Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#74
(09-11-2018, 07:05 PM)అన్నెపు Wrote: అనిరుద్ర H/o అనిమిష - 8వ భాగం



రాత్రి పదకొండు నలభై...

అనిమిష ఆలోచిస్తోంది... టేబుల్ మీద ద్విముఖ తెచ్చిన ఆవేల్టి దినపత్రిక ఉంది. అందులో అనిరుద్ర ఇచ్చిన ప్రకటన , ఉంది. అనిమిష కళ్ల ముందు యాక్సిడెంట్ దృశ్యం కదలాడుతోంది. భయానకమైన ఆ సంఘటన ఆమె మొహంలో స్వేదాన్ని అద్దింది. అలా ఆ...లో...చి...స్తూ...నే ఉంది.

పదకొండు యాభై అయిదు నిమిషాలు. యాభై ఆరు నిమిషాలు... యాభై నాలుగు నిమిషాలు...

టేబుల్ మీద వున్న మొబైల్ తీసి డయల్ చేసింది. 92462-02616 ఒక్కో నంబర్ డయల్ చేస్తుంటే ఆమె చేతి వేళ్లు సన్నగా కంపించసాగాయి. చిన్నపాటి ఉద్వేగం ఆమె మహా శరీరాలను ఆక్రమించుకుంది.

అనిరుద్ర ఆకాశం వంక చూస్తున్నాడు. అతని గుండెల మీద మొబైల్ ఫోన్. ఒక్క క్షణం చిన్నపాటి క...ద...లి...క. ఫోన్ రింగవుతోంది. టైం చూశాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలు... మొబైల్ తీసి ఓకే బటన్ ప్రెస్ చేసి, 'హలో' అన్నాడు.

“మీరు మిస్టర్ అనిరుద్రే కదూ...” అవతల వైపు నుంచి మనసు పొరలను స్పృశించే కంఠం.

“అవుననే అనుకుంటున్నాను... ఇంతకూ మీరు…”

“మీ ప్రకటన చూశాను. మిమ్మల్ని కలవాలి”

“ఇప్పుడా... ఈ టైంలోనా...”

“సారీ... ఇప్పుడు కాదు. రేపు... రేపొద్దున్నే ఆరు గంటలకు వీలవుతుందా?”

“వ్వా...ట్... మార్నింగ్ సిక్స్ కా? తర్వాతైతే కుదర్దా” కాసింత టీజింగ్ కనిపించింది అనిరుద్ర గొంతులో.

“పది గంటలకు ఆఫీసుకు వెళ్లాలి... అంటే తొమ్మిదిన్నరకు బయల్దేరాలి... తొమ్మిదిన్నరకు బయల్దేరాలంటే ఏడు గంటలకే పనులన్నీ మొదలు పెట్టాలి. అందుకే మిమ్మల్ని ఆరు గంటలకు కలుద్దామని”

“నో ప్రాబ్లమ్... నేనే మీ ఆఫీసులో లంచ్ అవర్లో కలుస్తాను” “వదొద్దు... నేనే కలుస్తాను”

“పోనీ మీ ఇంటికి వచ్చేయమంటారా?”

“వద్దోద్దు... నేనే మా ఫ్రెండ్ ని తీసుకొని వస్తాను”

“జనరల్గా ఇలాంటి అపాయింట్ మెంట్స్ ఇవ్వను. మీ కోసం ఒప్పుకుంటున్నాను. మరో విషయం తెలుసా? చాలామంది కలుద్దాం అన్నారు. అందరికీ రేపు ఉదయం పది తర్వాతే అపాయింట్ మెంట్ ఇచ్చాను”

అవతలివైపు అనిమిష కామ్గా ఉండిపోయింది.

“ఏంటీ... మగవాళ్ల సైకాలజీ ఇలానే ఉంటుంది. వాళ్లను వాళ్లే మోసుకుంటారని ఫీలవుతున్నారా? నేను నిజం చెప్తున్నాను. అన్నట్టు... రేపు ఉదయం క్వశ్చన్ అవర్ ఉంటుందా? ఐ మీన్ మీరు నన్ను ప్రశ్నలడగడం లాంటివి...”

"క్వశ్చనవర్ ఏమీలేదు. ఓన్లీ క్లారిఫికేషన్” అటువైపు నుంచి అనిమిష చెప్పింది.

“ఇంతకీ మీ పేరు చెప్పలేదు”

“రేపు కలిశాక చెప్తాను. అయినా ముందు పని ముఖ్యం కదా”

“మరేం లేదు... నేను పనిచేసే ఆఫీసు పేరు... అదే బాస్ పేరు తెలుసుకోవాలిగా” నవ్వి అన్నాడు అనిరుద్ర..

“గుడ్ నైట్” అంది అట్నుంచి అనిమిష

“గుడ్ నైట్” చెప్పాడు అనిరుద్ర.

****

ఫోన్ మాట్లాడ్డం అయిపోయాక ఓసారి ద్విముఖ వైపు చూసింది. వెంటనే తన దగ్గరకు వెళ్లి భుజాలు కుదిపిలేపింది.

బద్దకంగా కళ్లు తెరిచింది ద్విముఖ. “సారీ... మంచి నిద్ర చెడగొట్టాను” అంది అనిమిష

“ఆ విషయం నిద్ర చెడగొట్టి మరీ చెప్పాలా?” కళ్లు సగం మూసి అంది ద్విముఖ.

“వన్స్ ఎగైన్ సారీ... చిన్న పని ఉంది” అనిమిష అంది. “ఇప్పుడా? ఏమిటి?” అనడిగింది ఆశ్చర్యంగా ద్విముఖ.

. “రేపు మార్నింగ్ నువ్వు నాతో రావాలి...”

“ఎక్కడికి?” అడిగింది ద్విముఖ..

అప్పుడు గుర్తొచ్చింది అనిమిషకు. తను అనిరుద్రను ఎక్కడ కలవాలో చెప్పలేదన్న విషయం. వెంటనే మొబైల్ తీసుకొని అనిరుద్ర నెంబర్ కు డయల్ చేయసాగింది. ద్విముఖకు విషయం అర్ధంకాక తెల్లమొహం వేసింది. సరిగ్గా అప్పుడే అనిరుద్రకు కూడా అదే డౌట్ వచ్చింది. తను ఎక్కడ కలవాలి? ఆ ఆలోచన రాగానే రిసీవ్డ్ కాల్స్లో వున్న నెంబర్ చూసి డయల్ చేశాడు. ఇద్దరూ ఒకేసారి ట్రయ్ చేయడం వల్ల ఎంగేజ్ వస్తోంది. అనిరుధ్రకు విసుగొచ్చి ఆగాడు. అనిమిష ప్రయత్నిస్తూనే ఉంది. అనిరుద్ర నెంబర్ చూసి ఓకే బటన్ నొక్కాడు.

“సారీ... ఇందాక మనం ఎక్కడ కలుసుకోవాలో చెప్పలేదు”

“అవునవును... నాకూ అదే డౌట్ వచ్చి మీ నెంబర్ కు ట్రై చేస్తున్నాను. చెప్పండి ఎక్కడ కలుద్దాం”

“బీచ్ దగ్గర కలుద్దాం...”

“గుడ్ ఐడియా... ఆ పక్కనే అయ్యర్ హోటల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ పొగలు కక్కే ఇడ్లీ, కారప్పొడి, నెయ్యి కాంబినేషన్ తింటే చాలా బావుంటుంది. మీకేం అభ్యంతరం లేదంటే, నేను మా ఫ్రెండ్ ని తీసుకువస్తాను. ఎటూ మీరు మీ ఫ్రెండ్ తోనే కదా వస్తుంది”

“అలాగే” అంది అనిమిష

“మరో విషయం... హోటల్లో టిఫిన్ బిల్లు మీరు పేచేస్తారా? నేను చేయాలా? క్లారిఫికేషన్ బెటర్ కదా”

అనిమిషకు ఒళ్లు మండింది. అయినా తమాయించుకొని “నేనే పే చేసాను”

“థాంక్యూ... గుడ్ నైట్” అని ఫోన్ కట్ చేశాడు అనిరుద్ర.

***

అనిమిష మాట్లాడేది వింటూనే వుంది ద్విముఖ. అయినా ఆమెకు ఏమీ అరం.

అనిమిష ద్విముఖ వంక చూసి, “రేపు మార్నింగ్ మనం బీచ్ దగ్గరకి వెళుతున్నాం రాగలవా?” అడిగింది అనిమిష

“ఎందుకు... నీ వాలకం చూస్తుంటే నాకో డౌట్”

“డౌటా... ఏమిటది?”

“ఏమీలేదుగానీ, రేపు మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్లాలి? ఎందుకు వెళ్లాలి?”

“రేపు మనం అనిరుద్రను కలుస్తున్నాం” చెప్పింది అనిమిష.

“అనిరుద్రనా? ఎందుకు... కొంపదీసి...” అని అనిమిష మొహంవైపు చూసింది.

“అందుకే...” అన్నట్టు తలూపింది అనిమిష.

“వావ్... వాటే గ్రేట్ డెసిషన్.... అదేంటి సడన్గా... వెరీ ఇంట్రెస్టింగ్... దీని మీద పెద్ద స్టోరీనే తయారుచేయాలని వుంది” అంది ద్విముఖ.

“అలాంటివేమీ చేయకు... రేపు మనం అతణ్ణి కలుస్తున్నాం”

“అంటే అతణ్ణి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అన్నమాట”

“ఇష్టం కాదు... అవసరం”

“అంటే అతనితో…”

“భర్తగా అతను నా దగ్గర ఉద్యోగం చేస్తాడు. అంతే... “అదేంటి?”

“నాకు డబ్బు కావాలి”

“అతణ్ణి పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుందా? పోతుంది కానీ... నెల నెలా శాలరీ ఇవ్వాలిగా”

“అతణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల నాకు మూడు లాభాలున్నాయి చెప్పింది అనిమిషం .

“ఏమిటో ఆ మూడు లాభాలు?” అడిగింది ద్విముఖ.

“నా పనులు అతను కూడా షేర్ చేసుకుంటాడు కాబట్టి నాకు పనిభారం తగ్గుతుంది

“నెంబర్ టూ... మా బాస్ తనను పెళ్లి చేసుకొమ్మని నా వెంటపడ్తున్నాడు. నేనిప్పుడు అనిరుద్రను పెళ్లి చేసుకుంటే ఇక ఆ ప్రస్తావన తీసుకురాడు”

“అదేం...”

“అంతే... మా బాస్' విలన్ కాదు... అదో టైప్ మనిషి... మనిద్దరం ప్రేమించుకుంటే తప్పేంటి... పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అని అడుగుతున్నాడు. ఒకవేళ మీకు బాయ్ ఫ్రెండ్, వుంటే అది వేరే విషయం అంటాడు. ఎవరో ఒకరి చేసుకునే బదులు తననే పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అంటాడు”అంది.

“మంచి లాజిక్కే.. నిజమే కదా... మరి నువ్వు మీ బాస్నే పెళ్లి చేసుకోవచ్చుగా... ఏకంగా చైర్ పర్సన్ వే కావచ్చు... నీ డబ్బు సమస్యా తీరుతుంది”

“అలా పెళ్లి చేసుకోవడం నాకిష్టంలేదు”

“మరి అనిరుద్రను ఎలా పెళ్లి చేసుకుంటావు?”

“అతనితో పెళ్లి అగ్రిమెంట్... టెంపరరీ... అతనితో తాత్కాలిక ఒప్పందం మాత్రమే ఉంటుంది. ఇందులో అతణ్ణి మోసం చేయడం ఏమీ ఉండదు” “మరి మూడవ లాభం”

“నాకు పెళ్లయితే... మా కంపెనీలో మా బాస్ పెట్టిన కొత్త రూల్ ప్రకారం నా జీతం రెట్టింపవుతుంది. రెట్టింపైన నా జీతంలోంచి నేను సిక్స్టీ పర్సెంట్ అనిరుద్రకు జీతంగా ఇస్తాను. మిగతా ఫార్టీ పర్సెంట్ నాకు మిగులుతుంది. పైగా పెళ్లై విడిగా వుంటే హౌస్ అలవెన్స్, ఫెస్టివల్ అలవెన్స్... మ్యారేజీ అడ్వాన్స్ ఇలా బోల్డు ఇస్తాడు మా బాస్”

“అంటే నీకు కావాల్సింది నిజం మొగుడు కాదు... అద్దె మొగుడన్నమాట”

“అద్దె మొగుడు కాదు... భర్తగా జాబ్ చేసే మొగుడు” చెప్పింది అనిమిష.

“అంతా కుదిరితే... పెళ్లికాగానే ఇక్కడ్నుంచి వెళ్లి విడిగా ఉంటారా?”

“సారీ... అవును” తల దించుకొని చెప్పింది.

“అంతగా డబ్బు అవసరమైన సమస్య ఏమిటి?” అడిగింది ద్విముఖ.

అనిమిష చెప్పసాగింది.

****

“ఐయామ్ సారీ అనిమిషా... నీ పాయింటాఫ్ వ్యూ లోనుంచే కాదు... ఎవరి పాయింటాఫ్ వ్యూలోంచి చూసినా నీదే కరెక్ట్... నీ వ్యక్తితం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఆల్ ద బెస్ట్... రేపు మనం అనిరుద్రని కలుస్తున్నాం” చెప్పింది ద్విముఖ అనిమిష చెప్పిందంతా విన్నాక. అనిమిష ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది.

****

బీచ్....

జనం పలుచగా ఉన్నారు. అనిరుద్ర, కార్తీక్ రెయిలింగకు ఆనుకొని నిలబడి ఉన్నారు. అనిరుద్ర చేతికి వున్న వాచీ వంక చూశాడు. ఆరు కావడానికి రెండు నిమిషాలు తక్కువ ఉంది.

“అనూ... ఏమిటీ శిక్ష? పొద్దున్నే టిఫిన్ చేయిస్తానని అంటే పేస్ట్ లేకుండానే బ్రష్తో పన్లు బరబరా గీకి మొహం కడుక్కొచ్చాను. అయ్యర్ హోటల్లో ఇడ్లీల వాసన ఇక్కడికి వస్తోంది” అన్నాడు కార్తీక్.

‘గెస్ట్లు రావాలి కదా... వాళ్లే హోస్ట్ లు చెప్పాడు అనిరుద్ర.

ఓసారి కార్తీక్ వైపు ఎగాదిగా చూసి, “నా కళ్లకు నువ్వో పెద్ద ఘోస్టులా కనిపిస్తున్నావు అన్నాడు.

"ఘోస్ట్ అంటే... నేనెవరో ఘోస్ట్ రైటర్ని అనుకుంటారు. అసలే ఈ మధ్య ఘోస్టీన్గ్ గురించి అందరూ చెవులు కొరుక్కుంటున్నారు” అనిరుద్ర మాట్లాడుతూ వుండగానే ఓ ఆటో వాళ్ల ముందాగింది.

అనిరుద్ర ఆ ఆటోలో నుండి దిగిన అమ్మాయిలను చూశాడు. అందులో ద్విముఖ ను గుర్తుపట్టాడు. వాళ్లిద్దరూ అతని దగ్గరికొచ్చారు.

“హలో... నన్ను గుర్తుపట్టారా.... డ్రీమ్ టీవీ... యాంకర్...” అంది ద్విముఖ.

“గుర్తు పట్టకపోవడమేమిటి....” అంటూ కార్తీక్ వైపు చూశాడు అనిరుద్ర.

“ఏంటీ... ఇప్పుడేదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారా?” క్రాఫ్ సరిచేసుకుంటూ అడిగాడు కార్తీక్.

“కాదు... పర్సనల్ పని...” అంటూ అనిరుద్రవైపు తిరిగి అనిమిషను పరిచయం చేస్తూ.

“అనిమిష... నా ఫ్రెండ్... రూమ్మేట్... మీ యాడ్ చూసింది. ఆ విషయమై మీతో మాట్లాడాలని” అంటూ ఆగింది ద్విముఖ.

“మనం టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం” అన్నాడు అనిరుద్ర.

“దట్స్ గుడ్. నా నోట్లో వున్న మాటలే మా వాడు చెప్పాడు” అన్నాడు కార్తీక్. అందరూ అయ్యర్ హోటల్వైపు కదిలారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల రష్ లేదు.

***
ఈ కథను ఈ ఫోరం కి ఎందుకు పంపారో  తెలీడం లేదు. ఇది ఏ విధంగా చూసినాకూడా, బూతు కథ కాదు. ఏ తెలుగు మాసపత్రిక/వారపత్రికకు పంపినా.... కళ్లకద్దుకుని ప్రచురించేవారు. ఇక్కడ వేయిమంది చదివి ఆనందిస్తే.... వారపత్రికలలో  ప్రచురించినట్లైయితే, లక్షల మంది చదివి ఆనందించేవారు కదా!!. -వ్యాస్
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by Vyas Kumar - 23-07-2022, 04:11 PM



Users browsing this thread: 1 Guest(s)