Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
49.91%
263 49.91%
వొద్దు
15.75%
83 15.75%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
34.35%
181 34.35%
Total 527 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 48 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
E 53 (ee అప్డేట్ స్కిప్ చేయండి పొరపాటున రాశాను)

మేడం తట్టి లేపుతుంటే కళ్ళు తెరిచి చూసాను. అక్కడ మా నాన్న నిలబడి నన్నే చూస్తూ కనిపించాడు. నేను వెంటనే పైకి లేస్తూ ఏంటి అన్నట్లుగా చూసా. మా నాన్న ఏంట్రా ఇక్కడ పడుకున్నావ్ అని అడిగాడు. నేను అదీ రాత్రి దోమలు కుడుతుంటే అని అంటూ మా నాన్న వంక చూసి అన్నా. మా నాన్న సరే సరేలే పోయి ముఖం కడుక్కొపో అని అంటూ అంతలోనే నా కళ్ళని చూసి ఏంటి ? నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయ్ రాత్రి నిద్రపోలేదా ? అన్నాడు. నేను మేడం వంక ఒక లుక్ ఇచ్చి లేదు నాన్న దోమలు ఎక్కువయ్యాయి అస్సలు నిద్ర పట్టలేదు అందుకే అని అన్నా. మా నాన్న సరేలే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే నేను మేడం వంక చూసా. మేడం నేను ఒక్క క్షణం అలాగే చూసుకున్నాం. వెంటనే ఎదో ఇబ్బందిగా ఒకే సారి తల తిప్పేసుకున్నాం. తను కిచెన్ లోకి వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి రెడీ అయ్యాను. తను టిఫిన్ పెడుతూ నా వంక ఒకసారి చూసింది తన చూపు లో కోపం లేదు కానీ ఎదో తెలీని ఇబ్బంది ఉంది. నేను గబగబా టిఫిన్ తినేశా. ఆ తరువాత మా నాన్న దగ్గరకు వెళ్లి నా ఫ్రెండ్ వినయ్ గాడి దగ్గరకు వెళ్తున్నా. వాడు ఎదో ఫంక్షన్ ఉంది అన్నాడు ఈరోజు రేపు అక్కడే ఉండి ఎల్లుండి డైరెక్ట్ గా మన ఊరికి వచ్చేస్తా అని చెప్పా. మా నాన్న ఎదో మూడ్ లో ఉండి సరే అన్నాడు. అదంతా కిచెన్ లో నుండి మేడం వింటూనే ఉంది. నేను తన వంక ఒకసారి చూసి తల తిప్పేసుకున్నా. అంతలో సిద్దు నాన్న హాల్ లోకి వచ్చాడు. ఆయనకు కూడా విశయం చెప్పేశా. దానికి సిద్దు వాళ్ళ నాన్న కూడా సరే అన్నాడు. ఒక గంట లో కావాల్సినవి అన్నీ తీసుకుని వెళ్ళడానికి రెడీ అయ్యాను. రూం లో కూర్చుని ఎదో మాట్లాడుకుంటూ ఉన్న మామ ఇంకా మా నాన్న తో వెళ్ళొస్తా అని చెప్పా. వాళ్ళు సరే అని అన్నారు. నేను వెంటనే బాగ్ తీసుకుని హాల్ నుండి బయటకు నడిచా. అక్కడ మేడం నిలబడి నన్నే చూడడం నాకు తెలుస్తూనే ఉంది. నేను వెళ్తుంటే సిద్దు గాడు ఎదురుగా వచ్చాడు. నేను వాడ్ని చూసి చిన్నగా నవ్వాను. వాడు ఏమీ అనలేదు. నేను బయటకు వచ్చి గేట్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే మేడం బయటకు కాస్త ఫాస్ట్ గా నడుస్తూ వచ్చింది. అలా వచ్చి వెళ్తున్న నన్ను చూసి భరత్ అని మెల్లగా పిలిచింది. నేను తల తిప్పి తన వంక చూసా తనేనా పిలిచింది అన్నట్లుగా. తను నన్ను చూస్తూ ఎదో చెప్పబోయింది. అంతలో లోపల నుండి మామ సంధ్యా అంటూ పిలిచాడు. అంతే వెంటనే మేడం లోపల వైపు చూసి మళ్ళీ నా వంక చూసి ఎదో చెప్పాలని చెప్పలేక పోతూ తల దించేసుకుని మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. నాకు తన కోసం వెయిట్ చేయాలి అని అనిపించలేదు అందుకే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయా. 


మూడు నెలలు అవుతుంది మేడం ను చూడక. అసలు గొడవ ఎందుకు జరిగిందో, ఎందుకు తననుండి విడిపోవాల్సి వచ్చిందో కూడా గుర్తు లేదు. నాకు అవి పెద్దగా కనిపించడం కూడా లేదు. మైండ్ లో కేవలం ఒకటే రన్ అవుతుంది. నేను తనతో లేను అని అంతే, కేవలం అదొక్కటే నన్ను వెంటాడుతుంది. తను ఎలా ఉందొ ఎం చేస్తుందో కూడా తెలీదు. ఊర్లో కూర్చుని ఎం చేయాలో తెలీక ఊరికే గాలికి తిరుగుతూ ఉన్నా. అసలు ఒకప్పటిలా లేను. కనీసం తినాలి అని కూడా అనిపించడం లేదు. ఏదో ఊరికే అలా ఉన్నా నంటే ఉన్నా అన్నట్లుగా ఉంది. మేడం ను చూడాలి అని బలంగా ఉన్నా కూడా వెళ్ళడానికి చాలా విషయాలు అడ్డు పడుతూ ఉన్నాయి. తను ఇప్పుడు నన్ను వొదిలి పెట్టినందుకు తను ప్రశాంతంగా ఉంటె అదే చాలు లే అని మనసుకు సర్ది చెప్పుకుంటూ బ్రతుకుతున్నా. నెల క్రితం మేఘ పెట్టిన లాస్ట్ మెసేజ్ ఒక్కటి మాత్రమే యిప్పుడు నా దగ్గర ఉంది. అది ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు.
తను పంపిన మెసేజ్ లో మేడం గురించి రాసింది కొంచెమే అయినా అదే నాకు పెద్ద సమాచారం అయ్యింది. "తను నిన్ను మర్చిపోవాలని ప్రయత్నిస్తుంది. ఎక్కడా ఇంట్లో నీ పేరు ను ఎత్తకుండా జాగ్రత్త పడుతుంది. నీ ఊహ కూడా రాకుండా ఉండాలని ఇంకా ఎక్కువ పనులు చేస్తుంది. కానీ అంత చేసినా నాకు మాత్రం తన ముఖం లో నీ గురించిన ఆలోచనలే చేస్తుందని క్లియర్ గా కనిపిస్తూ ఉంది. పనులు చేస్తున్న మాటే కానీ అప్పట్లా చలాకీగా లేదు. ఏదో లోకం లో ఉన్నట్లుగా ఉంటుంది. నాకు తెలుసు మీ ఇద్దరు కలవడం అనేది సొసైటీ అంగీకరించని విషయం అని. కానీ మీరు ఆ విదంగానే ఎందుకు ఉండాలి. కనీసం మంచి ఫ్రెండ్స్ లాగా అయినా ఉండకూడడా ? ఇలా అనడానికి కారణం లేకపోలేదు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమొ, మా అమ్మ అంటే కూడా అంతే ఇష్టం. తనను ఇలా చూడలేక పోతున్నా. నేను ఏదైనా చేద్దాం అన్నా కూడా తను నన్ను చేయనివ్వ కుండా తనతో ఒట్టు వేయించుకుంది. వాడితో మాట్లాడినా లేక మమ్మల్ని కలపాలని చూసినా, నా మీద ఓట్టే అని నాతో వొట్టు వేయించు కుంది. నేను చెప్పా చివరిగా ఒక్కసారి మాట్లాడతాను అని అందుకే ఈ మెసేజ్. నీకు కాల్ చేస్తుంటే ఎత్తడం లేదు ఎందుకో నేను అర్ధం చేసుకోగలను.
నాకు తెలుసు మా అమ్మ లేకుండా నువ్వు చాలా ఫీల్ అవుతూ ఉంటావ్ అని. ఇక్కడ కూడా మా అమ్మ పరిస్థితి అలాగే ఉంది. దాన్ని తను బయటకు కనిపించకుండా దాచి పెట్టుకుంటున్నాను అని అనుకుంటుంది కానీ అది పచ్చి అబద్దం. నాకు తనని చుసిన ప్రతి సారి నీ ముఖమే కనిపిస్తుంది తనలో. తను కేవలం మరిచిపోయాను అన్నట్లుగా ఆక్ట్ చేస్తుంది. అది నేను నమ్మను. ఇదేదో మీ ఇద్దరినీ కలపాలి అని రాయడం లేదు. నాకు చెప్పాలి అని అనిపించింది అందుకే చెప్పా. నాకు ఇక్కడ తన ముఖం చూస్తూ ఉండాలి అని లేదు. నాకు ఒకప్పటి మా అమ్మ కావాలి. అది లేకుండా నేను ఈ ఇంట్లో ఉండలేను. అందుకే కోచింగ్ పేరు తో ముంబై వెళ్తున్నా. చివరిగా నిన్ను నేను చాలా ప్రేమించా. ఎందుకో తెలీదు. నాకు బాగా నచ్చేసావ్. కానీ ఇప్పుడు మాత్రం నచ్చడం లేదు. కారణం, మా అమ్మ ను ఇలాంటి పరిస్థిఠీ లో ఒంటరిగా వదిలేసి పోవడం. అందుకే నిన్ను నేను ప్రేమించినా కూడా నీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేంత వరకు నీకు దూరం గా ఉందాం అని అనుకుంటున్నా. నా పిచ్చి గాని, దూరంగా ఉండడం ఏంటి, అసలు ఎప్పుడు అయినా దగ్గరగా ఉంటేనే కదా ? ఒక్కటి మాత్రం చెప్పగలను మనిద్దరి మధ్య లవ్ పుట్టే సందర్భాలు లేకపోయి ఉండొచ్చు. నీకు అసలు నా మీద అలాంటి ఉద్దేశం కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నా. నాకు తెలుసు నాదంతా వన్ సైడ్ లవ్ ఏ అని. నీ లవ్ అంతా మా అమ్మ మీదే అని. పర్లేదు. నా దృష్టిలో మా అమ్మా నేను వేరు వేరు కాదు. 
సదా నీ ప్రేమలో..
మేఘ...

నేను చివరి రోజు గేట్ దగ్గరికి వెళ్తుంటే మేడం పరిగెత్తుకుంటూ వచ్చి భరత్ అని పిలిచినది గుర్తు ఉంది. ఆ రోజు తన కోసం ఇంకాసేపు అక్కడే ఎదురు చూడాల్సింది. ఎం చేస్తుంది కాసేపు తిట్టి మల్లి దగ్గరికి తీసుకుంటుంది. అనవసరంగా వదిలి వచ్చేసా. ఇప్పుడు వెళ్ళాలి అన్నా కూడా తన ముందుకు వెళ్తే ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చావ్ అనే లాగా చూస్తుంది ఏమో అని భయం. అంతే కాదు తనని చూడాలంటేనే భయం. తనతో నేను చేసిన వెధవ పనులు అన్ని గుర్తు వస్తూ రోజూ నా బుర్ర తినేస్తున్నాయి. సరిగ్గా చెప్పాలంటే నా బాడీ ఇక్కడే ఉన్నా సోల్ మాత్రం మేడం దగ్గరే తిరుగుతూ ఉంది. మూడు నెలలు ఒకవేళ మేడం దగ్గర ఉంటె జస్ట్ మూడు రోజుల్లో అయిపోయేవేమో. ఇప్పుడు మాత్రం అవి మూడు యుగాలలా అనిపిస్తున్నాయి.
వెళ్లనూ లేను, అలాగని మరిచిపోనూ లేను. ఇంకా ఇది ఎన్నాళ్ల్లు ? ఇలా ఎన్నాళ్ళు ఇలా సాగుతుందో అర్ధం కావడం లేదు. పాపం మా అమ్మ నాకు ఏదో గాలి సోకింది అని అనుకుంటుంది. అందుకే ఇలా అయిపోయాడు అని రోజూ మాంత్రికుల దగ్గరకు తీసుకు వెళ్తుంది. పాపం తనకి తెలీదు నా ప్రాబ్లెమ్ ఏంటో.. 
ఇంకా ఎన్నాళ్ళు ఇలా ?
జరిగినదేదో జరిగిపోయింది ముందుకు వెళ్ళాలి కదా ?
కానీ నా వల్ల కావడం లేదే..
.......
రోజులు గడుస్తున్న కొద్దీ నాలో చిన్న మార్పు వచ్చింది. నేను బాధ పడడమే కాకుండా మా ఇంట్లో వాళ్ళని కూడా ఎందుకు బాధ పెడుతున్నా అని అనిపించింది.
అందుకే మా నాన్న చెప్పినట్లుగా కోచింగ్ తీసుకోవడానికి చెన్నైవెళదాం అని నిర్ణయించుకున్నా. నిజానికి వెళ్లాలని కూడా లేదు, కానీ ఇక్కడే ఉండి మా అమ్మా నాన్న లకు నా బాధపడుతున్న ముఖాన్ని చూపించలేక వెళ్తున్నా..
ఇవ్వాళ సాయంత్రమే ప్రయాణం, అన్ని సిద్ధం చేసుకుని వెళ్తుండగా మా అమ్మ వచ్చి ఏమైంది రా నీకు ? నిజం చెప్పు ఏమైనా లవ్ ప్రాబ్లెమ్ ఆహ్ ? ఎందుకు అలా ఉన్నావ్ ? అంది. తాను అలా అనగానే మేడం మనసులో మెదిలి వెంటనే కళ్ళలో నీళ్లు దిగబోయాయి, కానీ వెంటనే ఆపుకుంటూ ఛ ఛా అలాంటిది ఎం లేదు వొంట్లో ఏమో బాగోలేదు అంతే అని అంటూ కవర్ చేసుకుని బస్సు ఎక్కడానికి సిటీ కి వెళ్ళా.
సాయంత్రం బస్సు రానే వచ్చింది. నేను వెళ్లి బస్సు సీట్ లో కూర్చుని విండో లో చూస్తూ ఉన్నా .
ఇందాక మా అమ్మ అలా అడిగే సరికి ఏడుపు ఎందుకు రాబోయిందో అని ఆలోచించసాగా. బహుశా నాలోనే నేనే మదన పడుతూ ఎవ్వరికీ చెప్పుకోలేక పోతున్నందుకేమో. అలా ఒక్కసారిగా అడిగేసరికి ఏడుపు రాబోయింది అని అనుకుని మౌనంగా కళ్ళు మూసుకుని పడుకున్నా. బస్సు వెలుతూ వెళుతూ మేడం ఉన్న సిటీ కి వచ్చింది. అప్పుడే మెలుకువ వచ్చి కళ్ళు తెరిచా.
బస్సు విండో లో నుండి బయటకు చూడగానే అక్కడ బిందు ఆంటీ బస్సు ఎక్కే క్యూ లో నిలబడి ఉండడం కనిపించింది. వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. తను ఎందుకు ఈ బస్సు ఎక్కుతుంది అని అనుకుంటూ ఉండగానే తను బస్సు ఎక్కడం జరిగిపోయింది. తన బంధువులు చెన్నై లో ఉన్నారు అని నాకు అప్పట్లోనే తెలుసు. బహుశా తను అందుకే వెళ్తుంది ఏమో అని అనుకుని నన్ను తను చూడకుండా తల దించుకున్నా. తను హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని సీట్ నంబర్స్ చూసుకుంటూ నా పక్క సీటు దగ్గరికి వచ్చి ఆగింది. తను రాగానే ఇదేంట్రా ఇలా అయ్యింది అని అనుకుంటూ తల పైకి ఎట్టా.,
అప్పుడు చూసింది తను నా ముఖాన్ని తను చూడగానే నేను తల దించుకున్నా.
తను నన్ను చీదరించుకుంటుంది అని తెలుసు అందుకే వెంటనే తల కిందికి వంచుకున్నా. నన్ను చూసి నా పక్కన కూర్చోవడానికి కూడా నిరాకరిస్తుంది అని అనుకున్న నాకు సర్ప్రైస్ గా అసలు నన్ను గమనించనట్లు బెహేవ్ చేస్తూ నా పక్కన కూర్చుంది. నేను మధ్య మధ్య లో తల ఎట్టి తన వంక చూస్తున్న. తన నుండి ఎం రెస్పాన్స్ లేదు. తను నన్ను చూసింది అని క్లియర్ గా తెలుసు కానీ నన్ను తను ఎందుకు పట్టించుకోవడం లేదో నాకు అర్ధం కాలేదు. అసలు పూర్తి స్ట్రేంజర్ ను ఎలా చూస్తుందో అలా చూస్తుంది. నేను తన నుండి ఇది ఎక్ష్పెక్త్ చేయలేదు. కనీసం తను నన్ను చీదరించుకుంటుంది అని అనుకున్నా. కానీ తను అది కూడా చేయలేదు. ఈ మూడు నెలలు నేను ఎవ్వరికి ఈ విషయం చెప్పలేదు. కనీసం ఎవ్వరితోనూ సరిగా మాట్లాడలేదు. ఇప్పుడు సడెన్ గా అంతా తెలిసిన బిందు ను చూసే సరికి గుండె వేగంగా కొట్టుకుంటూ ఏదో ఒక రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తుంది. అది చీదరించుకోవడం అయినా పర్వాలేదు కానీ తన నుండి అది కూడా రాక పోవడం వల్ల నాకు బాధ ఇంకా ఎక్కువ అయ్యింది.
మూడు నెలలు ఆ బాధను మనసులోనే పెట్టుకోవడం వళ్ళ నెమో, తనని చూస్తుంటే నాకు తెలీకుండానే కన్నీళ్లు రాసాగాయి. నేను వాటిని అదుపు చేద్దాం అని అనుకుంటూ ఉండే లోపలే ఇంకా ఎక్కువ అయ్యాయి. అంతే వెంటనే అవి తనకు తెలీకూడద్దు అని తల పక్కకు తిప్పుకుని విండో లో నుండి బయటకు చూస్తున్న.
కాసేపటికి తల ఇటు తిప్పా. తను కళ్ళు మూసుకుని ఉంది చెవిలో బ్ల్యూ టూత్ పెట్టుకుని సాంగ్స్ వింటుంది. నేను తన ముఖం చూసా. చాలా రోజులయ్యింది తనని చూడక. తను కావాలనే ఇలా చేస్తుంది అని నాకు అర్ధం అయ్యింది. ఎందుకు అంటే తను ఇప్పుడు తిడితే నాకు ఏడుపు వచ్చి పూర్తిగా ఏడ్చేసి ఆ బాధ ను దింపుకుంటాను. కానీ అదే తను ఎం రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా ఉంటె నేను లోలోపలే ఇంకా ఇంకా
కుమిలిపోతూ బాధపడతా. అందుకే తను ఇలా చేస్తుంది అని అర్ధం అయ్యింది. నేను తన ముఖం లోకి చూస్తూ ఉంటె నా మనసేమో తనని పట్టుకుని ఎందుకె మౌనంగా ఉన్నావ్ నన్ను తిట్టు కొట్టు, చంపేయి ప్లీజ్ అంటూ తన కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. 
కానీ బిందు మాత్రం అసలు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.
రాత్రి అవ్వగానే డిన్నర్ కోసం బస్సు ఆపారు. తను కిందికి దిగలేదు. నేను కావాలనే తను నన్ను చూడాలని పైకి లేస్తూ పక్కకు తప్పుకో అన్నట్లుగా చూసా. కావాలనే తను నా ముఖం కూడా చూడకుండా పక్కకు తప్పుకుంది. నేను మల్లి వచ్చే సరికి తను లేదు. బస్సు విండో లో నుండి డాబా వైపు చూడగానే అక్కడ బిందు ఉరుముతున్న కళ్ళతో సూటిగా నేను కూర్చున్న విండో వైపే చూస్తూ కనిపించింది. నేను తన వైపు తల తిప్పడం చూసి వెంటనే మాములుగా తినడం మొదలు పెట్టింది. తను నన్ను కావాలనే అవాయిడ్ చేస్తుంది అని అర్ధం అయ్యింది. ఎలాగోలా తనతో మాట్లాడి తనతో తిట్టించుకుని ఇంకా వీలైతే తన్నించుకుని నా బాధ ను పోగొట్టుకోవాలి అని అనుకున్నా. కానీ తను ఏమో నాకూ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. తను కనీసం మాట్లాడితే నైనా ఎదో ఒకటి చేయొచ్చు కానీ ఎం చేయను ఇప్పుడు ? అని అనుకుంటూ ఉండిపోయాను.
తరువాత బస్సు ఎక్కాక తను మామూలుగానే ఉంది. నన్ను కనీసం చూడడం కూడా లేదు.
 ఎం చేద్దాం ఎం చేద్దాం అని అనుకుంటూ ఉండగా చిన్నగా కళ్ళలో నుండి కన్నీళ్లు రావడం మొదలు అయ్యింది. తను ప్రవర్తిస్తున్న తీరు నాకు ఇంకా భాధను కలిగించసాగింది. కనీసం నాకు తిట్టించుకునే అర్హత కూడా లేదా అని అనిపించగానే, ఒక్కసారిగా తెలీకుండానే ఏడుపు తన్ను కొచ్హిండి. మేడం ను మూడు నెలలుగా చూడలేదు అన్న బాధ. తనని మానసికంగా ఇబ్బంది పెట్టాను అన్న బాధ, ఇలా ప్రతీది గుర్తు కోస్తూ, ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది. సౌండ్ బయటకు రావడం లేదు కానీ, ఏద్వడం అయితే ఫుల్ గా ఏడుస్తున్న. తను పక్కనే ఉండి కూడా నన్ను పట్టించుకోవడం లేదు అనే విషయం గుర్తు వస్తుంటేనే ఏడుపు ఇంకా ఇంకా ఎక్కువయ్యింది.
మేడం అక్కడ నా వళ్ళ ఏదో కోల్పోయిన దానిలా ఉంది అని మేఘా చెప్పింది గుర్తొచ్చింది. ఇలా నా మైండ్ అన్ని గుర్తు చేస్తూ నాకు ఇంకా ఇంకా ఏడ్పు ను తెప్పిస్తోంది. అలా వెక్కి వెక్కి ఎంత సేపు ఏడ్చానో నాకే తెలీదు అసలు ఎందుకు ఏడుస్తున్నానో కూడా క్లారిటీ లేదు. ఇన్నాళ్లు కనీసం ఏడుపు రాలేదు కానీ ఎందుకో బిందు అలా చేస్తుంటే ఏడుపు తన్నుకొస్తోంది. ఆలా ఏడుస్తూ ఉండగా పక్క నుండి ఏదో సౌండ్ వినిపించింది. అది బిందు మాటలు అని కాసేపటికి అర్ధం అయ్యింది, తను నా చెవి దగ్గరికి వస్తూ కాలితో తన్నాననుకో ఆ అద్దం పగలకొట్టుకుని రోడ్ అవతల పోయి పడతావ్, నీ దొంగ ఏడుపు ఆపి పడుకో అని కోపంగా చెప్పేసి మల్లి మాములుగా తిరిగి పడుకుంటూ కళ్ళు మూసుకుంది బిందు. తను నేను ఏడుస్తున్నానని గమనిస్తూ ఉందని తెలియగానే నాకు ఆ బాధ లో కూడా ఏదో సంతోషం వేసింది. అదే ఏడుపు ముఖం తో బిందు వైపు చూసా తను ఇంకా ఏమైనా తిడుతుంది ఏమో అని ఆశగా. కానీ తను ఎం అనలేదు. అప్పటికే టైం పదకొండు నర అవ్వడం వళ్ళ అందరూ పడుకున్నారు. లైట్స్ కూడా ఆఫ్ లో ఉన్నాయి. ఇక నేను దైర్యం చేసి ఎం అయితే అది అయ్యింది లే అని సీట్ ను సెట్టర్ పోసిషన్ లోకి తీసుకొచ్చి, కింద కూర్చుని ఎదురుగా తను కాళ్ళు చాపుకుని ఉండడం చూసి తన కాళ్ళ మీద పడిపోయా.
అంతే తనకు మెలుకువ వచ్చింది. కాళ్ళను వదిలించుకోవాలని చూసింది. నేను వొదలలేదు. అసలు తన కాళ్ళ మీద ఎందుకు పడ్డానో కూడా తెలీదు. కానీ అంతా నా మనసు చేయమని చెప్తుంటే అలాగే చేస్తున్నా. తను కోపంగా కాళ్ళు విదిలించు కుంటూ ఉంది. కానీ నేను గట్టిగా తన కాళ్ళ ను పట్టుకుంటూ నా తలను తన కాళ్ళకు ఆనించి ఉంచా క్షమించమన్నట్లుగా వేడుకుంటూ.. 

తను అది చూసి కాస్త కిందికి వొంగుతూ నాకు వినిపించేలా, వొదులుతావా, కాలుతోనే కొట్టి చంపేయమంటావా ? అంది. నాకు కూడా అదే కావాలి అన్నట్లుగా నా మనసులో బాధ ఇంకా పొంగుకుని వస్తుంటే నన్ను చంపేయి నన్ను చంపేయి అని అనుకుంటూ ఇంకా గట్టిగా తన కాళ్ళు పట్టుకున్నా. ఇక తనకి అలా చేసేసరికి పిచ్చ కోపం వచ్చింది. నీ అబ్బా చావు రా కొడకా నా చేతిలో ఈ రోజు నీకు చావలని రాసి ఉంది లే చావ్.. కొడకా.. అంటూ గొణుగుతూ నా తల ను నా చేతులను విడిపించుకుంటూ తన కాళ్ళను బయటకు తీసుకుని ఎంత ఫోర్స్ గా బయటకు తీసుకుందో అంతే ఫోర్స్ గా మల్లి కిందికి తెస్తూ నా తల మీద నా బుజాల మీద ఎక్కడ పడితే అక్కడ కాలితో గాప్ లేకుండా తన్నసాగింది. ఎవరైనా చూస్తారేమో అనే ఆలోచ్చన కూడా లేదు నాకు తనకు. తను తంతుంటే హాయిగా అనిపించింది. చాలా హ్యాపీ గా ఏడుస్తూ తన తో తన్నించుకుంటున్నా. తను కోపంగా చావు రా వెదవ చావు అంటూ చిన్నగా గొణుక్కుంటూ నన్ను మూలకు దొబ్బి కాలితో ఎక్కడ పడితే అక్కడ తన్న సాగింది. తనకి నన్ను ఇంకా బాగా తన్నాలని ఉంది అని అర్ధం అవుతూనే ఉంది కానీ చుట్టూ నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా లేస్తారేమో అని కాస్త నెమ్మదిగా ఉంది. తను అలా తంతు ఉంటే నా లోని బాధ పోతున్నట్లుగా, మనసు ప్రశాంతంగా అవుతున్నట్లుగా అనిపించింది.
అలాగే మూలకు కూర్చుని మోచేతులు రెండూ మొహానికి అడ్డం పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నా. తను కోపంగా నా మోచేతుల మీద కొడుతూ చావు రా వెధవ చావు అంటూ ఉంది. కాసేపటికి ఎవరో ప్యాసింజర్ దిగాలని ముందు ఉన్న సీట్ లో నుండి లేవగానే లైట్స్ ఆన్ అయ్యాయి. వెనుక వైపు ఉన్న మాలో ఎవ్వరూ లేవలేదు. బిందు నన్ను కాసేపు ఉగ్రంగా చూసి తూ వెధవ అంటూ నాకు మాత్రమే వినపడేలా మల్లి నా జోలికి వచ్చావో ఈసారి ఎవరైనా చూస్తారేమో అని కూడా చూడను జాగ్రత్త అని కోపంగా అంటూ తల తిప్పుకుని కళ్ళు మూసుకుంది. నేను అలాగే కింద కూర్చుని వెనుక ఆనుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నా. సౌండ్స్ బయటకు రావడం లేదు కానీ ఏడుపు మాత్రం పీక్స్ లో వస్తుంది. అలా ఏడుస్తూనే ఉండిపోయా ఇంకో అరగంట వరకు. నిదానంగా కళ్ళు తుడుచుకుని తన వంక చూసా. తను తల కాస్త అటు తిప్పి పడుకుని ఉంది. తననే తదేకంగా చూస్తూ నన్ను క్షమించు మేడం ప్లీజ్ అని అనుకుంటూ సంధ్యా మేడం ను తనలో ఊహించుకున్నా. మేడం ఒక్కసారిగా నా ఇమాజినేషన్ లో కనపడగానే ఎదురుగా మేడమే ఉంది అని ఫీల్ అవుతూ, ఇంకో సారి తనని చూసి వెక్కి వెక్కి ఎడ్చా. అలా ఏడుస్తూ బిందు లో మేడం ను చూస్తూ సారి మేడం సారి అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్తూ మోకాళ్ళ మీద కూర్చుని, తన ముఖం లోకి చూసా. మెడమే నా బాధ ను పోగొట్టడానికి ఇలా వచ్చిందేమో అని అనిపించింది. అంతే ఒక్కసారిగా ఏడుస్తూ ఎదురుగా ఉన్న బిందు నే మేడం అనుకుని తన చేతులను పట్టుకున్నా ఓదార్పు కోసం. అంతే నేను అలా పట్టుకోగానే బిందు కోపంగా నా వైపు తిరిగింది. తిరగడం తిరగడం ఏమీ ఆలోచించలేదు తను. 
ఫట్, ఫట్, ఫట్ అంటూ మూడు సార్లు నా చెంప రీ సౌండ్ వచ్చేలా కొట్టింది..
తనలా కొడుతూ ఉంటే నేను బాధ తో కూడిన ఆనందం తో వెకిలిగా నవ్వుతూ ఉన్నా. నా పంటి మధ్యలో నుండి రక్తం వచ్చినట్లు కూడా తెలుస్తుంది. నా ముక్కు లో నుండి కూడా రక్తం వచ్చింది అనుకుంటా. అసలు ఇదంతా జస్ట్ వితిన్ సెకండ్స్ లో అయిపోయింది. ఆ సౌండ్ కు బస్ లో...
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
Nice story...,, - by Praveen kumar - 14-11-2018, 11:21 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 26-02-2019, 11:12 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 27-02-2019, 10:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 17-02-2019, 08:17 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 21-02-2019, 10:04 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 09:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:12 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:14 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 02-03-2019, 11:15 AM
RE: భరత్ అనే నేను..... - by akhilapuku - 18-11-2019, 07:36 PM
RE: సారీ టీచర్..... {Index Available} - by dom nic torrento - 19-04-2022, 11:49 PM



Users browsing this thread: 11 Guest(s)