Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
ఎపిసోడ్ ~ 15


అందరూ రాధ ఏం చెప్తుందా అని తన వైపే చూస్తున్నారు...

రాధ రుద్ర తల నిమురుతూ కళ్లెమ్మటి నీళ్లతో...

రాధ : నేను ప్రసాద్ ఇద్దరం అనాధలం ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కుటుంబం అయ్యాం, చాలా సాఫిగా సాగే లైఫ్ అప్పులు టెన్షన్లు లేని జీవితాలు మావి...

ఒక రోజు వర్షం పడుతుండగా నాకు నెప్పులు మొదలయ్యాయి... ఆటో పిలుచుకుని వస్తానని బైటికి వెళ్లిన ప్రసాద్ తిరిగి రాలేదు, నా వల్ల కాక ముక్కడం మొదలు పెట్టాను బిడ్డ బైటికి వస్తుండగా స్పర్శ కోసం చెయ్యి పెట్టాను, తల తగిలింది అంతే నేను స్పృహ కోల్పోయాను..రుద్ర సగం లోనే ఆగిపోయాడు .. అప్పుడు నాకు తెలియదు రుద్ర జీవితమంతా కష్టాలే అది కూడా నావల్లే అని....

దేవుడు దయవల్ల ఇంటి పక్కన ముసలావిడ నాకు పురుడు పోసింది..... రుద్ర పుట్టడం తనని చేతిలోకి తీసుకోగానే పెద్ద పిడుగు దాని వల్ల ప్రసాద్ మరణం.

ఇది రుద్రని నేను ముట్టుకోడం రెండో సారి, తనకి వాళ్ళ నాన్నని దూరం చేశానని నాకు తెలియదు...

ప్రసాద్ ఆఖరి చూపు కూడా దొరకలేదు, ఉన్న డబ్బులతో నా కొడుకే సర్వస్వముగా బతకాలనుకున్నా... కానీ నాకు నరకం కనపడింది ఆ తరువాతి పది రోజుల్లోనే.... నేను పాలిచ్చిన పది నిమిషాలలో కక్కునేవాడు దానితో పాటే రక్తం కూడా.... నాకు భయం వేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను కానీ వాళ్ళు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు ఏ ప్రాబ్లెమ్ లేదు అని నా మాటలు కొట్టేసారు....

ఆ రాత్రికి పాలు ఇవ్వకుండా తేనె పట్టించాను రుద్రని పక్కలో ఏసుకుని పడుకుని పొద్దున్నే లేచేసరికి పక్కనే ఉన్న తేనె బాటిల్ వల్ల చీమలు రుద్రని కుట్టడం మొదలు పెట్టాయి.... వాడి ఏడుపు విని ఉలిక్కి పడి లేచి రుద్రని చూసుకుని వెంటనే గుడ్డ తో తుడిచి స్నానం చేపించాను, నాకు చచ్చిపోవాలనిపించింది ఎందుకంటే అది నా తప్పే కదా రెండు రోజుల బిడ్డని చీమలు కుడితే ఎలా ఉంటుంది చూసి తట్టుకోలేక పోయాను.... వరసగా ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలిసేది కాదు, వాడు ఏడుస్తుంటే చూడలేక ఒళ్ళంతా కాండియో పౌడర్ రాసి హత్తుకుని పడుకున్నాను వాడి ఏడుపు గుక్కలు వినిపిస్తున్నాయి నావి బైటికి వినిపించట్లేదు అంతే... కానీ చీమలు కుట్టిన మచ్చలు గంటలో మాయం అయిపోయాయి....

ఆ మరుసటి రోజే రుద్రని మంచం మీద పడుకోబెట్టి చుట్టు దిండ్లు పెట్టి పని చేసుకుంటున్నాను లోపల నుంచి బిడ్డ ఏడుపు విని పరిగెత్తికుంటూ లోపలికి వచ్చి చూస్తే రుద్ర కింద పడి ఉన్నాడు.... వెంటనే ఎత్తుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లాను మళ్ళీ అదే  "బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఏం ప్రాబ్లెమ్ లేదు...."

ఆ పది రోజుల్లోనే నాకు అర్ధం అయ్యింది రుద్ర దెగ్గరికి నేను వెళ్ళినపుడల్లా వాడికి కష్టాలే అని... ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కాలేదు ఏం చెయ్యాలో కూడా తెలీదు పాల కోసం వాడు ఏడిచే ఏడుపు చూసి తట్టుకోలేక పోయేదాన్ని...

ఇక వాడి ఏడుపు చూడలేక రుద్ర ని వదిలేద్దాం కనీసం బతికుంటాడు విధి వల్ల కలుసుకుంటే మళ్ళీ కలుసుకుంటాం లేకపోతే లేదు అనుకున్నాను....

పక్కనే గుడికి వెళ్లి అక్కడున్న శివలింగం ముందు పెట్టి ఏడుస్తూ దణ్ణం పెట్టుకుంటుండగా, అక్కడ ధ్యానం చేసుకుంటున్న ఒక స్వామీజీ..

"బిడ్డని వదిలించుకుందాం అనుకుంటున్నావా ప్రయత్నించు నీ వల్ల కాదు" అన్నాడు...

ఏడుస్తూ చూసాను...

స్వామీజీ : "బిడ్డని తీసుకుని ఇలా రా"

రుద్రని ఎత్తుకుని తన కాళ్ళ మీద పడ్డాను.... వీడిది దేవుడి అంశ భూమ్మీద పుట్టాల్సిన జాతకం కాదు ఇది, అందుకే నీకు ఇన్ని కష్టాలు, ఇది విధి అంతే.... ఈ భూమ్మీద ఏ తల్లీ అనుభవించనంత బాధ నువ్వు అనుభవించాల్సిందే నీకు వేరే దారి లేదు...

నాకు ఏం అర్ధంకావటం లేదు, అందుకే ఆయననే చూసాను...

స్వామీజీ : చూడు తల్లీ ఈ క్షణం నుంచి నీ బిడ్డకి ఎంత దూరంగా ఉంటే వాడికి నీకు అంత మంచిది, అలా అని వదిలించుకోవాలని చూడకు నీదేగ్గరుంటేనే ఈ బిడ్డ మంచి దారిలో ఉంటాడు లేకపోతే ఈ భూమి అంతం అయ్యేది వీడి చేతిలోనే...

వీడిని దూరం పెట్టు ఎంత వీలైతే అంత దూరం కానీ నీ ఇంట్లో నీ చుట్టూనే ఉండాలి.... వాడి కష్టం చూసి కరిగిపోకు, కరిగిపోయి వాడి దెగ్గరికి వెళ్ళావంటే ఇంకా పెద్ద కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది...


ప్రతి నెలా పున్నమి తెల్లారే ఇక్కడికి రా వచ్చి ఆ శివుడి ముందు దీపం వెలిగించి పూజించు, నీకు అంతా మంచే జరగాలని ఆ రుద్రుడికి నా వంతు కార్యం నేను చేస్తాను.

స్వామీజీ చెప్పినదంతా వినగానే నాకు మతి పోయింది, రుద్రని చూసాను.... "చెప్పాను కదా వాడి మీద ప్రేమని తగ్గించుకో" అక్కడనుంచి వచ్చేసాను...

నా కళ్ళలో నీళ్లు రాలేదు, రుద్ర మీద ప్రేమ తగ్గించుకోవాలి, రుద్ర మీద ప్రేమ కంటే వీడు బతికుంటే చాలు దూరం నుంచి అయినా చూసుకుంటా అనుకున్నాను.... ఇక అక్కడ ఉండలేదు ముసలావిడ చెప్పినా కూడా వినకుండా రుద్రని తీసుకుని ఆ ఏరియా నుంచి ఇల్లు మార్చేసాను....

మొదటి మూడు నెలలు నరకం చూసాను, నా ఎదలో పాలు కారుతుండేవి రుద్రకి మాత్రం పౌడర్ పాలు.... రాత్రిళ్ళు వాడి ఏడుపు విని తట్టుకోలేక చెవులు మూసుకునే దాన్ని... ఎన్నో రాత్రుళ్ళు ఇద్దరం ఎదురేదురు కూర్చుని ఏడ్చేవాళ్ళం వాడికి ఏం తెలీక నాకు ఏం చెయ్యాలో తెలియక.

ఇంకో రెండు నెలలు అలా వాడిని చూస్తూ వాడి దెగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాడి ఒంటి నుంచి వచ్చే రక్తం చూసి ఇక నా వల్ల కాక ఒక పనమ్మాయిని పెట్టుకున్నాను కానీ రుద్ర కి ఉన్న శక్తుల వల్ల ఆ అమ్మాయి ఎక్కువ రోజులు చెయ్యలేక పోయింది, అలా ప్రతి మూడు నెలలకి ఒకసారి పనమ్మాయి ని మారుస్తూనే ఉన్నాను....

రుద్రకి రెండేళ్లు పడ్డాక చిన్నగా నడవటం మొదలు పెట్టాడు, సంతోష పడాలో లేక వాడు పడిపోతే పట్టుకోడానికి కూడా నోచుకోని నా చేతులని చూసుకుని ఏడవాలో కూడా తెలియని పరిస్థితి...

ఇక రుద్రని దూరం పెట్టాలంటే వాడి మీద కోపం రావాలి అందుకే వాడు పుట్టడం వల్లే నాకు ఇన్ని కష్టాలు అని నాకు నేనే అనుక్షణం  చెప్పుకోసాగాను....

అలా కొన్ని రోజులు దూరంగా ఉండగలిగాను... రుద్ర అమాయకమైన మొహం చూస్తే నాకు ఏడుపు తన్నుకొచ్చేది, రెండేళ్ల పసి కందు నా దెగ్గర పడుకోడానికి లేదు, అమ్మ పాలు లేవు కనీసం పడిపోతే పట్టుకునే వాళ్ళు కూడా లేరు....

కింద పడినప్పుడల్లా వాడికి వాడే లేస్తుంటే తలుపు చాటుగా చూస్తూ ఏడవటం తప్ప ఇంకేం చేయలేక పోయేదాన్ని.... అన్ని విషయాలలో ఇలాగే లేవాలి నాన్న అనుకోడం తప్ప.

ఇక నాకు బతకడానికి డబ్బు అవసరం లేకపోయినా రుద్రని దూరం పెట్టడానికి పక్కనే ఉన్న స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యాను.

స్కూల్ కి వెళ్ళేటప్పుడు రుద్ర ని నా చీరతో కట్టేసి వెళ్లేదాన్ని మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి బాత్రూం క్లీన్ చేసి మళ్ళీ వెళ్లేదాన్ని.... చాలా రోజులు స్కూలుకి వెళ్లకుండా రుద్రని ఇంటి బయట కిటికీ దేగ్గరనుంచి చూసుకునేదాన్ని...

ఒక రోజు అలా చూస్తుండగానే చీరకి తట్టుకుని కింద పడ్డాడు తలకి బొప్పి కట్టి ఏడుస్తుంటే తట్టుకోలేక వెళ్లి రుద్రని హత్తుకుని ముద్దులు పెట్టుకున్నాను... ఆ తరువాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి రుద్ర చీరలో చిక్కుకుని స్పృహ లేకుండా పడి ఉన్నాడు...

మొత్తం చీరని విప్పి నీళ్లు తాగించి పడుకోబెట్టాను... అదే నేను రుద్రకి పెట్టిన చివరి ముద్దు.  ఆ తరువాత రుద్రని స్కూల్ లో జాయిన్ చేసాను... అలా మా ఇద్దరికీ కొంచెం దూరం ఏర్పాటు చేయగలిగాను...

రాజీ నీకు గుర్తుందా నేను మీ క్లాస్ టీచర్ గా వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ లో నా బిడ్డ "ఐ హావ్ నో ఫ్రెండ్స్ నో హాబీస్ ఐయామ్ ఆల్ అలోన్" అన్నప్పుడు నన్ను ఎవరో కత్తి తో పొడిచినట్టనిపించింది.... ఏం తెలియని పసి వాడ్ని కోపంగా చూసేసరికి ఇక భయపడి నా దెగ్గరికి రావడమే మానేసాడు...

తల్లీ ప్రేమ లేక వాడికి బాధ పడటం, నవ్వడం తెలీక ఒక జీవచ్చవం లా తిరుగుతుంటే నా మీద నాకే అసహ్యం వేసేది.

ఒక రోజు రుద్ర రాత్రి పూట నన్ను దొంగ చాటుగా నన్ను చూడటం గమనించాను, అలా రోజు చూస్తుండడం గమనించి, మళ్ళీ రుద్ర నా మీద ప్రేమ పెంచుకుని నా దెగ్గరికి వచ్చేస్తాడేమో అని భయపడి.... ఇక లాభం లేదని అప్పుడే నాకు పరిచయం అయిన శివని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని శివ చెయ్యి పట్టుకుని "పెళ్లి నా కొడుకు అవసరం కోసం చేసుకున్నాను కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నిజం శివ "

శివ వచ్చాక మా మధ్య దూరం పెరిగింది కానీ పిల్లలు పుట్టాక గత కొన్ని రోజులుగా రుద్ర నన్ను ఆనందంగా చూడటం నేను గమనించాను వాడి కళ్ళలో ప్రేమ నన్ను బాధ పెడుతుంది.... మొన్న వచ్చి కౌగిలించుకున్నాడు నేను ఒక్కసారిగా అంతా మర్చిపోయి వాడి ప్రేమలో కరిగిపోయాను ఆ తరువాతే లిఖిత చేతిలో రుద్ర ప్రాణం పోయినంత పని అయ్యింది అందుకే ఇంట్లో నుంచి పంపించేసాను.....

అని ముగించింది.... అందరికి కళ్ళలో నీళ్లు, లిఖిత ఒకసారి రుద్రని చూసుకుని బైటికి వెళ్ళిపోయింది.

రాజీ వాటర్ బాటిల్ తీసుకొచ్చి రాధకి ఇచ్చింది, రుద్రని తప్పించి లేచి నీళ్లు తాగింది.

అంతా వింటున్న నా కళ్ళలో నీళ్లు కారుతూనే ఉన్నాయ్.... అవును చిన్నపటి నుంచి అమ్మ నా దెగ్గరికి వచ్చినా, నేను అమ్మ దెగ్గరికి వెళ్లినా ఆ రోజో లేక తెల్లారో నాకు పవర్స్ పోయేవి.... ఇప్పుడే ఒక్కొక్క విషయము అర్ధమవుతుంది నాకు.

నాకంటే శాపాలు అవి ఇవి ఉన్నాయి కానీ అమ్మ? అమ్మకెందుకు ఇన్ని కష్టాలు... ఇప్పుడు అలోచించి అనవసరం అని కళ్ళు తెరిచాను...

నేను కళ్ళు తెరవడం చూడగానే అందరూ నా చుట్టూ చేరారు అమ్మ కొంచెం భయంగానే వెనక్కి జరిగింది, అందరిని పలకరించి.... రాజీ కి సైగ చేశాను దెగ్గరికి వచ్చింది... తన చెవిలో నా ప్లాన్ వదిలాను... నవ్వుతూ అలాగే అని పిల్లల్ని బైటికి తీసుకెళ్ళింది ఆ వెంటనే శివ సర్ ని బైటికి పిలిచింది.

అమ్మకి అర్ధమయ్యే లోపు నేను స్పీడ్ గా నా రూమ్ డోర్ లాక్ చెయ్యడం,  బైట రాజీ కూడా డోర్ లాక్ చెయ్యడం రెండు జరిగిపోయాయి..

అమ్మ వైపే అడుగులు వేస్తున్నాను ప్రేమగా నవ్వుతూ...

రాధ వెనక్కి అడుగులు వేస్తూ గోడకి ఆనుకుని ఆగిపోయి " రుద్రా వద్దు మన ఇద్దరికీ మంచిది కాదు" అంది.

అలానే వెళ్లి అమ్మని అల్లుకు పోయాను... అమ్మ వదిలిన్చుకోడానికి గింజకుంటుంది, తన నడుము మీద రెండు చేతులు వేసి తన మెడకి నా మెడని అనించి గట్టిగా ఒక పాము ఇంకొక పాముని అల్లుకున్నట్టు నేను అమ్మని అల్లుకుపోయాను, అలానే తీసుకెళ్లి మంచం మీద పడుకో బెట్టుకొ బెట్టి తన మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను అమ్మ గింజకోడం ఆపేసి నన్ను ఇంకా గట్టిగా హత్తుకుని ఉంది.

కొంచెం సేపటికి కళ్ళు తెరిచి చూసాను మా ఇద్దరి కళ్ళలో నీళ్లు, తన మొహం నిండా ముద్దులు పెట్టాను ఆఖరికి తన పెదాల మీద కూడా...

రుద్ర : అమ్మా...  ఇక ఇన్నిరోజులు పడ్డ కష్టాలు చాలు, నాకోసం నువ్వు నీకోసం నేను పడిన బాధ కూడా చాలు....

నా ప్రాణం అయితే పోదు అని దేవుళ్ళు చెప్పారు నేను ఈ మనిషి రూపం అనుభవించాల్సిందేనట.... మనం ఇద్దరం కలిస్తే ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయా రాని...  చినప్పటి నుంచి మనం అనుభవించిన నరకం కంటే ఎక్కువా...

ఒక వేళ నాకేమైనా అవుతుందని నువ్వు అనుకుంటే బతికిన ఒక్క రోజైనా ఇలా నీ వొళ్ళో పడుకుని నీ ప్రేమని అనుభవించి చచ్చిపోతానమ్మా అంతకంటే నాకు ఇంకేం వద్దు....

నా మాటలకి అమ్మ ఏడుస్తూ నా నుదిటి మీద ముద్దు పెట్టుకుని గట్టిగా హత్తుకుంది తన గుండెల మీద పడుకున్నాను....

లిఖిత గుర్తొచ్చింది, ఇక్కడ లేదు అంటే తన వాళ్ళ దెగ్గరికి వెళ్లి ఉంటుంది, ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది.... తనని కాపాడాలి అలాగే ఒక సారి మహర్షిని కలవాలి... ఎందుకంటే అమ్మ చెప్పిన స్వామీజీ, నేను పిలుస్తాను కదా మహర్షి ఇద్దరు ఒకటే అని నాకు తెలుసు...

కానీ ముందు అమ్మ ఆ తరువాతే ఎవరైనా అని ప్రశాంతంగా అమ్మ కౌగిలిలో నిద్రపోయాను.....
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Takulsajal - 10-05-2022, 05:15 PM



Users browsing this thread: 4 Guest(s)