Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విక్రమ్ ~ లవ్ పార్ట్
(22-05-2022, 01:34 AM)Takulsajal Wrote:
4


పొద్దున్నే లేచాను ఇవ్వాళ అన్ని కొత్త కొత్తగా ఉన్నాయ్, బెడ్ మీద నుంచి లేచి ఇంటి ముందు గార్డెన్ లోకి వచ్చా, రోజు నేను చికాకుగా చూసే పక్షులు ఇవ్వాళ అందంగా కనపడుతున్నాయి.

త్వరగా స్నానం చేసి టైం చూసుకున్నాను కాలేజీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా రెండు గంటల పైనే పడుతుంది, రోజు వేసుకునే టైట్ డ్రెస్సులు వేసుకోబుద్ది కాలేదు, నాకోసం అమ్మ పోయిన సారి బర్తడేకి గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ తీసాను అదొక ఫుల్ హాండ్స్ ఎల్లో టీ షర్ట్ అండ్ తిక్ బ్లు జీన్స్, వేసుకుని అద్దంలో చూసుకున్నాను చాలా బాగుంది, విక్రమ్ నన్ను చూస్తాడా? తనకి నచ్చుతుందా అని ఆలోచిస్తూ మంచం మీద కూర్చున్నాను.

అన్నిటికంటే ముందు అమ్మ ఈ డ్రెస్ లో నన్ను చూసి సంతోషపడితే బాగుండు అనిపించింది, అలా ఎందుకు అనిపించిందంటే అమ్మ నాతో మాట్లాడదు కాబట్టి.

నాకు ఈ ప్రపంచంలోనే ఇష్టమైన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అమ్మ, అందరు నన్ను నా చిన్నప్పుడు అమ్మ కూచి అని పిలిచేవారు ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకుని అమ్మ ఎటు వెళ్తే అటు వెళ్లేదాన్ని..

కానీ నాకు రాను రాను డబ్బు పిచ్చి పిచ్చి కాదు అది మదం అని చెప్పుకోవచ్చు ఎక్కువైంది, అమ్మ పోలికలతో కొంచెం అందం కూడా వచ్చింది దానితో పాటే గర్వం కూడా..

నాకున్న ఫ్రెండ్స్ అందరు అటువంటి వాళ్లే నేను వాళ్ళలా ఉండకపోవడంతొ కొంచెం దూరం పెట్టారు అందుకే నేను వాళ్ళలా మారిపోయాను.

మొదట్లో అమ్మ చెప్పి చూసింది కానీ నా కష్టాలు తనకేం తెలుస్తాయి అని కొట్టి పారేసాను.

ఒక రోజు ఏదో చికాకులో ఉండగా మా ఇంట్లో పనిచేసే రమ కొడుకు నానీ నన్ను ఆటపట్టించాడు వాడు చిన్నపిల్లోడు కానీ కోపంలో వాడిని కాలితో తన్నాను.

అప్పటినుంచి అమ్మ నాతో మాట్లాడడం మానేసింది, అది కొంచెం బాధగా ఉండేది, అప్పటి నుంచే అందరి మీద కోపగించుకోడం చులకనగా చూడటం మొదలయ్యాయి.

కానీ విక్రమ్ ని చూసాకే నాలో ఉన్న నా చిన్ననాటి మానసని నాకు మళ్ళీ పరిచయం అయ్యింది.

ఇంతవరకు తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక వేళ తనకీ గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటే అయినా పరవాలేదు దూరం నుంచి ప్రేమిస్తాను, నాకు దక్కకపోయినా పరవాలేదు నా ప్రేమని మాత్రం ఆపలేను అది నాకు తనని చూసిన మొదటి చూపులోనే అర్ధమైంది.

ఇక అమ్మకి కనిపించాలని కావాలనే తన రూమ్ ముందు అటు ఇటు పని ఉన్న దాని లాగ తిరిగాను కొంచెం సేపటికి అమ్మ బైటికి వచ్చింది.

అమ్మ నన్ను చూసేలాగ "రమా టిఫిన్ పెట్టు" అని అరిచాను, అమ్మ నన్ను చూసింది, కొంచెం షాకింగ్ గానే చూసింది మళ్ళీ ఏమైందో తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.

వెనకాలే వెళ్లాను అమ్మ లోపలికి వెళ్లి గోడకి తగిలించి ఉన్న నా ఫోటోకి ముద్దు ఇచ్చింది, ఆ ఫోటో నా చిన్నప్పటిది అందులో లంగా ఓణి లో ఉన్నాను, వచ్చే వారం నా బర్తడే ఉంది అప్పుడు అమ్మకి ఆ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నాను.

రమ ఆంటీ టిఫిన్ పెట్టుకొచ్చింది తినేసి కాలేజీకి బైలుదేరాను, ఇంకా విక్రమ్ రాలేదు నా ఫ్రెండ్స్ కూడా రాలేదు కానీ రమ్య వాళ్ళు కనిపించారు.

మానస : రమ్యా..

రమ్య : చెప్పు మానస..

పూజ : ఏముంది మళ్ళీ ప్రాంకో లేక ఏడిపించడానికో వచ్చి ఉంటుంది.

రమ్య : నువ్వు ఊరుకోవే.

మానస : అది మొన్న మీ ఫ్రెండ్ సలీమాని ఏడిపించిందని సోనియా మెడ పట్టుకున్నాడు కదా తనెవరు, సలీమా బాయ్ ఫ్రెండా?

రమ్య : ఛీ కాదు మానస విక్రమ్ కి సలీమా చెల్లి లాంటిది, మొన్న సలీమా వాళ్ళ అమ్మ పోయాక తన బాధ్యత విక్రమ్ వాళ్లే తీసుకున్నారు, విక్రమ్ వాళ్ళ అమ్మ కూడా సేమ్ విక్రమ్ లాగే చాలా మంచిది.

ఇంతలో విక్రమ్ బైక్ మీద వస్తుండడం చూసి, "సరే రమ్య నేను వెళ్తాను, నా తరపున సోనియా చేసిన పనికి సలీమాకి సారీ చెప్పు"అని అక్కడ నుంచి క్లాస్ లోకి వచ్చేసా ఎలాగో వస్తాడుగా అప్పుడు మళ్ళీ చూడొచ్చులే అని...

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

విక్రమ్ : ఏంటి అలా చూస్తున్నారు పదండి వెళదాం.

పూజ : ఆ మానస సలీమాకి సారీ చెప్పమని చెప్పి వెళ్ళింది అందుకే అలా షాక్ లో ఉండిపోయాం, మళ్ళీ మనల్ని ఆటపట్టించట్లేదు కదా...

ఇంతలో నా భుజం మీద వెనక నుంచి ఎవడో రాడ్ తొ కొట్టాడు.. మొన్న ఫాతిమా అమ్మని స్మశానం వరకు ఒక్కన్నే ఎవ్వరికి ఇవ్వకుండా మోసాను కదా అక్కడ కొంచెం కమిలింది దెబ్బ కరెక్ట్ గా అక్కడే పడేసరికి కింద కూర్చుండిపోయాను.

చందు వాడిని ఒక్క తన్ను తన్నాడు, దూరం నుంచి సంధ్యతొ మాట్లాడుతున్న భరత్ చూసి పరిగెడుతూ వచ్చి మిగతా వారి మీద కలపడ్డాడు నేను లేచి మిగతా వాళ్ళ మీద కలబడ్డాను, చుట్టు స్టూడెంట్స్ అంతా మూగి చూస్తున్నారు.

ఊరివాళ్ళం కదా ఆరుగురిని ముగ్గురం కలిసి బాగానే హేండిల్ చేసాం, మా పిడి గుద్దుళ్ళకి తట్టుకోలేక వాళ్ళు పారిపోయారు, మేము క్లాస్ కి వెళదాం అని మెట్లు ఎక్కుతుండగా ఎవరో మాట్లాడుకోగా విన్నాం (అరే వీళ్ళు ఆ mla మనుషులు కదా వాళ్ళతో వీళ్ళకేంటి గొడవ) అని.

పూజ అది విని : చెప్పాగా ఆ మానస మంచిగా మాట్లాడినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది ఇలాంటిదేదో ఉంటుందని వాళ్ళనీ....

విక్రమ్ : ఇది మానస పని కాదు, ఇంతటితొ వదిలేయ్...

పూజ : మరి.. ఇంకెవరి పని?

విక్రమ్ : అదిగో అక్కడ చెట్టు కింద ఉన్నారు కదా సోనియా, పల్లవి వాళ్ళ పని.

అందరు అటు చూసారు మమ్మల్ని కొట్టడానికి వచ్చిన మనుషులని తిడుతున్నారు, పారిపోయి వచ్చారనేమో.

క్లాస్ లోకి ఎంటర్ అవుతూనే నా కళ్ళు ఆటోమేటిక్ గా మానస కోసం క్లాస్ మొత్తం స్కాన్ చేసేసాయ్, చివరి బెంచ్ లో కూర్చుని నన్నే చూస్తుంది, తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది అది గమనించాను...తనని చూస్తూ వెళ్లి కూర్చున్నాను, మానస నన్నే చూస్తుంది ఓర కళ్ళతో.

సలీమ : విక్రమ్ దెబ్బ చాలా గట్టిగా తగిలిందా ఏది చూడని...

విక్రమ్ : లేదు చిన్నదే.. తగ్గిపోతుంది.

పూజ : అవునురా మానస కాదు అని అంత గట్టిగా ఎలా చెప్పావ్?

విక్రమ్ : ఏదో అలా చెప్పా వదిలేయ్యవే... (నమ్మకం  మా అమ్మ తన గురించి చెప్పినదాని బట్టి తన మీద ఉన్న నమ్మకం అని మనసులో అనుకున్నాను).

కాసేపటికి సోనియా, పల్లవి వచ్చి మానస పక్కన కూర్చున్నారు, వాళ్ళు మానసతొ ఏం చెప్పారో తెలీదు కానీ వాళ్ళని తిట్టి నన్ను చూస్తూ లేచి అక్కడనుంచి వెళ్ళిపోయింది.

అందరం క్లాస్ వింటూ జోకులు వేసుకుంటూ ఉన్నాం ఇంతలో ల్యాబ్ పీరియడ్ లో అందరు ల్యాబ్ కి వెళ్లారు, నేను కొంచెం సేపు పడుకుంటానని చెప్పి క్లాస్ లోనే ఉండిపోయాను, లేచి క్లాస్ లో అటు ఇటు తిరుగుతూ డోర్ వైపు వెళ్తుండగా మానస లోపలికి వచ్చింది.

ఇదే మొదటి సారి ఇద్దరం ఎదురెదురుగా మా పక్కన ఎవ్వరు లేకుండా ఒకరి కళ్ళలోకి ఇంకొకరం చూసుకోడం, నన్ను చూస్తూనే నోరు తెరిచి అలానే ముందుకు వస్తూ బెంచ్ కి కాలు తట్టి ముందుకు పడబోయింది, చెయ్యి అందించడానికి చెయ్యి పైకి లేపాను, నా అర చేతిలో తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని పడిపోకుండా నీలాదొక్కుకుని నిల్చుని నన్నే చూస్తుంది.

ఇంకా తన చెయ్యి నా చేతిలోనే ఉంది, క్లాస్ లోకి ఎవరో వస్తున్నా చప్పుడుతొ సడన్ గా నా చెయ్యి వదిలేసి నా చేతిలో ఆయింట్మెంట్ పెట్టి తన బెంచ్ దెగ్గరికి పరిగెత్తింది.

ఈలోగా మా క్లాస్ స్టూడెంట్స్ అంతా వచ్చేసారు,

రమ్య : ఏంట్రా పడుకోలేదా?

విక్రమ్ : లేదు ఆయింట్మెంట్ తెచ్చుకోడానికి వెళ్ళా.

పూజ : తెచ్చుకున్నావా మరి?

విక్రమ్ : ఇదిగో.

నా బెంచ్ లో కూర్చోడానికి వెళ్తూ మానసని చూస్తుండగా సలీమా నా చేతిలో ఉన్న ఆయింట్మెంట్ తీసుకుంది, నాకు రాయడానికి, ఆ తరువాత కాలేజీ అయిపోయాక మానసని ఒకసారి చూసి ఇంటికి వచ్చేసాను సలీమాతొ పాటు.

ఇంటికి రాగానే అమ్మ ఏదో ఒకరకంగా నన్ను గమనిస్తూ సైగ చేసింది, నాకు అర్ధం కాలేదు ఇప్పటివరకు అమ్మ అలా చెయ్యనే లేదు.



≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

సాయంత్రం ఆరు అవుతుండగా మానస వాళ్ళ నాన్నతొ గొడవేసుకుంది, మానస వాళ్ళ అమ్మ ఒక పక్కన నిలబడి ఆశ్చర్యంగా చూస్తుంది.

వాళ్ళ నాన్న కూడా అయోమయంగానే ఉన్నాడు, ఎదురుగా సోనియా, పల్లవి ఇద్దరు తలలు దించుకుని ఉన్నారు.

మానస : ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా, చూసుకోవద్దు.

శివరాం : నిన్ను ఏడిపించారని చెప్పారు అందుకే మనుషుల్ని పంపించాను తల్లీ.

మానస : "పెద్ద గొప్ప పని చేసావ్... వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయ్యడమేనా, పనికిమాలిన మొహాలు" అని సోనియా, పల్లవి ఇద్దరినీ కోపం గా చూసింది.

శివరాం : ఇప్పుడేమైంది? కొడితే కొట్టారు ఏం కాదులే..

మానస : ఇలా ఆలోచిస్తావ్ కాబట్టే mla దెగ్గర ఆగిపోయావ్, ఆ అబ్బాయి ఎవరో తెలుసా, ఆ అబ్బాయి చెప్తే ఒక ఊరి స్టూడెంట్స్ మొత్తం కదులుతారు, చాలా ఫాలోయింగ్ ఉంది కాలేజీ లో.. మీరు ఇలా స్టూడెట్స్ అందరిని కనిపించినోడినల్లా కొట్టుకుంటు పోతే ఆఖరికి ఈ mla పోస్ట్ కూడా ఊడిద్ది....స్టూడెంట్స్ సపోర్ట్ లేకుండానే మీరు ఎదగ గలరని అనుకుంటున్నారా?

శివరాం : నువ్వు చెప్పిందీ కరెక్టే.. ఆ అబ్బాయికి సారీ చెప్పించనా?

మానస : చెప్పించాల్సింది కొట్టినోళ్లతో కాదు కొట్టించాల్సిన వాళ్ళతో...అని అక్కడనుంచి వెళ్ళిపోయింది, మానస వాళ్ళ అమ్మ తనలోని మార్పుని గమనిస్తూనే ఉంది .

మానస తన రూమ్ లోకి వెళ్లి అసహనంగా బెడ్ మీద కూర్చుంది, అక్కడే రమ ఆంటీ కొడుకు నాని కూర్చుని ఆడుకుంటున్నాడు.

సడన్ గా మానసని చూసి బెదిరిపోయాడు, నానీ ని చూడగానే మానసకి ఇందాక తన చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది "చెప్పించాల్సింది కొట్టినోళ్లతో కాదు కొట్టించాల్సిన వాళ్ళతో" అని కానీ కానీ నానీని ఒకప్పుడు తన్నిన్ది తనే కదా....

ఇంట్లో పని చేస్తున్న రమకి మానస పైకి వెళ్ళగానే తన రూమ్ లో ఆడుకుంటున్న తన కొడుకు గుర్తొచ్చి పైకి పరిగెత్తింది కానీ అక్కడే డోర్ దెగ్గర చాటుగా చూస్తున్న మానస వాళ్ళ అమ్మని చూసి ఆగిపోయింది.

మానస : నానీ ఇలా రా..

నానీ అప్పటికే మానసని చూసి బెదిరిపోయి ఉన్నాడు, భయం భయంగానే దెగ్గరికి వెళ్ళాడు.

మానస తన బ్యాగ్ లో నుంచి చాక్లేట్ తీసి నానీ కి ఇస్తూ.. " సారీ నానీ ఇంకెప్పుడు నిన్ను కొట్టను ఏమి అనను సారీ " అంది.

అయినా కూడా పిల్లాడు బెదిరిపోయి ఉండడంతొ మానస తన జేబు లోనుంచి ఫోన్ తీసి ప్లేస్టోర్ లో కార్ గేమ్ ఇన్స్టాల్ చేసి "ఇదిగో కార్ గేమ్ ఆడుకుంటావా?" అంది.

నానీ గాడికి ఫోన్ చూడగానే కళ్ళు మతాబుల్లా ఎలిగిపోయాయి వెంటనే అన్ని మర్చిపోయి చెయ్యి చాపాడు.

మానస నానీ నీ పక్కన కూర్చోబెట్టుకుని సారీ చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ అంది, నానీ గాడు ఇప్పుడు ఆ ఫోన్ కోసం ఏమైనా చేస్తాడు అందుకే నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నవ్వుకుంటూ ఫోన్ వాడి చేతికి అందించింది.

నానీ గేమ్ లో నిమగ్నమైపోయాడు మానస ఫ్రెషప్ అవ్వటానికి బాత్రూం లోకి దూరింది, ఇదంతా చూసిన మానస వాళ్ళ అమ్మ సంతోషంగా రమని కౌగిలించుకుని తన రూమ్ కి వెళ్ళిపోయింది....ఏం జరిగిందో తెలుసుకున్న రమ కూడా ఆనందంగా పని చేసుకోడానికి వెళ్ళిపోయింది.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

వారం రోజులుగా నేను మానస చూసుకోడం తప్ప పెద్దగా ఏం జరగలేదు, ముకుంద సినిమా లాగ గడిచిపోయింది ఈ వారమంతా, ఎవ్వరు లేనప్పుడు ఎవరూ మమ్మల్ని గమనించనప్పుడు నన్ను చూసి నవ్వేది అది నవ్వు కుడా కాదు నవ్వినట్టు కళ్ళతోనే చెప్పేది

అమ్మ నన్ను గమనిస్తూనే ఉంది, అప్పుడప్పుడు కళ్ళతో అర్ధంకానీ సైగలు చేసేది కానీ నేను అడిగితే మాత్రం నేను ఏం అనలేదే అని వేళ్ళతో చూపించేది.

రేపు కాలేజీకి వెళ్లొద్దు అమ్మతో ఉండి ఆ సైగలకి అర్ధం తెలుసుకోవాలి అనుకున్నాను కానీ నా వల్ల మళ్ళీ సలీమా ఎందుకు ఆగిపోవాలని బైలుదేరాను.

≈≈≈≈≈≈≈≈≈≈≈

ఇవ్వాళ నా పుట్టినరోజు అమ్మకి లంగా ఓణిలో కనిపించాలని తెగ ప్రయత్నించాను కానీ దొరకలేదు, వారం ముందే కుట్టించుకోవాలట నాకు తెలియక నేను ఒక్క రోజు ముందు వెళ్ళాను.

అందుకే ఇక మాములు డ్రెస్ వేసుకుని బైటికి వచ్చాను అందరు విష్ చేసారు, అమ్మ దెగ్గర ఆశీర్వాదం తీసుకుందామని అమ్మ రూమ్ లోపలికి వెళ్ళాను.

మానస : అమ్మా...! అని చుట్టు చూసింది.

అప్పుడే రూమ్ లోపలికి వెళదామని లోపలికి వచ్చి మానసని చూసింది వాళ్ళ అమ్మ.

మానస అమ్మ : మానసా...

మానస వెనక్కి తిరిగింది.

మానస అమ్మ : హ్యాపీ బర్తడే అని నవ్వుతూ చెయ్యి ఇచ్చింది.

మానస ఏడుస్తూ చెయ్యి నెట్టేసి గట్టిగా హత్తుకుపోయింది.. మానస వాళ్ళ అమ్మ వెన్ను నిమురుతూ, "కొత్త డ్రెస్ వేసుకోవా?" అని అడిగింది.

మానస : నాకు నచ్చింది దొరకలేదు మా..

మానస అమ్మ : నీకోసం నేనొక డ్రెస్ కొన్నాను వేసుకుంటావా?

మానస : ఆనందంగా "ఏది మా"

మానస అమ్మ : ఇదిగో అని లంగా ఓణి అని చేతికిచ్చింది.

మానస వాళ్ళ అమ్మని కౌగిలించుకుని లోపలికి వెళ్లి మార్చుకుని వచ్చింది.

మానస : అమ్మా ఎలా ఉంది..

మానస అమ్మ : బాగుంది కానీ నీకు సెట్ అవ్వాలా..

మానస : పర్లేదు మా నాకు నచ్చింది అని హత్తుకుని కాలేజీకి బైల్దేరింది.

లంగా ఓణిలో వచ్చిన మానసని చూసిన సోనియా పల్లవి ఓర్చుకోలేక కుళ్ళకుని, కావాలని జ్యూస్ ఒంపి సారీ అన్నట్టు నాటకమాడారు.

సోనియా : అయ్యో సారీ మానస చూసుకోలేదు, నీ బర్తడే రోజే ఇలా అవ్వాలా ఇంకా నీకు విషెస్ కూడా చెప్పలేదు, అని పల్లవికి కన్ను కొట్టింది.

పల్లవి : సారీ కాదు ముందు మానసకి డ్రెస్ ఇప్పించు.

మానసకి కోపంతొ పాటు బాధ కూడా వచ్చింది ఇక ఇప్పుడు చేసేదేం లేక వాళ్ళ వెంట షాపింగ్ కి వెళ్ళింది.

లోపల సోనియా పల్లవి ఇద్దరు కలిసి మినీ స్కిర్ట్ అండ్ టీ షర్ట్ సెలెక్ట్ చేశారు, తనకి నచ్చకపోయినా బలవంతం చెయ్యడంతొ తప్పక తీసుకుంది.

కాలేజీకి వెళ్లారు, అందరు బర్తడే విషెస్ చెప్తున్నారు కానీ ప్రతి మగాడి కన్ను మానసని కామంతొ చూసేసరికి మానసకి సిగ్గుగా అనిపించింది, విక్రమ్ కి ఈ డ్రెస్ లో ఎలా కనిపించాలో అర్ధం కాలేదు.

ఇంతలో విక్రమ్ రానే వచ్చాడు కానీ రోజు తనని గుచ్చి గుచ్చి చూసే కళ్ళు అస్సలు తనని చూడకపోడంతొ బాధగా తల దించుకుని క్లాస్ కి వెళ్ళింది....క్లాస్ లో అందరు విషెస్ చెప్పారు కానీ మానసకి అస్సలు అవి వినపడలేదు.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

పూజ : ఇవ్వాళ మానస బర్తడే అంట, తెగ చెప్పుకుంటున్నారు..

రాగానే మానసని దూరం నుంచే గమనించాను ఆ డ్రెస్ చూసి కోపం వచ్చింది, తనని చూడకుండానే లోపలికి వెళ్ళాను, కానీ ఆ డ్రెస్ లో తను ఇబ్బంది పడటం చూసాను, నాకు తెలిసి ఇది కూడా ఆ ఇద్దరు దున్నపోతుల పనే అయ్యుంటుంది.

అందుకే అందరికీ ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికి బైలుదేరాను.

విక్రమ్ : అమ్మా అమ్మా త్వరగారా అలా సిటీ దాకా వెళ్లొద్దాం.

అమ్మ : ఎందుకు రా? అని వెళ్ళు చూపించింది.

విక్రమ్ : మానస గురించి చెప్పాను, బర్తడే కి డ్రెస్ కొందాం అన్నాను.

అమ్మ మళ్ళీ ఎప్పుడు ఇచ్చే అర్ధం కానీ ఎక్సప్రెషన్ ఇచ్చింది, అప్పుడు అర్ధం అయ్యింది నాకు, నేను లవ్ లో పడ్డానని నన్ను వెక్కిరిస్తుంది అని.

విక్రమ్ : అమ్మా! నిన్నూ.....ఇన్ని రోజులు నాతో ఆడుకుంటున్నావ్ కదా...

అమ్మ : సరే సరే పదా వెళదాం.

అమ్మని తీసుకుని సంతోషంగా సిటీకి వచ్చి ఇద్దరం కలిసి మంచి చీర సెలెక్ట్ చేసాము, అమ్మ అందులో రెడీ మేడ్ ఉందేమో కనుక్కోమంది.

జాకెట్ కి సైజ్ అడిగితే అమ్మ నాకు సైగ చేస్తే షాప్ వాడికి చెప్పాను. అమ్మ నన్ను చూసింది నేను సిగ్గుపడ్డాను. మళ్ళీ నన్ను ఏడిపించాలని చూసింది కానీ తన చెయ్యి గట్టిగా పట్టేసుకున్నాను వద్దు అంటూ అమ్మ నవ్వుకుంది.

ఇద్దరం డ్రెస్ ప్యాక్ చేపించి మళ్ళీ అమ్మని ఇంట్లో దింపి కాలేజీకి వచ్చాను, అప్పటికే లంచ్ బ్రేక్ అయ్యింది.

కాల్ చేసి అందరిని కాంటీన్ దెగ్గరికి రమ్మన్నాను, మా వాళ్ళు అందరు బైటికి వెళ్ళిపోయాక క్లాస్ కి వెళ్ళాను, మానస ఒక్కటే బెంచ్ లో కూర్చుని ఉంది.

లోపలికి వెళ్లి నా బెంచ్ దెగ్గరికి వెళ్తున్నాను మానస నన్నే చూస్తుంది, తనని దాటి వెళ్తూ తన ఒళ్ళో పడేలా నా చేతిలో ఉన్న కవర్ వేసి మళ్ళీ బైటికి వెళ్లాను.

మానస కవర్ లో డ్రెస్ ఉండటం చూసుకుని ఆనందంగా మార్చుకోడానికి వెళ్ళింది.

నేను కాంటీన్ కి వెళ్లి మా వాళ్ళతో క్లాస్ కి వచ్చాను, ఇంకా మానస రాలేదు.

అందరు క్లాస్ కి వచ్చారు రూప మేడం కూడా వచ్చి క్లాస్ తీసుకుంటుంది, నేను మానస కోసం చూస్తున్నాను, ఇక సహనం కోల్పోయి బైటికి వెళ్లి తనని చూడాలన్న ఆత్రంతొ లేవబోయాను.

అప్పుడు ఎంట్రీ ఇచ్చింది నా దేవత... తెల్లటి చీర,  గోల్డెన్ అంచు, అదే రంగు చంకీలతో సన్నని పైట, జాకెట్ భుజానికి అటు ఇటు మెత్తటి ఈకల లాంటి డెకొరేషన్ చీరకి ముత్యాల డిజైన్ అబ్బబ  వర్ణించడం కంటే చూడటం మేలు అని కన్ను అర్పకుండా నోరు తెరుచుకుని అలానే చూస్తున్నాను, మానస నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళి కూర్చుంది.

ఆఖరికి రూప మేడం కూడా నైస్ సారీ అని మెచ్చుకుంది, అన్నిటికంటే మానసకి అప్పటి వరకు కామంతొ చూసిన కళ్ళన్ని ఇప్పుడు ఆకర్షణతొ ఆరాధిస్తున్నట్టు చూస్తుంటే విక్రమ్ మీద ఇంకా ఇష్టం పెరిగిపోయింది.

కాలేజీ అయిపోయే టైం కి అందరు తనతో మాట్లాడాలంటేనే భయపడేవారు అలాంటిది అందులో చాలా మంది ఏది అయితే అది అయ్యింది అని ప్రొపోజ్ కూడా చేసేసారు, మానస నవ్వుతూ సున్నితంగా రిజెక్ట్ చేసింది, మానసకి గర్వంగా అనిపించింది.

ఇంతక ముందు తను చూసుకుని పడే గర్వానికి, ఇప్పుడు ఒచ్చిన గర్వానికి ఉన్న తేడా కూడా తెలుసుకుంది.

కాలేజీ అయిపోయి అందరు ఇంటికి వెళ్లిపోతుండగా మానస అందరిని పిలిచి "ఇవ్వాళ నా బర్తడే సందర్బంగా చిన్న పార్టీ అందరు తప్పకుండా రావాలి అని నన్ను చూస్తూ అందరు తప్పకుండా రవాలి" అని ఎవ్వరికి కనిపించకుండా నాకు మాత్రమే కనిపించేలా పెదాలు వణికిస్తూ ప్లీజ్ ప్లీజ్ అంది....అందరం ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని బైటికి వచ్చాం.

పూజ : అరేయ్ మనం కూడా వెళదాం రా..

విక్రమ్ : నీకు తనంటేనే పడదు ఎందుకే అక్కడికి మనం.

పూజ : రేయ్ పార్టీ ఎక్కడో తెలుసా గ్రీన్ లోటస్ హోటల్ లో మన జీవితంలో మళ్ళీ అక్కడికి వెళ్లలేము ప్లీజ్, ప్లీజ్..... ప్లీజ్ రా వెళదాం.

విక్రమ్ : సరే సరే ముందు ఇంటికి వెళ్ళండి, అందరు రెడీ అయ్యి ఉండండి వెంకట్ అన్న కార్ తీసుకుని వెళదాం.

అందరు ఆనందంగా "యే" అని హై ఫయ్ కొట్టుకున్నారు.

విక్రమ్ : పూజ ఆ హోటల్ పేరేంటి?

పూజ : గ్రీన్ లోటస్.......

Connection akkadikoo pothundhi.. "GREEN LOTUS" nice update bro.. keep going time chusukoni updates isthu undu
[+] 3 users Like Dalesteyn's post
Like Reply


Messages In This Thread
RE: విక్రమ్ ~ లవ్ పార్ట్ - by Dalesteyn - 22-05-2022, 01:41 PM



Users browsing this thread: 2 Guest(s)