Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
ఎపిసోడ్ ~ 17


పెళ్ళికింకా వారం ఉంది కానీ ఎంత ట్రై చేసినా అమ్మ నాకు దొరకట్లేదు నా పెళ్లికి సంతోషంగా పనులు ఎవ్వరిని చెయ్యనివ్వకుండా అన్ని తనే చేస్తుంది....

అమ్మా అని పిలిచాను పలకలేదు పనిలో నిమగ్నమై ఉంది, అటు ఇటు హడావిడిగా తిరుగుతుంది, అమ్మ చెయ్యి పట్టుకున్నాను...

అమ్మ : ఏంటి చిన్నా..

రుద్ర : పనులు చెయ్యడానికి వాళ్ళందరూ ఉన్నారులె ఇటు రా అని మంచం మీదకి లాగాను...

తనని కూర్చో బెట్టి తన ఒళ్ళో పడుకున్నాను...

నా తల నిమురుతూ "ఏమైంది నాన్న" అంది.

రుద్ర : నువ్వు పనులు చెయ్యకు అస్సలు నన్ను వదిలి ఎటు వెళ్ళకు నాతోనే ఉండు....

అమ్మ : అలా అంటే ఎలా నాన్న... నువ్వు నేను కలిసి చేసుకునే మొదటి పండగ నీ పెళ్లే, అన్ని పనులు నేనే చెయ్యాలి ప్రతి ఒక్కటి నా చేతుల మీదే జరగాలి....

నా దురదృష్టమో ఏమో నీకు పాలు పట్టే అదృష్టం నాకు కలగలేదు, నీకు అక్షరాభ్యాసం, నడక, బర్తడేలు, మెచ్చుకోడాలు, నీ నవ్వులు ఏవి నా చేతుల మీద జరగలేదు....

తన కళ్ళలో నీళ్లు నేను తుడిస్తే నా కళ్ళలో నీళ్లు అమ్మ తన కొంగు తో తుడిచింది, అది చూసి రాజీ,  పిల్లలు వచ్చి అమ్మ మోకాళ్ళ దెగ్గర కూర్చున్నారు... లోపల లిఖిత కూడా బాధ పడింది .

అయినా ఈ వారం రోజులుగా మనల్ని చూసి కుళ్ళుకుంటూనే ఉన్నారు, నవ్వుతూ "అటు చూడు" అని పిల్లల్ని చూపించి "నిన్ను నన్ను చూసి వాళ్ళని దెగ్గరికి తీయట్లేదాని ఎంత కోపంగా చూస్తున్నారో".... "ఇక అటు చూడు" అని శివని చూపించి "కనీసం దెగ్గరికి కూడా వెళ్ళలేదు పాపం అల్లాడి పోతున్నారు ముగ్గురు ".

వాళ్ళ మాడిపోయిన మొహాల్ని చూసి అమ్మా నేను నవ్వుకున్నాం....

అమ్మ : అప్పటి పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకున్నాను కానీ నీకు ఎప్పటికి దూరం అవ్వాలని కాదు నాన్న...

రుద్ర : నాకు తెలుసమ్మా నువ్వస్సలు బాధ పడకు, పిల్లల వల్ల నువ్వెంత సంతోషంగా ఉన్నవో తెలీదు కానీ నాకు పిల్లల వల్ల చాలా ఆనందాలు ఉన్నాయ్..

ఇక శివ సర్ వచ్చినందువల్ల నాకేం బాధ లేదు తను చాలా మంచి వాడు నీకు సరైన జోడి.... నా చెయ్యి తన తల దెగ్గర పెట్టుకుని అవునంటూ ఏడుస్తూ తల ఊపింది.

శివ సర్ అమ్మ మోకాళ్ళ దెగ్గరికి వచ్చి "ఇన్ని రోజులు మమ్మల్ని దూరం పెట్టి అనుభవించాల్సిన ఆనందాలన్నీ అమ్మా కొడుకులు ఇద్దరే అనుభవించి ఇప్పుడు ఏడుస్తున్నారా " అన్నాడు.

దానికి అమ్మా నేను నవ్వుకున్నాం...

శివ : అందరూ పదండి ఇంకా చాలా పనులున్నాయి...

అందరు వెళ్ళిపోయాక...

రుద్ర : అమ్మా ఎప్పటి నుంచో ఒక ప్రశ్న మిగిలిపోయింది అడగనా?

అమ్మ : తల నిమురుతూ "అడుగు చిన్నా..."

రుద్ర : అది నాన్న గురించి... నీకు ఇబ్బందిగా అనిపిస్తే వద్దు...

అమ్మా : ఛా ఛా నాకు ఇబ్బందా... శివని పెళ్లి చేసుకుని ఇప్పుడు బానే ఉంటున్నాం కానీ ప్రసాద్ నాకు ఎప్పుడు గుర్తే నా జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉంటాడు...

నీకోటి తెలుసా నా జీవితం లో మీ నాన్నతో ఉన్నప్పుడు అంత సంతోషంగా ఎప్పుడు లేను...

రుద్ర : అవును నేను పుట్టగానే కదా నీకు అన్ని కష్టాలు...

అమ్మ : నాకొక్క దానికే కాదుగా..... ఇంకెప్పుడు వాటి గురించి మాట్లాడకు, నిన్ను సరిగ్గా నా చేతుల్లో పెంచలేదన్న బాధ నా జీవితాంతం ఉంటుంది అది నా జీవితం లో మానిపోని మచ్చ.. కానీ గుర్తుచేసుకోకపోవడమే మంచిది..

రుద్ర : నాన్న గురించి చెప్పు.

అమ్మ : హ్మ్....ప్రసాద్ నన్ను తెగ నవ్వించేవాడు... నువ్వు కూడా మీ నాన్న లాగే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమించిన వాళ్ళని వదలరు, నువ్వు రాజినీ ఎలా వదలలేదో ప్రసాద్ కూడా అంతే నన్ను వదిలేసి నా ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని ఉంటే కొన్ని కోట్లకి అధిపతి అయ్యుండేవాడు కానీ ఆ ఆలోచన కూడా చెయ్యలేదు....

మీ నాన్న కి నువ్వు పుట్టక ముందే తెలుసు అబ్బాయే అని...

రుద్ర : ఎలాగ?

అమ్మ : ఏమో కానీ అబ్బాయి అబ్బాయి అని గోల చేసేవాడు... నువ్వు పుట్టాకముందే నీపేరు పెట్టేసాడు రుద్ర అని..... అది మా మాష్టారు గారి పేరు...

రుద్ర : హో... ఇంకా..

అమ్మ : నువ్వు కడుపులో ఉన్నప్పుడు రోజు నీతో గంటలు గంటలు సోది వేసేవాడు..... ముఖ్యంగా రోజులో నీకు ఎన్ని జోకులు చెప్పేవాడో.... నేను అటు ఇటు తిరగడం చూసి హాస్పిటల్ లో జాయిన్ చేసేస్తా అని బెదిరించేవాడు...

ఇద్దరం నవ్వుకున్నాం...

అవును చిన్నా హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది అమ్ములు పుట్టడమే వికారంగా పుడుతుందని డాక్టర్ చెప్పింది, ఆ రోజు రాత్రి నువ్వు నా దెగ్గరికి వచ్చావ్... అమ్ములు కన్నగాడు ఇద్దరు ఆరోగ్యంగా పుట్టారు... నీ పనే కదా ?

రుద్ర : హ్మ్ అవును నా ఎంగిలి తో ఎవరినైనా నయం చెయ్యగలను అందుకే ఆ రోజు నా వేలితో ఎంగిలి తీసి నీ నోట్లో పెట్టాను అప్పుడే నువ్వు లేచావ్... అప్పుడు చెప్పలేదు సారీ మా...

అమ్మ : నేను సారీ చెప్పే లోపే తన పెదాలతో నా పెదాలు మూసేసింది..... "ఎప్పుడు సారీ చెప్పొద్దు ఈ అమ్మకి"..

పద పాపం వాళ్లంతా ఫీల్ అవుతున్నారు వెళదాం...

రుద్ర : అమ్మా ఆ తరువాత ఏం జరిగింది...

అమ్మ : వద్దు నాన్న పద... వెళదాం..

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

పెళ్ళికి అమ్మ అందరిని పిలిచింది కానీ అన్ని పనుల్లో పని చేసిన నా ఫ్రెండ్ ప్రసాద్ గాడు కనిపించలేదు...


వాడి నెంబర్ స్విచ్ అఫ్ వస్తుంది, నాకున్న కష్టాలకి అస్సలు కాలేజీ కి వెళ్లిందే లేదు అందుకే ప్రసాద్ ఇంటి అడ్రస్ లేదు నా దెగ్గర, పెళ్ళికి ఇంకా రెండు గంటల టైం ఉందనగా కాలేజీ కి వెళ్లి చూడగా ప్రసాద్ లేడు అన్నారు వాడి id నెంబర్ చెప్పాను ఎవరో ప్రకాష్ అడ్రెస్స్ ఇచ్చారు తీసుకున్నాను...

ఇంటికి వెళ్లి అడగగా... ప్రసాద్ అని ఎవ్వరు లేరే? అన్నారు, డౌట్ వచ్చి లోపలికి వెళ్ళాను... ఎదురుగా గోడకి ఫోటో దానికి పెద్ద దండ కానీ అందులో ఉన్నది ప్రసాద్ కాదు ప్రకాష్ అని తెలిసింది... మరి ఇన్నిరోజులు నాతో కలిసి చదువుకున్న ప్రసాద్ ఎవ్వరు డౌట్ వచ్చింది...

వెంటనే ఇంటికి వెళ్లి "అమ్మా నాన్న ఫోటో ఉందా నేనొకసారి చూడాలి" అన్నాను... లోపలికి వెళ్లి లాకర్ నుంచి ఫోటో తీసుకొచ్చింది.

వెంటనే అందుకుని ఫోటో చూసాను... ఇద్దరు ఒకటే అంటే మా నాన్న ప్రసాదే నా ఫ్రెండ్ గా వచ్చాడా, ఇన్ని రోజులు నాతోనే ఉండి ఎందుకు చెప్పలేదు, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు.... మళ్ళీ అన్ని ప్రశ్నల వర్షం కురుస్తున్నాయి నా మైండ్ లో  ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అబబ్బబ...

ఇంతలో అమ్మ నా భుజం పట్టుకుని కదిలించి "ఏమైంది రుద్రా" అంది.

ఇంత సంతోషంగా ఉన్న అమ్మ మొహం లో మళ్ళీ బాధని చూడాలనుకోలేదు అందుకే..

రుద్ర : ఏం లేదమ్మా ఊరికే ఇప్పటివరకు నాన్న ని చూడలేదు కదా, చూడాలనిపించింది...

అమ్మ : అలాగే నాన్న ఫోటో ఫ్రేమ్ చేపిద్దాం ఇదంతా అయిపోయాక, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫంక్షన్ హాల్ కి వెళ్ళాలి నువ్వింకా రెడీ అవ్వలేదు పద పదా...

అందరం కలిసి పెళ్లి మండపానికి వెళ్ళాం... నేను రాజీ ఇద్దరం పెళ్లి పీటల మీద కూర్చున్నాం, లిఖిత అంతా ఆనందంగా ఆశ్చర్యంగా చూస్తుంది జరిగే పెళ్లి తంతు.

రాజీ కి తాళి కట్టేటప్పుడు మాత్రం లిఖిత ఎడమ చేత్తో నేను కుడి చేత్తో ఇద్దరం కలిసి తాళి కట్టాం...

రాజీ నేను ఇద్దరం అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం శివ గారితో పాటు, పాపం పిల్లలకి చెయ్ అందక అక్షింతలు పట్టుకుని అలానే ఉన్నారు... నేను రాజీ పిల్లల ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాం నవ్వుతూ....కన్నగాడు అమ్ములు అక్షింతలు వేసి తెగ సంబర పడిపోయారు.రాజీ కన్నాని నేను అమ్ములుని ఎత్తుకున్నాం .. కానీ అమ్మ చేతిలో ఇంకా సగం అక్షింతలు ఉన్నాయి...

అందరికి ఆశీర్వాదాం తీసుకున్న తరువాత అమ్మ నన్ను ఒక్కన్నే పిలిచింది....మళ్ళీ ఆశీర్వదిస్తూ "పిల్లా పాపలతో సుఖంగా ఉండండి" అని నా గుండె మీద చెయ్యి పెట్టి నిమురింది.

వెంటనే నేను "అమ్మా అది లిఖి....." అనబోతుండగానే, అమ్మ నా పెదాల మీద వేలు పెట్టి "ష్ " అంది...

లిఖిత : అత్త నాకు నచ్చింది రా, మళ్ళీ ఒంగో ఇందాక ఆశీర్వాదాం తీసుకోలా నేను అత్త గురించి తెలీక...

రుద్ర : "బలుపె నీకు" అని బయటకి అనేశాను... అమ్మ గట్టిగా నవ్వుతుంది..... "అమ్మా అది ఆశీర్వాదం తీసుకోలేదంట ఇప్పుడు బతిమిలాడుతుంది..."

అమ్మ వెంటనే అక్షింతలు తెచ్చింది మళ్ళీ అమ్మ కాళ్ళు పట్టుకున్నాను....లిఖిత మనస్ఫూర్తిగా అమ్మ కాళ్ళు పట్టుకుంది..

కార్యక్రమం అయిపోయిన తరువాత అందరం ఇంటికి వెళ్ళాం... దారిలో లిఖిత నా శరీరం నుంచి బైటికి వెళ్ళింది... పోయేటప్పుడు అది కొట్టిన కామెడీ డైలాగ్ మీరు కూడా వినండి "మొదటి శోభనం రాజీ తో మనస్ఫూర్తిగా జరగాలి నేను అడ్డు రాను అందుకే వెళ్తున్నాను" అని... చూసారా నన్ను మనశాంతి గా వదిలేసిందట... దీనమ్మ ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటది ఇది అని డౌట్ గానే ఇంటికి వెళ్ళాను..

శోభనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అందరి మొహాల్లో సిగ్గు, బహుశా ఎవరి శోభనం వారికీ గుర్తొచ్చిందేమో.

కానీ ఇక్కడ జరిగింది రివర్స్ పాల గ్లాస్ పట్టుకుని పెళ్లి కూతురు కదా రావాలి కానీ నేను వెళ్తున్నాను...

ఏమంటే పెళ్లి కూతురి కోరిక అన్నారు... పాల గ్లాస్ పట్టుకుని లోపలికి వెళ్ళాను... డోర్ పెట్టి రాజినీ చూసాను...

ఎర్రటి బ్లోజ్ తెల్లటి చీర నడుము దాకా మల్లె పూలు దేవకన్య లా కనిపించింది.... వెంటనే సడన్ షాక్ ఇస్తూ సప్రైస్ అని గట్టిగా అరిచి మంచం దుప్పట్లో నుంచి అదే రెడ్ బ్లౌజ్ తెల్ల చీర మల్లెపూల తో లిఖిత లేచింది...

నేను ఆశ్చర్యంగా చూస్తుండగానే ఇద్దరు పరిగెత్తికుంటూ వచ్చి నా మీదకి దూకి చెరోక సంకలో దూరారు.... గట్టిగా నవ్వుతూ..

రాజీ లిఖిత ROCKS »»»»❤️«««« రుద్ర SHOCKS

సమాప్తం

❤️
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Takulsajal - 11-05-2022, 09:43 PM



Users browsing this thread: 4 Guest(s)