Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
దారి మరలిన వందల దున్నపోతులు దూలాలతో నిర్మించిన కంచెను సైతం పడగొట్టి దూసుకుపోతున్నాయి .
పశువులన్నీ లోయవైపుకు వెళ్లిపోతున్నాయి ఎవరైనా కాపాడండి అంటూ కేకలువినిపిస్తున్నాయి .
వెంటనే విల్లుని వెనుకవేసుకుని జాగ్రత్త అంటూ అమ్మాయి చేతిలోని ఎర్రని గుడ్డను అందుకుని కృష్ణా అంటూ ఎగిరి దున్నపోతులవైపుకు వేగంగా వెళ్ళాను - నావెనుకే జనమంతా పరుగులుతీశారు .

పశువులు లోయవైపుకు వెళ్లకుండా బాణాలు వేస్తున్నా ప్రయోజనం లేకపోయింది . రాత్రిపూట జనాలకు అపాయమైన లోయ ఉందని తెలుసుకోవడానికి రగిలించిన అగ్నిగోళంలో గుడ్డకు అంటించుకుని , కృష్ణా ఊ ...... అంటూ దున్నపోతులకంటే ముందుకు వేగంగా వెళ్లి లోయ వెంబడి పెరిగిన గడ్డిని అంటించడం - మధమెక్కిన దున్నపోతులకు దిసానిర్ధేశం చేస్తున్న దున్నపోతు అగ్నిని చూయించడంతో మరొకవైపుకు తరిలాయి - లోయ వెంబడే కిందకు తీసుకెళ్లి లోయలో ప్రాహిస్తున్న నదీ ప్రవాహంలోకి చేర్చడంతో శాంతించాయి .
అధిచూసిన జనాలంతా పైనుండి జయజయనాదాలు చేస్తున్నారు . సంతోషంతో కేకలువేస్తూ కిందకువస్తున్నారు .
కృష్ణా ...... సాధించాము సాధించాము అంటూ ముద్దుపెట్టాను . అవునూ ...... మన పని పూర్తయ్యేంతవరకూ ఎవరి దృష్టిలో పడకూడదు ఇక్కడికి ఆ రాజ్యం దగ్గరే కదా అనుకుని ప్రవాహం దాటుకుని అటువైపు అరణ్యంలోకి వెళ్లిపోయాము .

( జనాలతోపాటు లోయ దగ్గరికి చేరుకున్న ఆ అమ్మాయి , నేను వెళ్లిపోవడం చూసి తన స్నేహితుల గుండెలపైకి చేరింది . 
మహీ ...... ఎలాంటి బహుమతి ఆశించని వీరాధివీరుడు అంటూ ఓదార్చారు - మహీ ...... అందరూ నీకోసమే వస్తున్నారు పదా వెళదాము అంటూ తీసుకెళ్లారు .
ఆ అమ్మాయి మాత్రం పదే పదే వెనక్కు చూస్తూనే వెళ్ళింది ) .

చీకటి పడేంతవరకూ అరణ్యంలోనే సేదతీరాము - వొళ్ళంతా ఏదో తెలియని మాధుర్యం నాపెదాలపై తియ్యదనాన్ని కలిగిస్తోంది .
సమయం వేగంగా గడిచిపోయింది - కృష్ణ అయితే నావైపు కాస్త తేడాతో చూస్తున్నాడు .
అవును నిజమే వొళ్ళంతా వేడిగా ఉంది . క్షణక్షణానికీ పెరుగుతూనే ఉండటంతో చల్లని కొలనులోకి చేరి వేడిని చల్లార్చుకున్నాను కానీ కలుగుతున్న మాధుర్యానికి ఆనందం రెట్టింపవుతూనే ఉంది , నీళ్ళల్లోనుండి బయటకురాగానే మళ్లీ వేడి ..... ప్చ్ ఏమైందో ఏమో .......
కృష్ణమాత్రం అధోవిధంగా నావైపు చూస్తున్నాడు .

బట్టలు మార్చుకుని , నన్ను గుర్తుపట్టకుండా తలపై ముసుగు మరియు కృష్ణను గుర్తుపట్టకుండా కొన్ని మార్పులు చేసుకుని , ప్రవాహం గుండా అమ్మవారి జాతరకు చేరుకున్నాము .
మధ్యాహ్నం బామ్మ చెప్పినట్లు ఇసుకేస్తే రాలనంత జనంతో జాతర అంగరంగవైభవంతో జరుగుతోంది - జనాలంతా నా వీరత్వం గురించే గొప్పలు గొప్పలుగా చెప్పుకుంటున్నారు . 
కృష్ణ ఆనందాలకైతే అవధులులేవు . జనాలతోపాటు గుడిలోపలికివెళ్లి అద్భుతంగా అలంకరించిన అమ్మవారి దర్శనం చేసుకుని బయటకువచ్చాను . ఈసారి మొత్తం ప్రసాదాన్ని కృష్ణకే తినిపించాను , నా కళ్ళు - మనసు మాత్రం ఎవరికోసమో ఆశగా వెతకడం నాకే ఆశ్చర్యం వేసింది .

మరింత ఆశ్చర్యం ....... ఎదురుగా నన్నుకూడా రెండు కళ్ళు జాతర మొత్తం వెతుకుతున్నాయి . మధ్యాహ్నం రక్షించిన అమ్మాయి ముఖంపై ముసుగుతో చుట్టూ అమ్మాయిలతో నాకంటే ఘాడంగా నాకోసం వెతుకుతున్నట్లు తెలిసిపోతోంది . 
ఆ క్షణం కలిగిన ఆనందం ...... ఆఅహ్హ్హ్ ...... తాళపత్ర గ్రంథాలలో వివరించిన స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపించి పులకించిపోతున్నాను - వొళ్ళంతా వేడి తాపాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి . కృష్ణ ....... ఆమె వైపుకు నన్ను తోసాడు - నాకు తెలియకుండానే అడుగులు అమ్మాయివైపుకు కదులుతున్నాయి .

ఒక్కసారిగా జాతరలో తప్పెట్లు మ్రోగడంతో అమ్మాయి మైకం నుండి స్పృహలోకొచ్చాను . లేదు లేదు మన గమ్యం వేరు కృష్ణా ...... అంటూ అమ్మాయివైపు చూస్తూనే వెనక్కు అడుగులువేశాను , కృష్ణా ...... మన ఇద్దరినీ ఓకదగ్గర చూశారంటే కనిపెట్టేస్తారు నేను ఇటు - నువ్వు అటు అన్నాను .
కృష్ణకు కోపం వచ్చినట్లు నన్ను తోసేసి వెళ్ళిపోయాడు . 
ఆ అమ్మాయినుండి అడుగులు మాత్రం దూరంగా పడటం లేదు , నేను వద్దంటున్నా మనసు - కళ్ళు మాత్రం వెనుకే వెళ్ళమని గోల చేస్తున్నాయి , అడుగులు కూడా ఆమె వెనుకే పడుతున్నాయి . 
జాతర మొత్తం నాగురించే వెతకడం - వాళ్ళ స్నేహితులతో నాగురించే మాట్లాడుతూ కనిపించకపోయేసరికి బాధపడుతుండటం చూస్తూ పొందిన ఆనందం ఇంతవరకూ కలగని మధురానిభూతిని కలిగిస్తోంది . ఒప్పు - తప్పు అన్న భావనాలతో సతమతమైపోతున్నాను , చివరికి తప్పుగానే నిర్ణయించుకుని కష్టమైనా దూరంగా వచ్చేసాను - ఆమె మాత్రం ఆపకుండా మళ్లీ మళ్లీ తిరుగుతూ వెతుకుతూనే ఉంది .
జాతర పూర్తయ్యేంతవరకూ ఉండి అందరితోపాటు జాతరలో వడ్డించిన ఆహారం స్వీకరించి , వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే ( అందరూ వెళ్లిపోతున్నా ఆ అమ్మాయిమాత్రం బాధతో ఆశతో ఇంకా వెతుతూనే ఉండటం ) భారమైన హృదయంతో వచ్చేసాను .

నేను చేసినది ఏమాత్రం ఇష్టం లేనట్లు కృష్ణ అలకతో ముందు ముందుకు వెళ్ళిపోతున్నాడు .
పరుగున ప్రక్కకువెళ్లి , నీకే అలా ఉంటే నాకింకెలా ఉంటుందో అర్థం చేసుకో కృష్ణా ...... , ఆ అమ్మాయి నుండి దూరంగా వెళుతున్నకొద్దీ లోలోపల ఎంత బాధపడ్డానో ....... , గురువుగారి కోరిక తీర్చడమే మన ఏకైక కర్తవ్యం నన్ను మన్నించు అంటూ మధ్యాహ్నం సేదతీరిన ప్రదేశానికి చేరుకుని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చల్లని నీళ్ళల్లోకి చేరిపోయాను .
ఇంతటి మధురమైన విరహతాపం ఉంచుకుని చాలాపెద్ద తప్పు చేస్తున్నావు అంటూ కృష్ణ నావైపే చూస్తున్నాడు .
నావల్ల కూడా కావడం లేదు కృష్ణా ...... , కళ్ళు - మనసు నిండా ఆమెనే అందుకే గంగమ్మ ఒడిలోకి చేరాను - అమ్మకూడా నీలానే గుర్రుగా ఉన్నట్లున్నారు - తాపం చల్లార్చడం లేదు , నేనే తప్పుచేస్తున్నానా ...... ? లేదు లేదు నాకు గురువుగారి మాటే ముఖ్యం - అమ్మా మన్నించు అంటూ తనివితీరా అమ్మ ఒడిలో సేదతీరి అలసిపోయినట్లు కృష్ణపై తలవాల్చి కళ్ళు మూసుకున్నాను .

కళ్ళు మూసినా తెరిచినా కనులముందు ఆ అమ్మాయి ....... వొళ్ళంతా వేడి సెగలు , ఏమైందిరా నీకు ...... ఒక్కసారి స్పర్శకే ఇలా అయిపోతే ఎలా ......
మరి జీవితంలో తొలిసారి అమ్మాయి స్పర్శ ...... , " మహీ " ...... ఆఅహ్హ్హ్ పేరు తలుచుకుంటేనే పెదాలపై అందమైన నవ్వులు - వొళ్ళంతా తియ్యదనం . తప్పు తప్పు పరాయి అమ్మాయిని కలవరించడం - పేరుతో పిలవడం .......
అయినా ఆ పేరులో " మహి " ఆఅహ్హ్ ...... ఏదో మాయ ఉంది . 
" మహేష్ - మహి " ...... అంటూ నా మనసులోనుండి వచ్చిందా లేక అరణ్యం నుండి వినిపించిందా అన్నట్లు ఆశ్చర్యంతో లేచి చూసాను . అక్కడక్కడ కిలకిలారావాలు తప్ప అరణ్యం నిర్మానుష్యంగా అనిపించింది - ఆ పిలుపుకే వొళ్ళంతా తియ్యనైన జలదరింపులు మరొకవైపు వేడిసెగలు ....... 
ఆ వేడిసెగలు ...... కృష్ణను తాకినట్లు నన్ను తోసేసి దూరంగా వెళ్లి వాలిపోయింది .
నవ్వుకుని ఇక నావల్ల కూడా కాక గంగమ్మ ఒడిలోకి చేరిపోయాను . ఆఅహ్హ్ ...... చల్లగా హాయిగా ఉంది - పద్దెనిమిదేళ్ల తరువాత మొదటిసారి అమ్మాయి స్పర్శ కదా విలవిలలాడిపోతున్నాను , అమ్మా ...... మీకు అభ్యంతరం లేకుంటే ఈ పూటకు మీ ఒడిలోనే విశ్రమిస్తాను .
అమ్మకు అంతకంటే ఆనందమా అన్నట్లు నాపైకి అలలు ఎగిసాయి . 
మా గంగమ్మకు ...... నేనంటే చాలా ఇష్టం అంటూ నీటి ఉపరితలంపై తేలుతూ నిద్రపోయాను . ఒకవైపు మహి వలన తియ్యనైన వేడిసెగలు - ఆ వెంటనే అమ్మ చల్లదనం ....... నిద్రలోనే చిరునవ్వులు చిందిస్తూ హాయిగా నిద్రపోయాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-07-2022, 10:08 AM



Users browsing this thread: 53 Guest(s)