Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహారాజు : మహేశ్వరుడా ...... చివరిసారిగా అడుగుతున్నాను నువ్వు క్షత్రియుడివా కాదా ? .
కాదు అన్నట్లు తలదించుకున్నాను .
మహారాజు : అంటే ఈ హిడుంభి రాకుమారుడు చెప్పినది నిజమే అన్నమాట అంటూ ముందు హడలిపోయారు ఆ వెంటనే కోపంతో ఊగిపోతున్నారు .
ప్రభూ నన్ను మన్నించండి - రాకుమారి అంటే నాకు ప్రాణం - ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాము - తనకు ఏ లోటూ లేకుండా చూసుకుంటాను . 
మహారాజు : ఇక ఆపు , ఇంతవరకూ మహారాజునైన నాతోపాటు రాజ్యంలో అందరినీ మోసం చేసింది చాలు - నువ్వు ఏ పరివారం లేకుండా ఒంటరిగా వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది .
ప్రభూ ...... తప్పు మాదే మన్నించండి అంటూ మహామంత్రి - సైన్యాధ్యక్షుడు తలలు దించుకున్నారు .
ప్రభూ ...... మోసం చెయ్యాలని కాదు - ప్రేమను గెలిపించుకోవడానికి వేరే మార్గం ఇలా చేసాను .
మహారాజు : ప్రేమకు నేను అడ్డుకాదు కానీ నీ స్థాయిని చూసి ప్రేమించాలి - నాకు పరువే ముఖ్యం - మా తరతరాలుగా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ వెళుతున్నాము - నా బిడ్డపై అంతులేని ప్రేమ నా బిడ్డ సంతోషం కంటే నాకు రాజ్యం పరువే ముఖ్యం - పెళ్లికోసం వచ్చిన సామంతరాజులకు ఈవిషయం తెలిస్తే మన పరువు మొత్తం పోవడమే కాకుండా మనపై ఉన్న భయం పోయి పన్నులు కూడా కట్టరు - వీటన్నింటి గురించి ఆలోచిస్తే నువ్వు చేసినది అక్షరాలా మోసం ..... భటులారా ఈ మోసగాడిని బంధించి జీవితకాలం కారాగారంలో పడేయ్యండి .

హిడుంభి యువరాజు : మహారాజా ...... చంద్ర వంశాన్నీ మరియు మమ్మల్ని మోసం చేసిన ఈ మోసగాడికి ఆ శిక్ష సరిపోదు వెంటనే ఉరిశిక్ష విధించండి - అప్పుడే క్షత్రియుల పరువుప్రతిష్టలు నిలబడతాయి మరియు ఇలాంటివాళ్లకు తమ స్థాయి ఏంటో తెలుస్తుంది .
మహారాజు : అవునవును వెంటనే ఉరిశిక్ష ఏర్పాట్లు చెయ్యండి - ఈ మోసగాడి గురించి ఎవ్వరికీ తెలియకూడదు అంటూ ఆజ్ఞ వేశారు 
మోసగాడు అని నిరూపణ అయ్యాక ఇక వివరణ ఇచ్చుకోవడానికి మాటలు లేక మౌనంగా ఉండిపోయాను . 
మంజరి తెగ కంగారుపడుతూ నా భుజం పైకి చేరింది . ప్రభూ ...... వెంటనే వెళ్లి మహికి చెబుతాను .
వద్దు మంజరీ ...... తను తట్టుకోలేదు - ఆ దుర్గమ్మ తల్లి ఎలా అనుగ్రహిస్తే అలా శిరసావహిస్తాను - నేనే ఏదో తప్పుచేసాను అమ్మ కోపాగ్నికి లోనయ్యాను .

మంత్రి గారు : ప్రభూ ...... ఉన్నఫలంగా ఉరిశిక్ష విధిస్తే , ఈ విషయం గురించి ప్రజలలో చర్చ జరుగుతుంది - సామంత రాజులకు తెలిసిపోతుంది ,
మహారాజు : చక్కగా చెప్పారు మహామంత్రీ ...... , ఈ విషయం ఈ నాలుగు గోడలు దాటి బయటకు వెళ్లకూడదు , ఇక్కడ ఉన్న ఏ ఒక్కరుకూడా పరిస్థితులు చక్కదిద్దేవరకూ రాజ్యమందిరం దాటి వెళ్లిపోకూడదు అంటూ ఆజ్ఞలు వేశారు .
సైన్యాధ్యక్షుడు : చిత్తం ప్రభూ ......
హిడుంభి యువరాజు : మహారాజా ...... మీ పరువుప్రతిష్టలకు ఏమాత్రం భంగం కాకూడదు అంటే యువరాణిని నాకిచ్చి వివాహం జరిపించండి - సంతోషంగా చేసుకుంటాను .
ప్రభూ ప్రభూ ....... 
మహారాజు : సైన్యాధ్యక్షా ...... ఈ మోసగాడు నాకళ్ల ముందు ఉండకూడదు లాక్కెళ్లి చెరశాలలో బంధించండి .
సైన్యాధ్యక్షుడు : భటులారా .......
భటులు వచ్చి పట్టుకున్నారు .
హిడుంభి యువరాజు : మహారాజా ...... ఈ విషయం గురించి మనిద్దరమే ఒంటరిగా మాట్లాడటం మంచిది - ముందైతే రాకుమారికి ఇలా చెప్పండి అంటూ గుసగుసలాడాడు .
మహారాజు : సరిగ్గా సెలవిచ్చావు రాకుమారా ...... , మహామంత్రీ ఇతడు మోసగాడు అని , రాకుమారి మందిరంలోని నగలను తీసుకుని పారిపోయాడని యువరాణికి తమరే స్వయంగా తెలపండి .
మహామంత్రి : చిత్తం ప్రభూ .......

మంజరి : ప్రాణాలుపోయినా మహి నమ్మదు - మహేష్ అంటే అంత నమ్మకం తనకు ........ , ఇప్పుడే వెళ్లి ఈ విషయం గురించి మహికి చెబుతాను .
మహారాజు : భటులారా ...... మొదట ఆ చిలుకను బంధించండి - ఈ మందిరం దాటి వెళ్లకూడదు .
మంజరీ ....... మహికి నామాటగా చెప్పు , ప్రాణం ఉంటే ఎలాగైనా తనను చేరుతానని ........
హిడుంభి యువరాజు : అలా జరగనే జరగదు - నువ్వు జీవితాంతం చీకటి చెరశాలలో లేదా ఉరిశిక్షకు సిధ్ధంగా ఉండు , ఇప్పటికిప్పుడు నీ ప్రాణాలు తియ్యగలను కానీ నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు మిగిలే ఉన్నాయి , భటులారా చెరశాలలో బంధించడం కాదు సంకెళ్లతో కట్టి ఉంచండి కొద్దిసేపట్లో వచ్చి కలుస్తాను.

ప్రభూ ప్రభూ ...... చిలుక తప్పించుకుని యువరాణీ వారి దగ్గరకు వెళుతోంది .
భటుల వెనుకే మహారాజు కూడా పరుగులుతీశారు .
హిడుంభి యువరాజు : భటులారా ..... వీడిని లాక్కెళ్లండి అనిచెప్పి , క్షత్రియులతో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది ఇక నీ జన్మలో ఆ అందాలరాశిని చూడలేవు .......
నేను - తను కలిసి జీవించడం దైవేచ్చ ...... అది జరగకుండా ఎవ్వరూ ఆపలేరు .
హిడుంభి యువరాజు : నేను ఆపుతాను అంటూ కడుపులో ఒక దెబ్బవేసి రాక్షస నవ్వుతో మహారాజా మహారాజా అంటూ వెళ్ళాడు .

( మంజరి : మహీ మహీ ...... ఘోరం ఘోరం , మన దేవుడి గురించి మహారాజుకు తెలిసిపోయింది - చెరశాలలో బంధించమని ఆజ్ఞాపించారు .
మహి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది - కళ్ళల్లోనుండి కన్నీళ్లు ఆగడం లేదు .
మంజరి : మహీ మహీ ....... , ఎలాగైనా నిన్ను కలుస్తాను అని మాటిచ్చారు మన దేవుడు .......
అప్పటికిగానీ మహి ప్రాణం తిరిగిరాలేదు .
మహారాజు : దేవుడు ...... ? , వాడు దేవుడు కాదు మోసగాడు ...... , నిన్ను ప్రేమ అనే పేరుతో మోసం చేసి వలలో వేసుకున్నాడు .
మహి : తండ్రి గారూ ...... మహేష్ మంచివాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు అంటూ గుండెలపైకి చేరింది .
మహారాజు : నువ్వే సర్వస్వం అనుకుని ఏ మహారాజు ఇవ్వని స్వేచ్ఛను ఇచ్చినందుకు ఈ తండ్రినే మోసం చేసావు తల్లీ ...... , భటులారా ..... ఆ చిలుకను బంధించండి .
భటులు వెళ్లి మంజరిని పట్టుకుని పంజరం లో బంధించారు . 
తండ్రి గారూ ...... అంటూ కన్నీళ్ళతో మౌనంగా ఉండిపోయింది .

మహారాణి : ప్రభూ ....... ఆ విషయమే నాకు మరియు మీకు తెలియజెయ్యాలని అనుకునేంతలో ఇలా జరిగిపోయింది .
మహారాజు : ఇప్పుడు కాదు మహారాణీ ..... వివాహానికి ముందు చెప్పి ఉండాలి .
మహారాణి : ప్రభూ ...... మనకు మన తల్లి సంతోషం కంటే ఇంకేమి కావాలి చెప్పండి - మీరే అన్నారుకదా అల్లుడుగారిని మించిన వీరుడు ఈ భువిపైననే లేడని ........
హిడుంభి యువరాజు : ఇక నుండీ ఆ బాధ్యత నాది మహారాణీ వారూ ......
మహారాజు : అవును మహారాణీ ...... , వీరుడైతే మాత్రం సరిపోదు ఖచ్చితంగా క్షత్రియుడై ఉండాలి , తల్లీ మహీ ...... ఈ తండ్రి అంటే గౌరవం ఉంటే ఈ తండ్రి కోరిక తీరుస్తావా ? - నువ్వు ఈక్షణమే ఈ యువరాజుని వివాహం చేసుకోవాలి .........
మహి : తండ్రి గారూ ......
మహారాణీ : మహారాజా .......
మహి : తండ్రి గారూ ...... , అంతకంటే ప్రాణాలు వదిలెయ్యమని ఆజ్ఞాపించండి - సంతోషంగా వదిలేస్తాను అంటూ కన్నీళ్ళతో చెబుతోంది .
మహారాణీ : తల్లీ ...... అంటూ గుండెలపైకి తీసుకున్నారు .

మంజరి : మహీ ...... నువ్వు ప్రాణాలు వదిలేస్తే అక్కడ మన దేవుడి ప్రాణం నిలుస్తుందా ? .
మహి : లేదు లేదు లేదు అలా జరగడానికి వీలులేదు .
హిడుంభి యువరాజు : మహారాజా ...... మీరు అనుమతి ఇస్తే ఒక సలహా ...... , నన్ను వివాహం చేసుకుంటేనే ఆ మోసగాడిని కనీసం ప్రాణాలతోనైనా ఉంచుతాను అనిచెప్పండి .
మహారాజు : పరువుప్రతిష్ఠల మాయలోపడినట్లు ఏమాత్రం ఆలోచించకుండా హిడుంభి రాకుమారుడు చెప్పినట్లు చేస్తున్నారు - సైన్యాధ్యక్షా ...... ఆ మోసగాడిని వెంటనే ఉరితియ్యడానికి ఏర్పాట్లు చెయ్యండి , తల్లీ ...... సమయం లేదు తెల్లారేలోపు హిడుంభి రాకుమారుడు పథకం ప్రకారం అన్నీ జరిగిపోవాలి .
మహి : తండ్రి గారూ ...... అంటూ కన్నీటిపర్యంతం అవుతోంది , కాదనలేదు - ఔననలేదు .......
మంజరి అయితే పంజరంలో ఎగురుతూ కన్నీటిని కారుస్తోంది . 

మహారాజు : మహామంత్రీ ...... ఇక రాకుమారి సమ్మతంతో సంబంధం లేదు , మరలా వివాహం చేసుకుంటేనే ఆ మోసగాడు కనీసం చెరశాలలోనైనా ప్రాణాలతో ఉంటాడు .
మహామంత్రి : ప్రభూ ...... మరలా వివాహం అంటే కూడా విషయం ఎలాగోలా తెలిసిపోతుంది .
హిడుంభి యువరాజు : అయితే దీనికి ఒకటే పరిష్కారం మహారాజా ....... , ఇక్కడ మా వివాహం జరిగిపోయిందని తీసుకెళ్లి మా రాజ్యంలో వివాహ ఏర్పాట్లు చేయిస్తాను , మీరు బంధు సమేతంగా వచ్చి తిలకించవచ్చు ......
మహారాజు : చక్కటి పరిష్కారం యువరాజా ....... , ఇక్కడి ప్రజలకు - సామంతరాజులకు ఎలాంటి అనుమానం కలుగదు , ఇద్దరూ ఒక్కటే అనుకుంటారు అంటూ సంతోషిస్తున్నారు .
హిడుంభి యువరాజు : మహారాజా ...... ఇలా అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అంటే రాత్రికిరాత్రి ప్రయాణమై వెళ్లిపోవాలి - మేము వెళ్లి మీకోసం ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయిస్తాము .
మహారాజు : నేను కోరుకునేది కూడా అదే ...... , మా రాజ్య పరువుప్రతిష్ఠలు నిలబడాలంటే నిర్ణయాలు త్వరత్వరగా తీర్చుకోవాల్సిందే ...... , మహామంత్రీ ఆ ఏర్పాట్లు చెయ్యండి .
మహి : తండ్రి గారూ .......
మహారాజు : నువ్వు చేసిన మోసానికి ...... , మన రాజ్యం కోసం నీకు ఇష్టమైన లేకపోయినా నా ఆజ్ఞను పాటించాల్సిందే లేకపోతే మీ అమ్మ - నేను ప్రాణాలతో ఉండము - మహామంత్రీ ...... విషాన్ని తెప్పించండి - తల్లీ ..... నీకు తెలుసు మన రాజ్యప్రతిష్ఠ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటానని .......
మహి : తండ్రి గారూ ...... అంతమాట అనకండి అంటూ ఏడుస్తూ వెళ్లి దుర్గమ్మ సన్నిధికి చేరింది - అమ్మా ...... ఇంత జరుగుతున్నా చూస్తూ ఉంటారా ? , నా దేవుడు లేకుండా నేనుండలేను - నా దేవుడు ఉండాలంటే నాన్నగారి మాటను మన్నించాలి - నీపైనే భారం వేస్తున్నాను అంటూ కన్నీళ్ళతో స్పృహకోల్పోయింది .
మహారాణి : తల్లీ తల్లీ ....... , ప్రభూ ...... మరొక్కసారి ఆలోచించండి .
మహారాజు : ఆలోచించే సమయం లేదు మహారాణీ ....... , చంద్ర రాజ్య అధినేతగా నాకు ....... మన బిడ్డ - నీ సంతోషం కంటే రాజ్యప్రతిష్టలే ముఖ్యం , కొద్దిసేపట్లో తన ప్రయాణం .......

హిడుంభి యువరాజు : సంతోషం మహారాజా ...... , ప్రయాణానికి ముందు తీర్చుకోవలసినవి తీర్చుకునే వెళతాను - సైన్యాధ్యక్షా ...... చెరశాల ఎక్కడ ? ) .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2022, 10:31 AM



Users browsing this thread: 26 Guest(s)