Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఏంటీ ...... " రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అంటూ మంజరి - రెండు రాజ్యాలను దాటుకుని వచ్చామా అని నేను " ఇద్దరమూ ఒకేసారి అన్నాము . 
మంజరి : ఆ రాజ్యాలు ఎటువైపు అడవిరాజా ...... , మేము వెంటనే అక్కడికి వెళ్ళాలి ఇటువైపా అటువైపా అంటూ ఆతృతతో అడిగింది , ఒక్కసారిగా ఆకాశంలో అంతెత్తుకు ఎగిరి చుట్టూ చూసినట్లు కిందకువచ్చి అటువైపు ప్రభూ .....
అడవిరాజా ..... నీ కుటుంబం దగ్గరికివెళ్లు , మిత్రమా అంటూ పైకెక్కాను . 

అంతలో ఇంతవరకూ మేము వెళుతున్న వైపు నుండి " అన్నయ్యా - చెల్లీ , అన్నయ్యా - చెల్లీ ....... అమ్మా అమ్మా ...... కాపాడండి కాపాడండి అంటూ బుజ్జాయిల కేకలు వినిపించాయి . 
రాను రాను కేకలు పెరుగుతూ రావడంతో మళ్లీ అటువైపుకే తిరిగి కేకలు వస్తున్నవైపు వేగంగా పోనిచ్చాను . 
ప్రభూ అంటూ మంజరి , మంజరితోపాటు నొప్పి ఇంకా ఉన్నట్లు వేగంగా కాకపోయినా మావైపుకు పరుగులుతీసాడు అడవిరాజు .
" అన్నయ్యా - చెల్లీ " అంటూ బుజ్జాయిల హాహాకారాలు - ఏడుపులు మరింత పెరగడంతో ...... చలించిపోయి మిత్రమా హో అంటూ మరింత వేగంగా పోనిచ్చాను .

దూరాన సైనికుల వస్త్రలలో చేతులలో కత్తులు - ఈటెలతో ...... అన్నయ్యా - చెల్లీ అంటూ ప్రాణభయంతో ఏడుస్తూ పరుగులుతీస్తున్న బుజ్జాయిలవైపుకు భీకరంగా వచ్చి , చిక్కినట్లు చుట్టుముట్టారు .
అమ్మా అమ్మా ....... అన్నయ్యా - చెల్లీ అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు , చెల్లీ అంటూ వెనకనుండి చేతితో పట్టుకుని మరొకచేతిలో చిన్న కత్తితో చుట్టూ రాక్షస నవ్వులు నవ్వుతున్న సైనికులవైపుకు తిరుగుతూ , నా చెల్లిని వదిలెయ్యండి లేకపోతే అంటూ ధైర్యంగా నిలబడ్డాడు .
లేకపోతే ఏమిచేస్తావు అంటూ ముందుకువచ్చిన సైనికుడి చేతిని చిన్న కత్తితో గాయపరిచాడు .
స్స్స్ ....... పిల్లలిద్దరినీ చంపేయ్యండి .
యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నాను పిల్లలను వదిలెయ్యండి అంటూ ఆయాసపడుతూ మరొకడు వచ్చాడు .
గాయపడిన సైనికుడు : చంపేయ్యమని మీ నాన్నగారు ఆజ్ఞాపించారు - వారి ఆజ్ఞనే మేము పాటిస్తాము - పిల్లలని జాలి చూయించకుండా చంపేయ్యండి .

పిల్లలవైపుకు ఇద్దరు కత్తులతో రావడం చూసి మిత్రమా అంటూ వాయువేగంతో వెళ్లి , మిత్రుడి మీద నుండే చుట్టుముట్టిన సైనికుల మీదుగా బుజ్జాయిల ముందుకు దూకి బుజ్జాయి చేతిని అందుకుని బుజ్జి కత్తితోనే ఇద్దరు సైనికులు చంపడానికి ఎత్తిన కత్తులను అడ్డుకుని వారిద్దరి బొటన వేళ్ళను నరికేసాను .
హమ్మా హమ్మా ...... అంటూ చిందిస్తున్న రక్తంతో వాళ్ళ కేకలు అడవి మొత్తం వినిపించాయి .
బుజ్జాయి గాయపరిచిన సైనికుడు : ఎవర్రా నువ్వు , భటులారా ..... పిల్లలతోపాటు వీడిని కూడా చంపేయ్యండి .
3 - 4 ఏళ్ల వయసున్న బుజ్జాయిలిద్దరినీ గుండెలపైకి ఎత్తుకుని ( వారిని స్పృశించగానే ఏదోతెలియని తియ్యదనం ), బుజ్జి కత్తితో చుట్టూ అందరినీ నిలువరిస్తూ ఒక్కొక్కడి వేళ్ళను నరికేస్తున్నాను .
వీడు సామాన్యుడు కాదు చిన్న కత్తితోనే పాతికమందిని నిలువరిస్తున్నాడు పారిపోదాము రoడ్రోయ్ అంటూ పరుగులుతీసారు .

అంతలో ఒక్కసారిగా నామీదుగా మరియు సైనికుల మీదుగా సింహం ఎగిరి వారివైపుకు తిరిగి అడవికి రాజుని నేను నన్ను తప్పించుకుని ఎలా వెళతారన్నట్లు ఒక్క గర్జన గర్జించింది .
అంతే సింహం సింహం అంటూ వొళ్ళంతా చెమటలతో గజగజ వణికిపోతున్నారు .
మరొక్క అడుగువేశారో సింహానికి ఆహారం అయిపోతారు మీఇష్టం - మోకాళ్లపైకి చేరి శరణు కోరండి .
అంతే భయంతో వణుకుతూ మోకాళ్లపైకి చేరారు .

అమ్మో సింహం ...... అన్నయ్యా - చెల్లీ అంటూ నన్ను గట్టిగా హత్తుకున్నారు ( మళ్లీ అలాంటి మధురమైన అనుభూతి ) .
నవ్వుకున్నాను , బుజ్జాయిలూ ...... సింహం మనదే మనల్ని ఏమీ చెయ్యదు చూడండి చూడండి అంటూ ఎత్తుకెళ్ళి తాకించాను - మరింత గట్టిగా పట్టుకోవడంతో భయపడకండి వద్దులే వద్దులే ఇదిగో అందమైన మంజరి ఎంత ముద్దొస్తోందో కదా ...... 
బుజ్జాయిలు : మంజరి అని ఎక్కడో విన్నాము కదా అన్నయ్యా - అవును చెల్లీ ....... , చాలా చాలా ముద్దుగా ఉంది చిలుక మంజరి మంజరి ......
నేను - మంజరి - ఇదిగో కృష్ణ మరియు అడవికే రాజు అయిన సింహం మేమంతా మిత్రులం , ఇప్పుడు ముట్టుకోండి ......
భయపడుతూనే ముట్టుకుని , అవును ఏమీ చెయ్యలేదు అంటూ బుజ్జిబుజ్జిగా ఆనందిస్తున్నారు .
భయం పోయింది కదా అడవిరాజుపై కూర్చుంటారా ...... ? .
అంతే భయంతో నా వస్త్రం చిరిగిపోయేలా అల్లుకుపోయారు .
సరే సరే వద్దులే అంటూ స్వచ్ఛమైన అనుభూతిని ఆస్వాదిస్తూ బుజ్జాయిల వీపులపై ఆప్యాయంగా స్పృశిస్తున్నాను - నాకుకూడా బుజ్జాయిలను అప్పుడే కిందకు దించాలని అనిపించడం లేదు - మరింత ప్రేమతో హత్తుకున్నాను .
మంజరి అయితే నాకంటే ఎక్కువగా బుజ్జాయిలకు ప్రేమను పంచుతూ నవ్విస్తోంది 

నేను - మంజరి ...... బుజ్జాయిల అందమైన మైకంలో ఉండగా , మరొకవైపు అడవిరాజు మాత్రం నేను నరికిన సైనికుల వేళ్ళను బఠాణీల్లా లాగించేస్తూ రక్తం రుచిమరిగినట్లు వెళ్లి సైనికుల చేతుల నుండి కారుతున్న రక్తాన్ని జుర్రేస్తోంది . 
వాళ్ళ భయం చూసి బుజ్జాయిలకు చూయించి ఆనందించాము .

యువరాజా ...... చూస్తుంటేనే తెలిసిపోతోంది మీరు మంచివారని మీరు మోకాళ్లపై కూర్చోవాల్సిన అవసరం లేదు మాదగ్గరకు రండి .
బుజ్జాయిలు : అవును మంచివారు , అమ్మ పారిపొమ్మని చెబితే సహాయం చేసినది వారే .......

మిత్రుడి సంచీలో ఉన్న కాసిన్ని నీళ్లను బుజ్జాయిలకు తాగించి , బుజ్జాయిలూ ..... ( బుజ్జాయిలను బుజ్జాయిల కళ్ళల్లోకి అలా చూస్తుండిపోవాలనిపిస్తోంది ) .
బుజ్జాయిలు : వీరాధివీరా ...... ఏంటి అలా చూస్తున్నారు ? - ఏదో అడుగుతున్నట్లున్నారు ? అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో ముద్దుముద్దుగా అడిగారు .
మంజరి : వీరాధివీరుడని బుజ్జాయిలకు కూడా తెలిసిపోయిందన్నమాట .

అదే అదే ఎవరుమీరు ? - అభం శుభం తెలియని మిమ్మల్ని ఈ సైనికులంతా చంపాలని ఎందుకు పరిగెత్తిస్తున్నారు ? - మిమ్మల్ని పారిపొమ్మని చెప్పిన మీ అమ్మగారు ఎక్కడ ? .
బుజ్జాయిలు : అమ్మ అమ్మ ...... అమ్మ అంటే గుర్తుకువచ్చింది , అమ్మ ఆపదలో ఉంది అంటూ ఏడుస్తున్నారు .
బుజ్జాయిలూ బుజ్జాయిలూ ...... ఏడవకండి , ఎక్కడ ఉన్నారు ? ఏమిటా ఆపద ? , యువరాజా ...... 
యువరాజు : మహారాణి గారు మాత్రమే కాదు మా నాన్నగారి వలన రాజ్యం మొత్తం ఆపదలో ఉంది , తీరం వెంబడి ఉన్న రాజ్యాలలో మా రెండు రాజ్యాలే పెద్దవి కానీ ఈ పిల్లల రాజ్యానికి ఆనుకుని ఉన్న అదిగో ఎదురుగా కనిపిస్తున్న కొండలలో బంగారు - వజ్రపు నిధులు పుష్కలంగా ఉన్నాయి , వాటిని చేజిక్కించుకుంటే తరతరాలుపాటు సుసంపన్నంగా జీవించవచ్చు - చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటినీ సామంత రాజ్యాలుగా కాళ్ళ కింద తొక్కేయ్యవచ్చు ........
యువరాజా ...... అధికారం కోసం ప్రయత్నం అని తెలిసిపోతోంది - ముందైతే బుజ్జాయిల అమ్మగారి ఆపద గురించి చెప్పండి అంటూ బుజ్జాయిలకు తెలియకుండా ఇద్దరినీ సింహం పై కూర్చోబెట్టి సైనికులందరినీ యువరాజు సహాయంతో ఊడలతో చెట్లకు కట్టిపడేసాను - వెనక్కు తిరిగిచూస్తే బుజ్జాయిలిద్దరూ భయంతో చప్పుడు చెయ్యకుండా కదలకుండా కూర్చుని ఉండటం చూసి నవ్వుని ఆపుకుంటూ ఎత్తుకున్నాను .
బుజ్జాయిలు : కొట్టబోయి గట్టిగా అల్లుకుపోయారు .
కొట్టొచ్చు కదా ప్చ్ ప్చ్ ...... , మా మిత్రుడు అంటే మీ మిత్రుడు కూడానూ బుజ్జాయిలూ , చూడండి మీవైపు ఎంత ఇష్టంతో చూస్తున్నాడో అడవిరాజు ఎందుకంటే అడవిరాజుకు కూడా మీలానే ఇద్దరు పిల్లలు - బుజ్జి సింహాలు అంటూ బుగ్గలపై ఆప్యాయంగా ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : నా బుగ్గలపై చెరొక ముద్దుపెట్టి మరింత గట్టిగా హత్తుకున్నారు - ఆహ్హ్ ...... ఏమిటీ కొత్త అనుభూతి అంటూ పులకించిపోసాగాను , తేరుకుని యువరాజా ...... వెళదాము పదండి .
యువరాజు : ఎంతో కాలంగా వేచిచూస్తున్న మా నాన్నగారు ..... ఈ రాజ్యానికి మహారాజు ఆకస్మికంగా మరణించడం ఆ వెంటనే కరువు రాగానే సహాయం చెయ్యడం మానేసి చుట్టుప్రక్కల రాజ్యాలను కూడగట్టి మూడువైపుల నుండీ దాడిచేశారు , ఈ విషయం తెలుసుకున్న పిల్లల తండ్రి యువరాజు చేతనైనంత సంపద వందలమంది భద్రతా సిబ్బందితో రాజ్యాన్ని - పిల్లల అమ్మ రాణిని - పిల్లలను మీ చావు చావండి అని వదిలేసి పిరికివాడిలా వీలైనన్ని ఓడలలో పారిపోయాడు , మా తండ్రి ఊరికే వదలరు కదా వెనుకే అంతకు రెట్టింపు ఓడలను పంపించారు ఈపాటికి చంపేసే ఉంటారు .
బుజ్జాయిలు వినకూడదని ప్రయత్నించాను .
బుజ్జాయిలు : ఆ రాజు గురించి మేము బాధపడము వీరాధివీరా - అతడు కూడా రాక్షసుడు - అందరినీ హింసించేవాడు .
యువరాజు : కుటుంబాలు ఉన్న సైనికులు పోరాడి ఓడి శరణు కోరారు - వారిక జీవితాంతం కారాగారంలోనే ఉండిపోతారు - ఈపాటికి రాజభవనంలోని ద్వారాలన్నింటినీ బద్ధలుకొట్టి రాజ్యాన్ని ఆక్రమించేసుకుని ఉంటారు - నేను ఎంత వారించినా వినలేదు మా తండ్రి - మన్నించండి పిల్లలూ .......
బుజ్జాయిలు : అంటే అమ్మ - పిన్నమ్మలంతా ...... 
యువరాజు తలదించుకున్నారు - పిల్లలు ...... రహస్య ద్వారం ద్వారా బయటకు రావడం చూసి భటుల నుండి తప్పించాను , మా తండ్రి చంపేయ్యండి అంటూ ఆజ్ఞాపించడంతో కాపాడాలని వెనుకే వచ్చాను , ఇక జరిగినది మీకు తెలుసు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-02-2023, 10:52 AM



Users browsing this thread: 20 Guest(s)