Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#22
ఇంటికి వొచ్చి ఫ్రెష్ గా స్నానం చేసి టిఫిన్ కానిచ్చి....పడుకున్నాను....ఈవెనింగ్ మీటింగ్ కి ఫ్రెష్ గా వెళ్లాలని. ఈవెనింగ్ వినూత్న ఫోన్ చేసింది డైరెక్ట్ వాళ్ళ బాస్ పర్సనల్ ఫామ్ హౌస్  లో  మీటింగ్ ఫిక్స్ అని, కారు కూడా పంపిస్తాను అని.

నేను ఫామ్ హౌస్ కి చేరుకునేసరికి ఇంచుమించు ఎనమిది అయ్యింది. నా కోసమే వెయిట్ చేస్తున్నారు. చాలా luxurious  గా వుంది ఆ ఫామ్ హౌస్. అందర్నీ ఓ మారు  చూసాను. దేవదానం కూల్ గా ఉన్నాడు, లారీసా నేను ఎలా డీల్ చేయబోతున్నానో అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది. వినూత్న ఐతే చాలా టెన్షన్ పడుతున్నట్టుగా వుంది, బహుశా తనకు ఎంత రాబోతుంది నేను తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉందనుకుంటాను. నేను నవ్వుతు అందర్నీ పలకరించాను.
"వెల్.....విగ్నేష్ ...నిన్ను మళ్ళి కలవడం నాకు ఆనందం గా వుంది...."  అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు దేవదానం. "మీ టు  సర్...."అన్నాను polite  గా.   సోఫాలో కూర్చున్నాక "నీ...ట్రేడింగ్ ఎలా వుంది...."అన్నాడు దేవదానం. నేను నవ్వుతు "గుడ్ సర్....."అన్నాను. "మాకు కూడా నేర్పించవయ్యా....ఎప్పుడు నేను డబ్బులు పెట్టిన పోవడమేకాని రావడంలేదు...."అన్నాడు నవ్వుతు.   "మీకెందుకు సర్ ట్రేడింగ్....అది...."అన్నాను ఏమనాలో అర్థంకాక.    "వెల్..యంగ్ బాయ్...నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించెను అంటే....మేము పెద్ద ఫ్యాక్టరీ కట్టబోతున్నాము ఫారిన్ కోలాబరేషన్  తో.. ఇట్స్ బిగ్గెస్ట్ వన్ ఇన్ సౌత్ సైడ్....అందుకోసం ఇన్ అండ్ అరౌండ్ 500  ఎకరాల  పై చిలుకు ల్యాండ్ కొన్నాము. మాక్సిమం ల్యాండ్ నీ ల్యాండ్ వెనకాల వుంది...రోడ్ ఫేసింగ్ నీ సైడ్ నుండి ఐతే బాగుంటుందని అనిపించి, దట్  టు  ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ అవుతుంది....అందుకే ఈ మీటింగ్...."అని ఆపి నా వైపు చూసాడు.      "నాకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఏ ల్యాండ్ సర్....." అన్నాను మాములుగా అతని వైపు చూస్తూ. "50  ఎకరాలు...అదే హోటల్ కి ఎదురుగా వుంది చూడు....నేను కూడా వెళ్లి చూసాను ఆ ల్యాండ్ "అన్నాడు దేవదానం. "ఓ ...అదా...సర్....కానీ ....అందులో నేను ఫామ్ హౌస్ కడదాము అనుకుంటున్నాను....వాటర్ సోర్స్ కూడా బాగుంది అందులో ."అన్నాను, అలాంటి ఉదేశ్యం ఏమి లేకున్నా కూడా.    "నీకు ఎంత కావాలో అడుగు...ఆ ల్యాండ్ కావాలి నాకు..ఆ ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే లోకల్ వాళ్లకు ఉద్యోగాలు కూడా దొరుకుతాయి.."అన్నాడు. "మీరు ఇంత సడన్ గా అడిగితె ఎలా డిసిషన్ తీసుకోవడం...వినూత్న కూడా నాకు చెప్పలేదు...."అన్నాను వినూత్న వైపు చూసి. తను తల కిందకు వేసుకుంది. "ఇప్పుడు అడుగుతున్నాను కదా..."అంటూ వినూత్న వైపు చూసి "విన్ను....ఆ ఏరియా లో ఎకరాకు ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత వుంది...."అని అడిగాడు వినూత్నని. "సర్.....మెయిన్ రోడ్ అయితే పది   లక్షల వరకు "అంది వినూత్న. "సో...ఐదు కోట్లు  ..."అంటూ నా వైపు చూసాడు ఏమంటావు అన్నట్టుగా. నేను నవ్వుతు "ఇప్పుడు నాకు డబ్బులు అవసరం లేదు సర్....ఆ డబ్బు మళ్ళి ఎక్కడో ఒకచోట పెట్టాల్సిందే...."అన్నాను.
"నీకు ఎంత కావాలో చెప్పు....." అన్నాడు  స్ట్రీట్ గా పాయింట్ కి వొస్తూ.    "ఎంత అడిగితె అంత ఇవ్వగలరా....."అన్నాను అదే చిరునవ్వుతో.   సైలెంట్ గా లారీసా, వినూత్న నన్నే observe  చేస్తున్నారు.
"అడిగి చూడు...."అన్నాడు దేవదానం కూల్ గా. నేను సర్దుకొని కూర్చొని   "వెల్...సర్....20  కోట్లు అండ్ మీరు పెట్టబోయే కంపెనీ ఒక లక్ష షేర్స్...ఇవేకాకుండా మీరు ఎం.జి రోడ్ లో కట్టబోతున్న కమర్షియల్ కాంప్లెక్స్ లో స్పేస్......"అంటూ తన వైపు చూసాను. తను నా వైపు కాసేపు చూసి, వినూత్న వైపు చూసాడు, వినూత్న తల దించుకుంది, ముఖం ఎర్రగా అవడం నాకు తెలుస్తూనే వుంది. లారీసా వైపు చూసాను గ్రేట్ అన్నట్టుగా చూసింది. మనసులో calculate  చేసుకున్నట్టుగా ఉన్నాడు "అది చాలా పెద్ద అమౌంట్...నువ్వు ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత వచ్చే రేట్ అడుగుతున్నావు అన్ని కలిపి....."అన్నాడు కొంచెం అసహనం అతనిలో. "మీరు పెట్టబోయే ఫ్యాక్టరీ తో పోల్చుకుంటే చాలా తక్కువ సర్....మీరు ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత నా ల్యాండ్ అమ్ముకుంటే ఎంత వస్తుందో  నాకు తెలుసు...."అన్నాను నవ్వుతు. "బానే వాడవు బుర్రని ...."అన్నాడు నవ్వుతు దేవదానం. "మీ కంటేనా.....సర్...."అంటూ దేవదానం వైపు చూసాక, వినూత్న వైపు చూసాను. తన ముఖం కందగడ్డలా అయ్యింది. ఈ డీల్ లో తనకు ఎక్కువ అమౌంట్ రావడంలేదు అని calculate  చేసుకుంది అనుకుంట తను. చిరునవ్వుతో లారీసా వైపు చూసాను. తన ముఖం వెలిగిపోవడం గమనించాను. నిజానికి నేను అడిగింది చాలా ఎక్కువ. వన్ షాట్ త్రి బర్డ్స్ లా...అలోచించి ప్లాన్ చేశాను. ఇటు దేవదానానికి  ఎక్కువ అమౌంట్ పోవాలి...వినూత్నకి, జావేద్ కూడా ఎక్కువ అమౌంట్ రావొద్దు. ఇంకా పొడిగించడం తన గొయ్యి తానె తొవ్వుకోవడం అనుకున్నాడేమో "వెల్....యంగ్ బాయ్....డన్.....మిగిలిన ఫార్మాలిటీస్ రేపటి నుండి స్టార్ట్ చేద్దాము...."అంటూ లేచాడు దేవదానం.
ఇంటికి వొచ్చాక  uneasy  గా అనిపించి సోఫా లో కూలబడ్డాను. ఈ రెండు మూడురోజుల నుండి జరుగుతున్న సంఘటనలన్నీ ఒక్కొక్కటి అనలైజ్ చేసుకున్నాను. ఎందుకో  కానీ జావేద్, వినూత్న చేసింది పెద్దగా తప్పు అనిపించలేదు. ఎవరైనా డబ్బు కోసమే కదా కష్టపడేది, వాళ్ళు కూడా వాళ్ళ   వే   లో ఆలోచించారు.   ఇలా పాజిటివ్ గా ఆలోచించేసరికి మనసు కొంచెం రిలాక్స్ అనిపించింది.     ఎందుకో అమ్మకు ఫోన్ చేయాలి అనిపించింది ఫోన్ చేసి కాసేపు మాట్లాడాను. తాను బంధువుల మధ్య కొంచెం సంతోషం గా ఉండడం చాల సంతోషం అనిపించింది.
అమ్మతో మాట్లాడక,  సోఫా లో వెనక్కు వొరిగి అలాగే కళ్ళు మూసుకున్నాను. సిరి, హేమలత గుర్తుకు వొచ్చారు. మనసంతా బాధగా అనిపించింది. సిరి ఉండి ఉంటె నా జీవితం ఇంకోలా ఉండేదేమో.....లేని వాటి మీదే మనకు మమకారం ఎక్కువగా ఉంటుందా...ఏమో.... అన్ని  గజిబిజి ఆలోచనలు...డబ్బు వుంది....సోషల్ స్టేటస్ వుంది..నా చిన్నప్పటి జీవితం గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న స్థాయికి బంధువుల్లో కూడా మంచి పేరు వుంది...అన్ని ఉన్న ఎదో అసంతృప్తి.....ఎందుకు ....ఎందుకు....అలా ఆలోచిస్తుంటే నా మనసు పెళ్లి వైపు ఆలోచించింది.....పెళ్లి లేకుండా ఇవన్నిటికి విలువ ఉండదా......ఏమో...అంత గజిబిజి....సరే పెళ్లి ఇంపార్టెంట్ అయినప్పుడు.....పెళ్లి ఐన వారు కూడా చాల సంతోషంగా ఉన్నట్టుగా పెద్దగా నాకు కనిపించలేదు...ఎదో కొద్దీ మంది తప్ప....మరి సంతోషం ఎక్కడ వుంది.....డబ్బులో లేదా....relationships  లో లేదా.....మరి ఎక్కడ వుంది....ఏంటో అంత గందరగోళం.....బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నానా.....ఏమో ...ఏమో....ఇలా ఆలోచనల ఝరి లో ఉక్కిరిబిక్కిరి అయిపోయి అలాగే కలత నిద్ర పోయాను.
మరుసటి రోజు ఉదయమే  దేవదానం ఫోన్ చేసాడు ఆఫీస్ కి రమ్మని. నేను 11  కి వెళ్ళాను, నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు వెళ్ళగానే "రెండు కోట్లు అడ్వాన్స్ చాలా ?    "అన్నాడు దేవదానం. సరే అన్నట్టుగా చూసాను. "కాష్ or  డి డి ఏది కావాలి? "అన్నాడు. నేను కొంచెం అలోచించి "కాష్....."అన్నాను. "నేను విన్ను కి చెప్తాను....కలెక్ట్   చేస్కో....నేను ఢిల్లీ వెళ్తున్నాను.....వొచ్చాక రిమైనింగ్ ప్రాసెస్ ఫినిష్ చేద్దాము....అన్నట్టు....ఆ ట్రేడింగ్ ఎలా చెయ్యాలో నాకు నేర్పించవయ్యా...."అన్నాడు నవ్వుతు. నేను నవ్వుతు "అలాగే సర్...చూద్దాము....మీకు నాకు ఇద్దరకు టైం దొరికినప్పుడు తప్పకుండ నాకు తెలిసింది చెప్తాను...."అన్నాను. "వెల్ ....బాయ్....సి యు ఆన్ నెక్స్ట్   మండే....."అంటూ తాను వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక వినూత్న వొచ్చింది బాగ్ తీస్కొని. "సర్ మీకు ఇవ్వమన్నాడు...రెండు కోట్లు....లెక్క చూస్కోండి...."అంది నా వైపు చూసి. "నేను మనుస్యుల్ని నమ్ముతాను....."అంటూ తన వైపు చూసాను. తాను తల  దించుకుంది. "అవును...వినూత్న...ఈ డీల్ మీరు అనుకున్నట్టుగా ఫినిష్ అయితే నీకు ఆ జావేద్ కి ఎంత వొచ్చేది....."అన్నాను స్ట్రయిట్ గా తన వైపు చూస్తూ. తాను నా కళ్ళలోకి చూసి ఒక్క  క్షణం ఆగి "టు  బి  హానెస్ట్....వన్ క్రోర్... అది చాల పెద్ద అమౌంట్ నాకు...."అంది ఎలాంటి సంకోచం లేకుండా. నేను ఏమి మాట్లాడకుండా బాగ్ లోనుంచి డబ్బు తీసి లెక్కపెట్టి "మీ బాస్ అంత నేను ఇవ్వలేను కానీ ....50  లక్షలు తీస్కో....జావేద్ కి ఏమి ఇవ్వాల్సిన అవసరం  లేదు....అతని సంగతి నేను చూసుకుంటాను....."అన్నాను డబ్బు  టేబుల్ మీద పెట్టి లేస్తూ. తాను నోరెళ్లబెట్టింది. "వెల్......వినూత్న....నైస్ ఫర్ యువర్ కంపెనీ.....ఈ రెండు మూడు రోజులు చాల కష్టపడ్డావు...."అంటూ నేను అక్కడ నుండి బయలు దేరి వొస్తుంటే, తానూ పిలిచింది కానీ నేను వెనక్కు కూడా చూడ కుండ వొచ్చేసాను.
ఇంటికి వొచ్చి అమ్మకు ఫోన్ చేశాను. బోర్ గా ఉంది నెక్స్ట్ వీక్ వొస్తాను రా అంది. సరే అమ్మ నీ ఇష్టం అని అమ్మకు చెప్పి. జావేద్ దెగ్గరకు బయలు దేరాను.
నేను వొస్తాను అని ఉహించనట్టున్నాడు నేను వెళ్ళగానే కారు  దెగ్గరకు పరుగున వొచ్చాడు. "అన్నా  ఫోన్ చేయలేదు...."అన్నాడు. నేను నవ్వుతు కారు దిగి "అదే ఫెన్సింగ్ పని ఎంత వరకు వొచ్చిందో చూద్దాము అని వొచ్చాను...."అన్నాను కారు  లో నుండి బాగ్ తీసి భుజానికి వేసుకుంటూ. "అన్నా...అది....వర్కర్స్ ఎవరు దొరకలేదు ఇంకా....."అన్నాడు నసుగుతూ జావేద్. "అవునా....సరే పద...కాఫీ తాగాలి అని ఉంది ..."అన్నాను తన వైపు చూసి. 
ఇంట్లోకి వెళ్ళాము, నన్ను చూసి వాళ్ళ నాన్న అమ్మ పలకరించారు. నేను చైర్ లో కూర్చుంటే  కాఫీ తీస్కొని అలియా వొచ్చింది. నా వైపు వోరగా చూసి మెల్లిగా నవ్వి కాఫీ ఇచ్చింది.  నేను బాగ్ లో నుండి 20  లక్షలు తీసి టేబుల్ మీద పెట్టి "జావేద్.....ఇది తీస్కో....."అన్నాను. అర్ధం కానట్టుగా నా వైపు చూసాడు. "ల్యాండ్ అమ్మాను.....ఇది నీ షేర్.....వినూత్న నీకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేది కాదు...."అన్నాను సూటిగా తన వైపు చూసి.  చప్పున తల దించుకున్నాడు జావేద్. నేను కాఫీ తాగి లేచి "ఫెన్సింగ్ ఎం అవసరం లేదు ....జావేద్.....కావాలంటే నీ ల్యాండ్ కి వేయించుకో...."అంటూ బయటకు రాబోతుంటే "గల్తీ హోగయి అన్నా.....ముజే మాఫ్ కరో....."అన్నాడు వొచ్చి నా చేతులు పట్టుకుంటూ "పర్లేదు....జావేద్....నీ తప్పమి లేదు....ఆ డబ్బు ఉంచుకో....చెల్లి పెళ్ళికి పనికొస్తుంది....."అన్నాను. జావేద్ నాన్న కల్పించుకుంటూ "బేటా...ఉనే మాఫ్ కరో హమ్ సబ్ లోగోమ్ కో దేఖ్ కర్..."అన్నాడు. "అదేం లేదు..ఛీచా .....ముఝే కుచ్ బి గుస్సా నహి  జావేద్ పర్...."అన్నాను జావేద్ నాన్న వైపు చూసి. జావేద్ వైపు చూసి "ఇవన్నీ వొదిలేయి....హోటల్ బిజినెస్ ఎలా ఉంది....."అన్నాను. "బానే ఉంది అన్నా....అన్నా అలియా కి ఏదైనా జాబ్ చూడన్న... "అన్నాడు జావేద్.
"జాబ్ నా...నీ హోటల్ బిజినెస్ బానే ఉంది కదా..జాబ్ ఎందుకు ...."అన్నాను జావేద్ వైపు చూసి. "ఎం లేదన్న....తనకు బోర్ గా ఉందంట...డిగ్రీ కూడా చేసిందికదా...."అన్నాడు నసుగుతూ జావేద్. "సరే...ట్రై చేస్తాను....."అని చెప్పి అక్కడినుండి బయలు దేరాను.
కార్ డ్రైవ్ చేస్తుంటే చందన ఫోన్ చేసింది. "హౌ అర్ యు సర్..."అంది. "ఐ అం ఫైన్...వాట్ అబౌట్ యు...."అన్నాను. "సర్ పక్క గా వస్తారా సాటర్డే మా ఉరికి .....ఎందుకంటే నేను పర్మిషన్ తీసుకోవాలి....."అంది చందన. "హ....నేనే ఫోన్ చేద్దాము అనుకున్నాను ఈ రోజు...sure  గా వెల్దాము. సాటర్డే మార్నింగ్ నేను మీ హాస్టల్ కి వొస్తాను...
ప్లేస్ చెప్పు…” అన్నాను. తాను ఎలా రావాలో చెప్పింది. తనతో కాసేపు మాట్లాడి, ఇంటికి వొచ్చాను.
ఎందుకో కాసేపు ప్రశాంతంగా పడుకోవాలి అనిపించింది. స్నానం చేసి, హాయిగా పడుకున్నాను సాయంత్రం వరకు.
నాకున్న ఫ్లాట్స్ లో ఒక ఫ్లాట్  tenant  కాళీ చేసి వెళ్లారు, దానికి పెయింటింగ్ వేయించడానికి పెయింటర్ ని పిలిచాను, వాడికి వర్క్ చెప్పి నైట్  బోర్ గా ఉందని క్లబ్ కి వెళ్ళాను, పాత ఫ్రెండ్స్ కి కల్సి చాల రోజులు అయ్యింది అని.
సాటర్డే చందన హాస్టల్ కి వెళ్ళాను. ఫ్రెండ్స్ అందర్నీ పరిచయం చేసింది. అందరం కలిసి పక్కన ఉన్న  కాఫీ షాప్ కి వెళ్లి కాసేపు అక్కడ ఉండి, చందన నేను వాళ్ళ ఉరికి బయలు దేరాము.
దారిలో చందన తన గురించి అంత చెప్పింది. ఎలా ప్రోబ్లెంస్ పేస్ చేసింది. వాళ్ళ ఉరికి చేరుకునేసరికి సాయంత్రం ఆరు అయ్యింది. అది చిన్న పల్లెటూరు, ఊర్లోకి కారు వొచ్చేసరికి జనాలు చాలా మంది చందన ఇంటికి వొచ్చారు. చందన వాళ్ళది చిన్న ఇల్లు. చందన వాళ్ళ తాతను, చెల్లిని  పరిచయం చేసింది.  జనాల హడావిడి తగ్గాక. ఇంటి ముందు మంచంలో కూర్చున్నాను. చందన వాళ్ళ తాత ఆ ఊర్లో ఉన్న బాధల గురించి చెప్తుంటే విన్నాను.
చందన చెల్లి వొచ్చి నా పక్కన కూర్చుంది, నేను తల మీద చేయి వేసి నిమిరి " వొస్తావా....మీ అక్క దెగ్గరకు..."అన్నాను చిరునవ్వుతో.   "ఓ.....కానీ అక్క అక్కడ ఉంచుకోవడం కుదరదని చెప్పింది...."అంది నా వైపు చూస్తూ.   నేను నవ్వుతు "నీ పేరేంటి....."అన్నాను.   "వందన...."అంది తను. "రేపు వెల్దాము.... వొస్తావా....మాతో పాటు...."అన్నాను. నిజమా అన్నట్టుచూసింది అపనమ్మకంగా. నేను నవ్వుతు వాళ్ళ తాతయ్యతో "వందన ...కి ట్రీట్మెంట్ ఇప్పిద్దాము అనుకుంటున్నాను....మీరు కూడా రండి....వాళ్ళతో పాటు మీరు ఉంటె వాళ్ళకి దైర్యంగా ఉంటుంది....."అన్నాను.   "మీకెందుకు బాబు అంత శ్రమ....అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.....గవర్నమెంట్ ఆఫీస్ లో దరఖాస్తు చేసాము.... ...MLA   గారిని కూడా కలిసాము... ఏమవుతుందో  చూద్దాము... వాళ్ళు రేపు మాపు అంటూ తిప్పుతున్నారు......"అన్నాడు నిట్టూర్చుతూ వాళ్ళ తాత. "అవును సర్...మీ కెందుకు అంత శ్రమ.....మీరు సరదాకి ఊరుకి చూడడానికి వొస్తారనుకున్నాను..."అంది మధ్యలో కల్పించుకుంటూ చందన.  నేను అంతా విని వందన  వైపు తిరిగి "ఏంటి ...వొస్తావా..."అంటూ తన వైపు చిరునవ్వుతో చూసాను. "హా...కానీ....."అంటూ అక్క వైపు, తాత వైపు చూసింది. నేను చందన వైపు చూసి "చూడు చందన....సెంటిమెంట్స్ అన్ని పక్కన పెట్టి నాతో రండి....తనకు ట్రీట్మెంట్ చాల అవసరం....మీకు కావాల్సిన ఆరెంజిమెంట్స్ అన్ని చేసే వొచ్చాను.....తాతను కూడా తీస్కొని రా...మీకు మోరల్ సపోర్ట్ గా ఉంటుంది....అమ్మతో కూడా చేప్పాను మీ విషయం...ఏమైనా హెల్ప్ కావాలంటే అమ్మ కూడా మీకు సహాయంగా ఉంటుంది...ఇంకేమి ఆలోచించకండి..."అన్నాను ఫిర్మ్ గా చందనతో. "కానీ ...సర్.....ఇది చాల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.....మేము మీకు అనవసరంగా బర్డెన్ అవుతామేమో...."అంది చందన. "అవును...బాబు...అమ్మాయి చెప్పింది కూడా కరెక్ట్ నే...."అన్నాడు చందన తాత.
 "మీరు అవన్నీ ఎం ఆలోచించకండి....డబ్బుకి ఎం ఇబ్బంది లేదు నాకు....."అన్నాను వాళ్ళతో. వాళ్లకు ఇంకా ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు. వందన కళ్ళలో ఒక ఫ్లాష్ లాంటి వెలుగు చూసి ఎందుకో కొంచెం సంతోషంగా అనిపించింది నాకు. రాత్రి భోజనాలు అయ్యాక ఆ ఊరి సర్పంచ్ వొచ్చాడు. స్కూల్ శిధిలావస్థలో వుంది సాధ్యమైతే ఏమైనా హెల్ప్ చేయమని అడిగాడు. ట్రై చేస్తాను అని చెప్పాను తనతో.
[+] 1 user Likes rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:56 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 2 Guest(s)