Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
#67
ఎపిసోడ్ ~ 4


పొద్దున్నే చీకటి తోటే లేచాను రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది చుట్టూ చూసాను కత్తి కింద పడి ఉంది పక్క మీద దుప్పటి రక్తంతో ఎర్రగా అయిపోయింది... బైటికి పరిగెత్తాను ఎంత దూరమో నాకు తెలీదు కానీ పక్కన పట్టాల మీద ఒక గూడ్స్ బండి వెళ్తుంది స్పీడ్ గా దాన్ని దాటుకుని ముందుకి వెళ్లి అడ్డంగా నిల్చున్నాను.... ట్రైన్ నాకు గుద్దుకుని ఆగిపోయింది, బోగీలన్నీ అటు పక్క ఇటు పక్క పడిపోయాయి కానీ నా ఒంటి మీద చిన్న గాటు లేదు, కోపం వచ్చి పక్కనే పొడుగాటి రేకు తో చెయ్యి కోసుకున్నాను కట్ అయింది రక్తం కారుతుంది అదే నాకు అర్ధం కావట్లేదు ఎంత బలమున్నా నా వల్ల నాకు హాని కలుగుతుంది, కానీ చావు రాట్లేదు.... నాకు ఎందుకు బతికుండాలో అర్ధం కావట్లేదు.... ఏదైనా లక్ష్యం ఉంటే దానికోసం బతుకుతారు, ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకోసం బతకాలనుకుంటారు కానీ నా తల్లే నా చావుని కోరుకుంది....నాకోసం ఎవరున్నారు, నాకు ఏది ఇష్టం లేదు, ఏది వద్దు .... ఇలా మర మనిషిలా నాకు బతకడం ఇష్టం లేదు....

అందుకే చావాలనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం కూడా లేదు, నా చావు కూడా నేను చావలేకపోతున్నాను.... గట్టిగా అరిచాను ఎంతలా అంటే నా అరుపుకి ట్రైన్ ఇంజిన్ అడుగు వెనకకి జరిగేలా... వెనకాల అన్ని మంటలు... నావల్ల వీళ్ళకేమైనా అయ్యిందేమో అని ఇంజిన్ లో చూసాను ఇద్దరు స్పృహ తప్పి పడి ఉన్నారు గాయాలు బాగానే అయ్యాయి.... పక్కనే ఒక వాటర్ బాటిల్ ఉంది తీసుకుని కొంచెం నా ఉమ్ము కలిపి ఇద్దరికీ తాగించాను....గాయాలు నయమయ్యాయి...

అక్కడనుంచి ఇంటికి వచ్చాను బెడ్ షీట్ చేంజ్ చేసి కత్తి కడిగి ఎలా ఉన్నవి అలా సర్దేశాను..... అమ్మ ఇంకా లేవలేదు... టేబుల్ మీద ఉన్న పువ్వు మళ్ళీ వాడిపోయింది... చిన్నగా చేతిలోకి తీసుకుని మళ్ళీ నా నోటితో గాలి ఊదగానే పువ్వు ప్రాణం పోసుకుంది.....

ఇవ్వాల్టి నుంచి ఎలాగో సెలవలే అని పడుకున్నాను నిద్ర పట్టింది... లేచే సరికి మధ్యాహ్నం అయింది.... లేచి ఫ్రెషప్ అయ్యి బైటికి వచ్చాను... మాధురి టీచర్, అమ్మ సోఫా లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు....

తనని విష్ చేసి కిచెన్ లోకి వెళ్లి అన్నం పెట్టుకుని తినేసి బైటికి వచ్చాను.... మాధురి టీచర్ ఒక్కటే కూర్చుని ఉంది... నన్ను చూడగానే పిలిచింది వెళ్లి పక్కన కూర్చున్నాను...

మాధురి : రుద్ర హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావా?

రుద్రా : అలా ఏం లేదు మేడం..

మాధురి : మరి రోజంతా ఏం చేస్తావ్?

రుద్ర : పక్కనే కొత్తగా లైబ్రరీ పడింది మేడం అక్కడే నాకు కాలక్షేపం అవుతుంది.

మాధురి : ఒహ్హ్ వెరీ గుడ్.... అని కొంచెం గాప్ ఇచ్చి....

మాధురి : రుద్రా అమ్మ నీకు తను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా....

రుద్ర : చెప్పింది మేడం...

మాధురి : నీకు ఇష్టమేనా?

నేను అక్కడనుంచి లేచాను.... మాధురి మేడం నా చెయ్యి పట్టుకుంది... "రుద్రా ఆన్సర్ చెప్పి వెళ్ళు" అంది.

వెనక్కి తిరిగాను "మేడం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నాకు మీరు సమాధానం చెప్తారా?" అన్నాను..... "అడుగు" అంది.... "ఒక వేళ నాకు ఇష్టం లేదని చెప్తే మా అమ్మ పెళ్లి చేసుకోకుండా ఆగుతుందా " అని అడిగాను.... మేడం నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు...

నా రూమ్ లోకి వెళుతూ "తన పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని చెప్పి డోర్ వేసుకున్నాను..

కొంచెం సేపటికి డోర్ సౌండ్ ఐతే తీసాను ఎదురుగా మాధురి మేడం... "లోపలికి రండి" అని ఆహ్వానించాను...

మాధురి మేడం : ఓహ్ నీ రూమ్ బాగుంది రుద్ర... అని టేబుల్ మీద పువ్వు చూసింది... వెంటనే పువ్వు అందుకుని... రుద్ర ఈ పువ్వు నాకు నచ్చింది తీస్కోనా....

రుద్ర : వద్దు అన్నాను గట్టిగా...

మేడం ఉలిక్కి పడి పువ్వుని టేబుల్ మీద పెట్టేసింది...

ఐయామ్ సారీ మేడం.... ఈ ఇంట్లో నాకు సొంతమైంది... నాకు ఇష్టమైంది... ఆ పువ్వు ఒక్కటే.... అన్నాను.

మాధురి : మరి అది వాడిపోతే...

రుద్ర : వాడిపోనివ్వను....

చిన్న పిల్లడు తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు అని నవ్వుకుంది...

మాధురి : రుద్ర ఈ పువ్వు మీద నల్లగా మచ్చ ఉంది చూసావా...

రుద్ర : అవును మేడం చూసాను....

మాధురి : అయినా నచ్చిందా?

రుద్ర : నా మనసుకి నచ్చింది... అన్నాను.

మాధురి మేడం కొంచెం సేపు మౌనం గా కూర్చుని..

"రుద్రా అమ్మకి, మన స్కూల్ లో ఉన్న సోషల్ సర్ శివ గారికి ఎల్లుండే పెళ్లి...." అంది.

అలాగే అన్నాను.

ఆరోజు లైబ్రరీ కి వెళ్లి పురాణ కధలు... రాజులూ వారి పరిపాలనలు చదివాను.... చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాను... అమ్మ హడావిడిగా ఇల్లు సర్దుకుంటుంది.... వెళ్లి తినేసి పడుకున్నాను...

తెల్లారి లేచాను ఇల్లు అంతా కడిగినట్టు ఉంది ఎవరో గెస్ట్స్ వచ్చారు అంతా మా స్కూల్ స్టాఫ్ వాళ్లే.... రెడీ అయ్యి బైటికి వచ్చాను...

మాధురి మేడం నన్ను చూసి "రుద్ర కొత్త బట్టలు వేసుకో నీ కోసమే వెయిటింగ్ పద వెళదాం" అంది.

అమ్మ బైటికి రాడానికి హాల్లోకి వచ్చి నన్ను చూసింది... అమ్మ చాలా ఆనందంగా, అందంగా కనిపించింది.... పెళ్లి బట్టలు అనుకుంటా చాలా అందంగా ఉంది..తనని చూసి "నేను లైబ్రరీ కి వెళ్తున్నాను సాయంత్రం వస్తాను" అని చెప్పి బైటికి వచ్చేసాను... అమ్మ మొహం కోపంగా మారడం కూడా చూసాను....

సాయంత్రం అవ్వక ముందే ఇంటికి వెళ్ళాను లాక్ వేసి ఉంది.. గేట్ తీసుకుని మెట్లు ఎక్కి మేడ పైకి వెళ్ళాను.... కొంచెం సేపటికి ఇంటి ముందు సౌండ్ ఐతే వెళ్లి పైనుంచే చూసాను...

శివ సర్, అమ్మా చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్ స్టాఫ్, ఇద్దరి మేడలో దండలు...అందరు సంతోషంగా లోపలికి వస్తున్నారు...

అమ్మ గేట్ లోపలికి వస్తూనే పైన ఉన్న నన్ను చూసింది, అప్పటివరకు ఆనందం గా ఉన్న మొహం.. కోపంగా సీరియస్ గా తల దించుకుని లోపలికి వెళ్ళింది.

నేను రాత్రి వరకు పైనే ఉన్నాను... వచ్చిన వాళ్లంతా వెళ్లిపోయారనుకుంటా ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది.

శివ సర్ పైకి వచ్చాడు....నేను ఆకాశం లో చుక్కలు లెక్కపెడుతూ గచ్చు మీద పడుకుని ఉన్నా...

శివ : రుద్ర...

లేచి కూర్చున్నాను

శివ : "ఏమైంది రుద్ర అప్పటినుంచి కిందకి రాలేదు "

రుద్ర : అలా ఏం లేదు సర్ నాకు ఇక్కడ ఒంటరిగా ఆకాశం లోకి చూడటం అలవాటు, ఎంత సేపైనా కూర్చుంటాను.

శివ : నేనంటే నీకు ఇష్టం లేదా? మీ అమ్మని పెళ్లి చేసుకున్నానని బాధగా ఉందా? అది మీ అమ్మ..... అని ఇంకేదో చెప్తుండగా.... "సర్ మా అమ్మకి మీతో పెళ్లి జరిగినందు వల్ల నాకు బాధగా లేదు, మీరంటే నాకు గౌరవము అది కూడా ఈ పెళ్లి వల్ల తగ్గలేదు... కానీ మీరు అమ్మని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను వెంటనే మీమీద లేని ప్రేమని చూపించలేను కదా నా గురించి మీరు ఇబ్బంది పడకండి అమ్మకి తోడు దొరికింది అందులోనూ మీరు చాలా మంచివారు, ఇంకొంచెం సేపు కూర్చుని నేనే కిందకి వస్తాను మీరు వెళ్ళండి " అని మళ్ళీ పడుకున్నాను..

శివ సర్ కిందకి వెళ్ళాడు...

రాధ : అయిపోయిందా వాడికి సంజాయిషీ చెప్పడం.

శివ : అలా ఏం లేదు... మామూలుగానే మాట్లాడాను.

రాధ : ఏమంటున్నాడు?

శివ : ఏమి అనలేదు కానీ రుద్ర తో మాట్లాడుతుంటే చిన్న పిల్లాడితో మాట్లాడినట్టు లేదు, రుద్రకి చాలా ముందు చూపు, తన మాటల్లో ఎంత పరిణితి... ఇరవై ఏళ్ల పిల్లలు కూడా అంత క్లారిటీ గా మాట్లాడలేరు....నీకెప్పుడు తేడా తెలియలేదా?

రాధ : నాతో అంతసేపు వాడెప్పుడు మాట్లాడలేదు లెండి... ఇప్పుడు మూడ్ ఎందుకు పాడు చేస్తున్నారు... పదండి వెళ్లి భోజనం చేద్దాం...

శివ : రుద్రని పిలుచుకువస్తాను...

రాధ : అవసరం లేదు.. వాడికి ఆకలివెస్తే వాడే తింటాడు... మనిద్దరి మధ్యలోకి వాడిని తీసుకురావడం నాకు ఇష్టం లేదని మీకు ముందే చెప్పాను.

శివ ఇంకేం మాట్లాడకుండా వెళ్లి తినడానికి కూర్చున్నాడు....

పైన చుక్కలని చూస్తున్న నాకు రాజి గుర్తొచ్చింది... గాల్లోకి ఎగిరాను... ఐదు నిమిషాల్లో రాజి ఇల్లు వచ్చింది బాల్కనీ లో చైర్ వేసుకుని కూర్చుని చిప్స్ తింటు పక్కనే వాళ్ళ నాన్నతో ముచ్చట్లు పెడుతుంది.

కొంచెం సేపు తనని చూసి ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళాను, శివ సర్, అమ్మ భోజనం చేస్తున్నారు... అమ్మ నన్ను చూసింది... తనని చూడకుండానే కిచెన్ లోకి వెళ్లి అన్నం పెట్టుకుని ప్లేట్ తీసుకుని నా రూంలోకి వెళుతుండగా శివ సర్ పిలుస్తుంటే తనకి నవ్వుతు ఏం పర్లేదు అన్నట్టు థంప్స్ అప్ సింబల్ చూపించి లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాను.

ఈ వారం రోజులు నాకు లైబ్రరీ లో గడిచిపోయింది... ఒక రోజు శివ సర్ పిలిచి "రుద్ర నువ్వు ఎక్కువ సేపు ఇంట్లో ఉండట్లేదు" అన్నాడు.

నేను ఎక్కడికి వెళ్ళను లైబ్రరీ లో మాత్రమే ఉంటాను, కంగారు పడకండి, నేను ఎవ్వరితో స్నేహం చెయ్యను నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టము.. లైబ్రరీ లో కొత్త కొత్త పుస్తకాలు ఉన్నాయి... అవి చదువుతుంటే టైం తెలియడం లేదు అందుకే అప్పుడప్పుడు లేట్ అవుతుంది... రేపటి నుంచి పెందలాడే ఇంటికి వచ్చేలా చూసుకుంటాను అని నా రూమ్ లోకి వెళ్ళాను.

స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక రోజు ఉందనగా శివ సర్ నాకోసం సైకిల్ కొని తీసుకొచ్చారు... నవ్వి వద్దని సున్నితంగా తిరస్కరిస్తూనే గట్టిగా గిఫ్ట్స్ ఇవ్వద్దు అని చెప్పకనే చెప్పాను.

శివ సర్ కొంచెం హర్ట్ అయినా.... అమ్మ కోపంగా చూసినా... నేను పట్టించుకోలేదు.

స్కూల్ స్టార్ట్ అయింది... స్కూల్ కి వెళ్లడం లైబ్రరీకి వెళ్లడం.... ఇంటిని ఒక తిని పడుకునే హోటల్ లానే చూసాను..

రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.... ఒక రోజు శివ సర్ వచ్చి అమ్మ ప్రేగ్నన్ట్ అని చెప్పాడు, బైట వాళ్ళలానే కంగ్రాట్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాను... ఎందుకో శివ సర్ నా వల్ల అప్పుడప్పుడు బాధ పడ్డా నా మీద కొంచెం కన్సర్న్ గానే ఉండేవాడు...

మా జీవితాలలో శివ సర్ రావడం వల్ల అమ్మకి నాకు ఇంకా దూరం పెరిగిపోయింది... తనని క్లాస్ లో చూడటం, ఎప్పుడైనా నా రూమ్ లో నుంచి బైటికి వస్తే చూడటం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.... మా మధ్య దూరం రోజు రోజుకి పెరిగిపోతుందని గ్రహించి అప్పుడప్పుడు మా ఇద్దరినీ మాట్లాడుకునేలాగ సంఘటనలు సృష్టించేవాడు.... కానీ అమ్మ నాతో బలవంతంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు....

ఇంకో తొమ్మిది నెలలు గాడిచాయి కొంచెం పొడవు పెరిగాను..అమ్మ ఆల్రెడీ స్కూల్ మానేసింది... నేను ఇంటికి ఒక ఐదు వందల కిలోమీటర్స్ లోపల మనుషులు ఎవ్వరు చేరుకోలేని స్థలం కోసం వెతుకుతున్నాను నా స్థావారం గా చేసుకోడానికి కానీ ఇంకా దొరకలేదు...లైబ్రరీ లో బుక్స్ అన్ని చదివేసాను పురాణాలూ, ఇతిహాసాలు, ధర్మాలు, హిస్టరీ, పాలిటిక్స్ ఒకటేమిటి అన్ని చదివేసాను... రాజి రోజు రోజుకి అందంగా తయారవుతుంది... ఇప్పుడు క్లాస్ లో అదే అందేగత్త.

నాకున్న పవర్స్ ని కూడా అప్పుడప్పుడు టెస్ట్ చెయ్యడము, శివ సర్ తో చెప్పించుకోవడం... కానీ ఏమనేవాడు కాదు నా పరిస్థితి అమ్మ పరిస్థితి చూసి.

పని మనిషిని పెట్టుకున్నారు, తనకి తెలుసు నాకు అమ్మకి పడదు అని ముందు ఆశ్చర్యపడినా తరువాత తను అలవాటు చేసుకుంది... పని మనిషి వచ్చిన తరువాత నేను ఇంట్లో అమ్మని చూడటం మానేసాను.....

అమ్మని హాస్పిటల్ లో జాయిన్ చేసారు... ఇద్దరు కవలలు కానీ ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్పింది...

స్కాన్ చేసి డాక్టర్ శివ గారితో... "మీకు ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి ఇద్దరు కవలలు కానీ అమ్మాయి వీక్ గా ఉంది, పుట్టుక తో అవిటి గా పుడుతుంది" అని చెప్పింది.

శివ సర్ నేను అమ్మ దెగ్గరికి వెళ్ళాము, శివ సర్ అమ్మతో డాక్టర్ చెప్పింది చెప్పాడు... అమ్మ ఏడ్చింది నాకు అది నచ్చలేదు... బైటికి వచ్చాను చీకటి పడ్డాక ఆపరేషన్ కి ఇంకా రెండు గంటల సమయం ఉందనగా అమ్మ పడుకుంది...ఎవ్వరు చూడకుండా వెళ్లి నా నోట్లో ఎంగిలి తీసుకుని ఆ వేలిని అమ్మ నోట్లో పెట్టాను...

అమ్మ కళ్ళు తెరిచింది, తన నోట్లో నా వేలుని చూసి... ఛీ అని చీదరించుకుని నా చెంప మీద ఒక్కటి పీకింది... నేను అక్కడనుంచి బైటికి వచ్చేసాను....

ఆపరేషన్ ముందు డాక్టర్ వచ్చి అమ్మని చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ రిపోర్ట్స్ రెడీ చేయించింది.... "వావ్ ఇట్స్ ఏ మీరకల్, రాధా గారు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఆపరేషన్ అవసరం లేదు నార్మల్ డెలివరీ చెయ్యొచ్చు, పెయిన్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం " అని శివ సర్ తో చెప్పి వెళ్లిపోయింది.

శివ సర్ ముందు ఆనందపడినా అమ్మాయి అవిటిది అన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ మాములుగా అయిపోయాడు...

రాధ కి ఇంకో రెండు రోజుల తరువాత పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి నార్మల్ డెలివరీ లోనే ఇద్దరు ఆరోగ్యాకరమైన కవలలకి జన్మనిచ్చింది... డాక్టర్ ముందు ఆశ్చర్యపోయినా తరువాత... మీరకల్స్ అనుకుని వెళ్ళిపోయింది....అందరూ చూడటానికి వచ్చారు .... రాధాకి రుద్ర కడుపులో ఉన్నప్పుడు సంగతి గుర్తొచ్చింది.... కవలల్ని కన్నా కూడా తాను అలిసిపోలేదు కానీ రుద్ర ఒక్కణ్ణి కనడానికి నానా నరకం అనుభవించింది... ఆ వెంటనే జరిగిన సంఘటనలు గుర్తుకువచ్చాయి... వాటితో పాటే బాధలు...

పిల్లల్ని చూద్దామని దెగ్గరికి వెళ్ళాను కానీ అమ్మ నన్ను చూసి గట్టిగా అరిచింది "ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని " అందరు నన్నే చూస్తున్నారు.

నేను బైటికి పరిగెత్తాను శివ సర్ పిలుస్తున్నా వినకుండా.... హాస్పిటల్ బిల్డింగ్ మీదకి ఎక్కి ఎగిరాను...

నేను వేగంగా ఎత్తుకి ఎగురుతున్న కొద్దీ నా కళ్ళలో నీళ్లు అంతే వేగంగా ఆవిరైపోసాగాయి...

ఎంత ఎత్తుకి ఎగిరాను అంటే భూమి నా కంటికి వాలీబాల్ లా కనిపించే అంతలా.....

అక్కడి నుంచి భూమిని చూసాను..స్పేస్ లో నా చుట్టూ నా కన్నీటి చుక్కలు ఒక పక్క వెలుగు ఒక పక్క చీకటి... ఈ సారి నా చావు ఆపడం ఎవ్వరి వల్ల కాదు అని స్పీడ్ గా భూమి వైపు వెళ్ళాను..

భూ కక్ష్య లోకి ఎంటర్ అవ్వగానే నా పవర్స్ అన్ని ఆపేసి కళ్ళు మూసుకున్నాను......


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


పై లోకం లో...

"నాధా ?? నాధా?? త్వరగా లెమ్ము.... ఓ పతి దేవుడా నా బిడ్డకి ఇన్ని కష్టాలు తగునా?

చావాలనుకుని తనకి తెలియకుండానే భూమిని నాశనం చెయ్యడానికి వెళ్తున్నాడు.... నాధ త్వరగా లెమ్ము...."

❤️ : కంగారు పడకు దేవి వెళ్తున్నాను..........




Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Takulsajal - 14-04-2022, 12:12 AM



Users browsing this thread: 5 Guest(s)