Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
స్వయంవరం కోసం నిన్ననే విచ్చేసిన మైసూర్ రాజ్యపు యువరాజుని పోటీకి ఆహ్వానిస్తున్నాము . 
యువరాజు ఠీవిగా లేచి , రాకుమారులారా ...... ఈ పోటీ నాతోనే పూర్తవుతుంది , మీరంతా నిరాశతో మీ మీ రాజ్యాలకు వెళ్ళడానికి సిద్ధం కండి అంటూ ధనస్సు వైపుకు అడుగులువేస్తున్నాడు .
మిగతా యువరాజులు : ప్రభూ ప్రభూ ...... స్వయంవరం పోటీ అంటే కనీసం సగం మంది వరకూ అయినా పోటీ నిలబడాలి .......
ప్రభువు : శాంతించండి శాంతించండి రాకుమారులారా ....... , సగం మంది వరకూ కాదు మీ అందరికీ అవకాశం రాబోతోంది , శాంతించి తిలకించగలరు ........
యువరాజులంతా ఎవరి స్థానాల్లో వారు కూర్చుని మొదటి అవకాశం నాకు రావాల్సింది అంటూ చింతిస్తున్నారు .

మైసూర్ యువరాజు : ఈ ధనస్సుకు నా ఎడమచేతి వేలు చాలు అంటూ ఎత్తబోయి ఆ బరువును వేలి ఎముక విరిగినట్లు శబ్దం వినిపించడం - నొప్పితో కేకలువెయ్యడం చూసి కొంతమంది నవ్వుతున్నారు మిగిలినవారు ఆశ్చర్యపోతున్నారు .
అంటే మహామంత్రి చెప్పినదంతా నిజమే అన్నమాట అంటూ కంగారుపడుతూ ఒకసారి నా దేవకన్యవైపు చూసి , ధనస్సు వైపు చూస్తున్నాను .
యువరాజులు : మైసూర్ యువరాజా ...... దనుస్సునే కాదు ఇక ఆ విరిగిన వేలితో ఏమీ ఎత్తలేరు వచ్చి కూర్చో అంటూ నవ్వుకుంటున్నారు .
మైసూర్ రాజ్యపు సైనికులు వెళ్లి యువరాజా నొప్పివేస్తోందా అంటూ పిలుచుకునివెళ్లి కూర్చోబెట్టారు .
మహామంత్రి ఆజ్ఞ వెయ్యడంతో రాజ్యంలోని వైద్యులు వచ్చి చికిత్స చేస్తున్నారు .

మహామంత్రి : ఇక రెండవ యువరాజు శాతవాహన రాజ్యం నుండి .......
శాతవాహన యువరాజు : మైసూర్ యువరాజా ...... మా వీరత్వం ఏమిటో చూడు అంటూ ఎడమచేతితో ఎత్తబోయి వీలుకాక కిందపడ్డాడు .
మైదానం మొత్తం నవ్వులే నవ్వులు .......
శాతవాహన యువరాజు : ఏమిటీ అంటూ కుడిచేతితో - రెండుచేతులతో ప్రయత్నించినా వీలుకాక చుట్టూ నవ్వులకు పరువు పోయినట్లు , సైనికులారా రండి అంటూ కోపంతో బయటకు వెళ్ళిపోయాడు .
మహామంత్రి : శాతవాహన యువరాజా ...... మా ఆతిధ్యం పూర్తిగా స్వీకరించి వెళ్ళండి అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు .
యువరాజులంతా నవ్వుతున్నారు - నాకైతే నవ్వు రావడం లేదు ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాను .

మహామంత్రి : తరువాత పరంపర యువరాజు .......
పరంపర మహారాజు : బస్తీలు - వ్యాయామం చేస్తూ వెళ్లి కండలను చుట్టూ ప్రదర్శించి రెండుచేతులతో ఎత్తబోయి వీలుకాక వారి సైన్యం మొత్తాన్ని పిలిచాడు .
మహామంత్రి : యువరాజా .......
మహారాజు ఆపడంతో ఆగిపోయారు . 
10 మంది కలిసి ఎత్తడానికి ప్రయత్నించినా వీలుకాక , వొళ్ళంతా చెమటతో వెళ్లి కూర్చుని దాహం దాహం అంటూ నీళ్లు గట గటా త్రాగడం చూసి నవ్వులు విరిసాయి .......
ప్రతీ ప్రయత్నానికి నాలో ఆసక్తి - కంగారు అంతకంతకూ పెరుగుతూనే ఉంది .

తరువాత చోళ - పాండ్య - పల్లవ - నాయక ....... యువరాజులు ఒక్కొక్కరుగా వచ్చి తమవంతు ప్రయత్నం చేసి వీలుకానట్లు వెళ్లి కూర్చోవడమో లేక నవ్వులపాలై రాజ్యం నుండి వెళ్లిపోవడమో జరుగుతోంది .
మా యువరాజుల వంతు వచ్చింది , మొదట తూర్పు రాజ్యం యువరాజు వెళ్ళాడు - తెగప్రయత్నించి వీలుకాక తలదించుకుని వచ్చాడు .
ధనస్సు కంగారు మరిచిపోయినట్లు నవ్వు వచ్చేసింది - గురువుగారినే తప్పుపడతారా ? .
ఆ వెంటనే గురుకులానికి పడమరవైపు రాజ్యం యువరాజుని పిలిచారు .
రేయ్ నువ్వే నాకంటే ముందు వచ్చావు నువ్వే వెళ్లు నువ్వే వెళ్లు అంటూ వాదులాడుకుంటున్నారు .
మహామంత్రి : సమయం మించిపోతోంది ఒకరితరువాత మరొకరు పోటీలో పాల్గొనండి .
రేయ్ ...... మన ముగ్గురిలో వీరుడు వీడు - వీడివల్లే కాలేదు మనవళ్లు ఎలా వీలౌతుంది , అక్కడికివెళ్లి నవ్వులపాలు కావడం కంటే ఇక్కడే ఆగిపోవడం మంచిది అంటూ కూర్చుండిపోయారు , సోదరా ...... వెళ్లిపోదామా ?.
తూర్పు రాజ్యం యువరాజు : ధనస్సు సంగతి ఏమిటో చూసే వెళదాము కూర్చో ....... , ఒకవేళ ఎవరి వలనా కాకపోతే మహారాజుని కలిసి ఎలాగైనా ఒప్పించి రాకుమారిణి మనలో ఒకరం చేబట్టాలి లేకపోతే మన రాజ్యంలో తలెత్తుకోలేము ........

మహామంత్రి : అయితే తరువాతి యువరాజును అంటూ వరుసగా పిలవడం - వీలుకాక వెళ్లి కూర్చోవడం ......
అలా నాకంటే ముందు సింహద్వారంలో ప్రవేశించిన చివరి యువరాజువరకూ పోటీలో పాల్గొని వీలుకాకపోవడంతో .......
మహామంత్రి లేచి ఇక చివరగా మిగిలిన హిడుంభి రాజ్యం యువరాజు - ఇతడి వల్లనైనా వీలౌతుందో లేదో చూద్దాము అంటూ నవ్వుతున్నారు .

యువరాజులు : మావల్ల కాలేదు అంటే ఎవరి వలనా కాదు ....... , వెళ్లు హిడుంభి యువరాజా నవ్వులపాలై వచ్చి కూర్చో అంటూ ముందే నవ్వుతున్నారు .

లేచి తలపాగాను - ఖడ్గాన్ని - నా విల్లును ఆసనంపై ఉంచి , నా దేవకన్య వైపు - ధనుస్సు వైపు మార్చి మార్చి చూస్తూ వెళ్ళాను . ధనుస్సు చుట్టూ తిరుగుతూ పూర్తిగా పరిశీలించాను , ధనుస్సు పై దేవనాగరి లిపి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను అంటే మహామంత్రి గారు చెప్పినట్లు ఈ ధనుస్సు దేవలోకం నుండి భువిపైకి చేరి ప్రవాహం ద్వారా ఈ రాజ్యానికి చేరిందన్నది వాస్తవం ...... , కిందవైపుకు చూస్తే అమ్మవారి ప్రతిమ ....... అమ్మవారు అమ్మవారు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది అంటే దేవనాగరి లిపి ప్రకారం భువిపై రాక్షసులను చంపి భూతల్లిని సస్యశ్యామలం చెయ్యడానికి ఆ అమ్మే స్వయంగా భువిపై అడుగుపెట్టారన్నమాట , ఆ క్రమంలో మానవాళిని రక్షించిన అమ్మవారి ధనుస్సు ప్రవాహంలో ఇక్కడికి చేరిందన్నమాట ...... , అప్పుడే ఆ అమ్మ నదీ అమ్మ జన్మస్థానంలా స్థిరపడిపోయి ఉంటారు , ధనుస్సు ను ఎలా ఎక్కుపెట్టాలో పూర్తిగా అర్థమైనట్లు సంతోషంతో కేకలువేస్తూ అమ్మవారిని భక్తితో ప్రార్థించాను .
యువరాజులు : ధనుస్సు ఎత్తేటప్పుడు సంతోషపు కేకలు కాదు ఏడుపులు వస్తాయి ప్రయత్నించు ప్రయత్నించు అంటూ నవ్వుకుంటున్నారు .

అలాగే ప్రయత్నిస్తాను తోటి యువరాజుల్లారా ........ , చంద్ర రాజ్య మహారాజా ...... మీరు అనుమతిస్తే ఒక విన్నపం చేసుకోవచ్చా ? .
ప్రభువు : ఏమిటి రాకుమారా ? .
మహారాజా ...... ఈ ధనుస్సు ను ఎక్కుపెట్టడానికి యువరాణీ సహాయం కావాలి - ఇక్కడకు పంపించగలరా ...... ? .
సైన్యాధ్యక్షుడు : ఎంత ధైర్యం ఉంటే స్వయంవరం పోటీ గెలవకముందే యువరాణీ గారిని చూడాలని ఆశపడుతున్నావు ........
మన్నించండి మహారాజా ....... , ఈ ధనుస్సు పై లికించిన దేవలిపి ప్రకారం గొప్ప చరిత్ర కలిగి ఈ ధనుస్సును తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న చంద్ర వంశం యొక్క అమ్మవారి భక్తురాలి ద్వారానే ఎక్కుపెట్టగలము ...... , విన్నాను యువరాణీవారు అమ్మవారి భక్తురాలు అని , మీరు అవకాశం ఇస్తే నిరూపిస్తాను మహారాజా - ఎక్కుపెట్టకపోతే నన్ను రాజ్యం నుండి పంపించడం కాదు ఇక్కడే ఉరి తియ్యండి .......
సైన్యాధ్యక్షుడు : మహారాజా .......
ప్రభువు : సైన్యాధ్యక్ష ఆగండి , ఈ యువరాజు విన్నపం బహు ఆసక్తికరంగా ఉన్నది , అనుమతి ఇస్తున్నాము ....... , తల్లీ మహీ ......
ఆజ్ఞ తండ్రీ ...... అంటూ తియ్యనైన నా దేవకన్య స్వరం వినిపించగానే పెదాలపై చిరునవ్వుతో అటువైపు చూస్తున్నాను .

నా కోరికను మన్నించినందుకు ధన్యవాదాలు మహారాజా ...... , యువరాణీవారూ ........ ఒక్కసారి ఇక్కడకువస్తే మీరు ఆశ్చర్యపోయే వినోదం చూయిస్తాము .
మహి : వినోదమా ....... మేము సిద్ధం అంటూ ముఖంపై పరదాతో చెలికత్తెలతోపాటు నావైపే ప్రాణంలా చూస్తూ వస్తోంది .
మహారాజు - మహామంత్రి - యువరాజులు - చుట్టూ ఉన్న రాజ్యపు ప్రజలు ఆసక్తితో చూస్తున్నారు .
నవ్వుకుని , మహారాజా ....... మరొక చిన్న విన్నపం , నాకు ఒక చిన్న పాత్రలో నదీప్రవాహపు జలం కావాలి .
మహారాజు ఆజ్ఞ వెయ్యగానే , సైన్యాధ్యక్షుడు ...... వెంటనే ప్రవాహపు నీటిని తీసుకురండి అంటూ భటులను పంపించారు .

దేవకన్య కంటే ముందు దేవకన్య భుజాలపై ఉన్న మంజరి మరు క్షణంలో నా భుజం పైకి చేరింది .
దేవకన్య దగ్గరకు రాగానే ఆఅహ్హ్ ...... ఇప్పటికి శాంతించినది నా హృదయం - చూసి ఎన్ని ఘడియలు అయినదో తెలుసా ...... ? .
మహి : నా దేవుడు ఎదురుగా ఉన్నాకూడా కౌగిలి లేక ఎంత నియంత్రించుకుంటున్నానో తెలుసా ? , స్వయంవరం కానివ్వనివ్వండి నా దేవుడిని కొరికేస్తాను .
వెనకున్న చెలికత్తెలు నవ్వుకుంటున్నారు .
అంతకంటే అదృష్టమా యువరాణీ ....... , మంజరీ ...... చూడగానే గుర్తుపట్టేసింది మన యువరాణి .......
మంజరి : చెప్పాను కదా ప్రభూ ...... , మీ ఇద్దరి మనస్సు ఒక్కటే అని ......
తెలిసిందిలే మంజరీ ....... , మహీ ...... ధనుస్సు గురించి కంగారుపడ్డావా ? - నేనైతే కంగారుపడ్డాను .
మంజరి : మీ దేవకన్య ఏమాత్రం కంగారుపడలేదు ప్రభూ ....... , మీ వీరత్వం గురించి నమ్మకం ఉందని చెబుతూనే అమ్మవారిని ప్రార్థిస్తోంది .
చాలా చాలా సంతోషం మహీ ....... , ఇక కంగారుపడాల్సిన అవసరమే లేదు .

యువరాజా యువరాజా .......
మహి : దేవుడా ...... మిమ్మల్నే పిలుస్తున్నది .
అవునవును యువరాజునే యువరాజునే ........
మహి - మంజరి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
భటులు : యువరాజా ...... మీరు కోరిన జలం .
భటుల నుండి నదీఅమ్మ జల పాత్రను అందుకున్నాను - మహారాజా ...... ప్రసిష్ఠమైన చంద్ర రాజ్య వారసురాలు యువరాణీ చేతులమీదుగా ధనుస్సును కొట్టుకునివచ్చిన నదీ జలంతో అభిషేకిస్తే , అమ్మవారు ఈ ధనుస్సును ఎక్కుపెట్టే అవకాశం కలిగిస్తారు .
అందరిలో ఆసక్తి మరింత పెరిగింది - మహారాజు ...... తమ సింహాసనం నుండి లేచి చివరకువచ్చి నిలబడ్డారు ......
మహామంత్రి - సైన్యాధ్యక్షుడు ఏకంగా మాదగ్గరికి వచ్చారు .

యువరాణీ ...... అంటూ పాత్రను అందించాను .
మహి : తండ్రి అనుమతితో ....... , జలాన్ని - ధనుస్సును మొక్కి జలపాత్రను అందుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ నావైపే ప్రాణంలా చూస్తూ ధనుస్సును ...... జలంతో అభిషేకించింది .
ఆశ్చర్యం - అద్భుతం ప్రభూ ........ , తాడు దర్శనమిస్తోంది .
మహి : రాకుమారా ...... ఇక కానివ్వండి .
ఆజ్ఞ రాకుమారీ అంటూ ధనస్సుకు మొక్కి , కుడిచేతితో బాణాన్ని మరొకచేతితో ధనుస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టి రెప్పపాటులో పైన వ్రేలాడుతున్న బంగారు చేపను కొట్టాను .
అంతే రాజ్యం మొత్తం దద్దరిల్లిపోయేలా సంబరాలు అంబరాన్ని అంటాయి .
భళా రాకుమారా భళా ...... , ఇక ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు నా బంగారుతల్లి మరియు నా రాజ్యం నీకే సొంతం ....... అంటూ సంతోషంతో ప్రకటించేశారు మహారాజు .
మహి : తండ్రిగారూ .......
ప్రభువు : తల్లీ మహీ ...... ఇంతకంటే వీరాధివీరుడైన క్షత్రియుడు ఈ భువిపైననే లేడు , పూలహారంతో ....... 
మహారాజు మాటలు పూర్తికాకముందే చెలికత్తె అందించిన పూలహారాన్ని నా మెడలో వేసి నా గుండెలపైకి చేరి ఏకమయ్యేలా అల్లుకుపోయింది - దేవుడా ..... అనుకున్నది సాధించారు అంటూ నా హృదయంపై ముద్దులుపెడుతోంది .
మాపై పూలవర్షం కురుస్తోంది - రాజ్యం మొత్తం దండోరా మారుమ్రోగుతోంది .

రాకుమారీ ...... మరొక వినోదం తిలకిస్తారా ? .
అంతులేని ఆనందంతో అవునన్నట్లు కళ్ళతోనే సైగచేసింది నా దేవకన్య .......
నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , చేతిలోని ధనుస్సును మహి చేతికి అందించి మరొకచేతితో బాణాన్ని అందుకుని మహితో మరొక చేపను కొట్టించాను .
భళా యువరాజా భళా ....... నీలాంటి వీరాధివీరుడిని ఇంతవరకూ చూడలేదు అంటూ ఇద్దరినీ కౌగిలించుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2022, 10:26 AM



Users browsing this thread: 53 Guest(s)