదని నాకు అర్ధం అయ్యి, కొంచెం uneasy   గా ఫీల్ అయ్యాను.
[+] 1 user Likes rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:50 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 3 Guest(s)