Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కింద అప్పుడే నా బుజ్జితల్లి బుజ్జి పట్టు పరికిణీలో రెడీ అయ్యి సోఫాలో కూర్చుని బూస్ట్ తాగుతూనే నాకోసమన్నట్లు సిప్ సిప్ కూ పైకిచూస్తూ ...... డాడీ అంటూ కప్ అక్కడే ఉంచేసి పైకి పరుగునవచ్చింది .
బ్యూటిఫుల్ నా బుజ్జితల్లి నిజంగానే బుజ్జిదేవతలా రెడీ అయ్యింది అంటూ ముద్దులు కురిపిస్తూ కిందకువచ్చాను .
అల్లుడుగారూ ....... టీ తాగుతారా ? .
వద్దులేండి అత్తయ్యగారూ ....... మీ పెద్ద కూతురు చేతి కాఫీ తాగాను - అక్కడికి వెళ్ళాక మీ చిన్నకూతురు చేతి కాఫీ ఎలానో తాగాలికదా .......
నా మాటలకు అత్తయ్యగారి ఆనందాలకు అవధులు లేవు . ఇద్దరు కూతుర్లు - ఒక బుజ్జితల్లి ....... అంటూ మురిసిపోతున్నారు .
బుజ్జితల్లి : అమ్మమ్మ సో హ్యాపీ డాడీ అంటూ ముద్దులుపెట్టింది . డాడీ ...... మమ్మీ ఎక్కడ ? .
నేను ఉంటే ఆలస్యం అవుతుందని తోసేసింది బుజ్జితల్లీ .......
అత్తయ్యగారు ముసిముసినవ్వులతో వెళ్లిపోయారు .
బుజ్జితల్లీ ....... మీ తాతయ్య ఎక్కడ ? .
అత్తయ్యగారు : ఊరిజనాన్ని గుంపుగా వేసుకుని తెగ మాట్లాడుతున్నారు - ఆ పెద్దతనాన్ని ఇచ్చినది నువ్వే కదా అల్లుడూ ....... థాంక్యూ .
పెద్దయ్య ఎప్పుడూ అలా పెద్ద స్థాయిలోనే ఉండాలి - ఉంటారు .......

ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్ ......
పైకిచూస్తే నిన్న సాయంత్రం సెక్సీ గాడెస్ - ఇప్పుదు పూర్తి అపోజిట్ గా దివినుండి దిగివచ్చిన దేవతలా పట్టుచీర - నగలతో .......
బుజ్జితల్లి : బ్యూటిఫుల్ మమ్మీ .......
సంతోషంతో బుజ్జితల్లిని ఎత్తుకుని కిందకు దిగిన దేవత దగ్గరికి వెళ్లి లవ్ యు శ్రీమతిగారూ అంటూ చేతిని అందుకుని ముద్దుపెట్టాను .
దేవత : లవ్ యు శ్రీవారూ ....... అంటూ నా గుండెలపైకి చేరింది .
బుజ్జిదేవత - దేవత ....... నా గుండెలపై ...... అదృష్టవంతుడిని .....
దేవత : దేవుడి గుండెలపై - మేము అదృష్టవంతులం , తొందరగా వెళితే బుజ్జిదేవతతోపాటు మీ ప్రాణమైన దేవకన్యను కూడా గుండెలపైకి తీసుకోవచ్చు .

అత్తయ్యగారూ .......
రెడీ అల్లుడుగారూ అంటూ బయటకువెళ్లి మామయ్యగారిని పిలిచారు .
బుజ్జితల్లి : డాడీ డాడీ ..... కొత్త కారులో .......
లవ్ టు బుజ్జితల్లీ అంటూ బుజ్జితల్లిని ...... దేవతకు అందించి , లోపలికివెళ్లి కీస్ మరియు నా బుజ్జితల్లి బుజ్జి కారుని ఎత్తుకునివచ్చాను . బుజ్జితల్లీ ...... మీ అత్తయ్య ప్రేమతో కొనిచ్చిన బుజ్జి కారులో కూర్చుని రౌండ్స్ వెయ్యడం మీ అత్తయ్య చూసి ఆనందించాలికదా అంటూ కొత్త కారుపై ఉంచి తాడు కోసం చూస్తున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ తమ్ముళ్లు వచ్చి విషయం తెలుసుకుని తాడుతో సెట్ చేశారు . కీర్తీ తల్లీ ....... అన్నీ కార్లకంటే బుజ్జి కార్ సుపెరుగా ఉంది .
థాంక్యూ ....... , డాడీ డాడీ అంటూ నా గుండెలపైకి చేరింది .
దేవత : సాయంత్రం వరకూ పోటీ రాను లేవే బుజ్జిరాక్షసీ అంటూ బుజ్జితల్లి బుగ్గపై గిల్లేసి వెళ్లి అత్తామావయ్యలకోసం కారు డోర్ తెరవబోయింది .
అక్కడితో ఆగిపో గాడెస్ ...... , ఆ అదృష్టం నాది అంటూ వెళ్లి డోర్ తెరిచాను . పెద్దయ్య ఎప్పుడూ ఆ స్థాయిలో ఉండాలి అంటూ కూర్చున్నాక క్లోజ్ చేసాను .
దేవత : లవ్ యు శ్రీవారూ ...... నిన్ననే అన్నీ సమర్పించేసాను ఇక ఏమి ఇవ్వాలబ్బా ...... అంటూ ఏకంగా పెదాలపై లేలేత ముద్దుపెట్టింది .
యాహూ ........ అంటూ డోర్ తెరిచి , దేవత చేతిని అందుకుని ముద్దుపెట్టిమరీ కూర్చోబెట్టి , బుజ్జితల్లితోపాటు అటువైపుకు వెళ్లి కూర్చుని పోనిచ్చాను .

బుజ్జితల్లి : డాడీ ...... మీ దేవత కోపంతో నన్నే చూస్తోంది అంటూ మరింత గట్టిగా హత్తుకుంది .
దేవత : లేదులేవే , కోప్పడితే భయపడేదానివా నువ్వు , చీకటిపడ్డాక లాగేస్తాను నిన్ను అంటూ నా చేతిని చుట్టేసింది .
నాతోపాటు అత్తామావయ్యలు నవ్వుకున్నారు . ఇద్దరికీ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , బుజ్జితల్లీ - గాడెస్ - మావయ్యగారూ ....... మీకొక స్మాల్ సర్ప్రైజ్ .......
ఏమిటి డాడీ - ఏమిటి శ్రీవారూ ...... అంటూ నలుగురూ అడిగారు .
మరికొద్దినిమిషాలలో మీరే చూస్తారుకదా ....... , ఒక్కమాట మాత్రం చెబుతున్నాను మీ అత్తయ్య - నీ చెల్లి ....... చాలా చాలా హ్యాపీగా ఉండటం చూస్తారు .
అయితే తొందరగా తొందరగా పోనివ్వండి అంటూ రెండువైపులా ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
మీరు ఎన్ని ముద్దులతో రెచ్చగొట్టినా నార్మల్ స్పీడ్ ఈ స్పీడ్ లోనే ........ , మై ఫ్యామిలీ సేఫ్టీ ముఖ్యం నాకు ........
దేవత : ఇక్కడికిక్కడ బుజ్జిదెయ్యాన్ని లాగేసి .......
లాగేసి .......
దేవత సిగ్గుతో నా గుండెల్లో దాచుకుంది .

ఆనందిస్తూ బుజ్జితల్లి ముద్దులలో తడుస్తూ నిమిషాలలో హైవే చేరుకున్నాము . మై డియరెస్ట్ ఫ్యామిలీ సర్ప్రైజ్ ...... 3 2 1 .....
డాడీ - మై గాడ్ ....... రాత్రికిరాత్రి అత్తయ్య - చెల్లి ఊరివారకూ కూడా రోడ్ వేయించేసారన్నమాట ఉమ్మా ఉమ్మా ....... , సూపర్ సర్ప్రైజ్ .....
మిర్రర్ లో పెద్దయ్య సంతోషం కనిపిస్తోంది - రోడ్ ఇంకా హార్డ్ కాకపోవడంతో ప్రక్కనే ఉన్న మట్టిరోడ్డులో పోనిచ్చాను .
డాడీ ...... మావయ్య తాతయ్య కూడా .......
అంకుల్ - కృష్ణతోపాటు చాలామంది జనాలు ఉన్నారు .  కారుని ఆపి బుజ్జితల్లిని ఎత్తుకుని దిగేంతలో .......
అంకుల్ వచ్చి ఆపి , బాబూ మహేష్ - బావగారూ ....... మా సంతోషాలను పంచుకోవడానికి ఇక్కడికే వచ్చేసాము - మీరు కారులోనే ఉండండి - రేయ్ ఇంకా చూస్తారేమిటి మన దేవుడు వచ్చేశాడు వాయించండి ......
అంతే మహేష్ మహేష్ ....... నినాదాలు మరియు డప్పు వాయిద్యాలతో మారుమ్రోగిపోతోంది . 
అంకుల్ : బాబూ ...... రండి అంటూ ఊరివైపుకు నడిచారు . 
సంబరాల మధ్యన వెనుకే ఫాలో అయ్యాను . బుజ్జితల్లి - దేవత ఆనందాలకు అవధులులేనట్లు ముద్దులతో పంచుకుంటున్నారు .
సగం దూరం వెళ్ళాక కృష్ణను పిలిచి అంకుల్ ను కారులో పెద్దయ్య ప్రక్కన కూర్చునేలా చేసాను - చెల్లెమ్మ ఇంటివరకూ డప్పు వాయిద్యాలతో తీసుకెళ్లారు .

కారు దిగగానే బుజ్జితల్లీ - వదినా - అన్నయ్యా ...... అంటూ వచ్చి ముందుగా అత్తామావయ్యల ఆశీర్వాదం తీసుకుని బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దులుకురిపిస్తూ నా గుండెలపైకి చేరింది . బుజ్జితల్లీ ....... ఉదయం లేచి స్వచ్ఛమైన గాలికోసం కిటికీ తెరవగానే రోడ్డు దర్శనం ఇచ్చింది .
దేవత : నీకోసమే చెల్లీ ....... , నీవలన ఊరికోసం .
చెల్లెమ్మ : లవ్ యు లవ్ యు soooo మచ్ అన్నయ్యా .........
నాకైతే ఇంతకుముందు గుంతల రోడ్డునే బాగుండేది - నిన్న ఆ మాధుర్యం అంటూ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను .
దేవత : మిమ్మల్నీ అంటూ నడుముపై గిల్లేసింది .
స్స్స్ ...... అంటూ అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయాను .
ఊరిజనమంతా చుట్టూ చేరి అభినందనలు తెలిపారు . అందరికీ నమస్కరించి , మొత్తం క్రెడిట్ నాకే ఇచ్చెయ్యకండి రాత్రంతా దగ్గరుండి రోడ్డుని పూర్తిచేసినది మీ ఊరి పెద్దయ్య అంకుల్ ....... అంకుల్ లేకపోయుంటే ఇంత త్వరగా పూర్తయ్యేది కాదు .
అంకుల్ ను అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు . చెల్లెమ్మ - అంటీ ..... ఆనందబాస్పాలతో బుజ్జితల్లిని ముద్దులతో ముంచెత్తుతున్నారు .
సంతోషించి , అన్నలూ ...... ఈ రోడ్డు వేయించినది నేనే కానీ నేనుకాదు , నేను పనిచేస్తున్న కంపెనీ ***** - మా చైర్మన్ గారు కొన్నిగంటల్లో రాబోతున్నారు వారి ద్వారానే ఓపెన్ చేయిస్తే .......
అలాగే చెద్దాము అలాగే చేద్దాము - ప్రారంభ ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటుచేస్తాము - ఇలానే సంబరాలతో ఆహ్వానిస్తాము .
సంతోషం అన్నలూ ....... , రోడ్డు మాత్రమే కాదు ఊరి సమస్యలన్నీ కంపెనీ తీర్చబోతోంది , ఈ రెండు ఊర్లుమాత్రమే కాదు ఈ క్షణం నుండే మొదట వైజాగ్ చుట్టూ ఆ తరువాత ఒక్కొక్క జిల్లాల్లోని గ్రామాల సమస్యలన్నీ తీర్చబోతోంది .

అంతలో ఆశతో దూరంగా ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు దగ్గరికివచ్చి దండాలుపెట్టి నమస్కరించారు . 
పెద్దయ్య - అంకుల్ వచ్చి వీరంతా చుట్టుప్రక్కల గ్రామాల సర్పంచులు మహేష్ అంటూ చెప్పారు .
బాబూ బాబూ ...... ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా మారుమూల గ్రామాలకు రోడ్లు వేయడం లేదు - ఎన్నో ప్రమాదాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి .
పెద్దయ్యలూ ....... ఒక్క రోడ్లు మాత్రమే కాదు మీ ప్రధాన సమస్యలన్నీ కంపెనీ తీర్చబోతోంది - ఈపాటికే కొన్ని ఊర్లకు రోడ్ల పనులు మొదలైపోయి ఉంటాయి .
ఇద్దరు పెద్దయ్యలకు కాల్స్ రావడం - మాట్లాడి రేయ్ రేయ్ ...... రోడ్డుకు పూజా కార్యక్రమాలు చేస్తున్నారట అంటూ సంతోషంతో దండాలు పెట్టారు - బాబూ మీరు నిజంగా దేవుడు మా గ్రామాలకు తప్పకుండా రావాలి .
పెద్దయ్యలూ ...... మీ సమస్యలు విని తీర్చడానికి ఖచ్చితంగా వస్తాను .
చాలా సంతోషం దేవుడా అంటూ నినాదాలు చేస్తూ సంతోషంగా ట్రాక్టర్లలో వెళ్లారు .
అంకుల్ అంకుల్ ...... మీ సమస్యల లిస్ట్ రెడీ చేశారా మరి .......
అది ఇది అంటూ గుసగుసలాడుకుంటున్నారు ఊరిజనం .
ఒకటీ రెండూ కాదు అన్నింటినీ తీర్చేద్దాము లిస్ట్ రెడీ చేసి ఇవ్వండి అనిచెప్పి పంపించాను .

చెల్లెమ్మా చెల్లెమ్మా ....... సమస్యలు తీర్చడానికి ప్లాన్స్ వేయాలంటే శక్తి కావాలి - శక్తి కావాలంటే టిఫిన్ తినాలి - బాగా ఆకలివేస్తోంది . 
అన్నీ వంటలూ రెడీ బాబూ అంటూ అత్తామావయ్యలను గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు అంకుల్ - అంటీ .......
చెల్లెమ్మా ....... రాత్రంతా మొత్తం శక్తిని లాగేసుకుని కేవలం కేవలం కాఫీ మాత్రమే ఇచ్చింది మీ వదినమ్మ .......
నా పరిస్థితి కూడా అదే బావగారూ అంటూ కృష్ణ దీనంగా చెప్పాడు .
దేవత - చెల్లెమ్మ సిగ్గుపడటం చూసి నవ్వుకున్నాము .
దేవత : అమృతమంతా జుర్రేసుకుని ఒక్క బిందువునైనా షేర్ చేసుకోలేదు - అప్పుడు ఎవరు ఎక్కువ ఆకలితో ఉన్నట్లు ........ అంటూ చెవిలో గుసగుసలాడి కొట్టడానికి రావడంతో ........
నాతోపాటు కృష్ణకూడా లోపలికి పరుగులుతీసాడు . గుమ్మం బయట కావాలనే దొరికిపోయి దేవత దెబ్బలు మరియు ముద్దులు ఆస్వాదించి లోపలికివెళ్లాము . చేతులు శుభ్రం చేసుకుని అందరమూ కలిసి టిఫిన్ చేసాము .

అంటీ - చెల్లెమ్మా ...... అన్నిరకాల టిఫిన్స్ అధిరిపోయాయి . సూపర్ .......
థాంక్యూ బాబూ - లవ్ యు అన్నయ్యా ....... 
అంకుల్ : బావగారూ - బాబూ మహేష్ - అల్లుడుగారూ ....... మధ్యాహ్నం భోజనం తోటలో ఏర్పాటుచేసాము , అక్కడే వంటలు కూడా .......
మావయ్య గారు : చాలా సంతోషం బావగారూ ......
సూపర్ ప్రకృతిలో భోజనం - అంకుల్ ....... ఆపాటికి చైర్మన్ గారి ఫ్యామిలీ కూడా రావచ్చు .
అంకుల్ : ఇది మీ ఇల్లు బాబూ ...... , మీ ఇష్టమే మా ఇష్టం , అదృష్టం లా భావిస్తాము .  
చెల్లెమ్మ : లవ్ యు నాన్నగారూ ....... 
బుజ్జితల్లి : డాడీ ...... పాపకు గిఫ్ట్ ఇస్తానన్నారు .

పాప రావడానికి కొన్ని గంటలు పడుతుంది బుజ్జితల్లీ ...... తోటకువెళ్లి వంటలో సహాయం చేస్తూ ఆ సమయానికి నెమ్మదిగా తీసుకునివెళ్ళొచ్చు , మెసేజ్ రావడంతో చూసి బుజ్జితల్లీ - చెల్లెమ్మా ...... ఆ సమయం వచ్చేసింది , నిమిషాలలో ఫ్లైట్ బయలుదేరబోతోంది అని మెసేజ్ - గంటలో వైజాగ్ లో ల్యాండ్ అయిపోతుంది పాప ...... బ్యూటిఫుల్ బుజ్జి గిఫ్ట్ తీసుకోవాలి . The బెస్ట్ & బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చాను , బుజ్జితల్లీ - చెల్లెమ్మా - గాడెస్ ...... మీరే హెల్ప్ చెయ్యాలి , బావా ...... పదా వెళదాము . అంకుల్ - మావయ్యగారూ వెళ్ళొస్తాము .
అంకుల్ : అయితే ప్రారంభ ఏర్పాట్లు మొదలుపెట్టాలి అంటూ మాతోపాటు బయటకువచ్చి ఊరిజనాన్ని అలర్ట్ చేసి హడావిడి చేశారు .

బుజ్జితల్లిని ఎత్తుకుని చెల్లెమ్మ - దేవత వెనుక కూర్చున్నారు . కృష్ణ ముందుసీట్లో కూర్చున్నాడు - కారుని ఎలా స్టార్ట్ చెయ్యాలో చూయించి సిటీకి బయలుదేరాము . తమ్ముడు చంద్రకు కాల్ చేసి ఇంటిలో హాల్లోని హ్యంగర్ కు తగిలించిన కీస్ తీసుకుని కొత్త కారులో ఎయిర్పోర్ట్ కు రమ్మని చెప్పాను .
సిటీలోని బిగ్గెస్ట్ గిఫ్ట్ షాప్ లో సుమారు అర గంటపాటు ఇష్టంతో సెర్చ్ చేసి , బుజ్జితల్లి సెలెక్ట్ చేసిన బుజ్జి టెడ్డి బేర్ ను తీసుకున్నాము . అందరి పెదాలపై సంతోషమైన నవ్వులు .......
చెల్లెమ్మ - దేవత కూడా పాపకోసం గిఫ్ట్స్ మరియు మేడం కు వెల్కమ్ చెప్పడానికి లైవ్లీ రోజెస్ తీసుకున్నారు . సరిగ్గా ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి కొన్ని నిమిషాలముందు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . చంద్రకు hi చెప్పి లోపలిపిలుచుకునివెళ్లాము . అప్పటికే మా కంపెనీ మేనేజర్స్ - ఎంప్లాయిస్ ...... వేచిచూస్తూ నన్ను చూసి సెల్యూట్ చేసి సర్ సర్ అంటూ వచ్చారు - 5 మినిట్స్ లో లాండింగ్ అవుతోంది సర్ ........

చెల్లెమ్మ : అన్నయ్యా అంటూ బుజ్జితల్లిని నా గుండెలపైకి చేర్చి , బుజ్జితల్లికి గిఫ్ట్ అందించింది . 
నిమిషాలలో ల్యాండ్ అవ్వడం - ప్యాసెంజర్స్ తోపాటు చైర్మన్ - మేడం - పాప వచ్చారు .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ మేడం వచ్చి పాపను నాకు అందించి బుజ్జితల్లికి చేతితో ముద్దులుపెట్టి , మహీ మహీ ....... ఈ ఎయిర్పోర్ట్ లోకే మోస్ట్ బ్యూటిఫుల్ కాబట్టి నువ్వే మహి అంటూ అమాంతం కౌగిలించుకుంది .
దేవత : చెల్లెమ్మను పరిచయం చేసి , పూలతో వెల్కమ్ చెప్పారు .
మేడం : Wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లైక్ మహి - కృష్ణవేణి ...... థాంక్యూ థాంక్యూ అంటూ ఇద్దరినీ కౌగిలించుకున్నారు . చూసారా మహీ - కృష్ణవేణీ ...... మీ అంకుల్ దగ్గరికి వెళుతున్నాము అనిచెబితేనేకానీ ఫ్లైట్ ఎక్కలేదు , శ్రీవారూ ...... ఎంత గోల చేసింది , ఇప్పుడు చూడండి వాళ్ళ అంకుల్ - బుజ్జితల్లితో ఎంతలా నవ్వుతోందో .......
బుజ్జితల్లి ...... పాపకు ముద్దుపెట్టి గిఫ్ట్ ఇచ్చింది . దేవత - చెల్లెమ్మ కూడా వెళ్లి ఎత్తుకుని ముద్దుచేస్తూ గిఫ్ట్ అందించారు .
మేడం : బ్యూటిఫుల్ బుజ్జితల్లీ - ఫ్రెండ్స్ ...... , అన్నయ్యా - మహీ - కృష్ణా ...... పాప ఆనందాలు చూస్తుంటే మళ్లీ మాతోపాటు బెంగళూరు వచ్చేలా లేదు .
అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము .

మేనేజర్ వచ్చి చైర్మన్ సర్ ...... హోటల్ or బ్రాంచ్ అని అడిగారు .
నో నో నో ..... చైర్మన్ సర్ సాయంత్రం వరకూ మేడం - పాప మాదగ్గరే ఉంటారు , మీరు ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్లొచ్చు , మాతోపాటు వస్తే జీవితంలో గుర్తుండేలా హ్యాపీనెస్ ....... మీ ఇష్టం .
చైర్మన్ : అంతలా చెప్పాక రాకుండా ఉంటానా ...... ? , కృష్ణా ..... కార్ ఎక్కడ అంటూ భుజం చుట్టూ చేతినివేసి బయటకు నడిచారు. 
మేనేజర్స్ ....... evening సమయానికి అక్కడ ఉంటాము అనిచెప్పి రెండు కార్లలో చెల్లెమ్మ ఊరికి బయలుదేరాము .
హైవే నుండి టర్న్ కాగానే అప్పటివరకూ సైలెంట్ ఒక్కసారిగా డప్పు వాయిద్యాలతో మారుమ్రోగిపోయింది . బుజ్జితల్లి - పాపను రెండువైపులా ఎత్తుకుని కారుదిగి చైర్మన్ గారివైపు చూయించడం ఆలస్యం ఊరిజనం వెళ్లి ధన్యవాదాలు తెలిపి అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకున్నారు . 

ఆశ్చర్యం - షాక్ లో ఉన్న మేనేజర్ దగ్గరికివెళ్లి , రోడ్డువైపు చూయించాను .
చైర్మన్ : కొత్తగా వేసినట్లు ఉందే ......
రాత్రే పూర్తయ్యింది సర్ ...... , మీచేతులతో ప్రారంభం జరగాలన్నది గ్రామ ప్రజల కోరిక ....... , ఇలా చెప్పానని ఫస్ట్ నడవాలని ఆశపడకండి మొదట పాదాలు పాపవి అంతే .......
చైర్మన్ - మేడం : థాంక్యూ థాంక్యూ మహేష్ ...... , ఒక మంచిపని చేస్తే ఇంత ఆనందం కలుగుతుందా అంటూ కౌగిలించుకున్నారు .
చాలు చాలు సర్ ...... , గ్రామ ప్రజలతోపాటు వెళ్లి ప్రారంభిస్తే పాప తొలి అడుగులు వేస్తుంది .
మేడం : పాపతోపాటు బుజ్జితల్లి కూడా .......
అలాగే మేడం గారూ అంటూ ఆనందించి , పాప - బుజ్జితల్లి పాదాలకు కవర్స్ వేసి , చైర్మన్ గారు ప్రారంభించిన తరువాత , చెల్లీ ...... అంటూ పాపను అందించి బుజ్జితల్లిని కిందకుదించి చెల్లి మరొకచేతికి అందించాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ........
వెళ్లు చెల్లెమ్మా ...... అంటూ గుండెలపై దేవతను హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టాను .
దేవత : ఊరందరి కోరిక కూడా ఇదే చెల్లీ ....... , వెళ్లు వెళ్లు అంటూ ఫ్లయింగ్ కిస్సెస్ వదిలించి .
చెల్లెమ్మ : అంకుల్ - అంటీ - కృష్ణ ఆనందబాస్పాలతో పాటు చెల్లెమ్మ మావైపు చూస్తూనే పాపను ఎత్తుకుని - బుజ్జితల్లిని నడిపించుకుంటూ వెళ్లి , తమ అడుగులతోపాటు పాప అడుగులు వేయించారు .
ఆ ప్రాంతమంతా చప్పట్లు - కేకలు - డప్పు వాయిద్యాలతో మారుమ్రోగిపోయింది .
అన్నయ్యా - వదినమ్మా ...... అంటూ పాప - బుజ్జితల్లితోపాటువచ్చి మా గుండెలపైకి చేరింది చెల్లెమ్మ .
నీళ్లు తెప్పించి కవర్స్ తొలగించి పాదాలను శుభ్రం చేసాము - చెల్లెమ్మ శుభ్రం చేసుకుంది .
చైర్మన్ గారు ...... తనివితీరేంతవరకూ గ్రామప్రజలతో మమేకమయ్యారు . 
చైర్మన్ సర్ ...... ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి తోటలో భోజన కార్యక్రమాల దగ్గరికి వెళ్ళాలి అని ఇంటికి తోటకు తీసుకెళ్లాము . చైర్మన్ గారితో హైఫైకొట్టుకుని కృష్ణ - నేను వంట ఏర్పాట్లలో సహాయం చేసాము , దేవత -  వాళ్లంతా దర్జాగా చెట్టుకింద కూర్చుని ముచ్చటలుపెట్టారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-02-2022, 10:19 AM



Users browsing this thread: 17 Guest(s)