Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విక్రమ్ ~ లవ్ పార్ట్
11


వైజాగ్ వెళ్ళాక నాకు మానసకి కొంచెం ఏకాంతం దొరికింది, రాత్రికి అందరూ పడుకున్నాక ఇద్దరం బీచ్ కి వెళ్లిపోయాం రాత్రి మొత్తం ఇక్కడే గడపాలని అనుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం చాలా ప్రేమించుకున్నాం ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందొ కూడా ఈ ప్రయాణం లోనే మాకు తెలిసింది.

విక్రమ్ : మానస ఇలా రా

మానస : ఏంటి?

విక్రమ్ : నీ పెదాలు భలే ఉంటాయి.. సన్నగా ఎక్కడ చేపించావ్

మానస : ఆహా.. మా అమ్మ చేసింది, కావాలా

విక్రమ్ : నువ్విస్తానంటే నేనొద్దంటానా, చూస్తుంటేనే ముద్దొస్తున్నాయి.

బీచ్ లో మానసని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుంటుంటే ఫోన్ మోగింది, చూస్తే ఆదిత్య. అది చూసి మానస కూడా నా ఒళ్ళో నుంచి లేచింది. ఫోన్ స్పీకర్ లో పెట్టాను.

విక్రమ్ : హలో

ఆదిత్య : నాకొక హెల్ప్ కావాలి.

విక్రమ్ : నువ్వు వెళ్లి ఒక్క రోజు కూడా అవ్వట్లేదు.

ఆదిత్య : లేదు నేనింకా దారిలోనే ఉన్నాను, ఇంకో గంట పడుతుంది.

విక్రమ్ : చెప్పు..

ఆదిత్య : నన్ను చంపడానికి కొరియా నుంచి ఒక బ్యాచ్ దిగుతుంది ఇరవై మంది పైనే వస్తున్నారు, అందరూ ట్రైనడ్ కిల్లర్స్. అలాగే రేపు నా మరదలకి ఇక్కడ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు నేను ఏదో ఒకటి తెల్చుకోవాలి, నువ్వు నా స్థానంలో వెళ్లి అనురాధని తీసుకొచ్చేయి నేను ఇక్కడ వీళ్ళ పని పడతాను.. ఏమంటావ్, వస్తావా?

విక్రమ్ : మానసని చూసాను..

మానస : వస్తాడు ఆదిత్య, నీ లవ్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది కానీ ఆ కొరియన్ వాళ్ళు ఎవరు, నాకు భయంగా ఉంది.

ఆదిత్య : అదే చెప్తున్నాను, చాలా రిస్క్ ప్రాణాలు పోయే అవకాశం కూడా లేకపోలేదు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించుకొని నాకు ఏ విషయం చెప్పండి.. గుర్తుపెట్టుకో ప్రాణాలకే ప్రమాదం.. కానీ నువ్వు నాకు చాలా అవసరం విక్రమ్.. నీకు లొకేషన్ పంపిస్తున్నా ఏ విషయం ఆలోచించుకుని ఫ్లైట్ ఎక్కు, నాకు మళ్ళీ ఫోన్ చెయ్.

ఫోన్ పెట్టేసి మానసని చూసాను..  మానస అయోమయంగా చూసింది..

విక్రమ్ : ఎం చెయ్యను.?

మానస : నాకు భయంగా ఉంది, తను అంత గట్టిగా చెప్తున్నాడు. నాకు వెళ్లాలని ఉంది.

విక్రమ్ : ఎలాగో ఇద్దరం ఉన్నాం, మేనేజ్ చెయ్యొచ్చు తన లవ్ కి హెల్ప్ చేస్తే అప్పుడైనా మందు మానేస్తాడేమో.. ఎవరో కూడా తెలియని అమ్మాయిల కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు, అడగక పోతే అది వేరు కానీ ఇప్పుడు తను ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా కూర్చోలేను.

మానస : జాగ్రత్త.. అంటూనే నా పెదాలు అందుకుంది.

విక్రమ్ : పదా వెళదాం.. అని లేచి హోటల్ దెగ్గరికి వచ్చేసాం

చందు భరత్ లని లేపి విషయం వివరించాను కానీ వాళ్ళకి ఇవేమి చెప్పలేదు. భరత్ ని తీసుకుని ఎయిర్పోర్ట్ కి బైలుదేరాను. మానస వైపు చూసాను, బాయ్ అని చెయ్యి ఊపింది. తల ఊపి బైటికి వచ్చేసి భరత్ బండి నడుపుతుంటే వెనక కూర్చున్నాను.

భరత్ : విక్రమ్ ఈ బండి ?

విక్రమ్ : పొద్దున్నే ఏ ట్రైన్ కి కుదిరితే ఆ ట్రైన్ కి బండి పార్సెల్ వేసి పంపించు అలాగే ఎందుకైనా మంచిది ఊర్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటె నా బండి కూడా బెంగుళూర్ పార్సెల్ చెయ్యమను అవసరం పడొచ్చు నాకొక ప్లాన్ ఉంది.

భరత్ : అలాగే 

బండి ఎయిర్పోర్ట్ ముందు ఆగింది దిగి లోపలి వెళుతూ వెనక్కి తిరిగి భరత్ ని పిలిచాను.

భరత్ : ఏంట్రా 

విక్రమ్ : ఎక్కడో తేడా కొడుతుంది రా, ఆ మనుషులని అక్కడే వదిలేశాం మేము ఇద్దరం ఒకేలా ఉంటామని మానస వాళ్ళ నాన్నకి తెలుస్తుందేమో.... ఇంకోటి మా ఇద్దరి గురించి అందరికి తెలిసిపోయింది ఎప్పుడైనా ఏ ప్రాబ్లెమ్ అయినా రావొచ్చు ఒక వేళ వస్తే మాత్రం అమ్మా నాన్న సలీమాని నా దెగ్గరికి పంపించేయి మానస సంగతి తరవాత చూసుకోవచ్చు.. కొంచెం జాగ్రత్తగా ఉండండి.. పని అయిపోగానే వచ్చేస్తాను జాగ్రత్త.. హ్మ్మ్.. బై 

లోపలికి వెళ్లి ఫ్లైట్ చూసుకుని ఎక్కి కూర్చున్నాను, మానసని వదిలి వెళ్లాలంటే ఎలాగో ఉంది కానీ అక్కడ వాడి పరిస్థితి కూడా అంతే కదా పాపం చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన మరదలు.. వస్తున్నా ఆదిత్య.

గంటలో బెంగుళూర్ రీచ్ అయ్యాను బైటికి వచ్చేసరికి ఎవరో ఒక పిల్లాడు నా దెగ్గరికి వచ్చి విక్రమ్ అన్నాడు, అవును అన్నాను.

"నా పేరు రాము, అన్న చెప్పినట్టు మీరు సేమ్ ఆదిత్య అన్న లెక్కనే ఉన్నారు"

విక్రమ్ : ఎక్కడున్నాడు.

రాము : పద అన్నా,  అక్కడికే వెళుతున్నాం. అన్నా వదిన కలిసిపోయారు.. అమ్మాయిలు ఆకలి వేస్తుందనేసరికి అన్న డైరెక్టుగా వదినకె ఫోన్ చేసాడు.. వదిన అక్కడ అందరికి  కిచిడీ వండుతుంది.

విక్రమ్ : అయితే కలిసిపోయారన్నమాట 

రాము : అవునన్నా.. కానీ అన్న ఇంకా రాలే

విక్రమ్ : అదేంటి నాకు ఫోన్ చేసినప్పుడు ఇంకోగంటలో వెళ్ళిపోతా అన్నాడు.

రాము : నాతోని కూడా అదే అన్నాడు కానీ మధ్యలో సెక్యూరిటీ అధికారి చెకింగ్ ఉందట హైవే దిగి ఊర్లల్లో నుంచి వస్తున్నాడు... ఇదే అన్నా క్యాంపు.. అదిగో అక్కడ కట్టెలు పెట్టి మంట వెలిగిస్తుందే తనే అనురాధ.

బండి దిగి తన ముందుకి వెళ్ళాను నన్ను చూడగానే ఏడుస్తూ నా వైపు పరిగెడుతుంటే చెయ్యి ఎత్తి "నేను ఆదిత్యని కాను" అన్నాను. నన్ను చూసి ఆగిపోయి రాము వంక చూసింది.

రాము : అవును వదినా ఈ అన్న పేరు విక్రమ్ ఆచం అన్న లెక్కనే ఉన్నడు, తన ఫ్రెండ్ అట.

అనురాధ : కానీ...

విక్రమ్ : ముందు వంట సంగతి చూద్దాం.

అనురాధ : కట్టెలు మండడం లేదు..

విక్రమ్ : తప్పుకోండి నేను చూస్తాను అని పొయ్యి వెలిగించి డెక్షా పెట్టి అనురాదని చూసాను ఒక్కొక్కటి నాకు అందిస్తుంటే అన్ని వేసి ప్లేట్ పెట్టి కింద కర్రలు మధ్యలోకి పెట్టి మంట పెంచాను.

రాము : అన్నా వంట బాగా చేస్తున్నావ్

విక్రమ్ : మేముండేది పల్లెటూళ్ళో కదా అందరం కలిసి వండుకోవడం అలవాటు.

అనురాధ : మా బావ ఉన్నాడు, ఎంత తినమన్నా తింటాడు కానీ కాఫీ పెట్టడం కూడా రాదు.

అలా అన్ని మాట్లడుకుంటూ కూర్చున్నాం కిచిడి కూడా అయిపోయింది, టేస్ట్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. ఇంతలో ట్రక్ లోపలి వస్తున్న శబ్దం విని అటు వైపు చూసాము.

ట్రక్ ఆపి డోర్ తీసుకుని కిందకి దిగాడు ఆదిత్య, రాము పరిగెత్తి వెనకాల డోర్ తీసి అమ్మాయిలని కిందకి దించుతుంటే, అనురాధ వెళ్లి ఆదిత్యని కరుచుకుపోయింది.. వాళ్లు ఇద్దరు మాట్లాడుకుంటుంటే మనసుకి హాయిగా ఉంది, నేను మానసని బుజ్జగించినదానికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు.. ఆ బాండింగ్ నాకు నచ్చింది.


నేనూక్కణ్ణే వాళ్లందరికీ భోజనాలు వడ్డించడం చూసి అను ఆదిత్య కూడా జాయిన్ అయ్యి వడ్డించారు, ఆ తరువాత అందరి గురించి తెలుసుకుని  ఇంటికి పంపించేసరికి మధ్యాహ్నం రెండు అయ్యింది. కొంతమంది వెళ్లిపోయారు మరికొంతమందిని వదిలి పెట్టి రావాల్సి వచ్చింది.

నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే పెట్టి పనిలో ఉండగా రింగ్ అయితే ఆదిత్య ఎత్తి స్పీకర్ లో పెట్టాడు.. 

మానస : విక్రమ్ ??

విక్రమ్ : ఆ వాయిస్ లో భయం వినిపించగానే ఫోన్ అందుకున్నాను...   మానస చెప్పు 

మానస : మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అమ్మ నా కార్ పంపించింది వాళ్లు రాకముందే ఇంట్లో ఉండమని డ్రైవర్ వచ్చాడు... అంతే కాదు తన ప్లాన్ చెడగొట్టింది కూడా నువ్వేనని ఆయనకి తెలిసిందట నిన్ను చంపించమని కాంట్రాక్టు కూడా ఇచ్చాడట.. నన్ను ఇంటికి లాక్కెళ్ళడానికి కూడా మనుషులు వచ్చారు ఇప్పుడు ఎలా?

విక్రమ్ : ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్?

మానస : బెంగుళూర్ హైవే మీద, నీ దెగ్గరికి వస్తున్నాను..

విక్రమ్ : ఇంటికి రమ్మని మీ అమ్మ చెప్పింది కదా

మానస : ఏమో నాకు భయం వేసింది, మళ్ళీ నన్ను ఎక్కడైనా దాచిపెడితే.. నీకు దూరంగా అస్సలు ఉండలేను..

విక్రమ్ : ఒక్కదానివేనా కార్ లోనా

మానస : లేదు ఒక అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు.. తనే నడుపుతున్నాడు డ్రైవర్ అని చెప్పాడు.

విక్రమ్ : మరి భరత్ వాళ్ళు?

మానస : భరత్ మీ అమ్మ వాళ్ళని ఊర్లో వాళ్లతొ మాట్లాడి అలాగే ఇక్కడ సలీమాని బెంగుళూరు ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు, చందు మిగతా పూజ వాళ్ళని తీసుకుని ఊరికి వెళ్ళిపోయాడు.

విక్రమ్ : సరే నేను మళ్ళీ చేస్తాను.. అని భరత్ కి ఫోన్ చేసి మాట్లాడి ఆ వెంటనే చందుకి కూడా ఫోన్ చేసాను.. నాన్న కూడా నన్ను ఏమనలేదు వచ్చాక మాట్లాడదాం అన్నాడు అంతే.. ఫోన్ పెట్టేసి తల పట్టుకుని కూర్చున్నాను. భుజం మీద చెయ్యి పడేసరికి తల తిప్పి చూసాను ఆదిత్య.

ఆదిత్య : ఏం కాదు చూసుకుందాం.

విక్రమ్ : నా విషయం పక్కన పెట్టు అస్సలు ఈ కొరియన్ వాళ్లు ఎవరు, నీ వెనక ఎందుకు పడ్డారు..?

అనురాధ : బావ, ఏం జరిగింది.. అస్సలు ఇన్ని రోజులు ఏమైపోయావు నన్ను ఎందుకు దూరం పెట్టావు.. చదువు మధ్యలో ఆపేసావని తెలుసు కానీ రాము వాళ్ల అన్నయకి ట్రీట్మెంట్ చేసింది నువ్వే.. నువ్వేసిన కుట్ల పద్ధతి కొరియ వాళ్ళది, వాళ్లు ఇప్పుడు నిన్ను చంపడానికి వస్తున్నారంటున్నావ్.. ఏంటిదంతా?

అందరూ ఆదిత్య వైపు చూసారు...
Like Reply


Messages In This Thread
RE: విక్రమ్ ~ లవ్ పార్ట్ - by Takulsajal - 11-09-2022, 08:25 PM



Users browsing this thread: 1 Guest(s)